శాంభవి ఉండాల్సింది గుడి లో కాదు బడిలో


శాంభవిని గుడి నుంచి రక్షించి బడిలో చేర్చాలని మానవ హక్కుల కమీషన్ ని కోరిన వార్తను మీరంతా టివీల్లో,పేపర్లలో చూసే ఉంటారు. ఇవిగో ఆ ఫోటోలు

Comments

అటు బడిలోనూగాక,ఇటు గుడిలోనూగాక వీధుల్లో రెండు పూటలా తిండిలేని బాలలు కొన్ని లక్షలమంది ఉన్నారు.వారినిగూడా ఇదేవిధంగా రక్షించవచ్చు కదా మానవ హక్కులను కాపాడుతున్నమనే ఫోజులిచ్చేవారు.
సుజాత said…
విజయమోహన్ గారూ, జనవిజ్ఞాన వేదిక వారి బాధ్యత వీధి బాలల్ని చేరదీసి విద్యా బుద్ధులు చెప్పించడం కాదు. మూఢ నమ్మకాల మీద పోరాటం, హేతువాద దృక్పథాన్ని పెంచడం. కాకపోతే వారి విశ్వసనీయత మీద కూడా ప్రశ్నలున్నాయి. అవి ఇక్కడ అప్రస్తుతం!

గుడ్డెద్దు చేలో పడ్డట్లు శాంభవి మాటల్ని దైవ వాక్కులుగా భ్రమించి ఆ పాప వెంట పరుగులు పెట్టిన మూఢ భక్తులు సదరు ఉషారాణి గారి మోస పూరిత దృక్పథం బయట పడ్డాక కూడా మారతారో లేదో మరి!

ఆ పాప వైఖరి మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉన్నా, దాన్ని పత్రికలు, మీడియా ఛానెళ్ళు ఎత్తి చూపిస్తూనే ఉన్నా, ఎవరు పట్టించుకుంటారు? పాప భీతి ఒకటి ఉందిగా! దైవ స్వరూపంగా ఎవరు ప్రకటించుకున్నా అందులో విశ్వసనీయత ఎంతో గమనించే తీరిక లేనంత పాపభీతి!

సత్యవతి గారూ, ఈ సమాచారం నలుగురికీ చేరాలి. బాల్యాన్ని కోల్పోయి దైవ స్వరూపంగా బలవంతపు సంకెళ్లను మోస్తున్న శాంభవికి విముక్తి కలగాలి. అందరు పాపల్లాగే హాయిగా బడికెళ్ళాలి, చదువుకోవాలి.
లలిత said…
శాంభవి విషయం లో జనవిజ్ఞాన వేదిక తో కలిసి మీరు చేసిన పొరాటం నిజంగా అభినందనియం . పేపర్లొ ఫొటొ చుసిమిమ్మల్ని అభినందించాలనుకుంటూనే మర్చిపోయాను. ఈ పొస్ట్ కూడా ఆలస్యంగా చుస్తున్నను. బుర్ర బుద్దీ వున్న ఎవరికైనా ఆ పాప చెప్పేవన్నీ చిలకపలుకనీ వల్లె వెస్తుందనీ తెలిసిపోతుంది . ఆ పాప మాటల్లోనూ, ప్రవర్తనలోనూ పసితనం కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. మిరు మనవ హక్కుల కమిషన్ కి వెళ్ళిన రొజు నాని గారితొ చర్చా కార్యక్రం వచ్చింది . ఒక పక్క మిమ్మల్ని సమర్దీస్తూనే మరోపక్క టి.వి. ఏంకర్ ఆ పాపముందు చేతులు కట్టుకుని వినయంగా మీరూ....అని సంబోధిస్తూ మాట్లాడుతుంటే వీళ్ళు చూపించేదానికి ఆచరించేదానికీ సంబంధమె లేదనిపించింది. కంప్లెంట్ ఇవ్వటంతోనే ఊరుకోకుండా ఆ పాప హక్కులు పూర్తి స్తాయిలో పరిరక్షించేంత వరకూ మీరు పాటు పడాలని కోరుకుంటున్నాను.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం