క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్ ప్రోగ్రామ్ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయిన మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
మే ఒకటవ తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్ అదికారులు. ఏప్రిల్ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేకు వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్ ప్రోగ్రామ్ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమయ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్ వెళ్ళాల్సి వుంది.
రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్, లే వెళుతూ ఒక్క షాల్ సరిపోతుందనుకున్నావా అంటూ తన దగ&గరున్న ఉలెన్ బట్టలన్నీ ఓ సూట్‌కేస్ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు చూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
ఉత్పల ఇచ్చిన అదనపు సూట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్ వెకేషన్ కోసం శ్రీనగర్ వెళుతున్నారు. శ్రీనగర్ ఫ్లయిట్ కన్‌ఫర్మ్ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. వ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్ ఆఫర్ చేసింది. ఆ సీట్లో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కనప్పబడి, సూర్యకాంతికి మెరుసు&తన్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయాను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్ప మాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
ఎయిర్‌పోర్ట్ నించి బయటకు వచ్చి కారులో కూర్చుని తలుపు వేయబోయాను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్ ఫ్రూఫ్ కారని. ఎందుకు బుల్లెట్ ఫ్రూఫ్ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నరు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47 పట్టుకున్న పట్టుకున్న పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ముందు సీట్లో సెటిల్ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
మాకు టూరిస్ట్ గెస్ట్ హౌస్‌లో బస ఏర్పాటు చేసారు. శ్రీనగర్ రోడ్లమీద జనం కంటే పోలీసులు, మిలటరీ వాళ్ళు, బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు అడుగడుగునా ఆవరించి కని&పంచారు. మేం గెస్ట్ హౌస్‌కి వెళ్ళేలోపు నాలుగైదు చెక్‌పోస్ట్‌లను దాటాం. గెస్ట్ హౌస్ ఆవరణలో కారు ఆగగానే తలుపుతీయబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆవరణలో ఆకాశాన్నంటిన చినార్ చెట్లు కారు కలి&పంచిన విసుగును దూరం చేసాయి. చినార& చెట్లు మహావృక్షాల్లా, నిండా ఆకుల్తో చూడ్డానికి ఎంత బావున్నాయో! మాకిచ్చిన రూమ్‌లో అడుగుపెట్టి కిటికీ తలుపు తెరవగానే ఉరవడిగా పారుతున్న నదిమీంచి వచ్చిన గాలి ఉక్కిరిబిక్కిరి చేసింది. అది జీలం నది అని తర్వాత తెలిసింది. చినార్ చెట్ల సౌందర్యం, జీలం నది దర్శనం నాలో గొప్ప సంతోషాన్ని నింపినా అడుగడుగునా కప్పించిన పోలీస్ మిలటరీ, బి ఎస్ ఎఫ్ జవాన్లు నాలో మాత్రం చాలా ఆందోళనను కల్గించారు.
ఆరోజు సాయంత్రం దాల్‌లేక్ చూడ్డానికి వెళ్ళాం. హిందీ సినిమా పాటల్లో చూసి ఈ సరస్సు పట్ల అభిమానం పెంచుకున్న వాళ్ళలో నేనూ వున్నాను. షికారీలు, హౌస్ బోటులు విస్తారంగా పరుచుకున్న జలరాసి చూడడానికి ఎంతో బావున్నా జీవం లేనట్టుగా, చైతన్యరహితంగా వున్న ఆ పరిసరాలు మాత్రం మనసును మెలిపెట్టాయి. వందల సంఖ్యలో వరసగా కొలువు తీరిన లగ్జరీ హౌస్ బోటులు, సరస్సు నలువైపులా బారులు తీరిన షికారీలు మనుష్యులు లేక వెల వెల బోతున్నాయి. దాల్‌లేక్‌లో పన్నెండు వందల హౌస్ బోటు లున్నాయని, టూరిస్టులు లేక అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్ చెప్పాడు. హౌస్ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజమానులు కూర్చునివున్నారు. హమీద్ ఫ్లోటింగు గార్డెన్ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడి&డ లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్ జమీన్' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్ చినార్' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.
శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఠల్ గార్డెన్స్ అనే పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్, నిషాద్, హనూర్, షాలిమార్. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్ ఫౌంటెన్ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్ గార్డెన్స్ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
మర్నాడు గుల్‌మార్గ్ వెళ్ళాలని చాలా తొందరగా తయారైపోయాం. గుల్‌మార్గ్ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేం చూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్ అన్వర్ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
మా మూడ్స్ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్, దేవదార్, పోప్లార్ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక&కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద&ద మంచు దిబ్బ మా కారుకు అడ్డు వచి&చంది. అన్వర్ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్ చేరిపోయాం. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్ కార్) లో టాప్ ప్లేస్ ఐన సెవెన్ స్ప్రింగ్సు చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సమ్మోహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయాం. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి, చీరతోనే తిరిగాను. మైనస్ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్ నించి తిరుగు ప్రయాణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్న మా రావ్ ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్ పండు రంగులో కొచ్చింది. 'స్నోబైట్' ' సన్‌బర్న్' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
మర్నాడు పెహల్‌గావ్ వెళ్ళొచ్చని, అనంతనాగులో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్ ప్రకటించాడు. అమర్‌నాథ్ యాత్ర పెహల్‌గావ్ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాం. అనంతనాగులో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము బయలుదేరిందని అన్వర్ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయాం. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్ చేరేటప&పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయాం. అయితే మా ప్రయాణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీల్లు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్ పార్క్‌లో వున్న ట్రాట్ ఫిష్ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగు సరస్సును చూడలేకపోయామన్న నిరాశతో తిరిగి వచ్చేం.
మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లే' ప్రయాణం మొదలైంది. లే గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లే పట్టణం. అది లదాఖ్ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని నేను ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్ నుంచి లే కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్ - లే రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లే లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెపి&పంది. తొమ్మిదిన్నరకి లే లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగు అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుకకొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్ వచ్చి మా ఇద్దరి బ్లెడ్ ప్రెషర్ చెక్ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్ తాషి ' ఆప్ లోగు హమ్ సె బీ ఫిట్ హై, ఏక్ దమ్ ఫిట్' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హోల్ ఆఫ్ ఫేమ్' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లే చరిత్రతో పాటు, లదాఖ్ ఫెస్టివల్స్, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్ యుద్ధం, యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్ గ్లేసియర్ ఫోటోలు, అక&కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
అక్కడినుంచి మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లే చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్, ఆల్చి, ఫైయాండ్, షె మొదలైన ఎన్నో గొంపాలు వున్నాయి. వీటిలో లే కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షనమైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు. రావ్ ' ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగు కోట్, గ్లౌస్ వేసుకుని, మంకీకేప్ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను. వావ్! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచి&చంది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తూండిపోయాను. తాషికి థాంక్స్ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయాను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా నిద్రపోయాను.
మే ఎనిమిదో తేదీన మా అసలు అడ్వంచర్ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగు సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లే రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది. ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగు సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయాల మధ్య సన్నటి రోడ్డుమీద కారు మెలికలు తిరుగుతోంది. ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయాం. అక్కడ మైనస్ 4 టెంపరేచర్ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని రావ్ మైనస్ డిగ్రీలో నిలబడటం నాకు స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను యోగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్ లోపలకు పంపించగలిగాను. రావ్‌కు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక&కడ ఒక మిలటరీ కేంప్ పెట్టారు. ఫస్ట్ ఎయిడ్, టాయిలెట్ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్ సుబేదార్ విష్ణు బహదూర్ గురండ్ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న టీ ఎంత తృప్తి నిచి&చందో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్ ( కొండ ఉడతలు) లు, యాక్స్, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగు సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది. ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్ గాంగు సరస్సు విస్తరించి వుంది. నాలుగు కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయాం. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగు సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయాణానికి అయిష్టంగానే సిద్ధమయ్యాం. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప&ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా తెలుగుమాట వినని మేం ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్ షేక్ మహబూబ్ పాషా గిద్దలూరుకు, లాన్స్ నాయక్ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యాం.
అప్పటికి మంచుకొండల మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయాం. ఆ అదురులోనూ మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయాం. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్ ఆన్ చేసాడు. మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయాం. ఆక్సిజన్ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్ ఎక్కి దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లే పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లే , లదాఖ్ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబోలు అనుకున్నాను.
అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయాణమయా&యం. క్షణక్షణం మారే లే వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్ పోర్ట్‌లో ఎండ ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా విమానం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
పది రోజులపాటు కాశ్మీర్ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతూనే వుంది. శ్రీనగర్ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్ ప్రేరేపిత ఆగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన 80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదని మా పి.ఎస్.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు బర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు బతికి వున్నారో లేదో తెలియని బయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని ఒక చోట చదివాను. 20 వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి చంపి చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరబాగాలు ఇదీ నేటి కాశ్మీర్ వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.
Saturday, June 13, 2009
Wednesday, June 3, 2009
ఉత్తరం ఉత్త కాయితం ముక్క కాదు
ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకుని,సన్నటి చిరుజల్లులు కురుస్తున్న వేళపుడు,నీటి తుంపర్లతో నిండిన చిరుగాలి శరీరాన్ని తడిపేస్తున్న వేళ,మా పోస్ట్ మాన్ ఓ నీలిరంగు కవర్ తెచ్చిచ్చాడు.ఏమిటేమిటొ చెత్తంతా మోసుకొచ్చే పొస్ట్ మాన్ ఈ రోజు నాకో ఉత్తరం తెచ్చిచ్చాడు.....ఉత్తరం....నిజంగా ఉత్తరమే.
ఏంత సంతోషమో.ఫ్రం అడ్రస్ చూసి మరీ సంతోషం.సుగుణ.చదువుకునే రోజుల్లో నా ఆత్మీయ నేస్తం.ఇంటర్నెట్ లో అడ్రస్ పట్టుకుని,నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ,
అందమైన దస్తూరితో,ఆత్మీయతను కుమ్మరించిన అక్షరాల వరసలు.ఆ రోజుల్లో మేము ఎన్నెన్ని ఉత్తరాలు రాసుకునే వాళ్ళం.ఎన్ని కబుర్లు వాటిల్లో కలబోసుకునే వాళ్ళం.
ఉభయ కుశలోపరి అంటూ మొదలయ్యే ఉత్తరాన్ని విప్పి...అందులోని కష్టాలూ,కన్నీళ్ళూ,నవ్వులు, నమ్మకాలూ,ఆప్యాయతలూ,ఆరాధనలూఅన్నింటిని కలగలిపి ఆస్వాదించడం ఎంత బావుండేదో!ప్రియ నేస్తాలకు,ప్రాణ సమానమైన మిత్రులకురాసే ఉత్తరాల్లోకి ఉద్వేగం,భావుకత,ఆత్మీయత,ఎంత సునాయాసంగా అక్షరాల్లోకి జాలువారేదో!ఎంత ఆనందాన్ని,హాయిని పంచేవి ఆనాటి ఉత్తరాలు.
సశేషం.......
Tuesday, June 2, 2009
వెర్రి పరుగు
దేని వెంటో పరుగు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు

Thursday, May 28, 2009
రామంతాపూర్ రోడ్లో ఓ అద్భుతమైన సంపెంగ వనం
హిమాయత్ నగర్ రోడ్లో నాగమల్లి చెట్టు ఉంది చూసారా అంటే ఎవ్వరూ స్పందించలేదు.మరీ అంత బిజీనాండి తమరంతా?ఎడారిలా మారిన బిల్డింగులున్నయ్ లెండి.చెట్లు లేకుండాపోయాయని నా బాధ. పచ్చదనం కోల్పోయిన అలాంటి కాంక్రీట్ జంగల్ రోడ్లో ఓ అద్భుతంలా నాగమల్లి విరగబూసి ఉంది అంటే అందరూ పరుగెత్తికెళ్ళి చూస్తారనుకున్నా. అబ్బే ఎవ్వరూ స్పందించలేదు. ఎంత విషాదం.
పోనీ రామంతాపూర్ రోడ్లో ఓ అద్భుతమైన సంపెంగ వనం ఉంది .ఎవరైనా చూసారా?సంపెంగ చెట్టు కాదండోయ్.సంపెంగ వనం. పోనీ దీన్నైనా చూస్తారా?
మడిసన్నాకా కాసింత కలాపోసన పచ్చని చెట్టు మీదా ప్రేమ లేకపోతే ఎలాగండీ.

Sunday, May 17, 2009
మా ఊరు సీతారామపురం-నా లైఫ్ లైన్
ఆయ్! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను ఆ సంగతులు.
మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మేం పిల్లలందరం కలిసి వేసంగి శెలవులొస్తే కోతుల్లాగా చెట్లమీదే ఎగురుతుండేవోళ్ళం. జీడిపళ్ళు చీక్కుంట, గింజల్ని చెట్లకిందే కాల్చుకుంట, జీడిపప్పు తెగ తినేవోళ్ళం. ఇప్పుడేమో కొలస్ట్రాలని భయపెడుతున్నారుగాని మేం తిన్నంత జీడిపప్పు ఎవ్వరూ తినుండరంటే నమ్మండి. మా కూరల్నిండా పచ్చిజీడిపప్పే. చింతచిగురు, మామిడి కాయ, వంకాయ కోడిగుడ్లు అన్నింట్లోను కలిపేసుకుని వండేసుకునేవాళ్ళం. చింతాకు జీడిపప్పు కూర రుచి నే చెబితే ఏం తెలుస్తుంది. తిని చూడాలంతే.
వేసంగి శెలవుల్లో మా పిల్లమూకంతా ఆడపిల్లలైతే లంగాలకి కచ్చాలుపోసి, మొగపిల్లలైతే జేబుల్లోకి గంపెడేసి చింతచిగురు కోసి కుప్పలు పోసేవోళ్ళం. చిటారుకొమ్మల్లోకి పాక్కున్టూ వెళ్ళిపోవడం బలే మజాగా వుంటుంది. చింతాకు ఉడకబెట్టి బిళ్ళలు చేసేవోళ్ళు. ఆకు ఎండబెట్టి డబ్బాల్లో పోసేవోరు. మాకు సంవత్సరమంతా చింతాకు, చిన్తపరిగెలు, మెత్తళ్ళు,చిత్తడాయిలు, చెంగుడుపట్టు- ఇయ్యన్ని ఏంటీ అనుకుంటున్నారా? చేపలండీ బాబు చేపలు. ఈ చేపలన్నీ చింతాకుతో కలిపి ఒండుకుతింటే ఇంకేమీ ఒద్దనిపిస్తదండి. మీరు కూడా పశ్చింగోదావరి వాళ్ళయితే ఇయ్యన్నీ ఈజీగా తెలిసిపోతాయండి.
ఏసంకాలంలో మామిడి పళ్ళతోపాటు మాన్చి రుచైన పండు మరోటుందండి. మీరెప్పుడైనా తాట్టెంక తిన్నారా? చెట్టుమీద ముగ్గిన తాటి పండు నిప్పులమీద కాల్చుకుని తిన్నారంటే..... ఎందుకులెండి వర్ణిఅమ్చడం. మీరెరూ తినుండరు. పోనీ కుంపటేసిన తేగలన్నా తిన్నారా లేదా? కనీసం బుర్ర గుంజయినా తిన్నారా? తినుంటే మాత్రం వందేళ్ళొచ్చినా ఆ రుచుల్ని మర్చిపోవడం వుండదండి. సరే. మా ఊరినిండా పళ్ళతోటలే కాదండి కూరగాయల పాదుల ఎక్కువేనండి. వంకాయలు, దొండకాయలు, బీర, సొర, పొట్ల, గోరుచిక్కుళ్ళు, టమెటాలు, పచ్చిరగాయలు, గోన్గూర, తోటకూర ఒకటేమిటి అన్నీ పండిస్తాం. వీటన్నింటికి నీళ్ళెక్కడినించొస్తాయా అని ఆలోచిత్తన్నారా ఏంటి? నుయ్యిలు తవ్వుతారు. పదడుగులు తవ్వితే చాలు బుడబుడమని నీళ్ళూరిపోతాయి. రెండు కుండల్లాంటివుంటాయి. వాటిని బుడ్లజోడంటారండి. ఈ బుడ్లజోడుని నూతుల్లోని నీళ్ళతో నింపి కూరపాదులకి నీళ్ళుపోస్తారు. బుడ్లజోడుతో నీళ్ళపోత అంటారు సిపుల్‌గా.
మా నాన్న చాలా కష్టజీవి. గోచిపెట్టుకుని బుడ్ల జోడుతో పాదులకి నీళ్ళపోతపోసి, పచ్చిగడ్డి కోసుకుని ఇంటికొచ్చి అలిసిపోయి అలానే వీధరుగుమీద పడి నిద్రపోయేవాడు. నేను నాన్నతో కలిసి పాదుల్లో పనిచేసేదాన్ని. గొడ్డలితో కట్టెలు కొట్టేదాన్ని. పాలు పితికేదాన్ని.నూతుల్లో దిగి బోలెడన్ని చేపలు పట్టేదాన్ని. ఎపుడూ ఊరిమీద బలాదూర్ తిరిగేదాన్ని. నువ్వాడపిల్లవి. ఇలాంటి పనులు చెయ్యకూడదు అని ఏనాడూ మా నాన్న నాకు చెప్పలేదు. నేనేం చేసినా అడిగేవోడు ఎవ్వడూ లేడనుకోండి.
ఓసారి నూతిలో దిగి చేపలు పడుతుంటే సీసాపెంకు గుచ్చుకుని ఒకటే రక్తం. నేనేం భయపడలేదు. ఆ నూతుల్లోనే వున్న మెట్టతామరాకు ముద్దగా చేసి తెగిన చోట పూసేసానంతే. తెగిందని ఆరోజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఈ రోజుకి నా ఎడం చేయి మణికట్టు దగ్గర ఆ మచ్చ అలాగే వుండిపోయి, ఆ అల్లరి రోజుల్ని గుర్తుచేస్తంటుంది. తేగబుర్రల్ని కత్తితో కొడుతుంటే తెగిన మచ్చ కూడా ఎడం చేతి చూపుడు వేలు మీద వుందండోయ్. మరేంటనుకున్నారు. ఆ మచ్చల వెనక ఇంత మహా చరిత్ర వుందిమరి.
తోటలెంబడి తూనీగలాగా తిరుగుతుండేదాన్ని కదా! నాకు బయమంటే ఏంటో తెలియదండి. కాని ఒక్క బావురుపిల్లికి మాత్రం తెగ భయపడేదాన్ని. మా యిల్లు రైలుబండంత పొడుగుండి చాలా పెద్దమండువా ఇల్లండి. బోలెడంత పెరడు వుండేది. గుమ్పులుగా కోళ్ళు తిరుగుతుండేవి. ఈ కోళ్ళ కోసం రాత్రిళ్ళు బావురు బావురంటూ బావురుపిల్లి వచ్చేదండి. కోళ్ళు గూళ్ళో దూరి కోడినెత్తికెళ్ళి తినేసేది. పిల్లొచ్చినపుడు కోళ్ళు గోల గోలగా అరిచేవండి. నా గుండెల్లో రైళ్ళు పరుగెట్టేవి. గుడ్లు మిటకరించి అటకమీదికి చూస్తుండేదాన్ని. అటకమీంచి బావురుపిల్లి నా మీదికి దూకేస్తుందని తెగ భయపడేదాన్ని. నేనెంత మొద్దునంటే పిల్లిక్కావలిసింది కోడిగాని నేను కాదుగా. అది ఈ మొద్దుబుర్రకు అర్తం కాడానికి చాలా కాలమే పట్టింది. అదండి సంగతి.
మా వూర్లో నాకు ఎక్కువ యిష్టమైంది, ప్రాణప్రదమైంది అమ్మోరి తీర్తం. మా వూరి దేవత పేరు మారమ్మ. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు. తీర్తం పదిరోజులుందనగానే పిల్లల హడావుడి మొదలయ్యేది. తాటాకులు కోసుకొచ్చి బుల్లి బుల్లి బుట్టలల్లేవాళ్ళం. వీటిని జాజారి బుట్టలు అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి రెండేసి బుట్టలన్నమాట. బుట్టల్లో మట్టి నింపి నవధాన్యాలు వేసి నీళ్ళు పోసేవాళ్లం. పొద్దున లేవడం బుట్టలన్నీ వీధరుగుమీద పెట్టుకుని మొలకలొచ్చినయ్య లేదా అని చూసుకునేవాళ్ళం. అన్నింటి కన్నా ముందు పెసల మొక్కలొచ్చేవి. తీర్తం నాటికి జాజారి బుట్టల్నిండా పచ్చటి మొక్కలు గుబురుగా వచ్చేసేవి. తీర్తం నాటిముందు రోజు రాత్రి ఆసాదులు మోళీ కట్టేవాళ్ళు. ఆసాదులంటే ఎవరో చెప్పలేదు కదా! మారమ్మ తీర్తంలో ఘటాలనే గరగలంటారు. ఈ ఆసాదుల గరగల నృత్యం చూసి తీరాల్సిందే. మాదిగడప్పుకు అనుగుణంగా వారు వేసే స్టెప్‌లు, ఏ మెగాస్టార్ కూడా వెయ్యలేదండోయ్. ఆ... అన్నట్టు మెగాస్టార్ మా వూరివాడేనండి. మా బస్సులోనే వచ్చి మాకు బీటేసినవోడేనండోయ్. ఆ ముచ్చట మరోసారి చెబుతాలెండి. ఈ ఆసాదుల మోళీ అబ్ధుతంగా వుంటుంది. మోళీ అంటే మరేం కాదండి మేజిక్ అన్న మాట. మనిషి నెత్తిమీద నల్ల దుప్పటి కప్పి, పొయ్యేట్టి పకోడీలువొన్డేసేవోరు. జేబుల్లోంచి రూపాయల కట్టలు లాగి దండల్లాగా మెళ్ళో వేసుకునేవోళ్ళు. పేకముక్కల్ని ఫెవికాలెట్టి అంటించినట్టు సర్రున ఎగరేసేవోళ్ళు. మేం పిల్లలం నోళ్ళు ముయ్యడం మర్చిపోయి మొద్దురాచ్చిప్పల్లా చూస్తుండిపోయేవాళ్ళం. పి.సి. సర్కార్ మేజిక్ షో వాళ్ళముందు పనికిరాదంటే నమ్మండి.
ఇంక తీర్తం రోజు సంగచ్చెబుతాను. తలంటుస్తానం చేసేసి, వుంటే కొత్తబట్టలేసేసుకుని ఆసాదుల రాకకోసం ఎదురుచూత్తా కూచొనేవాళ్ళం. డప్పుల హోరుతో ఆసాదులెళ్ళి ఊరి పొలిమేరల్ని కట్టేసి వచ్చేవోళ్ళు. ఆసాదుల వెంటపడి రెండు చేతుల్లో పచ్చటి జాజారి బుట్టలతో మిడతల దండులాగా పిల్లల గుంపు. బుట్టలో జానేడేసంత పచ్చటి మొక్కలు. ఆసాదులు గరగల నృత్యంతో ముందుకెళుతుంటే వాళ్ళ వెనకాల మేము. గుడి వరకూ అలా వెళ్ళి బుట్టల్ని గుడిచుట్టూ తిప్పి గుడి గోపురం కింద అంచుల మీద పెట్టేసేవోళ్ళం. గుడంతా పచ్చగా కళకళల్లాడిపోయేది. అసలు పిల్లలు బుట్టల్తో నడుస్తుంటే పచ్చటి తివాసీని మోసుకెళుతున్నారా అన్నంత ఆకుపచ్చగా వుండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కళ్ళకి ఆ పచ్చదనం అగుపిస్తుందంటే మీరు నమ్మితీరాలి మరి.
దీపాళి పండగ గురించి ఏం చెప్పమంటారు. ఎప్పుడూ డబ్బుల్తో దీపావళి టపాసులు కొనలేదు మేం. అన్నీ మేమే తయరు చేసుకునేవాళ్ళం. పేటేప్ కాయలు ( తాటాకులతో చేసేవి), మతాబులు, సిసింద్రీలు, చిచ్చుబుడ్లు అన్నీ చేసేవోళ్ళం. ముడిసరుకులు కొనుక్కొచ్చి తయారు చేసేవోళ్ళం. మతాబులు చేయడానికి ముందు కాగితం గొట్టాలు చెయ్యలిగా. అలాగే సిసింద్రీ గొట్టాలు. కాయితం, అన్నం మెతుకులు వుంటే గొట్టాలు రెడీ. వాటిల్లో మందుకూరి ఎండకి పెట్టేవోళ్ళం. తాటాకుల్ని మెలికతిప్పి, మందుకూరి, వొత్తిపెడితే పెటేప్‌కాయ రెడి. మేం చేసినవి ఫట్ ఫట్ మని పేలేవి. మతాబులు జలతారు పువ్వుల్ని రాల్చేవి. సిసింద్రీలయితే సుయ్‌మని ఎగిరిపోయేవి. ఇవన్నీ కాకుండా దీపావళికి మేం ఓ ప్రత్యేక వస్తువు తయారు చేసేవోళ్ళం. ఉప్పు, ధాన్యపువూక, పేడ కలిపి ఓ మూటలాగా చేసి తాడు కట్టేవోళ్ళం. మూట మధ్య నిప్పురవ్వేస్తే, ఉప్పు టపటప పేలేది. తాడుతో ఆ మూటని గుండ్రంగా తిప్పితే మనచుట్ట నిప్పుల వలయం ఏర్పడుతుంది. పేడ, వూక కాలుతుంటే ఉప్పురవ్వలు ఎగిసేవి. ఈ ఉప్పు మూట దీపావళికి స్పెషల్ ఎట్రాక్షన్ తెలుసాండి.
వినాయక చవితికి కూడా మేం ఎండుపల్లేరుకాయల్ని మూటగట్టి ఇంటికొచ్చే కొత్తల్లుళ్ళని తెగ బెదిరించేవాళ్ళం. మా అల్లరికి బావలు పరుగో పరుగు. అల్లుళ్ళని చాలా రకాలుగా ఏడిపించే వాళ్ళం. ఆకునిండా భోజనం పెట్టి, ఆకు కింద ఆవాలు పోసి, సన్నటి తాడుకట్టి ఆయన భోజనానికి కూర్చుని తినడం మొదలెట్టగానే ఆకుని లాగేసేవాళ్ళం. కింద ఆవాలుంటాయిగా ఆకు ఈజీగా కదిలిపోయేది. ఇంటల్లుడి ముఖం చూడాలి. అందరం గొల్లున నవ్వేవాళ్ళం. అలాగే గారెల్లో బండారు గాజులెట్టి అల్లుడికి పెట్టేవాళ్ళు. ఆయన ఆనందంగా గారెలు లాగించబోయేసరికి గాజు గట్టిగా పళ్ళకి తగిలి బెంబేలెత్తిపోయేవాడు. మేం నవ్వుకుంటూ గాజుకు సరిపడా డబ్బులివ్వాలని ఆటపట్టించేవాళ్ళం. ఇవన్నీ పండగ సరదాల్లో భాగమేనండోయ్. పండగ సంబరాలు ఎంత రాసినా తనివి తీరదు . ఉగాదికి అరకలు కట్టి దున్నడాలు, సంగ్రాంతికి దుంలెత్తుకొచ్చి భోగిమంటలేయడాలు, కార్తీక వమాసం చలిరోజుల్లో తెల్లవారు ఝామునే గోదావరిలో మునగడాలు, అట్లతద్దికి ఉయ్యల లూగడాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో సంబరాలు.
మావూరి గొప్పదనం గురించి ఇంకేం చెప్పమంటారండి బాబు! మాకు ఒక వేపు గోదారి. మరోవైపు సముద్రం. గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటే పది కిలోమీటార్ల దూరంలో సముద్రం. నా బతుకు మా వూరి పచ్చదనంతోటి, మా వూరి చుట్టు వున్న నీళ్ళతోటి ముడిపడిపోయింది. వెన్నెల్లో గోదారి మీద లాంటి ప్రయణం, అంతర్వేది రేవు, అన్నాచెల్లెలగట్టు, కొనసీమ కొబ్బరి చెట్లు ఇవన్నీ నా జీవితంలో అంతర్భాగాలు. నా బాల్యం ధగధగ మా గోదారి గట్టుమీద సూర్యబింబం మెరిసినట్టు మిరుమిట్టు గొలుపుతుంటుంది.
నేనేం టాటాలు, బిర్లాల్లాగా నా నోట్లో బంగారపు చెంచా పెట్టుకునేం పుట్టలేదు సుమండి. నేను పుట్టింది ధాన్యపు కొట్లోనంట. మా అమ్మ నిండు నెలల్తో ధాన్యపు కొట్లోంచి ధాన్యం తీస్తోందట. అమాన్తం నేను పుట్టేసానంట. కొవ్వాసు పీసు ( ఒక రకం చేప) లాగా వుండి ఈరోజో రేపో అన్నట్టుండేదాన్నంట. నా కర్మకాలి నే పుట్టిన పద్నాలుగో రోజే మా అమ్మమ్మ చచ్చిపోయిందంట. నా చదువుకూడా అంతే. మా వీధరుగు మీదే బడి వుండేది. బుద్ధిపుడితే కూర్చునేదాన్ని. లేకపోతే చెట్లెక్కేదాన్ని. టీకాల వాళ్ళు వస్తే మాత్రం నేను చిక్కడు, దొరకడు. చిటారు కొమ్మల్లోకి ఎక్కి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక దిగేదాన్ని. నా కెవరన్నా భయముండేది కాదు కాని టీకాల వాళ్ళంటే ఆ సూదులు చూసి భయమేసేది.
నా కెందుకు, ఎలా, ఎపుడు పుట్టిందోగాని చదువుకోవాలనే కోరిక మాత్రం పుట్టేసింది. మా కుటుంబంలో అటు ఇటు చదువుకున్న వోళ్ళే లేరుమరి. నాకెలా పుట్టిందో తెలియదు. చదువుకోసం ఎంతో పోరాటం చేయాల్సివచ్చింది. మా నాన్నకి నన్ను చదివించాలనే వుండేది కాని డబ్బుల్లేవు. ఉమ్మడి కుటుంబానికి ఆయన చాకిరీ చేసేడు గాని చిల్లి కాని కూడా వుండేది కాదు. నా చదువు సమాచారం క్లుప్తంగా చెబుతాను. అయిదు వరకు ఊర్లోనే చదివాను. ఆరునించి పదివరకు ఓరియంటల్ స్కల్. అంతా సంస్కృతం మయం. మా సంస్కృతం మేష్టారు శ్లోకం తప్పు చదివితే స్కల్ చుట్టూ తిప్పి కొట్టేవోరు. ఒకసారి నేను ఆయనకి దొరక్కుండా బాదం చెట్టెక్కి కూర్చున్నా. ఆయన కోపం ఆపుకోలేక గోడకేసి తలబాదుకున్నాడు. నేను కిందికి వచ్చేసాను గాని ఆయన నన్ను కొట్టలేదు. నేను టెంత్ వరకు సంస్కృతం, ఇంటర్‌లో తెలుగు లిటరేచర్, డిగ్రీలో ఇంగ్లీషులిటరేచర్ చదవడమ్ వల్ల సాహిత్యం మీద వల్లవలిన ప్రేమనాకు.
మళ్ళీ ఓసారి మా ఊరి కెళదావ! మా ఊరికి బస్సులేదని ముందే చెప్పానుకదండి. నడవాల్సిందే! పదండి నడుద్దాం. కాలవ దగ్గర ఎర్ర బస్సుదిగి నడవడం మొదలెడితే మీకు ఇళ్ళేం కనబడవు. ఒక వేపు జీడితోటలు, మరోవేపు సరుగుడు తోటలు. ఆ తోటల్లో పడి ఓ మైలున్నర నడిస్తే మా ఇల్లొస్తుంది. ఆ.... అన్నట్టు మీకు ఇంకో రహస్యం చెప్పడం మర్చిపోయా. ఎవరికి చెప్పకండేం. ఎండు సరుగుడాకులు చూసారా ఎపుడైనా? ఎండిపోయిన సరుగుడాకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టుకుని గుప్ గుప్ మని పీల్చి పొగవొదిలేవాళ్ళం. హమ్మ! ఎంత రౌడీ పిల్లలు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా? 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అని మహాకవే అన్నాడు నాదోలెక్కా. మాకు సిగరెట్లు తయరు చేయడం ఎంత సులువో తెలిసిపోయింది. మాకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలికూడా.
మీకు మరోరహస్యం కూడా చెబుతానండి. ఎవరితోనుచెప్పకండి. మా నాయనమ్మ రోజూ పొద్దున్నే మాన్చి్ పోత్తాడి కల్లు ముంతలు ముంతలు లాగించేదంటండి. మీకు ఇంకో సీక్రెట్టు చెప్పేస్తున్నాను. కాచుకోండి. మేం కూడా తాటాకు దొన్నుల్లో నింపుకుని పోత్తాడి కల్లు తాగేసేవోళ్ళమండి. మా ఇంటెనక ఓ పోత్తాడి వుందండి. దాని కల్లు భలే తియ్యగా వుండేదండి. కల్లు అనగానే చాలా మంది మొకాలెందుకో తుమ్మల్లో పొద్దుగకినట్టయిపోతాయి. ఎందుకో నా కర్థమే కాదు. ముంజలు మాత్రం జుర్రుకుంట తినేస్తారు కాని కల్లంటే ఆముదం తాగిన మొకాలు పెడతారు. కల్లంటే కల్తీ కల్లనుకుంటున్నారా ఏంటి కొపదీసి. కాదండి బాబూ! మా వూరి ఈడిగ ఎంకట్రావుడు కల్లు తీస్తాడు. తెల్లారగట్లే అతను చెట్టెక్కడం మనం చెట్లకింద చేరడం. ఫ్రెష్. తాగితే అపుడే దింపిన కల్లే తాగాలండి. లేకపోతే యమ డేంజర్. కొబ్బరి నీళ్ళలాగానే వుంటదండి. ఒట్టండి. ఆరోగ్యానికి అపుడే తీసిన కల్లు చాలా మంచిదని మా ఎంకట్రావుడు చెపుతాడండి. ఇదండి మావూరి కల్లు బాగోతం.
మీరందరూ గోలీకాయల్తో గోలీలాడితే మేమ్ జీడిపిక్కల్తో గోలీలాట ఆడి బోలెడు జీడిగింజల్ని సంపాదించేవాళ్ళం. ఆ తర్వాత వాటిని అమ్మి డబ్బులు సంపాదించేవాళ్ళం. పుస్తకాలు కొనుక్కోవాలికదా! డబ్బులంటే గుర్తొచ్చింది. మేం డబ్బులు కూడా తయరు చేసేం. ఫెయిలయామనుకోండి. చిల్ల పెంకుల్ని గుండ్రంగా అరగదీసి సిగరెట్ పెట్టెల్లో వుండే ముచ్చిబంగారం అంటించి కొట్టుకు తీసుకెళ్ళి ( రాత్రిపూట) నిమ్మతొనలిమ్మంటే, చిల్లపెంకుల్ని తీసుకుని మా వీపుల్ని విమానంమోత మోగించిన విషయం గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుంది నాకు. ఇంకా బలుసుచెట్ల కొమ్మలకుండే ముళ్ళకి నేరేడు పండ్లు గుచ్చి ద్రాక్ష గుత్తుల్లా చేసినా, పుంతలోని ఇసకలో ఉసిరి కాయల్ని కప్పెట్టి మర్నాడు తొనలు తొనలుగా వొలుచుకుతిన్నా, బ్రహ్మజెముడు కాయల్ని కాళ్ళంతా పూసుకుని అమ్మోరక్తం అని గగ్గొలు పెట్టినా, పిచ్చికాయలు, తాటాకు కలిపి నమిలి కళ్ళీ కన్నా ఎర్రగా నోరు పండించుకున్నా ఇదంతా మా అల్లరిలో భాగమైనా మా సృజనాత్మకతకి పునాదులని నేననుకుంటాను.
అందుకే మా ఊరంటే ప్రాణం నాకు. నాకు బంగారు బాల్యాన్నిచ్చిన మా సీతారామపురం నా లైఫ్ లైన్. ఊరుకుండాల్సిన లక్షణాలు లేని ఊరు కాబట్టి నేనాడింది ఆట పాడింది పాటగా సాగింది. దళితులు, రాజులు, కాపులు తప్ప వేరే ఏ కులం వాళ్ళూ మా వూళ్ళో లేరు. దళితుల అణిచివేత విషయంలోమా ఊరేమీ మినహాయింపు కాదు. మా తాత ఓ భయంకరమైన, కరడుకట్టిన భూస్వామి. పావలా, అర్థణా అప్పిచ్చి ఎకరాలకెకరాలు భూమి రాయించుకున్న దుర్మార్గ భూస్వామి. ఈయన దుర్మార్గానికి బలై కుటుంబాలకు కుటుంబాలే ఊరొదిలి పోయారని, అందులో నా చిన్ననాటి నేస్తం నాగులు కూడ వుందని నేను పెద్దయ్యాకే నాకు అర్థమైంది. దొంగతనాలంటగట్టి దళితుల్ని గుంజలక్కట్టేసి కొట్టిన ఉదంతాలు చూచాయగా గుర్తున్నాయి. పాలేర్ల పెళ్లాల మీద అత్యాచారాలు చేసి, గర్భవతుల్ని చేసిన వాళ్ళూ వున్నారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళ పిల్లల్లో తమ పోలికలు చూసుకుని ముఖాలు మాడ్చుకున్న వాళ్ళూ వున్నారు. ఇవన్నీ నాకు పెద్దయ్యాక తెలిసిన నగ్న సత్యాలు. వీటికి, మా వూరిలో నాకున్న అనుబంధానికి ఏం సంబంధం లేదు. పైరు పచ్చల్తో కళ కళలాడే మా ఊరు, ఎత్తైన అరుగుల్తో గంభీరంగా వుండే మా యిల్లు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా వుంటాయి.
ఇవండి మా ఊరి సంగతులు. ఇవన్నీ చదివేక మీరు నా బాల్యానుభవాలని ఆడపిల్ల మగపిల్లాడు సున్నితపు తాసులో కొలుత్తారని నాకు తెలుసండి. కల్లు తాగడాలు, సరుగుడు సిగరెట్లు పీల్చడాలు, గొడ్డళ్ళతో కట్టెలు కొట్టడాలు, చిటారుకొమ్మల్లోకి ఎగబాకడాలు, చేపల్ని పట్టుకోవడాలు ఇయ్యన్నీ జనం దృష్టిలో మగానుభవాలు. మగపిల్లలు మాత్రమే చేయల్సిన పనులు. ఆడపిల్లలక్కూడా ఇలాంటి బాల్యం వుంటుందంటే నమ్మరేమో! మనోళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఎచ్చనగాయలూ, వోమన గుంట్లూ ఆడాలి. లక్కపిడతలాటలూ, బొమ్మల పెళ్ళిళ్ళాటలు ఆడాలి. అమ్మలెనక వొంటింట్లో తిరిగి వొంటల్నేర్చుకోవాలి. తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఎత్తుకు మోయలి. అడ్డగాడిదలు అన్నలు, తమ్ముళ్ళు తిని తేన్చిన కంచాలు ఎత్తాలి. వినయ విధేయతల్తో నడుములు, మెడలు వొమ్చేసి పెళ్ళికి సిద్ధంగా వుండాలి. అంతేకాని నాలాగా స్వేచ్ఛగా, పక్షిలాగా బయటే తిరగడం, నా కిష్టమైన అన్ని పనుల్ని అడ్డూ, అదుపూ లేకుండా చేసేయడం అబ్బో! చాలా మందికి కంట్లో నలకపడ్డట్లే.
చివరగా మా దొంగతనాల సంగతుల్జెప్పేసి ముగించేత్తానండి. మా వూర్లో బోలెడన్నిమామిడి తోటలున్నాయని చెప్పేనుకదండి. పచ్చిమామిడికాయలు మాకు బాగానే దొరికేవి కాని పండ్లు చిక్కేవి కాదు. మామిడి కాయల్ని ఎడ్లబండి మీద తీసుకొచ్చి మా తాతకు అప్పచెప్పేవోరు. మా తాత వాటన్నింటిని ఓ పెద్ద గదినిండా పోయించి పండింతర్వాత, కొంచం కొంచం డాగుపడ్డ పళ్ళనే బయటకు తెచ్చి ఇచ్చేవోడు. మాకు చాలా కోపమొచ్చేది. ఒక్క మంచి పండు ఇయ్యొచ్చు కదా అనుకునేవోళ్ళం. చచ్చినా ఇచ్చేవోడు కాదు. మరి మేం తక్కువోళ్ళమా? సరుగుడు కర్రల చివర్న సూదివాటంగా చెక్కి కిటికీల్లోంచి పళ్ళు లాగేసేవోళ్ళం. ఆ గది కిటికీకి రెండు చువ్వల్లేకపోవడం మా పనెంతో సులువుగా అయిపోయేది. బోలెడన్ని మామిడి పండ్లు దొంగతనంగా లాగేసి తినేసేవోళ్ళం. మామిడిపండ్లు ఏమైపోతున్నాయో అర్తం కాక మా తాత జుట్టు పీక్కునేవోడు. ఇక మారెండో దొంగతనం భోగిమంటల కోసం దుంగలు ఎత్తుకురావటం. పొయ్యికిందికి దాచుకున్న కట్టెల్ని ఎత్తుకొచ్చి భోగిమంటల్లో పడేసేవోళ్ళం. ఓసారి పెద్ద గొడవైపోయింది. రామాయమ్మని ఒకామె వుండేది. ఆమె పోట్లాట మొదలెట్టిందంటే ఓ పగల ఓ రాత్రీ నడిచేది. చెంబునిండా నీళ్ళు పెట్టుకుని అవి తాగుతూ మరీ తిట్టేది. దుంగలెత్తుకొచ్చామని మమ్మల్ని దుంపనాశనం తిట్లెన్నో తిట్టి మా చిన్నానతో కొట్టించింది.
ఇలా రాసుకుంటపోతే ఈ వ్యాసం కొండపల్లి చెంతాడంత పొడుగైపోతాది. అవకాశం దొరికితే తరువాయి భాగం మళ్ళెప్పుడన్నా వినిపిస్తాలెండి. ఇంకా చానా సంగతులున్నాయి మరి.
నేను ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసేసాను. ఏభై ఏళ్ళు వచ్చేసినా నా బాల్యం నా కళ్ళకి నవనవోన్మేషంగా కన్పిస్తూనే వుంటుంది. నా పెదాల మీద తురాయి పువ్వుల్ని పూయిస్తూనే వుంటుంది. మ ఊరు జున్నుముక్కలా నన్ను ఊరిస్తనే వుంటుంది. మా సపోటతోట నూతిలోని తెల్లని కలువపూలు నన్ను రా రమ్మని పిలుస్తనే వుంటాయి.
మరింక శెలవుచ్చుకుంటానండి. మా ఊరంటే మీకూ ప్రేమ పుట్టే వుంటుంది. మీరందరూ కూడా మా ఊరిని, నాకు ప్రాణప్రదమైన మా సీతారామపురాన్ని ప్రేమించాలని కోరుకుంటూ....

Sunday, April 26, 2009
కనుక్కున్న వాళ్ళకి కొండంత ఆనందం
అస్తవ్యస్తంగా,మహా రష్ గా ఉండే హిమాయత్ నగర్ మెయిన్ రోడ్డులో ఒక్క చెట్టు లేదు.ఎంత విషాదం?
చెత్త చెత్తగా భవనాలు,రోడ్డంతా ఆక్రమించుకుంటూ
వాహనాలూ.
నిజానికి ఆ రోడ్లో డ్రైవ్ చెయ్యడమంటే మహా మంట నాకు.
కానీ ఇపుడు ఆ రోడ్లో వెళ్ళడమంటే ఎంత ఇష్టమో చెప్పలేను.
ఎందుకలాగా అని ప్రశ్నార్ధకం పోజ్ లో కి వచ్చేసారా?
అదే కదా నా ప్రశ్న.
కనుక్కోండి. చూద్దాం.
ఒక్క చెట్టైనా లేని హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో
అందమైన,సువాసనలు వెదజల్లే నాగమల్లి చెట్టుందంటే మీరు నమ్ముతారా?
పచ్చటి ఆకుల్తో,మొదలంటా పూసిన పరిమళాల పువ్వుల్తో
కాంక్రీట్ మహారణ్యంలో కొలువుతీరిన నాగమల్లిని కనుక్కోండీ .కొండంత ఆనందాన్ని సొంతం చేసుకోండి.
Thursday, April 16, 2009
కులూ లోయలూ మనాలీ మంచు శిఖరాలూ
కులూ లోయల అగాధాలు
మనాలి మంచు కొండల సోయగాలు
పార్వతీ నది పరవళ్ళు
బియాస్ మహా నది ఉరవళ్ళు
వశిష్ట గ్రామం లో ఉల్లాసపు నడకలు
హడింబమ్మకి కట్టిన గుళ్ళు
ఘటొత్కచుడి గోపురాలు
కనుచూపుమేరంతా
కమ్ముకున్న ఏపిల్ పూల పరిమళాలు
మణికరణ్ లో సలసలకాగే
భాస్వరపు నీటి గుండాలు
నేచురల్ నీటీ గుండాల్లో
ఉడికిన అన్నాల ఆరగింపులూ
ఐస్ వాటర్లో బతికే ట్రాట్ ఫిష్
వేడి వేడి వేపుళ్ళూ
హిమాలయాల అంచుల్లో ఉన్న
హిమాచల్ అందాలు చూసి తీరాల్సిందే
హిమవత్పర్వతాల స్వచ్చత్వం లో మునకలేయాల్సిందే
మనశ్శరీరాల మహా వికారాలన్ని
మటుమాయం చేసుకోవాల్సిందే
మంచుకప్పుకున్న మహా పర్వతాల ముందు
మనోవాక్కయకర్మలా మోకరిల్లాల్సిందే
ఉల్లాసం ఉత్సాహం ఉద్వేగం
ముప్పేటలా మనస్సు నిండా ముప్పిరిగొన్న
మనాలీ మంచు కొండల యాత్ర
గుండెల్లో గూడు కట్టుకున్న
గమ్మత్తు జ్ఞాపకాల సమాహరం
మత్తులో సోలిపోయిన మధుర్యాల మణిహారం
మండు వేసవిలో చందనాల లేపనం
Friday, March 27, 2009
ఇంఫాల్ - ఏక్ పల్ హసీ ఏక్ పల్ ఆశు
2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్ ఎక్స్‌పోజర్ విజిట్‌కి జైపూర్ వెళ్ళడం వల్ల నేను వాటిని మిస్ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్ చాలాదూరం కాబట్టి ప్రయాణ ఖర్చులకే ఇరవైవేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్ నిర్మాణంతో పాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేను హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద చర్చలతో పాటు, ఎన్నో అంశాల మీద మూడురోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
మూడునెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈమెయిల్ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుండి ప్రయణపు ఏర్పాట్లు మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఎన్నో అనుమానాలు. మణిపూర్ గురించి గాని మిగతా ఈశాన్యభారతం గురించి గానీ మీడియాలో ఎలాంటి వార్తల, సమాచారం లేకపోవడం వల్ల ఎన్నెన్నో సందేహాలు. అసలు ఎలా వెళ్ళాలి? ఇంఫాల్‌కి రైల్వేలైను లేదు. విమానంలో వెళితే ఎక్కడ దిగాలి? కోల్‌కతానా? గౌహతీనా? అక్కడి నుండి బస్సులుంటాయ? ఎన్ని గంటల ప్రయణం? ఇంటర్‌నెట్ నుండి కొంత సమాచారం సేకరించినా తృప్తిలేదు. మొబైల్ ఫోనులు మౌనవ్రతం పడతాయని, ఎటిఎమ్‌లు మొత్తానికే మొరాయిస్తాయని కొందరు భయపెట్టారు. అవసరమైన డబ్బులు మోసుకెళ్ళాలన్నమాట.
ఈ అనుమానాలన్నీ ప్రశ్నలరూపంలో సంధిస్తూఅంజులికకు ఎన్ని మెయిల్స్ రాసినా సమాధానాల్లేవు. మణిపూర్‌లో పరిస్థితి, అంజూలిక నిస్సహాయస్థితి తెలియక కోపం తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయడం లేదని, త్వరలోనే అన్ని వివరాలు రాస్తానని తన మెయిల్, ఆ మర్నాడే కల్పనాశర్మ నుండి మెయిల్ వచ్చింది. అంజులిక కజిన్ ఇంఫాల్‌లో దారుణ హత్యకు గురయ్యాడని తను చాలా దుఃఖంలో వుందని దాని సారాంశం. అందరం చాలా బాధపడుతూ తనకి రాసాం. తను కాన్ఫరెన్స్ నిర్వహించగలుగుతుందా అనే భయాలను పటా పంచలు చేస్తూ అంజులిక అన్ని వివరాలతో మెయిల్ ఇచ్చింది. తన దుఃఖాన్ని దిగమింగి ప్రోగ్రామ్ జరపడానికే తను రెడీ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది వెళతారో, ఎవరెవరు వెళతారో స్పష్టత లేకపోవడం వల్ల నేను నా ప్రోగ్రామ్ ఒంటరిగానే తయారుచేసుకున్నాను. గౌహతిలో ఐఐటి చదువుతున్న, నా ఫ్రెండ్ గీత కూతురు వైశ్ణవి నా కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యాంపస్‌లోను, షిల్లాంగ్‌లో నా కోసం గెస్ట్‌హౌస్ బుక్ చేసి, టాక్సీ మాట్లాడి గౌహతి ఏయిర్‌పోర్ట్‌లో వుంచింది.ఈశాన్య రాష్ట్రాలకి ఎపుడూ వెళ్ళకపోయినా సరే ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా ఒక్కదాన్ని తిరుగుదామనే నిర్ణయించుకున్నాను కొన్నిసార్లు ఒంటరి ప్రయాణాలు గొప్ప గొప్ప అనుభవాలను అందిస్తాయి. ఇంఫాల్ వెళ్ళిన తర్వాతే ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళని కలుసుకోవడం జరిగింది.
4వ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఫ్లయిట్‌లో నా ఇంఫాల్ ప్రయాణం మొదలైంది. పదిగంటలకి కోల్‌కత్తాలో దిగి, ఇంఫాల్ ఫ్లయిట్ కోసం ఎదురుచస్తున్నపుడు బాంబే, పూనే, కలకత్తా గ్రూప్‌లు కలిసాయి. 12.30కి ఇండిగో విమానంలో బయలుదేరి 1.45కి ఇంఫాల్‌లో దిగాను. ముందు విమానంలో బయలుదేరి వెళ్ళిన ఆంధ్రాగ్రూప్‌లో సాక్షిలో పనిచేసే మంజరి, వార్తలో పనిచేసే జె. శ్యామల, వసంత, వనజారెడ్డి, ఎన్‌టివీలో పనిచేసే సమీర (మంజరి కూతురు) కలిసారు. అంజులిక కోసం ఎదురుచస్తుంటే గలగల నవ్వుతూ చిత్ర మా కోసం వాహనం తీసుకుని వచ్చింది. అందరం వాహనంలో ఎక్కి 'మంత్రిపుక్రి' అనే ప్రాంతానికి బయలుదేరాం. అక్కడే ఒక క్రిష్టియన్ సంస్థలో మా అందరికీ వసతి ఏర్పాటైంది. ఎయిర్‌పోర్ట్ నుండి మంత్రిపుక్రికి వెళుతుంటే, దారిపొడుగునా కనబడిన షాపులు, భవనాలు గమనించినపుడు మేము ఒక రాష్ట్ర రాజధాని నగరంలో ఉన్న భావం కలగలేదు. దుమ్ముకొట్టుకుపోయిన ఆ దారంతా చూస్తున్నపుడు ఏదో చిన్న పట్టణంలో వున్నామనిపించింది. మధ్యలో అరగంటపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెళ్ళిళ్ళ సీజనని చిత్ర ప్రకటించింది. మామూలు పౌరుల కన్నా తుపాకు లెక్కుపెట్టిన ఆర్మి, అస్సామ్ రైఫిల్స్ సాయుధుల హడావుడి ఎక్కువగా వుంది. జిప్సీ వాహనాల్లో ట్రిగ్గర్ మీద వేలుంచి, తీక్షణంగా జనంవేపు చూస్తున్న వాళ్ళని చూస్తుంటే వెన్నులో జలదరించినట్లయింది.
మా వాహనం దుమ్ము రేపుకుంటూ మంత్రిపుక్రిలోకి ప్రవేశించింది. మెయిన్ రోడ్డుకి అరకిలోమీటర్‌లో రిట్రీట్ హౌస్ వుంది. దుమ్ము తుఫానును చీల్చుకుంటూ మా వాహనం ఓ చిన్నపాటి చెరువు పక్కనుంచి పాఠశాల భవనంలా వున్న రిట్రీట్ హౌస్ ముందు ఆగింది. అప్పటికి మూడు గంటలయ్యింది. ఎవరి సామానులు వాళ్ళు మోసుకుంట రెండస్తులు ఎక్కి లోపలికెళితే బోర్డింగ్ స్కూల్‌లో వున్నట్లు వరసగా ఓ ఇరవై మంచాలు కనబడ్డాయి. తలో మంచం దగ్గర లగేజ్ పెట్టి లంచ్ ఏర్పాట్లు ఏమిటా అని అడిగితే ఏమీ లేవు అని తెలిసింది. అందరి బ్యాగుల్లోంచి బిస్కెట్ పాకెట్లు, చిక్కీలు, చపాతీలు బయటకొచ్చాయి. అందరం వాటిని షేర్ చేసుకుని కబుర్లలో పడ్డాం. ఇరవైమందికి మూడే బాత్‌రమ్‌లున్నాయి. ఎవరెవరు ఎపుడు స్నానాలు చేయాలో జోక్‌లేసుకుంటూ నవ్వుకుంటూ వున్నపుడు ఎవరో వచ్చి మనకోసం రూమ్‌లు కూడా వున్నాయంట అంటూ ప్రకటించారు. మళ్లీ లగేజ్‌మోసుకుంటూ రూమ్‌లున్నవేపు వెళ్ళాం. నేను, కల్పనాశర్మ ఒక రూమ్‌లో సర్దుకున్నాం.
మొబైల్ ఫోన్లు మూగనోము పట్టడంతో మెయిన్‌రోడ్డు కెళ్ళి ఎస్‌టిడి ఫోన్ చెయాలని కొంతమంది బయలుదేరాం. రోడ్డు మీదకెళ్ళేవరకు మాకు తెలియని విషయం ఒకటుంది. అదే గత నెలరోజులుగా ఇంఫాల్‌లో సాయంత్రం ఐదు నుండి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ వుందని. మేము వెళ్ళేసరికి నాలుగున్నర అయ్యింది. ఇంక అరగంటే టైముంది. ఒకే ఒక్క ఎస్.టి.డి. బూత్ కనబడింది. ఫోన్లు చేసి, వాటర్ బాటిల్స్, ఏవో తినుబండారాలు కొనుక్కుని టీ కోసం చూస్తే ఒక్క హోటల్ కూడా కనబడలేదు. పోలీసుల విజిల్స్ వినబడసాగాయి. హడావుడిగా షాప్‌లు మూసేయసాగారు. ఒకామె టీకోసం మేం పడుతున్న అవస్థ చూసి, ఇంట్లోకి పిలిచి బ్లాక్ టీ పెట్టి ఇచ్చింది. పాలు లేవని చెప్పింది. అందరం దుమ్ము లేపుకుంటూ మా బసవేపు నడవసాగాం. తీరా రిట్రీట్ హౌస్‌కి చేరేసరికి చిమ్మచీకటి. పవర్ కట్ అట. కరెంట్ ఎపుడొస్తుందో ఎపుడు పోతుందో తెలియదట. చీకటి వల్ల వెన్నెల స్పష్టంగా కనబడుతోంది. చుట్ట పరుచుకున్న కొండల మీద తెల్లగా కురుస్తున్న వెన్నెల. పల్లెటూళ్ళల్లో కరెంట్ పోయినపుడు పౌర్ణమి ఎంత అందంగా కనబడుతుందో అష్టమినాటి చంద్రుడు అంత అందంగాను కనబడ్డాడు.
మా అదృష్టం బావుండి రూమ్‌ల్లో చిన్నచిన్న సోలార్‌లైట్‌లు వెలుగుతున్నాయి. ఎనిమిదింటికల్లా డిన్నర్‌కి రమ్మన్నారు. కట్టెలపొయ్యి మీద చికెన్ వొండుతుంటే లోపలికెళ్ళి చూసాన్నేను. అపుడే లిల్లీ పరిచయమైంది. రిట్రీట్ హౌస్‌లో వంట చేస్తుంది లిల్లీ. కూరల్లో ఉప్పూ కారం అస్సలు లేవు. చికెన్ కొంచం బెటర్. క్యాబేజ్ ఎక్కువగా వాడారు. ఏదో తిన్నామన్పించి ఎనిమిదిన్నరకల్లా రూమ్‌ల్లో పడ్డాం. ఏంచెయ్యలో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు కబుర్లయ్యాయి. ప్రయాణ బడలికతో అందర అలిసిపోయారు. అయినా నిద్దర రావట్లేదు. టీవీల్లేవు. చదువుదామంటే లైట్ లేదు. చుట్టూ చిమ్మచీకటి. ఉండుండి వినిపిస్తున్న పోలీసుల విజిల్స్. ముసుగేసి పడుకోవడం బెటరన్పించి తొమ్మిదికల్లా మంచమెక్కేసాం. నా రూమ్మేట్ కల్పనకి దుమ్మువల్ల బాగా జలుబుచేసి, రాత్రంతా చాలా ఇబ్బంది పడింది.
మర్నాడు ఐదుకల్లా మెలుకువ వచ్చేసింది. తొమ్మిదింటికల్లా రెడీ అవ్వాలని క్రితం రోజు చిత్ర చెప్పింది. ఓ గంటసేపు వాకింగ్ కెళితే టైమ్‌పాస్ అవుతుందని అనుకుని బూట్లేసుకుని బయటకొస్తే బాగా చలిగా అన్పించింది. అప్పటికే మంజరి, సమీర వాళ్ళు కూడా బయటకొచ్చారు. అందరం కలిసి బయటపడి కనబడుతున్న కొండలవేపు బయలుదేరాం. చల్లగాలిలో నడవడం చాలా హాయిగా వుంది. చిన్నచిన్న ఇళ్ళు. ఎక్కువ భాగం వెదురు తడకలతో కట్టుకున్నవే. మేం నడుస్తూ వెళుతున్నపుడు ఒకామె ఇంటిముందు ఊడుస్తుంటే మాతో వున్న వసంత ఫోటో తియ్యడానికి ప్రయత్నించినపుడు మమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచింది. సన్నగా, సంప్రదాయ మణిపురి దుస్తుల్లో వున్న ఆమె పేరు సోసో. మమ్మల్ని ఎంతో ఆదరంగా పిలిచి, చిన్నచిన్నమోడాలు వేసి కూర్చోమంది. లోపల్నుంచి నలుగురు పిల్లలు వచ్చారు. తన పిల్లలని ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని చెప్పింది. చక్కటి నవ్వుముఖాలతో, చికిలి కళ్ళతో వున్నారు వాళ్ళు. తన భర్త పొల్ల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. వెదురు చాపలతో కట్టిన మూడురూముల ఇల్లు. శుభ్రంగా వుంది. లోపల్నించి కుంపటి తెచ్చి మామధ్య పెట్టి టీ తెస్తానని వెళ్ళింది. మేం పిల్లల ఫోటోలు తియ్యడంలో మునిగాం. ఆమె కొడుకు నవ్వుతుంటే ఎంత ముద్దొచ్చాడో. ఆ పిల్లాడి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ నవ్వుతుంటాయి. సోసో వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది. ఆ చలిలో వెచ్చటి టీ తాగుతూ సోసోతో బోలెడు కబుర్లు చెప్పాం. కర్ఫ్యూ గురించి అడిగితే, నవ్వుతూఅలవాటయిపోయింది అంది. మేము జర్నలిస్ట్‌లమని చెప్పాం. ఆమెకు థాంక్స్ చెప్పి బయటపడ్డాం.
తొమ్మిదింటికల్లా అందరం తయరై బస్సులో కూర్చున్నాం. దాదాపు 60 మంది జర్నలిస్టులం అప్పటికి ఇంఫాల్ చేరుకున్నాం. ఇంకా రావలసిన వాళ్ళున్నారు. మొదటిరోజు మీటింగ్ కాంగ్లా ఫోర్ట్ అనే చోట జరుగుతోందని చిత్ర చెప్పింది. మేము కాంగ్లా చేరేసరికి పదయ్యింది. సమావేశాన్ని ప్రారంభించే హాలులో కూర్చున్నాం. మణిపూర్ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ సమావేశాన్ని ప్రారంభించారు. అదే రోజు ''అనుపవ జయరామన్'' అవార్డును ప్రదానం చేయడం జరిగింది. చాలా చిన్న వయస్సులో మరణించిన ''అనుపమ'' పేరు మీద ఆమె తల్లిదండ్రులు, జర్నలిస్టుల నెట్‌వర్క్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవార్డును 2008కి గాను అలీఫియ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, హిందుస్తాన్ టైమ్స్, ముంబయ్‌కి ప్రదానం చేసారు.
ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 'అరంబమ్ మెంచుబీ' మణిపురి స్త్రీల స్థితిగతుల మీద ఉపన్యసించారు. అరంబమ్ నాకు బాగా పరిచయమే. మేమంతా ''స్పారో'' ఏర్పాటు చేసిన జాతీయస్థాయి రచయిత్రుల సమావేశంలో ఐదు రోజులు ఖషీద్ (ముంబయి)లో కలిసివున్నాం. నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పల్కరించింది. అక్కడే వుండే మరో మణిపురి రచయిత్రి బోర్‌కన్య గురించి వాకబుచేస్తే, మర్నాడు తనని తీసుకొస్తానని వాగ్ధానం చేసింది అరంబమ్. ఆ తర్వాత మణిపురి వర్కింగ్ జర్నలిస్ట్‌లతో మాటామంతి జరిగింది. మణిపురి జర్నలిస్ట్‌లతోమాట్లాడుతున్న సందర్భంలోనే కాంగ్లా గేట్ ఉదంతం గురించి, ఆ గేట్ ముందు జరిగిన చారిత్రాత్మక మణిపురి స్త్రీల నగ్నప్రదర్శన గురించి మా అందరికీ వివరంగా తెలిసింది. నాలుగున్నర అయ్యేసరికి కర్ఫ్యూ హడావుడి మొదలైంది. మేమంతా హడావుడిగా బస్సెక్కేసాం. అందరూ ఎక్కేసరికి ఆలస్యం అవ్వడంతో కర్ఫ్యూ మొదలైంది. పోలీసులు, ఆర్మీ బెదిరింపుల మధ్య మా బస్సు భయంభయంగా బయలుదేరింది.
కాంగ్లాఫోర్ట్, మనోరమాదేవి హత్య :
2004, జులై 11వ తేదీన తన ఇంట్లో నిద్రపోతున్న మనోరమాదేవి అనే మహిళను అర్ధరాత్రి అస్సామ్ రైఫిల్స్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. తీవ్రవాది అనే అనుమానంతో ఆమెను అరెస్ట్ చేసారు. కొన్ని గంటల తర్వాత చిత్రహింసలకు గురిచేయబడి, ఒళ్ళంతా గాట్లు, కమిలిపోయిన శరీరభాగాలతో, సామూహిక అత్యాచారానికి గురైన మనోరమ శవం రోడ్డుమీద దర్శనమిచ్చింది.
ఈ సంఘటన మణిపూర్ స్త్రీలను తీవ్రంగా కలిచివేసింది. 12 మంది ''మైరా ఫెయిబి'' సంస్థకు చెందిన మణిపూరి స్త్రీలు ''ఇండియన్ ఆర్మి రేప్ అజ్'' అనే బేనర్‌తో పబ్లిక్ ప్రదేశంలో, కాంగ్లా గేటు ముందు నగ్నప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన దేశం మొత్తాన్నీ నివ్వెరపరిచి మణిపూర్‌లో ఏం జరుగుతుందో అర్థం చేయించింది. మనోరమ హత్యానంతరం కొన్ని నెలలపాటు మణిపూర్ మండిపోయింది. కమీషన్ ఆఫ్ ఎంక్వయిరీ వేసారు గానీ ఈ రోజుకీ ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. స్త్రీల నగ్నప్రదర్శనానంతర ఉద్యమం వల్ల అస్సామ్ రైఫిల్స్‌కీ, ఆర్మీకి కేంద్ర స్థావరంగా వున్న కాంగ్లా ప్రాంతాన్ని ఖాళీ చేయించి, సివిల్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది.
మేము బస్సులో మంత్రిపుక్రికి ప్రయాణం చేస్తున్నపుడు కాంగ్లా గేట్ ఉదంతం గురించి విన్నాం. మనోరమని తలుచుకుని కన్నీళ్ళ పర్యంతమయ్యామ్. తోటి స్త్రీకి జరిగిన అన్యాయన్ని ప్రశ్నిస్తూ నగ్నప్రదర్శనలాంటి తీవ్రచర్యతో తమ నిరసనను వ్యక్తం చేసిన పన్నెండుమంది మణిపురి స్త్రీలకు పాదాభివందనం చెయ్యాలన్పించింది. బస్సు మా బస దగ్గరికి దుమ్ములేపుకుంట వచ్చింది. అప్పటికే చీకటి పడింది. కరెంట్ లేదు. దూరంగా కొండలమీద మిణుకు మిణుకుమటూ వెలుగుతున్న దీపాలు. పిండారబోసినట్లు నవమి వెన్నెల. ''కొండలపైనా, కోనలలోనా గోగులుపూచే జాబిలి'' అని పాడుకుంటూ ఆ చీకట్లో చేసే పనేంలేక బయటే కూర్చుండిపోయం. చాలాసేపు కాంగ్లా గేట్ ఉదంతం మా మాటల్లో నలిగింది. డిన్నర్ అయ్యాక కొంతమందిమి ఒక గదిలో చేరి పాటలు పాడే కార్యక్రమం మొదలుపెట్టాం. బెంగుళూరు నుండి వచ్చిన వాసంతి రేష్మా 'చార్ దినోంకా' పాటని అద్భుతంగా పాడింది. అన్ని భాషల వాళ్ళు తలో పాటా అందుకుని హైపిచ్‌లో పాడుతూ, అల్లరి చేస్తుంటే రిట్రీట్ ఫాదర్ పాల్ వచ్చి నిశ్శబ్దంగా వుండాలని తొమ్మిది అవుతోంది, లైటు తీసేయాలని హుకుం జారీచేసాడు. బతుకుజీవుడా తొమ్మిదికే పడుకోవాలా అనుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళం ముడుచుకుపోయామ్. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కలల్లో కాంగ్లా గేట్, నగ్నస్త్రీలు కలవరపరిచారు. మనసు కలిచివేసి నట్లయింది.
మర్నాడు ఉదయమే ఆంధ్రా బ్యాచ్ ఎదురుగావున్న కొండ ఎక్కాలని బయలుదేరాం. నేను, వనజ, మంజరి, శ్యామల, సమీర, వసంత, అనూరాధ, వనజారెడ్డి అందరం హుషారుగా కొండెక్కుతున్నాం. కిందినుంచి చూస్తే కొండమీద ఏమీ కనబడలేదు గాని మేముపైకి వెళుతుంటే ఓ ఇల్లు కనబడింది. దానిపక్కనే ఓ గెష్ట్‌హౌస్ లాంటిది కనబడింది. కొండమీదికి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లోని కుటుంబమంతా ఉదయపు ప్రార్థనలో వున్నారు. మేం నిశ్శబ్దంగా నిలబడ్డాం. కొంతసేపటికి ప్రార్థన ముగించి ఒకాయన మాదగ్గరకొచ్చాడు. మేం ఫలానా అని చెప్పాం. తన పేరు అనమ్ అని, ఆ కొండపేరు ఖదిమ్ కొండ అని చెబుతూ ఖదిమ్ అనే అతను అక్కడ వుండేవాడని, ఈ గెష్ట్‌హౌస్ వాళ్లదేనని, తాను వాచ్‌మెన్‌నని చెప్పాడు. ఆ పక్కనే వున్న ఖదిమ్ భార్య సమాధినిచూపించాడు. మా ఎనిమిదిమందికి పొగలు కక్కే టీ తీసుకొచ్చి ఇచ్చింది అతని కూతురు. టీ తాగి అతని ఇంట్లోకి వెళ్ళాం. చిన్న ఇల్లు. అనమ్, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటున్నారు. ఆవులు, బాతులు పెంచుతున్నారు. మేం శెలవు తీసుకుని బయలుదేరబోతుంటే 'ఆప్ లోగ్ ఫిర్ ఆయియే' అంటూ ఆదరంగా చెప్పాడు అనమ్. మణిపూర్ వాస్తవ్యులు కొత్తవ్యక్తులతో కూడా చాలా ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడ్డం గమనించాం. సోసో, అనమ్ కుటుంబం మాకు బాగా గుర్తుండిపోయారు.
తొమ్మిదిన్నరకి రెండోరోజు సమావేశం మొదలైంది. నెట్‌వర్క్ సమావేశాలకు హాజరైన సభ్యుల పరిచయాలయ్యయి. అంతకుముందురోజు మధ్యాహ్నానికి ఇంఫాల్ చేరిన 'నవోదయం' సభ్యులు తమని తాము పరిచయం చేసుకున్నపుడు సభ్యులందరూ కరతాళధ్వనులతో వారిని ఆహ్వానించారు. చిత్తరుకు చెందిన ఈ గ్రామీణస్త్రీలు ఎంతో ప్రతిభావంతంగా తామే ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా పనిచేస్తూ నడుపుతున్న పత్రిక నవోదయం. స్వయంసహాయక బృందాలకు చెందిన ఈ పత్రిక చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ టీమ్ సభ్యులు ప్రతి సంవత్సరం మహిళా జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్ సమావేశాలకు హాజరవుతారు.
పరస్పర పరిచయలయ్యక నెట్‌వర్క్ గురించి, వెబ్‌సైట్ గురించి చర్చ జరిగింది. జాతీయస్థాయిలో మహిళా జర్నలిస్ట్‌్‌ల నెట్‌వర్క్‌ను రిజిష్టర్ చేయలా వద్దా అనే అంశం మీద వేడైన వాడైన చర్చ జరిగింది. కొంతమంది రిజిష్టర్ చేస్తే బావుంటుందని వాదిస్తే మరికొందరు నెట్‌వర్క్ అందం అంతా రిజిష్టర్ చెయ్యకుండా, ఏలాంటి హెచ్చుతగ్గుల స్థాయిలు లేకపోవడంలోనే వుందని వాదించారు. అయితే ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్ వైపు మొగ్గుచపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కల్పనాశర్మ చర్చను ముగిస్తూ దీనిమీద తొందరపడడం మంచిది కాదని మరింత చర్చ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పింది.
ఆ తర్వాత మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు. హ్యూమన్ రైట్స్ అలర్ట్ అనే సంస్థ నుండి బబ్లూ లైటోంగ్‌బామ్ చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సభ్యులందరూనిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. మణిపూర్‌లో తిరుగుబాటు నేపథ్యాన్ని గురించి ప్రస్తుతం ఎన్ని గ్రపులు అండర్‌గ్రౌండ్‌లో వుండి పోరాటం చేస్తున్నదీ వివరించారు. నాగాలు, కుకీలు, మైతేయులు, వైష్ణవులు, ముస్లిమ్‌ల గురించి వివరించాడు బబ్లూ. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి మణిపూర్ రాచరికంలో వుందని, ఆగష్టు 14, 1947 రోజు అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన ఒకరోజుముందే నాగా నేషనల్ కౌన్సిల్ బ్రిటీష్ రాజ్యం నుండి తాము స్వతంత్య్రాన్ని పొందినట్టు ప్రకటించుకున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం ఇండియన్ గవర్నమెంట్ బలవంతంగా మణిపూర్‌ను ఇండియాలో విలీనం చెయ్యడాన్ని జీర్ణించుకోలేని అనేక గ్రపులు తిరుగుబాటు బాట పట్టాయి. ఈ తిరుగుబాట్లను అణిచివేసే నెపంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరమైన చట్టాలను తెచ్చాయి. అనేక గ్రూపులు చేస్తున్న ఈ తిరుగుబాట్లను లా అండ్ ఆర్డర్ సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప వారి ఆత్మగౌరవ పోరాటాలుగా గుర్తించడం లేదు. ఈ తిరుగుబాట్లను అణచడానికి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఏక్ట్ 1958ని తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసి, మణిపూరీ ప్రజల మాన, ప్రాణాలను ఈ చట్టం హరిస్తోందని బబ్లూ వివరించారు. ఎన్నో దేశీయ గ్రూప్‌లు భారత ప్రభుత్వంతో పోరాడుతున్నాయని, ఆర్మీ, అస్సామ్ రైఫిల్స్‌కి చెందిన సాయుధులు ప్రజలను ఊచకోత కోస్తున్నారని బబ్లూ వివరించాడు.
బబ్లూ తర్వాత 'నాగా వుమన్ యూనియన్'కి చెందిన గ్రేస్ ఫట్‌సంగ్ నాగా స్త్రీల ఉద్యమం గురించి చెప్పారు. ఆమె ప్రసంగం తర్వాత డా: ఎస్. చోంగ్లాయ్‌మానవహక్కుల కోసం 'కుకి'లు చేస్తున్న పోరాటం గురించి ప్రసంగించారు. 1919లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసిన, ఒకప్పుడు ''ఇండిపెండెంట్, హిల్, కంట్రీని'' ఏలిన దేశీయ ప్రజలైన 'కుకీ'లు ఈ రోజు అత్యంత దయనీయంగా బతుకుతున్నారని చోంగ్లోయ్ వివరించారు.
వీరి ప్రసంగాలు చాలా ఆసక్తిదాయకంగా సాగి, మణిపూర్ చరిత్ర పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మంచి చర్చను లేవనెత్తాయి.
ఆ తర్వాత ''వుమన్ విడోడ్ బై కాన్‌ప్లిక్ట్ ఇన్ మణిపూర్'' పేరుతో అంజులిక తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ చూపించారు. సైన్యం విచక్షణారహితంగా కాల్చేసిన కుటుంబాల స్థితిగతులు, అతిచిన్న వయస్సుల్లో భర్తల్ని పోగొట్టుకుని విధవలైన స్త్రీలు హృదయవిదారకంగా రోదిస్త కాల్పుల నేపథ్యాలను వివరించినపుడు అందరం కదిలిపోయామ్. నలుగురు నుంచి ఐదుగురు పిల్లలతో భర్తల్ని పోగొట్టుకున్న ఆ స్త్రీల జీవితాల్లోని విషాదం చూస్తూ కన్నీళ్ళ పర్యంతమైనాం అందరం. అన్నిటికన్నా అత్యంత దుఃఖాన్ని నింపిన సన్నివేశం మిలిటెంట్ గ్రూప్ చేతుల్లో హత్యకు గురైన అంజులిక సోదరుడి భార్య ప్రసంగం. ప్రస్తుత ఇంఫాల్ కర్ఫ్యూకి కారణమైన దింగనమ్ కిషన్, (మణిపురి సివిల్ సర్వీస్‌కి చెందిన యువ అధికారి) దారుణహత్య. ఫిబ్రవరి 13న కిషన్‌ని, అతని డ్రైవర్‌ని, అంగరక్షకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి హత్య చేసారు. శోకదినాలను పాటిస్తూ తెల్లవస్త్రాలను ధరించి కిషన్ భార్య నెట్‌వర్క్ సమావేశాలకు వచ్చి జరిగిన దారుణాన్ని వివరించినపుడు మేమంతా దుఃఖాన్ని ఆపుకోలేకపోయామ్. అందంగా, అమాయకంగా, పుట్టెడు దుఃఖంలో వున్న ఆమె ముఖం ఈ రోజుకీ కళ్ళల్లోంచి పోకుండా కలవరపెడుతూనే వుంది.
లంచ్ తర్వాత ఆరుబయట మణిపురీ నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి అద్భుతంగా నృత్యం చేసారు. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనను కూడా తిలకించిన తర్వాత మనం ఇపుడు ఇమా మార్కెట్ చూడ్డానికి వెళుతున్నామని, త్వరగా వెళ్ళి, కర్ఫ్యూ సమయానికి తిరిగి వచ్చెయ్యాలని అంజులిక ప్రకటించడంతో అందరం హడావుడిగా బస్సెక్కేసాం. కాంగ్లా గేట్‌కి ఎదురుగా, కిటకిటలాడుతున్న మార్కెట్ దగ్గర బస్సు ఆగింది. అప్పటికి టైమ్ నాలుగుంబావు అయ్యింది. బ్యాచ్‌లుగా విడిపోయి ఒక్కో బ్యాచ్‌కి ఒక్కో మణిపూరీ అమ్మాయి తోడురాగా మార్కెట్ వేపు వెళ్ళాం.మార్కెట్ యమ రద్దీగా వుంది. లోపలికెళ్ళినపుడు అక్కడున్న షెడ్‌లలో బారులుతీరి కూర్చున్న మణిపురీ స్త్రీలు వివిధ వ్యాపారాలు చేస్త కనబడ్డారు. అక్కడ దాదాపు 3000 మంది స్త్రీలు ప్రతిరోజూ వ్యాపారం చేస్తారని తెలిసింది. ఆ మార్కెట్ ఎప్పుడు మొదలైందనే దానికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. అక్కడ వ్యాపారులందరూ ఆడవాళ్ళే. అదీ మధ్యవయస్సులో వున్నవాళ్ళు, అరవై దాటివాళ్ళు ఉన్నారు.తల్లుల మార్ఖెట్ అనే దీనికి పేరు. బట్టలు, వివిధ వస్తువులు, కూరగాయలు, చేపలు ఒకటేమిటి ఎన్నో అమ్ముతుంటారు. ఎక్కువగా వివిధ రంగుల్లో మణిపురీ చేనేత దుస్తులు కన్పించాయి. ఈమార్కెట్ పేరు 'ఇమా' బజార్. అక్కడ కొనుక్కునే పురుషులు తప్ప అమ్మే పురుషులుండరు.
మేమంతా తలోదిక్కు వెళ్ళిపోయామ్. అందరూ మణిపురి సంప్రదాయ లుంగీలు, షాల్‌లు కొన్నారు. ఎంతో హడావుడిగా అమ్మేవాళ్ళు అమ్ముతూ, సర్దుకునేవాళ్ళు సర్దుకుంటున్నారు. పిలిచి పిలిచి అమ్ముతున్నారు. కర్ఫ్యూ టైమ్ అయిపోతోంది. ఒక ముసలామె గంప నిండా వంకాయరంగు కలువపూలు తెస్తూ కనబడింది. నేను, మంజరి మూడేసి కట్టల పువ్వులు కొనేసాం. మాకు తోడుగా వచ్చినవాళ్ళు ఇంక పోదాం అంటూ కంగారుపెట్టసాగారు. మార్కెట్ వొదిలి రావాలని ఎవ్వరికీి లేదు. సరదాగా అట ఇట తిరుగుతూ ఆ స్త్రీలను పల్కరించాలని వాళ్ళతో మాట్లాడాలని వున్నా గాని, పోలీసుల విజిల్స్, సాయుధ సైనికులు తుపాకులెక్కుపెట్టి తిరుగుతున్న జిప్సీ వాహనాలు అందరినీ టెన్షన్ పెట్టేసాయి.మార్కెట్ కూడా చాలావరకు మూసేసారు. మేమంతా కంగారు కంగారుగా మా బస్సు ఆగివున్న చోటుకి పరుగులుపెట్టేం. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక వాహనం పట్టుకుని, కిటకిటలాడే ఆటోలెక్కి ఇళ్ళకు వెళ్ళిపోసాగారు. బిజినెస్ ఊపందుకునే సాయంత్రం వేళ పాపం! ఆ మహిళలంతా దుకాణాలు మూసేసి ఇళ్ళకు వెళ్ళిపోవడం అదీ ఎంతో టెన్షన్‌గా వెళ్ళడం చాలా బాధన్పించింది. ఇళ్ళకెళ్ళాక మాత్రం ఏముంటుంది? కరెంట్ లేని చీకటి ఇళ్ళు మాత్రమే వాళ్ళకోసం ఎదురుచూస్తాయి. బహుశా సైన్యం ఇనుపబూట్ల చప్పుళ్ళే వాళ్ళకి వినోదమేమో! అంతకు మించిన చప్పుళ్ళు ఆ కర్ఫ్యూవేళ ఇంకేముంటాయి?
మా బస్సు వేగంగా మమ్మల్ని తెచ్చి రిట్రీట్ హౌస్‌లో దింపేసింది. అప్పటికి ఐదున్నర అయ్యింది. మార్కెట్ దగ్గర ఫోన్ చేద్దామని ప్రయత్నించినా ఎక్కడా ఎస్‌టిడి బూత్ కనబడలేదు. నేను మెయిన్‌రోడ్డు మీదకెళుతున్నా ఎవరైనా వస్తారా అంటే మంజరి నేను కూడా వస్తానంది. శ్యామల కూడా మాతో బయలుదేరింది. ఎస్‌టిడిబూత్ వుంటుందనే ఆశతో ఆ చీకట్లో బయలుదేరాం. కరెంటు లేకపోవడం వల్ల వెన్నెల తెల్లగా మెరుస్తోంది. మాకు ఒక మిలిటరీ జీప్ ఎదురొచ్చింది. మేం పక్కకు జరిగి నిలబడ్డాం. దుమ్ము లేపుకుంట వెళ్ళిపోయింది. కొంతమంది స్త్రీలు గుడ్డిదీపాలు పెట్టుకొని కూరగాయలు, చేపలు అమ్ముకుంటున్నారు. షాపులన్నీ మూసేసారు. వాటర్ బాటిల్స్ కొందామంటే దొరకలేదు. మేము అంతకుముందురోజు మాట్లాడిన ఎస్‌టిడిబూత్ మూసేసి వుంది. అర్జంటుగామాట్లాడాలి ఎలా? అనుకుంటూ అక్కడ నిలబడిన ఒకాయన్ని ఇక్కడ ఇంకో ఎస్‌టిడి బూత్ వుందా అని హిందీలో అడిగాం. మా వేపు ఎగాదిగా చూసి ఆ ప్రాంతానికి కొత్తవాళ్ళమని అర్థం చేసుకుని 'ఆయీయే' అంటూ రోడ్డు మీదకు దారితీసాడు. మెయిన్‌రోడ్డంతా చీకటిగా, నిర్మానుష్యంగా వుంది. ఒక షాప్ ముందాగి తలుపు మీద కొడితే ఆ తలుపు ఓరగా తెరుచుకుంది. లోపల ఫోన్ వుంది. ముగ్గురం లోపలికెళ్ళగానే ఆ షాపతను తలుపు మూసేసాడు. తనివితీరా ఫోన్‌లో మాట్లాడి, మిత్రులకి ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నామో చెప్పేసరికి వాళ్ళు కంగారుపడ్డారు. నా మిత్రురాలు ఒకామె అయితే నన్ను చివాట్లేసింది. అలాంటి ప్రమాదకర పరిస్థితులున్నచోట ఎడ్వంచర్లేమిటని కేకలేసింది.
షాపతనికి డబ్బులిచ్చేసి మొత్తంగా నిర్మానుష్యంగా మారిన రోడ్ల మీద నడుస్తూ, ఇంఫాల్ ప్రజల ముఖ్యంగా స్త్రీల కష్టాలకు బాధపడుతూ,
ఇలా ఎన్నాళ్ళు కర్ఫ్యూనడుస్తుందా, జనం ఇలా ఎంతకాలం భరించాలా అని చర్చించుకుంటూ మా బసకు చేరాం.
మర్నాడు తొమ్మిదిన్నరకే మీటింగ్ మొదలైంది. నెట్‌వర్క్‌కి సంబంధించిన కార్యకలాపాల గురించి, వచ్చే సమావేశం ఎక్కడ నిర్వహించాలి అనే అంశం గురించి చర్చ జరిగింది. మేము నిర్వహిస్తాం అంటూ కేరళ బృందం ముందుకు రావడంతో నిర్వహణకు అవసరమైన వనరుల మీద, ఆ వనరుల్ని ఎలా సేకరించాలి అనే దానిమీద వాదోపవాదాలు జరిగాయి. బెంగుళూరుగ్రూప్ 'అనుపమ జయరామన్' అవార్డు నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చకు పెట్టారు. చాలా సీరియస్‌గా అందరం చర్చలో మునిగివున్న వేళ అంజులిక హఠాత్తుగా ఒక ప్రకటన చేసింది. ఇరామ్ షర్మిల ఆ రోజు విడుదల కాబోతోందని, మనమంతా ఇపుడు ఆమెను బంధించి వుంచిన ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పడంతో అక్కడంతా ఒక ఉత్కంఠ నెలకొంది. నేను ఇంఫాల్‌కి వచ్చిన రోజే షర్మిలను కలిసే వీలుందా అని చిత్రని అడిగితే చాలా కష్టం అని చెప్పింది. రెండు సంవత్సరాల క్రితమే ''మణిపుర్ ఉక్కు మహిళ ఇరామ్ షర్మిల'' అని నేనుభూమికలో సంపాదకీయం రాసాను. ఆమె ధైర్యం, సాహసం ఎంతో స్ఫర్తిదాయకమైనవి. అలాంటి షర్మిలను కలుసుకునే అవకాశం రావడం అందరిలోను ఉద్వేగాన్ని రేపింది.
లంచ్ తిన్నామనిపించి అందరం బస్సులో ఎక్కేసాం. ఓ అరగంట ప్రయణం తర్వాత మేము షర్మిల విడుదల కోసం రిలే నిరాహారదీక్షలు చేస్తున్న శిబిరం దగ్గర దిగాం. అప్పటికి 88 రోజులుగా మణిపురి స్త్రీలు రిలే నిరసనదీక్షలు చేస్తున్నారు. మేము కూడా శిబిరంలో కూర్చున్నాం.
అద్భుత సాహసమూర్తి ఇరాం షర్మిల
ఇరామ్ షర్మిల సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతాదళాల చేతుల్లో హత్యలకు, అత్యాచారాలకు బలైన స్త్రీల కన్నీటికథనాలను వినేది. శాంతియత్రల్లో పాల్గొనేది. 2000 సంవత్సరం నవంబరు 2న 'మాలోమ్' పట్టణంలోని బస్టాండులో అస్సామ్ రైఫిల్స్ సాయుధులు పదిమంది పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిల తీవ్రంగా చలించిపోయింది. అంతకుముందు మణిపురి తిరుగుబాటుదారులు భద్రతాదళాల వాహనాలపై దాడిచేసినందుకు ప్రతీకారంగా అస్సామ్ రైఫిల్స్ ఈ దురాగతానికి దిగింది. 'మాలోమ్' పట్టణం ఇంఫాల్‌కి పదిహేను కిలోమీటర్ల దూరంలో వుంది. షర్మిల ఈ సంఘటన జరగడానికి ముందే ఒక శాంతియత్రా నిర్వహణ కోసం మాలోమ్‌కి వచ్చి వుంది. ఆమె మాలోమ్‌లో వున్నపుడే ఈ దారుణ సంఘటన జరగడంతో, శాంతి ర్యాలీ ఆలోచనను విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకి పూనుకోవాలని నిర్ణయించుకుంది. భద్రతాదళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన Armed Forces Special Powers Act, 1958 (AFSPA) ని రద్దుచేయలంట ఆమరణ నిరాహారదీక్షకు దిగాలనే తీవ్ర నిర్ణయన్ని ఇరామ్ షర్మిల తీసుకుని తల్లితో చెప్పినపుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి షర్మిలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతికఠినమైన నియమం పెట్టింది. షర్మిల తను మొదలుపెట్టిన కార్యంలో విజయం సాధించేవరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టడంతో షర్మిల ఒప్పుకుని తన ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. నవంబర్ 11, 2000లో షర్మిల ప్రారంభించిన ఈ దీక్ష తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతూనే వుంది.
అమరణ నిరాహార దీక్షలో వున్న షర్మిలను ఆత్మహత్యా నేరం కింద ప్రభుత్వం అరెష్ట్ చేసి బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌లేసి, ద్రవాహారం పంపిస్తూ జె.ఎన్, ఆసుపత్రిలోని ఎంతో భద్రత కల్గిన వార్డులో బంధించి వుంచింది. ఈ నేరం కింద ఒక్క సంవత్సరమే ఖైదీలో వుంచే వీలుండడంవల్ల, ప్రతి సంవత్సరం ఒక రోజు విడుదల చేసి షర్మిల ఆహారం తీసుకోదు కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేయడం ఎనిమిదేళ్ళుగా ఒక ''తన్తు''లాగా నడుస్తోంది. మేము ఇంఫాల్‌లో వున్నపుడే మార్చి 7న ఆమెను విడుదల చేసి, మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం రోజున అరెస్ట్ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.
"షర్మిల కంబ లప్" పేరుతో ''మైరా పెయిబి'' స్త్రీలు ఆమెకు సహకరిస్తున్నారు. మణిపూర్ లోయలో ఈ మైరాపెయిబి స్త్రీలు అట్టడుగు స్థాయినించి సాంప్రదాయక స్త్రీల సంఘాలుగా ఏర్పడి పనిచేస్తుంటారు. చారిత్రకంగా తీసుకుంటే ఈ మైరాపెయిబీ స్త్రీలు బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగివున్నారు. అలాగే మణిపూర్‌లో తాగుడు వ్యసనానికి, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది కూడా వీరే. అతిబలమైన సాయుధ దళాలను ధిక్కరిస్తూ వనవ హక్కుల ఉద్యమాన్ని నడుపుతున్నది కూడా మైరాపెయిబీ స్త్రీలే నన్నది నగ్నసత్యం. ప్రస్తుతం షర్మిల ఆమరణదీక్షకు మద్దతునిస్తున్నవాళ్ళు వీళ్ళే.
2006లో షర్మిల విడుదలైనప్పుడు, ఆమె తన సోదరుడు, మరో ఇద్దరు కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్ళి జంతర్‌మంతర్ దగ్గర రోడ్డు మీద తన దీక్షను ప్రారంభించింది. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వుంచి ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారాన్ని పంపి ఆమె దీక్షని భగ్నం చేసారు. ఆ తర్వాత షర్మిలను ఇంఫాల్ తీసుకెళ్ళి జవహర్‌లాల్‌నెహ్రూ హాస్పిటల్‌లో నిర్బంధించారు. ఆమెని ప్రతి సంవత్సరం విడుదల చేసి, ఆమె తన దీక్షను కొనసాగించడంతో, ఆమెపై ఆత్మహత్యానేరం వెపి మళ్ళీ మళ్ళీ నిర్బంధిస్తూనే వున్నారు.మార్చి ఎనిమిదిన ఆమెను తిరిగి అరెస్ట్ చేసారు.
2009లో మేము ఇంఫాల్‌లో వున్నపుడు మార్చి 7న ఆమెను విడుదల చేసారు. ఆమె దీక్షకు మద్దతుగా మైరాపెయిబీ స్త్రీలు చేపట్టిన నిరసన శిబిరంలో మేము కూర్చుని వున్నపుడే మరో పదిహేను నిముషాల్లో షర్మిలను విడుదల చేస్తారనే సమాచారం వచ్చింది. మేమందరం శిబిరంలోంచి బయలుదేరి ఆసుపత్రికి కాలినడకనే చేరుకున్నాం. అప్పటికి సమయం మూడు కావస్తోంది. మేము వెళ్ళేసరికే అక్కడ పెద్దఎత్తున మీడియాకు చెందిన వాళ్ళు, స్త్రీలు, మైరాపెయిబికీ చెందిన కార్యకర్తలు గుమిగూడారు. షర్మిలను నిర్బంధించిన హై సెక్యూరిటీ వార్డు ముందు మేమంతా నిలబడ్డాం. ఎవరెవరో వస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. లోపలున్న పోలీసులు మాటిమాటికీ తలుపులు తీసి బయటకు తొంగిచూసి మళ్ళీ తలుపులు మూస్తున్నారు. 70 సంవత్సరాలు పైబడిన మైరాపెయిబీకీ చెందిన వృద్ధ స్త్రీలు చాలా ఓపికగా వార్డు మెట్ల మీద కూర్చుని షర్మిల కోసం ఎదురుచస్తున్నారు. 78 సంవత్సరాల కె.తరుణి అనే స్త్రీమాట్లాడుతూ అప్సని (AFSPA) రద్దుచెయ్యలి. షర్మిలని కాపాడాలి. ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దుచెయ్యకపోతే మేము ఈసారి ఎవ్వరికీ ఓట్లు వెయ్యం. జరిగింది చాలు అంటూ దృఢమైన కంఠంతో చెప్పినపుడు ఆ వయస్సులో ఆమె కన్పరిచిన నిబద్ధత మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అలాంటి స్త్రీలు చాలామంది అక్కడ గుమిగూడి వున్నారు. వారంతా షర్మిల విడుదల కోసం 88 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.
మాలో ఉత్కంఠ పెరగసాగింది. అక్కడ కూర్చునే చోటు లేదు. నిలబడ్డం కూడా కష్టంగానే వుంది. సమయం గడుస్తున్నకొద్దీ కర్ఫ్యూ భతం భయపెట్టసాగింది. నాలుగున్నర అయ్యింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. ఇంకో అరగంటలో కర్ఫ్యూ పెట్టేస్తారు. వార్డు లోపల్నుంచి పోలీసులు బయటకు వస్తున్నారు. తొంగి చూస్తున్నారు. గ్రిల్ చప్పుడైనప్పుడల్లా మా కళ్ళు గ్రిల్‌కు అతుక్కు పోతున్నాయి. ఐదు కావస్తోంది. మేము షర్మిలను చూడలేమేమో ననే సందేహం పీడించసాగింది. సరిగ్గా ఆ సమయంలో ఎవరో బిగ్గరగా ప్రకటించారు. ఆ రోజు కర్ఫ్యూ 7 గంటల వరకు పొడిగించారని. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ గ్రిల్ గేట్ చప్పుడు కోసం ఎదురుచడసాగాం.
5.30 అయ్యింది. వార్డు రూమ్ తెరుచుకుంది. గ్రిల్ గేట్ కూడా తెరిచారు. సూర్యుడు అస్తమించేవేళ, ఆ చిరుచీకట్లో వెలుగురేఖలా షర్మిల చాలా మెల్లగా అడుగులేస్తూ వస్తూ కనబడింది. తెల్లగా పాలిపోయిన ముఖం. ఒక్కసారిగా వెలిగిన మీడియా ఫ్లాష్‌లైట్లను తట్టుకోలేక కళ్ళు మూసుకున్న షర్మిల కనబడింది. సంప్రదాయ మణిపురి దుస్తుల్లో, భుజాల చుట్టు గులాబీ రంగు షాల్ చుట్టుకుని కళ్ళు మూసుకుని బయటకు వచ్చిన షర్మిలనుచూసి కొంతమంది చప్పట్లు కొట్టారు. కొంతమంది స్త్రీలు బిగ్గరగా ఏడ్చారు.
'మైరాపెయిబి' స్త్రీలు ఆమెకు రక్షణ కవచంలా ఏర్పడి, ఆమెను పసిపాపను పొదువుకున్నట్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. షర్మిల నిలబడడానికి కూడా శక్తి లేక తల వాల్చేస్తూ ఆ స్త్రీల చేతుల ఆసరాతో నడిచి మీడియా ముందుకొచ్చింది. నేను షర్మిలా పక్కనే వుండడంతో ఆమెను అతిదగ్గరగా పరిశీలించగలిగాను. తొమ్మిది సంవత్సరాలుగా నోటితో ఘనపదార్ధం ఏమీ తినకుండా మణిపూరి ప్రజల కోసం, AFSPA 1958 చట్టం రద్దు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న 35 సంవత్సరాల షర్మిలను అతిసమీపంగా చూసినపుడు నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడంతో పాటు, ఆమె వజ్రసంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. పోరాట పటిమ, దృఢ సంకల్పం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధంగా వున్న ఆ స్త్రీ మూర్తి ముందుమోకరిల్లాలన్పించింది.
చాలా బలహీనంగా వున్నప్పటికీ్ ఆమె ఏ వాహనంలోను ఎక్కకుండా, స్త్రీల సమూహంతో కలిసి అక్కడికి 500 మీటర్ల దరంలో వున్న నిరాహారదీక్షా శిబిరం వరకు నడవసాగింది. ఆమె వెంట మేమంతా, దాదాపు 70 మంది వివిధ భాషలకు చెందిన జర్నలిస్ట్‌లం నడిచాం. శిబిరం దగ్గరకు చేరగానే ఆమె కోసం పరుపు సిద్ధం చేసి కూర్చోబెట్టారు. ఆమె కాళ్ళకు మేజోళ్ళు తొడిగారు. ఆమె మెడను నిలపలేకపోతోంది. ఆమె శరీరం అటు ఇటు ఊగిపోతోంది. అక్కడ చేరిన అసంఖ్యాక మీడియా పదేపదే కోరగా ఆమె గళం విప్పింది. మెత్తగా, పీలగా ఆమె గొంతు విన్పించసాగింది. "నాకోసం ఎదురుచస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు తెలపడానికి నాదగ్గర సరైనమాటలు లేవు. మీరు నాకు మరింత ధైర్యాన్నిచ్చారు. మణిపూర్ నుండి AFSPA 1958 చట్టాన్ని రద్దుచేసేవరకు నేను ఈ నిరాహారదీక్షని కొనసాగించదలిచాను. ఇమాస్ తో కలిసి ప్రచారాన్ని సాగిస్తానని చెప్పింది. షర్మిల మెల్లగా, స్పష్టంగా మాట్లాడుతూ ''ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళాదినాన్ని జరుపుకుంటుంటే, ఇక్కడ మణిపూర్‌లో సారవంతమైన భూములతో, అపారమైన వనరులతో, చల్లటి గాలులు వీచే చోట, ప్రజలు ఎంతో స్నేహసుహృద్భావాలతో పల్కరించే చోట స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు, అణిచివేత బయట ప్రపంచానికి తెలియవు.'' అన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ''నేను మాఅమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంతకాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్నుచూడొద్దన్నాను కదా అంటుందేమోనని ఆమె వున్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు తచ్చాడాను.'' అన్నప్పుడు అక్కడున్న స్త్రీలు దు:ఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చారు. మాఅందరి కళ్ళల్లోను నీళ్ళు చిప్పిల్లాయి.
మెల్లగా చీకటి చిక్కనౌతోంది. షర్మిల ఆ రాత్రి శిబిరంలోనే గడపటానికి సిద్ధపడింది. కర్ఫ్యూ పెట్టే టైమ్ దగ్గరపడడంతో మేము కూడా వెళ్ళడానికి లేచాం. అప్పుడే అంజులిక షర్మిలకి సమీపంగా వెళ్ళి ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు ఆమె చూడడానికి వచ్చారని, వారంతా శిబిరంలో వున్నారని చెప్పగానే ''మీ అందరినీ చూడ్డం నాకు సంతోషంగా వుంది. ఇక్కడి స్త్రీలకు ఏం జరుగుతోందో మీరు దేశం నలుమూలలా తెలియచేస్తారని నాకు ఆశగా వుంది. మీ సోదరుడి హత్య నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది'' అన్నప్పుడు అంజులిక బాధతో సతమతమైంది.
మేమంతా శిబిరంలోంచి బయటపడి బస్సులో ఎక్కాం. అందరం మౌనంగా కూర్చున్నాం. కాసేపట్లో కర్ఫ్యూ పెట్టేస్తారు. బస్సు రిట్రీట్ హౌస్ దగ్గర ఆగింది. యథాప్రకారం చీకటి. చిమ్మచీకట్లో కురుస్తున్న వెన్నెల. నాకురూమ్‌లోకి వెళ్ళాలన్పించలేదు. కాసేపు వెన్నెల్లో కూర్చుని కిచెన్ వేపు వెళ్ళాను. లిల్లీతో మాట్లాడాలన్పించింది. ''లిల్లీ! మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం'' అన్నాను. మళ్ళీ రమ్మని, వచ్చినపుడు తనని కలవమని చెప్పింది. నీకు ఇక్కడి పనికి జీతమెంత ఇస్తారని అడిగితే 1200 ఇస్తారని, రెండుపూటలా తిండి పెడతారని చెబుతూ తనకి తొమ్మిది మంది చెల్లెళ్ళున్నారని, తండ్రి చనిపోయాడని, తన తల్లి కూడా వంట పనిచేస్తుందని చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించరా అంటే సిగ్గుపడుతూలేదని చెప్పింది. సోసో కూడా అదే మాట అంది. ఆడవాళ్ళు పిల్లల్ని కంటూ పోవాల్సిందే. ఫ్యామిలీప్లానింగ్ లేదు అంది.చూడ్డానికి చిన్నగా వుంటుంది సోసో. ఆమెకు నలుగురు పిల్లలు. డిన్నర్ చేసి లిల్లీకి బై చెప్పి నా రూమ్‌కు వచ్చేసాను.
8వ తేదీ ఉదయం సోసో ఇంటికెళ్ళాం. మళ్ళీ తప్పక రమ్మని కోరింది సోసో. ఆమెకు గుడ్‌బై చెప్పి, మళ్ళీ ఇంకో కప్పు టీ తాగి అక్కడి నుండి బయటపడ్డాం. పదిగంటలకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. అన్నీ సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి రూమ్‌లో ఏకాంతంగా కూర్చున్నపుడు ఇంఫాల్ అనుభవాలు ఒకటొకటే కళ్ళముందు కదలాడాయి. దుమ్ము కొట్టుకుపోయిన నగరం, చీకట్లో మగ్గుతున్న నగరం, కర్ఫ్య పడగనీడ కింద కుములుతున్న మణిపూర్ రాష్ట్ర రాజధాని. ఇపుడిపుడే ''అభివృద్ధి'' నామజపం వినబడుతోందని, వందలాది కుటుంబాలు ఎయిర్‌పోర్ట్ విస్తరణలో నిర్వాసితమౌతున్నయని బబ్లూ చెప్పాడు. మీ హైదరాబాదు చాలా 'అభివృద్ధి' చెందిందటగా అని వ్యంగ్యంగా అడిగినపుడు షంషాబాద్ చుట్టుపక్కల కనుమరుగైన వందలాది గ్రామాలు, పూల, పండ్ల తోటలు గుర్తొచ్చాయి. చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరిపోయిన ఆ ఊళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. ఆంధ్రదేశంలో ''అభివృద్ధి'' పేరు మీద ఏర్పాటవుతున్న ''సెజ్''ల గురించి జీవనాధారాల్ని కోల్పోతున్న ప్రజల్ని గురించి మేం చెప్పాం.
ఇంఫాల్‌లో వున్న నాలుగురోజుల్లో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న కష్టాలు, స్త్రీలు పడుతున్న అగచాట్లు చూసాం. ఎక్కడ చూసినా ఏదో పనిచేస్తూ స్త్రీలు. ఇమా మార్కెట్‌లో వ్యాపారాలు చేసే వేలాది స్త్రీలు ర్ఫ్యూ వేళ ఉరుకులు పరుగులతో దుకాణాలు మూసేసి, కిక్కిరిసిన వాహనాల్లో ఇళ్ళకు చేరే స్త్రీలు. అన్నింటినీ మించి జిప్సీ వాహనాల్లో ప్రజల మీద తుపాకులెక్కుపెట్టి ఊరకుక్కల్లా వీధులెంబడి తిరిగే సైన్యం, అస్సామ్ రైఫిల్స్. ఎక్కడచూసినా సైన్యమే. 23 లక్షల మణిపూర్ జనాభాకి 53000 సాయుధ సైనికులు వున్నారంటే పరిస్థితి ఎంత భీతావహంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెవరిని చంపేస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో? ఎవరిని మాయం చేస్తారో తెలియదు. మహిళల మీద అత్యాచారాలకి అంతేలేదు.AFSPA 1958 చట్టం సైన్యానికిచ్చిన పాశవిక అధికారాలతో ఎవరినైనా కాల్చొచ్చు. ఎవరినైనా చంపొచ్చు. ఊళ్ళకుఊళ్ళు తగలబెట్టొచ్చు. ఇవన్నీ కేవలం అనుమానంతోనే చెయ్యొచ్చు. తిరుగుబాటుదారులున్నారనే నెపంతో రోజుకి కనీసం రెండు హత్యలు జరుగుతున్నాయి. చిన్నవయస్సులో భర్తల్ని పోగొట్టుకుంటున్న స్త్రీలు. అయిదారుగురు పిల్లల్తో అనాథలవుతున్న స్త్రీలు. ఉపాధి లేక ఉద్యోగాల్లేక డ్రగ్స్‌కు, తాగుడుకు బానిసలౌతున్న యువత. నిరాశానిస్పృహలతో తిరుగుబాటుదారుల్లో చేరుతున్న యువకులు. 60 సంవత్సరాలుగా అగ్నిగుండంలా మండుతున్న మణిపూర్. 40 ఎత్‌నిక్ కమ్యూనిటీలున్న మణిపూర్‌లో 38 తిరుగుబాటు గ్రూపులున్నాయి. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చెయ్యడంతో పాటు వాటిల్లో వాటికి ఎన్నో విభేదాలు, పరస్పర దాడులు.
'గ్రేస్ షట్‌సంగ్' నాగా వుమన్స్ యూనియన్ ప్రెసిడెంట్ మాటల్లో చెప్పాలంటే సాంప్రదాయకంగా మణిపురి స్త్రీలు శాంతిప్రేమికులు. శాంతి స్థాపన కోసం స్త్రీలు పాటుపడుతున్నారు. మణిపురి స్త్రీలు తీవ్ర వివక్ష నెదుర్కొంటున్నారు. వారికి ఎలాంటి హక్కులూలేవు. నిర్ణయధికారం లేదు. సైన్యం చేతిలో అత్యాచారాలు, కాల్పుల్లో భర్తల మరణాలు, కుటుంబాల్ని కాపాడుకోవాల్సిన పెనుభారాలు. మణిపురి స్త్రీలు రెండువిధాలా సమస్యల్ని ఎదుర్కోవాలి. సైన్యం అత్యాచారాలొకవైపు, తిరుగుబాటుదారుల అవసరాలు తీర్చాల్సి రావడం మరోవేపు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మణిపూరి స్త్రీలు. మొత్తం మణిపూర్ కోసం ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడుతున్న షర్మిల. నగ్నప్రదర్శనలాంటి తీవ్ర నిర్ణయలతో సైన్యం అకృత్యాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మైరాఫెయిబి కార్యకర్తల సాహసం.
AFSPA లాంటి బలమైన చట్టం పెట్టుకుని కూడా మణిపూర్ ప్రభుత్వం మణిపూరి ప్రజల్ని కాపాడలేకపోతోంది. ప్రతిరోజూ సైన్యం కాల్పుల్లోనో, రెబెల్ తిరుగుబాటుదారుల చర్యలవల్లో నలుగురో, ఐదుగురో చనిపోవాల్సిందే. మేము ఇంఫాల్‌లో వున్నపుడే 13 ఏళ్ళ కుర్రాడు కాల్పుల్లో చనిపోయిన విషాద సంఘటన జరిగింది. మణిపూర్‌లో మామూలు పరిస్థితులు నెలకొనే ఆశ అయితే కనుచపుమేరలో కనబడ్డం లేదు. AFSPA చట్టం రద్దు అవ్వడం గానీ, ఇరాం షర్మిల ఆమరణ నిరాహారదీక్ష ముగియడం అనేవి కల్లోమాటగానే అన్పిస్తున్నాయి.
ఇంతటి విషాదకర పరిస్థితుల్లో ఎంతో హాయిగా నవ్వే మణిపురి స్త్రీలను చూస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. హృద్యంగా నవ్వే చిత్ర, అంజులిక, సోసో, లిల్లీ, ఆరంభమ్. వీళ్ళ హాయైన నవ్వు చసి చిత్రతో అన్నాన్నేను ''magic of Manipur Is your smile''. మీరింత చక్కగా ఎలా నవ్వగలుగుతున్నారు. అంటే సమాధానంగా మరింత నవ్వే దొరికింది.
ఇంఫాల్ విమానాశ్రయంలో కూర్చుని గౌహతి వెళ్ళే విమానం ఎక్కేవరకు ఇవే ఆలోచనలు. మణిపూర్‌లో త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలనే ఆశాభావంతో నేను తిరుగు ప్రయణమయ్యాను. మనస్సునిండా మణిపూర్ విషాదం నిండిపోవడం వల్ల అక్కడి నుండి అస్సాం, మేఘాలయ వెళ్ళిన అనుభవాలను ప్రస్తుతం రాయలేకపోతున్నాను. మేఘాలయలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోనే తడిప్రాంతంగా రెండుసార్లు గిన్నిస్ బుక్ కెక్కిన చిరపుంజిలో, చెక్కలబళ్ళమీద ప్లాస్టిక్ బిందెలతో కిలోమీటర్ల దూరం నీళ్ళ కోసం వెతుకుతున్న స్త్రీలని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నిత్యవర్షం కురుస్తుందని చెప్పుకునే చోట నీళ్ళకోసం వెదుకులాట నిజంగా ఎంత విషాదం. మరెప్పుడైనా ఈ విషయాల గురించి రాస్తాను.
మొత్తానికి, మహిళా జర్నలిస్ట్‌ల మూడురోజుల కాన్ఫరెన్సు, మణిపూర్ మహిళల విషాద జీవితాల్లోని మల్లెపువ్వులాంటి నవ్వులు, ఇరాం షర్మిల ఉక్కులాంటి పట్టుదల, మైరాపెయిబీ మాతృమూర్తుల మడమ తిప్పని పోరుబాట ఇవన్నీ నామీద గొప్ప ముద్రవేసాయి. తిరిగివచ్చాక కూడా మనసంతా ముసురుపట్టినట్లే వుంది. కర్ఫ్యూలో వున్నట్లే అన్పిస్తోంది. చీకటి గుయ్యారంలో మగ్గుతున్నట్లే వుంది. మణిపూరి మహిళల మందహాసం గుర్తొచ్చినపుడు మాత్రం చాలా హాయిగా, రిలాక్స్‌డ్‌గా అన్పిస్తోంది. నాతోపాటు నాలుగురోజులు గడిపిన మిత్రులందరూ పదేపదే గుర్తొచ్చినా, ఎక్కువగా నా మనసులో చోటు సంపాదించుకున్నది మాత్రం సమీర. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్ళు, ముక్కుతీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్ పెట్టాలని వుందని మీరు హెల్ప్ చేస్తరా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లోరూమ్‌లు మాట్లాడి పెట్టాడు. ఎనిమిది మందిమి రెండు రూమ్‌ల్లో సర్దుకోగలిగాం. హైదరాబాద్ వచ్చాక రెండు సార్లుమాట్లాడాడు. 'బెహాన్! ఆప్ ఫిర్ కబ్ ఆరే షిల్లాంగ్' అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్,గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని,కామాఖ్య కొన్డ మీదకి,బ్రహ్మపుత్ర నది మీదకి పడవ శికారుకి తీసుకెళ్ళి,నగరమన్తా తిప్పి చూపిన్చి భద్రమ్గా నన్ను ఎయిర్ పోర్ట్ లో దిన్చిన ఆటో వాలా కమల్ భాయ్, వందలకొద్దీ మా ఫోటోలు, వీడియోలు తీసి, ఫోటోలు మాకివ్వాలి సుమా అని అడిగినపుడు ఖర్చవుతుందని అల్లరిగా నవ్వే సమీర, ఖర్చంటే డబ్బులేనా ఏంటి అని వెక్కిరించే సమీర నాకు చాలా నచ్చింది.
మంజరి కూతురుగా కంటే బోలెడన్ని పుస్తకాలు చదివిన, సరదాగా, సంబరంగా నవ్వే సమీర మా గ్రూప్‌లో వుండడం మాకు గొప్ప ఎసెట్. అమ్మాకూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా మెలిగిన మంజరి, సమీరామాకు బోలెడంత వినోదం, హాస్యం అందించారు. ఇంఫాల్ ట్రిప్‌లో సమీర పరిచయం హైలెట్టే మరి. దీనిక్కూడా ఖర్చవుతుందంటుందో ఏమో!!!

Saturday, March 14, 2009
సేవ్ ద గర్ల్ ఛైల్డ్ ప్లీజ్!
జనవరి24 తేదీని ”జాతీయ ఆడపిల్లల దినం”గా కేంద్రం ప్రకటించింది. విచ్చలవిడిగా విస్తరించిపోయిన లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిండాల హత్యలు, గృహహింస, పోషకాహారలేమి లాంటి అంశాలపై విస్తృత స్థాయి ప్రచారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ‘దినాన్ని’ ప్రకటించారు. టీవీప్రకటనలు, పాఠశాలల్లో పాఠాల రూపంలో, వ్యాపార ప్రకటనల్లోను ఆడపిల్లల గురించి ప్రచారం చేయనున్నారు. గృహ హింసకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు అవసరమైన నిధులను మళ్ళించి, పూర్తి స్థాయి రక్షణాధికారుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నిధులను బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా చెయ్యాలని నిర్ణయించారు. మొత్తానికి ఇంత కాలానికి ఆడపిల్లల కోసం ఓ ప్రత్యేక దినాన్ని కేటాయించడంతోపాటు, ఆడపిల్లలెదుర్కొంటున్న వివక్షకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఆలస్యం గానైనా ఆడపిల్లల సమస్యల మీద దృష్టి సారించడం ముదావహం.
అయితే ఒక ప్రత్యేక దినాన్ని ప్రకటించి, కొన్ని ప్రచార కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన మన సమాజంలో పాతుకుపోయిన లింగవివక్షని రూపుమాపగలమా? ఆడపిల్లల స్థితిగతుల మీద యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన అంశాలను ఒక్కసారి గమనిద్దాం.
ు ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల్లో లేని 110 మిలియన్‌ల పిల్లల్లో 60% ఆడపిల్లలు.
ు 18 సంవత్సరాలు నిండే నాటికి బాలురకన్నా, బాలికలు 4.4 సంవత్సరాల విద్యాకాలాన్ని తక్కువ పొందుతారు.
ు ప్రపంచం మొత్తం మీద ప్రాధమిక పాఠశాలల్లో నమొదు కాని 30 మిలియన్‌ల పిల్లల్లో 60% మంది ఆడపిల్లలే.
ు ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి బారిన పడిన వారిలో బాలురకన్నా బాలికలే ఎక్కువ.
ు ప్రతి సంవత్సరం 1,46,000 మంది టీనేజ్ యువతులు ప్రసవ సమయంలో మృత్యువాత పడుతున్నారు.
ు 13 మందిలో ఒకరు ప్రసవ సమయంలో మరణించే ప్రమాదంలో వున్నారు. 450 మిలియన్ ఆడపిల్లలు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.
ు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల సంఖ్యలో గృహహింసకు, పబ్లిక్ స్థలాల్లో హింసకు మహిళలు గురవుతున్నారు.
యునైటెడ్ నేషన్స్ గణాంకాల ప్రకారం చూస్తే ఈ రోజుకీ గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లలకి విద్య అందని కుసుమమే. ప్రపంచీకరణ నేపధ్యం, వ్యవసాయ, చేనేత విధ్వంసం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుంగుబాటు, ”అభివృద్ధి” పేరు మీద జరుగుతున్న నిర్వాసితత్వం- వీటి పర్యవసానాలు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీల, ఆడపిల్లల జీవితాలు మరింత ప్రభావితమౌతున్నాయి. రాష్ట్రంలో పెరిగిపోతున్న ”ట్రాఫికింగ్” విష వలయంలో చిక్కుకుని వేలాదిమంది బాలికలు ప్రతిరోజు వేశ్యావాటికలకు చేరవేయబడుతున్నారు. హెచ్‌ఐవిలాంటి ప్రవదకర వ్యాధులకు బలవుతున్నారు.
మన సమాజంలో ఇంకా జరుగుతున్న బాల్యవివాహాలు, ఆడపిల్లల చదువు, వృత్తి, ఆరోగ్యంలాంటి వాటిని సమూలంగా నాశనం చేస్తున్నాయి. బాల్య వివాహాల చుట్టూ అల్లుకుని వున్న సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, మత పరమైన అంశాల గురించి పట్టించుకోకుండా, వాటిని ప్రధాన స్రవంతి చర్చల్లోకి తేకుండా బాల్యవివాహాలు నశించాలి అంటూ గొంతులు చించుకుంటే ఏమీ ఫలితం వుండదు. దేశంలో విపరీతంగా పడిపోతున్న సెక్స్‌రేషియె, వీధి వీధినా అల్ట్రాసౌండ్ మెషిన్లు పెట్టి, లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిండాల హత్యలు చేస్తున్న వాళ్ళని ఉదారంగా వదిలేస్తూ చూసీ చూడనట్లు నటించే చట్టం వల్ల ఉపయెగమేమీ లేదన్నది ఇప్పటికే అర్ధమైపోయింది.
ఇటీవల యూనిసెఫ్ ఒక నగ్న సత్యంలాంటి రిపోర్ట్‌ని విడుదల చేసింది. జనవరి 15న మనమంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ చేదుగుళిక లాంటి వాస్తవాన్ని యూనిసెఫ్ ప్రకటించింది. వతృమరణాలకి, పేదరికానికి వున్న సంబంధం గురించిన ఈ అధ్యయన రిపోర్ట్ ఏం చెబుతోందో చూద్దాం. పేద దేశాలలో, ప్రసవ సమయంలో 300 రెట్లు స్త్రీలు మరణించే ప్రమాదంలో వున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ధనిక దేశాలలో కన్నా పేద దేశాలలో పుట్టిన పిల్లలు 14 రెట్లు అధికంగా మొదటి నెలలో చనిపోయే పరిస్థితి వుంది.చిన్న వయస్సు బాలిక గర్భం దాల్చితే ఆమె ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. అలాగే 15 సంవత్సరాల వయస్సులో ప్రసవించితే బాలిక చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. 95శాతం మాతృమరణాలు సంభవిస్తున్నది ఆఫ్రికా మరియు ఆసియా దేశాలలోనే. మరీ ముఖ్యంగా 35 శాతం దక్షిణాసియాలోనే. ఈ ప్రాంతాలలోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 7,00,000 మంది 15,19 ఏళ్ళ వయస్సున్న బాలికలు, యువతులు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని యునిసెఫ్ రిపోర్ట్ ప్రకటించింది.
జనవరి 24 తేదీని ‘బాలికలదినం’గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పై విషయలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని, వాటి కనుగుణమైన విధాన నిర్ణయాలని, కార్యచరణ ప్రణాళికలను, చిత్తశుద్ధితో రూపొందించి అమలు చేస్తుందని ఆశిద్దాం. ”సేవ్ ద గర్ల్ ఛైల్డ్” క్యాంపెయిన్‌ని ఉధృతం చేస్తుందని ఆశపడదాం.

Thursday, March 12, 2009
మాకు ‘నో’ అనే హక్కు లేదా?
”మేం చదువుకోకూడదా? మేం రోడ్లమీదకు రాకూడదా? మాకు ‘నో’ అనే హక్కు లేదా? ఎవడంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఒప్పుకుని తీరాలి అని బలవంతపెడితే, మృగంలా ప్రవర్తిస్తే మేము ఒప్పుకు తీరాలా? మా ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేదా? మేం ఒప్పుకోకపోతే కత్తులతో పొడవడం, ఆసిడ్ పోసి గాయపర్చడం. వీళ్ళంతా ఏ సంస్కృతికి వారసులు? వీళ్ళకి ప్రేమంటే తెలుసా? ప్రేమంటే ఇదేనా? వీళ్ళని శిక్షించే చట్టమేదీ లేదా?” ఈ ప్రశ్నలను మనం చాలాసార్లు విని వుంటాం. అగ్రికల్చర్ యూనివర్సిటీక్యాంపస్‌లో ఆసిడ్ దాడికి గురై మరణ యాతన అనుభవించిన అనూరాధ, బెంగుళూరులో అలాంటి దాడికే బలైన వందనా పాటిల్. ఈప్రశ్నలను పదే పదే వేస్తూనే వున్నారు. ఒక అయేష, ఒక ప్రత్యూష, ఒక స్వప్నిక, ఒక ప్రణీత-నిండు జీవితాలను ‘ప్రేమ’ అనే క్రూర క్రీడకి బలిపెడుతూనే వున్నారు. ‘ప్రేమ’ ఈ రోజు క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగాతయారై ఆడపిల్లల్ని కబళిస్తోంది. ముక్కూ ముఖం లేని స్వప్నిక రూపం, ఉబ్బిపోయి కళ్ళు మూసుకుపోయిన ప్రణీత ముఖాలు మనోఫలకంలోంచి చెదరకుండా పదే పదే కళ్ళముందు కదలాడి కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఆరకముందే నిందితులు దొరికారన్న వార్త ఎంతో ఊరట కలిగించింది. ఆసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో ఘోషించిన వారంతా, వారి అరెస్టుతో ఎంతో ఊరట చెందారు. పోలీసులు చాలా వేగంగా, కేవలం 48 గంటల్లో పట్టుకోగలిగారని ప్రశంసించారు కూడా.
అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళాసంఘాలు తలపెట్టిన ధర్నా మాత్రం కొనసాగాలని నిర్ణయమైంది. అయితే శనివారం ఉదయమే ఎవరో ఫోన్ చేసి ధర్నా కాన్సిల్ అయ్యిందని చెప్పినపుడు, ఏమైంది? ఎందుకు కాన్సిల్ అయ్యింది అని అడిగితే ‘వాళ్ళ ముగ్గురిని ఎన్‌కౌంటర్ చేసేసారు. మీకు తెలియదా? ‘ అని చెప్పారు. వెంటనే టీవీ ఆన్ చేస్తే ఎన్‌కౌంటర్ దృశ్యాలు, ఛానళ్ళ హడావుడి. నిన్న రాత్రి పోలీస్ కస్టడీలో వున్న వాళ్ళు పొద్దున్నే ఎదురుకాల్పుల్లో చనిపోవడం, గుట్టల్లో శవాలు పడి వుండడం, శవాల చేతుల్లో తుపాకులు, కత్తులు వుండడం. నమ్మశక్యంగాని దృశ్యాలు. నిందితుల్ని శిక్షించడమంటే చంపి వేయడమా? నిన్నటి ఆవేశం, కోపం స్థానంలో క్రమంగా ఆవేదన, భయం ప్రవేశించాయి. పోలీస్ కస్టడీలో వున్న వాళ్ళకి ఆయుధాలెలా వచ్చాయనే ప్రశ్న బుర్రలోంచి పోనంటూ వేధించసాగింది.
చేతివేళ్ళు ఛానళ్ళను యా౦త్రికంగా నొక్కుతున్నాయి. టీవీలో దృశ్యాలు మారుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నిందితులను చంపేయడాన్ని పండగలా జరుగుకుంటున్న క్యాంపస్ విద్యార్థులు . టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మరి కొందరు. పోలీసులు చాలా మంచి పని చేసారని ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తున్న వాళ్ళు. తేనె పూసిన కత్తిలాంటి నవ్వుతో అభినందనల్ని స్వీకరిస్తున్న ఉన్నత పోలీసు అధికారి. ఆడపిల్లలు అందిస్తున్న పువ్వుల బొకేలని గర్వంగా అందుకుంటూ, టీవీలకు ఫోజులిస్తున్న ఆ అధికారిని చూస్తుంటే నా వొళ్ళంతా జలదరించింది. మూడు ప్రాణాల్ని తూటాలకు బలిచ్చిన అతని ముఖంలోని ఆ నవ్వుని నేను ఈ జన్మకి మర్చిపోలేననుకుంటాను.
దృశ్యం మారింది. టీవీ యా౦కర్ల రిపోర్టర్ల వికృత చర్యలు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న వాళ్ళ ముఖాల దగ్గర, వాళ్ళ బంధువుల ముఖాల వద్ద మైక్‌లు పెట్టి మీరేమనుకుంటున్నారు? ఎన్‌కౌంటర్ మీకు సంతోషాన్నిచ్చిందా? తూటాలకు బలివ్వడం బావుందా? లేదావాళ్ళని యాసిడ్ పోసి చంపి వుండాల్సిందని మీరు భావిస్తున్నారా? ఈ అంశంపై ఎస్.ఎమ్.ఎస్‌లు చేయండి. మీ అభిప్రాయం చెప్పండి. నోరు విప్పి సరిగా మాట్లాడలేక పోతున్న ప్రణీత నోట్లో మైకు కుక్కి మాట్లాడించిన ఈ భయానక, బీభత్స, జుగుప్సాకర దృశ్యాలను చూడాల్సి రావడం ఎంత బాధాకరం. అతి తీవ్రంగా గాయపడి, వైద్యం పొందుతున్న ఆ పిల్లల దగ్గరికి ఈ టీివీ రిపోర్టర్లను ఎలా అనుమతిస్తున్నారో ఎంతకీ అర్ధం కాని ప్రశ్న. టీవీలలో నడుస్తున్న ఈ అమానవీయ దృశ్యాలు మనసును ఎంత బండ బారుస్తున్నాయె, సున్నితంగా స్పందించడం అంటే ఏమిటో మర్చిపోయేలా తయారు చేస్తున్నాయె చూస్తుంటే, మీడియా మహా విశ్వరూపం వెన్నులోంచి చలి పుట్టిస్తోంది.
వరుసగా జరుగుతున్న సంఘటనలు మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అమ్మాయిల మీద జరిగిన పాశవిక దాడి, పదే పదే పునరావృతమౌతున్న సంఘటనలు, పువ్వుల్లాంటి పిల్లల ముఖాలు మాడి మసి బారిపోయిన దృశ్యాలు, దోషుల్ని శిక్షించమని కోరిన జనాగ్రహాన్ని తెలివిగా తమ వేపు మళ్ళించుకుని ఏకంగా ప్రాణాలే తీసేసిన పోలీసుల క్రూరత్వం. దీన్నంతా పంచరంగుల సినిమాలా జనం మెదళ్ళలోకి రీళ్ళు రీళ్ళుగా పంపిస్తున్న మీడియా.
ఏం జరుగుతోందసలు? మనం ఎటువెళుతున్నాం? అసలు విషయలను గాలికొదిలేసి, వేరుకు పట్టిన చీడనొదిలేసి పైపైన పాకుతున్న పురుగుల్ని చీదరించుకుంటే ఏం లాభం? ‘మహిళా సాధికారత’ అంటే పావలా వడ్డీ అనుకునే చోట, మహిళల మీద పెరుగుతున్న నేరాలకు కారణాలను అన్వేషిించకుండా, ఆ నేరాలను అరికట్టే చర్యల్ని ఆదిలోనే తీసుకోకుండా, ఇంటా బయటా హోరుగాలిలో దీపంలా రెప రెపలాడుతున్న స్త్రీల జీవితాలను ఆసిడ్‌లకు, కిరోసిన్‌లకు, కిరాతకాలకు బలిస్తున్న చోట ఇలాగే, ఇంత బీభత్సంగానే వుంటుంది. స్త్రీ, పురుషుల సమానత్వం అనే మాట మచ్చుక్కూడా వినబడని, ఆలోచనల్లో, దృక్పధాల్లో మార్పుకోసం ఉద్యమ స్పూర్తిని నింపని రాజకీయ కలుషిత వాతావరణంలో ఇలాంటి దృశ్యాలనే చూడాల్సి వుంటుంది. మాకు హక్కుల్లేవా? అంటూ ఆడపిల్లలు అరుస్తూ బలవుతూనే వుంటారు.

Sunday, March 1, 2009
విందు తర్వాత…..
కొండవీటి సత్యవతి
చలి గడగడలాడించేస్తోంది. చేతి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. గది మధ్యలోని బుఖారి నుంచి వచ్చే వెచ్చదనం ఏ మాత్రం సరిపోవటం లేదు.
”అబ్బ! ఇంత చలేమిట్రా బాబూ! ఎలా భరిస్తున్నావ్” వధవి అతి కష్టం మీద అంది. చలికి పళ్ళు టక టక కొట్టుకుంటున్నాయి.
”ఏం చేయమంటావ్ భరించక. అయినా నిన్ను చలికాలంలో కాశ్మీర్ రమ్మని ఎవడు చెప్పాడు” అని హనీఫ్ ”కాంద్దీ లావో” అన్నాడు.
”నాకేం తెలుసురా బాబూ! మరీ ఇంత భయంకరంగా వుంటుందంటే ఢిల్లీ నుంచే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని” సుధాకర్ మాట్లాడకుండా సవెవాయ్ లోంచి వేడి వేడి టీ పోసి ఇచ్చాడు.
టీ తాగుత బుఖారీకి దగ్గరగా జరిగింది మాధవి. వెచ్చటి టీ గొంతులోకి జారుతుంటే హాయిగా వుంది. ఈ సీజన్‌లో ఇక్కడికి రావడం ఎంత బుద్ధి తక్కువో అర్థమైంది మాధవికి.
ఢిల్లీలో ఏదో మీటింగ్ అటెండవ్వ డానికి వచ్చింది. అది నిన్న ఉదయమే అయి పోయింది. తన పిన్ని కొడుకు సుధాకర్ శ్రీనగర్‌లో మిలటరీలో మంచి హోదాలో ఉన్నాడని ఎలాగైనా ఒకసారి శ్రీనగర్ వెళ్ళా లని వధవి ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే ప్రస్తుతం చాలా చలిగా వుంటుందని సుధాకర్ చెప్పినా విన కుండా వచ్చింది. సరే వస్తానంటే వద్దనడం ఎందుకులే అని సుధాకర్ ఊరుకున్నాడు.
”వదిన ఎపుడొస్తుందిరా” మాధవి అడిగింది.
”లంచ్ టైముకి వస్తుందిలే. ఏం ఆకలేస్తోందా?” నవ్వుతూ అన్నాడు సుధాకర్.
”ఆకలా? పాడా? పొద్దున్న తిన్నదే అరగలేదింకా”.
”రెండు రోజులైతే అలవాటవు తుందిలే. నేను బయటకెళ్ళి వస్తా. ఒక్కర్తివీ ఉండగలవా?”
”దివ్యంగా వుంటాను. నాకేం భయం. ఎవరైనా తుపాకులుచ్చుకుని వస్తా రంటావా?”
”దివ్యంగా వుంటానని మళ్ళీ తుపా కులంటావేంటీ?”
”ఏవె బాబూ! ఎక్కడ చూసినా సైన్యం, పోలీసులే. ఇక్కడ మామూలు మనుష్యుల కన్నా పోలీసులే ఎక్కువ వున్నట్టు న్నారు.”
”నేచురల్లీ! లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చాలా వుంది. ఏ టైములో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు”.
”కన్పిస్తూనే వుందిగా. సరే. నేను టీవీ చూస్తుంటాను నువ్వెళ్ళిరా.” అంది ధైర్యంగానే.
”వద్దులే మధ! వదిన వచ్చాక వెళతాలే”
”అయ్యె! నీకేం పనులున్నాయె వెళ్ళరా! నిజంగానే చెబుతున్నా. నాకేం భయం లేదు.”
”అంత అర్జంటేమీ కాదులే. ఇవాళ ఎలాగ ఆదివారం కదా. ఆ… అన్నట్టు మర్చిపోయను. సాయంత్రం మనం డిన్నర్‌కి బయట కెళ్ళాలి. వదిన చెప్పిందా?”
”చెప్పలేదే! అయినా ఈ చలిలో బయటకెలా వెళతాంరా బాబూ”
”తప్పకుండా వెళ్ళాలి. మాపై ఆఫీసర్ కూడా వస్తాడు”
బయట కారాగిన చప్పుడైంది.
”వసు వచ్చినట్టుంది” సుధాకర్.
లాంగ్ కోటు, మంకీ కాప్‌తో వసుధ లోపలికొచ్చింది.
”తొందరగా వచ్చినట్టున్నావే”.
”అవును. మధుకోసం తొందరగా వచ్చేసా. అయినా హాస్పిటల్‌లో కూడా పని ఎక్కువ లేదు.”
వసుధ మిలటరీ హాస్పిటల్‌లో డాక్టరుగా పనిచేస్తోంది.
”వదినా బయటెలా వుంది”
”చలి గురించా. చలిగానే వుంది. మాకు అలవాటయి పోయిందిలే” అంది కోట, కాప్ తీసేస్త
”వసూ! ఈవినింగ్ డిన్నర్ గురించి మధుకి చెప్పలేదట.”
”అవును. ఉదయం హడావుడిలో మర్చిపోయను”.
”సరే! లంచ్ చేద్దామా!”
వంటచేసే హనీఫ్ వేడివేడిగా వడ్డించాడు.
”రాజ్‌వ కూర చాలా బావుంది. మదూ! ఇంకొంచెం వేసుకో” వసుధ.
”బావుంది. ఇవి మనవేపు బొబ్బర్లలాగా లెదు”.
”అదే జాతిలే. పన్నీర్ వేసుకో. ఈ చలికి బావుంటుంది”.
”మదు! నువ్వింకా కథల, కవితల రాస్తున్నావా? మానేసావా?”
”రాస్తూనే వున్నాను. ఈ మధ్యనే నా కథల సంకలనం వేసాను”
”అవునా! మరి నాకు పంపలేదే”
”నీకా?! నువ్వు కథలు కూడా చదువుతావా? తీవ్రవాదుల, ఎన్‌కౌంటర్ల వీటిలోనే మునిగి తేలతావనుకున్నాను”
”భలేదానివి మదు! అది ఉద్యోగం. అవన్నీ ఉద్యోగ ధర్మాలు. నేను కూడా రాసేవాడినని మర్చిపోయవా?”
”అవుననుకో. కాని అదెప్పటి మాట. నువ్వు సాహిత్యం సంగతే మర్చిపోయవనుకున్నాను”.
వీళ్ళిద్దరి సంభాషణని వసుధ ఆసక్తిగా వింటోంది. సుధాకర్ కథల గట్రా రాసేవాడని ఆమెకు అస్సలు తెలియదు.
”అలా అనుకోవడం నీ తప్పు. నిజమే చాలా కాలంగా నేనేమీ రాయలేదు. వసుకి నేను రచయితనని తెలియదు కూడా” అన్నాడు నిష్ఠూరంగా.
”ఒ.కె. ఒ.కె. సారీ! నా కథల పుస్తకం నా సూట్‌కేస్‌లో వుంది. ఇపుడే ఇస్తా సరేనా”
”ఇంత చిన్న విషయనికి సారీ ఎందుకులే గాని నేను చేస్తున్న ఉద్యోగం నాలో రచయితని చంపేసింది. అయితే నేను సియచిన్‌లో ట్రయినింగ్‌లో వున్నపుడు జరిగిన ఒక సంఘటన నన్ను కదిలించి చాలా సంవత్సరాల తర్వాత నా చేత కవిత్వం రాయించింది”
”సియచిన్ గ్లేసియర్‌లో ట్రయినింగ్ అయ్యవా”
నోరు వెళ్ళబెట్టి మరీ అడిగింది మధు.
”అవునే! సియచిన్ మంచుకొండల్లో మూడు నెలలున్నాను. అక్కడ ధవళ కాంతులీనే మంచు తప్ప మరేమీ వుండదు. మంచు తప్ప మరో ప్రాణి వుండదు”.
”అమ్మ బాబోయ్! ఎలా బతికేర్రా బాబూ!”
”నేనొక్కణ్ణే బతికాను. నా బాచ్‌లో ఐదుగురు చనిపోయరు” సుధాకర్ గొంతు భారంగా పలికింది.
వసుధ, మాధవి ఉలిక్కిపడ్డారు. ఈ విషయలేవీ తనతో ఎపుడ చెప్పలేదని ఆశ్చర్యపడింది వసుధ.
”అయ్యె! ఎంత ఘోరం. అలాంటి చోట ట్రయినింగ్ ఎందుకసలు” అంది మధు.
”ఆ రోజున ఏంజరిగిందో విను. మేం నిద్రలో ఉన్నపడు పెద్ద మంచుతుఫాను వచ్చింది. నా పక్క టెంట్‌లో వున్న నా బ్యాచ్‌మేట్ల టెంట్లన్నీ మంచులో కప్పడ పోయయి. లక్కీగా నా టెంట్‌కేమీ కాలేదు. మర్నాడు అతి కష్టం మీద వాళ్ళ మృత శరీరాలు మంచు తవ్వి తీసారు. నిద్రలోనే బిగుసుకు పోయరు. వెంటనే నన్ను కిందికి పంపేసారు. చాలా రోజులగ్గాని నేను కోలు కోలేకపోయను. కోలు కొన్నాక ఒక కవిత రాసాను. చాలా సంవత్సరాల తర్వాత రాసాను” ఎటో చూస్త చెబుతున్నాడు సుధాకర్.
వింటున్న వాళ్ళ హృదయలు బరువెక్కాయి. వసుధ లేచి వెళ్ళి సుధాకర్ దగ్గరగా కూర్చుని ”నువ్వెపుడ ఈ విషయలు నాకు చెప్పలేదే” అంది.
”ఎందుకో నాకు ఆ విషయం తలుచుకోబుద్ధి కాదు. ఆ రాత్రి నాతో సరదాగా కబుర్లు చెప్పిన ఐదుగుర అలా చనిపోవడం చాలా బాధాకరంగా అన్పించేది. ఇదిగో ఇపుడు మధు, నువ్వేం రాయడం లేదు అంటే అదంతా గుర్తొచ్చింది” అన్నాడు.
”అది సరేగాని. అంత చలివుండే సియచిన్‌కి కాపలా ఎందుకసలు?” ”బోర్డర్ కదా! వాచ్ తప్పదు. దీన్ని కాపలా కాయడంలో ఎందరో మిలటరీ వాళ్ళు చలికి చచ్చిపోతుంటారు. ఇటు, అటు కూడా” మధు బుర్ర గోక్కుంట చటుక్కున అంది ”దీన్ని కామన్ పీస్ ఏరియగా డిక్లేర్ చేస్తే బావుంటుంది కదా!”
”అద్భుతమైన ఐడియ! కాని ఎవరు చేస్తారు. సియచిన్ గ్లేసియర్‌లో ప్రతి రోజూ ఎవరో ఒకరు చావాల్సిందే. మనం ‘లేహ్’ వెళ్ళగలిగితే అక్కడున్న ‘హాల్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియంలో సియచిన్ సైనికులు వేసుకునే ప్రత్యేక డ్రెస్సులు, షూస్, ఫోటోలు చూడొచ్చు” అన్నాడు.
”లేతహ్ వెళ్ళడం ఇపుడు కుదరదు. నువ్వా చలి భరించలేవు. మే, జూన్ అయితే చాలా బావుంటుంది” అంది వసుధ.
అప్పటికి తినడం పూర్తయింది. హనీఫ్ వేడివేడిగా టీ యిచ్చాడు. టీ తాగేసి సుధాకర్ బయటకెళ్ళిపోయడు.
”మధ! నువ్వు రావడం వల్ల నాకు రెండు విషయలు కొత్తగా తెలిసాయి. థాంక్స్ టు యూ” అంది వసుధ.
”అవును. వీడు చాలా సెన్సిటివ్. వాడిదీ నాదీ ఒకే ఈడు. నాకన్నా ఆరు నెలలేవె పెద్దవాడు. మా ఊళ్ళో స్కూల్ లేకపోవడంతో నా స్కూల్ చదువంతా వీళ్ళ ఊరిలో వీళ్ళింట్లో వీడితోనే అయింది” అంది మాధవి.
”అది తెలుసు. తనే చెప్పాడు. రాస్తాడని మాత్రం ఈ రోజే తెలిసింది”
”చాలా బాగా రాసేవాడు. కథల కన్నా కవిత్వం రాయడం తనకిష్టం. నాకు కథలు రాయడం ఇష్టం”.
”బావుంది. అన్నా చెల్లెళ్ళిద్దర రైటర్స్ అన్న విషయం దాచిపెట్టారన్నవట” అంది నవ్వుతూ
”మేమ్ సాబ్! ఆప్‌కేలియే కోయీ ఆయ” అన్నాడు హనీఫ్.
”ఠీక్ హై! మై అభీ ఆవూంగీ. వున్ కో బిఠాదో” అంది వసుధ.
”మదు! కాసేపు పడుకోరాదు! నేనిపుడే వస్తా”
‘సరే’ అంట ్మాధవి తనకిచ్చిన రూమ్‌లోకెళ్ళింది. కాసేపు టీవీ ొచూసింది. నేషనల్ జియొగ్రాఫికల్ ఛానల్‌లో అంటార్కిటికా మీద ఏదో ప్రోగ్రామ్ వస్తోంది.
వెంటనే సియచిన్ గ్లేసియర్ గుర్తొచ్చింది. ఆ మంచులో కప్పడిపోయిన ఐదుగురు గుర్తొచ్చారు. వాళ్ళ కుటుంబాల వాళ్ళు గుర్తొచ్చారు.
అయ్యె! అన్పించింది. ఆలోచనల్లో వుండగానే వగన్నుగా కునుకు పట్టింది మాధవికి.
మెలుకువ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ చలిగా అన్పించింది. రూమ్‌లో హీటరుంది. బద్ధకంగా అలాగే మంచంలో పడుకుని వుంది.
”మదు! లేచావా!” అ౦టూ వచ్చాడు సుధాకర్.
”ఆ…. లేచాను. నువ్వొచ్చి ఎంత సేపయ్యింది”.
”చాలా సేపయ్యింది. టైమెంతో తెలుసా? ఆరు. మొద్దులా నిద్రపో్యావ్”.
”హవ్మె! ఆరయ్యిందా? వదిన లేపొచ్చుగా”.
రెండు సార్లు వచ్చింది. నువ్వేమొ గురకలు పెట్టి నిద్రపోతున్నావ్” హాస్యంగా అన్నాడు.
”గురకా? ఛీ… ఛీ నేను గురక పెట్టను”
”నీకెలా తెలుస్తుందేమిటి? గురక నిద్దరోతున్నపుడు వస్తుంది”.
”అవునా? నాకు తెలియదులే. నేనింకా మెలుకువగా వున్నప్పుడు వస్తుందనుకున్నాను” అంది నవ్వుతూ.
ఇద్దర గట్టిగా నవ్వుతంటే వసుధ వచ్చి ”ఏమిటి? ఇద్దర తెగ నవ్వుతున్నారు. ఏం తల్లీ నిద్ర సరిపోయిందా? కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోయవ్”.
”అంటే నేను కుంభకర్ణుణ్ణని నీ ఉద్దేశమా”
”ఉండొచ్చు” అంది వసుధ నవ్వుతూ.
”అది సరేగాని, ఈ డిన్నర్‌కి నేను రాకపోతే ఏమౌతుంది” అంది ొమాధవి.
”ఏమీ కాదు. ఇంట్లో నీకు బోరు కొడుతుంది. ఎందుకు రానంటున్నావ్?
”వాళ్ళెవరో ఏంటో! నాకు పరిచయం లేదుగా”.
”ఏం ఫర్వాలేదు. ఎవరూ ఏమీ అనుకోరు. లేచి తయరవ్. మనం ఏడింటికల్లా బయటపడాలి”.
”ఒరేయ్! సుధా! ఇంతకీ మనం వెళుతున్న పార్టీ సందర్భం ఏమిటో చెప్పనే లేదు”. కారులో కూర్చున్నాక మాధవి అడిగింది.
”ఇక్కడి ఎస్.ఎస్.పి. కి ప్రమొషన్ వచ్చింది. అతని కొడుకు బర్త్‌డే కూడా నట”. అన్నాడు సుధాకర్. ”అలాగా” అంటుండగానే కారు ఓ ఇంటి ముందు ఆగింది. కారులో హీటర్ వుండడం వల్ల వెచ్చగానే వుంది.
ఆ చలిలో కారుదిగి బయటకు రావాలంటే ప్రాణాంతకంగా అన్పించింది మాధవికి.
ఎస్.ఎస్.ప.ిఇనాయత్, ఆయన భార్య తబస్సుమ్ వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే లోపల చాలా మంది వచ్చి వున్నారు. పోలీస్, మిలటరీ అధికారుల్తో హాలంతా నిండిపోయింది. హాల్లో సన్నటి వెలుతురు పరుచుకుని వుంది. మంద్రంగా సంగీతం వినబడుతోంది. తబస్సుమ్ ఆడవాళ్ళ కూర్చున్న దగ్గరికి వచ్చి అందరినీ పలకరించింది. మాధవి కన్నార్పకుండా ఆమెనే చూడసాగింది. ఎంత అందంగా వుందీమె. విలక్షణమైన కాశ్మీరీ పోలికల్తో తెల్లగా, సన్నగా, నాజూగ్గా మెరిసిపోతోంది. వయసు ఏభై పైనే వుండొచ్చు. కాని అలా అన్పించడం లేదు. వసుధ, ొమాధవిని ఆమెకి పరిచయం చేసింది. ఆత్మీయత ఉట్టిపడే కంఠంతో మాధవిని పలకరించి కుడిచేతి మీద ముద్దుపెట్టింది. మాధవికి గమ్మత్తుగా అన్పించింది.
గ్లాసుల గలగలలు మొదలయ్యయి. ఘుమఘుమలాడే నాన్‌వెజ్ కాశ్మీరీ వంటకాల వాసనలు హాలంతా కమ్మేసాయి.
హాలుకు ఒక వైపున అందంగా అమర్చిన టేబుల్ మీద గులాబీ రంగు కాక్ వుంది.
”హేపీ బర్త్ డే టు అన్వర్ ” అని రాసిన ప్లేకార్డ్ వుంది.
అందరూ ఆ టేబుల్ వేపు నడిచారు. లోపల్నించి ఐదేళ్ళ కుర్రాడిని తీసుకొచ్చిందొకామె. కాశ్మీరీల సంప్రదాయ డ్రస్‌లో, తలమీద రమీ టోపీతో కుర్రాడు ముద్దుగా వున్నాడు. అయితే ఆ పిల్లాడు తబస్సుమ్ కొడుకంటే ఆమెకి నమ్మకం కలగలేదు. ఆ వయస్సులో వీళ్ళకింత చిన్న కొడుకా?
”వీడు వీళ్ళ మనవడేవె వదినా” అంట గుసగుస లాడింది వసుధ చెవిలో.
”కాదట. కొడుకేనట”.
”సుధా గాడేడీ! వాడినే అడుగు దాం” చుట్ట చూసింది కాని సుధాకర్ దగ్గర్లో కనబడలేదు. దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
అన్వర్ కేక్ కట్ చేసాడు. అందర చప్పట్లు కొట్టారు. ఇనాయత్, తబస్సుమ్‌లు వాడి నోటిలో కేక్ పెట్టి ఫోటోలు తీయించు కున్నారు.ఆ తర్వాత అన్వర్‌ని లోపలి గదిలోకి తీసుకెళ్ళిపోయరు. డ్రింక్స్, కబాబ్స్ సర్వ్ చేసారు. ఎవరి కిష్టమైన డ్రింక్ వాళ్ళు తాగుత కబుర్లలో పడ్డారందరూ.
వైన్, జిన్ లాంటివి ఆడవాళ్ళవేపు వచ్చాయి. మటన్ బాల్స్ నములూతూ, వైన్ సిప్ చేస్త ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు.
డిన్నర్ కంప్లీట్ అయ్యేవరకు సుధాకర్ వీళ్ళ వేపు రానేలేదు.
పదకొండు గంటలకి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంట ఇళ్ళకి బయలు దేరారు.
కారులో కూచున్నాక వెంటనే మాధవి అడిగిన మొదటి ప్రశ్న అన్వర్ గురించే.
”సుధా! అన్వర్ చాలా చిన్నగా వున్నాడు. వీళ్ళ కొడుకేనా? లేక వాళ్ళ మనవడా?” మాధవి
”కొడుకూ కాదు మనవడూ కాదు”.
”ఏమిట్రోయ్! మందెక్కువయ్యిందా”
”నిజమే. అన్వర్‌ని వీళ్ళు పెంచుకున్నారు”
”అలా చెప్పు. అదీ సంగతీ”. అంది మాధవి.
”పెంచుకోవడం అంటే దత్తత తీసుకోలేదు. ఒక ఆపరేషన్‌లో అన్వర్ వీళ్ళకి దొరికాడు”.
”ఆపరేషన్‌లో దొరకడమేమిటి? వదినా! వీడికి నిజంగానే మందెక్కువ య్యింది”. నవ్వుత అంది మాధవి. వసుధ కూడా నవ్వింది.
”అబ్బ! ఊరుకుంద! నేను ఎక్కువ తాగనని నీకు తెలుసు. కంపెనీ కోసం కొంచం తీసుకుంటాను. సరే! నీ అను మానాలన్నీ తీరాలంటే మొత్తం చెప్పాల్సిందే”.
”చెప్పు చెప్పు” అంట తొందర పెట్టింది.
”నీకు తెలుసు కదా మదు! ఇక్కడ తీవ్రవాదుల ప్రాబ్లమ్ గురించి. ఎన్ కౌంటర్ల, కూంబింగ్ ఆపరేషన్‌లు, కిడ్నాప్‌లు నిత్యం జరుగుతుంటాయి. ఇనాయత్ ఇలాంటి ఒక ఆపరేషన్‌లో పాల్గొన్నపుడు అన్వర్ దొరికాడు.
”అంటే….’మాధవికి కొంచెం అర్థమయ్యింది.
”ఒక రోజున ఒక ఇంట్లో తీవ్ర వాదులు దాక్కున్నారని ఇనాయత్‌కి ఇన్‌ఫర్‌మేషన్ వచ్చింది. ఆయన బలగాలతో ఆ ఇంటిమీద దాడిచేసాడు. ఆ దాడిలో ఇంట్లో వున్న వాళ్ళందర చనిపోయరు. గమ్మత్తుగా అన్వర్ గాయలేమీ కాకుండా బతికి బయటపడ్డాడు”.
”నిజంగా ఆ యింట్లో తీవ్రవాదులు దాక్కొన్నారా”.
”లేదని తర్వాత తెలిసింది. అన్వర్ తల్లి, తండ్రి, చెల్లి ఆ దాడిలో చనిపోయరు”.
మాధవికి కడుపులోంచి ఏదో తెళ్ళుకొస్తున్నట్లనిపించింది.
”అన్వర్ అమ్మా నాన్న అమాయ కులు. పేదవాళ్ళు. ఇనాయత్‌కి వచ్చింది తప్పుడు ఇన్‌ఫర్‌మేషన్. అతడి భార్య తబస్సుమ్ బలవంతంమీద అన్వర్‌ని తెచ్చుకుని పెంచుతున్నారు.
”ఒక్కసారి కారాపు” అని అరిచింది మాధవి.
సడన్ బ్రేక్‌తో కారాగింది.
గబుక్కున డోర్ తీసి భళ్ళున వాంతి చేసుకుంది మాధవి. సుధాకర్ వసుధ గాభరాపడ్డారు. ”ఏమైంది మధ! ఫుడ్ పాయిజనింగయ్యిందేమిటి?”
”ఏం ఫర్వాలేదులే. ఈ వాంతి అవ్వకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఛీ…ఛీ…. ఇలాంటి ఇంటికి తీసుకొచ్చా వేమిటి? అమాయకుల్ని పొట్టన పెట్టుకుని, రక్తపు చేతులతో వాళ్ళ బిడ్డని పెంచడానికి వీళ్ళకి సిగ్గులేద! తన అమ్మా, నాన్న చెల్లెల్ని చంపిన వాడే తనని సాకుతున్నాడని పాపం అన్వర్‌కి తెలియదు. ఎంత ఘొరం! కోపంగా అంది మాధవి.
”మదు! అనవసరంగా ఆవేశ పడకు. కాశ్మీర్లో ఇలాంటివి మామూలే. అన్వర్‌ని పెంచుకుంటున్నందుకు అందర ఇనాయత్‌కి తెగపొగుడుతుంటేను. అనాధలా వదిలేయకుండా…”.
సుధాకర్ మాటలు పూర్తికాకుండానే మాధవి ”అనాథని చేసిందెవరు?” అంటూ గయ్‌మంది.
”సుధా! ఇంక వాదించకు. ఆ విష యం ముందు తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు. నాక్కూడా ఏమిటో కడుపులో తిప్పుతున్నట్టు గా వుంది” అంది వసుధ.
సుధాకర్ మాట్లాడకుండా కూర్చున్నాడు.
అన్వర్ అమాయకమైన ముఖం గుర్తొచ్చి మాధవి భారంగా నిట్తూర్చింది. అన్వర్‌కి జరిగిన అన్యాయన్ని పట్టించు కోకుండా దొంగ చేతికే తాళాలిచ్చినట్లు తన కుటుంబాన్ని చంపినవాడి కొడుకుగా చెలామణి కమ్మని ఆదేశించడం ఎంత అన్యాయం. పైగా అతనికి ప్రవెషన్‌లు, పొగడ్తలు.
ఇక్కడ ఇలాంటివి మామూలే అంట సమర్ధిస్తున్న సుధాకర్ వేపు చూస్త ”నేను రేపు వెళ్ళిపోతాను” అంది హఠాత్తుగా.
”రేపేనా? ఎందుకు?
”ఏవె! నాకిక్కడ ఉండాలన్పించ డం లేదు”.
అన్వర్ ముద్దు ముఖం ఆమె కళ్ళల్లోంచి చెదిరిపోవడం లేదు.
ఇనాయత్‌ని తల్చుకోగానే ఆమెకి టాల్‌స్టాయ్ ‘విందు తర్వాత’ కథలో మిలటరీ అధికారి గుర్తొచ్చాడు. నిశ్శబ్ధంగా కారుదిగి ఇంట్లోకి వెళుతున్న మాధవిని చూస్త నిలబడ్డారు సుధాకర్, వసుధలు.
(బుఖారి : కాశ్మీర్ లాంటి చలిప్రదేశాల్లో వెచ్చదనం కోసం ఏర్పాటు చేసుకునేది. ఒక స్తంభంలాంటి కట్టడం. దానిలో నిత్యం బొగ్గుగాని, గ్యాస్‌గాని వుంచి వెలిగిస్తే గదంతా వెచ్చగా వుంటుంది.
సవెవాయ్ : టీ కాచుకునేది. చిన్న సైజు బాయిలర్ లాగా వుంటుంది.
కాంగ్ది : నిప్పుల కుంపటి. కాశ్మీరీలు చలికాలంలో దీన్ని దుప్పట్లో పెట్టుకుని పడుకుంటారు.)

Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...