జూ పార్క్ లో వెదురుపూల వెల్లువ

జూ పార్క్ లో జంతువులే కాదండోయ్ వెదురుపూలు వెల్లువెత్తాయ్.
నిన్న పేపర్ల లో వార్త చదివాను జూ పార్క్ లో ఉన్న అసంఖ్యాకమైన వెదురు చెట్లు విపరీతంగా పూసాయని.
ఈశాన్య రాష్ట్రాల్లో కదా వెదురు పూలు పూస్తాయని ఇంతకాలం అనుకున్నాను.వెదురు పూలు పూసినపుడు అక్కడ పండగ కూడా చేస్తారని చదివాను.40 సంవత్సరాలకు ఒక సారి పూస్తాయట.
జూ ఓపెన్ అయ్యాక ఈ చెట్లు ఎప్పుడూ పుయ్యలేదట.
హమ్మో!!! ఇప్పుడు చూడకపోతే ఇంతేసంగతులు.మనం నలభై కాదు పదేళ్ళు బతికి ఉంటామన్న గ్యారంటి లేదు.అంతే!! సిరికిన్ చెప్పక అనంట్టుగా ఈ రోజు ఉదయం జూ కి పరుగెత్తను.నేను కాదు లెండి పాపం ఆ ఎర్రటి ఎండలో నా కారు
జూ కి దౌడు తీసింది.
500 వందలు కారుకి చెల్లించుకుని కారుతో సహ లోపలికి వెళ్ళి జూ అంతా తిరిగి బోలెడు ఫోటోలు తీసుకున్నాం.నాతో పాటు నా ఫ్రెండ్ గీత కూడా ఉంది.
అబ్బో!!!! వెదురు పూలని చూసి మనసు ఉప్పొంగిపోయింది.
మేమిద్దరం హాయిగా పూల మధ్య తిరుగుతుంటే టివి 9 వాళ్ళు మా వెంట పడ్డారు.ఈ పూల గురించి ఎవ్వరిని అడిగినా మాట్లాడ్డం లేదు మీరు మాట్లాడండి ప్లీజ్ అంటే మేం మహా పోజుగా ఇంటర్వ్యూ ఇచ్చేసాం.
మీ కోసం ఇవిగో వెదురుపూలు.
అన్నీ ఎండిపోతున్నాయ్.అగ్గి రాజుకుంటుందేమోనని చెట్లని కొట్టేస్తున్నారు.
అర్జంటుగా వెళ్ళి చూసేయండి .ఆలసించిన ఆశాభంగం.

Comments

Rani said…
photo kanipinchatledandi
Satyavati said…
రాణి గారు!సారీ అండి.ఫోటోలు సరిగ్గా అప్ లోడ్ అవ్వలేదు.
మీరు ఫోటోలు చూడాలంటే April(10)మీద క్లిక్ చెయ్యండి అక్కడ మూడు ఫోటోలున్నాయి
సత్యవతిగారూ,
యేదైనా అనుభవాన్ని ఆస్వాదించి ఆనందించడం అంటే మాటలు కాదు. అటువంటి అరుదైన అనుభవాలని మీరు ఆస్వాదించి, ఆ ఆనందాన్ని మాకు కూడా పంచుతున్నందుకు ధన్యవాదాలు. ఫొటోలు బాగున్నాయి.
nice to read your post
i recollected my childhood

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం