శారదా శ్రీనివాసన్ గారితో ఓ సాయంత్రం
నిన్న ఎందుకో అలా డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే హిమాయత్ నగర్ దగ్గరకొస్తూనే
శారద గారు గుర్తొచ్చారు. చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు.
ప్లాన్ చేస్తే పనులవ్వడం లేదు కాని చెప్పకుండా వెళ్ళి ఆశ్చర్యపరుద్దామనుకున్నాను.
లేడికి లేచిందే పరుగు లాగా శారద గారింటికెళ్ళడం డొర్ బెల్ కొట్టడం
ఆ.. సత్యా అంటూ ఆవిడ నన్ను ఆత్మీయంగా హత్తుకోవడం
ఓ పది నిముషాల్లో జరిగిందంటే నమ్మండి.
ఆ తర్వాత కబుర్ల జలపాతం,నవ్వుల జల్లులు.
ఇంతకీ శారద గారు ఎవరో చెప్పలేదు సుమండి.
ఎవరి గొంతు వినాలని ఆనాటి తరం రేడియోల ముందు నిశ్శబ్దంగా కూర్చునే వారో,
ఆవిడ నాటకాలని వినడానికి ఆదివారం 3 గంటలకి రేడియోకి అతుక్కుపోయేవారమో
ఆ శారదా శ్రీనివాసనే నండి.
నాకు మంచి మితృరాలు.మా స్నేహానికి 20 ఏళ్ళు.
ఆవిడ నటించి జీవించిన పురూరవ నాటకం విన్నారా మీరు.
"నా రేడియో అనుభవాలు" అంటూ ఇటీవల ఓ అద్బుతమైన పుస్తకం రాసారు.
చదివారా మీరు.
ఆ పుస్తకాన్ని దాదాపు 6 గంటపాటు స్టూడియోలో చదివి సీడి కూడా తెచ్చారు.
నిన్న నాకు ఆ సీడి ఇచ్చారు.
దానిని వినడం ఓ గొప్ప అనుభవం.
మీకు కావాలంటే చెప్పండి.
ఆవిడకి మార్కెటింగ్ చేసుకోవడం అస్సలు రాదు.
అందరం కలిసి కొన్ని సీడి లు కొంటే బావుంటుంది కదా.
నేనీ మాట అంగానే వద్దులే సత్యా అన్నారు కానీ నేనే చొరవ తీసుకుంటున్నాను.