ఈ రోజు తెలంగాణ జుడీషియల్ అకాడెమి,భూమిక ఉమన్స్ కలక్టివ్ సమ్యుక్త ఆధ్వర్యం లో 317 మంది జడ్జీలకు జెండర్ సెన్సటైజేషన్ మీద మూడు గంటల పాటు అవగాహనా సదస్సు జరిగింది.జెండర్ అంటే ఏమిటి,ఎలా అర్ధం చేసుకోవాలి,వ్యవస్థల్లో జెండర్ సెన్సిటివిటి లోపించడం వల్ల స్త్రీలకు న్యాయం ఎలా అందకుండా పోతోంది అనే అంశం మీద లోతైన చర్చ జరిగింది.
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా హింస ఎందుకు పెరిగిపోతోంది,గృహ హింస చట్టం అమలు లో ఉన్న లోపాలు మొదలైన అంశాల మీద సెషన్ లో చర్చించాము.
ఇటీవల అపర్ణా భట్,మధ్య ప్రదేశ్ హైకోర్టు మధ్య జరిగిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద చాలా సేపు మాట్లాడాను నేను.జండర్ మీద పద్మ ఆకెళ్ళ గారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరంగా మాట్లాడారు.
ఒక రేపిస్ట్ కి రాఖీ కట్టి సయోధ్య కుదుర్చుకోవాలని,ఆ పద్ధతిలో బెయిల్ పొందాలని చెప్పిన తీర్పును కొట్టేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పాఠాన్ని ,అందులోని జెండర్ సెన్సిటివిటీనీ గురించి చాలా చర్చ జరిగింది.
మొత్తానికి ఈ రోజు 317 మంది జడ్జీలకు జెండర్ సెన్సిటివిటీ మీద పాఠాలు చెప్పే అవకాశం ఈ సదస్సు ద్వారా మాకు లభించింది.
No comments:
Post a Comment