Thursday, May 28, 2009

రామంతాపూర్ రోడ్లో ఓ అద్భుతమైన సంపెంగ వనం

హిమాయత్ నగర్ రోడ్లో నాగమల్లి చెట్టు ఉంది చూసారా అంటే ఎవ్వరూ స్పందించలేదు.మరీ అంత బిజీనాండి తమరంతా?ఎడారిలా మారిన బిల్డింగులున్నయ్ లెండి.చెట్లు లేకుండాపోయాయని నా బాధ. పచ్చదనం కోల్పోయిన అలాంటి కాంక్రీట్ జంగల్ రోడ్లో ఓ అద్భుతంలా నాగమల్లి విరగబూసి ఉంది అంటే అందరూ పరుగెత్తికెళ్ళి చూస్తారనుకున్నా. అబ్బే ఎవ్వరూ స్పందించలేదు. ఎంత విషాదం.

పోనీ రామంతాపూర్ రోడ్లో ఓ అద్భుతమైన సంపెంగ వనం ఉంది .ఎవరైనా చూసారా?సంపెంగ చెట్టు కాదండోయ్.సంపెంగ వనం. పోనీ దీన్నైనా చూస్తారా?
మడిసన్నాకా కాసింత కలాపోసన పచ్చని చెట్టు మీదా ప్రేమ లేకపోతే ఎలాగండీ.

6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

సంపెంగ గుబాళిస్తోంది

rākeśvara said...

రామాంతపురం అంటే కోనసీమేమో అనుకున్నాను, హైదరాబాదులో సంపెంగ వనమే.. అబ్బో...

Vani said...

ekkada? choodalani undi!

మాలా కుమార్ said...

అవునా?ఎక్కడ?మనకు కావాలంటే మొక్క ఇస్తారా?
అలాగే హిమాయత్ నగర్ లో నాగమల్లి చెట్టు ఎక్కడ?

భావకుడన్ said...

ఏమిటీ మా రామంతాపూర్ రోడ్లో సంపెంగ వనమా?....ఎక్కడుందో చేపరూ....ఊహాల్లోనే అలా చూసేసి వస్తాను ఎంచక్కా.

maa godavari said...

మొదట నాగమల్లి చెట్టు ఎక్కడుందో చెప్పేస్తాను.మీలో చాలామంది మినర్వా హోటల్ లో ఎన్నో సార్లు లంచో ,డిన్నరో చేసే ఉంటారు కదా.మినర్వా చుట్టుపక్కల ఒకసారి cooDanDi

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...