ఇదిగో ఈ గంధం మొక్క చూసారా అది చాలా కాలంగా ఇక్కడే ఉంది.
నేను కూర్చుని ప్రక్రుతిని ఆస్వాదించే నా ఉయ్యాల కుర్చీ
ఇదిగో ఈ చింత చెట్టు చూసారా.ఇది మాజీ హోం మంత్రి గారి ఇంట్లో ఉంది. నేను గొంగతనంగా చింత చిగురు,కాయలు కోస్తూ ఉంటానండోయ్.
ఇదిగో ఈ బారామాస్ మామిడి చూడండి దీన్ని కూడా కడియం నుంచే తెచ్చామండి. సంవత్సరమంతా కాస్తూనే ఉంటుంది.
అదిగో ఆ పోకచెట్టు చూడండి దాన్ని అండమాన్ నుంచి,
మా ఇంటి ముందు ఈ కాక్టస్ చూసారా.దాని కింద పరిచిన కోరల్స్ చూసారా.బంగాళామహాఖాతం నుండి తెచ్చినవి.
ఈ జామ మొక్క చూసారా దాని పెరు కేజీ జమ అంటారు.ఒక్కో కాయ కేజీ ఉంటుంది.దాన్ని కడియం నుంచి,
బ్రహ్మ కమలం మొక్క ని బ్రహ్మపుత్ర నది పక్కనుండి అంటే గౌహతి నుండి,
ఇవిగో ఈ సంపెంగ మొక్కల్ని చూసారా వాటిని తిరుపతి నుండి,
నాఫోటోల కార్యక్రమాన్ని చిరునవ్వులు చిలికిస్తూ చూస్తున్న 85 ఏళ్ళ మా అత్త గారు
ఈ రోజు ఉదయమే లేచి కెమేరా భుజానికి తగిలించి మా ఇంటి చుట్టూ తిరుగుతూ తీసిన చాయాచిత్రాలివి. ఒక్కో మొక్కకీ ఒక్కో కధ ఉందండోయ్ ఇదిగిదిగో ఈ మొక్క చూడండి దీన్ని నా ప్రియనేస్తం నాకు బహుమతిగా పదేళ్ళ క్రితం ఇచ్చింది.మా స్నేహం లాగానే అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. ఈ లోటుస్ పాండ్ చూసారా ఇందులో తెల్లకలువలు పూస్తాయి.
11 comments:
సత్యవతి గారూ,
ఆహా.. ఎంత బావుందండీ మీ తోట. ఇలా అయితే మీ ఇంటికి తప్పక రావాలన్నమాట ;)
బాగున్నాయి మీ మొక్కలు..ఫోటోలు..మీ అత్తగారు కూడా :)
Wow too good !
సత్యవతి గారు
మీ మొక్కలు, మీ ఇంటి పరిసరాలు చాలా చాలా బావున్నయండి. బ్రహ్మ కమలం పూసి నప్పుడు ఫొటోలు చూసాను. అప్పుడు అనుకున్నాను ఎక్కడ నుండి తెచ్చారు అని.
సుధ
superb photos. inthaki mi illu ekkada :)
మీరు తోట చక్కగా నిర్వహిస్తున్నారు. దీనివెనుక ఎంత శ్రమ ఉంటుందో నాకు తెలుసు.
తోటపని ధ్యానం ఇచ్చినంత తృప్తిని, ఆ వీక్షణం మోక్షం పొందినంత ప్రశాంతతని మాత్రం ఇస్తాయి [నా వరకు]. మంచి శ్రమ పెడుతున్నారు, చక్కని అనుబంధాన్నీ కనపరిచారు మీ నెచ్చెలుల పట్ల.
government quarters అయితే ఇలా పెంచడం easy! చాలా బాగుంది.
Beautiful home.
Like Madhuravani garu said, we perhaps would like to visit your home once.
-- For now anonymous,
Vinay Chaganti
మీ ఇంటికి తప్పక రావాల.బాగున్నాయి ఫోటోలు, మొక్కలు. ఎంత బావుందండీ మీ తోట.
సత్య వతి గారు, మీ తోట చాలా బాగుంది అండి.
మా తోట మీ అందరికీ నచ్చినదుకు నాకు బోలెడు సంతోషంగా ఉంది.
నేనుండేది ప్రభుత్వం వారి క్వార్టర్.చుట్టూ బోలెడు స్థలం ఉంటుంది.
ఇంటిదేముంది చెప్పండి.ఏ ఇల్లయైనా ఓ వంట గది,ఓ పడక గది ఇంకొన్ని ప్రత్యేక గదులు ఉండొచ్చు.గదులు పెద్దగాను,చిన్నగాను ఉండొచ్చు.
ఇక్కడ నాకు అమితంగా నచ్చింది ఈ తోటేనండి.నేను ప్రాణం పెట్టి చూసుకునేది,ప్రేమించేది ఈ తోటనే.ఎక్కడికెళ్ళినా నా మనస్సు మొక్కల మీదే ఉంటుంది.ఏ ఊరెళ్ళినా నాకు షాపింగ్ ఇష్టముండదు కానీ కొత్త మొక్క కనిపిస్తే మాత్రం వొదలను. అలా తెచ్చుకున్నవే చాలా మొక్కలు.
మేము ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ వచ్చిన వారికి మంచి తోట అందించిన సంతోషం చాలు కదా.
మధుర వాణి గారు,శ్రావ్య గారు,శ్రినివాస రాజు గారు,స్వప్న గారు,సి.బి.రావ్ గారు,మరువం ఉష గారు,థెరిసా గారు,సునీత గారు,భావన గారు,వినయ్ గారు
మీ అందరికి ధన్యవాదాలండి.
తప్పక అవకాశమొచ్చినపుడు మీ అందరినీ మా ఇంటికి పిలుస్తాను.
Post a Comment