Friday, October 19, 2012
Monday, October 15, 2012
స్త్రీవాదం – స్త్రీల సాహిత్య అవగాహన
రెండు దశాబ్దాల (1990-2010) తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం లో (27,28,29 జనవరి, 2012) సమర్పించిన అవగాహనా పత్రం
కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, ఘంటశాల నిర్మల, మందరపు హైమావతి, శిలాలోలిత, విమల, మహెజబీన్, జయప్రభ, షాజహాన్ లాంటి ఎందరో కవయిత్రులు అద్భుతమైన స్త్రీవాద కవితలు రాసారు. ఇంటి చాకిరీ గురించి, మాతృత్వం గురించి, పెళ్ళి గురించి, భార్యాభర్తల సంబంధంలోని అసమానత గురించి కుటుంబ సంబంధంలోని అసమానత గురించి కుటంబాల్లోని సవాలక్ష వివక్షల గురించి అనన్య సామాన్యమైన కవితలొచ్చాయి.
ముఖ్యంగా కొండేపూడి నిర్మల మాతృత్వ వేదన గురించి ”రైలు పట్టాల మీద నాణెం విస్తరించినంత వేదన’ గా చెప్పడం, విమల వంటిళ్ళలోని చాకిరీ గురించి రాయడం, ఏ కాల్ గాళ్స్ మోనోలాగ్‌్‌గా వ్యభిచారం కూపంలోని స్త్రీ ఆత్మఘోషని ఘంటశాల నిర్మల అద్భుతంగా ఆవిష్కరించడం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
స్త్రీ అంటే శరీరంగా మాత్రమే చూసే పితృస్వామ్య సంస్కృతిని ధిక్కరిస్తూ, తిరుగుబాటు బావుటా నెగరేస్తూ ఎనభయ్యవ దశకంలో స్త్రీవాద కవయిత్రులు స్త్రీలను అణిచివుంచే, అధికారం చలాయించే పురుషాధిక్య భావజాలాన్ని తిరస్కరిస్తూ గొప్ప కవిత్వం రాసారు. ఇంకా రాస్తూనే వున్నారు. ఒక దశలో వరద గోదారిలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తిన స్త్రీవాద కవిత్వం ఉధృతి తగ్గి, కుదురుకుని నిదానంగా నలుదిక్కులా పారుతూ కథల్లోకి, నవలల్లోకి, వ్యాసాల్లోకి ప్రవహించింది. స్త్రీవాదం అన్ని సాహిత్య ప్రక్రియల్లోకి విస్తరించింది.
ఏ ఉద్యమమైనా ఉధృతంగానే మొదలౌతుంది. ఆ ఒరవడిలో చెత్త్తంతా కడిగేస్తుంది. ఉధృతి తగ్గినపుడు కూడా తన ఉనికిని కోల్పోకుండా నిదానంగా ప్రవహిస్తూనే వుంటుంది. స్త్రీవాదం కూడా దీనికి మినహాయింపు కాదు. ఎనభైలలో కవిత్వరూపంలో ఉరకలెత్తిన స్త్రీవాదం తొంభైల నాటికి కథలోకి ప్రవహించింది.
1990 దశకం నాటికి తెలుగు సమాజంలో అనేక మార్పులు సంభవించాయి. ఎనభైలలో పితృస్వామ్యాన్ని, పురుషాధిపత్యాన్ని సవాల్ చేస్తూ వచ్చిన కవిత్వం వచ్చేనాటికి, తొంభైలలోని నూతన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణల నేపథ్యం లేదు. స్త్రీల శరీరాల చుట్టూ, అణిచివేతల చుట్టూ, ఆడపిల్లలుగా పుట్టి స్త్రీలుగా తయారుచేయబడే క్రమం చుట్టూ, కుటుంబాల్లోని అసమ సంబంధాల చుట్టూ కుటుంబహింస చుట్టూ అల్లుకున్న కవిత్వం ఎనభైలలో వస్తే…. తొంభైల నాటికి ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. మారిపోవడమంటే స్త్రీల సమస్యలన్నీ తీరిపోయాయని అర్థం కాదు. వీటికి తోడు మరిన్ని సమస్యలు ప్రపంచీకరణ పేరుతో మనల్ని చుట్టుముట్టాయి. కుటుంబ హింసకి తోడు, బహిరంగ హింస, పనిచేసే చోట హింస, చదువుకుని సంపాదిస్తూ కూడా తప్పని ఇంటిపని, వంటపని, పిల్లల పని స్త్రీలను పీల్చివేస్తున్న దుర్భర పరిస్థితులు తయారయ్యాయి.
అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంశం, వ్యవసాయ విధ్వంశం, కుదేలైన చేనేత రంగం, చేతి వృత్తుల సర్వనాశనంతో పల్లెలు వదిలి పట్టణాల దారి పడుతూ విపరీతమైన హింసకు గురౌతున్న గ్రామీణ జనాభా. ‘అభివృద్ధి’ ముసుగేసుకున్న బడా ప్రాజెక్టులు, ఎస్‌ఈజెడ్‌లు, కోస్టల్ కారిడార్ పేరుతో మత్స్యకారుల్ని, మత్స్య సంపదను ధ్వంశం చేస్తున్న వైనాలు తొంభైల నుండి 2010 వరకు నడుస్తున్న విధ్వంశ రూపాలు.
తెలుగు సమాజంపై పెనుసవాల్ విసిరిన ప్రపంచీకరణ విధ్వంశాన్ని రచయిత్రులు కథలుగా మలచడంలో సఫలమయ్యారు. గ్లోబలైజేషన్ నేపథ్యంతో అనేక వందల కథలు తెలుగులో వెలువడ్డాయి. పి. సత్యవతి, కుప్పిలి పద్మ, నల్లూరి రుక్మిణి, ఓల్గా, కొండవీటి సత్యవతి, వి. ప్రతిమ, పాటిబండ్ల రజని, చంద్రలత, కె. వరలక్ష్మి, ఎస్. జయ, మల్లీశ్వరి లాంటి కథకులు ఎన్నో అద్భుతమైన కథలు రాసారు. వీరిలో కొందరి సాహిత్యం గురించి ఇదే సమావేశంలో పత్ర సమర్పణలున్నాయి కాబట్టి నేను లోతుల్లోకి పోవడం లేదు.
1990-2010 మధ్య కాలంలో వచ్చిన పెనుమార్పు మానవ సంబంధాల విధ్వంశం. ఐటి రంగానికిచ్చిన అధిక ప్రాధాన్యత వల్ల సామాజిక శాస్త్రాలు వెనుకబడి, చరిత్రపట్ల, సమాజం పట్ల, తోటి మనిషి పట్ల బాధ్యత లేనితనం పెరిగి మనిషి అంతరంగంలో ఏకాకిగా మారిపోయాడు. మనసు నిండా కమ్ముకున్న డొల్లతనాన్ని నింపుకోవడానికి వస్తు సముదాయంమీద పడేలా పెద్ద పెద్ద మాల్స్ విజృంభణతో వస్తు వినిమయ సంస్కృతి పెరగడం అనేది చివరికి స్త్రీలమీద హింసగా పరిణమించి, వస్తువుల కోసం స్త్రీలను హింసించడం ఎక్కువైంది. కట్నాలకు తోడు నానా రకాల వస్తువులు కావాలనే గొంతెమ్మ కోర్కెలు పెరిగిపోయాయి.
భారతీయ సమాజం ప్రత్యేకత ఏమిటంటే అది దేనినీ తెగ్గొట్టుకోదు. ఆటవిక సమాజంలోని ఆచారాలు మధ్యయుగంలోకి, మధ్యయుగాల నాటి అవకతవకల్ని ఆధునిక సమాజంలోకి చాలా తేలికగా మోసుకొచ్చేస్తాం. రాముణ్ణి దేవుడిగా కొలుస్తూనే, ఏకపత్నీ వ్రతుడని పొగుడుతూనే బహుభార్యాత్వాన్ని హాయిగా కొనసాగిస్తాం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్నీళ్ళకి కరిగి నీరౌతూనే మన కూతుళ్ళకి మాత్రం బాల్యవివాహమే చేస్తాం. స్త్రీలు చదువుకోవాలి అంటూ వేదికలెక్కి కేకవేసి మన ఆడపిల్లని మాత్రం ఇంట్లోనే కూర్చోబెడతాం. దేవతల్ని తలకెత్తుకుని, తిలకాలు దిద్దుకుని కొలుస్తాం గానీ కన్నతల్లిని, కట్టుకున్న భార్యని నానా హింసలూ పెడతాం. మాతృమూర్తి అంటూనే నిండు గర్భిణిని సైతం కడుపు మీద తన్నే సంస్కృతి మనది. భారతీయ సంస్కృతి, స్త్రీలని హింసించే సంస్కృతి దీనిలో భాగమే. స్త్రీల కట్టు, బొట్టు, నడక, నడత, మాట, ఆలోచన, ఆచరణ, అంతరంగం అన్నింటినీ నియంత్రించే, అదుపుచేసే పితృస్వామ్య సంస్కృతి, భారతీయ సంస్కృతిలో మిళితమై పోయివుంది. దీనిని విడదీసి చూడాల్సిన అవసరం చాలావుంది. లేకపోతే మనం కూడా అతివాద మతోన్మాద సంస్కృతికి బలైపోయే ప్రమాదం వుంది. ఇప్పటికే మన మాటమీద, ఆలోచనమీద, రచనమీద, వేషధారణమీద విపరీతమైన పోలీసింగ్ వుంది. మంగుళూరు పబ్‌లో జరిగిన దాడులు, మీరానాయర్ వాటర్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన గొడవలు – ఎన్నెన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. మన కలాలకు కళ్ళెం వేసే సంస్కృతి పెరిగిపోయింది. తస్మాత్ జాగ్రత్త…
ఈ రోజు మనముందున్న పెనుసవాళ్ళు రెండు. ఒకటి ప్రపంచీకరణ పురికొల్పుతున్న అభివృద్ధి నమూనా, రెండోది అతివాద మతోన్మాధ ధోరణి. మొదటిది మొత్తం పేద ప్రజలని పిజ్జాలుగా, బర్గర్లుగా వార్చుకుని మింగేయడం, అభివృద్ధి పేరిట కడతాయని భ్రమింపచేసే ప్రాజెక్టులు, స్పెషల్ ఎకనామిక్ జోనులు కుమ్మరిస్తున్న కనకరాసులలో హఠాత్తుగా ధనవంతులౌతున్న వాళ్ళు ప్రదర్శిస్తున్న వల్గారిటీ ఆఫ్ వెల్త్ – పోగుపడుతున్న సంపద వికృత రూపం. (-దుబాయ్ లాంటి ప్రాంతాలు) మరో పక్క పేద ప్రజల్ని ఆత్మగౌరవం లేనివాళ్ళుగా తయారుచేస్తూ కుప్పలు తెప్పలుగా వస్తున్న ప్రభుత్వ పథకాలు. వీటన్నింటిని విశ్లేషణాత్మకంగా రచనల్లోకి జొప్పించాల్సిన అవసరం చాలా వుంది.
రెండోది అతివాద మతోన్మాదం- అది ఏ మతమైనా కానీయండి దీనిని అడ్డుకోకపోతే దాని కొరడా మొదటగా తాకేది స్త్రీలనే. స్త్రీలు చదువుకోవాలా వద్దా? ఉద్యోగాలు చెయ్యాలా వద్దా? బయట తిరగాలా? వద్దా? ఎలాంటి బట్ట తీసుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఏం రాయాలి ఏం రాయకూడదు? ఏ బొమ్మ గియ్యాలి? ఏ బొమ్మ గీయకూడదు? ఎంతమంది పిల్లల్ని కనాలి? – వీటన్నింటి మీద తీర్పులు చెప్పడానికి ఫర్మానాలు జారీ చేయడానికి తయారయ్యే అతివాద మతోన్మాద ప్రమాదాన్ని మనం తప్పనిసరిగా, జాగురూకతతో అర్థం చేసుకోవాలి. దానికుతంత్రాలను, తీర్మానాలను ఎదుర్కొనే ఆయుధాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఆ దిశగా రచనలు రావాలి.
చివరగా, స్త్రీవాదం పనైపోయింది. నీరస పడిపోయింది అనే విమర్శకు సమాధానం చెప్పి నేను ముగిస్తాను. ఇది వివక్షతో, అక్కసుతో చేసే విమర్శగానే మనం కొట్టిపారేయాలి. నిజానికి తెలుగు నాట ప్రజాస్వామిక పోరాటాలకు అనువైన వాతావరణాన్ని, అస్తిత్వ ఉద్యమాలకు సరైన బాటలేసింది స్త్రీవాదమే. స్త్రీవాదం లోంచి దళితవాదం, మైనారిటీ వాదం, బహుజనుల వాదం బలంగా ముందుకొచ్చాయి. స్త్రీలు స్త్రీవాద దృష్టికోణంతో, మైనారిటీలు తమదైన గొంతుకతో, బహుజనులు తమ తమ ప్రత్యేక కోణాలతో అద్భుతమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్రవేసిన స్త్రీవాదం సాహిత్యంతోనే ఆగిపోయిందనుకోవడం వెర్రితనమే అవుతుంది. స్త్రీవాదం చదువులో పాఠమైంది. పాలనలో చట్టమైంది. అంతర్జాతీయ వొప్పందాల వల్లనేమి, భారతదేశంలో ఎగిసిపడిన స్త్రీల ఉద్యమాల వల్లనేమి స్త్రీవాద రచనల ప్రభావం వల్లనేమి ప్రభుత్వ భాష మారింది. స్త్రీల సహాయం కోసం ఎన్నో సపోర్ట్ సిస్టమ్స్ ఏర్పడ్డాయి. మహిళా కమీషన్, మహిళా కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు – ఇలా ఎన్నో సంస్థలు, వ్యవస్థలు స్త్రీల సహాయార్థం ఏర్పడ్డాయి. పాలనలోకి జండర్ అవగాహన, జండర్ స్పృహ ప్రవేశించాయి. ప్రభుత్వమే స్త్రీల పట్ల ఎలా మెలగాలో తెలిపే జండర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఇదంతా ఒక్క రోజులో, ఆకాశం లోంచి ఊడిపడిన పరిణామం కాదు.
భారత స్త్రీల ఉద్యమంలో స్త్రీవాదం అంతర్లీనంగా ప్రవేసిచడం వల్లనే ఈ రోజు – పవిత్రమైన భారతీయ కుటుంబాల్లో హింసా? అని ప్రశ్నించిన వాళ్ళే – అవును కుటుంబాల్లో తీవ్ర స్థాయిలో హింస జరుగుతోందంటూ ఒప్పుకుని 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని, పని చేసే చోట వేధింపులు వాస్తవమని ఒప్పుకుంటూ చేసిన సెక్సువల్ హరాస్‌మెంట్ బిల్‌ని ప్రభుత్వం తెచ్చింది. ఇవన్నీ స్త్రీల ఉద్యమం సాధించిన విజయాలే. కుళ్ళుతనంతో కాక కళ్ళు విప్పార్చుకుని గమనిస్తే, 1975 చీకటి రోజుల తర్వాత వచ్చిన మార్పులు, ఆ మార్పులకు దోహదం చేసిన స్త్రీవాద ఉద్యమ విశ్వరూపం అర్థమౌతాయి.
అయినా నాకు తెలియక అడుగుతున్నాను. తెలుగు సాహిత్యంలో ఎన్నో వాదాలు వచ్చాయి. ఎంతో సాహిత్య సృజన జరిగింది. ప్రబంధాల యుగాన్ని భోగవాదంగా అనుకుంటే, భావ కవిత్వవాదం, విప్లవ సాహిత్య వాదం ఇలా ఆయా వాదాలన్నింటినీ ఆయా కాలాలకే పరిమితం చేసి, భావకవిత్వం పనయిపోయింది, విప్లవ కవిత్వం పనయిపోయింది అని ఎందుకనడం లేదు. భావకవిత్వం రాసే వాళ్ళు, విప్లవ సాహిత్యం రాసే వాళ్ళు అప్పుడూ వుంటారు. ఇప్పుడూ వుంటారు. సాహిత్యం ఒక జీవధార – ప్రవహిస్తూనే వుంటుంది. పనైపోవడం, నీరసించిపోవడం అంటూ వుండదు. ఆయా కాలాలకు, ఆయా సామాజిక అవసరాలకు అనుగుణంగా సాహిత్య సృజన జరుగుతూనే వుంటుంది. ఎనభైల నాటి పరిస్థితులు, ఉద్యమ ఉధృతికి అనుగుణంగా అంతే ఉధృతంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా స్త్రీవాద రచనలు వెలువడ్డాయి.
వందేళ్ళ తెలుగు సాహిత్యాన్ని తీసుకుని అప్పటి నుండి తెలుగు సాహిత్యం గమనాన్ని పరికిస్త్తే- నూటపది సంవత్సరాలకు పూర్వమే ఒక స్త్రీ తెలుగు సాహిత్యంలో పలుప్రక్రియలకు ఆద్యురాలుగా నిలిచింది. తెలుగులో తొలికథ రాసి, తొలిసారి స్త్రీల చరిత్రను గ్రంథస్థం చేసి, మొట్టమొదటిసారి స్త్రీల సంఘాలను/సమాజాలను స్థాపించిన భండారు అచ్చమాంబను ఈ సందర్భంగా మనం తప్పకుండా గుర్తుచేసుకోవాలి. స్త్రీ విద్య కోసం అహరహం కృషి చేసిన అచ్చమాంబను గురించి 2003 లో నేను ఇదే వేదిక మీద నుంచి తెలుగులో తొలి కథ రాసింది భండారు అచ్చమాంబ అని సగర్వంగా ప్రకటించడం- ఆ తర్వాత దానిపైన తీవ్ర స్థాయిలో చర్చ జరగడం- ఇప్పటికీ వందేళ్ళ తెలుగు కథ అంటున్నారు గానీ నూట పదేళ్ళ తెలుగు కథ అనడానికి చాలా మందికి మనస్కరించకపోవడం మనం చూస్తున్నాం. ఎవరి మనస్సు ఒప్పుకున్నా, ఎవరి మనస్సు నొచ్చుకున్నా చరిత్ర-చరిత్రే- దానిని వక్రీకరించడం ఇంక ఎంత మాత్రమూ కుదరదు. మహాకవి గురజాడ ఆశించినట్లు మనం చరిత్రను తిరగరాయడం మొదలు పెట్టాం. మనకు తెలియని మన చరిత్రని, మనకు తెలియకుండా ముసుగేసి దాచేసిన చరిత్రని మనం తవ్వడం మొదలు పెట్టాం. స్త్రీవాద దృష్టికోణంతో మనం తవ్వుతుంటే, మటగడ్డలుగానో, మసి బొగ్గులుగానో పక్కన పారేసిన వజ్రపు తునకల్లాంటి అచ్చమాంబ లాంటి అద్భుతమైన స్త్రీలు వెలుగులోకి వస్తున్నారు. పురుషాధిపత్య రంగుటద్దాల్లోంచి తూకం వేసి ఛీత్కరించిన బెంగుళూరు నాగరత్నమ్మ లాంటి వారి జీవిత చరిత్రలు ప్రచురితమయ్యాయి. ఇలా మొదలైన సాహిత్య గమనం 80 లలో ఒక వెల్లువల్లే పోటెత్తింది. డెబ్బె దశకంలో అంతర్జాతీయంగా విస్తృతస్థాయిలో మొదలైన స్త్రీల ఉద్యమం భారతదేశంలోను ప్రవేశించి, 1975ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించబడింది. స్త్రీల అంశాలెన్నో ప్రధాన స్రవంతి చర్చల్లో భాగమయ్యాయి. ఈ పరిణామాలు అనివార్యంగా తెలుగుసాహిత్యాన్ని, తద్వారా తెలుగు సమాజాన్ని ఒక ఉప్పెనలాగా తాకాయని చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్య చరిత్ర మొత్తంలోను ఏ దశాబ్దంలోను కనబడనంత మంది స్త్రీలు స్త్రీవాద స్పూర్తితో, స్త్రీల ఉద్యమాల ప్రేరణతో పెద్ద ఎత్తున సాహిత్యంలోకి దూసుకొచ్చారు. ఉద్వేగాలు అతి తీవ్ర స్థాయిలో వున్నపుడు ఆ ఉద్రేకం కవిత్వంలోనే గాఢంగా ఆవిష్కృతమౌతుందని నిరూపిస్తూ వందల సంఖ్యలో స్త్రీలు కవిత్వం రాయడం మొదలు పెట్టారు. ఆ కవిత్వమంతా నీలి మేఘాలుగా, గురిచూసి పాడేపాటగా ప్రచురణ రూపం దాల్చింది. వందలాదిగా కవిత్వం సంకలనాలు వెలువడ్డాయి.
‘బందిపోట్లు’ కవితతో సావిత్రి తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపింది. ‘పైటను తగలెయ్యాలంటూ’ జయప్రభ స్త్రీవాద కవిత్వాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళింది. అప్పటివరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా వుండి, పురుషుల కంటికి ఆనని అన్ని వస్తువులనూ తీసుకుని స్త్రీలు కవితలల్లారు. తెలుగు సాహితీ ప్రపంచం విస్తుపోయేలా, విభ్రమకు గురయ్యేలాంటి, బాణం వలలుకంత సూటిగా తగిలే కవితలు వెల్లువెత్తాయి.
‘బందిపోట్లు’ కవితతో సావిత్రి తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపింది. ‘పైటను తగలెయ్యాలంటూ’ జయప్రభ స్త్రీవాద కవిత్వాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళింది. అప్పటివరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా వుండి, పురుషుల కంటికి ఆనని అన్ని వస్తువులనూ తీసుకుని స్త్రీలు కవితలల్లారు. తెలుగు సాహితీ ప్రపంచం విస్తుపోయేలా, విభ్రమకు గురయ్యేలాంటి, బాణం వలలుకంత సూటిగా తగిలే కవితలు వెల్లువెత్తాయి.
కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, ఘంటశాల నిర్మల, మందరపు హైమావతి, శిలాలోలిత, విమల, మహెజబీన్, జయప్రభ, షాజహాన్ లాంటి ఎందరో కవయిత్రులు అద్భుతమైన స్త్రీవాద కవితలు రాసారు. ఇంటి చాకిరీ గురించి, మాతృత్వం గురించి, పెళ్ళి గురించి, భార్యాభర్తల సంబంధంలోని అసమానత గురించి కుటుంబ సంబంధంలోని అసమానత గురించి కుటంబాల్లోని సవాలక్ష వివక్షల గురించి అనన్య సామాన్యమైన కవితలొచ్చాయి.
ముఖ్యంగా కొండేపూడి నిర్మల మాతృత్వ వేదన గురించి ”రైలు పట్టాల మీద నాణెం విస్తరించినంత వేదన’ గా చెప్పడం, విమల వంటిళ్ళలోని చాకిరీ గురించి రాయడం, ఏ కాల్ గాళ్స్ మోనోలాగ్‌్‌గా వ్యభిచారం కూపంలోని స్త్రీ ఆత్మఘోషని ఘంటశాల నిర్మల అద్భుతంగా ఆవిష్కరించడం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
స్త్రీ అంటే శరీరంగా మాత్రమే చూసే పితృస్వామ్య సంస్కృతిని ధిక్కరిస్తూ, తిరుగుబాటు బావుటా నెగరేస్తూ ఎనభయ్యవ దశకంలో స్త్రీవాద కవయిత్రులు స్త్రీలను అణిచివుంచే, అధికారం చలాయించే పురుషాధిక్య భావజాలాన్ని తిరస్కరిస్తూ గొప్ప కవిత్వం రాసారు. ఇంకా రాస్తూనే వున్నారు. ఒక దశలో వరద గోదారిలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తిన స్త్రీవాద కవిత్వం ఉధృతి తగ్గి, కుదురుకుని నిదానంగా నలుదిక్కులా పారుతూ కథల్లోకి, నవలల్లోకి, వ్యాసాల్లోకి ప్రవహించింది. స్త్రీవాదం అన్ని సాహిత్య ప్రక్రియల్లోకి విస్తరించింది.
ఏ ఉద్యమమైనా ఉధృతంగానే మొదలౌతుంది. ఆ ఒరవడిలో చెత్త్తంతా కడిగేస్తుంది. ఉధృతి తగ్గినపుడు కూడా తన ఉనికిని కోల్పోకుండా నిదానంగా ప్రవహిస్తూనే వుంటుంది. స్త్రీవాదం కూడా దీనికి మినహాయింపు కాదు. ఎనభైలలో కవిత్వరూపంలో ఉరకలెత్తిన స్త్రీవాదం తొంభైల నాటికి కథలోకి ప్రవహించింది.
1990 దశకం నాటికి తెలుగు సమాజంలో అనేక మార్పులు సంభవించాయి. ఎనభైలలో పితృస్వామ్యాన్ని, పురుషాధిపత్యాన్ని సవాల్ చేస్తూ వచ్చిన కవిత్వం వచ్చేనాటికి, తొంభైలలోని నూతన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణల నేపథ్యం లేదు. స్త్రీల శరీరాల చుట్టూ, అణిచివేతల చుట్టూ, ఆడపిల్లలుగా పుట్టి స్త్రీలుగా తయారుచేయబడే క్రమం చుట్టూ, కుటుంబాల్లోని అసమ సంబంధాల చుట్టూ కుటుంబహింస చుట్టూ అల్లుకున్న కవిత్వం ఎనభైలలో వస్తే…. తొంభైల నాటికి ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. మారిపోవడమంటే స్త్రీల సమస్యలన్నీ తీరిపోయాయని అర్థం కాదు. వీటికి తోడు మరిన్ని సమస్యలు ప్రపంచీకరణ పేరుతో మనల్ని చుట్టుముట్టాయి. కుటుంబ హింసకి తోడు, బహిరంగ హింస, పనిచేసే చోట హింస, చదువుకుని సంపాదిస్తూ కూడా తప్పని ఇంటిపని, వంటపని, పిల్లల పని స్త్రీలను పీల్చివేస్తున్న దుర్భర పరిస్థితులు తయారయ్యాయి.
అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంశం, వ్యవసాయ విధ్వంశం, కుదేలైన చేనేత రంగం, చేతి వృత్తుల సర్వనాశనంతో పల్లెలు వదిలి పట్టణాల దారి పడుతూ విపరీతమైన హింసకు గురౌతున్న గ్రామీణ జనాభా. ‘అభివృద్ధి’ ముసుగేసుకున్న బడా ప్రాజెక్టులు, ఎస్‌ఈజెడ్‌లు, కోస్టల్ కారిడార్ పేరుతో మత్స్యకారుల్ని, మత్స్య సంపదను ధ్వంశం చేస్తున్న వైనాలు తొంభైల నుండి 2010 వరకు నడుస్తున్న విధ్వంశ రూపాలు.
తెలుగు సమాజంపై పెనుసవాల్ విసిరిన ప్రపంచీకరణ విధ్వంశాన్ని రచయిత్రులు కథలుగా మలచడంలో సఫలమయ్యారు. గ్లోబలైజేషన్ నేపథ్యంతో అనేక వందల కథలు తెలుగులో వెలువడ్డాయి. పి. సత్యవతి, కుప్పిలి పద్మ, నల్లూరి రుక్మిణి, ఓల్గా, కొండవీటి సత్యవతి, వి. ప్రతిమ, పాటిబండ్ల రజని, చంద్రలత, కె. వరలక్ష్మి, ఎస్. జయ, మల్లీశ్వరి లాంటి కథకులు ఎన్నో అద్భుతమైన కథలు రాసారు. వీరిలో కొందరి సాహిత్యం గురించి ఇదే సమావేశంలో పత్ర సమర్పణలున్నాయి కాబట్టి నేను లోతుల్లోకి పోవడం లేదు.
1990-2010 మధ్య కాలంలో వచ్చిన పెనుమార్పు మానవ సంబంధాల విధ్వంశం. ఐటి రంగానికిచ్చిన అధిక ప్రాధాన్యత వల్ల సామాజిక శాస్త్రాలు వెనుకబడి, చరిత్రపట్ల, సమాజం పట్ల, తోటి మనిషి పట్ల బాధ్యత లేనితనం పెరిగి మనిషి అంతరంగంలో ఏకాకిగా మారిపోయాడు. మనసు నిండా కమ్ముకున్న డొల్లతనాన్ని నింపుకోవడానికి వస్తు సముదాయంమీద పడేలా పెద్ద పెద్ద మాల్స్ విజృంభణతో వస్తు వినిమయ సంస్కృతి పెరగడం అనేది చివరికి స్త్రీలమీద హింసగా పరిణమించి, వస్తువుల కోసం స్త్రీలను హింసించడం ఎక్కువైంది. కట్నాలకు తోడు నానా రకాల వస్తువులు కావాలనే గొంతెమ్మ కోర్కెలు పెరిగిపోయాయి.
ఈ పరిణామాలన్నీ స్త్రీల కథల్లో వస్తువులయ్యాయి. ఓల్గా, సత్యవతి, కుప్పిలిపద్మలాంటి వాళ్ళు వీటి మీద చక్కటి కథలు రాసారు. ఎంతో మంది స్త్రీలు వీటిని వస్తువులుగా స్వీకరించి కథలు రాస్తున్నారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని, అది కలిగిస్తున్న భ్రమల్ని, వేస్తున్న జిలుగు ముసుగుల్ని చించిపారేయాల్సిన అవసరం, అది సృష్టిస్తున్న విధ్వంశాన్ని, అసమానతల్ని చాలా తెలివిగా ధనవంతుల్ని సూపర్ ధనవంతులుగా, పేదల్ని మరింత పేదలుగా, స్త్రీలని మరింత అణిచివేతలకు గురి చేస్తున్న వైనాలను మరింత లోతుగా సాహిత్యంలోకి ముఖ్యంగా నవలా రూపంలోకి రావాల్సిన అవసరం చాలా వుంది. ఈ మూడు దశాబ్దాలలో జరిగిన పరిణామాలను వస్తువులుగా స్వీకరిస్తూ పెద్ద కాన్వాసుతో నవలలు రావాల్సి వుంది. నిజానికి ఈరోజు రాస్తున్న రచయిత్రులకు/రచయితలకు వస్తువుల లోటు లేదు. ఎన్నో అంశాలు ఎంతో తీవ్రతతో మనముందున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వారసత్వంగా వస్తున్న తీవ్ర సమస్యలూ మనముందున్నాయి. ఇదిగో ఈ సమస్య పరిష్కారమైంది. దీనిగురించి మనం రాయక్కరలేదు అనేలా ఏదీ లేదు.
భారతీయ సమాజం ప్రత్యేకత ఏమిటంటే అది దేనినీ తెగ్గొట్టుకోదు. ఆటవిక సమాజంలోని ఆచారాలు మధ్యయుగంలోకి, మధ్యయుగాల నాటి అవకతవకల్ని ఆధునిక సమాజంలోకి చాలా తేలికగా మోసుకొచ్చేస్తాం. రాముణ్ణి దేవుడిగా కొలుస్తూనే, ఏకపత్నీ వ్రతుడని పొగుడుతూనే బహుభార్యాత్వాన్ని హాయిగా కొనసాగిస్తాం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్నీళ్ళకి కరిగి నీరౌతూనే మన కూతుళ్ళకి మాత్రం బాల్యవివాహమే చేస్తాం. స్త్రీలు చదువుకోవాలి అంటూ వేదికలెక్కి కేకవేసి మన ఆడపిల్లని మాత్రం ఇంట్లోనే కూర్చోబెడతాం. దేవతల్ని తలకెత్తుకుని, తిలకాలు దిద్దుకుని కొలుస్తాం గానీ కన్నతల్లిని, కట్టుకున్న భార్యని నానా హింసలూ పెడతాం. మాతృమూర్తి అంటూనే నిండు గర్భిణిని సైతం కడుపు మీద తన్నే సంస్కృతి మనది. భారతీయ సంస్కృతి, స్త్రీలని హింసించే సంస్కృతి దీనిలో భాగమే. స్త్రీల కట్టు, బొట్టు, నడక, నడత, మాట, ఆలోచన, ఆచరణ, అంతరంగం అన్నింటినీ నియంత్రించే, అదుపుచేసే పితృస్వామ్య సంస్కృతి, భారతీయ సంస్కృతిలో మిళితమై పోయివుంది. దీనిని విడదీసి చూడాల్సిన అవసరం చాలావుంది. లేకపోతే మనం కూడా అతివాద మతోన్మాద సంస్కృతికి బలైపోయే ప్రమాదం వుంది. ఇప్పటికే మన మాటమీద, ఆలోచనమీద, రచనమీద, వేషధారణమీద విపరీతమైన పోలీసింగ్ వుంది. మంగుళూరు పబ్‌లో జరిగిన దాడులు, మీరానాయర్ వాటర్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన గొడవలు – ఎన్నెన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. మన కలాలకు కళ్ళెం వేసే సంస్కృతి పెరిగిపోయింది. తస్మాత్ జాగ్రత్త…
ఈ రోజు మనముందున్న పెనుసవాళ్ళు రెండు. ఒకటి ప్రపంచీకరణ పురికొల్పుతున్న అభివృద్ధి నమూనా, రెండోది అతివాద మతోన్మాధ ధోరణి. మొదటిది మొత్తం పేద ప్రజలని పిజ్జాలుగా, బర్గర్లుగా వార్చుకుని మింగేయడం, అభివృద్ధి పేరిట కడతాయని భ్రమింపచేసే ప్రాజెక్టులు, స్పెషల్ ఎకనామిక్ జోనులు కుమ్మరిస్తున్న కనకరాసులలో హఠాత్తుగా ధనవంతులౌతున్న వాళ్ళు ప్రదర్శిస్తున్న వల్గారిటీ ఆఫ్ వెల్త్ – పోగుపడుతున్న సంపద వికృత రూపం. (-దుబాయ్ లాంటి ప్రాంతాలు) మరో పక్క పేద ప్రజల్ని ఆత్మగౌరవం లేనివాళ్ళుగా తయారుచేస్తూ కుప్పలు తెప్పలుగా వస్తున్న ప్రభుత్వ పథకాలు. వీటన్నింటిని విశ్లేషణాత్మకంగా రచనల్లోకి జొప్పించాల్సిన అవసరం చాలా వుంది.
రెండోది అతివాద మతోన్మాదం- అది ఏ మతమైనా కానీయండి దీనిని అడ్డుకోకపోతే దాని కొరడా మొదటగా తాకేది స్త్రీలనే. స్త్రీలు చదువుకోవాలా వద్దా? ఉద్యోగాలు చెయ్యాలా వద్దా? బయట తిరగాలా? వద్దా? ఎలాంటి బట్ట తీసుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఏం రాయాలి ఏం రాయకూడదు? ఏ బొమ్మ గియ్యాలి? ఏ బొమ్మ గీయకూడదు? ఎంతమంది పిల్లల్ని కనాలి? – వీటన్నింటి మీద తీర్పులు చెప్పడానికి ఫర్మానాలు జారీ చేయడానికి తయారయ్యే అతివాద మతోన్మాద ప్రమాదాన్ని మనం తప్పనిసరిగా, జాగురూకతతో అర్థం చేసుకోవాలి. దానికుతంత్రాలను, తీర్మానాలను ఎదుర్కొనే ఆయుధాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఆ దిశగా రచనలు రావాలి.
చివరగా, స్త్రీవాదం పనైపోయింది. నీరస పడిపోయింది అనే విమర్శకు సమాధానం చెప్పి నేను ముగిస్తాను. ఇది వివక్షతో, అక్కసుతో చేసే విమర్శగానే మనం కొట్టిపారేయాలి. నిజానికి తెలుగు నాట ప్రజాస్వామిక పోరాటాలకు అనువైన వాతావరణాన్ని, అస్తిత్వ ఉద్యమాలకు సరైన బాటలేసింది స్త్రీవాదమే. స్త్రీవాదం లోంచి దళితవాదం, మైనారిటీ వాదం, బహుజనుల వాదం బలంగా ముందుకొచ్చాయి. స్త్రీలు స్త్రీవాద దృష్టికోణంతో, మైనారిటీలు తమదైన గొంతుకతో, బహుజనులు తమ తమ ప్రత్యేక కోణాలతో అద్భుతమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్రవేసిన స్త్రీవాదం సాహిత్యంతోనే ఆగిపోయిందనుకోవడం వెర్రితనమే అవుతుంది. స్త్రీవాదం చదువులో పాఠమైంది. పాలనలో చట్టమైంది. అంతర్జాతీయ వొప్పందాల వల్లనేమి, భారతదేశంలో ఎగిసిపడిన స్త్రీల ఉద్యమాల వల్లనేమి స్త్రీవాద రచనల ప్రభావం వల్లనేమి ప్రభుత్వ భాష మారింది. స్త్రీల సహాయం కోసం ఎన్నో సపోర్ట్ సిస్టమ్స్ ఏర్పడ్డాయి. మహిళా కమీషన్, మహిళా కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు – ఇలా ఎన్నో సంస్థలు, వ్యవస్థలు స్త్రీల సహాయార్థం ఏర్పడ్డాయి. పాలనలోకి జండర్ అవగాహన, జండర్ స్పృహ ప్రవేశించాయి. ప్రభుత్వమే స్త్రీల పట్ల ఎలా మెలగాలో తెలిపే జండర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఇదంతా ఒక్క రోజులో, ఆకాశం లోంచి ఊడిపడిన పరిణామం కాదు.
భారత స్త్రీల ఉద్యమంలో స్త్రీవాదం అంతర్లీనంగా ప్రవేసిచడం వల్లనే ఈ రోజు – పవిత్రమైన భారతీయ కుటుంబాల్లో హింసా? అని ప్రశ్నించిన వాళ్ళే – అవును కుటుంబాల్లో తీవ్ర స్థాయిలో హింస జరుగుతోందంటూ ఒప్పుకుని 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని, పని చేసే చోట వేధింపులు వాస్తవమని ఒప్పుకుంటూ చేసిన సెక్సువల్ హరాస్‌మెంట్ బిల్‌ని ప్రభుత్వం తెచ్చింది. ఇవన్నీ స్త్రీల ఉద్యమం సాధించిన విజయాలే. కుళ్ళుతనంతో కాక కళ్ళు విప్పార్చుకుని గమనిస్తే, 1975 చీకటి రోజుల తర్వాత వచ్చిన మార్పులు, ఆ మార్పులకు దోహదం చేసిన స్త్రీవాద ఉద్యమ విశ్వరూపం అర్థమౌతాయి.
అయినా నాకు తెలియక అడుగుతున్నాను. తెలుగు సాహిత్యంలో ఎన్నో వాదాలు వచ్చాయి. ఎంతో సాహిత్య సృజన జరిగింది. ప్రబంధాల యుగాన్ని భోగవాదంగా అనుకుంటే, భావ కవిత్వవాదం, విప్లవ సాహిత్య వాదం ఇలా ఆయా వాదాలన్నింటినీ ఆయా కాలాలకే పరిమితం చేసి, భావకవిత్వం పనయిపోయింది, విప్లవ కవిత్వం పనయిపోయింది అని ఎందుకనడం లేదు. భావకవిత్వం రాసే వాళ్ళు, విప్లవ సాహిత్యం రాసే వాళ్ళు అప్పుడూ వుంటారు. ఇప్పుడూ వుంటారు. సాహిత్యం ఒక జీవధార – ప్రవహిస్తూనే వుంటుంది. పనైపోవడం, నీరసించిపోవడం అంటూ వుండదు. ఆయా కాలాలకు, ఆయా సామాజిక అవసరాలకు అనుగుణంగా సాహిత్య సృజన జరుగుతూనే వుంటుంది. ఎనభైల నాటి పరిస్థితులు, ఉద్యమ ఉధృతికి అనుగుణంగా అంతే ఉధృతంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా స్త్రీవాద రచనలు వెలువడ్డాయి.
తొంభైలలో తెలుగు సమాజం మీద ఉపద్రవంగా దాడి చేసిన ప్రపంచీకరణ విధ్వంసం మీదికి రచయిత్రులు దృష్టి సారించారు. ఇరవై ఒకటో శతాబ్దపు హామీలన్నీ గాలికెగిరిపోయి, మిలీనియం సంబరాలు ఆవిరైపోయి ఇంకా… విద్య కోసం, ఉద్యోగం కోసం, బతుకు కోసం, బాల్యవివాహాల నిర్మూలన కోసం, సమస్త హింసల్ని అంతం చేసే ప్రజాస్వామిక కుటుంబాల ఏర్పాటు కోసం, కుటుంబాల్లో నిర్ణయాధికారం కోసం – వెరసి విముక్త సమాజం కోసం మన కలగంటూనే వున్నాం. ఆ కలనే సిరాగా మన కలంలోకి ఎక్కించుకుని కన్నెర్ర చేస్తూ కథనో, కవిత్వాన్నో రాస్తూనే వున్నాం. ఎవరాఅన్నది స్త్రీవాదం చచ్చిపోయిందని?? ఇరవై ఏళ్ళ స్త్రీవాద భూమిక వాళ్ళ కంటపడలేదా….??
Wednesday, October 3, 2012
గురజాడ కలగన్న అత్యాధునిక మహిళ ‘నాంచారమ్మ’
ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం. గురజాడ కాలం నాటికి పౌరాణిక కథలతో, పద్యాలతో కాలక్షేపం చేస్తున్న తెలుగువారికి కందుకూరి, గురజాడల సాహిత్య ప్రవేశం చాలా విలువైంది. కందుకూరి నవల, ప్రహసనాలతో రంగ ప్రవేశం చేస్తే గురజాడ నాటకం, గేయం కథానికలతో ఆధునికమైన నూతన ప్రక్రియలతో తెలుగు వారికి కొత్త రుచులను అందించాడు. అభూత కల్పనలకు సమాధి కట్టి సాహిత్యం సామాజికం కావాలని పట్టుబట్టాడు. ”పుష్కలమైన, అనంతమైన సంఘటనలతో నిండివున్న ఎంతో గాంభీర్యమూ, వైవిధ్యమూగల నేటి జీవితాన్ని వీక్షించక ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ప్రాచీన కాల్పనిక కథల నుంచి రచయితలు యితివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో, అర్థం కాక నాకు ఆశ్చర్యం వేస్తుంది ” అంటాడు.
గురజాడ కన్యాశుల్కం, కొండు భట్టీయం, బిలవాణీయం నాటకాలు, ముత్యాల సరాలు, పూర్ణమ్మ, కాసులు, కన్యక, దేశభక్తి కవితలు దిద్దుబాటు, మెటిల్డా, మీ పేరేమిటి?, సంస్కర్త హృదయం, పెద్ద మసీదు అనే ఐదు కథలు రాసాడు. ఈ ఐదు కథలు సమాజంలోని భిన్న రంగాలకు చెందినవి. సౌదామిని అనే నవల కూడా రాసాడాయన.
గురజాడ కథలు ఒక్క పెద్ద మసీదు తప్ప మిగిలినవన్నీ స్త్రీ ప్రధానమైన కథలు. స్త్రీవాదం అనే పేరు అప్పటికి పోయినా ఈ కథలు స్త్రీ దృష్టికోణం నుంచి రాసినవి.
గురజాడ సాహిత్యం గురించి తలుచుకున్నపుడు, ఆయన సృష్టిించిన స్త్రీపాత్రలు మనసులో మెదలగానే మొట్ట మొదటగా కళ్ళ ముందు రూపుకట్టేది మధురవాణి. చతురత, విజ్ఞత, హాస్యం, తెలివితేటలు అన్నీ మూర్తీ భవించిన అపూర్వపాత్ర మధురవాణి. కన్యాశుల్కం నాటకాన్ని ఒంటి చేత్తో నడిపిస్తుంది మధురవాణి. ఎంతో చురుకైన, తీక్షణమైన మేధస్సు ఆమె సొంతం. మధురవాణి గురించి ఎందరో కుప్పలు తెప్పలుగా రాసారు. ఇంకా రాస్తూనే వున్నారు. భవిష్యత్తులో కూడా మధురవాణి విమర్శకులను వదిలిపెట్టే సమస్యే లేదు. అంత గొప్ప పాత్రని గురజాడ ఎంతో ప్రేమతో సృష్టించాడు.
అయితే ”మీ పేరేమిటి?” కథలో నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, వివేచనతో ప్రవర్తించే నాంచారమ్మ పాత్రను కూడా అంతే ప్రేమతో సృష్టించాడు గురజాడ. కానీ మధురవాణికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు నాంచారమ్మకి రాకపోవడానికి ‘కన్యాశుల్కం’ నాటకంగా ఆంధ్రదేశమంతా ప్రదర్శింపబడడం, మధురవాణి పాత్ర కళ్ళ ముందు ఆవిష్కృతమవ్వడం, ”మీపేరేమిటి?” కధారూపంలో వుండడం ఒక కారణం కావచ్చు లేదా దుడ్డు కర్రతో తిరగబడ్డ నాంచారమ్మ తెగువ సాహిత్య విమర్శకులకు కొరుకుడు పడకపోయి వుండొచ్చు.
ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అని గురజాడ చెప్పిన ఆధునిక స్త్రీ నాంచారమ్మే అనిపిస్తుంది నాకు. మత మౌఢ్యాల మీదే కాదు తమ మీద అమలవుతున్న సవాలక్ష ఆంక్షల మీద, హింసలమీద కూడా భారత స్త్రీలు ఇదే రీతిలో తిరగబడాలన్నది మహాకవి ఆకాంక్ష అయ్యుండొచ్చు.
”మీ పేరేమిటి?” కథలోని నాంచారమ్మ లాంటి పాత్రను సృష్టించడం గురజాడ బతికిన కాలం నాటికి చాలా కష్టమైన పని. ఆయన సృష్టించిన పాత్రలన్నీ ఒక ఎత్తు. నాంచారమ్మ ఒక ఎత్తు. సాంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలోకి కోడలుగా ఆ గ్రామంలో ప్రవేశించిన ఆమె అన్యాయాన్ని ఎదిరించడానికి సాంప్రదాయాన్ని లెక్కచేయదు. ఊరు ఊరంతా మత మౌఢ్యంలో పడి కొట్టుకు చావబోతున్న సమయంలో నాంచారమ్మ రంగ ప్రవేశం అద్భుతంగా వుంటుంది. శైవులు, వైష్ణవుల్లో తగాదాలు, మోతుబరుల కప్పదాట్లు భక్తి, మతం పేరుతో సాగే అకృత్యాలను ఎండగట్టడంతో పాటు గురజాడ ” ఏ దేవుడి మీదనైనా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే ఒక్క గండమే కాదు అన్ని కష్టాలను తరించవచ్చును” అని నాంచారమ్మ చేత అనిపిస్తాడు. ఊర్లోని అందరూ తన భర్తను, మామను నిప్పుల గుండం తొక్కించడానికి కుట్ర పన్ని నపుడు నాంచారమ్మ దుడ్డుకర్ర చేతబట్టి అక్కడ చేరిన వారినందరినీ తన వాదనతో బెదర గొట్టి, మూఢవివ్వాసాలను దుయ్యబట్టడంతోపాటు, నిజమైన భక్తికి, ఆరాధనకి మతాలు అడ్డు రావని ఒప్పిస్తుంది. అంతేకాదు వైషమ్యాలతో పరస్పరం తలపడుతున్న వైష్ణవుల్ని, శైవుల్ని తన మాటలద్వారా ఏకం చేసి పీరును గరుఢధ్వజంగా మార్పుచేసి సాయిబు చేత నిప్పుల గుండం తొక్కిస్తుంది. మానవత్వాన్ని నిలబెట్టుకోడానికి అవసరమైతే దుడ్డుకర్ర పట్టుకోవాలని చెబుతూ
”వేళకి భక్తి నిలుస్తుందో లేదో చేతికర్రలు మాత్రం మరవకండి” అని తన పక్షం వాళ్ళని హెచ్చరిస్తుంది.
ముమ్మాటికీ గురజాడ పేర్కొన్న ఆధునిక స్త్రీ నాంచారమ్మే అని నా బలమైన నమ్మకం. నాంచారమ్మ లాంటి సజీవ పాత్రను సృష్టించిన గురజాడ అత్యంత అభినందనీయుడు.
”గాలీ వెలుతురూ సోకకుండా మీ ఆడవాళ్ళను జనానా కొట్లలో ఎందుకలా బంధిస్తారు. కోళ్ళ గంపల్లో కుక్కితే కోళ్ళు సైతం ఉక్కిరి బిక్కిరవుతాయే. మరి మనుష్యుల మాట చెప్పేదేమిటి? స్వేచ్ఛ లేకపోతే ఎలాగ? ముందు తరాలవాళ్ళు గొప్ప వాళ్ళు కావాలంటే ఇప్పటి ఈ ఆచారాలు మారవద్దా” – గురజాడ లేఖలు
దాంపత్య జీవితంలోని అసంతృప్తులు, స్త్రీ పురుష సంబంధాలల్లోని అసమానత్వం, తారతమ్యాలు,వివాహ వ్యవస్థలోని లోపాలు ఆయన చక్కగా గుర్తించాడు. సాంఘిక దురాచారాలకు స్త్రీలే ఎక్కువ గురవుతున్నారని గ్రహించిన గురజాడ తన కథల్లోను, ఇతర రచనల్లోను స్త్రీ పాత్రనే ప్రధానం చేసాడు. స్త్రీలకు ప్రాధాన్యత నివ్వడం అంటే స్త్రీలకు లేని గొప్పతనాన్ని ఆపాదించడం కాదు. స్త్రీలకి ఎన్ని సమస్యలుంటాయో చెప్పడంతో పాటు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చెబుతారు.
భర్త ఏమి చేసినా సహించే పాతివ్రత్య లక్షణాలను తోసి రాజని, వేశ్యాలోలుడైన భర్తని అదిరించి, బెదిరించి సంస్కరించిన కమలిని పాత్ర దిద్దుబాటు కథలోది. మౌనంగా భర్త చేష్టల్ని భరించకుండా ఉపాయంతో, ధైర్యంగా తన సమస్యను పరిష్కరించుకుంటుంది. గురజాడ 1910లో దిద్దుబాటును రాసాడు. స్త్రీలు బేలగా కన్నీరు కార్చకుండా తమ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని చెప్పడంతోపాటు, స్త్రీ విద్య ప్రాధాన్యాన్ని, చదువుకున్న స్త్రీల చొరవని ఈ కథలో చక్కగా చెప్పాడు.
మెట్టిల్డా కథలో కథానాయిక మెటిల్డాకి ఒక ముసలి అనుమానపు మనిషితో పెళ్ళవుతుంది. ఈ కథ గురించి గురజాడ డైరీలలో ఒక చోట ఒక వంటలక్క చెప్పినట్లుగా రాసుకున్నాడు. ” ఈ విషాధగాథను విన్నంతనే నా హృదయభారం మిక్కుటమైంది. మనసులో ఏవేవో ఆలోచనలు చెలరేగి గుండెలో చేయిపెట్టి కలచినట్టయి కొంతసేపు అలాగునే నిలబడి పోయాను. భరించలేని విషాదానుభూతి కలిగింది.” అని రాసాడు మెటిల్డా గొప్ప సౌందర్యవతి. ముసలిభర్త అనుమాన పిశాచం. వాళ్ళింటికీ ఎవరూ వెళ్ళరు. ఆమె ఇంటి గుమ్మంలోకి కూడా రాకూడదని శాసిస్తాడు. కథను చెప్తున్న కథకుడు పక్కింటి నుండి మెటిల్డాను చూసి ఆమె అందాన్ని మెచ్చుకుంటాడు. ”ఈ ముండను తీసుకుపో. నీకు దానం చేసాను ఫో అంటాడు”
మెటిల్డా అతనికి తన వేపు చూడొద్దని తన సంసారం కూల్చొద్దని ఉత్తరం రాస్తుంది. ఈ ఉత్తరం చదివి భర్త మారిపోయినట్టు గురజాడ రాస్తాడుగానీ పురుషాహంకారం మూర్తీభవించిన కరకు పాషాణంలాంటి ఆ భర్త మారాడంటే నమ్మశక్యం కాదు. అయితే చిన్నవాళ్ళని పెళ్ళి చేసుకుని వాళ్ళని అణిచివేసే ముసలి భర్తల అమానవీయ, అహంకార పూరిత ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. అయితే మిగిలిన కథల్లోలాగ మెటిల్డాని చైతన్యం, చొరవ కల పాత్రలాగా ఎందుకు చిత్రించలేదో అర్థం కాదు.
”సంస్కర్త హృదయం” కథని గురజాడ ఇంగ్లీషులో రాసాడు. దీనిని అవసరాల సూర్యారావు తెలుగులోకి అనువాదం చేసారు. ఈ కథలో రంగనాథయ్యరు అనే ప్రొఫెసర్ సంస్కర్త. పుస్తకాలు, సిద్ధాంత పఠనం తప్ప సమాజ వాస్తవాలు తెలియవు. వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూంటాడు. అలాంటి వాడికి సరళ అనే అందమైన వేశ్య కంటపడుతుంది. ఏమి సౌందర్యం అని విస్తుపోయి వేశ్యలు ఇంత అందంగా వుంటారా ? అనుకుంటాడు. రంగనాధయ్యరు సరళను సంస్కరించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆమె ఇంటికి వెళ్ళి, ఆమెతో వాదనలు చేసి, ఆమె ఆదమరిచి ఉన్న వేళ ముద్దు పెట్టుకుంటాడు. పైగా ఆమెతో ”నువ్వు పెళ్ళెందుకు చేసుకోకూడదు” అంటాడు. దానికి ఆమె ”అంటే ఎవడో ఒక ఛండాలుడికి నేను కలకాలం పూర్తిగా బానిసనై పడివుండాలనా మీ తాత్పర్యం. నాలాంటి భోగం పిల్లను ఏ మర్యాదస్తుడు పెళ్ళాడతాడో చెప్పండి మీరే” అని కడిగేస్తుంది.(ఛండాలుడు అనే పద ప్రయోగం గురజాడ చేసి వుండకూడదు కానీ అప్పటికి అస్తిత్వ ఉద్యమాల స్పృహలేదు కాబట్టి ఆయన ఈ పదం వాడాడు.)
గురజాడ తన వ్యాఖ్యలో ” సరళ వేసిన ప్రశ్న రంగనాథయ్యరుకు యింతకు ముందెన్నడూ తట్టి వుండలేదు. ఈ సమస్యను సంపూర్ణంగా ఎన్నడూ చర్చించలేదు. వ్యభిచార నిర్మూలన ఎలా సాధ్యమో, ఎలా అసాధ్యమో అతను ఆలోచించలేదు. పుస్తకాలలోని సిద్ధాంతాలను వల్లెవేయడం తప్ప” అంటాడు. గురజాడ ఈ కథద్వారా సంస్కర్త డొల్ల విధానాల మీద దాడి చేసాడు.”పెళ్ళి చేసుకొని ఒక్కరికే బానిసవ్వాలా” అనే ప్రశ్నను సరళ చేత అడిగిస్తూ వివాహ వ్యవస్థలోని లోటుపాట్లను కూడా చెప్పిస్తాడు. ఈ కథలో వేశ్య అయినప్పటికీ సరళలో ఒక సున్నితమైన స్త్రీ మూర్తి కన్పడుతుంది.
గురజాడ సాహిత్య సృష్టికి మూలం స్త్రీ. స్త్రీలకు సంబంధించిన సమకాలీన సమస్యలన్నింటి గురించి ఆయన జీవితమంతా ఆలోచిస్తూనే వున్నాడనడానికి ఆయన లేఖల్లోను, రచనల్లోను ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి.
”శారీరకమైన శక్తిద్వారా కాక ఆత్మికమైన అసమ్మతిద్వారా జీవిత సన్నివేశం మీద విజయం సాధించిన స్త్రీల కథల్నే ఆయన చెప్పుకొచ్చాడని” అని చిన వీరభద్రుడు అంటాడు. అయితే గురజాడ స్త్రీ పాత్రలు కేవలం ఆత్మికమైన అసమ్మతితో ఆగిపోయేవి మాత్రమే కాక అంతకు మించి చతురత, విజ్ఞత, సాహసం మూర్తీభవించిన సజీవపాత్రలు.
‘స్త్రీలు మేలుకొనాలి.ఎదిరించాలి. తిరగబడాలి మానవత్వం ఆమెలో అధికం. ఆడది అబల కాదు” (సౌదామిని నవలలోంచి)
”స్త్రీ శరీర సౌఖ్యంపొందడం గొప్పకాదు
ఆమె మేధాశక్తిని గ్రహించి రసానుభూతిని పొందడం గొప్ప (గురజాడ లేఖలు)
మతం గురించి మత మౌఢ్యం గురించి ”మీ పేరేమిటి”లో ప్రశ్నించిన గురజాడ
”ఏనాడు బౌద్దం భారతదేశంలో తుడిచి పెట్టబడిందో ఆనాడే భారతదేశం మత విషయక ఆత్మహత్య చేసుకుంది.
మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్యమైనవి. గుదిబండలవంటివి. మానవుని ప్రేమించడమన్నది అతి సాధారణ జీవిత సూత్రం- ఒకరినొకరు ప్రేమించుకోవడం ఎంత మహత్తరమైనది”.
నార్లవారు చెప్పినట్టుగా ”గురజాడ కథల వెనుక ఒక జీవితకాలపు చింతన వుంది. అది పరి పరి విధాల కొనసాగిన చింతన కాదు. ఏకముఖమైనది. పరిపూర్ణమైన ఆధునికత నిండినది. అందులో రాజీపడే తత్వం లేదు. అంతా వర్తమానంతో ముడిపడ్డ భవిష్యత్తు. వర్తమానం వస్తువు. భవిష్యత్తు లక్ష్యం. గురజాడ శీలం విలక్షణమైనది. దుర్భలమైన శరీరం బలిష్టమైన హృదయం.”
ఒకటిన్నర శతాబ్దం కింద పుట్టిన ఈ మహామనిషి హృదయం నిండా పొంగి పొర్లిన ప్రేమ, మానవీయత తెలుగు సమాజాన్ని ఇంకా తడుపుతూనే వుంది. ఆయనను ఆర్తిగా, ఆర్ద్రంగా మనం తలుచుకుంటూనే వున్నాం. ఆయన ప్రస్తావించిన అన్ని సమస్యలు అలాగే వున్నాయి కాబట్టి మరో నూట యాభై ఏళ్లు మనం ఆయనను స్మరించుకుంటూనే వుంటాం.
”స్త్రీలు మేలు కొనాలని, ఎదిరించాలని, తిరగబడాలని, ఆడది అబల కాదని” పిలుపు నిచ్చిన మహాకవి సందేశాన్ని వినండహో” అని ఎలుగెత్తుతూ గురజాడ వెంకట అప్పారావుకి భూమిక ఆత్మీయ నివాళి ఇది.
Monday, September 3, 2012
Sunday, September 2, 2012
"వాడిపోని మాటలు"
"వాడిపోని మాటలు" రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం పుస్తకావిష్కరణ సభ నిన్న సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్స్ క్లబ్ లో అత్యంత ఉత్సాహంగా జరిగింది.
ముదిగంటి సుజాతా రెడ్డి అధ్యక్షత వహించారు.
కే.లలిత,కేతు విస్వనాథ రెడ్డి,ఏ.ఉమా మహేశ్వరి పుస్తకం గురించి మాట్లాడారు.
డా సమతా రోషిణి వందన సమర్పణ చేసారు.
భూమిక మితృలు,ఆత్మీయులు శ్రేయోభిలాషులు సమక్షం లో జరిగిన ఈ ఆవిష్కరణ సభ రెండు గంటలు కొనసాగి విజయవంతంగా ముగిసింది.
Saturday, August 11, 2012
సాల్లో గుర్రం - సాలినంత ధనం
కిటికీలోంచి నీలి సముద్రం ఎగిసి పడుతూ కనబడుతోంది. నా చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ గ్లాసు. సముద్రంలో దూరంగా కనబడుతున్న షిప్. షిప్ మీద నుంచి ఉదయిస్తున్న సూర్యుడు. ఇవాళెందుకో చాలా అందంగా కన్పిస్తున్నాడు. ఎర్రటి టమాటాపండు షిప్‌లోంచి పైకి లేస్తున్నట్టుగా వుంది. సూర్యుడు రోజూ ఇదే వేళకి వస్తాడు. నేను అదే వేళకి నా కాఫీ గ్లాసుతో తయారవుతాను.
ఈ రోజు నేనూ, ఉదయించే సూర్యుడూ కలిసి కాఫీ తాగుతున్నంత సంతోషంగా వుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. నేను వేస్తున్న కాఫీ గుటక మాత్రమే వినిపించేంత నిశ్శబ్దంగా వుంది ఇల్లు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నాకు నేను దొరికాను. ఈ 'నేను' అనే పదం ఎంత బావుంది. మేము లోంచి నేను ను విడదీసి చూడడం, ఈ రోజు నేనొక్క దాన్నే వున్నాను అనే భావనే అద్భుతంగా వుంది. ఈ రోజంతా నాదే. ఈ రోజే కాదు ఈ నాలుగు రోజులూ నావే కదా! నా ఇష్టం. నాకిష్టమైంది నేను చేస్తాను. ఎంత కాలమైంది నా ఇష్టాయిష్టాలు మర్చిపోయి, ఎంత కాలమైంది నా కోసమే నేను బతికి. కిటికీలోంచి కనబడుతున్న సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది, నా మనస్సులా. నాకెప్పుడూ ఇలా ఒంటరిగా, నిశ్శబ్దంగా కాఫీ తాగుతూ సముద్రాన్ని చూడాలన్పిస్తుంది. అస్సలు మాట్లాడాలన్పించదు. మా ఆయన నిశ్శబ్దానికి బద్ధవ్యతిరేకి. మంచం మీంచి లేస్తూనే మహా శబ్దంతో లేస్తాడు. తలుపులు దడదడ వేస్తూ, గడగడ మాట్లాడుతూ ఓ శబ్దయంత్రంలా వుంటాడు. బరాబరా పళ్ళు తోమాడంటే, వేడివేడి కాఫీ రడీగా వుండాలి. కాఫీ తాగుతూ, పోనీ ఆ కాఫీని ఎంజాయ్ చేస్తాడా అంటే అదీ లేదు. లేచీ లేవగానే టీవీ ఆన్ చేసి వెంటకేశ్వర భక్తి ఛానల్ ఓపెన్ చేస్తాడు. ఏదో ఒక ఛానల్ చూస్తాడా అంటే, రిమోట్ తెగనొక్కుతుంటాడు. పొద్దున పొద్దున, వింత వింత సన్నాసుల సూక్తి ముక్తావళిని బోలెడంత సౌండ్‌తో మోగిస్తుంటాడు. ఒకడు ఏక ముఖి రుద్రాక్షంటాడు. మరొకడు ఏదో ఉంగరం అంటాడు. ఇంకొకడు ''ఈ పాడు జీవితం వుంది చూసారా..... దీని మీద మమకారం పెంచుకోకూడదు. సకల సౌకర్యాలను త్యజించాలి.'' అంటూ కారుకూతలు కూస్తుంటాడు. సకల సౌకర్యాలను త్యజించాలని చెప్పిన ఆ సన్నాసి బక్కచిక్కి వున్నడా అంటే కాదు కాదు వాక్స్ పూసిన అమెరికన్ ఏపిల్ పండులా నిగనిగలాడుతుంటాడు. ఉదయం లేస్తూనే ఈ సకల సన్నాసుల సొల్లు వింటూ, మా ఆయన పేపర్‌లో తల దూర్చి, కాఫీ గుటక లేస్తూంటాడు.
పేపర్ చదువుతూ కెవ్వున కేకేస్తాడు. మొదట్లో నాకు గుండె నొప్పి వొచ్చినంత పనయ్యేది - ఆ అరుపులకి, మెల్లగా అలవాటైంది లెండి.
''ఏమోయ్! ఎంత ఘోరమో చూడు. మీ ఆడవాళ్ళు చెడిపోతున్నారు. ఆడపిల్ల పుట్టిందని చెత్త బుట్టలో పడేసిందట కసాయి తల్లి'' ఆ వార్తని గట్టిగా చదివి విన్పిస్తాడు. ఒక పక్క టీవీలో సన్నాసుల గోల, ఇంకో పక్క ఈతని వెర్రి వ్యాఖ్యానాలు. కాసేపు నా బుర్ర పని చేయడం మానేస్తుంది. టీవీ నోరన్నా ముయ్యాలి. నా మొగుడి నోరన్నా ముయ్యాలి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది.
దాదాపుగా రోజూ ఇదే తంతు. ఆఫీసుకెళ్ళే వరకూ నా మొగుడు మహా సందడిగానే వుంటాడు. ఆ శబ్దాల హోరు నా మనశ్శరీరాలను ఆవరించుకుపోతుంది. వాటిని మోస్తూనే నేనూ ఆఫీసుకు బయలుదేరుతాను. ఇంట్లో అరుపులకి అలవాటు పడిన నా చెవులు ఆటోమేటిగ్గా వేరే వాళ్ళతో మాట్లాడినపుడు నేనూ అరవాలి కాబోలనే అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల నేనూ గట్టిగా అరవడం మొదలు పెడతాను.
''ఎందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నావ్. నాకేమైనా చెవుడనుకున్నావా?'' అంటూ నా ఫ్రెండ్ పల్లవి ఉతికి ఆరేసిందొకసారి.
''అరిచానా? మాట్లాడాను కదా'' నా అమాయకపు ముఖం చూసి ఫక్కున నవ్వింది పల్లవి.
''అరిచావే తల్లీ! వాల్యూమ్ తగ్గించు'' అంటూ తన పనిలో పడింది.
అంటే నాకు తెలియకుండానే నేను మా ఆయన శబ్దయంత్రానికి ఇరుసైపోయానన్నమాట. నాకు తెలియకుండానే నేనూ అరవడం మొదలుపెట్టానన్నమాట. హమ్మో! అలా జరక్కూడదు. నేనసలు అరవకూడదు అనుకుంటూ నాకు నేను కౌన్సిలింగ్ చేసుకుంటుంటాను.
ఎదురుగా సూర్యుడు షిప్ దాటి మెల్లగా పైకొస్తున్నాడు. నా కాఫీ కూడా పూర్తయింది. హాల్లో కొచ్చి కూర్చున్నాను. తలుపు సందులోంచి పేపర్ జారొచ్చింది. కాలు మీద కాలేసుకుని కూర్చుని పేపర్ చదవడం మొదలుపెట్టాను. నేను కాలుమీద కాలేసుక్కూర్చుంటే మా ఆయనకి నచ్చదు.
''ఏంటా కూర్చోవడం. ఆడవాళ్ళు వొద్దిగ్గా కూర్చోవాలి'' అంటాడు.
తను మాత్రం కాళ్ళు బార్లా జాపి, కాళ్ళ మీద కాళ్ళేసి రకరకాల విన్యాసాల్లో కూర్చుంటాడు. నేను మాత్రం వొద్దిగ్గా, వినయంగా కూర్చోవాలి.
ఫోన్ మోగింది. ఎత్తాలా వద్దా? మా ఆయనే చేసుంటాడు. ఎత్తితే ఒక బాధ. ఎత్తకపోతే ఒక బాధ. ఆగకుండా మోగుతూనే వుంది. తప్పదని ఫోన్ తీసాను.
చెప్పానుగా. మా ఆయనే. ఏం చేస్తున్నావ్ ఒక్క దానివి. ఫోన్ ఎందుకెత్తలేదు. ఏం టిఫిన్ తిన్నావ్? ఇదీ ఫోన్ సారాంశం. తను ఇంట్లో లేడని నేను అల్లాడిపోతున్నానని అనుకుంటాడు.
ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి తింటా నా ఇష్టం. ఈ నాలుగు రోజులూ నావే. నాకు నచ్చినట్లే గడుపుతా. రోజూ లాగా అయితే ఈ రోజుండదు. పేపర్ పక్కన పడేసి కిచెన్‌లోకెళ్ళా. నీట్‌గ అద్దంలా వుంది. రోజూ అయితే ఈ టైమ్‌కి టిఫిన్ చేసే పని మొదలౌతుంది. టిఫిన్ ఏంటి వంట కూడా మొదలౌతుంది. మా ఆయనకి ఎనిమిదింటికల్లా టిఫిన్ పెట్టాలి. అదీ వేడివేడిగా. రోజుకోరకం. ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, పూరీలు, ఉప్మా. చాలా వెరైటీగా వుండాలి. వాటిల్లోకి వెరైటీ చట్నీలుండాలి. ఇడ్లీలకి పల్లీ చట్నీ, దోశలకి కొబ్బరి చట్నీ, పెసరట్టుకి అల్లం చట్నీ, ఏది లోపించినా ఆ రోజు టిఫిన్ తినడు. దోశలైతే వేడివేడిగా పోస్తూ వుంటే చాలా ఆనందంగా లాగిస్తుంటాడు. కొంచెం చల్లారినా 'ఏంటోయ్! వేడి తగ్గింది!' అంటూ సణుగుతాడు. నేను ఏరోజూ వేడిగా తినేదీ లేదు. అతనికి తినబెట్టేసి చల్లారిన వాటినే నేను తింటాను.
ఈ రోజసలు ఏమీ వొండకూడదని నిర్ణయించుకున్నాను. వెధవ వంట. ఎవడు కనిపెట్టాడో కానీ ఆడవాళ్ళని పీక్కుతినే బ్రహ్మరాక్షసి. ఎవరెవరి కోసమో వేడివేడిగా వొండి వడ్డించడమే కానీ ఒక్క రోజైనా నా కోసం వొండుకున్నానా? మొగుడి కోసం, పిల్లల కోసం వాళ్ళకిష్టమైనవి వొండి పొయ్యడం తప్ప ఇది నాకిష్టం. నా కోసం వొండుకుందామనే ధ్యాసే రాదు. అసలు తనకేది యిష్టమో వీళ్ళకి తెలుసా?
కాకరకాయ పులుసంటే తనకెంతో యిష్టం. తను తప్ప ఎవ్వరూ ముట్టరు. తినకపోతే మానే వెధవ కామెంట్లు. 'అబ్బ! ఆ చేదు కషాయం ఎలా తింటావోయ్' వినివిని వొండడం మానేసింది. దొండకాయ తనకిష్టం లేదు. వొండాలంటే విసుగు. నా మొగుడికి దొండకాయి గుత్తికాయ, వేపుడు పచ్చడి అన్నీ కావాలి. లొట్టలేసుకుంటూ తింటాడు. 'అబ్బ! వెధవ దొండకాయ ఎలా తింటారో' అంటే 'అదేంటోయ్ అలా అంటావ్? ఎవరి యిష్టం వాళ్ళది' అంటాడు. కాకరకాయ నా యిష్టమని మాత్రం అతను మర్చిపోతాడు.
వంటింట్లోంచి బయటకొస్తూంటే మళ్ళీ ఫోన్ మోగింది. పల్లవి.
''ఏంటీ ఇంకా బయలుదేరలేదా?''
''లేదు. ఇంకో అరగంట పడుతుంది. మావాడు పూరీలు చెయ్యమన్నాడు సడన్‌గా. అందుకే ఆలస్యమైంది. పూరీ, కూర చేసి వాడికి పాక్ చేసి ఇచ్చేసరికి ఇదిగో ఈ టైమయ్యింది. ఓ అరగంటలో వస్తాలే. మనకి కూడా పూరీలు తెస్తున్నా'' అంటూ ఫోన్ పెట్టేసింది.
పాపం పల్లవి కూడా అంతే. ఇద్దరు కొడుకులు మొగుడు. వాళ్ళకి వెరైటీగా వొండిపెట్టాలని చాలా తాపత్రయ పడుతుంది. వాళ్ళేది అడిగినా నిమిషాల్లో చేసిపెడుతుంది. ఒక్కడు ఒక్క పని ముట్టరు. ఒకడు ఇంజనీరింగ్, ఒడు మెడిసిన్. వాళ్ళకి టైమెక్కడుంటుందే పాపం! అంటుంది. మా ఆయన సాయం చేస్తాంనటాడు కానీ గందరగోళం చేస్తాడు. అవన్నీ సర్దుకునే సరికి తలప్రాణం తోకకొస్తుందే. నాకో గట్టి అనుమానం. అతను కావాలనే గందరగోళం చేసి పనిలోంచి తప్పించుకుంటాడని.' అంటుంది నవ్వుతూ.
ఇంకో కప్పు కాఫీ కలుపుకుని బెడ్ రూమ్‌లోకొచ్చాను. టేప్ రికార్డర్‌లో నాకిష్టమైన క్యాసట్ పెట్టి మంచం మీద బాసింపట్టు వేసుక్కూర్చున్నాను. బాలసరస్వతి మధుర స్వరం.
'సృష్టిలో తీయనిది స్నేహమేనోయి'
మంద్రంగా బాల సరస్వతి పాటలు వింటూంటే ఆ నిశ్శబ్దంలో ఆమె గొంతు ఎంత హాయిగా వుందో. ఏ రోజైనా యీ టైమ్‌లో యింత ఆరామ్‌గా కూర్చుంటానా? ఇంత ఏకాంతం నాకు దొరుకుతుందా? యిల్లంతా ఆక్రమించుకుని, అరుపులతో, అదిలింపులతో రోద చేసే నా మొగుడు యింతటి నిశ్శబ్దాన్ని బతకనిస్తాడా? నా పాటికి నన్నుండనిస్తాడా? ఏంటో నా ఆలోచనలన్నీ అతనికి చుట్టే తిరుగుతున్నాయి. నా గురించి ఒక్క ఆలోచన రావడం లేదు. అతన్నించి విడివడి ఆలోచించలేకపోయేంతగా అతను నన్ను ఆక్రమించాడు. నా ఉనికినే కోల్పోయినట్టుంది. నా మనస్సు, శరీరం నా అదుపులో లేకుండా పోయాయి. ఏంటిది? నేను ఏంటసలు? అతనికి పెళ్ళాన్ని, పిల్లలకి, తల్లిని, ఆఫీసులో ఉద్యోగిని, వంటింట్లో వంటకతై అంతేనా? నా ఉనికి ఇదేనా? నాఅరస్తిత్వం ఇదేనా?
ఛీ.... ఛీ..... ఒక్క మంచి ఆలోచన రావడం లేదు. ఈ క్షణం నుంచి నా గురించే ఆలోచించాలి. నేను కోల్పోయినదేమిటో వెతికి పట్టుకోవాలి. ఈ రోజు నాది. దీనిలో పల్లవికే తప్ప ఇంకెవ్వరికీ ప్రవేశం లేదు. పల్లవి పేరు తలుచుకోగానే ఒక లాంటి హాయి మనసులో కమ్ముకుంది. నా ప్రాణ నేస్తం. వెంటనే తాము రాసుకున్న ఉత్తరాలు గుర్తొచ్చాయి. కట్టలు కట్టలు. ఎక్కడున్నాయో! తన బీరువాలోనే ఎక్కడో వుంటాయి. పల్లవి వచ్చే లోపు వెతికి పట్టుకోవాలి. హమ్మయ్య దొరికాయి. కవర్ తియ్యగానే మొగలి పూల వాసన కమ్మినట్లయింది. ఇద్దరికీ మొగలి పూలంటే ఎంతిష్టమో! ఒక్క మొగలి పూలేమిటి? పొగడపూలు, సంపెంగలు, చమేలీలు, కాగడా మల్లెలు, కొండ మల్లెలు. ఉత్తరాల కట్టను విప్పి మంచం మీద పరిచాను. పల్లవి ఎంత అందంగా రాస్తుందో ఉత్తరాలు. ఎంత చక్కటి కవిత్వం రాస్తుందో. నాకు కథలు రాయడం ఇష్టం. ఎంత కాలమైంది కథ రాసి. ఏ నాటి మాటది?
ఇల్లు, ఆఫీసు, పిల్లలు, సంసారం, చాకిరీ ఇవే మిగిలాయి కానీ నా లోని సృజనాత్మకత ఏమైపోయిందో. నేను యంత్రంగా మారి చాలా కాలమైంది. చాకిరీ యంత్రం. పల్లవి రాసిన ఉత్తరాలు చదువుతూ కూర్చున్నాను. ఒకదాని తర్వాత మరొకటి.
''ఆ తోటలో నొకటి ఆరాధానాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే!''
బాలసరస్వతి గొంతులోని మాధుర్యం, ఆ పాటలోని మధుర భావంలో తేలిపోతున్న వేళ డోర్‌బెల్ మోగింది.
పల్లవి వచ్చినట్టుంది. తలుపు తీసి పల్లవి చేయిపట్టుకుని లోపలికి లాక్కొచ్చాను.
ఏమిటే! అంత సంతోషంగా వున్నావ్. వుండు వీటిని టేబుల్ మీద పెట్టనీ ''తాను తెచ్చిన బాక్సును డైనింగ్ టేబుల్ మీద పెట్టింది.
పల్లవిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళాను. ''ఓహో! బాలసరస్వతి! ఎంత కాలమైంది ఈ పాటలు విని.'' పల్లవి సంబరంగా అంది.
''రెల్లెపూల పానుపుపై
జల్లు జల్లుగా ఎవరో
చల్లినారమ్మా
వెన్నెల చల్లినారమ్మా!''
''ఆహా! ఏమి పాట. ఏమి ఆ సౌకుమార్యం'' పల్లవి.
''ఇవేంటో చూడు.''
''ఉత్తరాలు. నేను రాసినవి. ఏం చేస్తున్నావ్?''
''చదువుకుంటున్నానే. ఎంత ఆనందంగా వుందో వాటిని చదువుతుంటే.''
''అవునా! మరి నాకు చెప్పలేదే! నా దగ్గరున్న నీ ఉత్తరాలు తెచ్చుకునేదాన్ని.''
''పద! ఇపుడెళ్ళి తెచ్చుకుందాం.''
''ఇపుడా? పదముందు టిఫిన్ తిందాం.''
''నువ్వు కవిత్వం రాయడం ఎందుకు మానేసావే.''
''కవిత్వం రాసేటట్టే వుంది? అయినా నువ్వెందుకు కథలు రాయడం లేదు?''
''ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు.''
''ప్రశ్నా లేదు. సమాధానం లేదు. ఈ సంసారం ఓ పెద్దసాగరం. నిండా మునిగిపోయాం. మొగుడు, పిల్లలు, చుట్టాలు. వీటి చుట్టూనే జీవితం తిరుగుతోంది.''
''సంసారం అందరికీ వుంటుంది. కొంతమంది అందులో వుంటూనే తమతమ సొంత జీవితాలు నిర్మించుకుంటారే! మంజరిని మించిన మంచి ఉదాహరణ ఏముంది చెప్పు.''
''మంజరి! దాని ధైర్యం మనకెక్కడిదే.''
''తప్పు మనది కూడా. మనకి ధైర్యం లేదు.''
''ఏంటి మహితా! ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావ్.''
''నిజమేనే! ఉదయంనించి నాకిలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మనం సంసారంలో మునిగిపోయాం సరే. మన ఉనికి కోసం, మన అస్తిత్వం కోసం ఎపుడైనా ఆలోచించామా? లేదు. మనం ఏమీ ప్రయత్నించకుండా వేరేవాళ్ళని నిందించడంలో అర్థం లేదనిపిస్తుందే నాకు.''
''మన ఉనికి?? అస్తిత్వం?? ఎక్కడినుంచి తెచ్చుకుంటాం.'' పల్లవి.
''నువ్వు రాసిన ఈ ఉత్తరాల నిండా ఎంత కవిత్వం వుంది. నువ్వు ప్రయత్నించి వుంటే మంచి కవయిత్రిగా ఎదిగివుండేదానివి. ఇది నాకూ వర్తిస్తుంది. క్రియేటివిటీని నిలబెట్టుకోవాలంటే క్రియేట్ చేస్తూ వుండాలి. మనం ఆ పని మానేసాం.''
''నువ్వన్నది నిజమే! ఈ రోజు మనకో అస్తిత్వం లేకపోవడానికి కారణం మనం కూడా. సృజనాత్మకంగా బతకడానికి చాలా సంఘర్షణ పడాలి. మనం ఎందుకొచ్చిన ఘర్షణలే అని సర్దుకుపోవడం నేర్చుకున్నాం.''
ఫోన్ మోగింది.
మా ఆయనే అయ్యుంటాడు నేను ఏం చేస్తున్నానో, ఏం తింటున్నానో ఆరా తీయడానికి. అలా ఆరా తీయడాన్ని ప్రేమ అనుకుంటాడు. నేను ఫోన్ ఎత్తలేదు. మోగి మోగి ఆగింది.
''పదవే టిఫిన్ తిందాం.''
బాల్కనీలో కుర్చీలు వేసుకుని టీపాయ్ మీద పూరీలు పెట్టుకుని కూర్చున్నాం. ఎదురుగా ఎగిసిపడుతున్న సముద్రం. మా మనసులు అలాగే వున్నాయి.
''మహీ! భిమ్లీ వెళ్ళొద్దామా? నాకు చాలారోజులుగా నీతో కలిసి ఎటైనా వెళ్ళాలన్పిస్తోంది. అసలు మనం కలిసి ప్రయాణం చేసి ఎన్ని సంవత్సరాలైంది? ఎవరి కుటుంబాలతో వాళ్ళం వెళ్ళడం వేరు. ఏమంటావ్?''
''ఏమంటాను? పద పోదామంటాను. మా ఆయన నాలుగు రోజులదాకా రాడు. ఈ నాలుగు రోజులూ నావే. నాకిష్టమైనవన్నీ చేస్తాను. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను.'' అన్నాను ఉత్సాహంగా.
''వండర్‌ఫుల్. నాకు ఓ అయిడియా వస్తోంది. మా అమ్మని ఈ నాలుగు రోజులూ మా ఇంట్లో వుండమంటాను. మనం ఎటైనా వెళదాం.''
''వావ్ పల్లవీ! వాట్ ఎ గ్రేట్ ఐడియా! మనకి కొంచెం ఏకాంతం దొరగ్గానే ఎంత డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నామో చూడు. ఎన్ని ఆలోచనలొస్తున్నాయో! అందుకే మనని ఏకాంతంగా వొదలరు. సంసారం, మొగుడు, పిల్లలు - 24 గంటలూ ఇవే ఆలోచించడంవల్ల, అసలు ఏకాంతంగా ఆలోచించుకునే వెసులుబాటు లేకపోవడంవల్లనే మనం మన గురించి ఆలోచించలేకపోతాం. మన సృజనాత్మకశక్తి కూడా చచ్చిపోతుంది. మనకి ఏకాంతం దొరికితే కదా రాయడానికి?''
''మహీ! నీకు గుర్తుందా? మనం ఒకసారి చదివాం. ఓ తమిళ రచయిత్రి అర్థరాత్రిళ్ళు టాయ్‌లెట్‌లో కూర్చుని కవిత్వం రాసేదని. ఆమె మొగుడు ఆమెని రాయనిచ్చేవాడు కాడట. వాడికి పెళ్ళాం పక్కనే వుండాలి. నిద్రపోతున్నప్పుడు కూడా.''
''అవును. గుర్తుంది. పల్లవీ నువ్వు నిజంగానే అమ్మని రమ్మంటావా? నాలుగురోజులు నాతో గడుపుతావా?'' అనుమానంగా అడిగాను. ఎందుకంటే కొడుకులకి వండిపెట్టకపోతే ఆమెకి క్షణం తోచదు. తను ఇంట్లో లేకపోతే వాళ్ళసలు తిండే తినరని ఆమెకి భయం.
''నిజంగానే చెబుతున్నాను. ఇన్ని మాట్లాడుకున్నాక ఈమాత్రం ధైర్యం చెయ్యకపోతే ఎలా? మా ఆయనతో ప్రోబ్లమ్ లేదు. మా అమ్మ వస్తుందిలే.''
''అయితే మనం భువనేశ్వర్ వెళ్దామా?''
''భువనేశ్వరా? అంత దూరమా.''
''పోనీ అరకు వెళదామా? కనీసం భీమిలీ.''
''ఆగు... ఆగు... మహీ! భువనేశ్వర్ బెటర.్ నా కజిన్ కూడా వున్నాడు. బోలెడన్ని రైళ్ళు. రాత్రి ఎక్కితే పొద్దున దిగుతాం. హాయిగా కోణార్క్, పూరి, చిల్కాలేక్ చూద్దాం.'' ఉత్సాహంగా అంది పల్లవి.
''నువ్వలా చెబుతుంటే భలే బావుంది. అపుడే వెళ్ళిపోయినట్టుంది.'' అన్నాన్నేను.
''వెళ్ళిపోయినట్టు కాదు. వెళుతున్నాం. నేను ఇంటికెళ్ళి, అమ్మకు చెప్పి బట్టలు సర్దుకు వస్తాను. లంచ్‌కి బయటకెళదాం'' అంటూ పల్లవి వెళ్ళిపోయింది.
జ జ జ
నా మనసు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఉదయం నుంచి నాతో సయ్యాటలాడుతున్న ఏకాంతం మళ్ళీ నా ముందుకొచ్చి చిందేయసాగింది. ఈ ఏకాంతం ఎంత హృద్యంగా వుంది. ఈ నిశ్శబ్దం ఎంత నిరామయంగా వుంది. మనుష్యులు ఒంటరిగా వుండటానికి ఎందుకు భయపడతారో? బహుశా ఏకాంతానికి, ఒంటరితనానికి తేడా తెలియక కాబోలు. ఒంటరితనంలో దుఃఖం వుంటుంది. ఏకాంతంలో మనసులోతుల్ని, మనలోపలి ప్రపంచాలను ఆవిష్కరించుకునే సొగసైన తీరు వుంటుంది.
ఏకాంతం ఎంత అపురూపమైందో ఈ రోజు నాకు అర్థమైంది. నా ఆలోచనలు ఇలా సాగుతుండగానే పల్లవి ఫోన్ చేసింది. అన్నీ అమిరిపోయాయ్. ఒంటిగంటకల్లా సూట్‌కేస్‌తో దిగిపోతున్నానంటూ ఫోన్. చెప్పలేని ఉద్వేగమేదో కమ్మినట్టయింది. నేను ఇల్లొదిలి నాలుగురోజులు పోయానంటే మా ఆయన ఏమంటాడో! అని కొంచెంసేపు పీకింది. ఏమంటాడులే! పోట్లాడతాడు. గొడవౌతుంది. కానీయ్. తను తిరుగుతూనే వుంటాడు. నేనొక్కసారి వెళితే ఏమౌతుంది?
నేను ఆలోచనల్లో కొట్టుకుపోతుండగానే పల్లవి వచ్చేసింది. చేతిలో చిన్న సూట్‌కేస్.
''మీ అమ్మ ఏమంది.''
''వస్తానంది. పిల్లలొచ్చే టైంకి వచ్చేస్తుంది.''
''మనం! హఠాత్తుగా ఇలా బయలుదేరుతున్నాం కదా! నాకు మా అమ్మ తరచూ అనే మాట గుర్తొస్తోంది.''
''ఏంటే అది. ఏమనేది?''
''సాల్లో గుర్రం సాలినంత ధనం వుండాలే కాని స్వేచ్ఛకి అడ్డేముంటుంది'' అనేది మా నాన్నతో. మా నాన్న నవ్వేసేవాడు.
''సాల్లో గుర్రం. సాలినంత ధనం.'' వారెవా? ఎంత బాగా చెప్పారే. సాల్లో గుర్రం అంటే వాహనం. సాలితం ధనం అంటే డబ్బు. ఈ రెండూ వుంటే హాయిగా తిరగొచ్చు. భలే చెప్పారు ఆంట''ి.
''మగవాళ్ళకి ఈ రెండూ అందుబాటులో వుంటాయి. ఆడవాళ్ళకి అందనివి. స్కూటర్లూ, కార్లూ, బైక్‌లూ వాళ్ళకే. వనరులు, డబ్బులు, భూములు కూడా అంతే. వీటిలోనే స్వేచ్ఛ వుందని ఎంత గొప్పగా చెప్పిందో అమ్మ. అనుభవం మీద చెప్పి వుంటుంది.''
''మహీ! నీ ఉత్తరాలు కూడా తెచ్చాను. ఎంత కాలమైందో వాటిని చదివి. ఆ... అన్నట్టు మా కజిన్‌తో కూడా మాట్లాడాను. వాడు స్టేషన్‌కి వస్తానన్నాడు.''
''వండర్‌ఫుల్! పల్లవీ! రాత్రికి ఫలక్‌నుమా గుర్రాన్నెక్కి, కోణార్క్‌వేపు సాగిపోదాం.''
''మహీ! చాలా సంతోషంగా వుందే! మనకి ఇలాటి ఆలోచనలు ఇంతకుముందెందుకు రాలేదో కదా!''
''రావుగాక రావు. మనకి క్షణం తీరిక లేని రొటీన్ పనులవల్ల ఇలాంటి ఆలోచనలు రావు. గాలివాటుకి కొట్టుకుపోతుంటాం. మనకోసం మనని ఆలోచించుకోనివ్వని సంసార బాధ్యతల్లో మనల్ని మనం కోల్పోతాం. మనల్ని వెతికి పట్టుకోవడం అంటే చాలా సంఘర్షణ పడాలి. అసలు విషాదం అక్కడే వుంది. సరే. పద. లంచ్‌కెళదాం.''
* * *
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ వేపు దూసుకెళుతోంది. నేను పల్లవి అంతూదరి లేని మాటల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఆ మాటల్లో మా కథలు, కవిత్వాలు, ఉత్తరాలు, ఆటలు బాల్యజ్ఞాపకాలు, ఊరి సంగతులు, కాలేజి కబుర్లు వస్తూ పోతూ వున్నాయి. ఆ ప్రవాహంలో, ఆ ఒరవడిలో మనసుకంటిన మకిలి కరిగిపోతున్నట్టుగా వుంది. ఇంతకాలం కోల్పోయినదేదో ఊటలాగా ఒక్కోచుక్క రాలుతున్నట్టుగా వుంది. నన్ను నేను వెతికి పట్టుకున్నట్టుగా వుంది.
* * *
మా ముచ్చట్లను లోతుగా పరికిస్తోన్న రైలు ఒక రకమైన ఉద్విగ్నతతో చీకట్లను చీల్చుకుంటూ వెలుగుదారుల్లోకి నడుస్తోంది.
* * *
Thursday, August 2, 2012
భువనేశ్వర్ వచ్చింది మహా సీరియస్ మీటింగ్ కి.
జెండర్ బడ్జెట్.బడ్జెట్ ని స్త్రీల ద్రుష్టి కోణం నుండి,
జెండర్ పర్స్పెక్టివ్ నుండి ఎలా అర్ధం చేసుకోవాలి
అనే అంశం మీద మీటింగ్ జరిగింది.
కెంద్ర ప్రభుత్వం గ్రుహ హింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టం తెచ్చింది గానీ
దాని అమలుకు సరిపడిన నిధులివ్వడం లేదు.
జెండర్ బడ్జెట్ కు,ఈ అంశానికి ఉన్న లింక్ కు సంబంధించి
భువనేశ్వర్ లో ఒకటిన్నర రోజులు మీటింగ్ జరిగింది.
చర్చోపచర్చలు,తీర్మానాలు అయ్యాయి.
బుర్ర వేడెక్కిపోయి చల్లగాలి పీల్చుకోకపోతే పిచ్చెక్కిపోయేలా ఉందని కారు బుక్ చేసుకుని కోణార్క్ కి పారిపొయ్యా.
కోణార్క్ శిల్ప సౌందర్యం రెండు కళ్ళు విప్పార్చుకుని చూడాల్సిందే.
అద్భుత శిల్పవిన్యాసం.
ఎన్నివేలమంది శిల్పులు అహర్నిశలు అన్నపానాలు లేకుండా చెక్కారో.
సూర్యుడి రధచక్రాలను చూస్తుంటే ఆ రధం కదులుతున్నదా అనే భ్రమ కలుగుతుంది.
కోణర్క్ చూడడం గొప్ప అనుభవం.
కోణర్క్ నుండి సముద్ర తీరం వెంబడి పురి వెళ్ళడం
మరో అపూర్వానుభవం.
వైజాగ్ నుండి భీమిలి వెళ్ళే రోడ్డులా ఉంటుంది.
దీన్ని మెరైన్ డ్రైవ్ అంటారట.
మధ్యలో దట్టమైన అడవి కూడా వస్తుంది.
పురి బీచ్ అండమాన్ బీచ్ లాగా అనిపించింది.
స్వచ్చంగా,శుభ్రంగా వుంది.
నీలి ఆకాశం రంగులో మిల మిల మెరిసిపోయే నీళ్ళు.
ఇటీవల అక్కడ సముద్రం రోడ్డు మీదకొచ్చేసిందట.అక్కడ రోడ్డు కోతకు గురైంది.
నేను నీళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తుంటే కెరటాలు నా పాదాలను పట్టుకొని వెళ్ళిపోవద్దని బతిమాలినట్టు అనిపించింది.
నేను పొవ్వాలని వెనక్కి తిరిగానో లెదో కెరటాలు ఎగురుకుంటూ వచ్చి మళ్ళి మళ్ళీ నా పాదాలను తాకుతూనే ఉన్నాయి.
వెళ్ళొద్దని అడుగుతూనే ఉన్నాయి.
దిగులుగానే వాటిని వదిలేసి జగన్నాధ గుడి వేపు మళ్ళిపోయాను.
అక్కడి కెళ్ళడం ఓ భయంకరానుభవం.
ఇరుకిరికు రోడ్డు,ఆ రొడ్డు నిండ యాచకులు,పశువులు,దుకాణాలు.
గుడిముందు ఏమిటొ మంటలు.గుళ్ళోకి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తానంటూ వేధించే పురోహితులు.
వద్దు మొర్రో అంటే వినడు.
నేను గుళ్ళో కెళ్ళను బాబో అంటే నన్నో వింత మ్రుగాన్ని చూసినట్టు చూసి క్యోం ఆయా ఇత్నా దూర్ అంటూ లెక్చరివ్వబోయాడు.
అతన్ని తప్పించుకుని,పురి ఇరుకులోంచి బయటపడి
భువనేశ్వర్ వైపు సాగిపోయా.
కోణర్క్, పురి బీచ్ చూడడం మహాద్భుతం.మంచి అనుభవం.
మొదటి సారి భువనేశ్వర్ వచ్చి ఒక్కదాన్ని వెళ్ళిరావడం మహా థ్రిల్లింగ్ గా ఉంది.

Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...