అప్పికట్ల నుండి ఉదయమే వచ్చాను.
కొత్త సంవత్సరం ఆరంభం లో ఢిల్లి దుర్ఘటన కలిగించిన దుఖం నుండి నన్ను సేదతీర్చింది అప్పికట్ల.
చాలా అద్భుతమైన అనుభావాన్నిచ్చింది అప్పికట్ల.
నన్ను ఆ గ్రామం రిసీవ్ చేసుకున్న పద్ధతి,నన్ను సన్మానించిన విధానం నేను ఎప్పటికి మర్చిపోలేను.
ఊరంతా నా పేరు మీద వెలసిన ఫ్లెక్సీలు చూసినప్పుడు నాకు చాలా సంభ్రమంగా అనిపించింది.
ఊరులో తిరుగుతున్నపుడు అందరూ మీరేనా భూమిక సత్యవతి అని అడుగుతుంటే ఏదో గమ్మత్తుగా అనిపించింది.
చక్కటి గ్రామం.
ఊరంతా వెల్లి విరిసిన సంక్రాంతి సంబరం.
ఆటల పోటీలు,రంగవల్లుల పోటీలు.
ఊరంతా ఉత్సాహం.
కొసరాజు రాఘవయ్య,జస్టిస్ అమరేశ్వరి,తుమ్మల సీతారామమూర్తి
లాంటి ప్రముఖులకు పుట్టిల్లు అప్పికట్ల.
కనుపర్తి వరలక్ష్మమ్మ,ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ లాంటి ప్రముఖులకు పక్కనే ఉన్న బాపట్ల స్వంత ఊరు.
శంకరం వేదిక తరఫున యలమర్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమాల రూపకర్త.
వారి సహచరి ధన లక్ష్మి గారు.
రాజేంద్ర ప్రసాద్ తండ్రిగారే శంకరం గారు,వారి పేరు మీదనే ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు ,సన్మానాలు జరుగుతున్నాయి.
ప్రముఖ సినీ గేయ రచయిత రాసిన "ఏరువాకా సాగారో" పాటకి చిన్నారుల నృత్యం తో కార్యక్రమం మొదలైంది.
బహుమతి ప్రదానాలు,అపైన నాకు ఎంతో ఆత్మీయంగా చేసిన సన్మానం.
నేను ఓ అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చాను.అందరూ శ్రద్ధగా విన్నారు.
మంచి విషయాలు చెప్పావమ్మా అనే ఫీడ్ బాక్ వచ్చింది.ఆ తర్వాత
గుంటూరు నుండి వచ్చిన మ్యూజికల్ పార్టి వారి పాటలు ఫర్వాలేదు కానీ
అతిగా ముస్తాబైన అమ్మాయిల్ని స్టేజి మీద కూర్చోబెట్టడం,వాళ్ళ చేత ఐటం సాంగ్స్ లో చేసేలాంటి డాన్సులు చేయించడం చెప్పొద్దూ నాకు మరో రూపం దాల్చిన ఈష్ట్ గోదావరి రికార్డింగ్ డాన్సుల్లా అనిపించాయి.
అర్ధరాత్రి దాకా అవి కొనసాగాయి.
నా ట్రైన్ 12 గంటలకి.
ఎక్కడో పుట్టిన నేను,మరెక్కడో పని చేస్తున్న నేను ఈ అప్పికట్ల గ్రామ వాసుల గుండెల్లో స్థానం సంపాదించుకుని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యాను.
5 comments:
మీ ఉపన్యాసం లో ఏ విషయాలు మాట్లాడారు?
ఊర్లో వీదులమీద పరుచుకున్న ముగ్గులు మాత్రం.. అద్భుతం!
ఎంత చక్కగా వేశారో..
చాలా బాగున్నాయి ఫోటోలు.సంక్రాంతి కళ్ళకు కట్టినట్లు ఉంది.మధ్యలో కాలు మీద కాలు వేసుకున్న ముసలమ్మా,బర్రె,కుక్క లు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను
GOOD
ఫోటోలు చాలా బాగున్నాయి.మేమూ అక్కడ వున్నట్లు అనిపించింది .కంగ్రాట్స్ మేడం .
గల గల పారుతూ వచ్చిన గోదావరి
రాజమండ్రి రాగానే నిదానమై, నిశ్సబ్దంగా
నన్నయ వ్రాసిన భారతాన్ని వింటూ
వంతెనల మీద పరిగెత్తే రైళ్ళను, బస్సులను
చూస్తూ నెమ్మదిగా ధవలేశ్వరాన్ని దాటి
పాయలుగా చీలి పచ్చని పొలాలలో
బంగారం పండిస్తూ సాగరమాత గర్భంలో చేరుకొని
సేద దీరుతుంది కాబోలు!
Post a Comment