Friday, December 31, 2010

మన చేతి కరదీపిక ఈ భూమిక



1993లో భూమిక ప్రధమ సంచిక విడుదలైనప్పటినుండి వివిధ స్త్రీల అంశాలు, సామాజిక అంశాల మీద ప్రత్యేక సంచికలు వెలువరించాం. ఈ ప్రత్యేక సంచికలన్నీ భూమిక పాఠకుల అభిమానాన్ని, ఆదరాన్ని చూరగొన్నాయి. గత పద్దెనిమిది సంవత్సరాలుగా భూమిక ప్రయాణం, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా దిశని మార్చుకుంటూ కొనసాగుతోంది. ప్రపంచీకరణ వేగవంతంగా ఆంధ్రప్రదేశ్‌ను తాకడంవల్ల అనూహ్యంగా మారిపోయిన పరిస్థితుల్లో వివిధ రంగాల స్త్రీల జీవితాలు అతలాకుతలమయ్యాయి. గ్రామీణ స్థాయి నుంచి, పట్టణ మురికి వాడల్లో నివసించే స్త్రీల వరకు ప్రపంచీకరణ తీవ్ర ప్రభావం చూపించింది. గ్రామాల్లో వ్యవసాయ విధ్వంసం, కుదేలైన చేనేతరంగం, చేతి వృత్తుల ధ్వంసం కోట్లాది ప్రజల జీవనాధారాలను నాశనం చేసాయి. ప్రజలు పొట్ట చేతబట్టి పనుల కోసం నగరాల, మహా నగరాల బాట పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేయబడుతున్నారు. వలస వచ్చిన కుటుంబాల జీవన స్థితిగతులు, వారి హృదయ విదారక జీవన విధానం ముఖ్యంగా ఇల్లు వాకిలీ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో నివసించాల్సి వచ్చిన మహిళల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. నిత్యం దారుణ హింసకు, లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు.

నిర్వాసితులు అనివార్యంగా వలస దారి పట్టడం, వలస వచ్చిన చోట మహిళలు హింసకు గురవ్వడం నేడు సర్వసాధారణమైంది. ఇంటి బయట ఎంత హింస విస్తరించి వుందో ఇంటి నాలుగు గోడల మధ్య అంతే హింస చాప కింద నీరులా ప్రవహిస్తూ వుంది.కొత్త చట్టాలు వస్తున్నాయి. కొత్త సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. హింసలో మగ్గుతున్న స్త్రీల కోసం ఎన్నో సహాయ, సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. గృహహింస నిరోధక చట్టం 2005 అమలు లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటుతోంది. కుటుంబ హింసకు గురవుతున్న మహిళల్ని ఆదుకోవడానికి, రక్షించడానికి, వారికి న్యాయం చెయ్యడానికి రక్షణాధికారుల వ్యవస్థ ఆవిర్భవించింది. వారికి సహకరించడానికి సహాయ సంస్థలుగా 72 స్వచ్ఛంద సంస్థలు సంస్థలు ఉన్నాయి. బాధిత స్త్రీలకు కౌన్సిలింగు ఇవ్వడానికి, వారికి ఉచిత న్యాయం అందించడానికి ఏర్పాట్లు వున్నాయి. జిల్లా స్థాయిలో పి.డి, డివిజన్‌ స్థాయిలో ఆర్‌.డి.వోలు రక్షణాధికారులుగా వున్నారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌లలో సపోర్టుసెంటర్లు ఏర్పాటయ్యాయి. (ఆక్స్‌ఫామ్‌ ఇండియా సహకారంతో) రాష్ట్ర స్థాయి సంస్థగా పనిచేస్తున్న ఉమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌లో సపోర్టు రెండు సెంటర్లు పనిచేస్తున్నాయి ( ఒకటి ఆక్స్‌ఫామ్‌ ఇండియా సహకారంతో మరొకటి సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ సహకారంతో).

బాధిత మహిళని ఆదుకోవడానికి అందుబాటులో వున్న వివిధ సంస్థల గురించిన సమాచారం వారికి చేరేదెలా? స్త్రీ , శిశు అభివృద్ధి విభాగం వారు కొంతమేర అవగాహన కల్గిస్తున్నారు. అయితే స్త్రీలకు అందుబాటులో వున్న చట్టాలు, సహాయాలు, సహకార సంస్థల సమాచారం నిరంతరం జీవనదిలా ప్రవహించాల్సిన అవసరం వుంది. అట్టడుగు గ్రామస్థాయి మహిళ నుంచి పట్టణ మురికి వాడల స్త్రీలు సహ, స్త్రీలందరికీ ఈ సమాచారం అందుబాటులో వుండాలి. ఇంటి లోపల, పని చేసే చోట, బహిరంగ స్థలాలో హింసాయుత పరిస్థితులెదురైప్పుడు ఏం చెయాలో దారి చూపే దీపంలా ఈ భూమిక ప్రత్యేక సంచిక ఉండాలని మేము ఆశించాం. ఒక ప్రమాదం జరిగితే 108 నంబరు గుర్తొచ్చినట్టు, సమస్యలెదురైనప్పుడు మహిళలకి భూమిక హెల్ప్‌లైన్‌ గుర్తొచ్చినట్టు, సమాచారం కోసం భూమిక ప్రత్యేక సంచిక గుర్తుకు రావాలని నా కోరిక.

నిజానికి ఈ ప్రత్యేక సంచిక రూపకల్పన జరిగింది స్త్రీ, శిశు అభివృద్ధి కోసం పనిచేసే కార్యాలయంలోనే. ఉషారాణిగారు డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టినపుడు నేను, గిరిజ (అప్పుడు ఆక్స్‌ఫామ్‌లో వున్నారు) ఆవిడని కలిసినపుడు భూమికలో అప్పటికే ప్రచురిస్తున్న వివిధ జిల్లాల సమాచారం గురించి మెచ్చుకుంటూ మొత్తం అంతా కలిపి ఒక ప్రత్యేక సంచిక వెయ్యండి అని కోరారు. ఎక్కువ కాపీలు వేసి ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో వుంచుదాం, దీనికి అయ్యే ఖర్చును కూడా మేమే భరిస్తాం అంటూ భరోసా ఇవ్వడంతో ప్రత్యేక సంచిక పని మొదలయ్యింది. నాకు నిద్రలేని రాత్రులు కూడా మొదలయ్యాయి. సమాచారాన్నంతా ఎలా పొందుపరచాలి, ఆసక్తికరంగా వుండేలా సంచికను ఎలా రూపొందించాలి అనే ఆలోచనలతో నేను సతమతమయ్యాను.

ఈ ప్రత్యేక సంచికను రూపొందించడంలో ఎంతో మంది సహకరించారు. ఎన్నో పుస్తకాలను చదివాం. ఎందరినో సంప్రదించాం. ముఖ్యంగా భూమికలో హెల్ప్‌లైన్‌ వాలంటరీగా చేరి భూమికతో మమేకమైన వెన్నెల (కల్పన), భూమిక హెల్ప్‌లైన్‌ ప్యానల్‌ అడ్వకేట్‌గా చేరిన శేషవేణిల కృషి ఇందులో ఎక్కువగా వుంది. వారి సహకారం లేకుంటేే ఈ సంచిక వచ్చేది కాదు. ఎప్పటిలాగానే భూమిక టీమ్‌ ప్రసన్న, లక్ష్మి, కల్పన, నాగమణి, ముజీబా, జయల సమిష్టి కృషి వల్ల నా పని నల్లేరు మీద బండిలాగా సాగిపోయింది. అలాగే శాంతసుందరిగారు ఫ్రూఫ్‌ దిద్ది పని త్వరగా అయ్యేటట్లు సహాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ సర్వీసెస్‌ ఆధారిటీ వారి పుస్తకాలు, మంగారి రాజేందర్‌గారి గృహ హింస చట్టం 2005 పుస్తకం, ఎ.పి. పోలీస్‌ వెబ్‌సైట్‌, హేమలలిత పుస్తకాలు, ఎమ్‌. ఏ.వనజ నడి పిన తర్జని, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీ వారి పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, మహిళా కమీషన్‌, ఐడియాస్‌ కన్సల్టెన్సీ వారు ప్రచురించిన ”మన ఊరు, మన పథకాలు” యూనిసెఫ్‌వారి ”స్త్రీలు-చట్టాలు” మొదలైన ఎన్నో పుస్తకాల నుండి సమాచారం తీసుకున్నాం. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. భూమిక హెల్ప్‌లైన్‌ కోసం సేకరించిన సమాచారం మొత్తం ఈ ప్రత్యేక సంచికలో పొందుపరిచాం.

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలందరికీ ఈ సమాచారం అందాలని నా ఆశ. బాధిత మహిళకు దారి చూపించాల్సిన ప్రతి అధికారి, ప్రతి స్వచ్ఛంద సంస్థ చేతిలోను ఒక డైరెక్టరీలాగా ఈ సంచిక ఉండాలని, చుట్టూ కారు చీకటిలా హింస కమ్ముకునే వేళ సోదరీ మణులందరికీ, దీపంలాగా దారి చూపాలని, అంతిమంగా హింస లేని సమాజం వేపు మనమందరం నడిచేలా, స్ఫూర్తి నిచ్చేలా ఈ ప్రత్యేక సంచిక నిలవాలని నా సంకల్పం. ఎప్పటిలాగే మీరంతా ఆదరిస్తారని ఆశిస్తూ…


Sunday, December 19, 2010

చేపలండోయ్ చేపలు



యమ చురుకుగా, కన్నైనా మూయకుండా కదలాడుతుండే చేపలు నాకెప్పుడూ గొప్ప స్పూర్తే.అబ్బో ఎన్ని రకాల చేపలు.
ఆ చైతన్యం చూస్తే ముచ్చటేస్తుంది.
చేపల మార్కెట్ బహుశా చాలా మందికి ఇష్టముండదనుకుంటా.
నాకు మాత్రం మహా ఇష్టం.

ఏ వి ఎన్ కాలేజి ఫంక్ష లో భూమిక ఎడిటర్ గా,"అంకితం" కధల సంకలనం గౌరవ ఎడిటర్ గా చక్కటి సాహితీ కార్యక్రమం లో పాల్గొన్నాను




మర్నాడు ఉదయమే తెన్నేటి పార్కులో సూర్యోదయ దర్శనం,హార్మని సందర్శనం,రాంబాబు తీసిచ్చిన నీరా సేవనం, ఆ జోష్ లో చేపల రేవులో దిగాం.
మగవాళ్ళు రకరకాల చేపలు తెస్తున్నారు.
ఆడవాళ్ళు వాటిని కొంటున్నారు.
గోలగోలగా పూర్తిగా చేపల మార్కెట్ లాగానే ఉంది.
నాకు ఆ చేపల్ని చూస్తే ముచ్చటేసింది.
ఎన్ని వెరైటీలు.
సావడాయలు,ఇసక దొందులు,కానా గంతలు,మాఘలు ఇంకా ఎన్నో పేర్లు.
నేను నాలుగు రకాలు కొనేసి కార్లో పడేసుకున్నాను.
పరదేశి అమ్మ నాతో ఫోటో కు సై అంది.
నాతో నా ప్రియ మిత్రులు జయ,గీత పాల్గొన్నారు.

Wednesday, December 8, 2010

సుబ్బమ్మ గారి గురించిన పోష్ట్ కి స్పందించిన మీ అందరికి ధన్యవాదాలు.

నా పోష్ట్ కి స్పందించిన మీ అందరికి ధన్యవాదాలు.

మల్లాది సుబ్బమ్మ గారి గురించి ఇన్నయ్య గారు రాసిన కామెంట్ అక్షర సత్యం.
నేను కూడా ఆవిడతో కలిసి పని చేసాను.
ఆవిడ ప్రారంభించిన అభ్యుదయ వివాహ వేదిక లో తొలి పెళ్ళి నాదే.ఉదయం రిజిస్టర్ చేసుకుని సాయంత్రం వారింట తేనీటి విందు పార్టీ జరిగింది.ఆనాటి మీటింగ్ లో సుబ్బమ్మ గారు,లవణం గారు,ముఖ్య పాత్ర పోషించారు.ఇది 1981 లో సెప్టెంబర్ 5 న జరిగింది.నేనంటే ఆవిడకు చాలా అభిమానం.
మా అమ్మాయి అంటూ,ఈమె పెళ్ళి నేనే చేసాను అని అందరికి చెప్పేవారు.స్పారో అనే సంస్థ కోసం నేను ఆవిడను ఒక రోజంతా ఇంటర్వ్యూ చేసాను.
ఆవిడ వ్యక్తిత్వం ఉన్నతమైంది.
సుబ్బమ్మ గారితో ఉన్న అనుబంధం వల్లనే ఆమెను అలా చూసి తట్టుకోలేక రాసాను.
తన వయస్సు 86.వయస్సు సంబంధ అనారోగ్యమే.

మృత్యువుతో సైతం పోరాడుతున్న మల్లాది సుబ్బమ్మ


మల్లాది సుబ్బమ్మ గారికి బాగా లేదని తను వెళ్ళి చూసి వచ్చానని అబ్బూరి చాయా దేవి గారు చెప్పారు.వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను.
నేను వెళ్ళేసరికి రాత్రి ఎనిమిదవుతోంది.ఆవిడ ఒక్కరూ మంచం మీద అపస్మారక స్థితి లో కనిపించారు.ఆవిడ దగ్గర ఎరూ లేరు.రెండు చేతులూ మంచానికి కట్టేసి ఉన్నాయి.సుబ్బమ్మ గారూ నేను భూమిక సత్యవతి అండి ఎలా ఉన్నారు.
అంటే ఆవిడ కళ్ళు తెరిచారు.ఓ క్షణం నావేపు చూసారు.వెంటనే కళ్ళు మూతలు పడిపోయాయి.
నర్సింగ్ ష్టేషన్ కి వెళ్ళి సుబ్బమ్మ గారి అటెండెంట్ ఎక్కడున్నారు అని అడిగితే ఎవ్వరూ లేరు ఇంటికెళ్ళిపోయారు.మేమే చూసుకోవాలి అన్నరు నర్సులు.
నాకు గుండెల్లో కలుక్కుమంది.
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

జీవితమంతా తనకు తోచినట్టు మహిళల కోసం పోరాటం చేసిన సుబ్బమ్మ గారు,ఎప్పుడూ జనం మధ్యలో గడ గడా మాట్లాదే సుబ్బమ్మ గారు అల ఏకాకిలాగా మంచం మీద పడి ఉండడం,దగ్గర ఎవ్వరూ లేకపోవడం నాకు చాలా బాధ అనిపించిని.ఎన్నో ఉద్యమాల్లొ పాల్గొన్న మల్లాది సుబ్బమ్మ,ఎన్నో సంస్థలను స్త్రీల కోసం నడిపిన మల్లాది సుబ్బమ్మ మృత్యువుతో సైతం పోరాడుతోందా అనిపించింది నాకు.

Sunday, December 5, 2010

ఒక్క రోజు డిల్లీ లో దుకాణం తెరిచిన భూమిక








నిజమండి.నవంబర్ 28 న ఢిల్లీ లోని వసంత్ కుంజ్
ప్రాంతంలోని ఒక ఫాం హౌస్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో భూమిక పాల్గొంది.
భూమిక అంటే సినిమా నటి అనుకునేరు.
కాదండీ భూమిక పత్రిక,భూమిక హెల్ప్ లైన్ అన్నమాట.
డెవలప్మెంట్ మార్కెట్ పేరుతో ఆక్స్ ఫాం ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ లో మేము దుకాణం తెరిచాము.
జెండర్ సెన్సిటివిటి,జెండర్ వైలెన్స్ మీద అవగాహన కల్పించే పని మాది.
100 దేశాల నుంచి 300 మంది విదేశీ యువత ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.
భూమిక చేసే పని గురించి,మహిళల మీద హింస తగ్గించడంలోను,కుటుంబ హింసకు గురయ్యే మహిళలకు హెల్ప్ లైన్ ఎలా తోడ్పడుతోంది,మేము ఏ విధంగా పని చేస్తాము లాంటి విషయాలు మా స్తాల్ సందర్శకులకు వివరిచాలి.
నాతో పాటు నా ఫ్రెండ్ ఉత్పల,మా రిసెర్చ్ అసోసియేట్ ముజీబా పాల్గొన్నారు.
ఉదయం నుంచి సాయంత్రందాకా సాగిన ఈ ప్రోగ్రాం లో మా స్టాల్ కి మంచి స్పందన లభించింది.
లేపాక్షి నుంచి మన హాండీ క్రాఫ్ట్స్ కొనుక్కెళ్ళి మా స్టాల్ల్ ని ఆకర్షణీయంగా అలంకరిచాము.
నేను గౌహతి లో కొనుక్కున్న బుల్లి కేన్ సోఫా సెట్, బుల్లి బుల్లి మోడాలు,చిన్ని టీ సెట్,సోఫాలో కూర్చున్న రక రకాల రంగుల్లో పిట్టలు,బొంగరాలు,మోటర్ సైకిల్,బండ్లు,కీ చైన్స్ ఇలా రక రకాల బొమ్మలతో డెకరేట్ చేసాం.పిల్లలు వెల్లువలా మా  స్టాల్కి వచ్చారు.
మేము చేసే పని గురించి అడుగుతూ వాళ్ళు చేసే పని గురించి మాకు చెప్పారు.
చాలామంది చాలా రకాల స్టల్స్ పెట్టారు.
అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. రాజస్తాన్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరిచాయి.
వచ్చిన విదేసీ యువత ఎంతో ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉన్నారు.
అందరూ చేతులు చాపి మెహిందీ పెట్టించుకోవడానికి ఎగబడ్డారు.
నాకు ఎంతోఆశ్చర్యం  కలిగించిన అంశం ఏమిటంటే వచ్చిన యూత్ లో కనీసం ఆరుగురు వీల్ చైర్ లో వచ్చారు.
ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు నడవలేకపోయినా.
డిల్లీ లో దుకాణం తెరవడం,అదీ యువత తో మాటా మంతీ కలపడం,పరస్పరం అనుభవాలను
కలబోసుకోవడం అద్భుతమైన అనుభవం.
100 దేశాలకు భూమిక పని గురించి తెలియడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది
మేము అలంకరిచిన బొమ్మలు అమ్మమని చాలా మంది అడిగారు.
మేము ఒకటే సెట్ తీసుకెళ్ళాం.
చూపిద్దామనుకున్నాం కానీ అమ్మొచ్చనుకోలేదు.
అయితే నాలుగు గంటలకి మళ్ళీ అందరూ వచ్చి బొమ్మలు అమ్మామని అడిగారు.
మంచి ధరకి బొమ్మల్ని అమ్మేసాం.
నా కేన్ సోఫా సెట్ మీద చాలా మంది కన్నేయడంతో నేను దాన్ని తీసేసి దాచేసుకున్నాను.



చివరలో మిగిలినవన్నీ సర్దుకున్నాం గానీ నేను మా సీతారాంపురం నుంచి ప్రేమగా తెచ్చుకున్న లేస్ టేబుల్ క్లాత్ మర్చిపోయాం..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...