Wednesday, November 30, 2011

Campaign “On Breaking the Conspiracy of Silence”



Violence affects lives of millions of women in our country in all socio economic and educational classes. It cuts across cultural and religious barriers impeding the right of women to participate fully and contribute effectively in the society. 
Violence against women in the society exists in different forms such as domestic violence, rape, eve teasing, child marriage, corporal punishment, sexual abuse and female foeticide to name a few. All are violations of the most fundamental human rights.
To address the widespread violence in our society it has become imperative to address these issues and advance equality in society. 
Placing Andhra Pradesh in the given context some alarming figures come to the fore. A.P has been experiencing a steep rise in crimes against women. It topped the list in crimes against women during 2010 with 27,244 cases being registered accounting for 12.8% of the total crime in the country. The data released by National Crime Records Bureau also pegs A.P. to have highest record of crime against women second time in a row. 
Among crime against women cruelty by husbands topped the list, followed by molestation, sexual harassment, kidnapping, rape and immoral trafficking. The offences against women formed a major chunk of total cognisable cases in the State at 32.4 %. The state also ranks sixth in the country in the category of crimes against children with 1,823 cases at 6.8% of the all India total. At the same time one needs to also note that the instances of violence against young girls are an important aspect of this. We read every day about many incidences of eve teasing, abuse, sexual harassment, insult, acid attacks in the name of love, honour killings, crime against girls and women and the suicidal tendencies among girls.
Andhra Pradesh Mahila Samata Society (APMSS) has been addressing these issues in MS project areas. These issues also prevail in urban areas which makes the girls and women to experience various forms of violence in day to day life. Hence, there is a dire need for all of us to think about the city of Hyderabad and the plight of young girls, particularly adolescents, school going, out of school and junior college girls. Given this situation, there is a need to campaign on these issues in such a manner as to every one hears the voices of the girls.
Given these alarming incidences of violence in the State it has become imperative to initiate women centric interventions which can address these issues effectively.

There is an urgent need to address issues of violence against women if we are to evolve towards a more egalitarian society. The objectives of National Policy for Empowerment of Women state creation of an eco system which would be conducive for holistic development of women. These include positive social and economic policies for full development of women, enjoyment of all human rights and fundamental freedom in all spheres including- political, economic, social, cultural and civil, equal access to decision making, equal access of women to health care, education, employment, remuneration, strengthening legal systems aimed at elimination of all forms of discrimination against women, mainstreaming gender perspective in development process and elimination of discrimination and all forms of violence against women and girl child to name the core objectives. The goals envisaged in the policy are a far cry from how the reality is today. 
With the ratification of International treaties such as the CEDAW and 3 years to go for the realization of MDG’s by India it has become necessary to take pro active initiatives and address gender related inequalities more effectively. It has also become important to evolve strategies and mechanisms at the State level to ensure that these goals are realised at the earliest. 
With the need of addressing issues of violence becoming more pertinent, a fortnightly campaign to address these issues is being organised. The campaign which kicks off on 25th November also marks the International Day for the Elimination of Violence against Women designated by the UN in 1999. The campaign scheduled between 25th November to 10th December is first among the series of campaigns and activities that would be planned to strengthen and mobilise the local bodies and also build solidarity about the issue of violence against women and girls in society. 
The main objectives of the campaign are to-
a)      Demand formation of a State Level Women’s body/Organisation on the lines of National Commission to address issues of violence against women.
b)      Demand good infrastructure/ toilets to be made available for women and young girls in schools, colleges and public places.
c)      Demand to stimulate the committees on sexual harassment in schools and junior colleges with active involvement of, students, School Management Committees to enable efficient monitoring.
d)      Complaint box and grievance redressal mechanism to be made available in schools and colleges. 

a)      Identification and documentation of prevailing critical issues and put forth before the Government.
b)      Create awareness among young adolescent girls about violence.
c)      To garner support from various stakeholders with their active participation such as adolescent boys, Police, Government Departments.
d)      To disseminate, create awareness and build solidarity among civil society on the issue of violence against women.
e)      Get a clear direction towards the next set of initiatives to be undertaken in this regard.
The 18 Mandals which are covered during the 16 Days Activism are as follows:
Amberpet, Asifnagar, Bahadurpura, Bandlaguda, Charminar, Golconda, Himayatnagar, Marredpally, Musheerabad, Nampally, Saidabad, Secunderabad, Shaikpet, Trimulgherry, Serilingampally, Malkajgiri, Uppal, and Saroornagar.

Monday, November 21, 2011

నా రెండో కధల సంపుటి "మెలకువసందర్భం" పుస్తకం మీద ఆంధ్ర జ్యోతి లో ఆదివారం వచ్చిన రివ్యూ

నా రెండో కధల సంపుటి "మెలకువసందర్భం"
పుస్తకం మీద ఆంధ్ర జ్యోతి లో  ఆదివారం వచ్చిన రివ్యూ

http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2011/nov/20/sunday/newbooks&more=2011/nov/20/sunday/sundaymain

Wednesday, November 16, 2011

మా ట్రిప్ సూపర్ సక్సెస్


రచయిత్రులు,జర్నలిస్టులు,ఉపాధ్యాయులు,వ్యక్తులు...
మొత్తం 25 మంది నాలుగు రోజులపాటు సాహితీ యాత్ర చేసి వచ్చాం.


పూర్తి రిపోర్ట్ త్వరలోనే.

Tuesday, November 8, 2011

భూమిక ఆధ్వర్యంలో నాలుగోసారి సాహితీ యాత్ర

భూమిక ఈ సారి నిర్వహిస్తున్న సాహితీ యాత్ర కర్నూల్ జిల్లా, నల్లమల ఫారెష్ట్ కడలివనం లోని అక్క మహాదేవి గుహలు,మల్లెల ద్వీపం.
10 న బయలుదేరి పున్నమి రాత్రిని అహోబిలంలో గడపాలని ప్లాన్ చేసాం.
అన్నీ తిరిగి,చూసి 13 సాయంత్రానికి తిరిగి వస్తాం.
ఈ యాత్రలో రచయిత్రులు,జర్నలిస్ట్లులు,యాక్టివిస్టులు  ఉన్నారు.

Monday, November 7, 2011

షర్మిలా ఇరామ్‌ ఉపవాస దీక్షకు పదకొండేళ్ళు


షర్మిల
విడుదలైనప్పటి ఫోటో
ఆ ఒక్క రోజే ముక్కులో ట్యూబ్ ఉండదు

నిరసన శిబిరంలో

సెప్టెంబర్‌ 23న జర్నలిస్ట్‌ జ్యోతి పున్వాని నుండి వచ్చిన ఒక ఇమెయిల్‌ నన్ను తీవ్రమైన దు:ఖానికి గురి చేసింది. ఆ ఇమెయిల్‌ సారాంశం ఏమిటంటే గత పదకొండేళ్ళ సంవత్సరాలుగా ఇంఫాల్‌లో నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, చాలా ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు పొడసూపుతున్నాయని, దీర్షకాలంగా నిరాహారంగా ఉండడమే దీనికి కారణమని డాక్షర్లు అంటున్నారని, షర్మిల కోసం నా అణువణువూ దు:ఖంతో నిండిపోయింది. ఎవరీ షర్మిలా? ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఆమె కోసం మనసెందుకు ఇంత ఆరాటపడుతోంది? కళ్ళలోంచి జలాజలా కన్నీళ్ళెందుకు ఉబికి వస్తున్నాయి?
షర్మిలా ఇరామ్‌ పేరు తలుచుకుంటేనే ఒక ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. ఆమెను చూడగలిగితే...ఇంకెంత సంతోషం కలుగుతుంది. నిలువెత్తు త్యాగం, నిర్ధుష్టమైన ఆచరణ ఆమెను ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. పది సంవత్సరాలుగా నోటి ద్వారా ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా మణిపూరి ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఇరామ్‌ జీవితం ఎంతో ఆదర్శపూరితమైంది.
 నేను 2009 మార్చిలో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్ట్‌ల సమావేశంలో పాల్గొనడానికి  మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ వెళ్ళాను. మార్చి 7 వ తేదీన సాహసనారి షర్మిలాను ప్రత్యక్షంగా చూశాను.
 ఆమెతో కలిసి నడిచాను. జైలు నుండి విడుదలైన వెంటనే ఆమె తిరిగి నిరాహారదీక్షలో కూర్చున్నపుడు ఆమెతో పాటు శిబిరంలో కూర్చున్నాను. ఆ రోజు ఆమె వజ్ర సంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. షర్మిలా ఆరోగ్యం బాగా లేదని వస్తున్న వార్తలు అందుకే నాకింత దు:ఖాన్ని కల్గిస్తున్నాయి.
 షర్మిలా సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతా దళాల చేతుల్లో హత్యలకు, అత్యాచచారాలకు బలయ్యే స్త్రీల కన్నీటి కథనాలు వింటుండేది. శాంతి యాత్రల్లో పాల్గోనేది. 2000, నవంబర్‌ 2న 'మాలోమ్‌' అనే ప్టటణంలోని బస్టాండులో అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధులు పదిమంది సాధారణ పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిలా తీవ్రంగా చలించిపోయింది. 'మాలోమ్‌' పట్టణం ఇంఫాల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటన జరగానికి ముందే షర్మిలా శాంతి యాత్ర నిర్వహణ కోసం 'మాలోమ్‌'కి వచ్చింది. తాను అక్కడ ఉన్నపుడే జరిగిన ఈ దారుణ సంఘటన ఆమెను కుదిపేసింది. శాంతి ర్యాలీ ఆలోచన విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకు పూనుకోవాలని షర్మిలా నిర్ణయించుకుంది. మణిపూర్‌లో భద్రతా దళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన ''ఆర్మ్‌డ్‌ పొర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ ఆక్ట్‌ 1958ని రద్దు చేయాలంటూ అమరణ నిరాహార దీక్షకు దిగాలనే  తీవ్ర నిర్ణయాన్ని తీసుకుని, తల్లితో చెప్పినప్పుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి, కూతురికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతి కఠినమైన నియమం పెట్టింది. తను మొదలు పెట్టిన కార్యంలో విజయం సాధించే వరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టింది తల్లి. అందుకు కూడా షర్మిల ఒప్పుకుని, నవంబరు 4, 2000లో తన అమరణ నిరాహార దీక్ష  ప్రారంభించింది. పది సంవత్సరాలుగా, నేటికీ ఆమె దీక్ష కొనసాగుతోంది. అమరణ దీక్షలో ఉన్న షర్మిలను ఆత్మహత్యా ప్రయత్నం నేరం కింద అరెస్ట్‌ చేసి, బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌ వేసి ద్రవాహారం పంపిస్తూ ఇంఫాల్‌లోని జిఎన్‌ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమెను బంధించారు. ఈ నేరం కింద ఒక్క సంవత్సరం మాత్రమే జైలులో ఉంచే వీలుండడంవల్ల ప్రతి సంవత్సరం ఒక రోజు ఆమెను విడుదల చేసి, ఆమె మళ్ళీ దీక్షలో కూర్చుని ఆహారం ముట్టదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేసి బంధించడం గత పది సంవత్సరాలుగా ఈ తంతును మణిపూర్‌ ప్రభుత్వం నడుపుతోంది. 2009 మార్చి 7వ తేదీన ఆమెను విడుదల చేసినపుడు మేము ఇంఫాల్‌లో ఉండడంవల్ల ఈ అద్భుతమూర్తిని చూడడం, ఆమెతో కొంత సమయం గడపడం జరిగింది. ఆ మరునాడే అంటే మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం రోజున షర్మిలను అరెస్ట్‌ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.

బలవంతంగా ముక్కులోకి ట్యూబ్‌ పెట్టి ఆమెకు ద్రవాహారాన్ని ఎక్కిస్తున్నారు.

 ఈ పదకొండేళ్ళ కాలంలో షర్మిల, వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలవలేదు. చూడలేదు. నిరక్షరాస్యురాలైన, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. 'మీరు మీ బిడ్డను చూడడడానికి ఎందుకు వెళ్ళలేదు' అని విలేకరి ఆమెను ప్రశ్నించినపుడు ఆమె ఇచ్చిన సమాధానం 'నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన దృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలచలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు తనను చూడదలుచుకోలేదు' అంది. షర్మిల కూడా మేమందరం శిబిరంలో ఉన్నపుడు తన తల్లి గురించి 'నేను మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంత కాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్ను చూడొద్దన్నాను కదా అని అంటుందేమోననీ భయంతో అమ్మ ఉన్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు
తచ్చాడాను' అని షర్మిల అన్నప్పుడు మా అందరి కళ్ళల్లోను నీళ్ళు తిరిగాయి.

షర్మిల నిరాహార దీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004లో మణిపూర్‌ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమాదేవి అనే మహిళ అత్యాచారానికి, హత్యకు బలైనపుడు మణిపూరి స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకు ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్‌ రైఫిల్స్‌ హెడ్‌ క్యార్టర్స్‌ ముందు నగ్నంగా నిలబడి 'భారత సైనికులారా మమ్మల్నీ రేప్‌ చేయండి.' అంటూ  మణిపూర్‌ తల్లులు నిర్వహించిన నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెర పరిచింది.భద్రతాదళాల ఆగడాలు, అత్యాచారాలు ఏ తీరులో సాగుతున్నాయో, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో యావత్‌ ప్రపంచానికి తెలియచెప్పింది ఈ నగ్న ప్రదర్శన.


 ఒక ఇంటర్వ్యూలో బిబిసితో మాట్లాడుతూ 'మణిపురి ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతి కోసం' అంటూ ప్రకటించిన నలభై ఏళ్ళయినా నిండని బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారత దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరు సల్పుతుంది. తన ప్రాణాలను తృణప్రాయంగా తన ప్రజల కోసం వదిలేయడానికి సిద్ధపడిన షర్మిల జీవితం ఇప్పుడు అత్యంత ప్రమాదపుటంచులకు చేరింది. దిన దినమూ క్షీణిస్తోందని అక్కడి నుండి వస్తున్న వార్తలు చెబుతున్నాయి. బక్క చిక్కిన ఈ బలహీన ప్రాణం గురించి భారత ప్రభుత్వం విచారిస్తున్న దాఖలాలుగానీ, ఆమె కోరుతున్నట్లుగా ఎఎఫ్‌ఎస్‌పిఏ   చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నంగానీ కనుచూపు మేరలో కనపడ్డం లేదు. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని గుండె గుబగుబలాడుతోంది. షర్మిలా కోసం గట్లు తెంచుకుంటూ దు:ఖం ఉబికివస్తోంది.

Tuesday, November 1, 2011

పి సి పి ఎన్ డి టి చట్టం మీద ఒక రోజు మీటింగ్ ( ఆడపిండాల హత్యలకు వ్యతిరేకంగా )

 
 
 Dear Friends,

Greetings from Bhumika Women's Collective!

We would like to inivite you all for a One Day State Level Consultation on "Pre-Conception & Pre-Natal Diagnostic Techniques Prohibition of Sex Selection" (PC PNDT) Act on November 5th 2011 at Minerva Grand, RP Road, Secunderabad from 10:00 am - 4:00 pm.

Kindly confirm your participation along with the number by today (November 1st 2011).

Look forward to meet you all.

Regards,

K. Satyavathi
Chief Functionary
Bhumika Women's Collective
Mob: 9618771565


తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...