కనుక్కున్న వాళ్ళకి కొండంత ఆనందంఅస్తవ్యస్తంగా,మహా రష్ గా ఉండే హిమాయత్ నగర్ మెయిన్ రోడ్డులో ఒక్క చెట్టు లేదు.ఎంత విషాదం?
చెత్త చెత్తగా భవనాలు,రోడ్డంతా ఆక్రమించుకుంటూ
వాహనాలూ.
నిజానికి ఆ రోడ్లో డ్రైవ్ చెయ్యడమంటే మహా మంట నాకు.
కానీ ఇపుడు ఆ రోడ్లో వెళ్ళడమంటే ఎంత ఇష్టమో చెప్పలేను.
ఎందుకలాగా అని ప్రశ్నార్ధకం పోజ్ లో కి వచ్చేసారా?
అదే కదా నా ప్రశ్న.
కనుక్కోండి. చూద్దాం.
ఒక్క చెట్టైనా లేని హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో
అందమైన,సువాసనలు వెదజల్లే నాగమల్లి చెట్టుందంటే మీరు నమ్ముతారా?
పచ్చటి ఆకుల్తో,మొదలంటా పూసిన పరిమళాల పువ్వుల్తో
కాంక్రీట్ మహారణ్యంలో కొలువుతీరిన నాగమల్లిని కనుక్కోండీ .కొండంత ఆనందాన్ని సొంతం చేసుకోండి.

Comments