
యమ చురుకుగా, కన్నైనా మూయకుండా కదలాడుతుండే చేపలు నాకెప్పుడూ గొప్ప స్పూర్తే.అబ్బో ఎన్ని రకాల చేపలు.
ఆ చైతన్యం చూస్తే ముచ్చటేస్తుంది.
చేపల మార్కెట్ బహుశా చాలా మందికి ఇష్టముండదనుకుంటా.
నాకు మాత్రం మహా ఇష్టం.
ఏ వి ఎన్ కాలేజి ఫంక్ష లో భూమిక ఎడిటర్ గా,"అంకితం" కధల సంకలనం గౌరవ ఎడిటర్ గా చక్కటి సాహితీ కార్యక్రమం లో పాల్గొన్నాను

మర్నాడు ఉదయమే తెన్నేటి పార్కులో సూర్యోదయ దర్శనం,హార్మని సందర్శనం,రాంబాబు తీసిచ్చిన నీరా సేవనం, ఆ జోష్ లో చేపల రేవులో దిగాం.
మగవాళ్ళు రకరకాల చేపలు తెస్తున్నారు.
ఆడవాళ్ళు వాటిని కొంటున్నారు.
గోలగోలగా పూర్తిగా చేపల మార్కెట్ లాగానే ఉంది.
నాకు ఆ చేపల్ని చూస్తే ముచ్చటేసింది.
ఎన్ని వెరైటీలు.
సావడాయలు,ఇసక దొందులు,కానా గంతలు,మాఘలు ఇంకా ఎన్నో పేర్లు.
నేను నాలుగు రకాలు కొనేసి కార్లో పడేసుకున్నాను.
పరదేశి అమ్మ నాతో ఫోటో కు సై అంది.
నాతో నా ప్రియ మిత్రులు జయ,గీత పాల్గొన్నారు.
4 comments:
ఏంటండీ (బ్రహ్మ కమలం, పొగడ) పువ్వులమీంచి ఒకేసారి చేపల వైపు వచ్చేశారు.
నాకూ మీలాగే చేపల్ని చూడ్డమంటే భలే ఇష్టం. బాగున్నాయి మీ చేపలు.
గీతిక
ఏమోనమ్మా, నాకు మాత్రం ఆ చేపలు అలా కొస ప్రాణంతో గిల గిల లాడుతుంటే చూడ్డానికే ప్రాణం పోయినంత పనవుతుంది.
/నేను నాలుగు రకాలు కొనేసి కార్లో పడేసుకున్నాను./
అబ్బెబ్బెబ్బె కారంతా చేపల కంపు కొట్టదాండీ? మీ కారు కొత్తదైనా మార్కెట్ వాల్యూ ఏడాదికి 25% డిప్రిషిఏషన్ అవుతుంది. :P
జీవితమన్నాకా పూలూ ఉండాలా
సముద్రపు గాలీ ఉండాలా
సేను మీద వాలిన సీతాకోక సిలుకా ఉండాలా
కెరటాల మీద ఎగిరిపడే కొవ్వాసు పిల్లా ఉండాలా
మావ్ సూడండి ఎన్నెన్ని పనులు సేసేసామో!!!
ముందు రోజు మేధావి జలతారు ముసుగు
తెల్లారుఝాములో తొలిపొద్దుతో కేరింతలు
తెలతెలవారే వేళ భీమిలిలో నీరా సేవ
తెల్లారాకా చేపల రేవులో పరదేశి అమ్మతో చిందులు
థిస్ ఈజ్ లైఫ్
వైవిధ్యం,ఆటవిడుపు,అల్లరి,ఆరాం కి జిందగి
ఆత్మీయులతో హాయైన అనుభవాల పల్లకి.
పని చేసినపుడు పనే
మీటింగ్ లో గాంభీర్యమే
సవా లక్ష పనులు చేస్తున్నప్పుడు
సరదాగా ఓ రోజైనా ఇలా బలాదూర్ గా గడిపెయ్యడం
నా దృష్టిలో మోష్ట్ డిసైరబుల్
Post a Comment