Tue, May 25 07:19 PM (yahoo news)
Chandigarh, May 25 (IANS) Anand Prakash, the main complainant in the Ruchika Girhotra molestation case, Tuesday said he may move higher courts for sentencing disgraced former Haryana police chief S.P.S. Rathore to two-year jail instead of 18 months.
A local court here Tuesday enhanced the jail sentence of Rathore in the nearly 20-year-old molestation case from six months to 18 months and ordered his arrest by the Central Bureau of Investigation (CBI).
'I am very happy that the court has enhanced the sentence but at the same time there is some disappointment in my heart as court can also award him the maximum punishment of two years for molesting Ruchika,' Prakash, the main complainant in this case, told IANS.
'Our fight is still on and we will go to high court and even the Supreme Court seeking maximum jail sentence in this case. We will discuss this issue with our lawyers in the coming days,' he said.
The order of the court came after Rathore filed a plea in January this year challenging his conviction by a CBI special court here for molesting 15-year-old Ruchika Aug 12, 1990.
Ruchika committed suicide three years after Rathore molested her in Panchkula town, adjoining Chandigarh.
Rathore was sentenced to six months' rigorous imprisonment and fined Rs.1,000 by the CBI special court Dec 21 last year. However, he was immediately granted bail.
Madhu Prakash, wife of Anand, told IANS: 'We are happy that once again the court has marked a stamp on the fact the Rathore is a culprit. There is a provision of two-year jail for this offence but I think that judge had taken into consideration poor health of Rathore while announcing the verdict.'
'But still three other cases are pending against Rathore and court can award him 10 year jail in the case registered under abetment to suicide,' stated Madhu.
Madhu Prakash's daughter Aradhna, who has now migrated to Australia, was the only witness in this case. She was a close friend of Ruchika.
Rathore, 68, was taken into custody by the CBI soon after the district and sessions court rejected his appeal against his December 2009 conviction. He was taken to Burail prison here.
This is the first time that Rathore has been formally arrested in the Ruchika molestation case.
Tuesday, January 12, 2010
ఒక జెసికాలాల్, ఒక అరుషి, ఒక స్వప్నిక, ఒక రుచిక. ఎవరు వీళ్ళంతా? ఏం జరిగింది వీళ్ళకి. ఈ సంవత్సరాంతాన ఎందుకు వీళ్ళను తలుచుకోవలసి వస్తోంది. వీళ్ళంతా ఎందుకు అర్ధాంతరంగా చనిపోయారు? చనిపోలేదు. చంపేయబడ్డారు. కళ్ళ ముందు వరుస క్రమంలో నిలబడి నన్నెందుకు ఇంతటి మానసిక క్షోభకి, ఆపుకోలేని దు:ఖానికి గురి చేస్తున్నారు. అదుపు చేసుకోలేని కోపంతో నా కలం కూడా వొణుకుతోంది. ఏం తప్పు చేసారని వాళ్ళు మరణం అంచులవేపు నెట్టేయబడ్డారు. ఈ దేశంలో ఆడదానిగానో, ఆడపిల్లగానో పుట్టడమే వాళ్ళ నేరమా? ఇంకా ఎంతమందిని ఇలా చంపేస్తారు? చంపేసిన వాళ్ళని శిక్షించరా? శిక్షలు పడవని తెలిసేకదా చంపేస్తున్నారు.
నేను ఢిల్లీలోని కుతుబ్ హోటల్ రూమలో టి.వీ ముందు కూర్చుని, ఆనాటి సమావేశపు బడలిక నుండి సేద తీరుతున్నవేళ రుచిక కేసుకు సంబంధించిన తీర్పు గురించిన వార్తను చూసాను. పద్నాలుగు సంవత్సరాల పసిపిల్ల రుచిక లైంగిక అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 19 సంవత్సరాల తర్వాత వెలువడిన తీర్పు గురించిన వార్తను చూసాక నా గుండె ఒక్కసారిగా జలదరించినట్టయింది. నిందితుడు, అప్పటి హర్యానా ఐజి ఎస్.పి.ఎస్‌్. రాధోడ్ నవ్విన నవ్వు, వెకిలి, విషపు నవ్వు నా కళ్ళల్లోంచి కదలడం లేదు. భారతదేశ న్యాయవ్యవస్థ భాగోతం మీద రాధోడ్ ధిక్కార, నిర్లక్ష్యనవ్వు. నన్నెవరేం చెయ్యలేరు అనే పొగరుబోతు నవ్వు. పసిపిల్ల మీద దున్నపోతులా లైంగిక వేధింపులకు పాల్పడిన రాధోడ్, దున్నపోతు మీద వాన కురిసినట్టే న్యాయవ్యవస్థ ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళి పోయాడు. కేవలం ఆరునెలల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా. ఘనత వహించిన కోర్టువారు వెంటనే ఉదారంగా బెయిల్ కూడా మంజూరు చేసేసారు. పై కోర్టులో అప్పీల్ చేస్తానంటూ దున్నపోతు కోర్టు నుండి జారిపోయింది.
ఈ ఉదంతం మనిషన్న వాడిని మండించకుండా వుంటుందా? తన ప్రాణ స్నేహితురాలి తరఫున ఇరవై సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న ఆరాధన దు:ఖాన్ని ఎవరు అర్ధం చేసుకుంటారు? ఎవరు ఓదార్చుతారు? స్త్రీలమీద పదే పదే జరుగుతున్న ప్రాణాంతక దాడులు, లైంగిక అత్యాచారాలు, యాసిడ్ పొయ్యడాలు పెచ్చరిల్లి పోతూనే వున్నాయి. నిందితులు రాజకీయ అండబలంతో, డబ్బు కండకావరంతో, ఏళ్ళు పూళ్ళూ సాగే న్యాయవిచారణా వ్యవస్థ, అవినీతిలో మునిగితేలే పోలీసు వ్యవస్థల వల్ల చట్టం నుండి సునాయాసంగా తప్పించుకుపోతున్నారు. శిక్షించని న్యాయవ్యవస్థ వల్ల అత్యాచారాలకు గురౌతున్న స్త్రీలు తామే అంతమౌతున్నారు తప్ప నిందితులు కాలరెగరేసి, వెకిలి నవ్వులు నవ్వుతూ సభ్య సమాజంలో మిన్నాగుల్లా తిరుగతూనే వున్నారు మళ్ళీ మళ్ళీ కాటేేస్తూనే వున్నారు.
1990 ఆగష్టు పన్నెండు. కోటి ఆశలతో టెన్నిస్ తారనవ్వాలనే బలమైన ఆకాంక్షలతో అప్పటి హర్యానా ఐజి మరియు హర్యానా లాన్ టెన్సిస్ అధ్యక్షుడు రాధోడ్ ఆఫీసులో అడుగుపెట్టింది రుచిక. తన ఫ్రెండ్ ఆరాధనని వెంట తీసుకెళ్ళింది. ఆరాధనని బయటకు పంపి 14 సంవత్సరాల రుచికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు రాధోడ్. తిరిగి వచ్చిన ఆరాధనకి జరిగిన ఘోరాన్ని చెప్పింది రుచిక. ఆగష్టు 18న పోలీసులకు ఫిర్యాదు చేసారు రుచిక తండ్రి, సోదరుడు. రుచిక స్వదస్తూరితో జరిగిన ఘోరాన్ని రాసిచ్చింది. పోలీసులు కంప్లయింట్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి రాధోడ్ మీద నేరాన్ని ధృవీకరించారు. అప్పటి నుండి రుచిక కుటుంబం తీవ్రమైన వేధింపులకి గురౌతూ వచ్చింది. బెదిరింపులు రావడం, రుచిక ఎక్కడికెళ్ళితే అక్కడికి రాధోడ్ గుండాలు వెంటాడం, రుచిక సోదరుడి మీద కారు దొంగతనాలు అంటగట్టి అరెస్ట్ చేయడంలాంటి వికృత చర్యలకి రాధోడ్ పాల్పడడం మొదలుపెట్టాడు. ఒకసారి రుచిక సోదరుడిని ఆమె ముందే తీవ్రంగా కొట్టి వేధించాడు. రుచికని స్కూల్ నుండి తీసేసారు. పద్నాలుగు సంవత్సరాల రుచిక ఈ మానసిక వేదనని, వొత్తిడిని తట్టుకోలేక రాధోడ్‌ని తిడుతూ తన జీవితాన్ని నాశనం చేసాడని బిగ్గరగా ఏడ్చేదని తండ్రి చెప్పారు. తనెంత నచ్చ చెప్పినా, ఓదార్చినా వినేది కాదని కళ్ళనీళ్ళ మధ్య పత్రికల ముందు వాపోయాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి లోనై డిశంబరు 29, 93లో రుచిక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆరాధన, ఆమె తండ్రి కలిసి రుచిక ఆత్మహత్యకు కారకుడు రాధోడ్ అంటూ కేసు వేసారు. క్రింది కోర్టు ఈ వాదనని అంగీకరించినప్పటికీ హైకోర్టు అతను నిర్ధోషి అని కితాబిచ్చి వదిలేయడం, ప్రభుత్వం రాధోడ్‌కి డి.జిపిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగిపోయాయి.
ఆరాధన తన పోరాటం ఆపలేదు. 1990 కేసు రిజిస్టరు అయినప్పటికీ 1999 వరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ కాలేదు. రాధోడ్ తన రాజకీయ, పోలీసు ప్రాబల్యాన్ని ఉపయోగించి కేసును ముందుకెళ్ళకుండా చెయ్యడంతో పాటు రుచిక కుటుంబాన్ని చంఢీగడ్‌లో బతకలేని స్థితి కల్పించాడు. డి.జి.పిగా తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించడంవల్ల వారు చంఢీగడ్ నుంచి వెళ్ళిపోయారు. వారి తరఫున, తన స్నేహితురాలి కోసం ఆరాధన ఇరవై సంవత్సరాలు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు డిశంబరు 21, 2009న చిన్నపాటి విజయం సాధించింది. రాధోడ్‌కి కేవలం 6 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది కోర్టు.
నేరం జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత, బాధితురాలు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెకి దొరికిన న్యాయం చూసి గుండెలు బాదుకుని ఏడ్వాలో, పగలబడి నవ్వాలో తెలియడం లేదు. నేరగాడికి సంబంధించి, అతడిని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన రాజకీయ వ్యవస్థ విశ్వరూపం దిమ్మతిరిగేలా చేస్తోంది. నలుగురు ముఖ్యమంత్రులు ఈ నేరస్థుణ్ణి కాపాడుకుంటూ వచ్చిన వైనం కథలు, కథగా, వార్తాపత్రికలు ప్రచురిస్తున్న కధనాలు చదువుతుంటే, ఎంతమందిని ఎన్ని రకాలు ప్రలోభపెట్టి, బెదిరించి తన నేరాన్ని కప్పిపుచ్చుకున్న పెద్ద పోలీస్ రాధోడ్ కౄరమైన, వెక్కిరింత నవ్వు వెన్నులో వొణుకు పుట్టిస్తోంది. స్త్రీల మీద అత్యాచారాలు చేసి, కిరోసిన్ పోసి కాల్చి, యాసిడ్ పోసి రూపాలను చిదిమేసి, ఎన్నో దారుణాలు చేసే పురుషుల్ని, నేరస్థుల్ని, నిందితుల్ని, పురుషాధిక్య సమాజం ఎలా కాపాడుకుంటూ వస్తుందో ‘రుచిక’ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల్లోను పాతుకుపోయిన పితృస్వామ్యం స్త్రీలను ఎన్ని రకాలుగా రాచిరంపాన పెడుతుందో ఈ కేసులో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని నేరాలు చేసినా, కమ్ముకుంటూ, కాపాడుకుంటూ వచ్చే పోలీస్, పరిపాలన, న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు వున్నపుడు రుచికలాంటి పసికూనలు రాధోడ్‌లాంటి రాక్షస పదఘట్టనల కింద నలిగిపోక ఏమైతారు? రాధోడ్ కౄరనవ్వుకి అర్ధం ఇదే.
మరి మనమేం చెయ్యాలి? నిరాశలో కూరుకుపోదామా? నిట్టూర్చి వదిలేద్దామా? ఈ దేశంలో 50 కోట్ల మంది స్త్రీలకి గౌరవంగా, భద్రంగా, హింసారహితంగా బతికేహక్కు వుందని ఎలుగెత్తాల్సిన అవసరం, ఆవశ్యకత మరింత ఎక్కువైందని అర్ధం చేసుకుందామా? రాధోడ్ పురుషులందరికి ప్రతినిధి కాడు. పురుష ప్రపంచమా! పెదవి విప్పండి. మాతో గొంతు కలపండి. పోయేదేమీ లేదు. సమానత్వం వెల్లివిరియడం తప్ప.
1 comment:
Satyavati గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Post a Comment