Sunday, November 2, 2008

తూర్పు కనుమల్లో వెల్లువెత్తిన స్త్రీల కన్నీటి ప్రవాహాలు

భూమిక ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రచయిత్రుల సాహితీ యాత్ర ఈసారి ఉత్తరంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయమైంది.అక్టోబుర్ 17 న నలభై మంది అందులో ముప్పైకి పైగా రచయిత్రుల తో మా యాత్ర మొదలైంది.ఉత్త్రాంధ్ర లో జరుగుతున్న వివిధ సామాజిక ఉధ్యమాల అధ్యయనం, వాకపల్లి సందర్శనం మా యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు.
మేం విశాఖలో దిగిన వెంటనే అల్పాహారం చేసేసి గంగవరం, దిబ్బపాలెం వైపు వెళ్ళిపోయాం. గంగవరం పోర్టు నిర్వాసితుల గురించి మీడియా లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే.గంగవరం గ్రామ ప్రజల గుండె ఘోషను అక్షరీకరించడానికి నా కలానికున్న బలమెంతో నాకు తెలియదు కానీ "మా సముద్రం పోయింది"అనే మాట పదేపదే చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది.సముద్రం మా జీవనాధరం.చేపలు పట్టుకుని బతికేటోల్లం.మమ్మల్ని మా సముద్రం నుంచి వేరు చేస్తే మేం బతికేదెట్లా?మేం పని చేసుకు బతుకుతామంటే మీకు చెక్కులిస్తా..ఇక్కడి నుండి పొమ్మంటారేమిటి?ఉద్యోగాలిస్తామన్నరు.ఇల్లు కట్టించి ఇస్తామన్నరు.ఇంకా ఏమేమో ఇస్తామన్నారు.అవన్నీ మాకెందుకు?మా సముద్రాన్ని మాకిచ్చేస్తే చాలు కదా?కన్నీళ్ళ వేడికోలు.
గంగవరంలో మహిళలు సాహసోపేతమైన ఉద్యమం నడిపారు.జైలు కెళ్ళేరు.తుపాకీ తూటాల దెబ్బలు తిన్నారు.నూక రాజు ఆత్మార్పణే చేసాడు.మహిళలు పోర్టులోకి దూసుకెళ్ళి,వంటా వార్పూ కర్యక్రమం పెట్టి,పదిహేను రోజులు అక్కడే వండుకుని,తింటూ పోర్టు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.స్త్రీలు జైలు కెళ్ళీ శిక్ష అనుభవిస్తున్నపుడు,పురుషులు ఉద్యమ ద్రోహం చేసి ఒప్పందాలు చేసుకున్నారని కన్నీళ్ళతో వారు చెబుతున్నపుడు మేమంతా నోట మాట రానివాళ్ళమయ్యాం.
గంగవరం చుట్టూ వెలుస్తున్న గోఘ సముద్రంలో పుట్టి,సముద్రంతో జీవితం పెనవేసుకుని,సముద్రమృ జీవనాధారమైన వాళ్ళనిసముద్రాన్ని ముట్టుకోకుండా అడ్డుకట్ట వెయ్యడమెంత ద్రోహమో ఎవరు చెబుతారు?మా "సముద్రం పోయింది"అంటూ గుండెలు బాబుకుని ఎడుస్తున్న గంగవరం గ్రామస్తుల్ని,ఉవ్వెత్తున ఉద్యమం నడిపి మోసగించబడిన ఆ స్త్రీ మూర్తులని ఎవరు ఓదార్చగలరు?

మిగతా భాగం రేపు

3 comments:

Anonymous said...

సత్యవతిగారూ, మీరు టూర్ నుంచి వచ్చినప్పటినుండీ ఈ పొస్ట్ కోసం ప్రతిరోజూ చూస్తున్నాను.
ముఖ్యంగా వాకపల్లి దుర్ఘటన లో నిజాలు మీద్వారా వినాలి. పేపర్లలో వచ్చేది అంతా నిజమని నమ్మలేము.మీరు స్వయంగా వారి రోదనలు విని వచ్చారుకదా.

సుజాత వేల్పూరి said...

సత్యవతి గారు,
మీడియాలో చూసి, విని, చదివిన దానికీ మీరు "స్పందనతో" రాసిన దానికీ ఎంతో తేడా ఉంది. ఆ స్త్రీల వేదన ను , కన్నీళ్లను మీరు అర్థం చేసుకున్నంత ఆర్ద్రత తో మీడియా కన్ను చూడలేదు.(వారికా అవసరం కూడా లేదనుకోండి)

చాలా బాగుంది. మీరు టూర్ వెళ్ళినప్పటించి నేను కూడా ఈ పొస్టు కోసం చూస్తున్నా!

కార్తీక్ పవన్‌ గాదె said...

chala baaga vivarincharu..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...