Thursday, July 3, 2008

పులి మీద పుట్ర


"మాటి" మ్యూజిక్ ఆల్బం మీలో చాలా మంది చూసి ఉంటారు.శుభా ముద్గల్ పాడిన ఈ
ఆల్బం లొ "నువ్వెలాంటి మగాడివి?కండోం వాడకుండా నీ భార్యని ప్రమాదంలోకి
తోసేలాంటి మగాడివా ?" అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది. ఇటీవల ఓ దినపత్రిక
ప్రచురించిన దయనీయమైన ఓ కధనం చదివాక నన్ను ఈ పాట మల్లీ
వెంటాడింది.హెచైవి/ఏఇడ్స్ సోకిన ఓ స్త్ర్రీని ఎలా ఊరి బయటకు తోసేసారో
వర్ణించే ఆ కధనం లో ఆ స్త్రీ దిక్కులేకుండా ఊరవతల పడి ఉన్న ద్రుశ్యం
మనసుని పిండేస్తుంది.ఆమెకు హెచైవి అంటించింది ఆమె భర్తే అయినా సీన్ లో కి
భర్త రాడు. అందుకే పై పాటలోని ప్రశ్న మన ముందుకొస్తుంది."నువ్వెలాంటి
మగాడివి?"
మన దేశం లో హెచైవి బారిన పడుతున్న స్త్రీల శాతం క్రమంగా
పెరుగుతోంది.అయితే ఈ స్త్రీలంతా సెక్ష్ వర్కర్లు,వ్యభిచార వ్రుత్తిలో
ఉన్నవాళ్ళు అనుకుంటే పొరపాటే.వివాహ జీవితంలో ఉన్న స్త్రీలు తమ భర్తల
ద్వారా ఈ ఇంఫెక్షన్ కి గురవుతున్నట్టు ఇటీవల అధయనాలు
నిరూపిస్తున్నాయి.వీరి భర్తల ప్రమాదకర లైంగిక సంబంధాలు వీరి జీవితాలను
చిన్నాభిన్నం చేస్తున్నాయి.పురుషులు వివాహం బయట విచ్చలవిడిగా సంబంధాలను
కొనసాగిస్తూ ,ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా భార్యతో కూడా
వ్యవహరిస్తుండడం వల్ల చాలా మంది స్త్రీలు ఈ వ్యాధి బారిన
పడుతున్నారు.వీళ్ళకి హెచైవి పట్ల కనీస అవగాహన లెకపోవడం,తమ భర్తల్ని కండోం
వాడమని అడిగేంత చైతన్యం లేకపోవడం,అలా అడగటానికి అనువుకాని
పరిస్తితులు,పురుషాధిపత్యం,కట్టుబాట్లు, ఆచారాలు.

ఇంతకాలం హెచైవి అనెది కొన్ని వర్గాలవారి ద్వారానే వ్యాపిస్తుందని
భావించడం జరిగింది.ట్రక్ డ్రైవర్లు,,వ్యభిచార వ్రుత్తిలో ఉన్న
స్త్రీలు,హోమోసెక్ష్సువల్స్,,మాదక ద్రవ్యాలు వాడేవాళ్ళను నరాల్లోకి
గుచ్చుకుకేవాళ్ళు- వీళ్ళ ద్వారానే ఇది వ్యాపిస్తుందని భావించడం వల్ల
ఏఇడ్శ్ ప్రచారాం మొత్తం వీళ్ళనే కెంద్రీకరిస్తూ సాగింది.హెచైవ్ ప్రమాదం
కేవలం సెక్ష్ వర్కర్లకే అనే భ్రమ ఈ రోజున పటాపంచలైంది.దీనికి బలం
చేకూర్చే ఒక సెక్ష్ వర్కర్ అనుభవం చూడండి.మీ మంచి ఆడవాళ్ళంతా మేమే హెచైవి
ని వ్యాప్తి చేస్తున్నామని మమ్మల్ని నిందిస్తారు. నిజానికి మేము దీన్ని
వ్యాప్తి చేయడం లేదు.మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికి కండోం వాడమని
చెబుతాం.హెచైవి గురించి చెబుతాం.ఇలా చెప్పిందుకు మేము తిట్లూ,తన్నులూ
తిన్న సందర్భాలూ ఉన్నయ్.మా అదాయాన్ని కూడా చాలా సార్లు
పోగొట్టుకుంటాం.అయినా సరే మేము చెప్పల్సింది చెపుతాం.మా జాగ్రత్తలో
మేముంటాం".
ఇలా తగిన జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు వివాహబంధంలో ఉన్న స్ర్తీలకు
ఉందా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న."లేదు"అనే సమాధానం
వస్తుంది.ఎందుకంటే పిత్రుస్వామ్య సాజంలో,ఆర్ధికంగా పురుషుడిపై ఆధారపడిన
సంబంధాల్లో భర్తను కండోం వాడమని అడీగే చొరవ స్త్రీలకుండడం కష్టమే.అంతే
కాదు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి.వీళ్ళే
ప్రస్తుతం ప్రమాదాల అంచుల్లో వున్నారు. వీళ్ళ భర్తల లెక్కలేనన్ని లైంగిక
సంబంధాల వల్ల వీళ్ళు హెచైవి బారిన పడే ప్రమాదంలో ఉన్నారు.దీని వల్లనే
భవిష్యత్తులో ఎక్కువ శాతం స్త్రీలు హెచైవి కి గురయ్యే అవకాశలున్నాయని
ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
సెక్ష్ అనే పదాన్ని ఉచ్చరించడడమే పెద్ద తప్పుగా భావించే మన సమాజం లో
హెచైవి గురించిన అవగాహన ఎంతమంది స్ర్తీల కుంటుందనేది తేలికగానే
ఊహించవచ్చు.నేషనల్ ఫ్యామిలి హెల్త్ సర్వే ప్రకారం కేవలం 5% మంది
స్త్రీలకే హెచైవి ని ఎలా నియంత్రించవచ్చో అవగాహన ఉంది.విచిత్రమైన
విషయమేమిటంటే భారతీయ స్ర్తీలు వివాహం ద్వారానే హెచైవి కి గురయ్యే
ప్రమాదం లో ఉండడం.
సామాజకంగా, ఆర్ధికంగా,రాజకీయంగా వెనుకబడి వున్న భారతీయ స్ర్తీలు హెచైవి
పట్ల అవగాహనని పొందలేకపోవడం,ఒకవేళ అవగాహన పొందినా నియంత్రణా పద్ధతులు
అందుబాటు లో లేకపోవడం,సురక్షిత శ్రుంగారం కోసం డిమాండ్ చెయ్యలేకపోవడం
అనేవి వారిని ఈ వ్యాధి వేపు తోసేస్తున్నయి.
మన ఇళ్ళళ్ళో కుటుంబ హింస కూడా తక్కువ స్థాయి ఏమీ లేదు.హింసాయుతమైన
సంభంధాల్లో స్ర్తీలు సురక్షిత స్రుంగారాన్ని ఆశించడం ఎండమావుల్లో నీళ్ళను
వెతుక్కోవడమే.ఇది కూడా వారిని హెచైవి వేపు నడిపిస్తోంది.పులి మీద
పుట్రలాగా ఉన్న హింసలకి తోడు ఈ కొత్త హింస కూడా తోడవుతోంది.తన తప్పు
లేకపోయినా ఈ స్ర్తీలు ఊరి బయటకి దిక్కులేని వాళ్ళుగా విసిరి
వేయబడుతున్నారు.దుర్భరమైన ఒంటరి జీవితాల్లోకి నెట్టేయబడుతున్నారు.
స్మితా జెయిన్ అనే ఆమె రాసిన ఒక వ్యాసం లో ని ఒక పేరాని చూడండి. "
ఉహ అనే 26 సంవత్సరాల వివాహిత భర్త ద్వారా హెచైవి పాజిటివ్ గా మారింది.
ఆమే ఇలా అంటుంది.ఏఇడ్స్ గురించి స్త్రీలు ఇంకా చాలా తెలుసుకోవాలి.దాని
చుట్టూ ఉన్న భ్రమల్ని బద్దలుకొట్టాలి.నాకు తెలుసు నేను ఎప్పటికి తిరిగి
పెళ్ళిచేసుకోను.నాకున్న రోగాన్ని వేరే వాళ్ళకి అంటించలేను.మగవాళ్ళు
తప్పనిసరిగా ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి.లేకపోతే ఎంతో మంది అమాయక
స్త్రీలు నాలాగా బలైపోతారు."అంటుంది.
మగవాళ్ళని నిందించడం నా ఉద్దేశ్యం కాదు.కానీ వారి ప్రమాదకర జీవన
విధానాలు,విచ్చలవిడి సంబంధాలు స్త్రీలు,పిల్లల జీవితాలను ఎలా నాశనం
చేస్తున్నాయో అర్ధం చేసుకు తీరాలి.వాదన కోసం టిట్ ఫర్ టాట్ సమాధానాల
కోసం వెదకడం కాక స్ర్తీల పట్ల, సమాజం పట్ల తమ ద్రుక్పధాలను మార్చుకోవడం
పై మనసు పెట్టాల్సిన బాద్య్హత తమ మీదే ఉందని కూడా అర్ధం చేసుకోవాలి.ఊరి
బయటకి విసిరేయబడుతున్న స్త్రీల మ్రుత్యు ఘోష కి బాధ్యులు మీరేనని
మర్చిపోకండి.

4 comments:

cbrao said...

ఐడ్స్ నివారణ చర్యగా, sex workers కోరుకుంటున్నట్లుగా, వారికి వృత్తి పరమైన అనుమతులిస్తే, ఇలాంటి వ్యాధులపై నియంత్రణ పెరిగే అవకాశముండగలదా?

maa godavari said...

సెక్స్ వర్కర్ల కు అనుమతులివ్వడం పరి
ష్కారం కాదు రావ్ గారూ.ఇప్పుడు రిస్క్ లో ఉన్నది సెక్ష్ వర్కర్లు కాదు.వివాహం లో ఉన్న స్త్రీలు.

cbrao said...

Aids వ్యాపించే విధానము. సెక్స్ వర్కర్లు -పురుషుడు (భర్త) - స్త్రీ (భార్య). రోగానికి మూల కారణం సెక్స్ వర్కర్లు. అందుకే వారికి వృత్తి పరమైన అనుమతులు గురించి ఉదహరించటం జరిగింది. Moralists ఇలా commercial license ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చును. Aids నిర్మూలనకు, తద్వారా గృహిణులు ఈ దిక్కుమాలిన రోగంబారిన పడకుండా నివారించవచ్చు.

sunil.iitr said...

AIDS ANNADHI VYAKTHIGATHA SAMASYA KAADHU, EDHI MAANAVA SAMAAJA SAMASYAA KANUKA OKA SEX WORKERS GURINCHI KAADHU, PRATHI OKKARU RESPONSIBILITY GAA SOCITY DEVELOPMENT KOSAM KRUSHI CHEYAALI.
(QUESTION)- MARI ALA KRUSHI CHEYAALI?
Ans= AIDS gurunchi thelisina prathi okkaru monthly kaneesam muggurini counciling cheyaali , antae AIDS gurunchi theliyani vaariki avagaahana penchaali.Appudu manamu kontha kaalaaniki thappakunda change gamanchi vachu.
Y.SUNIL REDDY
HYDERABAD

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...