Thursday, June 26, 2008
Monday, June 16, 2008
మళ్ళీ బ్రహ్మ కమలాలు బ్రహ్మానందాన్ని పంచుతున్నయ్.



జూన్ నెల వచ్చింది.తెలి మబ్బులు,చల్లని గాలులు,వర్షపు చినుకులు,ఇంక నేను కుయ్యను కాక కుయ్యను అంటూ గొంతు గరగర లాడిస్తున్న కోకిలమ్మ. అందరికి ఈ అనుభూతులు మామూలే.
నాకు మాత్రం మరో అద్భుతమైన అనుభవం ఎదురైంది.
మా గార్డెన్ లో మళ్ళీ బ్రహ్మ కమలాలు పుయ్యడం మొదలైంది.నిన్న అర్ధరాత్రి రెండు పువ్వులు పూసాయండోయ్.ఈసారి మొక్కంతా మొగ్గలే.బోలెడు బ్రహ్మకమలాలు పుయ్యబోతున్నయ్.
మీ కోసమే ఈ ఫోటో.
Wednesday, June 11, 2008
గురజాడ ఇల్లు చూస్తే గుండె చెరువైంది


మే నెల ఎండల్లో సముద్ర తీరాన చల్లగా ఉంటుందని విశాఖ వెళ్ళాను.
చల్లదనం సంగతేమో గానీ చచ్చేంత చెమట.
దానికన్నా భాగ్యనగరం ఎండే మేలనిపించింది.
సాయంత్రం రిషికొండ బీచ్ కొంత మేలుగానే ఉందనుకోండి.
అక్కడున్న ఒక మిత్రురాలు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది.అదేమంటే విజయనగరంలో
పైడితల్లి గుడి గురించి తను చెప్పిన విషయం నాకు చాలా
నచ్చింది.సరే పైడితల్లి గుడి,అలాగే గురజాడ వారి ఇల్లు చూద్దామని
విజయనగరం వెళ్ళేము.పైడి తల్లి కధ మరోసారి చెబుతా.
గురజాడ గారి ఇల్లు చూసేసరికి నా గుండె చెరువై కళ్ళళ్ళో నీళ్ళొచ్చాయ్.
ఆ మహకవి ఇంటిని భద్రపరిచిన విధం చూస్తే చాలా బాధేసింది.ఇంటిని గ్రంధాలయంగా మార్చారు.ఆయన వాడిన కళ్ళ జోడు,అద్భుతమైన రచనలు చేస్తూ ఆయన కూర్చున్న కుర్చీ,ఆయన వాడిన రబ్బర్ స్టాంప్ అన్నీ అలా పడేసి ఉన్నాయి.వాటిని జాగ్రత్తగా అద్దాల బీరువాలో భద్రపరచకపోవడం వల్ల అందరూ వాటిని తాకొచ్చు.ఎవరైనా ఆకతాయిలు విరక్కొట్టనూవచ్చు.
నాకు మరీ ఎక్కువగ దుఖం ఎక్కడ కలిగిందంటే ఆయన చేదతో నీళ్ళు తోడుకుని స్నానం చేసిన బావి ని చూసినపుడు.అక్కడంతా చెత్త పోగడిపోయి ఉంది.పెరడంతా కూడా అంతే అధ్వాన్నంగా ఉంది.
ఫోటో లు చూస్తే మీకూ అర్ధమౌతుంది.
Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
When I look back into my past I can not but wonder at the changes that occurred in my life. Where have I started my journey and where have I...