Sunday, April 8, 2012

బూరుగు గూడెం భలే బావుంది.


నేనూ నా సహచరుడూ కలిసి రెండు రోజుల కోసం మాకు చాలా ఆత్మీయులైన రామనుజం గారు,మణి గార్ల ఊరు బూరుగుగూడెం వెళ్ళాం.
ఊరి నిండా మామిడితోటలే.
నూజివీడుకి దగ్గరగా ఉంది బూరుగు గూడెం.చాలా అందంగా పచ్చగా ఉంది ఈ ఊరు.
సాయంత్రం సరదగా వారి పొలాలవేపు వెళ్ళినప్పుడు ఓ అద్భుతమైనదృశ్యం ఆవిష్కారమైంది. ...
 ఓ వైపు నిండు పున్నమి జాబిల్లి ఆగమనం 
మరో వైపు సూర్యాస్తమయం.ఎంత హృద్యంగా ఉందో ఆ దృశ్యం.
రెండు కళ్ళు చాలలేదు చూడ్డానికి.
మామిడి తోటలో రెల్లుగడ్డి పాక.
పాకచుట్టూ పచ్చదనం,
కొబ్బరాకుల మధ్యలోంచి తొంగి చూస్తున్న పున్నమి చంద్రుడు
,
విరగ కాసిన మామిడి చెట్లు,
విస్తారంగా పండిన వరిచేలు,
అబ్బో బూరుగు గూడెం అందాలు చూడాల్సిందే.
మీరూ చూడండి.












1 comment:

వేణు said...

బూరుగుగూడెం నాకు బాగా తెలుసు. ఎందుకంటే పక్కనే మా ఊరు, చాట్రాయి! ఫొటోలు కూడా పెట్టి ఆ ఊరి అందచందాలను బాగా చూపెట్టారు. మామిడికాయలను అస్సలు మిస్సవలేదు మీరు! :)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...