Sunday, December 5, 2010

ఒక్క రోజు డిల్లీ లో దుకాణం తెరిచిన భూమిక
నిజమండి.నవంబర్ 28 న ఢిల్లీ లోని వసంత్ కుంజ్
ప్రాంతంలోని ఒక ఫాం హౌస్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో భూమిక పాల్గొంది.
భూమిక అంటే సినిమా నటి అనుకునేరు.
కాదండీ భూమిక పత్రిక,భూమిక హెల్ప్ లైన్ అన్నమాట.
డెవలప్మెంట్ మార్కెట్ పేరుతో ఆక్స్ ఫాం ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ లో మేము దుకాణం తెరిచాము.
జెండర్ సెన్సిటివిటి,జెండర్ వైలెన్స్ మీద అవగాహన కల్పించే పని మాది.
100 దేశాల నుంచి 300 మంది విదేశీ యువత ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.
భూమిక చేసే పని గురించి,మహిళల మీద హింస తగ్గించడంలోను,కుటుంబ హింసకు గురయ్యే మహిళలకు హెల్ప్ లైన్ ఎలా తోడ్పడుతోంది,మేము ఏ విధంగా పని చేస్తాము లాంటి విషయాలు మా స్తాల్ సందర్శకులకు వివరిచాలి.
నాతో పాటు నా ఫ్రెండ్ ఉత్పల,మా రిసెర్చ్ అసోసియేట్ ముజీబా పాల్గొన్నారు.
ఉదయం నుంచి సాయంత్రందాకా సాగిన ఈ ప్రోగ్రాం లో మా స్టాల్ కి మంచి స్పందన లభించింది.
లేపాక్షి నుంచి మన హాండీ క్రాఫ్ట్స్ కొనుక్కెళ్ళి మా స్టాల్ల్ ని ఆకర్షణీయంగా అలంకరిచాము.
నేను గౌహతి లో కొనుక్కున్న బుల్లి కేన్ సోఫా సెట్, బుల్లి బుల్లి మోడాలు,చిన్ని టీ సెట్,సోఫాలో కూర్చున్న రక రకాల రంగుల్లో పిట్టలు,బొంగరాలు,మోటర్ సైకిల్,బండ్లు,కీ చైన్స్ ఇలా రక రకాల బొమ్మలతో డెకరేట్ చేసాం.పిల్లలు వెల్లువలా మా  స్టాల్కి వచ్చారు.
మేము చేసే పని గురించి అడుగుతూ వాళ్ళు చేసే పని గురించి మాకు చెప్పారు.
చాలామంది చాలా రకాల స్టల్స్ పెట్టారు.
అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. రాజస్తాన్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరిచాయి.
వచ్చిన విదేసీ యువత ఎంతో ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉన్నారు.
అందరూ చేతులు చాపి మెహిందీ పెట్టించుకోవడానికి ఎగబడ్డారు.
నాకు ఎంతోఆశ్చర్యం  కలిగించిన అంశం ఏమిటంటే వచ్చిన యూత్ లో కనీసం ఆరుగురు వీల్ చైర్ లో వచ్చారు.
ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు నడవలేకపోయినా.
డిల్లీ లో దుకాణం తెరవడం,అదీ యువత తో మాటా మంతీ కలపడం,పరస్పరం అనుభవాలను
కలబోసుకోవడం అద్భుతమైన అనుభవం.
100 దేశాలకు భూమిక పని గురించి తెలియడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది
మేము అలంకరిచిన బొమ్మలు అమ్మమని చాలా మంది అడిగారు.
మేము ఒకటే సెట్ తీసుకెళ్ళాం.
చూపిద్దామనుకున్నాం కానీ అమ్మొచ్చనుకోలేదు.
అయితే నాలుగు గంటలకి మళ్ళీ అందరూ వచ్చి బొమ్మలు అమ్మామని అడిగారు.
మంచి ధరకి బొమ్మల్ని అమ్మేసాం.
నా కేన్ సోఫా సెట్ మీద చాలా మంది కన్నేయడంతో నేను దాన్ని తీసేసి దాచేసుకున్నాను.చివరలో మిగిలినవన్నీ సర్దుకున్నాం గానీ నేను మా సీతారాంపురం నుంచి ప్రేమగా తెచ్చుకున్న లేస్ టేబుల్ క్లాత్ మర్చిపోయాం..

1 comment:

సమూహము said...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...