నా పోష్ట్ కి స్పందించిన మీ అందరికి ధన్యవాదాలు.
మల్లాది సుబ్బమ్మ గారి గురించి ఇన్నయ్య గారు రాసిన కామెంట్ అక్షర సత్యం.
నేను కూడా ఆవిడతో కలిసి పని చేసాను.
ఆవిడ ప్రారంభించిన అభ్యుదయ వివాహ వేదిక లో తొలి పెళ్ళి నాదే.ఉదయం రిజిస్టర్ చేసుకుని సాయంత్రం వారింట తేనీటి విందు పార్టీ జరిగింది.ఆనాటి మీటింగ్ లో సుబ్బమ్మ గారు,లవణం గారు,ముఖ్య పాత్ర పోషించారు.ఇది 1981 లో సెప్టెంబర్ 5 న జరిగింది.నేనంటే ఆవిడకు చాలా అభిమానం.
మా అమ్మాయి అంటూ,ఈమె పెళ్ళి నేనే చేసాను అని అందరికి చెప్పేవారు.స్పారో అనే సంస్థ కోసం నేను ఆవిడను ఒక రోజంతా ఇంటర్వ్యూ చేసాను.
ఆవిడ వ్యక్తిత్వం ఉన్నతమైంది.
సుబ్బమ్మ గారితో ఉన్న అనుబంధం వల్లనే ఆమెను అలా చూసి తట్టుకోలేక రాసాను.
తన వయస్సు 86.వయస్సు సంబంధ అనారోగ్యమే.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
1 comment:
1986 ప్రాంతంలో జమాతే ఇస్లామీ హింద్ వారు గీటురాయి పత్రిక తరుపున ఒక సమావేశం హైదరాబాదులో ఏర్పాటు చేశారు.దానికి నేనూ వెళ్ళాను.అందులో మాలతీచందూర్,మల్లాది సుబ్బమ్మ పాల్గొన్నారు.సుబ్బమ్మగారు "ఈ సభలో అందరూ పురుషులే కనిపిస్తున్నారు,ఆడవాళ్ళేరి?"అని ప్రశ్నించారు."అమ్మా వాళ్ళంతా పై అంతస్తులో కనబడుతున్న బాల్కనీలో ఉన్నారు చూడండి"అని నిర్వాహకులు బదులిచ్చారు."అయితే ఆ పరదా తీసెయ్యండి,లేదా పురుషులతోపాటు సమానంగా అందరి ఎదుటా కూర్చోబెట్టండి".అన్నారామె.అబ్బాదుల్లా గారు పూలదండ చేతికి ఇవ్వబోతే "అలాకాదు మగాళ్లతో పాటు నాకు కూడా మెడలోనే వెయ్యండి" అని చెప్పిమరీ వేయించుకున్నారు.
తాను మహిళలపై వ్రాసి ఒక మంత్రిగారికి బహూకరించిన పుస్తకం నాకు ఆబిడ్స్ ఫుట్ పాత్ మీద కనబడితే కొన్నాను.సంగతి సుబ్బమ్మ గారికి ఫోన్ చేసి చెబితే నా పుస్తకం చివరికి దానివిలువ తెలిసిన వారి దగ్గరకే చేరింది"అని బదులిచ్చారు.
Post a Comment