ఈ సంక్రాంతి కి నేను నా కిష్టమయిన పని చేసాను


ఈ సంక్రాంతి కి నేను నా కిష్టమయిన పని చేసాను.
భోగి రోజు విజయవాడ నుండి వస్తూ బోలెడన్ని భోగి మంటలు చూసాను.
హఠాత్తుగా కురిసిన అకాల వర్షానికి కొన్ని భోగి మంటలు ఆరిపోతూ కనిపించాయి,
ఉవ్వెత్తున ఎగిసిపడిన ఇటీవలి ఉద్యామాలలా.
పెద్దపండగా రోజు నెక్లెస్ రోడ్ లో పతంగుల పండగ చూసి వస్తూ
వాల్దెన్ కి వెళ్లాను.నేను ఎంతోకాలంగా వెతుకుతున్న పుస్తకం కనబడి గొప్ప సంతోషం కలిగింది.
ఇటీవల శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయిన గోపీచన్దు గారి పుస్తకాల సర్వస్వం.
10 వాల్యూముల భండారం.మూడో వాల్యుం లో నాకిష్టమయిన "మెరుపులు మరకలు" నవల.
ఎన్నో సంవత్సరాలగా వెతుకుతున్న పుస్తకం.
1500 ఖర్చుపెట్టి పరమానందంగా ఇంటికి తెచ్చుకుని ఇదిగో మీకోసం ఈ ఫోటో తీశాను.
పండగరోజు పుస్తకం కొనడంలో గొప్ప ఆనందముంది.
మీరూ నాతొ ఏకీభవిస్తారని ఆసిస్తూ....

Comments

అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

http://telugusimha.blogspot.com/
oremuna said…
నేను కూడా చాశాను.
1500 కొనాలా వద్దా అని పది సార్లు ఆలోచించి
చదవకుండా కొని ఇంట్లో పెట్టిన 200 వరకు ఉన్న పుస్తకాలు కళ్ల ముందు కదిలి,
మళ్లా దొరుకుతాయో లేదు అని బాధ వేసి
చివరకు బొమ్మా బొరుసు వేసి కొనకుండా వచ్చాను. :)
నిజమే మంచిపని చేసారు...

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం