Wednesday, December 8, 2010

మృత్యువుతో సైతం పోరాడుతున్న మల్లాది సుబ్బమ్మ


మల్లాది సుబ్బమ్మ గారికి బాగా లేదని తను వెళ్ళి చూసి వచ్చానని అబ్బూరి చాయా దేవి గారు చెప్పారు.వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను.
నేను వెళ్ళేసరికి రాత్రి ఎనిమిదవుతోంది.ఆవిడ ఒక్కరూ మంచం మీద అపస్మారక స్థితి లో కనిపించారు.ఆవిడ దగ్గర ఎరూ లేరు.రెండు చేతులూ మంచానికి కట్టేసి ఉన్నాయి.సుబ్బమ్మ గారూ నేను భూమిక సత్యవతి అండి ఎలా ఉన్నారు.
అంటే ఆవిడ కళ్ళు తెరిచారు.ఓ క్షణం నావేపు చూసారు.వెంటనే కళ్ళు మూతలు పడిపోయాయి.
నర్సింగ్ ష్టేషన్ కి వెళ్ళి సుబ్బమ్మ గారి అటెండెంట్ ఎక్కడున్నారు అని అడిగితే ఎవ్వరూ లేరు ఇంటికెళ్ళిపోయారు.మేమే చూసుకోవాలి అన్నరు నర్సులు.
నాకు గుండెల్లో కలుక్కుమంది.
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

జీవితమంతా తనకు తోచినట్టు మహిళల కోసం పోరాటం చేసిన సుబ్బమ్మ గారు,ఎప్పుడూ జనం మధ్యలో గడ గడా మాట్లాదే సుబ్బమ్మ గారు అల ఏకాకిలాగా మంచం మీద పడి ఉండడం,దగ్గర ఎవ్వరూ లేకపోవడం నాకు చాలా బాధ అనిపించిని.ఎన్నో ఉద్యమాల్లొ పాల్గొన్న మల్లాది సుబ్బమ్మ,ఎన్నో సంస్థలను స్త్రీల కోసం నడిపిన మల్లాది సుబ్బమ్మ మృత్యువుతో సైతం పోరాడుతోందా అనిపించింది నాకు.

17 comments:

lalithag said...

బాధేసింది చదువుతుంటే.

ఆత్రేయ said...

భాదాకరమైన విషయం. త్వరగా ఆవిడకి అనారోగ్యం నుంచో ... లేక భాధాకర జీవితం నుంచో విముక్తి కలగాలని కోరుకుంటున్నా..
ఆవిడ చేతులు మంచానికి ఎందుకు కట్టబడ్డాయి?

మాలా కుమార్ said...

అయ్యో .

KumarN said...

చాలా బాధాకరం అండీ. ఊరికే మాటలు కాకుండా, ఇంత దూరం నుంచి నేనేమయినా చేయగలనా? చెప్పండి ప్లీజ్.
KumarN

P S Prakash said...

చాలా భాదా కరమైన విషయం

సుజాత వేల్పూరి said...

సత్యవతి గారూ, అయ్యో అనుకోడం కాకుండా ప్రాక్టికల్ గా ఏం చేద్దాం, చెప్పండి? ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉన్నారు? వివరాలు ఇవ్వండి? చేతనైనంత వరకూ ఏదో ఒకటి చేద్దాం!

VENKATA SUBA RAO KAVURI said...

సారాయి లేని సమాజం కోసం
సత్య సమాజం కోసం
మహిళా సాధికారత కోసం
తనదైన శైలిలో నడచిన
సుబ్బమ్మమ్మ మళ్లీ మన మధ్య తిరుగాడాలని ఆకాక్షిస్తూ....
వెంకట సుబ్బారావు కావూరి
తెలుగిల్లు

గోదారి సుధీర said...

అసలేం బాలేదు ,ఇప్పుడెలా ఉన్నారు

గోదారి సుధీర said...

ఏం అనారోగ్యమండి ,ఇప్పుడెలా ఉన్నారు

innaiah said...

I know Malladi Subbamma since 1960 when I met her in Bapatla along with Malladi Ramamurthy. She travelled beyond orthodox traditional family and studied modern education to obtain B.A. Then she jumped into the field and worked relentlessly in Humanist, Rationalist movements. Then she fought for abolition alchohol sales to save downtrodden.
Myself and Malladi Subbamma participated innumerable study camps , meetings of Radical Humanist, Rationalist organizations.
She travelled Europe and USA.
The edited Telugu journals and then with the help of Mr Malladi Ramamurthy published many writings for the upliftment of women.She fought fanatic religious ideas to save women in Muslim society and Hindu community.She became orator in Telugu. Press paid atention to her.
She is a great host for outstanding humanists who visited her house. She conducted several intercaste, inter religious marriages.
Great humanist who sacrificed her life for rational thinking.

cbrao said...

మల్లాది సుబ్బమ్మ, రామ్మూర్తి గారు కలిసి నడిపిన వికాసం మాసపత్రికకు కొన్ని వ్యాసాలు/కధలు వ్రాశాను గతంలో. సుబ్బమ్మ గారు స్త్రీల సమస్యలపై ఎడతెగని పోరాటం జరిపారు. ఎన్నో వర్ణాంతర వివాహాలు జరిపించారు. ప్రజాహితం కోరి ఒక ట్రస్ట్‌ను స్థాపించారు. జీవిత చరమాంకం లో ఇలా మంచాన పడటం బాధాకరం. వారు కోలుకుంటారని ఆశిస్తాను.

cbrao said...
This comment has been removed by the author.
శరత్ కాలమ్ said...

మల్లాది సుబ్బమ్మ గారిని ఒకసారి విజయవాడ నాస్తిక కేంద్రం శిక్షణా తరగతుల్లో కలిసి మాట్లాడాను. అప్పట్లో నేను నాస్తికకేంద్రంలోనే వుంటుండేవాడిని.

ఆ వీరనారి ప్రస్తుత పరిస్థితి చూస్తే జాలేస్తోంది.

సుజాత గారు. మీ సహాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించబోతున్నారు. శభాశ్.

సత్యవతి said...

చెప్పాల్నుకున్నది గట్టిగా గొంతెత్తి చెప్తారు సుబ్బమ్మగారు.ఆమె కోసం ఒకసారి ఇక్కడ విజయవాడలో వరకట్న వేధింపుల పైన ఒక సెమినార్ ఏర్పాటు చేసిపెట్టాను నేను అప్పుడు బాగా పరిచయం. తన పేరుమీద ఆవి్డ నాకొక అవార్డుకూడా ఇచ్చారు.విజయవాడ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసేవారు.చాలామందికి స్ఫూర్తి ఆవిడ ..

karlapalem Hanumantha Rao said...

మల్లాది సుబ్బమ్మ గారిని గురించి చదవడం ఒక ఎత్తయితే ...ఆమెను ప్రత్యక్షంగా చూడటం ఇంకో ఎత్తు.నాకూ రెండు కూడా అనుభవమే.బాపట్లలో మేము కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ఇంట్లో అద్దెకుండే వాళ్ళం .ఒకటి రెండు సార్లు నేను సుబ్బమ్మ గారిని మీటింగుల్లో చూసి విని వున్నాను కూడా.సారా వుద్యమం సందర్భం లో మల్లాది సుబ్బ్బమ్మ గారి పేరు మాములు జనాలకు కూడా బాగా పరిచయం అయింది.ఏ రాజకీయస్పృహ లేని మా అమ్మలాంటి వాళ్ళకు కూడా సుబ్బమ్మగారు ఒక ఉత్తేజకరమయిన ప్రస్తావన గా వుండటం నేను గమనించాను. జీవితం మొత్తం పోరాట మార్గాన్నే ఎంచుకొన్న మల్లాది సుబ్బమ్మ గారు చివరికి చివరి క్షణాలతో కూడా ఇలా పోరాడవలసి రావడం ఆమె అభిమానులమయిన మా బోటి వారికి ఎంతో బాధ కలిగించే విషయం.

Anonymous said...

మల్లాది సుబ్బగారితో నేను ప్రత్యక్షంగా మాట్లాడినది 1993 లో మదురై (తమిళనాడు) లో ! అప్పట్లో అక్కడ తెలుగు డిపార్టుమెంటులో స్త్రీవాద సాహిత్యం మీద జఱిగిన సెమినార్ లో పాల్గొనడానికి ఆవిడ వచ్చారు. ఆ సందర్భంగా ఆవిడ ఉంటున్న అతిథిగృహం (Guest House) గదికి నేను వెళ్ళాను. అప్పుడావిడ కొన్ని పుస్తకాలు నాకు బహూకరించారు. ఫెమినిస్టుగా ఫైర్‌బ్రాండ్ అని పేరుమోసిన సుబ్బమ్మగారు వ్యక్తిగత జీవితంలో సౌమ్యురాలు, శాంతమూర్తి అని చెప్పగలను.

Anonymous said...

నా యొక్క పై వ్యాఖ్యలో మొదటి పదాల్ని మల్లాది సుబ్బమ్మగారు అని సవరించుకొని చదవవలసినదిగా ప్రార్థన. సదరు అప్రతర్కిత స్ఖాలిత్యానికి చింతిస్తున్నాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...