మహిళలకు సహాయ కేంద్రం
మహిళా పోలీస్ స్టేషన్, సిసిఎస్, హైదరాబాద్

ఈ రోజు ఉదయం 11 గంటలకు నగర పోలీస్ కమీషనర్ ఎ.కే ఖాన్ ప్రారంభించారు. మీటింగ్ ఉండడం వల్ల సబితా ఇంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేక పోయారు.
ఉంది.
ఐదు లక్షల రూపాయల వ్యయంతో సహాయ కేంద్ర నమూనా నిర్మితమైంది. ఇటువంటి కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో నిధుల్ని అందించడమన్నది ఆక్స్ ఫాం ఇండియా చరిత్రలో ఇదే మొదటిసారి. వైవాహిక, గృహ హింసలనెదుర్కుంటున్న మహిళల సమస్యల్ని పరిష్కరించాలంటే అందుకు సానుకూల వాతావరణంతోపాటు, గోప్యమైన విచారణ కూడా అవసరం. ప్రధానంగా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే సహాయ కేంద్ర రూపకల్పన జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో పాటు వచ్చే వృద్ధులు, పిల్లలు రోజల్లా స్టేషన్ వెలుపలే వేచి ఉండాల్సిన అగత్యముండేది. ఈ అసౌకర్యాన్ని కూడా గుర్తించే కేంద్ర రూపకల్పనలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేగాక కేంద్రనిర్వహణలో కొందరు మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తలు వంటి నిపుణుల సహకారం అవసరమవుతుంది కనుక, వారిక్కూడా కొంత చోటును కేటాయించాల్సి వచ్చింది.
హింసలకి గురైన బాధితులు, ఫిర్యాదుదారులపై ప్రతిదాడులు జరగకుండా నిరోధించేందుకు అన్ని కోణాల్లోనూ సహకరించడంతో పాటు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా యువతని, కుటుంబాల్ని, అన్ని సామాజిక వర్గాల్ని చైతన్యపరచడం ప్రధాన బాధ్యతగా సహాయ కేంద్రాలు పనిచేస్తాయి. ఇలాంటి వ్యవస్థ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఒరిస్సా, రాజస్థాన్‌లలో ఇదివరకే అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ˜, గుజరాత్
లలో సహాయ కేంద్రాల ఏర్పాటు ఇంకా ప్రారంభదశలో ఉంది.
పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే వ్యూహాత్మకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు సంబంధించి న్యాయవ్యవస్థ పరిధిలోనే బాధిత మహిళలకు మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన రక్షణతోపాటు చట్టపరమైన ఆశ్రయాన్ని కల్పించినట్టవుతుంది. సహాయ కేంద్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్లయిన (సామాజిక సేవ, సామాజిక శాస్త్రాలు) ఇద్దరు సామాజిక కార్యకర్తలు హింసకు గురైన మహిళలకు, పిల్లలకు చట్టపరమైన సలహాలతో పాటు, అన్ని విధాలైన సహాయ సహకారాల్ని అందిస్తారు. మహిళలు, పిల్లలకు సహాయాన్నందించడంలో కేంద్రం పాత్ర, విధివిధానాలు
- బాధిత మహిళలకు మానసిక స్థయిర్యాన్ని కలిగించడంతో పాటు, వారికి భావోద్వేగ పరమైన సహాయాన్ని అందించడం
- హింసను విడనాడే విధంగా హింసకు పాల్పడిన, అందుకు సహకరించిన వ్యక్తులతో అవసరమైన చర్చలు జరపడం
- మహిళలకు అవసరమైన అన్ని సహాయ వ్యవస్థల్ని పెంపొందించే విధంగా కృషి చేయడం
- మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా పోలీసు సహకారం కోసం ప్రయత్నించడం
- చట్టపరమైన సహాయాన్నందించడం
- తాత్కాలికంగానైనా హోమ్స్, ఇనిస్టిట్యూషన్స్, హాస్టళ్ళు,తదితర మార్గాల ద్వారా బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడం
- బాధిత మహిళలకు అండగా నిలిచే పురుషులతో కలిసి పనిచేయడం,
- స్త్రీధనం వంటి ఆస్తుల పునర్నిర్మాణం, పరిరక్షణ దిశగా బాధిత మహిళలకు సహాయమందించడం
- యువతరం, విద్యా సంస్థలు, సామాజిక వర్గాల్లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెరిగేలా వారితో కలిసి పనిచేయడం
- నేరం జరిగిన తరువాత, సంక్షోభానంతర కాలంలో బాధిత మహిళలకు మరింత మానసిక స్థయిర్యాన్ని కల్పించేలా కవ్న్సెలింగ్ నిర్వహించడం