


జూన్ నెల వచ్చింది.తెలి మబ్బులు,చల్లని గాలులు,వర్షపు చినుకులు,ఇంక నేను కుయ్యను కాక కుయ్యను అంటూ గొంతు గరగర లాడిస్తున్న కోకిలమ్మ. అందరికి ఈ అనుభూతులు మామూలే.
నాకు మాత్రం మరో అద్భుతమైన అనుభవం ఎదురైంది.
మా గార్డెన్ లో మళ్ళీ బ్రహ్మ కమలాలు పుయ్యడం మొదలైంది.నిన్న అర్ధరాత్రి రెండు పువ్వులు పూసాయండోయ్.ఈసారి మొక్కంతా మొగ్గలే.బోలెడు బ్రహ్మకమలాలు పుయ్యబోతున్నయ్.
మీ కోసమే ఈ ఫోటో.
1 comment:
ఈ మొక్క మా ఇంట్లో ఉందండీ! పెద్దగా పెరిగింది కానీ ఇంకా పూలు పూయలేదేమి చెప్మా! (పూలు చూసే తెచ్చాను.) ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే మొక్కో, కొమ్మో కాక, కేవలం ఆకు నుంచి కూడా మొక్క వృద్ధి చెంది పెరుగుతుంది. మా తోటలో మొక్క అలా పెరిగిందే!
పూలు దేవతా పుష్పాల్లా చాలా బాగున్నాయి.
Post a Comment