Friday, October 15, 2010

అబ్బూరి చాయాదేవి గారి పుట్టినరోజు -చదువుకునే పిల్లిగారు

సెప్టెంబర్ 13 ప్రముఖ రచయిత్రి,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత అబ్బూరి చాయాదేవి గారి పుట్టిన రోజు.సెప్టెంబర్ 10 ప్రముఖ కవయిత్రి  సుజాతా పట్వారి పుట్టిన రోజు.
ప్రతి నెల భూమిక కార్యాలయంలో జరిగే రచయిత్రుల సమావేశం లో ఆ నెలలో పుట్టిన వారి పుట్టినరోజును జరపుతాం.
భూమిక ఆఫీసులో సరదాగా రచయిత్రుల సమక్షంలో వేడుకగా వీరద్దరి పుట్టినరోజును జరిపాం.చాయా దేవిగారికి ఎంతో ఇష్టమైన పిల్లిబొమ్మని నేను కానుకగా ఇచ్చాను.తోకని కాండిల్ స్తాండ్ గా చేసుకుని కాండిల్ వెలుతురులో చదువుకుంటున్న పిల్లిబొమ్మ అది.
కొవ్వొత్తి ఆర్పకుండా వెలిగించి ఆవిడకిచ్చాను.
ఆవిడ బోలెడు సంబరపడ్డారు.

2 comments:

కథా మంజరి said...

కొంచెం ఆలీసెంగానయినా, ఛాయా దేవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరిచ్చిన కానుక భలేగా ఉంది సుమండీ !

భాను said...

మీ బ్లాగ్ముఖంగా చాయా దేవి గారికి జన్మ దిన శుభా కాంక్షలు. మొన్నేమధ్య చాయ దేవి గారి సుఖంతఃమ్ కథ గురించి సాక్షి లో చదివానండి. నిద్ర కోసం ఓ ఇల్లాలు చేసే అంతిమ ప్రయత్నం....నిజంగా నిద్ర కోసం నిద్రపోతున్ననంటూ ..నిద్ర మాత్రలు మింగి భర్తకు ఓ చీటీ రాసిపెట్టి పోవడం...నిజంగా రివ్యు చదువుతుంటేనే అదోలా అనిపించింది..కథ చదివితే ఎలా ఉంటుందో.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...