Friday, June 25, 2021

లాలాపేట్ లెప్రసీ కాలని



మా సీతారామపురం దగ్గర రుస్తుంబాద లో ఒక లెప్రసి హాస్పిటల్ ఉంది.మిషనరీలు నడుపుతారు.మా చిన్నప్పుడు కుష్టువ్యాధిగ్రస్తులు చాలా దూరాల నుంచి నడుచుకుంటూ ఈ ఆసుపత్రికి వచ్చేవారు.
మేము కూడా నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళేవాళ్ళం కానీ తెలిసిన వాళ్ళు కనబడితే వాళ్ళ సైకిళ్ళెక్కేసే వాళ్ళం.
అడిగి మరీ ఎక్కేవాళ్ళం.
కానీ ఈ కుష్టు రోగులు కాళ్ళు చేతులూ సరిగ్గా లేకపోయినా చేతిలో అడుక్కునే డబ్బాతో సహా కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు.
వాళ్ళని ఏ ప్రయాణ సాధనాలు ఎక్కించుకునేవి కావు.
బస్సులు,గుర్రం బళ్ళు,రిక్షాలు ఎవ్వరు ఎ క్కించుకోరు.
ఆసుపత్రి నుంచి శరీరం మీద తెల్లటి బట్టతో కట్లు,దాని మీద మందు మరకలతో వాళ్ళ తిరుగు ప్రయాణాలుండేవి.
నాలుగైదు దశాబ్దాలు గడిచిపోయినా నాకు ఆ దృశ్యాలు ఇంకా రూపుకడుతూనే ఉంటాయి.
అలాగే 'పాపిలాన్' నవలలో అతను పారిపోయేటప్పుడు ఒక లెప్పర్ కాలనీకి వెళతాడు.అతనికి ఓ కాప్పులో టీ తెచ్చి ఇస్తుంది ఒక కుష్టు మహిళ.అతనికి టీ ఇచ్చినపుడు ఆమె చేతికి ఐదు వేళ్ళూ ఉంటాయి.అతనికి నాలుగువేళ్ళే కనిపించి ఇంకోవేలు ఏమైందా అని చూస్తే తాను తాగుతున్న టీ కప్పుకు అతుక్కొని వుంటుంది.
ఆ ఒక్క సంఘటన చాలు కుష్టువ్యాధి ఎంత భయానకమైందో అర్ధమవ్వడానికి.ఆ నవలలో ఆ సంఘటన కూడా నా స్మృతిపధం లో అలాగే ఉండిపోయింది.
సరే , తర్వాత రోజుల్లో మా ఊరిదగ్గర ఒక లెప్పర్ కాలని కట్టారు.హాస్పిటల్ కి వెహికల్ వచ్చింది.లెప్రసి చాలా వరకు తగ్గింది.రోడ్ల మీద నడిచేవాళ్ళు తగ్గారు.
అయితే ఇవన్నీ ఇప్పుడు గుర్తుకురావడానికి కారణం లాలాపేట దగ్గర ఒక లెప్పర్ కాలనీ ఉందని,150 కుటుంబాలున్నాయని,వాళ్ళు ప్రధాన లైవ్లీహుడ్ అడుక్కోవడమని,లాక్ డౌన్ వల్ల బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు సహాయం చెయ్యగలరా అని ఒక రిక్వెస్ట్ వచ్చింది.
కుష్టువ్యాధిగ్రస్తుల సమస్యలు వర్ణనాతీతంగా ఉంటాయి.
సమాజానికి వాళ్ళు అంటరాని వాళ్ళు.కరోనా వైరస్ కు సంబంధించి వాళ్ళ కష్టాలు ఎవ్వరికీ పట్టవు.హాస్పిటల్స్ కి వెళ్ళలేరు.వాళ్ళకి వాక్సినేషన్ జరుగుతుందో లేదో తెలియదు.కనీసం నిత్యావసర వస్తువుల్ని ఇవ్వగలిగితే బావుంటుందనే ఉద్ధేశ్యంతోనే
ఒక వారం క్రితం ఈ విషయాన్ని ఎఫ్ బి లో షేర్ చేసినప్పుడు చాలామంది స్పందించారు.మనీ పంపించారు.
కానీ 150 కుటుంబాలకు సహాయం చెయ్యాలంటే ఎక్కువ డబ్బు కావాలి.
రాచకొండ కమీషనరేట్ డిసిపి గా ఉన్న శిల్పవల్లి గారికి షేర్ చేస్తే కీట్స్ అనే సంస్థవారిని పరిచయం చేసారు.దాని బాధ్యులు సుబ్రహ్మణ్యం గారు వెంటనే స్పందించారు.ఆ సంస్థలో సభ్యురాలు,భూమిక లీగల్ అడ్వైజర్ శేషవేణి కలిసారు.
అమెరికాలో ఉండే సునీల్ నారిశెట్టి గారు ఆయన మిత్రబృందం కలిసారు.
అందరం కలిసి ఆ కుటుంబాలకు రెండు లక్షల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు,బియ్యం,పిల్లలకి బిస్కెట్స్ పంచిపెట్టాం.
150 కుటుంబాలకు ఒక నెలకు సరిపోయిన వస్తువులు అందాయి.
అమెరికా మితృలు వాళ్ళకి మరికొంత కాలం సహాయం చేద్దామని,దానికి అవసరమైన ఫండ్స్ సేకరిస్తామని హామీ ఇచ్చారు.
వీటన్నింటి వెనక ఉన్నది మమ్మల్నందరిని కలిపింది రవి అనే సోషల్ వర్క్ చదువుకున్న ఒక వ్యక్తి.
తను చదుకునే టైన్ లో ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఈ కుటుంబాలతో అతనికి ఒక అనుబంధం ఏర్పడి మమ్మల్ని కదిలించాడు.
ఈ గొప్ప పనిలో తోడ్పడిన ఉమా నూతక్కి,లావణ్య గట్టుపల్లి,మల్లీశ్వరీ దేవి సకరం,స్వాతి కొరాడ ,కీట్స్ సంస్థ బాధ్యులు సుబ్రమణ్యం గారు,అమెరికా మితృలు సునిల్ నార్శెట్టి ఆయన మితృలు,అందరికీ 150 కుటుంబాల తరఫున ధన్యవాదాలు.
ఈ కాలని గురించి నాకు చెప్పి ఈ పనంతా నా చేత చేయించిన గిరిజ కి థాంక్స్ చెప్పాలి.
Uma Nuthakki, Prasuna Balantrapu and 37 others
9 Comments
4 Shares
Like
Comment
Share

9 Comments

View 5 more comments

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...