Thursday, October 18, 2007

ఆకాశమల్లెల జడివాన





అనుకోకుండా ఇంటికొచ్చిన పిల్ల సిసింద్రీలను
వెంటేసుకుని ఈట్ స్ట్రీట్ కి వెళ్ళానా
ఎదురుగా ఉన్న పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంటే
ఆకాశమల్లెల పరిమళం హటాత్తుగా చుట్టుముట్టింది
తలెత్తి చూద్దును కదా
గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఆకాశమల్లెలు
పచ్చటి కారప్పూల చెట్లకి
ధవళ వర్ణం లో కుప్పలు తెప్పలుగా
విరగబూసిన ఆకాశ మల్లెలు
చిన్నప్పుడు కారప్పూలని పిలుచుకుంటే
భాగ్యనగరంలో అవే ఆకాశమల్లెలయ్యాయి
అందంగా పొందిగ్గా బారులు తీరి నిలబడ్డ
ఆకాశమల్లె చెట్ల కింద
ఆదమరిచి నిలబడ్డానా
జలజలా నా తలమీద
కాదు కాదు నా తనువంతా
తడిపేసిన ఆకాశమల్లెల జడివాన

ఈట్ స్త్రీట్ వెర్రి హోరుకి
పార్కింగ్ లోని ఈ పారవశ్యానికి
పొంతన ఎలా కుదర్చడం ?
ఒక్కొక్క పువ్వూ ఒయ్యారాలుపోతూ
పరిమళాలు వెదజల్లుతూ
నా మీద వాలుతుంటే
అబ్బో! ఆ అనుభవాన్ని అక్షరీకరించడం
ఇలా మీతో పంచుకోవడం
మహదానందంగా ఉంది.

2 comments:

santha sundari.r said...

chala bavundi satyavathi garu,mee prakruti premani mato panchukunnanduku dhanyavadalu.ee vidhamga mee matalu rozu vine chance dorukutondi...thanks.

జ్యోతి said...

మీ బ్లాగులోని ఫోటోలను చూడగానే నా చిన్నప్పటి అనుభూతి గుర్తొచ్చింది సత్యవతిగారు. మా స్కూలునుండీ బస్ స్టాప్ కెళ్ళేదారిలో పుట్‍పాత్‍పై పడిఉన్న ఈ పూలను ఏరుకుని దారం లేకుండా కాడలతోనే దండ అల్లేదాన్ని. లేదా గుత్తిగా పట్టుకుని వాసన చూస్తూ ఇంటికి తీసికెల్లేదాన్ని. థాంక్స్.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...