Sunday, August 23, 2015

అశోకం


 కొండవీటి సత్యవతి
.
నిర్మల మొబైల్ ఫోన్లోంచి ఖయ్‌మంటూ విజిల్ శబ్దం.
‘‘నన్నిక పనిచేసుకోనివ్వదా’’ అనుకుంటూ ఫోన్ లేసి చూసింది. అనల అమెరికా నుంచి... వాట్సప్‌లో మెసేజ్.
‘‘అమ్మా! నేనొస్తున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు కూడా శెలవు పెట్టేయ్’’
‘‘క్రిస్మస్ శెలవులు ... ఆ తర్వాత సంక్రాంతి శెలవులు’’
‘‘సరె అన్నూ! ఏ రోజు బయలు దేరతావు’’
‘‘డిశంబరు పది... మనం నాలుగురోజులు హైదరాబాదులో వుండి అమ్మమ్మ దగ్గరి కెళ్ళిపోదాం’’
‘‘అన్ని రోజులు నువ్వా పల్లెటూళ్ళో ఉండగలవా?’’
‘‘ఉంటాను... ఈరోజే అమ్మమ్మకి చెప్పేయ్. బై అమ్మా!’’
ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టేసి నిర్మల తన పనిలో పడింది. 
ఆఫీసులో చాటింగ్ తనకిష్టముండదు. కానీ అన్నూ వదలదు. నెలరోజులు శెలవంటే... దొరుకుతుందో లేదో... ఇవ్వకపోతే సిక్ లీవ్ వుండనే వుంది.
క్యాలండర్ చూసాను. నవంబరు 23. ఫర్వాలేదు. టైముంది.
అర్జంట్ పనులేమున్నాయా అని ఆలోచిస్తుంటే...
కోలీగ్ సరస్వతి అడిగింది.
‘‘అనల వస్తోందా నిర్మలా’’
‘‘అవునే... నెల రోజులుంటుందట... ఇక్కడ కాదు. అమ్మమ్మ దగ్గరుంటుందంట’’.
‘‘అమెరికాలో వుండే పిల్ల అంతర్వేదిలో వుండగలదా?’’
‘‘వుంటుందట... తనకి అలవాటే గానీ అన్ని రోజులుండలేదెప్పుడూ. నెల రోజులు లీవ్ పెట్టాలి.ఏం అర్జంటు పనులున్నాయా అని ఆలోచిస్తున్నా’’.
‘‘పెట్టేయ్... పనులెప్పుడూ వుంటాయ్.. నేను అకౌంట్స్ సెక్షన్‌కి వెళ్ళొస్తా...’’
అంతటితో సంభాషణ ముగిసింది.
***************
డిశెంబరు పది రానే వచ్చింది. ఎయిర్ పోర్ట్‌లో అనలను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది నిర్మల. సన్నగా... పొడవుగా తెల్లటి షర్ట్... నీలంరంగు జీన్స్... రింగులు తిరిగిన జుట్టు గాలికి ఎగిరెగిరి పడుతోంది. ఎంత కాన్పిడెంట్‌గా నడిచి వస్తోంది... ఇది తన కూతురు...
‘‘అమ్మా!’’ అంటూ ఎగిరివచ్చి నిర్మలను చుట్టేసింది. ‘‘ఏరా! ప్రయాణం బాగా సాగిందా?’’
‘‘హేపీగా... అమ్మా... నువ్వేంటి చిక్కిపోయావ్’’
‘‘ఏం లేదు... ఈ మధ్య చక్కెరకి నాకూ చుక్కెదురైందిలే’’ నవ్వింది.
‘‘అంటే... షు గరొచ్చిందా? నాకు చెప్పలేదు.’’
‘‘అదేం శుభవార్తని చెప్పడానికి ... సరే గానీ అన్ని గంటలు ఏం చేసావ్ విమానంలో’’
వాళ్ళెక్కిన క్యాబ్ అమీర్‌పేటవైపు బయలు దేరింది.
‘‘అమ్మా! ప్లైట్‌లో తినడానికి, తాగడానికి బోలెడుంటాయి. చదువుకోవచ్చు. సినిమాలు సినిమాలు చూడోచ్చు. బోర్ కోడితే నిద్రపోవచ్చు. అమ్మా! చాలా రకాల డ్రింక్స్ వుంటాయి. తాగితే హాయిగా నిద్రపోవచ్చు.’’
నిర్మల ఏం మాట్లాడలేదు.
‘‘ఏంటమ్మా! తాగాననా?’’
‘‘ఏం కాదులే...’’
అనలకి అర్థమైంది. నాన్న తాగుడు.. అమ్మ పడిన కష్టాలు.
‘‘సారీ అమ్మా!’’ అమ్మ మెడ చుట్టూ చేతులేస్తూ గోముగా అంది.
‘‘పోరా... ఏం కాదులే.. నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు... నా బంగారు తల్లివి కదా’’
‘‘తప్పా? తాగడం తప్పు కాదమ్మా.. నాన్నలా తాగడం తప్పు.’’
‘‘తాగుడు తప్పే... సరే పొనీయ్ కానీ.. అమ్మమ్మ భలే ఎగ్జైటెడ్‌గా వుంది. వెంటనే వచ్చెయ్య మంటోంది..’’
‘‘అమ్మా! నీ ఫోన్ ఇవ్వు... అమ్మమ్మతో మాట్లాడతా’’
అవతల అమ్మమ్మ ఏం చెబుతోందో అనల భలే..భలే.. వచ్చేస్తాం... నాలుగు రోజులు ఇక్కడుంటా...పనుంది...   అమ్మమ్మా! అవునా... భలే..ఉంటాను అమ్మమ్మా!’’ఇల్లొచ్చింది.
**************
‘‘ఏంట్రా ఇవన్నీ...
అనల సూట్ కేస్ తెరిచి తను తెచ్చిన వస్తువులన్నింటినీ బయటకు తీస్తోంది.
‘‘ఇదా... వైన్ బాటిల్.. నా ఫ్రెండ్ వుంది కదా రిథమ... దానికిష్టం...’’
‘‘అక్కడి నుండి మోసుకు రావాలా?’’
‘‘ఇది ఒరిజినల్ ఫ్రెంచ్ వైన్... ఇక్కడ దొరుకుతుందేమో తెలియదు. అమ్మా ఇది నీ కోసం... లేేప్ టాప్.. మనం రోజూ చాట్ చేసుకోవచ్చు. స్కైప్‌లో మాట్లాడుకోవచ్చు...’’
‘‘అబ్బ... నాకవన్నీ రావు లేరా...’’
‘‘నేను నేర్పిస్తాగా... వై ఫై పెట్టిద్దాం. అమ్మా! ఇందులో అమ్మమ్మకి ఏం సెలెక్ట్ చేస్తావో నీ ఇష్టం’’
‘‘అమ్మమ్మకా...’’ కాలింగ్ బెల్ మోగింది.
అనల స్ప్రింగ్ లా లేచెళ్ళి తలుపు తీసింది. రిథమ... ఇద్దరూ ఒకర్నొకరు వాటేసుకుని లోపలికొచ్చారు.
‘‘హాయ్ ఆంటీ...".
‘‘హాయ్... రిథమా... ఎలా వున్నావ్?
‘‘బావున్నానాంటీ... ఎన్ని రోజులైంది దీన్ని చూసి’’ అంటూ మళ్ళీ అనలని గట్టిగా వాటేసుకుంది.
‘‘రీతూ... నువ్వు కూడా అంతర్వేది కొస్తావా? అమ్మమ్మ వాళ్ళ ఊరికి’’
సోఫాలో సెటిలయ్యారు ఇద్దరూ..
నిర్మల వంటింట్లోకి వెళ్ళిపోయింది.
‘‘ఎప్పుడూ... వీకెండ్ అయితే ఓకె.’’
‘‘అమ్మా! రీతూ కూడా మనతో వస్తుంది.’’
ఇద్దరూ అంతులేని కబుర్లలో మునిగిపోయారు.
ఇల్లంతా కబుర్లతో, వాళ్ళిద్దరి నవ్వులతో మారు మోగుతోంది.
నిర్మల ఆలోచిస్తూ వంట చేస్తోంది.
ఎంత హాయిగా వున్నారిద్దరూ...
వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ శరీర కదలికలు ఎంత డిఫరెంట్‌గా వున్నాయి. ఆ వయసులో తనెలా వుంది. తన ఆలోచన లెలా వున్నాయి?
‘‘అమ్మా! ఏం చేస్తున్నావ్? మనం బయటకెళదాం. డిన్నర్ బయటే’’ అంటూ వంటింట్లోకి వచ్చింది అనలు.
‘‘నేనెందుకు లేరా? మీరిద్దరూ వెళ్ళండి’’.
‘‘లేదు లేదు... నువ్వు రావాలి. పద.. పద... రెడీ అవ్వు’’ అంటూ స్టౌ ఆపేసింది.
ఓ అరగంట తర్వాత ముగ్గురూ రిథమ కార్లో వున్నారు. ఆ తర్వాత కారు మెయిన్‌లాండ్ చైనా రెస్టారెంట్ ముందాగింది.
‘‘హమ్మో! ఈ హోటల్ కా.. చైనా వాళ్ళ కప్పలు.. పాములు పెడతారట’’
‘‘కమాన్ అమ్మా! ఇక్కడ ఫుడ్ బావుంటుందని రీతూ చెప్పిందిలే’’
వాలెట్ పార్మింగ్‌లో కార్ ఇచ్చేసి ముగ్గురు హోటల్ వేపు నడుస్తున్నారు.
ఎవరో హఠాత్తుగా అనల జుట్టు పట్టుకుని లాగుతూ ‘హాయ్ బేబీ’’ అంటూ వెళ్ళిపోతున్నాడు. అనల మెరుపు వేగంతో పరుగెత్తి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని ఎడాపెడా వాయించేసింది. వాడు చొక్కా వదిలించుకుని పరుగే పరుగు... నిర్మల అదిరిపోయింది.
‘‘అన్నూ...ఏంటిరా? ఇది అమెరికా అనుకున్నావా? వాడు వెళ్ళి ఒక గ్యాంగ్‌తో మళ్లీ వస్తాడు’’ అంది భయపడుతూ... 
‘‘ఏడిసాడు.. మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాడు ఆంటీ...’’
‘‘ఏంటమ్మా! ఇదేమన్నా సినిమానా? ఎంత ధైర్యం వాడికి నా వొంటిమీద చెయ్యి వెయ్యడానికి బాస్టర్డ్... పదండి... పదండి.. భలే ఆకలేస్తూంది.’’
నిర్మల వాళ్ళ ననుసరించింది కానీ.. అన్నూ తెగింపు, ధైర్యం చూసి భయపడింది. అదే సమసయంలో సంతోషించింది. తను పనిచేసే ఆఫీసులో కోలీగ్స్ చెత్త కామెంట్లు, సతాయింపులు మౌనంగా భరించడమే కానీ ఎప్పుడైనా ఎదురు మాట్లాడిందా? తన మొగుడు ఎంత హింసపెట్టే వాడు? ఏ రోజైనా తిరగబడిందా? తాగి తాగి చనిపోయాడు... అతను బతికుండగా ఒక్కరోజైనా సుఖపడిందా?
‘‘అమ్మా!... ఏంటి ఆలోచిస్తున్నావ్? ఏం తిందాం చెప్పు’’.
‘‘హమ్మో! నా కేం తెలుసు... మీరె చెప్పండి. నచ్చితే తింటా’’ అంది.
అన్ని టెబుళ్ళు నిండిపోయాయి. గోలగా మాట్లాడుకుంటున్నారు. అవతలి వేపు ఎవరిదో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.
ఏవేవో ఆర్డర్ చేసారు. అనల, రిథమ హాయిగా కబుర్లాడుకుంటూ, నవ్వుకుంటూ తింటున్నారు.
నిర్మలకి పెద్దగా నచ్చలేదు. తిన్నానని పించింది.
పదిన్నరకి రిథమ నిర్మల వాళ్ళని దింపేసి వెళ్ళిపోయింది.
******************
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి సికింద్రాబాద్ ప్లాట్‌పారం మీద ఎదురుచూస్తున్నారు. అనల, నిర్మల.
‘‘రిథమ కూడా వచ్చుంటే బావుండేది. నీకు బోర్ కొట్టకుండా తోడుండేది’’ నిర్మల అంది.
‘‘సడెన్ గా  బెంగుళూరు వెళ్ళాల్చొచ్చిదట. అమ్మమ్మ గారి ఊరిలో నాకేమీ బోర్ కొట్టదు. యు డోంట్ వర్రీ అమ్మా! ’’.
పదిన్నరకి ట్రయిన్ వచ్చింది. ఏసి సెకెండ్ క్లాస్ లో సర్దుకున్నారు.
పడుకోబోతూ అనల అడిగింది. ‘‘అమ్మా! ఎన్నింటికి నర్సాపూర్ చేరతాం’’.
‘‘ఎనిమిది దాటుతుంది. మాయిగా పడుకో.. అది లాస్ట్‌స్టాప్. రామం మావయ్య కారు పంపుతానన్నాడు లే’’.
‘‘అయితే ఇంకేం... హేపీగా నిద్రపోవచ్చు’ అంటూ ముసుగు పెట్టేసింది అనల.
నిర్మల కూడా పడుకుంది.

*********************
ఎనిమిదిన్నరకి ట్రయిన్ నర్సపూర్ చేరింది. స్టేషన్‌కి శ్రీధర్ వచ్చాడు.
‘‘అత్తయ్యా! బావున్నారా... అన్నూ.. ఎలా వున్నావ్’’.
‘‘బావున్నాం రా... అమ్మ నాన్న, అమ్మమ్మ ఎలా వున్నారు.
‘‘అంతా బావున్నారత్తయ్యా... నువ్వెప్పుడొచ్చావ్ అన్నూ’’
‘‘వారం అయింది శ్రీధర్.. ఏంటి మన కారు డైరక్టుగా దానిమీదకి వెళ్ళిపోతుందా?’’ ఆశ్చర్యంగా గోదావరిలో ఉన్న పొడవాటి పంటిని చూస్తు అంది.
‘‘వెళ్ళిపోతుంది.. చించినాడ దగ్గర గోదావరి మీద బ్రిడ్జి కట్టారు కానీ అలా దూరమౌతుంది. ఈ పంటి మీద దాటేస్తే అంతర్వేదికి గంట కూడా పట్టదు.’’ అన్నాడు జాగ్రతత్తగా కారుని పంటి మీద ఎక్కిస్తూ...
‘‘వారేవా..భలే ఉంది.. గోదావరి భలే మెరుస్తోంది.’’ అంది సంబరపడుతూ అనల.
పంటి దిగి.. కారు సఖినేటిపల్లి మీదగా పచ్చటి కొబ్బరి తోటల్లోంచి రయ్‌మంటూ దూసుకెళ్ళితోంది. అనల శ్రీధర్ పక్క సీట్లో కూర్చుని ఆ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తోంది.
అనల శ్రీధర్‌ని బావా అని పిలిస్తే బావుండు. చెబితే కొప్పడుతుంది. నిర్మల ఆలోచిస్తోంది. అన్నూ పెళ్ళి మాట ఎత్తాలంటే భయం. నేను ఇప్పుడే చేసుకోను అంటుంది. శ్రీధర్ కూడా బాగా చదువుకున్నాడు. వ్యవసాయం చేస్తూ ఊళ్ళోనే వుండిపోయాడు. ఇద్దరూ ఈడూ జోడూ బావుంటారు కూడా.... ఆమె ఆలోచనలు సాగుతూనే వున్నాయి.
ఎత్తైన అరుగులతో ఠీవిగా నిలబడి వుంది ఆ ముండువా లోగిలి.ఆ ఇంటి ముందు కారాగింది. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ..ఇంటి ముందు పెళ్ళి పందిరి.
‘‘అమ్మమ్మా!’’ అంటూ లోపలికి పరుగెత్తింది అనల.
‘‘వచ్చేసారా? ఏంటీ ఇంత పొడుగైపోయావ్... మీ మీయమ్మేదీ ?’’ సంపూర్ణమ్మ.
"అమ్మ వస్తుందిలే.. ఎలా వున్నావ్ అమ్మమ్మా!’’ అమ్మమ్మ మెడకి వేలాడుతూ అనల.
‘‘రైలు బాగా లేటల్లే వుందే.. ముందు ముఖాలు కడగండి. కాఫీ తాగుదురుకానీ’’
ఈలోపు బయట ఎవరో పలకరిస్తే మాట్లాడి నిర్మల లోపలి కొచ్చింది.
‘‘ఏం పాపా... ఎలా వున్నావ్’’ నిర్మలని సంపూర్ణ పాపా అని పిలుస్తుంది.
‘‘నాకేం బాగానే వున్నాను. క్రితం నెలేగా పెళ్ళికని వచ్చాను. . నీ ఆరోగ్యం ఎలా వుందమ్మా’’.
‘‘అవుననుకో.. ఎనభై ఏళ్ళ వయసులో నేనెలా వుంటానే.. ఫర్వాలేదు. నడుస్తోంది.’’
‘‘నా దగ్గరొచ్చి ఉండమంటే వినవుకదా..’’
‘‘స్టాప్... స్టాప్.. మీ ఇద్దరూ మొదలెయ్యాకండి. అమ్మమ్మా! ఆకలి.. టిపిన్ పెట్టు’’.
‘‘నా బంగారమే.. అయ్యో! ఐదు నిమిషాలాగు... వెంకమ్మా... ఇడ్లీ లేసేసావా... పాపం. పిల్ల ఆకలంటోంది..’’
‘‘ఆయ్.. వేసేసానండి... పచ్చడి కూడా నూరేసానండి అమ్మగారూ’’ వెంకమ్మ.
‘‘అయితే పెట్టేయ్.. పదండి.. టిఫిన్లు తిందురుగాని’’ హడావుడి పడుతోంది సంపూర్ణ.
‘‘అన్నూ... మన ఆవు ఈనింది.. జున్ను తింటావా?’’
‘‘ఓ.. జున్నంటే నాకు చాలా ఇష్టం. ఆవు దూడలు ఎక్కడున్నాయ్ అమ్మమ్మా’’
‘‘పోలాన వున్నాయ్.. కోడిదూడ భలే ఉషారుగా వుందంట శ్రీధర్ బావ చెప్పాడు’’.
‘‘అయితే శ్రీధర్‌తో నేను పొలమెళతా...’
‘‘పోలానికా.. వద్దులేవే’’ అంది నిర్మల.
‘‘ఎళ్ళనీయవే.. సరదాపడుతుంది కదా’’.
*************************
సాయంత్రం శ్రీధర్‌తో కలిసి పొలమెళ్ళింది అనల. పచ్చటి పంట పొలాలు... గట్ల మీద సైనికుల్లాగా లైనుగా కొబ్బరి చెట్లు. పశువుల కోసం వేసిన పాకలో కూర్చీలున్నాయి. పాలేరు కుర్చీలు తెచ్చి కొబ్బరి తోటలో వేసాడు.
‘‘ఆవు దూడేది...’’
‘‘అదిగో ఆ పాకలోపల కట్టేసి ఉందిగా...’’
‘‘వదలమనవా.. శ్రీధర్’’
‘‘నారాయణా... దూడని కట్టేసి ఇటు తీసుకురా’’ పాలేరుకు చెప్పాడు.
దూడ చెంగుచెంగుమంటూ ఎగురుకుంటూ వచ్చింది. తెల్లగా వుంది. నుదిటి మీద గోధుమ రంగు మచ్చ.
‘‘భలే వుంది... నారాయణ.. నాకివ్వు నేను పట్టుకుంటాను.’’ దానితో పాటు ఎగురుతోంది. అది తోక బిగబెట్టి చెంగుమంటూ ఎగురుతోంది. ఛాన్సు దొరికితే తల్లి దగ్గరకు ఉరకాలని చూస్తోంది.
‘‘నారాయణా! ఇంకచాల్లే... దూడని కట్టేసి కొబ్బరి బొండాలు తియ్య’’ అన్నాడు శ్రీధర్
చీకటి పడేవేళకి ఇల్లు చేరింది అనల... శ్రీధర్ బండి దిగేసి ఊళ్ళోకొస్తున్న ఎద్దుల బండెక్కింది. బండి తోలేవాని పక్కనచేరి బండి తోలుతుంటే శ్రీధర్ నవ్వుతూ చూసాడు.
‘అన్నూ.. మీ అమ్మ చూస్తే నన్ను తిడుతుంది. అది ఎక్కుతానంటే నువ్వెలా ఎక్కనిచ్చావ్ అంటుంది’’.
‘‘ఇల్లు దగ్గర పడగానే దిగిపోతాలే’’ అంది నవ్వుతూ.
*****************
వారం రోజులు గడిచిపోయాయి. అనల చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ తిరుగుతోంది. ఒకరోజు గుడి దగ్గరకెళ్ళింది. ఒక రోజు సముద్రం, లైట్‌హౌస్ చూసింది.
‘‘శ్రీధర్.. అన్నా చెల్లెల గట్టుకు తీసుకెళ్లవా?’’
అంతర్వేది దగ్గర గోదావరి సముద్రంలో కలుస్తుంది. ఆ చోటునే అన్నాచెల్లె గట్టు అంటారు.
‘లాంచి దొరికితే వెళదాంలే.. నువ్వు భయపడవు కదా.. అక్కడ సముద్రంలో అలలు గోదావరిలోకి వెనక్కి వస్తాయి. లాంచి ఎగిరెగిరి పడుతుందిమరి.  భయపడతావేమో’’
‘‘నాకేం భయం లేదు....ఇంతకు ముందు వెళ్ళాం కదా... వెళదాం’
‘‘సరేలే.. ఇంక దిగు ఇల్లోచ్చింది’’
బండిలోంచి చెంగున ఉరికి ఇంట్లోకి వెళుతుంటే శ్రీధర్ నవ్వుతూ చూస్తూ ‘‘ఏం పిల్లరా బాబూ’’ అనుకున్నాడు.
*******************
హైదరాబాదు తిరిగి వెళ్ళే రోజులు దగ్గర పడుతున్నాయి. అనల ఆ పల్లెటూరంతా చుట్ట బెడుతోంది. నిర్మల కూతురి పనులన్నీ గమనిస్తూనే వుంది. అమ్మమ్మ అయితే మురిపెంగా ‘‘దీనికి అన్నీ నా బుద్ధులే’’ అంటూ మురిసిపోతుంది.
ఆ రోజు రాత్రి అనల అమ్మమ్మ దగ్గర చేరింది. భోజనాలైపోయాయి. నిర్మల నిద్రపోవాలని తన రూవ్‌ులోకి వెళ్ళబోతుంటే
‘‘అమ్మమ్మా! నువ్వు తాతయ్యను వదిలేసావంట నిజమేనా’’
‘‘అన్నూ.. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏం మాటలవి. ఇప్పుడెందుకు.’’
‘‘ఫర్వాలేదు లేవే.. .. ఎవరు చెప్పారు.’’
‘‘ఊర్లో ఎవరో అన్నారమ్మమ్మా! నిజమేనా?’’
‘‘జనాలు ఇంకా మర్చిపోలేదన్న మాట... ఏ నాటి మాట..’’
‘‘అమ్మమ్మా! ప్లీజ్ చెప్పవా! ఏం జరిగింది.’’
‘‘అన్నూ... అమ్మమ్మని పడుకోనీయ్... పద... మనం వెళ్ళిపడుకుందాం’’.
‘‘పాపా.. నువ్వెందుకు కంగారుపడతావ్... చెబుతానుండు’’.
అనల అమ్మమ్మ మంచమెక్కి వినడానికి సిద్ధంగా కూర్చుంది.
................
పదమూడేళ్లప్పుడు నా పెళ్ళయింది. మీ తాతకి ఇరవై పైనే... వాళ్ళది అనకాపల్లి... మీ తాత రెవెన్యూ డిపార్ట్‌మెంటులో పని చేసేవాడు. ఎప్పుడూ క్యాంపులు తిరుగుతుండేవాడు. మీ అమ్మ, రామం మావయ్య పుట్టాక నాకు మరో ఇద్దరు పుట్టి పోయారు. ఇంట్లో నౌకర్లు, ఇంటి నిండా సరుకులు.. లోటుండేది కాదు. మీ తాతయ్య ఇంట్లో వుండేది తక్కువ. అది బ్రిటిష్ వాళ్ళ కాలం కదా! మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అప్పుడప్పుడూ దొరలు కూడా మనింటి కొచ్చేవారు. మీ తాత తాసిల్దార్ అయ్యాడు. గుర్రం మీద తిరుగుతుండే వాళ్ళు. మీ తాత గురించి చుట్టాలు రకరకాలుగా చెప్పెకునేవాళ్ళు. దొరలతో కలిసి తాగుతాడని, తిరుగుతాడని.. ఏంటేంటో చెప్పుకునే వాళ్ళు. నేను పట్టించుకునే దాన్ని కాదు. నాకు పిల్లలతో, ఇంటిపనితో సరిపోయేది.
‘‘నువ్వెప్పుడూ తాతయ్యని అడగలేదా అమ్మమ్మా’’ హఠాత్తుగా అడిగింది అనల. నిర్మల నిశ్శబద్ధంగా వింటోంది.
‘‘ఏమని అడగమంటావ్... అసలు మాట్లాడ్డానికే భయం. సింహంలా ఉండేవారు. గుర్రం మీద వెళుతుంటే జనాలే భయపడేవాళ్ళు.’’
‘‘అదేంటి.. అందరూ అలా అంటుంటే నీకు బాధగా వుండేది కాదా..  అమ్మా! నీకు తెలుసా?’’
‘‘నీకు తెలియదే వెర్రి పిల్లా! భర్తల్ని అడగడమే.. అంత ధైర్యం ఎవరికీ వుండదు... ఆ రోజులు వేరు’’.
‘‘ఏంటి వేరు... ఈ రోజుల్లో మాత్రం ఏం గొప్పగా వున్నాయి? మా నాన్న లేడా? మా అమ్మ ఎపుడైనా మా నాన్నని ఎదిరించిందా? తాగొచ్చి కొడుతుంటే దెబ్బలు తినేది...’’ తండ్రి గుర్చొచ్చి కోపంతో ఊగిపోయింది అనల.
‘‘నిజమేనే... మీ అమ్మకన్నా నేనే నయం... మీ అమ్మకి ఉద్యోగముంది. సంపాదనుంది. అయినా మీ నాన్నని వదలలేకపోయింది’’.
‘‘ఆ... బాగా చెబుతావ్‌లే అమ్మా! వదిలెయ్యడం అంత తేలికా? పైగా నాకో ఆడపిల్లుంది. దాని గురించి ఆలోచించాలా? వద్దా?’’నిర్మల ఉక్రోషంగా అంది.
‘‘ఛ... ఛ.. నా గురించి నాన్నను భరించావా?’’
‘‘సరేలే... ఇపుడవన్నీ ఎందుకు? అన్నూ... పెళ్ళింటే ఏంటో... దాన్నుంచి ఎందుకు బయటపడలేరో నీకు అర్థం కాదులే...’’
‘‘అలాంటి దాన్నుండి నువ్వెలా భయటపడ్డావ్ అమ్మమ్మా! వెరీ ఇంట్రస్టింగ్... చెప్పు.... చెప్పు’’
‘‘చెప్పాను కదా! మీ తాతయ్య గురించి ఎవరెన్ని చెప్పినా పట్టించుకునే దాన్ని కాదు. ఆయన్ని అడిగేదాన్ని కాదు. అలాంటిది ఒకరోజు ఎవరో ఒకామెని తనతో  ఈ ఊరికి తీసుకొచ్చేసాడు."
‘‘అవునా???’’
‘‘అవును. వాళ్ళు ఊళ్ళోకి వచ్చారని ట్రావలర్స్ బంగళాలో వున్నారని నౌకరొచ్చి నాకు చెప్పాడు. నేను తెల్లబోయాను. చాలా కోపమొచ్చింది. ఇంత కాలం బయట ఎన్ని వేషాలేసినా పట్టించుకోలేదు. ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తాడా? ఇంట్లోకి రానీయొద్దని గట్టిగా అనుకున్నాను. ఇంటికి ఒక పెద్ద సింహద్వారం వుండేది. దాన్ని మూసేయమని చెప్పాను.’’
‘‘సూపర్ అమ్మమ్మా..  ఐ లవ్ యూ’’ అనల అమ్మమ్మకి ముద్దు పెట్టింది.
‘‘మహా డాబుగా ఇద్దరూ ఆ సాయంత్రం ఇంటికొచ్చారు. నేను తలుపు తియ్యలేదు. ఎంత కొట్టినా తలుపు తియ్యలేదు. పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుని బిక్కు బిక్కుమంటూ...కూర్చున్నాను.. తలుపులు పగలగొట్టిస్తారేమో అని భయమేసింది.కానీ అలా చెయ్యలేదు. జనం గుమిగూడారు. వింత చూస్తున్నారు. తలోమాట అంటున్నారు.
ఇంక లాభం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను చాలా ఏడ్చాను... ఈ పిల్లలతో ఎలా అని దిగులు పడ్డాను. ఆ తర్వాత నేను మీ తాత ముఖం చూడలేదు. వాళ్ళిద్దరూ వైజాగ్‌లో కాపురం పెట్టారని తర్వాత తెలిసింది.’’
‘‘అమ్మమ్మా... నువ్వు సూపర్ వుమన్’’
‘‘ఆ సూపరే... తర్వాత ఎన్ని కష్టాలు పడ్డామో  నీకేం తెలుసు. నాన్న మాకు అన్నీ అమర్చాడు కాబట్టి సరిపోయింది.’’
‘‘అవునే.. చాలా కష్టాలు పడ్డాం. కానీ నేను మాత్రం మీ తాతని క్షమించలేకపోయాను. ఆయన చనిపోయినపుడు కూడా నేనెళ్ళలేదు.’’
‘‘అమ్మా! అమ్మమ్మ ఆత్మగౌరవం నుంచి నువ్వేం నేర్చుకోలేదు. నాన్న నిన్నెలా కొట్టేవాడో నాకు తెలుసు. ‘‘ఎందుకమ్మా! అమ్మమ్మకి చదువు లేదు.. ఉద్యోగం లేదు... అయినా తెగించింది. నీకు చదువుంది. ఉద్యోగముంది... ఎందుకని నాన్నని వదిలేయలేకపోయావ్?’’
‘నీకు తెలియదు... మగదిక్కులేని సంసారం ఎలా వుంటుందో నాకు తెలుసు. నువ్వలా కాకుండదనే నేను సహించాను’’ నిర్మల గొంతులో నిర్వేదం.
‘‘అయ్యో! అమ్మా! నా కోసమా?’’ అమ్మమ్మని వదిలి అమ్మ దగ్గర కెళ్ళి... అమ్మ గుండెల్లో దూరిపోయింది.
‘అవును రా అన్నూ!!..నీ కోసమే... తండ్రి లేకపోవడం.. ఆ లోటు నాకు తెలుసు... అయినా నాకు మీ అమ్మమ్మంత ధైర్యం కూడా లేదు.’’
‘‘నువ్వనుకున్నావ్‌కానీ... ఇప్పుడు నాన్నేలేడు. నీ కోసమే మీ నాన్న హింసను భరిస్తున్నాని చెప్పుంటే నాన్నను వదిలేయ్‌మనిచెప్పేదాన్ని కదా’’
‘‘సర్లే.. అయినా అవన్నీ ఇప్పుడెందుకురా? అమ్మా! దీని పెళ్ళి సంగతేంటో కనుక్కో... నా మాట వినడం లేదు’’ నిర్మల తల్లితో అంది.
‘‘అర్రే... వుండమ్మా... కథ క్లైమాక్స్‌లో వుంది. ‘‘అమ్మమ్మా! నీ కింత దైర్యం ఎలా వచ్చింది? తాతయ్యని ఇంట్లోంచి గెంటేసేంత తెగువ?’’ మళ్ళీ అమ్మమ్మ దగ్గర చేరింది.
‘‘ఏమో! అలా వచ్చిందంతే... మీ తాతయ్యని వేరేవాళ్ళతో పంచుకోలేకపోయా... నీకు తెలుసా? భ్రమర అదే.. మీ తాతయ్య రెండో పెళ్ళి చేసుకుని తీసుకొచ్చినామె నా దగ్గర కొచ్చింది.’’
‘‘అవునా! కథలో మలుపు భలే వుంది’’.
‘‘మా అమ్మ జీవితం నీకు కథలా వుందా?’’ గయ్‌మంది నిర్మల.
‘‘అమ్మా ప్లీజ్.. చెప్పు అమ్మమ్మా’’
‘‘భ్రమర చిన్న పిల్ల... ఏదో ఊళ్ళో గుమాస్తా కూతురు. మీ తాతకి క్యారియర్ తెచ్చిస్తే... ఆమెను లోబరుచుకున్నాడట. అలా చాలాసార్లు జరిగిందట. గుమాస్తా భయపడిఎవరికీ చెప్పలేదు. ఆ పిల్లకి కడుపొచ్చింది. ఊళ్ళో పెద్ద గొడవైతే... మీ తాత ఆ పిల్లను వెంటబెట్టుకొచ్చేసేడు. నాకు భ్రమరని చూస్తే చాలా జాలనిపించింది.’’
‘‘జాలా? అమ్మా! నీ కాపురం కూల్చింది ఆమెనే కదా?’’నిర్మల కోపంగా అంది.
‘‘తప్పంతా మీ నాన్నది... భ్రమర నిస్సహాయకురాలు... ఏం చేస్తుంది చెప్పు... ’’
‘‘అమ్మమ్మా! యీ ఆర్ గ్రేట్. ఐ యాం ప్రౌఢ్ ఆఫ్ యూ’’.
‘‘సరే... మీ అమ్మ అడిగిందానికి ఇప్పుడు సమాధానం చెప్పు... నా కథ అయిపోయింది. నీకు పెళ్ళి కొడుకును చూడాలి కదా!’’
‘‘వేరే చూడ్డం ఎందుకమ్మా! శ్రీధర్ లేడా ...ఏం వాడికేం తక్కువ?’’
‘‘అన్నీ ఎక్కువే... శ్రీధర్ చాలా మంచివాడు...చదువుకుని కూడా చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు.’’
‘‘మరింకేం..’’
‘‘ఏంటి ఇంకేం’’
‘‘నీ కెవరన్నాఫ్రెండ్ వుంటే చెప్పరా పోనీ’’
‘‘ఫ్రెండ్స్ చాలా మంది వున్నారు. మీ ఇద్దరికీ ఈ రోజు చెబుతున్నా... నేను అరేంజ్‌డ్ పెళ్ళి చేసుకోను. కట్నాలు, కానుకలు, ఆడంబరాలు... ఐ డోంట్ లైక్’’.
‘‘అయితే ఏం చేస్తావే... పెళ్ళి చేసుకోవా?’’
‘‘తెలియదు’’.
‘‘తెలియదా? పిచ్చి పట్టిందా’’నిర్మల అరిచింది.
‘‘అమ్మా! ఆవేశపడుకు.... నా జీవితం గురించి నాకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయి.పెళ్ళి పెద్ద ముఖ్యం కాదు. నాకు కొన్ని ఆశయాలున్నాయి. మొదట అవి తీర్చుకోవాలి. నా పెళ్ళిలో మీ పాత్ర ఏమీ వుండబోదు... నాకు అన్ని విధాలా నచ్చినవాడు ఎదురైతే నేనే నిర్ణయించుకుంటాను. మీకు తప్పకుండా చెబుతాను. నిర్ణయం మాత్రం నాదే....’’ అనల గొంతు దృఢంగా పలికింది.
‘‘అంటే... నీ పెళ్ళి మేము చేయెద్దా? నీ కోసం బోలెడు బంగారం... నగలు... సామాన్లు కొని వుంచానే...
‘‘ఆహా... హా.... నేను చెబుతూనే వున్నాను. నాకు నగలొద్దని... నువ్వు వినలేదు... ఎవరికైనా దానం చేసేయ్’’
అమ్మా కూతుళ్ళిద్దరూ అనలనే చూస్తున్నారు.
ఏంటీ పిల్ల ఇలా మాట్లాడుతుంది. కొంపదీసి ఎవరైనా అమెరికావోడిని పెళ్ళి చేసేసుకుంటుందా ఏంటి?
‘‘అమ్మమ్మా! నీ ధైర్యం నాకివ్వు... ప్రపంచాన్ని గెలిచేస్తాను... అమ్మా! నీ కన్నీళ్ళను నాకివ్వకు.. నేను నీ అంత బేలను కాదు. నాన్నలాంటి మనిషిని నువ్వు కాబట్టి భరించావ్... నేను వొక్కరోజు కూడా భరించను’’.
‘‘ఆ.. చెప్పావ్ లే... ఇది అమెరికా కాదు... ఇక్కడ నీ ఆటలు సాగవు... పొనీ ఎప్పుడు చేసుకుంటావో చెప్పు... నా దిగులు తగ్గుతుంది.’’ నిర్మల అనునయంగా అంది.
‘‘అమ్మా! డోంట్ వర్రీ... నాకు అమెరికా అయినా ఆంధ్రా అయినా వొక్కటే... పెళ్ళి విషయంలో నన్ను వొదిలేయ్.... అమ్మమ్మా! నువ్వు చెప్పు....పెళ్ళి చేసుకుని నువ్వు కష్టాలు పడ్డావ్... అమ్మా కష్టపడింది.... ఎందుకు అలాంటి పెళ్ళిలోకి నన్ను లాగాలని చూస్తున్నారు. ఏముంది దాంట్లో శోకమేకదా ?
‘‘అది కాదు బంగారం... అందరికీ కష్టాలే వుండవు. మగాళ్ళందరూ దుర్మార్గులు కాదు. పెళ్ళి మన సంప్రదాయం... కాదనకూడదు.’’
‘‘అమ్మమ్మా! అంటే పెళ్ళి జూదంలాంటిదన్నమాట... నాకు జూదమంటే ఇష్టం లేదు. ఇంక నాకు నిద్రొస్తోంది. ఇంతటితో ఈ మీటింగ్ ముగిసింది.’’ అంటూ లేచిపోయింది అనల. నిర్మల కూడా లేచింది.
‘‘అమ్మా! నా గురించి నువ్వేమీ దిగులుపడకు. నా పెళ్ళి గురించిన ఆలోచన నీ మనసులోంచి తీసేయ్. అమెరికాలో నాకో బోయ్‌ఫ్రెండ్ వున్నాడు. అతను బెంగాలీ... నా ఆలోచనలకు దగ్గరగా వచ్చినవాడు... నేను అతను కలిసి వుంటున్నాం. మాకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తే నీ దగ్గరకే వస్తాం.’’ అమ్మను గట్టిగా హత్తుకుని ఈ మాట చెప్పినప్పుడు నిర్మల ఉలిక్కి పడడం అనలకు స్పష్టంగా తెలిసింది.
‘‘అన్నూ.... అంటే... మీరిద్దరూ కలిసి వుండడమంటే... ’’ గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది.
‘‘అవునమ్మా.... మీం కలిసే వుంటున్నాం. నీ మాటల్లో చెప్పాలంటే మొగుడు పెళ్ళాల్లాగానే’’ అంటూ గట్టిగా నవ్వింది.
‘‘అన్నూ... తప్పు కదా! మన సంప్రదాయం కట్టుబాట్లు... ఎవరికైనా తెలిస్తే.’’ వణికిపోయింది నిర్మల.
‘‘తొక్కలో సంప్రదాయం... ఆడవాళ్ళని శోకమూర్తుల్లా బతకమంటుంది సంప్రదాయం. ఏంటి కట్టుబాట్లు... మారాలి. అన్నీ మారాలి... ప్రేమ వుంటేనే కలిసుండాలి... లేకపోతే విడిపోవాలి... హింసలు,తన్నులు, వేధింపులు, కట్నాలు, కానుకలు ట్రాష్... పెళ్ళంటే ఇదేగా... అమ్మా! నువ్వెప్పుడైనా నాన్నతో సుఫపడ్డావా? అమ్మమ్మ సుఖపడిందా? నేనలా కాదు... నేను అనలను...ఐ నో వాట్ టు డూ... ఐ కెన్ మానేజ్ మై లైఫ్... నా జీవితానికి నేనే కర్త  కర్మ క్రియ... దట్సిట్....’’
అనల ఆవేశం చూసి నిర్మల భయపడింది.
‘‘అమ్మా!! అశోక చెట్టు కింద సీత ఏడుస్తూ కూర్చున్నట్టు ఆడవాళ్ళు ఏడుస్తూ వుండాలని అందరూ ఆశిస్తారు. నేను శోకాన్ని గెలవాలనుకుంటున్నాను.
 నేను అశోకాన్ని... నేనెప్పుడూ ఆనందంగా వుండాలని కోరుకో అమ్మా!’’ అమ్మ గుండెల్లో దూరిపోతూ అంది అనల.
‘‘అన్నూ... నా బంగారం...  నువ్వెప్పుడూ ఆనందంగా, హాయిగా వుండాలి. నువ్వు గెలుస్తావని నాకు నమ్మకముంది. నువ్వెప్పుడూ అశోకంగానే వుండాలిరా...’’
వొకరిని ఇంకొకరు హత్తుకుని హాయిగా నిద్రపోయారు. ఎక్కడో తొలికోడి కూసిన శబ్దం లీలగా వినిపించింది.

                                                 **************

Monday, August 3, 2015

జీవన'చాయ్'


ఫోటోల కోసం నా ఫేస్ బుక్ పేజీని దర్శంచండి
https://www.facebook.com/satyavati.kondaveeti

Chai-enge 16 th Story ~

కొండవీటి సత్యవతి గారితో జీవన'చాయ్'
11. 26.
ఈ రాత్రి ఒక స్నేహశీలి గిరించి రాయాలని, రేపటి స్నేహితుల రోజుకి ఒక కానుకలా ఇవ్వాలని ఇప్పటికే రాసిన దానికి ఇంట్రడక్షన్ జత చేస్తున్నాను.
తను సత్యవతి గారు.
స్నేహానికి చిరునామా.
భూమిక'
తొలి పరిచయం తోనే ఈ విశేషణం ఎలా సాధ్యం అంటే 'ఒక మెతుకు చాలు' అంటారు కదా, అలా.! అంతే మరి. వారితో ఇందిరా పార్క్ సందర్శన ఒక్కటి చాలు, అక్కడ నేను తీసిన ఒక్క చిత్రం చాలు, తను ఎంతటి స్నేహ వస్చాల్యం తో ఉంటె అక్కడి ప్రకృతి నా చిత్రం లో అపురూపంగా కనిపిస్తుంది? నేను మనుషులను తప్ప ప్రకృతి దృశ్యాలు తీయను. కాని తనతో వెళితే నాగ మల్లిని తీసాను. లావెండార్ చెట్టును తీసాను. అడవి బాదం కాయను తీసాను, పురుగూ బూషి కూడా నాకు మహత్యం లా కాన వచ్చింది. తాను ఒక స్నేహితు రాలి తల దువ్వినట్టు, వెంట్రుకలను అలవోకగా ముందుకు వేసినట్టు ఒక చెట్టు ఆకులను ముందకు వేసి అప్పటిదాకా దానికి ఊపిరి ఆడని స్థితిని తప్పించడం చూస్తే, 'ఈమె మనిషి కాదు, ప్రకృతి' అనిపించింది. అలా తొలిసారి ఒక అడవిని, ఒక మైదానాన్ని, తోటని చూపించిన మాదిరి తను ఆ పార్క్ ను చూపడం ఒక చిత్రం. అనేక చిత్రాలు కూడా.
అందుకే ముందు నేను పోస్ట్ చేసిన నా చిత్రాలు చూడండి. తర్వాత ఒక చలన చిత్రం చూపించే ప్రయత్నం చేస్తాను, చూద్దురు గాని!

అవును మరి. సంక్షిప్తంగా చెప్పాలంటే తన జీవితం ఒక అద్భుతమైన చలన చిత్రం.
మామూలుగా ఒక స్టిల్ లైఫ్ ని చేసే రచయిత, కెమెరా దర్శకుడిని నేను. కానీ తాను చలన చిత్రం గనుక కొంత దృశ్యీకరించి చూపాలనిపిస్తోంది.
సో, కొండవీటి సత్యవతి గారు, డాటరాఫ్ కాసి అన్నపూర్ణమ్మ, శ్రీ రామ మూర్తి గారు. వారి కథ ఏమిటో చూడండి. రమారమి నాలుగు దశాబ్దాల చలన చిత్రానికి ఒక మూడుగంటల సంక్షిప్త రూపం ఇస్తే అదిలా ఉండవచ్చు నేమో!
వారి నాన్నగారు తనని హైదరాబాద్ తీసుకు వస్తూ ఉంటారు. అక్కడ టైటిల్స్ పడుతుండగా చిత్రం తొలి సన్నివేశం మొదలువుతుంది. ఆ టైటిల్స్లో కథానాయకి ఊరి పేరు ' సీతారామపురం' అని తొలుత పడుతుంది. తర్వాత రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఊర్లో మగపిల్లలతో సమానంగా ఆటపాటల్లో నిమగ్నమైన ఆ అమ్మాయిపై కెమెరా ఒక్కసారి ఫోకస్ అయి తర్వాత బ్లర్ అవుతుంది. ఆడపిల్లనా మగపిల్లవాడా అర్థం కాదు. కానీ మల్లీ ఆమెను చూపిస్తే తను అమ్మాయే! ఆమెనే చూపిస్తూ, అక్కడి నుంచి ఆ షాట్ లాంగ్ షాట్లో వైడాంగిల్ లోకి మారి మళ్లీ ప్యాన్ అయిన క్రేన్ షాట్ గా మారి పైనుంచి తండ్రి రేడియో వార్తలు వింటూ ఉండగా క్లోజప్ లోకి వస్తుంది. రేడియో నుంచి ఆ మాటలు మరింత గట్టిగా వినిపిస్తూ ఉండగా పక్షుల అరుపులు, గ్రామీణ జీవితపు సంబ్రమం ఒకింత తగ్గి ఒక అంతర్జాతీయ వేదికపై తొట్టతొలిసారిగా 'మార్చి 8' అన్నది మహిళా దినోత్సవంగా మారుతున్న సంగతి మనకు కానవస్తుంది. లీలగా ఒక మార్చ్ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆ పాట ఒక్క మార్చ్ 8 కి మాత్రమే పరిమితం కాదు, ఆ మొత్తం సంవత్సరానికీ విస్తరిస్తుంటే కెమెరా మరింత వైడ్ అవుతూ ఉంటుంది.

'అవును. 1975. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో కాదు, మహిళా సంవత్సరం. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. దాంతో మహిళల జీవితాల్లో ఒక కీలక ఘట్టానికి తెరలేవబోతోంది' అంటూ ఆకాశవాణి వార్తలు పెద్దగా వినిపిస్తుండగా కెమెరా లక్షలాది మహిళల జీవన ఘడియలను, వారి జీవనచ్ఛాయలని చూపిస్తూ తిరిగి ఫోకస్ లో తెరపై కథానాయకి అటు తర్వాత ఆమె తండ్రి కనపడతారు. ఇంతలో ఆ వార్తలు విన్న తండ్రి డిగ్రీ చదివిన తన కూతురు భవితా ఈ సంవత్సరం నుంచే మారుతుందన్న ఆశతో ఉత్సహంగా రేడియో కట్టేసి కూతురిని రెడీ చేస్తుంటంలోకి మారుతుంది. ఆ అమ్మాయి కూడానూ ఉత్సాహంగా తండ్రి వెంట సీతారామపురం నుంచి హైదరాబాద్ బయలుదేరడం మలిదృశ్యం. ఇంతలో దృశ్యాల్లోకి ఆ ఊరు - అక్కడి నది, గోదావరీ దాటి వారిద్దరూ బాగ్యనగరం రావడం, అప్పటి ఆ ప్రయాణం అంతానూ ఒక కొత్త చరిత్రకు సంకేతంగా కానవస్తూ ఉంటుంది. దాంతోఒక్కపరి ఒక అమ్మాయి జీవితం గ్రామం నుంచి సరికొత్తగా నగరంలోకి రావడం, తర్వాత తనని ఇక్కడ బందువుల ఇంట్లో తండ్రి వదిసి వెళ్లడం...దృశ్యాలు చకచకా మారుతుండగా సరిగ్గా అదే సంవత్సరం మరో మహిళ...పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ భారత ప్రధానిగా ఎమర్జెన్సీ విధించడంతో హాయిగా వినవస్తున్న నేపథ్య సంగీతంలో అపశృతి దొర్లుతుంది. అప్పటిదాకా చూసిన రంగుల దృశ్యాల్లోకి నలుపు దృశ్యాలు తోడవుతాయి. దాంతో ఆ సన్నివేశం ఫ్రీజ్ అయి మళ్లీ కదులుతుంది.
నేపథ్యసంగీతం నుంచి మాటలు వినవస్తాయి. 'ఈ కథ ముందుగా కేవలం ఒక స్త్రీ తాలూకు జీవన గాథ మాత్రమే, ఇతివృత్గం ఒక్క స్త్రీకి పరిమితం అనుకునేరు. కాదు' అంటుందా వాయిస్ ఓవర్. వెనకాల నుంచి వినవచ్చే మహిళల స్వరాలు, వారి ఉత్తేజిత ప్రసంగాలు నిదానంగా తగ్గి అటు తర్వాత మొత్తం సమాజం నుంచి వినవచ్చే హాహాకారాలు పెరుగుతాయి. వాటినుంచి ఎదురీతనూ చెప్పే దృశ్యాలు వ్యక్తమవుతూ ఉంటై. అట్లా మొత్తం సంక్షుభిత సమాజం, అందులో ఒక స్త్రీ వాదం కలగలస్తుంది. అది బలోపేతమై విస్తరించి మొత్తం సమాజాన్ని దగ్గరకు తీసుకుంటూ ఉంటే, తనదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న కొండవీటి సత్యవతి గారి పాత్ర క్రమేణా ఒక నిండు మనిషిగా వికసించడం, ఒక చక్కటి మూర్తిమత్వం తెరపై భాసిల్లుతుండగా సినిమా టైటిల్ 'భూమిక' అని పడుతుంది.
+++
ఇట్లా అంతర్జాతీయ వేదికపై మహిళలకు సంబంధించిన కీలక సన్నివేశానికి యవనిక తొలగుతుండగా మరోవంక భారతదేశంలో ఒక మహిళా ప్రధాని చేత చీకటి తెరలు కమ్ముకుంటున్న సందర్భంతో కొండవీటి సత్యవతి గారి కథ మొదలవుతుంది. 1975 నుంచి 1985 దాకా -అంటే ఒక దశాబ్దాన్ని యునైటెడ్ నేషన్స్ మహిళా దశాబ్దిగానూ ప్రకటించింది. సరిగ్గా ఈ పదేళ్లలోనే తెలుగునాట స్త్రీ వాదం బలమైన పాయగా ఎదిగడమూ ఒక యాదృచ్ఛికత. ఈ సమయంలో తాను చదువుకున్న అమ్మాయిగా, ఉద్యోగం చేస్తున్న వనితగా, తెలియకుండానే చరిత్ర రచనలో ఒక భాగమై ఒక కథానాయకిగా మారుతుండటం విశేషం. ఆ కథానాయకి నగరంలో వేసే తొలి అడుగులు, నిదానంగానే అయినా అత్యంత సహజంగా, సుందరంగా, స్థిరంగా పాదుకోవడం- తాను ముందుకు వెళుతూ ఉండగా ఆ మహిళ నిండు వ్యక్తిత్వం దశలు దశలుగా తెలుగునీట ఒక స్త్రీ జీవితం ఎంత స్వతంత్రంగా, స్వేచ్ఛగా, జీవితేచ్ఛతో వికసించిందో ప్రతిబింబించేలా సాగడం- అదే అదే 'భూమిక' కథ.
+++
వడివడిగా కథ ముందూ వెనకలకూ వెలుతూ ఒక స్త్రీ తనదైన వ్యక్తిత్వంతో ఉద్యోగిగా, కార్యకర్తగా, రచయిత్రిగా, పాత్రికేయురాలిగా తెలుగునాట తనదైన భూమికను సంతరించుకుంటూ విహరించడంతో కథ పురోగమిస్తుంది. మారుతున్న సమాజంలో తన పాత్ర కూడా బహుముఖాలుగా విస్తరించడం ఈ కథలోని విశేషం.
కథానాయకి పాత్ర నిదానంగా ఎదుగుతుంది. ఒక్క పరి పైకి రాదు. ప్రస్తుతం భూమిక సంపాదకురాలిగా, పత్రికతో పాటు ఐదారేళ్లక్రితమే 'హెల్ప్ లైన్' గా అవతరించి అందరికీ అందుబాటులో ఉంటూ ఉండగా, తన తదుపరి కర్తవ్యాన్ని మరో కథానాయకి ప్రశాంతంగా స్వీకరించడానికి సంసిద్ధం అవుతుండటంతో ఆ పాత్ర కాసింత విశ్రాంతిని పొందడానికి వెసులుబాటును పొందుతూ ఉంటుంది. ఈ దశలో తొలి భాగమైన భూమిక కథ ముగుస్తుందనవచ్చు. అయితే సినిమా చివర్లో 'సశేషం' అని పడుతుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
అయితే, ఇందులో తన భర్తా ఉన్నారు. ఎనభయ్యవ దశకంలో విజయవాడలో నాస్తిక సమాజం తరఫున జరిగే వేడుకల్లో నిప్పుల మీద నడుస్తుంది కథానాయకి. చివరికొచ్చేసరికి కాస్త తొణుకుతుందగా ఒకరు చేయి అందిస్తారు. వారినే తర్వాత భర్తగా స్వీకరించడం కథలో ఒక మలుపు.
చిత్రమే.అప్పుడు చిన్నఅడ్వకేట్ గా ఉన్న ఆయన తర్వాత సత్యవతిగారిని పెళ్లాడాక ఒక చిన్న సూట్ కేస్ తో ఆవిడ ఇంటికే రావడం అప్పట్లో చిత్రమే. అవును. కథ నిండా ఎవరూ ఊహించని మలుపులు. కల్పన లాగా తోచే జీవన సన్నివేశాలు. ఎన్నో పాత్రలు. తనలోని బహుముఖ వ్యక్తిత్వమూ వివిధ పాత్రలుగా కానరావడమూ అంతనూ ఒక స్నేహితం, శోభ. అయితే బాధితులు, నిస్సహాయులు, విధిరాతను ఎదిరించే మనుషులూ, ఇట్లా జీవితమూ, పోరాటమూ, ఘర్షణా, సంతోషమూ కలగలసి, కథ అనేక లేయర్స్ తో వర్తమాన చరిత్రను ప్రస్తావిస్తూ, గతం నుంచీ భవితలోకి సాగడం నిజంగానే ఒక కథలా ఉంటుంది. ఇదంతానూ - మార్పు యావత్తునూ చిత్రక పట్టేలా, ధ్వనించేలా -వీనుల విందైన ప్రకృతి ఒకటి సినిమా చివరికంటూనూ ఒక చలన సంగీతాన్ని వినిపించడం మరో విశేషం.
+++
భూమిక కథ ఒక హృద్యమైన గాథ. ఎందరితోనో అల్లుకున్న కథనం. ఆ కథలో తొలి దశలో ఉద్యోగిగా ఉంటూ ఉన్నప్పుడు కథానాయకికి తన భవిష్యత్తు పాత్ర ఊహకైనా రాదు. యాదృచ్చికంగా తాను ఒక నాటిక చూస్తూ ఉంటుంది. అది విడాకుల గురించిన నాటకం. అది చూశాక దాన్ని వేసిన వాళ్ల గురించి ఆరా తీస్తుంది. వాళ్లతో తాను కలిసి పనిచేయాలని నిశ్చయించుకుంటుంది. అట్లా తన అన్వేషణ 'ఆన్వేషి' బృందాన్ని పరిచయం చేయడం, కట్ చేస్తే అన్వేషి కార్యాలయంలోనే ఒక గది. అందులో భూమిక పత్రికా కార్యాలయం. అందులో సంపాదకురాలిగా తానే పనిచేస్తూ ఉండటం నిజంగా ఒక ఉద్విగ్న కథ. తనే రాసే ఒక నిజజీవిత కథ వంటి కథే.
సినిమా కథ కొనసాగుతూ ఉంటె, భూమిక కార్యాలయం లో మొదట ఉన్నచాలామంది ఒక్కొక్కరూ వెళ్లిపోతూ ఉండటం, తర్వాత తాను స్థిరంగా అదే భూమికలో ఉంటూ తాను వ్యక్తిగా విస్తరించడం, ఇదంతానూ వర్తమాన చరిత్రను, స్త్రీ వాదాన్ని బలంగా తీసుకు వచ్చిన మూర్తుల పరిచయంతో, వారి వేర్వేరు కార్యక్షేత్రాలతో అందులో తన జీవితం ఇరుసుగా ఈ చలన చిత్రం మన సమాకాలీన చరిత్రకు దర్పణంగా నిలవడం చాలా హాయిగా ఉంటుంది. హాయిగా ఉండటం ఎందుకంటే, ఈ చిత్రం లో గర్షణ పాత్రకన్నా జీవిత ఆవిష్కరణ జరగడమే సిసలు పాత్ర అన్నట్టు సత్యవతి గారి బ్రతుకు కాన రావడం ఒక కవితా న్యాయం అన్నట్టు ఉండటం అదొక చిత్రం. కథ సాగుతూ ఉంటుంది.
అన్నట్టు, తాను ఉద్యోగం చేయడం, ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా విరమించుకోవడం, భూమిక సంపాదకురాలిగా తాను పనిచే్యడం- తర్వాత రెండు దశాబ్దాలు దాటే సరికి భూమిక హెల్ప్ లైన్ ప్రారంభం కావడం. స్త్రీలు తమ సమస్యలు చెప్పుకోవడానికి టెలిఫోన్ ను సైతం వినియోగించుకుంటూ ఉండటం, రక రకాల ఫోన్లు. వాటినుంచి తాను ఒక్కత్తిగా బయల్దేరడం, తర్వాత మిత్రులతో కలిస ఒక బృందంగా వెళ్లడం, ఒక యాక్టివిజం- ఒకరికి ఒకరు అండదండలుగా ఉండటం, పత్రికా-కార్యాచరణ- అట్లా పోలీసులు, న్యాయవాదులు, డాక్టర్లూ, రకరకాల వృత్తిదారులూ, మనుషులు. ఇట్లా - కథ స్త్రీ సమస్యల ఇతివృత్తం ఎలాంటిదో, అది ఎట్లా మిగతా ఇతివృత్తాలతో అల్లుకుని ఉన్నదో చెప్పడంగానూ ఆ సినిమా వేగంగా అనేక దృశ్యాలతో సాగిపోతూ ఉంటుంది. ఐతే ఎక్కడ విసిగూ విరామం ఉండదు. అదే విశేషం.
తర్వాత తాను తర్వాత సోషల్ నెట్ వర్క్ మీడియం అయిన ఫేస్ బుక్కులోనూ కనిపించడం అక్కడ తనను తాను హాయిగా ఆవిష్కరించుకుంటూ ఉండటం, ఆ క్రమంలో ఒక మెసేజ్. అది నేను పెట్టింది కావడం. దానికి తాను రెస్పాండ్ అవడం నా వరకు మరో విశేషం. తర్వాత ఒకరోజు తాను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న కారు ఇందిరా పార్క్ దగ్గర ఆగడం, తాను పార్కులోకి నడిచి నడక సాగిస్తుండగా నేను కలవడం, కలిసింతర్వాత పార్కులోని ప్రతి చెట్టు, కొమ్మా, రెక్కా, పూవు కథలు కథలుగా వికసించడం, అసలు ఈ చెబుతున్న సినిమా అంతానూ ఇందిరాపార్కులోని ఒక్కో దృశ్యం దగ్గర నుంచి వెనక్కి నడిచి ముందుకు రావడం చిత్రం. ముందు నేను చెప్పినట్టు -నేను తెసిన ఒక్కో చిత్రం తో కథ వెనక్కు ముందుకూ నడుస్తూ చలన చిత్రం అవడం నిజమైన చిత్రం. ఇక్కడ ఆగాలి. విశ్రాంతి.
+++
ఇందిరా పార్క్ లో జీవన'చాయ్' కోసం మేము కలిసాక-చిత్రంగా మా సంభాషణ అంతా అయిపోయాక- బయటకు వస్తూ ఉండగా ఈ ఉద్విగ్న చిత్రానికి ఒరవడి 'ఆ 1975 కాదా?' అనుకోవడం ఒక ఆశ్యర్యం!
అప్పటి దాక మాకే తెలియదు. ఎవరి జీవితం వారు తిరిగి చూసుకుంటామా ఏమిటి? కాని చిత్రంగా అలా తోచింది. దాంతో ఒక ఆలోచన కలిగింది. ఇందిరాపార్క్ లోని ఇందిరమ్మ విగ్రహం వద్ద తనను నేను నిలిపి ఒక చిత్రం రచించడం అవసరం అనిపించింది. దాంతో ఈ చలన చిత్రానికి భూమిక 'ఆ 1975 సంవత్సరం' అనే నేను నమ్మడం, ఆ మాటా తనతో పంచుకోవడం, అట్లా అన్నప్పుడు ప్రస్తుతం ఇందిర కటింగ్ తో ఉన్న సత్యవతి గారు చిన్నగా నవ్వుకోవడం, నవ్వి 'అవునా' అని తల పంకించడం ఒక చిత్రం. తీసాను దాన్ని. ఇట్లా తన కథను నేను చెప్పడం గమ్మత్తుగా ఉందే అనుకోవడం, ఇదీ మా ఇద్దరి మధ్య నడిచిన ఒక తెలియని ఆవిష్కరణ - జీవన'చాయ్'.
అయితే ఇందిరాపార్కు ఒక ప్రతీక. అది తను పుట్టి పెరిగిన సీతారామాపురం వంటిదే. ఒక బూమికనే!
అక్కడ తాను మొగలిపూల పొదను చూపించారు. తాటివనాలనూ చూపించారు. మాంజా బారిన పడి మరణం అంచున వేలాడిన ఒక కొంగ, మరో గబ్బిలం గురించీ చెప్పారు. తాను వాటిని రక్షించిన విధానాన్ని, ఆ వాతావరణాన్ని, అక్కడ అలా ఆ ఉదయం ఆ చెట్ల నడుమ పంచుకున్నప్పుడు తాను మహిళల రక్షణ గురించి మాత్రమే తపించే స్నేహశీలి అనిపించలేదు. ఒక మమత అనిపించింది, ఆమె గురించిన ఒక ఎరుక తెలియ వచ్చింది. తను తీగల గురించి, ఛీమల పొట్లాల గురించీ చెబుతున్నప్పుడు సుతారంగా అల్లుకునే విధానం అర్థమైంది. తనను తాను దాపెట్టుకునే దాగే సౌందర్యం కాన వచ్చింది. తనకు ఇందిరాపార్కు అన్నది తన జీవావరణ వ్యవస్థలో ఒక భాగం అని, అసలు తానే భూమిక అని, మిగతావన్నీ కేవలం ఆశ్రయాలే అనీ అర్థమైంది. అసలు తన జీవితమే చలన చిత్రం అని, తాను చూపిస్తున్నవి తానూ వేరు వేరు కాదనీ అర్థమైంది. ఒక చిత్రం చలన చిత్రం కావడం అంటే ఇదే.
తాను అనుభవం, అనుభూతి. పంచుకుంటారు కూడా. అట్లా, ఎక్కడుంటే అక్కడ చప్పున తాను ఒక వేరును చూపుతారు. ఒక దారు వలయాన్ని చూపుతారు. అటువంటి మనిషే స్వయానా క్షేత్రం తప్పా మరొక క్షేత్రంలో తనను వెతకడం వృధా ప్రయాస అనీ అనిపించింది.
అక్కడి నుంచి తర్వాత వారి ఇంటికి వెళ్లి చాయ్ తాగడం, భూమిక కార్యాలయానికి వెళ్లి తన పుస్తకాలు తీసుకోవడం, అటు పిమ్మట నేను తీసిన చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసుకుని ఈ చలన చిత్రాన్ని రచించడం అంతానూ ఒక షేరింగ్. ఒకరి చాయలో సేద తీరడం. స్నేహితం. నాలుగు దశాబ్దాల చలన సంగీతానికి సంక్షిప్త అనువాదం.
+++
ఇట్లా సత్యవతి గారి కథనం ఒక చలన చిత్రం. అందులో సీతారామపురం నుంచి ఇందిరాపార్కు దాకా జరిగిన అనేక దృశ్యాదృశ్యాల సమాహారం చలనం అంతానూ ఒకే చిత్రం. అదే ఒక భూమిక.
+++
అయితే ఏవీ కల్పన కాదు. ఏవీ మరచిపోని విషయాలే.'వాడిపోని మాటలు'. అవును. ఆపేరుతో తాను రాసిన భూమిక సంపాదకీయాలు చదివితే, గడిచిన దశాబ్దాలలో విరిసిన ఘట్టాలెన్నో మళ్లీ ముందర ఉద్విగ్నంగా పరుచుకుని వర్తమానాన్ని ఉత్తేజితం చేస్తాయ్. చలన చిత్రం అన్నాను కదా. అందుకే. అందులో అందరి జీవితాలూ తెరుచు కుంటై!
'తుపాకీ మొనపై వెన్నెల' పేరుతో తెచ్చిన తన యాత్రానుభవాలు ఆమెలోని సాహసిని, పరిమితులు దాటి విహరించే స్వేఛ్చ పరిచయం చేస్తాయి. అదొక చిత్రం.
ఇక తన తొలి కథల సంపుటి 'ఆమె కల' తెరిస్తే, అందులో పక్షే ఉంటుంది. బోనులో ఉన్న పక్షి -బొనులొంచి బయట పడే పక్షి. అన్నీ ఉంటై. ' చెట్టు మీద పిట్టల్లే తనని పెంచిన అమ్మా నాన్నా -తనకు భూమికను ఇచ్చిన ఇరుగు పొరుగు - కార్యక్షేత్రం, మానవీయత -అన్ని కలగలసిన ఒక పెద్దబడి వంటి పాఠశాలలోకి ఆ పక్షులే మనల్ని మనల్ని తీసుకెళతాయి. అక్కడ విశ్వవిద్యాలయమూ ఉందని తెలిసి ఆశ్చర్యపోవడం మన వంతు. అవును మరి. అన్ని జీవావరణాలు కలిసిన స్త్రీ మూర్తి, వ్యక్తిత్వ, కొండవీటి సత్యవతి గారు.ఆవిడ స్వయానా రెక్కలున్న పక్షి. పిల్లల కోడి. అల్లుకునే స్నేహలత.
అన్నిటికీ మించి, తాను త్వరలో అచ్చుకు ఇవ్వబోతున్న పుస్తకం - 'ఆనందార్ణవం'. అది ఒక్కటి చాలు, మొత్తం తన చిత్రాన్ని లేదా చలన చిత్రాన్ని సంతోష ద్వీపాల సమాహారం అని రుజువు చేయడానికి. ఇందులో సంతోషం అంటే ఏమిటో తను అనుభవించి పలువరించిన విదానం చూస్తే, తాను గొప్ప రచయిత్రగా కంటే అద్భుతమైన మనిషిగా జీవించడానికి పొందిన వరం ఏమిటో అదెట్లా తనని సామాన్యీకరించిందో అవగతమై ఎదురీత, ఘర్షణ కన్నా 'జీవితేచ్ఛ' అన్నది తనని ఎంత నిశతం చేసిందో తనని అంత ఆనందమైన మనిషినీ చేసిందనిపిస్తుంది. ఒక రకంగా మ్యూజింగ్స్ వలే అనిపించే ఈ పుస్తకం ఆమెను సున్నితమైన మనస్కురాలిగా, ఇన్నేళ్లూ నిరంతర కార్యాచరణలో ఉండి కూడా యాంత్రికం కాని తన జీవధారుడ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
ఇక తన ఫేస్ బుక్ 'టైమ్ లైన్'. అక్కడ గనుక తనని చూస్తే, తాను ఎంత స్నేహశీలో మరెంతటి కార్యకర్తో ప్రతి పోస్టూ చెబుతుంది. కార్యాచరణ కోసం తను కాదు. తన కోసమే కార్యం అన్నంత ఇదిగా తాను ఇన్వాల్వ్ అయి ఇష్టంగా, ప్రేమతో నిమగ్నమయ్యే కార్యాచరణ మనల్ని ముగ్దులను చేస్తుంది.
తెలుగునాట ఇంత హాయిగా వ్యక్తమయ్యే 'జీవని' ఒకరు మనకు అరుదుగా కనిపిస్తారు. వారితో గడిపిన బతికిన క్షణాలకు ఆనందం. సంతోషం. ధన్యవాదాలు.
+++
చివరగా, తొలిగా చెప్పవలసిన మాటలు.
అవును. చిత్రమే.
చిత్రం ఏమిటంటే సత్యవతి గారు అద్బుతమైన మనిషి గా ఆవిష్కారం అవుతారు, ప్రతి రచనలో. బహుశా అందుకే తాను పెద్ద రచయితగా పేరు పొందలేదు. అది నిజంగా అదృష్టం!
అలాగే, తాను గొప్ప యాక్టివిస్ట్ గానూ పేరు పొందలేదు. లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ నించి తను రాకపోవడం తనకు కలిసి వచ్చిన మరో అదృష్టం! లేకపోతే తను జీవితం ఒక సంతోష సాగరం కాకుండా, పోరాట సారం మాత్రమె అయ్యేది. అదొక అదృష్టం.
అలాగే, తన జీవితం ఒక చిత్రం కాలేదు. అది చలన చిత్రం అయింది.
దాన్ని ఎవరూ ఫ్రీజ్ చేయలేరు. అది అన్నిటికన్నా ముక్యం.
ఈవెన్ స్త్రీ వాది గా తాను పని చేస్తున్నప్పటికీ, తనలోని మనిషి, మానవత ముక్యం గా ప్రవర్తించడమే తన స్త్రీ లక్షణం అవడం మా అదృష్టం. లేకపోతే తాను ఏమర్జ్ అయ్యేవారు కాదు, ఇందిర అయ్యే వారు గాని సత్యవతి గారు అయ్యేవారు కాదు.
థాంక్స్ ప్లీజ్.
మీ స్నేహపూర్వక జీవనజీవన'చాయ్'కి ,
మీదు మిక్కిలి మీది అయిన 'భూమిక''కి,
happy friendship day wishesతో.
00.27
02.05.2015
~ కందుకూరి రమేష్ బాబు

Tuesday, June 23, 2015

చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.ఈ రోజు తండ్రుల దినమట.
మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.
ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.
పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.
మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.
మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.
మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు బావిలోంచి బుడ్లజోడుతో (మట్టి కుండలు) నీళ్ళు ముంచి పోస్తుంటే నేనూ ఓ కుండ తీసుకుని ఆయన వెనకే నీళ్ళు పోసిన జ్ఞాపకాలు...
నన్ను స్కూల్ చేర్పించడానికి నరసాపురం తీసుకెళ్ళి అది ఏ స్కూలో తెలియకుండానే ఓ కొండపల్లి చేంతాడంత పేరున్న "హిదూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూల్" లో (అది ఓరియంటల్ స్కూల్ అని తెలిసో తెలియకో) నన్ను జాయిన్ చేసిన జ్ఞాపకం.
(అందరూ నన్ను విడో హోం లో చదువుతోంది అని వెక్కిరించేవారు.అప్పటికి విడోస్ అంటే ఎవరు అని నాకు తెలియదు.)
నేను కష్టాతి కష్టం గా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉన్నప్పుడు "పద హైదరాబాద్ పోదాం నీకు ఉద్యోగమొస్తుంద"ని నన్ను ఈ మహానగరానికి తెచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నన్ను మా చిన్నాన్న ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకం..
.నా జీవిత గమనం...గమ్యం నిర్ణయమైన సమయం..
మా అక్కలు..అన్న తమ్ముళ్ళు నాన్న గారూ అని పిలిచినా
నేనొక్కదాన్నే నాన్నా...నువ్వు అని పిలిచిన నాన్న...మా దొడ్డమనిషి.
వ్యవసాయం చేసిన రైతు...
అప్పుడప్పుడూ వ్యాపారం చేసి అమాయకంగా మునిగిపోయిన నాన్న.
నాన్న 50 ఏళ్ళకే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆయనకి ఖరీదైన వైద్యం చేయించే స్థోమత మాకు లేదు.
బిపి పెరిగి తలలో నరాలు చిట్లి చనిపోయాడు నాన్న.
నేను ఆయన్ని చివరి చూపు కూడా చూడలేదు.
నేను చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి వెళ్ళినా అప్పటికే అంతా అయిపోయింది.
నాన్న చాలా అరుదుగా షర్ట్ వేసుకునేవాడు.
షర్టులుండేవి కాదు.
నన్ను ఆడపిల్లగా కాకుండా మనిషిగా పెంచిన నాన్న..
చెట్లెక్కడం..
చేపలు పట్టడం...
సైకిల్ తొక్కడం...
గొడ్దళ్ళతో కట్టెలు కొట్టడం నేర్పిన నాన్న...
నువ్వాడపిల్లవి..అది చేయొద్దు.. ఇది చేయొద్దు... అలా తిరగొద్దు అని ఏనాడు చెప్పకుండా నన్ను చెట్టు మీద పిట్టల్లే స్వేచ్చగా పెంచిన నాన్న...
నన్ను హైదరాబాద్ తెచ్చి నా జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిన నాన్నని తలుచుకుంటే ఎంత సంతోషమో నాకు.
నా దగ్గర ఉన్న నాన్న ఒకే ఒక్క ఫోటో ఇది.వెనక రైలుపెట్టెల్లాగా ఉన్న మా ఇల్లు...
మండువా లోగిలి.
ఎడం వైపు నుండి రెండో వ్యక్తి మా నాన్న.పేంటు వేసుకున్న వాడు మా ఆఖరి చిన్నాన్న

వితంతువుల దినోత్సవమట

మనకి అన్నీ ఉత్సవాలే
ఏముంది సెలబ్రేట్ చేసుకోవడానికి??
ఏమి సాధించామట???
భళ్ళున గాజులు పగలకొట్టడం మానేసారా???
కృరంగా బొట్టు చెరిపేయడం మానేసాసా??
తెల్ల చీరలు కట్టించడం మానేసారా??
సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి గౌరవంగా పిలవడం నేర్చేసుకున్నారా??
"పరమ పవిత్రత" ఆపాదించి అందరి మెడలకి తాకించే తాళి బొట్టుని ఆమె మెడకి కూడా తాకించే సంస్కారం అలవరుచుకున్నారా?
పొద్దున్నే కళ్ళబడితే తుపుక్కున ఊసే అమానవీయాన్ని మానవీయమంచేసుకున్నారా???
ఏమి సాధించారని వితంతు దినోత్సవం జరుపుకుంటారు???
అసలు స్త్రీలు ముత్తైదువులుగా...వితంతువులుగా ఎందుకు విడదీయబడాలి???
ప్రపంచంలో వితంతువులే కానీ భార్యలు పోయినవాళ్ళు ఎందుకుండరు?
వాళ్ళకో పేరు ఎందుకు లేదు???
ఒక వికారమైన రూపమెందుకు లేదు??
భార్య చనిపోయిన నెలలోనే రెండో పెళ్ళికి సిద్ధమయ్యే మగవాళ్ళ...
వాళ్ళ మనశ్శరీరాల మీద భార్యా విహీనత గుర్తులేమీ ఉండక్ఖరలేదు.
అదే స్త్రీలైతే...మనసు నిండా దిగుళ్ళు...
వికృతం చేసిన శరీరాలు అందంగా ఉండే ఆమెను అందవిహీనను చేసేదాకా సాగే పరమ అసహ్యకరమైన తంతులు...
భార్య పోయిన నాటినుంచే బయట ప్రపంచంలో స్వేచ్చగా తిరిగే భార్యావిహీనుడు..
ఆమె మాత్రం చీకటి గదిలో కుళ్ళి కుళ్ళి శోకాలు పెట్టి ఏడవాలి.
ఎవ్వరికీ కనబడకూడదు...
అశుభం..
.అధ్వాన్నమైన వ్యవస్థ ఇది.
ఏది శుభం ఏది అశుభం???
ఎవరు నిర్ణయిస్తారు??
ఆచారాలు...కట్టుబాట్లు,సంప్రదాయాలు అన్నీ ఆడవాళ్ళకే
పురుషుడెప్పుడూ అచ్చోసిన ఆబోతులా స్వేచ్చగానే ఉంటాడు.
ఏ ఆచారమూ,ఏ కట్టుబాటూ,ఏ సంప్రదాయమూ అతడిని కట్టడి చేయలేదు.
ఎంత ఘోర అపరాధం ఇది???
ఈ అపరాధాన్ని భారతీయ సమాజం వేలాది ఏళ్ళుగా కొనసాగిస్తూనే ఉంది.
భర్త చనిపోతే ఆమెని మనిషిగా లెక్కగట్టని అమానవీయ సమాజం...
కడుపు నిండా తిననివ్వని,కంటి నిండా నిద్రపోనివ్వని భయంకర సమాజం.
మధురలో,బృందావనం లో,ఎన్నో గుళ్ళ దగ్గర హీనాతి హీనంగా బతుకుతున్న వేలాది వితంతువులు భారతీయ సమజం తయారు చేసిన మహా గాయాలు..
నెత్తురోడుతూ,నిలవనీడ లేక,తినడానికి తిండి లేక,పురుష సన్యాసుల నుంచి నిరంతరం లైంగిక హింసకి,దోపిడీకీ గురౌతున్న మధుర వితంతువుల దుఖం ఈ దేశం లోని నదులన్నింటిలో లోను కలసి ప్రయాణిస్తోంది.
మీరు మరీ విడ్డూరంగా రాస్తున్నారు..
.రోజులు మారిపోయాయి...
ఇప్పుడెవ్వరూ ఆ పద్ధతుల్ని పాటించడం లేదు
అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళకి నా సూటి ప్రశ్న...
దయ చేసి మీ కళ్ళదాలను మార్చుకోండి...
నగర నేపధ్యం లోంచి వ్యాఖ్యానించడం మానండి...
పల్లెల్లో ఇప్పటికీ యదేచ్చగా అన్ని సాగుతున్నాయి...
చైత్యన్యవంతులైన కొంతమంది అడ్డుకుని ఆపగలుగుతున్నారు
కానీ మెజారిటీ చూస్తే ఎక్కువ మంది తుచ తప్పక పాటిస్తున్నారు.
నేను చాలా దగ్గరగా చూసాను.
చాపకింద నీరులా కొన్ని చోట్ల కనబడకుండా కొనసాగుతోంది.
మన భాష లోంచి పునిస్త్రీలు,వితంతువులు అనే పదాలు పోలేదు.
పేరంటాలకి పునిస్త్రీలే ఇంకా అర్హులు.
తన సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి వితంతువులకు అనుమతి లేదు.
భరత స్త్రీకి నిర్వచనం ముత్తయుదువే...
బొట్టు కాటుక,తలనిండా పూలు,రంగు రంగు చీరలు కట్టినవాళ్ళే భారతీయ స్త్రీ నమూనాలు.
పరమ వికారమైన, కడుపులో పేగులు లుంగ చుట్టుకుపోయే దృశ్యాలు...
యుద్ధంలో మరణించిన "వీరుల" కు మరణానంతరం ఇచ్చే పరమవీర చక్రాలను అందుకోవడానికి తలనిండా ముసుగుతో తెల్ల చీరలు కట్టి కుంగిపోతూ వచ్చే స్త్రీలు.
వైధవ్యానికి ప్రతీకలు గా కనబడతారు.
పైగా వ్యాఖ్యానాల్లో ఫలానా సైనికుడి వితంతువు అని చెబుతారు తప్ప ఆమె పేరు ప్రస్థావించని మొరటు సంస్కృతి.
మగవాళ్ళు ఫలానా ఆమెకి వితంతువుడు అని చెప్పగా విన్నారా??
యుద్ధాలు చేసి చనిపోయేది మగవాళ్ళే కదా అంటారా??
స్రీలను వితంతువులుగా...పునిస్త్రీలుగా విభజించి అవమానించే సంస్కృతి పోవాలంటే ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి.
ఆ పదాలను భాషలోంచి తీసెయ్యాలంటే ఏం చేయాలి???
ముత్తైదువులని,పునిస్త్రీలని,వితంతువులని స్త్రీలని విభజించే దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిద్దాం రండి.

Tuesday, January 27, 2015

విశ్వప్రేమ ని నేర్పే విపశ్యన


                                                          కొండవీటి సత్యవతి

నాగార్జున సాగర్‌ వెళ్ళే దారిలోగుర్రంగూడ గ్రామంలో  విపాశన సెంటర్‌ వుంది.జూలై 19  తేదీన 1.30కి విపాసన సెంటర్‌ చేరాను. 2.15 కంతా అప్లికేషన్నింపడం అయ్యిందిఅప్లికేషన్‌ నింపాక పద్మజ అనే ఆవిడ దగ్గరికి (టీచర్‌)వెళ్ళమన్నారు.  అన్ని నియమాలకు కట్టుబడివుంటారారూల్స్‌ మరియు రెగ్యులేషన్లు చదివారాఅని అడిగారుఅన్నీ చదివానుమీ వైబ్సెట్లుకూడా చూసాను అని చెప్పానుమీరు జర్నలిస్ట్ని రాసారు కదా పేపర్‌ అంటేభూమిక పత్రిక అనిస్త్రీల కోసం ఒక హెల్ప్లైన్‌ నడుపుతానని చెప్పాను.మీరు రెవెన్యూడిపార్ట్మెంట్లో చేసేవారు కదా అని అడిగారునేను ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అన్నాతర్వాత చెబుతాను అన్నారుఎలా తెలుసో ఆతర్వాత చెప్పారులెండి.  నాకు సింగిల్‌ రూమ్‌ కావాలిఅంటే 117 ఇచ్చారుసామాను మోసుకుని రూమ్‌ కొచ్చానురూమ్‌ చక్కగా నీట్గా,క్లీన్గా వుందిసిమెంటుతో కట్టినమంచంపరుపుస్టోర్కెళ్ళి దుప్పట్లు తెచ్చుకుని  మంచంమీద పరిచానునేనుతెచ్చుకున్న దుప్పట్లు కూడా పరుచుకుని  రూమ్ని ప్రేమించడంమొదలుపెట్టానురూమ్‌ ముందు చెట్లు పెద్ద రావి చెట్టుఆకులు గలగలమంటూ ఒకటే సంగీతం.దానికి తోడు లెక్కలేవన్నీ పిట్టల వైవిధ్య స్వరాలు.రామచిలకలుపిచ్చుకలు ఒకటే పాడుతున్నాయి.వస్తూ వస్తూ కారులోనే లంచ్‌ తిన్నానురూమ్‌ సర్దాక బయటకొచ్చాను ఒకావిడ నిలబడి వుందినవ్వగానే వచ్చి నా రూమ్‌ ముందు కూర్చుందిఆవిడకి ఇది మూడోసారట.విపాసన గురించి చెప్పిందిఅన్నం తిన్నారా అని అడిగితే ఇక్కడతినలేదుపన్నెండింటికి  జొన్న రొట్టె తిన్నాను అన్నానుఅయ్యోపదండి.సాయంత్రం ఏమీ వుండదుఅంటూ డైనింగ్‌ హాల్కి తీసుకెళ్ళి తనే కంచంలోఅన్నంచపాతిపప్పుమజ్జిగ పట్టుకొచ్చిందిఆకుకూర,పెరుగుఅయిపోయినట్టుంది అంది నాకు చపాతి వద్దు కొంచం అన్నం చాలు అని పప్పు అన్నంతిని మజ్జిగ తాగానుపప్పుఅన్నం తిని మజ్జిగ తాగానుపప్పు చాలా రుచిగావుంది. 5గంటలకు హాలు దగ్గరికి రమ్మన్నారుఅప్పటి వరకు మాట్లాడవచ్చు.సెల్ఫోన్‌, డబ్బు వాళ్ళ దగ్గరడిపాజిట్‌ చేసేసాను.
ఆవరణంతా చెట్లతోహాయిగా వుందివాతావరణం బావుందిపెద్ద లోటస్పాండ్లో పసుపుపచ్చ కలువలుపూసాయిమూడు రౌండ్లు నడిచి ఒక చెట్టు దగ్గర కూర్చున్నానుసత్యవతిగారూ!అంటూ పిలుపుసర్వీస్‌ కమీషన్‌ కొలీగ్‌.  ఇద్దరం మాట్లాడుతూ మరో రౌండునడిచాం.నాలుగింటికి నా రూమ్‌ కొచ్చాను.ఇక్కడికి రాగానే పెద్ద బరువేదో వదిలినట్టుందిచేతిలో పైసా లేకుండాహాయిగా పది రోజులు వుండొచ్చురూమ్కి తాళం వెయ్యక్కరలేని హాయిదేనినీపట్టించుకోనక్కరలేదుదేనినీ మొయ్యక్కర్లేలేదుబ్యాగ్‌,సెల్ఫోన్బాదరబందీలేదురూమ్‌ తలుపుదగ్గరేసి అలా చెట్లలోకి నడుచుకుంటూవెళ్ళిపోవడం అబ్బనిజంగా ఎంత సుఖంగా వుందోపది రోజులపాటు దొరికే ఈస్వేచ్చ.  శృంఖాలాలుగొలుసులు లేని స్వేచ్ఛని అనుభవించడం నిజంగా గ్రేట్ప్రివలేజ్‌. ఎలాంటి మతపరమైన బోధనలుకీర్తనలు లేకపోవడం కేవలం కేవలంప్రకృతితోసంబంధం వుండడంమనతో మనకి మాత్రమే సంబంధం వుండడం ఫీలింగ్‌ గుడ్‌.రేపటి నుండి ఎలా వుంటుందో తెలియదు.   అనుభవం ఎలా వుంటుందో చూడాలినాకిష్టమైన చెట్లుపిట్టలు వుండనే వున్నాయివుండలేకపోవడం ఏమిటి?దూరంగా ఎక్కడినుండో నెమలి కేక కూడావినిపిస్తోందికోయిల బృందగానం వుండనేవుంది

ఆరుగంటల నుండి ఏక్టివిటీ మొదలైంది.ఆరింటికి ఉప్మాటీఇచ్చారుఅదేరాత్రిభోజనం  తర్వాత మెడిటేషన్‌ మొదలైందివిపాశన ప్రారంభించిన గురువుసత్యన్నారాయణ గోయంకాగారి ఆడియో పన్యాసంతో తొలి మెడిటేషన్‌. పాటించాల్సిననియమాలుఅంతకు ముందుదమ్మసేవకులు పాతసాధకులునియమాల గురించి వివరిస్తూఆవరణలో వున్న వివిధ మెడిటేషన్‌ సెంటర్లు చూపించారు తర్వాత ఐడికార్డుఇచ్చారురాత్రి తొమ్మిది వరకు మెడిటేషన్‌ నడిచిందిబాసింపట్టులో అంతసేపు కూర్చోవడం కష్టమైందిగుండె బరువెక్కినట్లనిపించింది.నొప్పిగాకూడా అనిపించిందిదాన్ని పట్టించుకోకుండా మెడిటేషన్‌ చేసానురాత్రి9.30 కి లైటార్పేసి పడుకున్నానుచాలాసేపు నిద్రపట్టలేదు.  దీని '0' డే అంటారుబుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం కనుగొన్న మెడిటేషన్ని ఇలా ఇపుడునేర్చుకోవడం బావుందిమనం తీసుకునేశ్వాస మీదే ధ్యాస పెట్టడంపరధ్యాసలేకుండా వుండడం ఇదే మొదటి రెండు రోజులు.శ్వాస ఎటు వెళుతుందిఎలావెళుతోంది చూడ్డమే పని వేరే పనేమీ లేదు.

మొదటిరోజు.
ఉదయం నాలుగింటికి గంట మోగిందిఠక్కున మెలకువ వచ్చిందిబ్రస్చేసి,మెడిటేషన్‌ హాలుకెళ్ళిపోయాను. 4.30కి తొలిసెషన్‌ మొదలైందిశ్వాసమీదధ్యాస అంతేశ్వాస ఎలా వెళ్ళుతోందిలా బయటకు వస్తోంది గమనిస్తూ మనసునుముక్కు పుటాల మీదే కేంద్రీకరించమనిగోయంకా గారు హిందీలోనుఇంగ్లీషులోను,వేరొకాయన తెలుగులోను చెబుతూంటారుమనసు శ్వాస మీద నిలవదుఅది గమనించిమనసును లాక్కొచ్చి శ్వాస మీద నిలపమంటారు క్షణం వుంటుందిడోక్షణంపారిపోతోందివరంగల్‌ పోతుందిహైదారాబాద్‌ పోతుందిఅమెరికాపోతుంది.అండమాన్‌ పోతుందిఏమిటేమిటో ఆలోచనలు వస్తుంటాయిచిత్రమైనఆలోచనలొస్తుంటాయిఎవరితోనో మాట్లాడుతుంటాంమళ్ళీ గుర్తొచ్చి మనస్సునులాక్కొచ్చి ముక్కు మీద కూర్చొబెడతాంకొంచెం సేపు కూర్చుంటుందిమనసు అలానిలకడగా వున్నపుడు మనంశ్వాసని చూడగలుగుతాంమనసు షికార్లు చేస్తునప్రుడుశ్వాస మీద ధ్యాస వుండదుఆలోచనలని ఆపడం మన తరం కాదుగమ్మత్తుగా మనఆలోచనలకనుగుణంగా మన శ్వాసలో తేడా తెలుస్తుందిఎవరి మీదో కోపంఎప్పటిదో!వాళ్ళ పని లా పట్టాలిఏదో పని మిగిలిపోయింది.దానిని ఎపుడు పూర్తిచెయ్యాలిప్రియమైన వ్యక్తి ఆలోచనలోకి వస్తే... అప్రియమైనవాళ్ళు వస్తే..శ్వాసలో తేడా గమనించొచ్చుతనకు నచ్చని అంశం గుర్తొస్తే మనసు ఉద్రిక్తమౌతుందినచ్చినది గుర్తొస్తే మనసు సేదతీరుతుంది తేడాలుశ్వాసలో తెలుస్తాయిద్రేకపడినప్పుడు శ్వాసబరువుగాబలంగా వస్తుంది.అంటే నెగిటివ్‌ విషయాలు ఆలోచనల్లోకి వచ్చినపుడు శ్వాస బరువెక్కుతుంది.గాలి ధారాళంగా లోపలికి వెళ్ళలేకపోతుందిమనసు తేలికగా వున్నపుడు గాలిమాములుగాతేలికగా వెళ్ళిపోతుందిఅలాగే మనసు ఎప్పుడూ గతంలోకిభవిష్యత్తులోకిచక్కర్లు కొడుతూంటుందిఇప్పటిమీద నిలవదునిన్నేంజరిగిందిఎందుకు జరిగిందిఎలా జరిగింది లాంటి జరిగిపోయినవాటిమీదరేపేంజరగబోతోందిఏం కాబోతోందిలాంటి వాటి చుట్టే తిరుగుతుంటుందిదీనివల్లఆందోళన పెరిగి ప్రస్తుతాన్ని ఆస్వాదించలేకపోతాంఇది తొలిరోజుగోయంకా గారి ఉపన్యాససారాంశం.ఉదయం 4.30 నుండి మధ్యలో కొంత విరామంతో రాత్రి 9.00దాకా సాగింది మెడిటేషన్‌. సాయంత్రం ఎనిమిదిన్నరకి గోయంకా గారి వీడియో ప్రసంగం విన్నాం.ఆయన్ని చూసాం టివిలోసాయంత్రం ఐదింటికి మరమరాలుఅరటిపండుటీఇచ్చారు.ఇదే డిన్నర్‌. తొమ్మిదింటి దాకా మెడిటేషన్లో వున్నాం కానీ ఆకలివెయ్యలేదుమధ్యాహ్నం అన్నంచపాతీలుకమ్మటి పప్పు తియ్యటి పెరుగువేడివేడి సొరకాయబెండకాయ కూరతో మంచి భోజనంఉదయం ఆరింటికి వేడి వేడి పొంగలి,పల్లీ చట్నిఅరటిపండు,టీ.తొమ్మిదింటికి రూమ్కొచ్చిన వెంటనే పడుకుండి పోయానువెంటనే నిద్రపట్టేసింది రోజు నేను నేర్చుకున్న ముఖ్యమైన అంశంభోజనాన్నిప్రేమగాఇష్టంగాగౌరవంగా తినడం.ఏం తింటున్నామో తెలుసుకుంటూ తినడం.ఆకలిని అర్ధం చేసుకోగలగడంనచ్చని అంశంబుద్ధుడినిభగవానుడనడంశ్వాసమీదధ్యాస సాధిస్తే పరమపదం పొందుతారని చెప్పడంపరమపదం అంటే ఏమిటిసెంటర్లోఎక్కడా బుద్ధ విగ్రహంగానీగోయంకా గారి ఫోటోలు కానీ లేవుఇది బావుంది.రెండోరోజు.
నాలుగింటికి గంట మోగిందివెంటనే లేచాను.  సెంటర్వేపు నడిచానుచాలానిశ్శద్ధంగా వున్నాయి పరిసరాలుచల్లటిగాలిరావిఆకుల గలగలుమాతో పాటేకొన్ని పక్షులు లేచాయికోయిలమ్మ గొంతు సవరించుకుంటూ కూయడంమొదలుపెట్టిందిరకరకాల పిట్టల సంగీతం వింటూసెంటర్దాకా నడిచానురోజూఇరవై సార్లన్నా ఇదంతా నడుస్తాను. నిశ్శబ్దవేళ 4.30కి మెడిటేషన్మొదలైందినిన్న మొదలైన ప్రశ్నలవల్ల ఒక వ్యతిరేక భావం రావడంతోమెడిటేేషన్‌ కష్టమైందిపదే పదే అవే ప్రశ్నలు వేధించడంతో ఇంక చెయ్యలేనేమోఅనుకున్నాను ''జీవనకళనునేర్చుకోవడమే విపాసన'' అని గోయంకా గారు చెప్పడంతోఆ రెండు ప్రశ్నల్ని పక్కన పెట్టానుసింపుల్గాఅర్థవంతంగాఆనందంగా జీవించడానికే  కళ అని ఆయన రెండోరోజు చెప్పారుబుద్ధుడిని భగవాన్అనలేదుకాని స్వర్గంనరకంపాపంపుణ్యం అంటూ బుద్ధుడువ్యతిరేకించినవాటిని ప్రస్తావించారు రెండు రోజుల సాధన విపాశనకి ఉపయోగపడుతుందిఅన్నారుఅంటే విపాసన వేరే వుందని అర్థమైందిబహుశ రేపటి నుండిమొదలవుతుందోమో! 4.30 నుండి మధ్యలలో కొంత విరామమిస్తూ 9.00 దాకా సాగింది
అంత సేపు కూర్చోవడం చాలా కష్టంగా వుంది మోకాళ్ళు పాదాలు విపరీతమైననొప్పిఐదు నిమిషాలు ఒకే ఫోజులో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నాను.కావాలంటే కుర్చీ మీద కూర్చోవచ్చుదిండులేసుకుని కిందే కూర్చున్నాను.ఆరింటికి ఉప్మాబత్తాయి పండు ఇచ్చారుఎనిమిదిదాకా రెస్ట్‌. అపుడేస్నానంరూమ్‌ శుభ్రం చేసుకోవడంబట్టలుతుక్కోవడంలాండ్రి సౌకర్యంవుందినేను తొలిరోజు మాత్రమే లాండ్రికిచ్చానుతర్వాత నేనే ఉతుక్కోవడంమొదలుపెట్టానుపనులన్నీ స్వయంగా చేసుకోవడం చాలా బావుందిమధ్నాహ్నం మంచిభోజనంకేసరి స్వీట్‌.ఎ్కవ తినడంవల్ల మధ్యాహ్నం సరిగా కూర్చోలేకపోయాను.ఇలా చెయ్యకూడదు.

 సాయంత్రం ఆరింటికి పేలాలుబత్తాయిపండుటీఅదే డిన్నరుపేలాలు తినిబత్తాయి రూమ్కి తెచ్చానురాత్రికి ఆకలేస్తుందేమోననే భయం వదలడం లేదు.నిజానికి ఆకలి వెయ్యడం లేదుతొమ్మిదింటికి రూమ్కొచ్చి బత్తాయి తిని,స్నానం చేసి నిద్రపోయానుమూడు రోజులుగానిశ్శబ్దమేమాటలు లేవు.ఒకరివేపు ఒకరు చూడ్డంలేదుతలదించుకుని ఎవరి ధోరణిలో వాళ్ళుమూడు
రోజుల్లో కేవలం మూడు మాటలుఅదీ టీచర్తోదమ్మ సేవకులతోమాట్లాడాను.గోయంకా గారి ఉపన్యాసంలో కొంచెం నవ్వాను అంతేమా గుంపులోపెద్దవాళ్ళుమధ్యవయస్కులుపిల్లలు దాదాపు డెబైమందిపన్నెండు మందిక్రిస్టియన్‌ నన్స్‌ వున్నారుఅందరూ చాలా శ్రద్ధగాచేస్తున్నారుతొలిరోజు వాళ్ళతో మాట్లాడానుమీరు ఎందుకు వచ్చారు అంటే డిఫరెంట్ఎక్స్పీరియన్స్‌ కోసం అన్నారునేనూ అందుకే వచ్చానని చెప్పాను.

మూడో రోజు

నాలుగింటికి బెల్‌. నాలుగున్నర నుండి 6 వరకు మెడిటేషన్‌. ఆరింటికిఇడ్లీలు పల్లీ చట్నీబత్తాయి పండుపండురూమ్కు తెచ్చానుఎనిమిది నుండి11 వరకు కంటిన్యూయస్గా మెడిటేషన్‌. కూర్చోవడం చాలా కష్టంఅయినాకూర్చుంటాంకూర్చోలేక బయటకొస్తే రెండు నిమిషాల్లోదమ్మ సేవకురాలు వచ్చినమస్కరించి లోపలికి పదమంటుందిసౌంజ్ఞలేమాటలుండవుపదకొండుకి వేడి వేడిభోజనంమితంగా తినడం మంచిదిలేకపోతే కూర్చోలేం.  ఒకటినుండి రింటివరకునిరంతరధ్యానంమధ్యలో టీచర్తో మాట్లాడొచ్చు ''మీరు మధ్యలో లేవకండి.కళ్ళుతెరవకండి'' అని సలహా ఇచ్చారుశ్వాస మీద ధ్యాసపెట్టండి.నొప్పులుండవు '' అని కూడా అన్నారునాకు విపరీతంగా చెమట పడుతోందిఅంటేచాలా మంచిది కదాచెమట పట్టాలంటే ఎంత కష్టపడాలిమీకు ఫ్రీ స్టీమ్‌ బాత్అవుతోంది కదా  అంటూ నవ్వారు''.  నేను కూడా హాయిగానవ్వానుఆవిడ సలహాపాటించానుమధ్యలో లేవలేదు.కళ్ళు తెరవలేదు.నొప్పుల మీద దృష్టిిపోయింది.శ్వాస మీదే ధ్యాస పెట్టాను. 7 గంనుండి తొమ్మిదిదాక మళ్ళీ ధ్యానం.గోయంకా గారి ఉపన్యాసంరేపు విపాశన నేర్పుతామని చెబుతూ చాలా సరదాగామాట్లాడారుచాలానవ్వానుబుద్ధుడి అష్టాంగ మార్గాల గురించి చెప్పారు.విపాశన తర్వాత ఎలాంటి మార్పులొస్తాయో ప్రతి క్షణాన్ని ఎరుకతో ఎలాఆస్వాదిస్తామో ప్రతిదీ నిరంతరం ఎలా మార్పు చెందుతుందోశరీరంలోని కణాలుచస్తూ పుడుతూ ఎలా వుంటాయో మంచి సరదా ఉదాహరణతో చెప్పారు.ప్రతిదీఅశాశ్వతమనిమార్పు మాత్రమే శాస్వతమని అర్థం చేసుకోవాలని చెప్పింది వినినేను ఆశ్చర్చపడ్డాను.''మార్పు మాత్రమే శాశ్వతం'' అని ఒక సందర్భంలో నేను
రాసిన కవిత గుర్తొంచ్చిందిఒక వేదనామయ సమయంలో నేను  కవిత రాసాను.భ్రమలకు లోనవ్వకుండా అన్నింటినీ తీక్షణంగా చూడాలనిఅప్పటికి ఏది సత్యమోఅదే సత్యమనిగతానికి భవిష్యత్తుకు లంకెపెట్టి మనుషులు బాధపడతారనివాస్తవంలో ఎప్పుడూ జీవించరని ఆయనచెప్పింది నేను చాలాకాలంగాఆచరిస్తున్నదేగతం గొప్పది భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతోనే మనిషి బతుకుతుంటాడునాకెప్పుడూ  ఆందోళన లేదునేను ప్రస్తుతంలోనే జీవిస్తాను.తొమ్మిదింటికి రూమ్కొస్తే ఒకావిడ రూమ్‌ ముందు పాము ముడుచుకునిపడుకుంది.అందరూ బేజారయ్యారుమౌనం వీడి మాటల్లో పడ్డారు లోపు దమ్మసేవిక వచ్చిచాలా నిబ్బరంగా పాముని చీపురుతో తొలగించేసి అందరినీ రూమ్లోకి పంపింది.పాము పెద్దదికాదుచిన్న కట్లపాముపిల్లఅయినా జనాలకి పామంటే భయమేకదా!.చిన్న పాము పిల్లఅందరి మౌనాన్ని కాసేపు భగ్నం చేసిందిరూమ్లోపలికొచ్చి ఉదయంసాయంత్రం సేకరించిన బత్తాయిలు తినిస్నానం చేసిమంచమెక్కానుచాలాసేపు నిద్రపట్టలేదురేపు విపాశన నేర్పుతారట., అంటేఏమిటోనని చాలాసేపు ఆలోచించానుమెల్లగా నిద్రపట్టిందిఏవేవోకలలు.ఒంటిగంటకు ఏదో చప్పుడై మెలుకువవచ్చిందిమంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నానుసాయంత్రం మెడిటేషన్‌ అయ్యాకా వొళ్ళంతా తేలిక పడుతున్నఫీలింగ్‌ వచ్చి నవ్వొచ్చింది.
నాలుగోరోజు
 రోజు  చాలా ముఖ్యమైందిరోజూలాగానే 4 గంటలకి లేవడం, 4.30కిమెడికేషన్లో కూర్చోవడం. 4.30కి ప్రకృతి ఎంత ప్రశాంతంగాసమ్మోహనంగావుంటుందోచల్లటిగాలి అడక్కుండానే ప్రేమగా వొళ్ళంతా తాకుతుందిఆనిశ్శబ్దం మనసును ఎంత హాయి పరుస్తుందోమధ్యాహ్నంవిపాశన
క్లాసువుంటుందనిరెండు గంటలు ఎవ్వరూ హాల్లోంచి బయటకెళ్ళకూడదనిఆసనం మీంచి లేవకూడదని చెప్పారుమూడు రోజులపాటు శ్వాస మీద ధ్యాసతో మెడిటేషన్‌ నడిచింది. 3.15కి గోయంకాగారి ఆడియో ఉపన్యాసం మొదలైందివిపాశన గురించి.కళ్ళు మూసుకుని తలమీదిఆయువు పట్టును చూడమన్నారుతర్వాత ముఖం కళ్ళు,చెవులుముక్కుబుగ్గలునోరు పెదవులుమెడ కుడి చెయ్యి మొత్తం ఎడమచెయ్యి మొత్తంగుండెపొట్టనాభికుడికాలు మొత్తంఎడమ కాలు మొత్తం,వీపు మొత్తం మీద శ్వాసను నడుపుతూ చూడమన్నారుఏంసంవేదన/సెన్సేషన్జరుగుతుందో గమనించమన్నారుశిరస్సు నుంచి పాదాలదాకా ఎలాంటి సెన్సేషన్ఏర్పడుతున్నాయో సాక్షిలాగా గమనించమన్నారుప్రతీదీ అశాశ్వతంపుడుతుంది,నశిస్తుందినిత్యం మారుతుంది అనే ఎరుకతో గమనించమన్నారుతలనించిపాదాలకొచ్చేసరికిఎన్నో నొప్పులు పుడతాయినశిస్తాయిచెమట పడుతుంది.ఆరిపోతుందిదురద పుడుతుందిపోతుందిశరీరం మొత్తంలో నిరంతరం ఎన్నోసంవేదనలు పుడుతుంటాయిపోతుంటాయ్‌. మళ్ళీ పుడుతుంటాయ్‌. పోతుంటాయ్‌.వాటిని నిర్వేదంగానిరపేక్షంగాసాక్షిలాగాగమనించమంటారుఏదీ నిత్యంకాదుఏదీ శాశ్వతం కాదు అనే దృష్టిలో సంవేదనలని చూడమని చెప్పారుఅలాగేఎక్కువ నొప్పిని ద్వేషించవద్దనితక్కువ నొప్పిని ప్రేమించవద్దనిరెండూశాశ్వతం కాదని తలనించి పాదాలవరకు జరిగే ప్రయాణంలో కనబడే సంవేదనలన్నీశాశ్వతంకాదనే ఎరుకతో చూడమని చెప్పారువిపాశన అంటే మార్పు.  శరీరంలోను,ప్రకృతిలోను నిరంతర మార్పులు జరుగుతుంటాయిఏదీ శాశ్వతం కాదు అనే ఎరుకే విపాశన అని నాకు అర్థమైందిక్లాసయ్యాక బయటికొచ్చాక  బెంచీ మీద చాలాసేపు అలాగే కూర్చుండిపోయానునాఆలోచనా విధానం విపాశనకు చాలా దగ్గరగావుందనిపించిందికళ్ళల్లో ఎందుకో నీళ్ళొచ్చాయిఎవరితోనైనా మాట్లాడితేబావుండనిపించిం '' మార్పుమాత్రమే శాశ్వతంమరేదీ కాదు'' అంటూ నేను రాసుకున్న కవిత పదే పదేగుర్తొచ్చిందిఎంతో అందంగా పూసే బ్రహ్మకమలం ఎంతఅశాశ్వతమోగుర్తొచ్చిందిఎర్రటి చిగురాకుఆకుపచ్చగా మారిపసుపు రంగుకు మారి రాలిపోవడం గుర్తొచ్చిందిఅందమైన గులాబీ నాలుగు రోజులకే రేకులన్నీరాలిపోయి నిర్జీవమవ్వడం గుర్తొచ్చిందిప్రకృతిలో ప్రతిదీ పుడుతూనశిస్తూమళ్ళీ పుడుతూ నశిస్తుంటుందిమనిషిమాత్రమే తాను శాశ్వతమనివిర్రవీగుతాడుఎంతో విధ్వంశం సృస్టిస్తాడుసంపద పోగేసి జనాలని దోపడీ
చెయ్యాలనుకుంటాడుఏదీ శాస్వతం కాదు తానే శాశ్వతం కాదు అనే ఎరుకతోజీవించడంఅదే ఎరుకతో మరణించడం విపాశన అని నాకు అర్థమైంది.

ఐదో రోజు

  రోజు కూడా 4.30 నుండి 9 దాకా ధ్యానం సాగిందినిన్న తలనించి పాదాలవరకు మనసును నడుపుతూ మెడిటేషన్‌ చేస్తూ శరీరంలో  భాగంలో  స్పందన కలుగుతుందో చూస్తూ స్పందనలను అర్థం చేసుకోమని చెప్పారు రోజు పాదాలనుండి శిరస్సుదాకా చూడమనిచెప్పారుగంటసేపు కదలకుండాకళ్ళు తెరవకుండామెడిటేషన్‌ చేస్తూ మనసుతో శరీరంలోని అంగాంగాన్ని పరిశీలిస్తే ఎన్నోసంవేదనలు తెలుస్తాయినెప్పులుచెమటలుమంటలుదురదలుదగ్గులుతుమ్ములుఆవలింతలు ప్రతి అంగంలోను ఏదో ఒక సంవేదన పుడుతూ,నశిస్తూవుంటుందిచెమట మీద చల్లగాలి తగిలినపుడు హాయిగా వుండడంచెమటకిమంటపుట్టినపుడు చికాకుగా కోపంగా వుండడం అన్నీ తెలుస్తుంటాయి. 150 మందికూర్చునే హాలులో ఫ్యాన్లు వెయ్యరుచెమట పట్టాలని  ఫీలింగ్స్తెలియాలని ఫ్యాన్లు వెయ్యరని తర్వాతఅర్థమైంది కానీ ముందు చాలా కోపమొచ్చేదికోపంగా బయటకొచ్చి చల్లగాలిలో తిరిగిన సందర్భాలు కూడా వున్నాయికానీ  స్థితి అవసరమని తర్వాత అర్థమై నా ప్రవర్తనకి సిగ్గుపడ్డానుఆల్మోస్ట్‌ అందరూ అలాగే చేసారు.  తలనించి పాదాలదాకాపాదాలనించి తలదాకా కళ్ళుమూసుకుని సర్వే చేస్తున్నపుడు శరీరంలో ఎన్నో స్పందనలు పుట్టినశిస్తున్నాయని స్పందనా శాశ్వతంగా వుండదని అర్థమౌతుందితలనించి దిగుతున్నపుడు మెడమీద నొప్పి వుండొచ్చుమళ్ళీ పాదాలనించి తలమీదికి వచ్చేటప్పటికీ  నొప్పి పోవచ్చుతీవ్రత తగ్గొచ్చుఅంటేశరీరంలో పుట్టే ప్రతి స్పందన అశాశ్వతంశరీర ధర్మం ప్రకారం నొప్పులు,  చెమటలుదురదలు ఇంకా ఎన్నో సంవేదనలు వస్తూ పోతుంటాయిఒకనాటికి తన ధర్మం ప్రకారం ముసలిదై శరీరం నశిస్తుందిమట్టిలో కలిసిపోతుంది శరీరానికి ఎన్ని నగిషీలు చెక్కినాగుడిసెలో వున్నా,బంగ్లాలో వున్నావీధిలో వున్నా మరణం ఆసన్నమైనపుడు మరణిస్తుందిఇది శరీర ధర్మం.  ప్రకృతి ధర్మం కూడా అదేప్రకృతి కూడా అనుక్షణం మారుతుంటుందిగంగానదిలో నిలబడి నీళ్ళు తాగుతున్నపుడు ఒకే నీరును మరో మాటు ఎప్పటికీ తాగలేంతాగి తలయెత్తే సరిగాగంగా ప్రవాహం ఎంతో దూరం పోతుందికొత్త నీరు వస్తుందిహిమాలయాలు అలాగే  న్నట్లనిపిస్తాయికానీ హిమం కరుగుతూంటుందిమళ్ళీ మంచు కురుస్తూంటుందివిత్తనం మొలకెత్తగానే ఎదుగుతుంటుందిప్రకృతిలో చలనమున్నదంతా చలిస్తూనే వుంటుందిమారుతూనేవుంటుందిమార్పు సహజం.  సుకుమార బాల్యంముగ్ధయౌవ్వనంమధ్య వయస్సుముసలితనం – శరీరం నిరంతరం మారుతుంటుందిశరీరంలో కానీప్రకృతిలో కానీ ఏదీ నిత్యంశాశ్వతం కాదుఅంతా అనిత్యంమార్పు మాత్రమే శాస్వతంఇదే విపాశనప్రతి నిత్యం మారడాన్ని అర్ధం చేసుకోవడమే విపాశనమార్పును అర్థం చేసుకోలేక శాశ్వతమనుకుంటేనే దు:ఖంఇప్పటికిది నిజం.వాస్తవంఅంతే.

ఆరో రోజు 
 రోజు ఉదయం  గమ్మత్తు జరిగిందినాలుగ్గంటలకి విపరీతమైన వర్షం కురిస్తున్నపుడు మెలుకువ వచ్చిందిలేచి టైమ్‌ చూస్తే  నాలుగయ్యిందిబయట వర్షంగంట కొట్టారో లేదో తెలియడం లేదుఅందరి రూమ్‌ తలుపులు మూసే వున్నాయిఎవ్వరూ లేవలేదుబ్రష్‌ చేసుకునిబయటకొచ్చానుదమ్మ సేవిక కనబడిందిబెల్కొట్టలేదు అని చెప్పాను అపుడు వెళ్ళి బెల్‌ కొట్టించింది.  నేను గొడుగు తెచ్చానుగొడుగేసుకుని వర్షంలో సెంటర్కెళ్ళాను.  అలా కుండబోతగా కురుస్తున్న వర్షంలో ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళడం ఎంత బావుందో చెప్పలేను.కాసేపటికి వాన తగ్గిందిఒక్కొరొక్కరే రాసాగారుఆలస్యంగా  మెడిటేషన్‌ మొదలైందినిన్నటి పద్ధతేతలమీంచి పాదాలవరకు ఏం జరుగుతుందో గమనించడంగంటసేపు కదలకుండా కళ్లు మూసుకుని కూర్చుంటే అన్నీ తెలుస్తాయిమనసు ఎక్కడ ఆగుతుందో అక్కడ ఏదో సంవేదన/సెస్సేషన్‌ తెలుస్తుందిపదిగంటలకి మమ్మల్ని సెల్కి వెళ్ళమన్నారుసెల్‌ అంటే పగోడాఆరు అడుగుల పొడవు/మూడు అడుగుల వెడల్పు వుండే చీకటిగదిలైట్‌ వుంటుందికానీ చిమ్మ చీకటిలోనే కూర్చోవాలనిపిస్తుందిఅక్కడ కూర్చుని మెడిటేషన్‌ చెయ్యాలిఇక్కడకూడా  గమ్మత్తు జరిగిందినాకు ఆరు బయటే విపరీతంగా చెమట పడుతుందిపగోడాలోకి వెళ్ళగానే టాప్‌ తీసేసి  బనీనుపైజామా మీద కూర్చున్నానుచెమటతో తడిసి పోతాననుకున్నానుఒక్క చుక్క చెమట పట్టలేదు మాట టీచర్కి చెపితే '' మీరు పరిసరాలకు బాగాఅడ్జస్ట్‌ అవుతారుకొత్త ప్రాంతంలో కూడా టెన్షన్‌ వుండదుచాలామందికి పగోడా చూస్తే భయంచీకటి చూస్తే భయంమీకు ఎక్కడున్నా ఒకటేవాస్తవం మీద మీ దృష్టి వుంటుందిఇది చాలా మంచిది.'' అన్నారుమధ్యాహ్నం టీచర్‌ పిలిచారుఎందుకు పిలిచారా అనుకుంటూ ఆవిడదగ్గరికెళ్ళానుపగోడాలో ఎలా వుందో అడగడానికి పిలిచారుచాలాసేపు మాట్లాడారుఆవిడ కూడా పదిరోజుల కోసం వచ్చారు మాతో పాటే వెళ్ళిపోతారునా మెళ్ళో పూసలదండ ఏంటిఏం నమ్మకం అని అడిగారుఉట్టిదేసరదాగా వేసుకున్నానునేను నాస్తికురాలనుదేవుడిని నమ్మను అని చెప్పాను ఇరవై నిమిషాలు అవి ఇవి మాట్లాడారుఆవిడ ఎవరితోను అలా మాట్లాడ్డం చూడలేదుగుళ్ళల్లో నాకు ఎదురైన అనుభవాలు చెపితే బాగా నవ్వారుగోయంకా గారి ఉపన్యాసాలు చాలా బావున్నాయిచాలా వ్యంగ్యంగా సూటిగా మాట్లాడతారుబుద్ధుడిజీవితం గురించిఎందరివో అనుభవాలుగురించి చక్కగా చెబుతారుఆయన ఇంగ్లీషు అద్భుతంగా వుంటుందినేను ఆయన హిందీ ఉపన్యాసాలు విన్నానుతెలుగు అనువాదం నచ్చలేదురోజూ  కొత్త అనుభవంకొత్త ఆలోచనలు వస్తున్నాయి.

ఏడో రోజు ఉదయం  సంఘటన జరిగిందిబ్రేక్ఫాస్ట్కి వెళ్ళినపుడు సేవిక నన్ను అరటిపండు తీసుకోవద్దని సైగ చేసింది.మొదట నాకు అర్ధం కాలేదుసరేనన ఉప్మా మాత్రమే తిన్నానునేను పండు రూమ్కి తీసుకెళుతున్నాననిఐదు తర్వాత ఏమీ తినకూడదనే నియమం వుందికాబట్టి అలా చెప్పింది కాబోలనుకున్నానుఆమెను అడిగానుఎందుకు అలా చెప్పారని (సేవికతో మాట్లాడొచ్చురూమ్కు తీసుకెళ్ళి తినడం 'శీల్భంగ్‌' అని అలా చెయ్యకూడదని చెప్పింది.  కానీ చాలామంది రూమ్కి తీసుకెళ్ళడం గమనించాకేతీసుకెళ్ళొచ్చనుకుని నేనూ అలాచేసాను. 'శీల్భంగ్‌' అనే మాట చాలా చికాకు పెట్టిందిటీచర్కెళ్ళి చెప్పాను. ''నేను  పొరపాటు చేసానునాకు తెలియక చేసాను'' అన్నాను.'' ఫర్వాలేదులెండిఇపుడు తెలిసి మానేసారుగాచెప్పారు కాబట్టి మాఫీ  యిపోయిందిలెండి '' అంటూ నవ్వారుమనసులో చికాకు మాయమైపోయిందిఅంతకు ముందు చాలా గింజుకున్నానుఎందుకు అలా చేసానని చాలసేపు మధన పడ్డానుపొరపాటును ఒప్పేసుకునిబయటకు చెప్పేసుకోవడంతో ఎంత రిలీఫ్‌ వుంటుందో తెలిసి వచ్చింది.

పగోడాలో ఏడుపు

విపాశన మెడిటేషన్లో పగోడాలో కూర్చుని చేసే మెడిటేషన్‌ చాలా పవర్ఫుల్గా వుంటుందిమనసు చాలా తీక్షణమౌతుందిఏడో రోజు పగోడాలో మెడిటేషన్‌ చేస్తున్నపుడు నాకెందుకో ఆపుకోలేనంత ఏడుపు వచ్చిందివెక్కి వెక్కి ఏడుస్తూనే వున్నానునా జీవితంలో నేను చేసినకొన్ని తప్పులు కొన్ని గుర్తొచ్చాయివాటివల్ల ప్రభావితమైన వాళ్ళు గుర్తొచ్చారునా ప్రవర్తన వాళ్ళనెంత  బాధపెట్టి వుంటుందో గుర్తొచ్చిందిఇలాంటివి ఒకటి రెండు సంఘటనలే నా జీవితంలో జరిగాయిఅవే గుర్తొచ్చి అమితమైన దు:ఖం కలిగిందిరెండోది హెల్ప్లైన్కి కాల్చేసేఅసంఖ్యాక స్త్రీల దు:ఖంవారి సమస్యలుబాధలు గుర్తొచ్చి మరింత ఏడుపు తన్నుకొచ్చిందినా స్నేహితుల్లోనా చుట్టూ వున్న వాళ్ళల్లో కొంతమంది పడుతున్న మానసిక వేదనలుసంఘర్షణలు గుర్తొచ్చి కూడా చాలా ఏడుపొచ్చిందివాళ్ళంతా  దు:ఖాలను మోయకుండా,ఇలాంటి మెడిటేషన్కొచ్చి బరువుల్ని దింపేసుకోగలిగితే ఎంత బావుంటుంది అనిపించిందిపగోడాలో ఏడుపు గురించి టీచర్కి చెప్పాను. ''అలా దు:ఖం రావడం చాలా మంచిదిలోపలున్న బరువంతా కరిగిపోయిందిస్త్రీల దు:ఖం మిమ్మల్ని కదిలించింది వాళ్ళంతా సంతోషంగావుండాలని మీరు భావిస్తారుఅందుకే వాళ్ళకోసం ఏడ్చారు'' అన్నారావిడ.

 ఆకలివేళ అందిన బిస్కట్

మెడిటేషన్‌ పూర్తయ్యాక తొమ్మిదింటికి రూమ్కొచ్చి స్నానం చేసినైటీ తగిలించి బయటకొచ్చి నిలబడ్డానుబయట చల్లగాహాయిగా వుందిఎదురుగా అర్థచంద్రుడుమెల్లగా ఆకలి మొదలైందిరూమ్‌ లోపలి కెళ్ళి నీళ్ళు తాగాను.  కాసేపు చల్లబడిందిమళ్ళీ మొదలైందిఐదింటికితిన్న మరమరాలుసేవిక అలా చెప్పాకాఅరటిపండు డైనింగ్హాల్లో కూడా తినాలనిపించలేదుతినలేదుఇంత ఆకలేస్తోందినిద్రపడుతుందా అసలుపొద్దున నాలుగింటికి లేవాలి కదాతలుపేసి పడుకున్నానుఊహూఆకలి.. మళ్ళీ వరండాలో కొచ్చానుఅటుఇటూ తిరగడం మొదలుపెట్టానుఅలా తిరుగుతున్నపుడు హఠాత్తుగా పక్కరూమ్లో ఉన్నావిడ ఓ చిన్న బిస్కట్‌ పాకెట్‌ తెచ్చి నా చేతిలో పెట్టిందిఆశ్చర్యపోయానుమాటలుపరిచయాలు లేవు కాబట్టి ఆవిడ పేరు తెలియదువొద్దన్నానుఫర్వాలేదు తీసుకోండి అని సైగలద్వారానే చెప్పిందితర్వాత ఆవిడ లోపలి కెళ్ళిపోయారునేను నా రూమ్లో కొచ్చి బిస్కట్‌ ప్యాకెట్‌ విప్పానుమూడు బిస్కట్లున్నాయిబ్రిటానియా వాళ్ళు కొత్తగా తెస్తున్న రాగిబిస్కట్లురెండు బిస్కట్లు తిని నీళ్ళు తాగాక అబ్బఆకలి మంట చల్లారడం అంటే ఏంటో అర్థమైందిఅసలావిడకినాకంత ఆకలిగా వుందని ఎలా అర్థమైదబ్బాబిస్కటివ్వాలని ఎందుకన్పించిందబ్బా అంటూ ఆశ్చర్యపోతూఆలోచిస్తూ నిద్రపోయాను.

 ఎనిమిదితొమ్మిది రోజులు పూర్తిగా మెడిటేషన్తోనే గడిచాయితలనుండి పాదాలవరకుపాదాల నుండి తలవరకు గమనిస్తూ మెడిటేషన్‌ చెయ్యాలిరిపీటెడ్గా గంటల తరబడి అదే స్థితిలో వుండాలిశరీరంలోని అంగాంగాన్ని గమనించడంకలుగుతున్న సంవేదనల్ని చూడడం,సుఖకరమైన వాటినిదు:ఖకరమైన వాటిని సమంగా చూడడంనొప్పిని ద్వేషించడంసుఖాన్ని ప్రేమించడం చెయ్యకుండా సమతని పాటించడం చాలా ముఖ్యమైన అంశంగా వుంటుందికళ్ళు మూసుకుని అంతర్వేత్రం తో మనసుని అంగాంగం మీదికి నడిపిస్తున్నపుడు చాలా అనుభవాలు కలుగుతాయిమనసు ఒక అంగం మీద ఆగినపుడు అక్కడ ఏదో ఒక సెన్షేషన్‌ వుంటుందినొప్పోదురదోమంటోచెమటో ఏదో ఒకటి వుంటుందిమన రియాక్షన్స్‌ కూడా వుంటాయిదురద పెట్టగానే గోకడం కూడా రియాక్షనేదురదని ద్వేషిస్తాంకోపంగా గోకుతాం.చెమటపట్టి చీదరగా వున్నపుడు చెమటని ద్వేషిస్తాం చెమట మీదికి చల్లగాలి వాలినపుడు  చల్లదనాన్ని ప్రేమిస్తాంరెండూ క్షణికమైన భావాలేఅశాశ్వతమైనవేమనం శిరస్సు నుంచి పాదాల వరకు అంతరౌత్రంతో ప్రయాణం చేస్తున్నపుడు మన ప్రయాణం   లుపెట్టినపుడుముక్కు మీద దురదనోచెమటలోమంటో ఏదో ఒక సంవేదన కనబడుతుందిమనం దాన్ని అలాగే సాక్షిలాగా చూసుకుంటూ పాదాలవేపు ప్రయాణం అయిపోతే...మళ్ళీ పాదాల నుంచి శిరస్సు వేపు వచ్చినపుడు  సంవేదన ముక్కు మీద వుండకపోవచ్చుచెవిమీదోనుదిటి మీదోఅలాంటి సంవేదన కనబడవచ్చుగోయంకా గారు చాలా సార్లు అనిత్యఅనిత్య అంటూంటారుఅలాగే మనసు పొరల్లోనోగుండెల్లోనో గూడు కట్టుకుని గడ్డకట్టుపోయిన సంవేదనలుమన సబ్కాన్షన్‌ మైండ్లో నిక్షిప్తం అయివున్న జ్ఞాపకాలుద్వేషాలుప్రేమలుదు:ఖాలుఅసంఖ్యాకసంఘటనలు - మనం సంవత్సరాలుగా మోస్తున్న దు:ఖపు మూటలు మన అంతర్నేత్రానికి ఆనడం మొదలుపెడతాయిశాస్వత సంపదగా మనం మనలోపల నిక్షిప్తం చేసుకున్న గుట్టలకొద్దీ సంవేదనలువాటిద్వారా మనకి ఎదురైన దు:ఖాలుసుఖాలు అన్నీ కళ్ళకు కట్టడంమొదలౌతుందిఎవరిమీదో ఎంతో కాలంగా పెంచుకునిగుండెల్లో ఘనీభవించుకున్న ద్వేషం,ఎవరి మీదో అవధుల్లేకుండా పెంచుకున్న ప్రేమ ప్రేమవల్ల ఎదురైన దు:ఖాలు కరగడం మొదలౌతాయిఘనీభవించిన సంవేదనలు కరుగుతున్నపుడు  మన కళ్ళల్లోంచి ఒక్కోసారికన్నీళ్ళు ధారకడతాయిచాలామంది బాగా ఏడుస్తారునా వరకు నేను ఎవ్వరి మీద శాశ్వత ద్వేసాన్ని పెంచుకోలేదునాకు ఎవరి మీద అంతద్వేషం లేదు.

కానీ ఒక సంఘటన ఇక్కడ చెప్పాలినేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటపుడు  డివిజన్‌ సబ్కలెక్టరు నా మీద అకారణ ద్వేషం చూపించేవాడుమీటింగ్ల్లో నిలబెట్టి అవమానించడంపరుషంగా మాట్లాడడం చేసేవాడుదానికి కారణముండేది కాదుబహుశా నా బాడీ లాంగ్వేజ్‌,ధిక్కార స్వభావం అతనికి నచ్చివుండవునాకు రెవెన్యూ డిపార్ట్మెంట్‌ ఫ్యూడల్‌ బానిసత్వపు లక్షణాలు అలవడలేదునేను ఆఫీసుకు నా కైనటిక్‌ హోండా మీద వెళుతున్నపుడుఅతని జీప్‌ ఎదురుపడిందంటే సాయంత్రం మీటింగ్లో అతను శివాలు తొక్కేవాడుదీనివల్ల అతనిమీద నాకు విపరీతమైన ద్వేషంఅసహ్యం పెరిగిపోయాయిఛాన్స్‌ వస్తే ఎప్పుడో తన్నాలి అన్నంత అసహసం పెరిగిపోయిందిఇదంతా నా మనసులో ఘనీభవించిపోయిందిఅతని పేరు తలిస్తే వొళ్ళంతా కంపించి పోయేంత కోపంనేను  డిపార్ట్మెంట్‌ వొదిలేసి వచ్చాకా పదేళ్ళ వరకు ద్వేషం నాలో వుందిసంవత్సరం క్రితం భూమిక పనిమీద అతన్ని కలవాల్సి వచ్చినపుడుకలిసి మాట్లాడినపుడు ఇతని మీద ఇంతకాలం  ద్వేషాన్ని అలాగే గడ్డకట్టి దాచుకున్నానా?  అని సిగ్గనిపించింది ద్వేషం అలాగే వుండడంవల్ల నా కోపం పెరగడం తప్పలాభామేముందిఅతని కొచ్చిన నష్టమేముందిపోనీ  నీ వల్ల నేనింత బాధపడ్డాను అని చెప్పానాచెప్పేవీలుందాలేదు కదా!   రోజు అతని మీద ద్వేషం కరిగిపోయిందిగమ్మత్తుగా అతనిపుడు మా ఇంటి ఎదురుగా కొత్తగా కట్టిన ఐఎఎస్‌/ఐపిఎస్‌ క్వార్టల్లో కొచ్చాడుఅతని మీద అదే ద్వేషం కొనసాగివుంటే  రోజు  ఇంటి వైపు చూస్తూ కోపంతో సతమతమై వుండేదాన్నిఇపుడలాంటి ఫీలింగ్‌ లేదుఅలా గడ్డకట్టిన ద్వేషాలుకోపాలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో  మనకు అనుభవమే.నేను ఇప్పటికీ ద్వేషిస్తున్న మనిషిక్షమించలేని మనిషిమరొకడున్నాడుఅతను నరేంద్రమోడిపేపర్లో అతని ఫోటో కనిపిస్తే చాలు అతని కళ్ళని చింపేస్తానుఅతని ఫోటోలోని కళ్ళుల్లోకి చూడడం కూడా నాకు ఇష్టం వుండదుఅయితే  ద్వేషంకోపంవల్ల నాకు జరిగే నష్టం ఏమీ లేదు కానీ అతను జరిపించిన మారణకాండని నేనెప్పటికీమర్చిపోలేనుఅయితే మోడీ మీద ద్వేషం వ్యక్తిగతమైందికాదు కాబట్టి అది నాలో గడ్డకట్టలేదు.

విపాశన ధ్యానం చేస్తున్నక్రమంలోగంటలకొద్దీ సమయం మనతో మనం గడపడంతో మన మనస్సులో పేరుకున్న వికారాలు మనకు అర్థమవ్వడం మొదలౌతుందిరాగం,ద్వేషం ఈ రెండే మనల్ని ప్రభావితం చేస్తుంటాయని తెలుస్తుంది రెండూ కూడా శాశ్వతంగా మనలోఉండిపోయేవి కావనిఅవి కూడా మారుతుంటాయని తెలుస్తుంటుందిమనకి దు:ఖాన్ని కలిగించేవిసుఖాన్ని కలిగించేవి  సంవేదనలుఅవి ఎంత కాలముంటాయిఅవి శాశ్వతంగా వుండిపోతాయామారిపోతుంటాయాఅనిత్యాలైతేమారిపోతే మనమెందుకు బాధపడాలి?సంతోషపడాలి ప్రభావాలు మన జీవితాలనెందుకు శాశించాలిఎన్నో ఆలోచనలకు నిలయమౌతుంది మనసు మనసే అంతర్నేత్రం ద్వారా శరీరంలోని ప్రతి అంగాన్ని శోధిస్తుంటుందిసంవేదనలని చూస్తుంటుందివిపశ్యన ధ్యానం చేస్తున్న వాళ్ళు  దు:ఖకారకసుఖకారసంవేదనల్ని సాక్షిలాగాసమత్వంతో చూడాలని చెబుతుంటారు గోయంకాగారు.  కోట్ల కణాల సముదాయం శరీరమైతే ప్రతి కణంలోను ప్రతి క్షణం మార్పు జరుగుతుంటుందిసంవేదనలు పుడుతూ గిడుతూ వుంటాయిపుట్టిన క్షణం నుంచి  మార్పు శరీరంలో జరుగుతుంటుంది.ఒకరోజు గడవడం అంటే ఒక రోజు చావుకి దగ్గరవ్వడంశిశువు ఒక రోజు పెరగడం అంటే మరణానికి ఒక రోజు దగ్గరవ్వడం నిరంతర మార్పు అనివార్యంగా  రుగుతూ చివరికి శరీరం మరణించడంగా పరిణమిస్తుందిఇది శరీర ధర్మందీన్ని ఎవ్వరూ  మా ర్చలేరుశాసించలేరు.అయినప్పటికీ మనిషి తాను శాశ్వతమనే భ్రమతోనే సంపదల్నిపోగేసుకుంటూ వుంటాడుసమాజానికి చెందాల్సిన వనరుల్ని కూడా తానొక్కడే   గొట్టాలనుకుంటాడుహింసలకిఅణచివేతలకిదుర్మార్గాలకి పాల్పడతాడుమనిషిలోని కౄరత్వంశరీరధర్మం ఏమిటో అర్థం
చేసుకోనివ్వదుఅహంకారంఆధిపత్యంపొగరుబోతుతనం తన ఉనికి శాస్వతమనే భ్రమని కల్పిస్తాయిఒక్కసారి మనిషి అంతర్ముఖుడై తన మనసులోని భయంకర చీకటి కోణాలపై వెలుతురు ఫోకస్‌ చేసుకోగలిగితేతాను ఎన్ని నికృష్ణకార్యాలకు పాల్పడతాడోఎన్ని వికారాలుతనలో గూడు కట్టుకుని వున్నయోఅవి తననెంత హీనస్థితికి దిగజార్చాయో అర్థమవుతుందివిపాశనలో పది రోజులపాటు ఎలాంటి బహిర్ముఖం లేకుండా అంతర్ముఖంలో వుంటూ తన మనసు లోతుల్ని శోధిస్తుండడంవల్లవాటి నిజనైజాలు తెలుస్తుండడంవల్లతమ నిజస్వరూపాలు తేట  ల్లమవుతుంటాయిఒక్కోసారి అది గాఢమైన దు:ఖానికి దారితీస్తుంది.  రాగంద్వేషంకౄరత్వం,
అహంకారంఆధిపత్యంలాంటి గుణాలు తనకి దు:ఖాన్నివ్వడంతో పాటు తన చుట్టూ వున్న వాళ్ళకు మానసిక వేదననిమన:శాంతిని లేకుండా చేస్త్తాయని అర్థమవుతుంది.

శరీరధర్మం ఏమిటిమరణించడం అంటే అశాశ్వతంఅనిత్యంమరి ప్రకృతిధర్మం ఏమిటివాట్‌ ఈజ్‌ రూల్‌ ఆఫ్‌ నేచర్‌? ప్రకృతి ధర్మం   కూడా పుట్టడంగిట్టడంనిరంతర మార్పు చిన్న బీజం నుండి పుట్టిన మర్రిమాను కూడా పుట్టి పెరిగిపువ్వులు పూసికాయలు కాసి,మరణించడంవిత్తనం ద్వారా మళ్ళీ పుట్టడం... మళ్ళీ అదే సైకిల్‌. అంటే ప్రకృతిలోని సమస్తంపుడుతూగిడుతూ...నిరంతరం మార్పు చెందుతూ వుండడమే ప్రకృతి ధర్మంధర్మం అంటే ఇక్కడ నియమంమహోత్తుంగ హిమాలయాలమీద మంచు కూడా శాస్వతంగా వుండదు.మంచు కురుస్తుందికరుగుతుందిప్రవహిస్తుందినదిగా అవతరిస్తుందిఆఖరికి సముద్రంలో కలుస్తుందిమళ్ళీ మబ్బురూపం ధరించి వాన చినుకై కురుస్తుందిహిమాలయాలు అలాగే మంచుతో శాశ్వతంగా నిలబడి వుంటాయని మనకి భ్రమ కలుగుతుందికానీ అక్కడ నిరంతరచలనంనిరంతరం మార్పు జరుగుతుంటుందిహిమాలయాల మీద మంచుకూడా అశాశ్వతమేఅలాగే సముద్రాలు ఒక్కచోటే వున్నట్టు అన్పిస్తుందిసముద్రంలో నిరంతర మార్పులు జరుగుతుంటాయినదుల నీరొచ్చి చేరుతుందితన లోని నీళ్ళే మబ్బులై మళ్ళీ తన మీదేకురుస్తుంటాయ్‌. సెలయేళ్ళుజలపాతాలు ఇవన్నీ కూడా చలన  శీలత సిద్ధాంతానికి  ట్టుబడివుంటాయిమార్పు ప్రకృతి ధర్మంశరీరధర్మంప్రకృతి ధర్మం ఒక్కలాగే వుండి అనుక్షణం మారుతూ వుంటాయిరెండింటిలోను శాశ్వతత్వం లేదుమార్పు చెందుతూ పుడుతూనశిస్తూ వుండడమే రెండింటి ధర్మం నియమాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటేఅనుభూతి చెందాలంటేఎవరో చెబితే కాకుండా మనకు మనమే అనుభవంలోకి తెచ్చుకునే జీవనకళ విపాశన.

 అర్ధరాత్రి సమస్తాన్ని వొదిలేసి చీకటిలోకి నడుచుంటూ వెళ్ళిపోయిన సిద్ధార్థ గౌతముడుబుద్ధగయలో రావిచెట్టు కింద తపస్సుచేసి దు:ఖానికి పరిష్కారం సాధించాడనిబుద్ధుడయ్యాడనిప్రపంచానికి వెలుగు ప్రసాదించాడని చెప్పగా విన్నాంసాహిత్యంలో చదువుతున్నాం.దు:ఖమంటే ఎరుగని సిద్ధార్ధుడు దు:ఖం ఎదురైనపుడు కలత చెంది అసలు మనిషికి దు:ఖమెందుకు కలుగుతుందిదు:ఖం ఎక్కడఎలా పుడుతుంది?అని శోధించాడుబోధివృక్షం కింద కదలకుండా కూర్చుని దు: కారణం కనుక్కున్నాడురోజుల తరబడి  కదలకుండా కూర్చునిసిద్ధార్థుడు,
కన్నువిప్పకుండా దు:ఖం కారణం కోసం తన లోపలే వెతనారంభించాడుతన మనసులోకితన లో ప్రపంచంలోకి  చేసిన ప్రయాణం తన శరీరంలో జరుగుతున్న సంవేదనలను చూపించిందిదు:ఖకారకసంతోషకారక సంవేదనలు ఎలా పుడుతున్నామోనశిస్తున్నామో సిద్ధార్ధుడుతన అంతర ప్రపంచంలో గమనించాడుకోరికలు ఎలా పుడతున్నాయో అర్థం చేసుకున్నాడుసంవేదనల స్వభావంఅవి మంచివైనాచెడువైనాదు:ఖాన్నిచ్చినా సంతోషాన్నిచ్చినా వాటి జీవితం స్వల్పమని పుడుతూ గిడుతూ వుంటాయని తెలుసుకున్నాడుతన సొంత అనుభవంనేర్చిన ఈ జ్ఞానాన్ని విపశ్యన పేరుతో ప్రజానీకానికి పరిచాడుమొదట తన అనుభవాన్ని ఐదుమందికి పరిచాడు తర్వాత కోట్లాది మంది  జ్ఞానాన్ని అందుకున్నారుమనసు ఆడించినట్టల్లా మనిషి ఆడితే-  కోరికలు తీరితే సంతోషపడి ( సంతోషం కూడా అశాశ్వతమేతీరకపోతేదు:ఖపడడం జరుగుతుందని చాలాస్పష్టంగా చెప్పాడు.
కోరికలే మనిషి దు:ఖానికి కారణమనిసుఖదు:ఖాలను సమంగా చూడగలిగితేసమతను సాధించగలిగితే మనిషి జీవితం సాఫీగా సాగిపోతుందనిగొప్ప ఆనందం అందుబాటులోకి వస్తుందంటాడు.  ఒక వ్యక్తి మీద ప్రేమకన్నవస్తువుల మీద ప్రేమ కన్నా విశాల ప్రేమనిప్రకృతిలోనిసమస్తాన్ని ప్రేమించగలిగితే మనిషి మహానందాన్ని అందుకుంటాడనిఅతను కూడా బుద్ధుడవుతాడనిబుద్ధుడు అనేది పేరు కాదనిసమస్థితిని సాధించిన ప్రతి వొక్కరూ బుద్ధులేనని విపాశన చెబుతుంది.  భారతదేశంలో బుద్ధుడి ద్వారా పుట్టిన  జ్ఞానం ఇక్కడ అంతరించిపోయిందని,
బర్మా  మాత్రం  దీన్ని భద్రంగా కాపాడుకున్నదనితాను 1969లో బర్మా నుంచి భారతదేశం వచ్చాననివిపాశన సెంటర్లను స్థాపించానని గోయంకాగారు చెబుతారు.

పదిరోజులపాటు ఇంటినిపనినిసంబంధాలని వొదిలేసి కేవలం నాతో నేనునాలో నేను గడపడానికి విపాశనని వెళ్ళడానికి కారణం అసలు విపాశన అంటే ఏమిటో తెలుసుకోవడం అనుభవం ఎలా వుంటుందో అనుభూతి చెందడం కోసమేనిజానికి నేను ఎప్పుడూ పాజిటివ్దృక్పథంతోనే వుంటానుజీవితాన్ని సింపుల్గా ఎలాంటి ఆర్భాటాలు లేని విధంగా మలుచుకున్నానువస్తు సముదాయం అవి ఎలాంటివైనా సరే నన్ను ప్రలోభపెట్టలేవుదు:ఖాలనుదిగుళ్ళను గుండెల్లో మోస్తూ తిరగడం నా వల్లకాదువాటిని అధిగమించే మార్గాలను అన్వేషిస్తాను.ప్రతి సమస్య పరిష్కారం  సమస్యలోనే వుంటుందని నమ్ముతాను అతీత శక్తిని నమ్మని దాన్ని  కాబట్టే  నాకు విపాశన సెంటర్లో వాతావరణం చాలా నచ్చిందిమతపరమైన కర్మకాండసంప్రదాయాలు లేని లౌకిక పద్ధతులు అక్కడ నెలకొనడంబుద్ధుడి విగ్రహం కూడాలేకపోవడం బావుందిబుద్ధుడిని భగవానుడని పిలవడం వెనుక ఇప్పటి భగవానుడు కాడనివిపాశన జ్ఞానంద్వారా సమతను సాధించిన వాళ్ళని భగవాన్‌ అని  రోజుల్లో పిలిచేవారని గోయంకాగారు వివరించారుఅలాగే పరమపదమంటే మరణాన్ని కూడా  ఎరుకతో,చిరునవ్వుతోస్వీకరించడంగా అర్థం చేసుకోవాలిబుద్ధుడు మతం ఆధారంగా సృష్టించబడిన స్వర్గనరకాలను నిరసించాడనిమతపరమైన కర్మకాండలవల్ల మనిషి పొందే జ్ఞానమేమీ వుండదనిఆ కర్మకాండలో కూరుకుపోవడమే వుంటుంది తప్ప దాన్నుండి బయటపడలేరని బుద్ధుడు
చెప్పాడని గోయంకా చెబుతారు.

మొత్తానికి విపాశన మెడిటేషన్‌ నాకొక కొత్త అనుభవాన్నే ఇచ్చిందిఆహ్లాదకరమైన వాతావరణంఎంతో నిబద్ధతతో పనిచేసే దమ్మసేవికలుఎంతో స్నేహంగా వుండే టీచర్‌ పద్మజగారుపది రోజుల పాటు చక్కటి క్రమశిక్షణవొళ్ళొంచి అన్ని పనులూ చేసుకోవడం చాలా నచ్చింది.మనం తలుచుకుంటే ఏమైనా చెయ్యగలం అనే నమ్మకాన్ని మనకి ఇస్తుందిపదిరోజులు మాట్లాడకుండా వుండగలంరాత్రి భోజనం లేకుండా బతకగలంబయట ప్రపంచంతో సంబంధం లేకుండా మనతో మనం పదిరోజులు గడపగలంఅన్నింటినీ మించి పుడుతూనే సెల్తో పుట్టామని,కంప్యూటర్‌ కవచకుండలాలతో  పెరిగామని విర్రవీగే వాళ్ళకి అవి లేకుండా కూడా హాయిగా పది రోజులు బతకొచ్చని అర్థమౌతుందిఎపుడూ బయట ప్రపంచంతోవస్తు సముదాయంతో ఉక్కిరిబిక్కిరిగా బతికే మనంమన లోపలి ప్రపంచాన్ని దర్శించాలంటేసంకుచిత ప్రేమల్నుండివిశ్వప్రేమను అలవరుచుకోవాలంటే  ప్రతి వొక్కరం  అనుభవాన్ని పొందితీరాలి.

మరో ముఖ్య విషయం చెప్పాలిఇక్కడ భోజనంవసతి అన్నీ ఉచితమేవిరాళాలివ్వమని కూడా అడగరుఅయితే పది రోజులు హాయిగా అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి మనమే విరాళం ఇవ్వాలనుకుంటాంనేను రూ. 2000 విరాళమిచ్చానుఇక్కడ పద్ధతి ఏమంటే నేనుఇచ్చిన విరాళం నా తర్వాత వచ్చేవాళ్ళకు ఉపయోగపడుతుందినా కోసం ఎవరో విరాళం ఇచ్చే వుంటారుఈ అవగాహనతో అందరూ తోచినంత  విరాళం ఇస్తారునిజానికి పదిరోజులు తిండితిప్పలుకరెంట్‌, వాటర్‌ వీటికి బాగానే ఖర్చవుతుందిసాధకులిచ్చే డొనేషన్స్‌ కాకుండా వేరేఎలాంటి విరాళాలు స్వీకరించరు.

అన్ని మానవ సంబంధాల్లోకి స్నేహం ఉన్నతమైందని నమ్మే నాకువిపాశన చివరిరోజు మంగళమైత్రి ఒక్కటే అలవరుచుకోవాలనిప్రకృతి మీదమానవాళి మీద స్నేహాన్నిప్రేమని మాత్రమే కురిపించాలనిమనం స్నేహంతో మన హృదయాన్ని నింపుకుంటే స్నేహం మన చుట్టూప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతుందనిఒక్కోసారి  స్నేహంప్రేమ మన మనసుల్లోంచి పొంగిపొర్లి మనతో వున్న వాళ్ళందరికీ దాన్ని పంచుతుందని గోయంకా గారు చెప్పినపుడు నా కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు కురిసాయి.మానవాళి మొత్తం  కళని అలవరుచుకుంటే ప్రపంచం మొత్తం శాంతి నెలకొనిఅందరూ మనశ్శాంతితో బతుకుతారు కదా అనిపించింది.

 చివరగా పదో రోజు మధ్నాహ్నం నుండి ఒకరితో ఒకరం మాట్లాడుకునే అవకాశం దొరికిందిచిత్రంగా చాలామంది నన్ను గుర్తుపట్టారుమీరు టీవీలో వస్తారుకదామిమ్మల్ని చాలాసార్లు చూసాం అన్నారుపరస్పర పరిచయాల్లో భూమిక పత్రికభూమిక హెల్ప్లైన్‌ గురించి చెబుతూనేను రచయిత్రిననిజర్నలిస్ట్నని చెప్పగానే చాలామంది బాగా ఎడ్జ్తెట్‌ అయ్యారుహెల్ప్లైన్‌ గురించి వివరంగా చెప్పమన్నారునేను చేస్తున్న పనిని మెచ్చుకుంటూ చాలామంది అభినందనలు  చెప్పారుటీచర్‌ పద్మజగారు నిన్నటివరకు మీరు నాకు నమస్తే చెప్పారు రోజు నేనుమీకు నమస్తే చెబుతున్నాను.  మీరు బాధిత స్త్రీల కోసం చాలా చేస్తున్నారుఅభినందనలునేను మీ ఆఫీసుకొస్తానుమనం మళ్ళీ కలుద్దాం '' అన్నపుడు నాకు నా పనిపట్ల  మరింత గౌరవంనిబద్దత పెరిగినట్లనిపించిందినేను రెగ్యులర్గా సందర్శించే చెంచల్గూడా మహిళా జైలులోవిపాశన మెడిటేషన్ను ఏర్పాటు చేద్దామని పద్మజగారితో చెప్పినపుడు ఆవిడ తప్పకుండా ప్రయత్నిద్దాం అన్నారు.

జూలై మొదటి తేదీన పెట్టెబేడా సర్దుకునినా రూమ్ని శుభ్రంగా కడిగి,
దుప్పట్లు వగైరాలు ఉతికేసి మళ్ళొస్తానని చెట్టకిపిట్టలకి చెప్పి,
తేలికైన శరీరంతో (మూడు కేజీల బరువు తగ్గానుఉత్సాహంగా వున్న మనసుతో మా
  1. ఇంటి ముఖం పట్టాను.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...