Monday, August 10, 2009

తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి సభ



మొన్న ఆదివారం నేను ఓ అద్భుతమైన సమావేశానికి వెళ్ళేను.ఎక్కడనుకున్నారు?చండ్ర రాజేశ్వరరావ్ ఫౌండేషన్ కి.అక్కడ తాపీ ధర్మారావు గారి కోడలు తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి జరిగింది.రాజమ్మ గారి కొడుకు,కూతురు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ కొండపల్లి కోటేస్వరమ్మ గారిని,వి.హనుమంతరావు గారిని,వేములపల్లి సత్యవతి గారిని,లీలావతి గారిని,సరళా దేవిగారిని,మల్లు స్వరాజ్యం గారినీ కలవడమే కాదు వారితో కలిసి భోజనం చేసాను.ఉద్యమాల కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులను ఆ రోజు కలిసాను. తాపీ రాజమ్మ గారి గురించి, వారి జీవితం గురించి ఎన్నో అపురూపమైన విషయాలు విన్నాను. నిజంగా ఆ ఆదివారం నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చింది.

14 comments:

సుభద్ర said...

తాపీ రాజమ్మ గారి గురి౦చి రాయ౦డి.
నాకు ఆవిడ గురి౦చి తెలియదు.

kusuma kumari said...

తాపీ రాజమ్మ గారి గురి౦చి వంటి
ఆదర్శప్రాయమైన మహనీయుల జీవిత కథలు,
వివరంగా తెలుపవలసిన అవసరం ఉన్నది.
మీకు తెలిసిన ఆ సంఘటనల మాలికను
మీ - మా గోదావరి - ద్వారా
మనకు, మన పాఠకులకు అందీయండి,
సత్యవతి గారూ!

Praveen Mandangi said...

నాకు ధర్మారావు గారు తెలుసు. అతనో అభ్యుదయవాద రచయిత. వ్యక్తిగత పాపులారిటీ కోసం పాకులాడేవాళ్ళు నమ్మే జయంతులు, వర్ధంతులు అభ్యుదయవాదులకి అవసరమా? అభ్యుదయవాదుల బోధనలు ఆచరిస్తే చాలు, వాళ్ళ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవలసిన పని లేదు.

సుజాత వేల్పూరి said...

Praveen, Good point!

సుజాత వేల్పూరి said...

దీన్ని మనం ఇంకోరకంగా అర్థం చేసుకోవచ్చు. తాపీ రాజమ్మ గారికి ఇలాంటివన్నీ ఇష్టం లేకపోయినా, ఆమె ఆలోచనలు, భావనలు ఒకసారి అందరం కలిసి కూచుని చర్చించుకోవచ్చు! నిజానికి సత్యవతి గారు రాసేదాకా చాలామందికి ఆవిడెవరో తెలీదు(నాక్కూడా)! ఇప్పుడు మనం ఆవిడ గురించి తెల్సుకునే సందర్భం వచ్చింది.

ఇలాంటి సభల్లో పోయిన వాళ్ళ గురించి పొగడతలూ, పూల దండలూ,పద్యాలూ వీటికంటే వాళ్లు మనకు ఏ విధంగా స్ఫూర్తిని అందించారన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది.సత్యవతి గారు రాసినదాన్ని బట్టి ఇక్కడ అదే జరిగిందని అనిపిస్తోంది

Praveen Mandangi said...

ఇలా ఎందుకు చెప్పానంటే కొంత కాలం స్త్రీవాదులమని చెప్పుకుని, తమకి అనుకున్నంత పాపులారిటీ రాకపోతే స్త్రీవాదాన్ని విడిచిపెట్టినవాళ్ళు ఉన్నారు. అభ్యుదయవాదులు వ్యక్తిగత పాపులారిటీ వైపు పోతే ఇలాగే అవుతుంది.

ఆ.సౌమ్య said...

రాజమ్మ గారి పేరు నేనెప్పుడూ వినలేదు...ఇదే మొదటిసారి. మీరు వివరాలు రాస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను.

Praveen Mandangi said...

ఆ కార్యక్రమానికి వచ్చినవాళ్ళకి తాపీ ధర్మారావు గారి గురించి నిజంగా తెలుసనుకోను. ధర్మారావు గారు వ్రాసిన 'రామునికి సీత ఏమవుతుంది?', 'ఇనుప కచ్చడాలు‌' వంటి పుస్తకాలని ఉదహరించి అతను బూతు రచయిత అని విమర్శించినవాళ్ళు ఉన్నారు. ధర్మారావు గారు వాస్తవానికి ఏమి వ్రాసారో ప్రజలకి చెపితే ఫర్వా లేదు కానీ జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తే వ్యక్తిపూజ చేసినట్టు ఉంటుంది.

Anonymous said...

*రాజమ్మ గారి పేరు నేనెప్పుడూ వినలేదు...ఇదే మొదటిసారి. మీరు వివరాలు రాస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను.*
ఓ. సౌమ్యా, ఇప్పటివరకు ఎంతో మంది వివరాలు నీకు తెలుసు గదా వాటిని తెలుసుకొని ఎమీ చేశావు? బ్లాగటం తప్ప.

Praveen Mandangi said...

తెలిసితెలియనివి వ్రాయడంలో కొంత మంది ఎక్స్‌పర్ట్‌లు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయి పడగలు నవలని గొప్ప నవలని పొగిడింది. వేయి పడగలు నవలపై రంగనాయకమ్మ గారు వ్రాసిన విమర్శలు ఆమె చదివినట్టు లేదు. 2009 మార్చ్, ఏప్రిల్ నెలలలో వార్త ఆదివారం బుక్‌లెట్‌లో 'చలం నవలావలోకనం' అనే శీర్షిక వచ్చేది. ఆ శీర్షికలోనే రంగనాయకమ్మ గారు చలం రచనలలోని స్త్రీ పాత్రలకీ, విశ్వనాథ & బాపిరాజు రచనలలోని స్త్రీ పాత్రలకీ మధ్య ఉన్న తేడా చక్కగా వివరించారు. తాపీ ధర్మారావు గారి రచనలైనా ఆమె చదివి ఉంటుందనుకోను. ధర్మారావు గారు రచనలు వ్యవస్థీకృత సంప్రదాయాలని ధిక్కరించే విధంగా ఉంటాయి. మామూలు సంప్రదాయ దృష్టితో చూస్తే అతని రచనలు అర్థం కావు.

y.v.ramana said...

" ఉద్యమాల కోసం జీవితాలను త్యాగం చేసిన .. " క్షమించాలి . నాకర్ధం కాలేదు . వాళ్ళు నమ్మిన రాజకీయ సిద్ధాంతాల కోసం కష్టపడి పని చేశారు . మంచిది . సంతోషం . కానీ .. మధ్యలో ఈ త్యాగాల గోలేంటి ?

Rajendra Devarapalli said...

ప్రవీణ్ నీ కామెంటులోనే నీవడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది చూసావా!!??తాపీధర్మారావు గారు అభ్యుదయ రచయితనీ,ఫలానాఫలానా పుస్తకాలు రాసారని నీకుతెలుసన్నావు కదా.కానీ అదీ తెలీని నాలాంటి వాళ్లకు ఈ కార్యక్రమం జరగటం వల్ల,సత్యవతి గారుహాజరయ్యి తనబ్లాగులో రాయటం వల్ల తెలిసింది.
ఇక వ్యక్తిపూజ గురించి....ఫలానా వారు అంతటివారు,ఇంతటి వారు
అని అదేపనిగా పొగుడుతూ ఉండేది వ్యక్తిపూజజాబితాలోకి వస్తుంది కొంతవరకూ.తెలుగు
బ్లాగుల్లో దాదాపుగా కొందరు రాస్తుంటారు అలాగన్నమాట.
ఉదాహరణకు:-ప్రవీణ్ శర్మ బహుముఖప్రజ్ఞాశాలి అదీ ఇదీ అని ఒకటే ఊకదంపుడు
ఉపన్యాసాలు,రాతలూ అవీ వెలువడుతుంటే అది వ్యక్తిపూజ అవి నిజమైనప్పటికీ
సందర్భానుసారం తలచుకోవటంలో,సభలూ సమావేశాలు జరుపుకోవటంలో
ఎలాంటి కృత్రిమత్వం,పాకులాటలూ ఉండవు.

Praveen Mandangi said...

It's not wrong to remember the works of a person or teach about his/her philosophy. But the celebration of jayanti (birth day) or vardhanti (death day) is something that is not different from traditional practice. So, I criticised it.

maa godavari said...

మితృలనదరికీ నమస్కారం.
తాపీ రాజమ్మ గారి గురించి కొండపల్లి కోటేశ్వరమ్మ గారు
నవంబరు 2009 లో రాసిన వ్యాసాన్ని మీకోసం ఇక్కడ పోష్ట్ చెస్తున్నాను.
ఆవిడ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని భూమిక వెబ్ సైట్
లో కూడా చదవొచ్చు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...