నిన్న సాయంత్రం మా సెనగ చేలో సాయం సంధ్య కెంజాయనీ,చలచల్లనీ శీత గాలినీ,పచ్చపచ్చని పొలాల తాజాదనాన్ని తనివితీరా ఆస్వాదించి ఇంటికొచ్చానా,
అబ్బో ! తూరుపుదిక్కునుంచి రెండు తొనలు తీసేసిన నారింజ పండులా నిగ నిగలాడిపోతూ విదియ నాటి చంద్రుడు (31 నిండు పున్నమి రోజు కదా)
ఈ ద్రుశ్యాన్ని కళ్ళ నిండా నింపుకొని కమనీయంగా నిద్రపోయానా ,ఉదయం లేవగానే మరో అందమైన అనుభవం నా కోసం ఎదురు చూస్తోంది.
ఇంతకుముందు ఒకటి రెండుగా వచ్చే పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.నేను చల్లిన బియ్యం తింటూ నా కెమేరాకి చిక్కిపోయాయి.
నేను చల్లింది గుప్పెడు బియ్యమే కానీ పిచ్చికలు పంచిన సంతోషం విలువను ఖరీదు కట్టే అక్షరాలు నా దగ్గర లేవు. మీరూ చూడండి కావాలంటే.
3 comments:
మీ కెమేరా కి చిక్కిపోయినవి ఎక్కడా కనిపించడం లేదు !!
నాకు కూడా కనపడలేదండీ
మీరు కెమరా క్లిక్ చేసే సరికి పిచ్చుకలు ఎగిరిపోయాయా ఏమిటి , ఒక్కటీ కనిపించటం లేదు. హైదారాబాదు లో పిచ్చుకలు లభ్యమయ్యే ప్రదేశాలగురించి Birdwatchers Society of Andhra Pradeash వారు డేటా సేకరిస్తున్నారు.
Post a Comment