ఇది ప్రాణాంతక హింస

"టీజింగ్" అంటే అర్థం వేళాకోళం చేయడం.అదీ సరదాగా. కానీ మనం మాత్రం రోడ్ల మీద,బస్సుల్లోను,వుమెన్స్ కళాశాలల దగ్గర ఒక చోట అనేమిటి సర్వాంతర్యామిలా వెర్రితలలు వేసిన ఒక హింసకు ' ఈవ్ టీజింగ్' అని ముద్దు పేరు పెట్టుకున్నాం.అయితే ఈ బాధ అనుభవించేవాళ్ళకే అర్థమవుతుంది.'ఈవ్ టీజింగ్'కు పాల్పడే వారికి స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపు,ఏం చేసినా తిరగబడరులే అన్న భరోసా,ఆడపిల్లల్ని ఏడిపించడం మగతనంగా భావించే తప్పుడు ధోరణులు..ఇవన్నీ కారణాలే.ఆడ, మగపిల్లలు కలిసిమెలిసి తిరిగే పరిస్థితులు లేకపొవడం కూడా ముఖ్యకారణంగా అర్థం చేసుకోవచ్చు.
గ్మగపిల్లల వద్ద స్వేచ్చగా ఉండలేక ముడుచుకుపొతుంటారు.వాళ్ళేమైన కామెంట్ చేసినా కన్నెర్ర చేసి ఖబడ్డ్దార్ అనడంచేతకాక కన్నీళ్లను మాత్రమే కారుస్తుంటారు

ఆడపిల్లలతో స్నేహం చేయడం తెలియని ఆకతాయి కుర్రాళ్లు వాళ్లను నానారకాలుగా మాటలతోను,చేతలతోను హింస పెడుతుం ఈవ్టీజటారు.ఈ హింస ఎన్నోరూపాల్లొ విస్తరించి,ఒక్కోసారి మితిమీరి ఆత్మహత్యల దాకా వెళుతుంది? ఆడపిల్లలు కూడా తక్కువేమీ తినలేదు.వాళ్ళూ ఏడిపిస్తుంటారని కొందరు వాదనకు దిగుతారు.అయితే.. ఎక్కువ శాతం హింసను ఎవరు అనుభవిస్తున్నారో అర్ఠం చేసుకుంటె ఈ వాదన అర్ఠం లేనిదనిపిస్తుంది.టీజింగ్ భరించలేక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటె ఆ చావుకు కారకులెవ్వరు?సమాజమా?తల్లిదండ్రులా?వేయితలలతో విస్తరించిన పురుషాధిక్య భావజాలమా

వాహనాలు నడిపే అమ్మాయిల మీద జరిగే దాడులు అమానుషంగ ఉంటాయి.వాహనాలను ఢీకొట్టడం,చున్నీలు లాగడం లాంటి పనులు వల్ల ప్రమాదాలు జరగ డం.ప్రాణాలు కోల్పోవడం కూడా మనం విన్నాం.కొంత కాలం క్రితం భోపాల్ యూనివర్సిటీ క్యాంపస్లో కూర్చొని ఉన్న అమ్మాయి మీద నుండి జీప్ పోనివ్వడం,అలాగే ఆమెను చాలదూరం ఈడ్చుకుపోవడంతో ఆ అమ్మయి అక్కడే మరణించింది.దేశంలొ ఏదో ఒక మూల ఇలాటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఇంత అమానుష చర్యని ఈవ్ టీజింగ్ అని పిలవడం సమంజసమేనా? నిత్యం స్త్రీలు అనుభవించే ఈ మానసిక హింసను చాలా తేలికైన విషయంగాను,చాల సహజమైనదిగాను తీసుకోవడం వల్ల ఈ హింసకు పాల్పడేవారి పట్ల కఠిన వైఖరి లేకుండా పోయింది.

తమ అక్కాచెల్లెళ్ళ చుట్టూ రక్షక కవచాలు,ముళ్ళ కంచెలు కట్టి 'కాపాడే' సహోదరులు ఎదుటివారి అక్కచెల్లెళ్ళ పట్ల ఎందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? పబ్లిక్ ప్రదేశాల్లో అచ్చోసిన ఆబోతుల్లా అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోవడం కాక ఆడపిల్లల్ని గౌరవించాలన్న ప్రాథమిక పాఠాన్ని తమ పుత్రరత్నాలకు నేర్పాల్సిన బాద్యత కన్నవాళ్ళదే కదా!ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వాళ్ళుగా,గుండె నిబ్బరంతో కొండల్ని సైతం ధిక్కరించే గుండె ధైర్యం ఉన్న వాళ్ళుగా పెంచిన రోజున ఈవ్ టీజింగ్ అనే పదం డిక్షనరీ లోంచి పారిపొకుండ ఉంటుందా?

ఈ నిత్యహింసను ఎదుర్కొనే మార్గం ఒక్కటే.అమ్మాయిలు ఆత్మస్థైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకొవడం.అబ్బాయిలు వెంటబడి వేధిస్తున్నపుడు తిరగబడి పబ్లిక్లొ నిలదీయడం,వాళ్ళు ఏదో అనగానే ముడుచుకుపోయి కన్నీళ్ళను ఆశ్రయించడం కాక కన్నెర్ర చేసి ధీటుగా సమాధానం చెప్పడం అలవర్చుకోవాలి.ఈవ్ టీజింగ్ ను లైంగిక వేధింపు లేక లైంగిక హింసగానే అర్ధం చేసుకోవాలి తప్ప ఇదేదో సరదా వ్యవహారంగా చూడకూడదు.శిక్షలతో నయమయ్యే జబ్బు కాదిది.శారీరక శిక్షల కన్న మానసిక వికాసం చాలా ముఖ్యం.

ఆడపిల్లలంటే అరచిగోల పెట్టి,వేధించడం మాత్రమే తెలిసిన అబ్బాయిలు,వాళ్ళతో స్నేహం చేస్తే ఎంత బావుటుందో అర్థం చేసుకోవాలి.అమ్మాయిలు తమలాంటి మనుషులేనని,తమలాగే స్వేచ్చగా సంచరించే హక్కు వాళ్ళకూ ఉందని అర్ధం చేసుకోవాలి. మగ పిల్లల ఆలోచనా ధోరణిలో ఆడపిల్లలు తప్పకుండా మార్పురావాలి.
బయటికొచ్చే ఆడవాళ్ళూ గానీ,చదువుకొనే ఆడపిల్లలు కాని బయట ప్రపంచంలో అనుక్షణం ఎదురయ్యే ఈవ్ టీజింగ్ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి కానీ క్రుంగిపోవడం,విలువైన ప్రాణాన్ని బలిపెట్టడం చెయ్యకూడదు.తలవంచుకుంటే దెబ్బకొట్టడం తేలిక.గుండె నిబ్బరంతో తలెత్తి నడిచేవాళ్ళను ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు.మనం అత్యవసరంగా,అనివార్యంగా అలవరుచుకోవాల్సింది ఆత్మస్థైర్యాన్నే.

Comments

మీ బాధ సహేతుకమైనదే.ఎప్పుడైతే పురుషుడు తన భార్యను తప్ప మిగతా అందరినీ సోదరభావంతో చూడగలడో అప్పుడే ప్రపంచం లోని స్త్రీలు ధైర్యంగా ఉండగలుగుతారు.అలాగే మీరూ అనగా మహిళలు అచంచలమైన ఆత్మవిశ్వాసం మరియు అఖండమైన ధైర్యం సాదించుకుంటారో అప్పుడు మీరూ సమానంగా జీవించవచ్చు. మీరు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించనవసరంలేకుండా స్వయంఉపాధి పనులు లేక సొంతకాళ్ళపై నిలబడగలిగే విద్య నేర్చుకుంటే మీకు ధైర్యం వస్తుంది.
అసలీ ప్రవృత్తికి మూలకారణాలేమంటారూ?
రాధిక said…
చాలా మంచి విషయాలు చెప్పారు.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం