Tuesday, June 1, 2010

అంతర్జాలం లో తెలుగు మహిళా బ్లాగర్ల విజయ ఢంకా

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది మహిళలు తెలుగు బ్లాగ్ రాజ్యాన్ని ఏలేస్తున్నారు.
మహిళల బ్లాగ్ లంటే ఏముంటాయిలే వంటలు,వోమన గుంటలు అని వెక్కిరించే బి.సీ కాలం నాటి పురుషపుంగవులకు దిమ్మతిరిగేలా (ఈ చురక అలాంటివారికే పరిమితం)కళ్ళు జిగేల్మనేలా నవనవోన్మేషంగా, వైవిధ్యభరితంగా రూపుదిద్దుకున్న మహిళా బ్లాగర్ల బ్లాగులివిగో.ఒక్కొక్కటి దేనికదే సాటి.


కధలు,కవితలు,పాటలు,పల్లవులు,ప్రయాణానుభవాలు,ఆరోగ్య చిట్కాలు,ఉత్తరాలు,వంటింటి కబుర్లు,స్నేహ సౌరభాలు,గుండెల్లొ కువకువ లాడే ఊసులు,మనసులోని మాటలు,సామాజిక అంశాల మీద అద్భుతమైన విశ్లేషణలు,స్త్రీల సమస్యలపై సూటైన రాతలు.


నేను ముందే రాసినట్టుగా విభిన్నాంశాల సమాహారమే మహిళలు నిర్వహిస్తున్న బ్లాగులు. అసహనాలు, అసూయావేశాలు పక్కనపెట్టి తేట కళ్ళతో చదివి చూడండి. నచ్చకపోతే ఒదిలేయండి. నచ్చితే సంతోషం మీదే కదా.


తెలుగు మహిళా బ్లాగర్లపై సమగ్ర వ్యాసం .. ఇక్కడ భూమికలో ..

6 comments:

Kathi Mahesh Kumar said...

కొన్ని లింకులు ఇచ్చుంటే బాగుండేదికదా!

నెలనెలావెన్నెల said...

congratulations to all

Ramu S said...

అభినందనలు. మహిళలు ఇంకా తమ పరిధిని, సామ్రాజ్యాన్ని విస్తరించాలి. ఇంకా బాగా రాయాలి.
రాము

cbrao said...

ఈ వ్యాసం మహిళా బ్లాగులు చదవాలనుకునే వారికి ఎలా ఉపయోగ పడుతుంది? మహిళా బ్లాగుల గురించి తెలిసిన వారికి ఈ వ్యాసం అవసరం లేదు కదా!

................ said...
This comment has been removed by the author.
................ said...

It would be nice if you could list the links to these blogs. Then you would have answered the questions of Mr CB Rao. Thanks for the summary!

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...