శారదా శ్రీనివాసన్ గారితో ఓ సాయంత్రం

శారదా శ్రీనివాసన్ గారితో సాయంత్రం

నిన్న ఎందుకో అలా డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే హిమాయత్ నగర్ దగ్గరకొస్తూనే 
శారద గారు గుర్తొచ్చారు. చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు.
ప్లాన్ చేస్తే పనులవ్వడం లేదు కాని చెప్పకుండా వెళ్ళి ఆశ్చర్యపరుద్దామనుకున్నాను.
లేడికి లేచిందే పరుగు లాగా శారద గారింటికెళ్ళడం డొర్ బెల్ కొట్టడం 
.. సత్యా అంటూ ఆవిడ నన్ను ఆత్మీయంగా హత్తుకోవడం 
పది నిముషాల్లో జరిగిందంటే నమ్మండి.
తర్వాత కబుర్ల జలపాతం,నవ్వుల జల్లులు.
ఇంతకీ శారద గారు ఎవరో చెప్పలేదు సుమండి.
ఎవరి గొంతు వినాలని ఆనాటి తరం రేడియోల ముందు నిశ్శబ్దంగా కూర్చునే వారో,
ఆవిడ నాటకాలని వినడానికి ఆదివారం 3 గంటలకి రేడియోకి అతుక్కుపోయేవారమో 
శారదా శ్రీనివాసనే నండి.
నాకు మంచి మితృరాలు.మా స్నేహానికి 20 ఏళ్ళు.
ఆవిడ నటించి జీవించిన పురూరవ నాటకం విన్నారా మీరు.
"
నా రేడియో అనుభవాలు" అంటూ ఇటీవల అద్బుతమైన పుస్తకం రాసారు.
చదివారా మీరు.
పుస్తకాన్ని దాదాపు 6 గంటపాటు స్టూడియోలో చదివి సీడి కూడా తెచ్చారు.
నిన్న నాకు సీడి ఇచ్చారు.
దానిని వినడం గొప్ప అనుభవం.
మీకు కావాలంటే చెప్పండి.
ఆవిడకి మార్కెటింగ్ చేసుకోవడం అస్సలు రాదు.
అందరం కలిసి కొన్ని సీడి లు కొంటే బావుంటుంది కదా.
నేనీ మాట అంగానే వద్దులే సత్యా అన్నారు కానీ నేనే చొరవ తీసుకుంటున్నాను.

Comments

ఉష said…
ఆ సీడీ నాకు కావాలండి, ఎలాగ మిమ్మల్ని లేదూ వారిని సంప్రదించాలో తర్వాత తెలియజేస్తారనుకుంటున్నాను, సత్యవతి గారూ.
KumarN said…
Yes, నాకు కావాలండి.
Further details చెప్పగలరా, ఎలా పే చేయాలో ఎట్సెట్రా
వేణు said…
సత్యవతి గారూ! మీ పోస్టులో అక్షరాలు మరీ చిన్నవిగా ఉన్నాయి!

శారద గారిని మీరు కలవడానికి రెండు రోజులముందే ఈ సీడీ విశేషాల గురించి ఓ బ్లాగ్ పోస్టు రాశాను. సీడీలోంచి మూడు బిట్స్ కూడా పోస్టులో పెట్టాను.
మీరు రాసినదానికి ఒక చేర్పు అవుతుందనే ఉద్దేశంతో లింకు ఇస్తున్నాను.
http://venuvu.blogspot.in/2012/04/blog-post.html
USHA said…
Please naaku kudaa aa C D kaavaalandi yelaa pay cheyyalo yekkada collect chesukovaalo cheptaaraa dayachesi :)
commander said…
Naaku Kooda oka CD kaavalandi. Ekkada dorukutundo cheppandi
commander said…
Naaku Kooda oka CD kaavalandi. Ekkada dorukutundo cheppandi
శారదా శ్రీనివాసన్ గారి సి డి ని తయారు చేసే పని లో ఉన్నాం.
నేనే ఆ బాధ్యత తీసుకున్నాను.
ఈ సీ డి భూమిక ఆఫీసులో దొరుకుతుంది.
అది తయారు అవ్వగానే ఈ బ్లాగ్ లో పొష్ట్ చేస్తాను.
మీరు భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేసి చెబితే మీ అడ్రస్ కి పంపడమో మీరే వచ్చి తీసుకోవడమో చెయ్యొచ్చు.
భూమిక హెల్ప్ లైన్ 1800 425 2908

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం