ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు
4 comments:
very nice!
బాగుందండి...
ఈ పరుగు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇది నేటితో ఆగేది కాదు. మన తరం కాస్త ఫర్వాలేదు. కానీ నేడు పుడుతున్న వారికి చదువుల పరుగులో బాల్యం బోసి పోతోంది. తరువాత సంపాదన పరుగు. సంసారం పరుగు. పరుగులో పుడుతున్నారు. పరుగులోనే గిడతారు. విశ్రాంతి తెలియదనే చెప్పాలి.
కవిత బగుంది :)
అవునండి .. బాగా చెప్పారు..
ప్రకృతి తో అనుబంధం కోల్పోయి .. మనిషి శాంతి కి దూరం అవుతున్నాడు.
Post a Comment