Monday, September 29, 2008

తుపాకీ మొనపై వెన్నెల

 
(ఈ ప్రయాణానుభవం ఇంతకుముందు ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో  అచ్చయ్యింది.
ఈ ఫోటో కూడా అందులోదే.)
     క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా  జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయినా మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
     మే ఒకటవ  తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేహ్  వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
 రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా  అంటూ తన దగ్గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు సూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
    ఉత్పల ఇచ్చిన అదనపు సట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. శ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో  కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కప్పబడి, సూర్యకాంతికి మెరుస్తున్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు. ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్పమాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు  పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
     ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో  కూర్చుని తలుపు వేయబోయను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నారు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47   పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో  సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
టూరిస్టులు లేక  అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజవనులు కూర్చుని వున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడ్డి లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.  
    శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఘల్‌ గార్డెన్స్‌ అని పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
    మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయరైపోయామ్. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేంచూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
     మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక్కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద్ద మంచు దిబ్బ  మా కారుకు అడ్డు వచ్చిన్ది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయామ్. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రిన్గ్స్ చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సవ్మెహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయామ్. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా  కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి,   చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్ననా సహచరుడి ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది.  'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
    మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగ్ లో ఎన్నికలు అయిపోయయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు.  అమర్‌నాథ్‌ యత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌  జామ్‌లో ఇరుక్కుపోయామ్. అనంతనాగ్ లో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము  బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయామ్. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప్పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయామ్. అయితే మా ప్రయణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీళ్ళు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగ్ సరస్సును చూడలేకపోయమన్న నిరాశతో తిరిగి వచ్చేం.
    మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లేహ్' ప్రయాణం మొదలైంది. లేహ్ గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లేహ్ పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని  నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి  లేహ్ కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లేహ్ రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లేహ్ లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెప్పిన్ది. తొమ్మిదిన్నరకి లేహ్ లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగ్ అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుక కొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా  తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి  తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగ్ హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లేహ్ చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం,  యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక్కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
    అక్కడినుంచి  మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లేహ్ చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయండ్‌, షె మొదలైన ఎన్నో  గొంపాలు వున్నాయి. వీటిలో లేహ్ కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షణ మైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల  చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు.నా సహచరుడేమో "ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగ్ కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను.  వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచ్చిన్ది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తండిపోయను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా  నిద్రపోయాను.
    మే ఎనిమిదో తేదీన  మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగ్ సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లేహ్ రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది.  ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగ్ సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయల మధ్య సన్నటి రోడ్డు మీద కారు మెలికలు తిరుగుతోంది.  ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాలని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి  మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయామ్. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని నా సహచరుడు మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు ఆ స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను  యెగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. తనకు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక్కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి  టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న  టీ ఎంత తృప్తి నిచ్చిన్దో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగ్ సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది.  ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగ్ సరస్సు విస్తరించి వుంది. నాలుగు  కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ. సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయామ్. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగ్ సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయణానికి అయిష్టంగానే సిద్ధమయ్యామ్. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప్ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా  తెలుగుమాట వినని మేం  ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యం.

    అప్పటికి మంచుకొండల  మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయా. ఆ అదురులోనే మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయా. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు.  మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయా. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి  దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లేహ్ పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిన్ధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం  పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లేహ్ , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు  మొదలుపెట్టాడు కాబోలు  అనుకున్నాను.
    అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయణమయ్యామ్. క్షణక్షణం మారే లేహ్ వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ  ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా వివనం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
    పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన  80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యరో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు భర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు భర్తలు బతికి వున్నారో లేదో తెలియని భయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని  ఒక చోట చదివాను. 20  వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి  చంపి, చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరభాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌. వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

Saturday, September 20, 2008

ఒంటరి దీవులు
జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.

Friday, September 19, 2008

ఈ రోజు ఏమైందంటే........


రోజూ ఉదయం లేచిందగ్గర నుండి ఒకటే ఉరుకులు పరుగులు.
ట్రాఫిక్ పద్మవ్యూహం లో సెగలు పొగలతో చిరాకులు
ఆఫీసుకి వెళ్ళగానే తలమునకలయ్యే పనులు
హెల్ప్ లైన్ లో అంతులేని సమస్యలు, సమాధానాలు, కౌన్సిలింగులు
ఈ రోజు రొటీన్ కి భిన్నంగా గడపాలని,రిలాక్ష్ అవ్వాలని అనుకున్నాం
నేను గీత.తను కూడా చాలా బిజి.తహసిల్దార్ కదా ఎప్పుడూ హడావుడే.
ఇద్దరం ఆఫీసు పనుల్ని పక్కన పెట్టేసి కలిసి గడపాలనుకున్నాం.
అన్నట్టు గీత ఎవరో చెప్పలేదుగా.నా నేస్తం.నాకు చాలా ప్రియమైన నేస్తం.
ఎంతటి పని ఒత్తిడి ఉన్నా మేమిద్దరం కలవడానికి,కబుర్లాడుకోవడానికి
కనీసం నెలలో ఒక రోజన్నా కేటాయిస్తాం.పనికి సంబంధించి ఏమి మాట్లాడం.
మాకిష్టమైన వన్ని చేస్తాం అంతే.
గీత ఈ రోజు ఉదయమే మా ఇంటికొచ్చేసింది.నేను నా పనులన్ని రేపటికి పోష్ట్ పోన్
చేసేసాను.
తనకిష్టమైన వెల్లుల్లి చికెన్,చేపల పులుసు,జొన్న రొట్టి చేసా.
తనకు ఎంతో ఇష్టమైన సంపెంగ పూలు,అనార్ పువ్వులు కోసి ఉంచాను
తను 11 కు వచ్చింది.కొన్ని కబుర్లయ్యాక ఇంటర్నెట్ ఓపెన్ చేసా.మా ఊరి వ్యాసం మీద వచ్చిన స్పందన చూసి చాలా సంతోష పడింది.
ఇద్దరం ఓ గంటన్నర సేపు కూరలతో పాటు కబుర్లు నంజుకుంటూ అన్నం తిన్నాం.
కాసేపు పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం.
అక్టోబర్లో భూమిక ఆర్గనైస్ చెయ్యబోతున్న రచయిత్రుల కాంప్ గురించి చర్చించాం.
ఆ తర్వాత తన కైనెటిక్ మీద శిల్పారామం బయలుదేరాం.
కార్ డ్రైవింగ్ అలవాటై స్కూటర్ నడపడం కొంత తడబడినా నేనే బండి నడిపా.శిల్పారామం లో షాపుల వేపు కన్నెత్తి చూడకుండా ఓ చక్కటి ప్రదేశం చూసుకుని కూర్చున్నం.ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగ, హాయిగా ఉంది ఓ పొగడ చెత్తు చుట్టూ రచ్చబండలా కట్టారు.ఒకటీ రెండు పొగడ పూలు కూడా మా మీద రాలాయి.
ఐదు గంటలవరకు కబుర్లే.నవ్వులే.మా నవ్వులు అక్కడి కొండల్లో ప్రతిధ్వనించాయి.
ఆ తర్వాత వేడి వేడి టీ తాగుతుంటే ఆ పక్కనే ఓ పచ్చిమిర్చి చెట్టు విరగ కాచి కనబడింది.ఆ కాయలన్ని కోసి కాంటీన్ నడుపుతున్నాయనకి ఇస్తే మేమెప్పుడూ చూళ్ళేదే ఇన్ని కాయలున్నాయా అంటూ ఆనందమగా మిరపకాయలు తీసుకుంటే మాకు ఒకటే నవ్వులు.
మిర్చి బజ్జి తింటారా అని చాలా ప్రేమగా అదిగాదు.మేము వద్దని బయటకు వచ్చేసి మా బండి మీద రయ్మంటూ ఇంటి వేపు బయలుదేరాం.
ఇందులో ఎమి విశేషమేముంది అనుకుంటున్నారా?
చాలా ఉందండోయ్.ఈ నాటి ఒత్తిళ్ళ,సవాళ్ళ ప్రపంచంలో మనకిష్టమైన ఫ్రెండ్ తో
అచ్చంగా ఒక రోజు హాయిగా, జాలీగా కేవలం మన కోసమే ఒక రోజు కేటాయిచుకుని
గడపడంలో ఎంత ఆనందముందో,ఆ అనుభవం మనల్ని ఎంత ఫ్రెష్ గా,రిలాక్షెడ్ గా ఉంచుతుందో నా అనుభవం మీద చెబుతున్నా.
ఒక్క రోజు మనం ఇలా గడిపితే నెల రోజులు హేపీగా మన పనుల్ని నల్లేరు మీద బండి లా లాగెయ్యగలం.నిజం నా మాట మీద నమ్మకం లెకపోతే మీరూ ఒక సారి ఈ ప్రయోగం చేసి చూడండి.ఇది మనకి చాలా అవసరమని మీరే అంటారు.

Tuesday, September 16, 2008

సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి


కొండవీటి సత్యవతి
పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్‌ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
 రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్‌ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్‌ హియరింగు వుందని.
 సరే ఆ రోజు హాజరైతే అందరినీ ఒకే చోట కలిసినట్టు వుంటుందని, విషయలు బాగా అర్ధమౌతాయని అనుకుని శిలాలోలితకి, సుజాతాపట్వారీకీ ఫోన్‌ చేసాను.
శిలాలోలిత వస్తానని చెప్పడంతో పోలేపల్లి ప్రయాణం ఖాయమైంది.
ఆగష్టు 7న ఉదయం ఆరుకంతా రోడ్డెక్కేసాం. జడ్చర్ల దాదాపు 80 కిలోమీటర్లుంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ రత్నమాల, బాలగోపాల్‌, గీతాంజలి, హేమలలిత, సూరేపల్లి సుజాత వచ్చి వున్నారు. మాధవి, 50 మంది కాలేజీ పిల్లలతో కలిసి బస్సులో వస్తోందని, తన కోసమే ఎదురుచూస్తున్నామని సుజాత చెప్పింది. సమావేశం ఇంకా ఆరంభమయ్యే సూచనలు కనబడలేదు. టెంట్‌ వేస్తుంటే గాలికి కిందపడుతోంది. మేము నిలబడిన చోట రాక్షసుడి కోరల్లా రెండు ఆర్చీలు  ఎపి ఐఐసి వి రోడ్డు కిటూ అటూ దర్పంగా నిలబడి వున్నాయి. పొలాల్లో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. ఆరవింద్‌ ఫార్మావారి షెడ్‌ నిర్మాణం జరుగుతుతోంది. లారీలు, రోడ్‌రోలర్లు అటూ, ఇటూ తిరుగుతున్నాయి. పొలాల మధ్యలో విశాలమైన నల్లటి తారు రోడ్డు అప్పటికే వేసారు. ఫార్మా కంపెనీల కాళ్ళు కందకుండా, వాళ్ళ కార్లు తిరగడానికి వీలుగా అంత విశాలమైన రోడ్డు వేసారని చూడగానే అర్ధమౌతుంది. వాటన్నింటినీ గమనిస్తూ అందరం మాట్లాడుకుంటుండగా మాధవి వాళ్ళ బస్సోచ్చింది. జీన్‌ పాంట్లేసుకున్న అమ్మాయిలు బిల బిల మంటూ బస్సు దిగేరు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషమన్పించింది.సెజ్‌లాంటి సీరియస్‌ అంశాల్లో యువత పాల్గొని, బాధితుల పక్షాన నిలబడితే మంచిది. ఈ విషయాలను వాళ్ళు అర్ధం చేసుకోగలిగితే బావుంటుంది అని నాకన్పించింది.
 బస్సు దిగిన వాళ్ళందరిని మళ్ళీ ఎక్కించి పోలేపల్లి గ్రామంలోకి బయలు దేరాం అందరం. మేము వెళుతున్నపుడు  చాలామంది స్త్రీలు ఎదురుపడ్డారు. వాళ్ళందరిని కూడా బస్సులో ఎక్కించుకుని ఊళ్ళోకి వెళ్ళాం. చాలా మంది పబ్లిక్‌ హియరింగు జరిగే ప్రాంతానికి బయలు దేరారు. కొంతమంది అక్కడ జరుగుతున్న పనుల్లో కూలీలుగా పనికి వెళ్ళారు. మేం పోలేపల్లికి ఆనుకుని వున్న గుండ్ల గడ్డ తాండాకి వెళ్ళాలనుకున్నాం. తండాలో ఎవరూ లేరని, పనులకి పొయ్యారని ఊళ్ళో వాళ్ళు అన్నారు. అయినా సరే కాలేజీ పిల్లలకి తాండా ఎలా వుంటుందోచూపించాలని మాధవి  వాళ్ళు అనడంతో ఇరుకు దారుల్లోంచి, లంబాడా తండాకి నడక మొదలు పెట్టాం. నిజంగానే మేము వెళ్ళేసరికి ఒక ముసలాయన తప్ప ఎవరూ కనబడలేదు. ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఆ లంబాడా తండాలో కోళ్ళు, కుక్కలు యధేచ్ఛగా తిరుగుతున్నాయి. చుట్టు చెట్ల మీద పిట్టలు గూళ్ళ కడుతున్న అద్భుత దృశ్యాలు కనబడ్డాయి. కొంత సేపటికి కొంతమంది స్త్రీలు తండాలోకి వచ్చారు. మేము వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టాం. అందరి గొంతులోను ఒకే వేదన, అందరి గుండెల్లోంచి తన్నుకొచ్చేది ఒకే దు:ఖం. మావి ఇన్ని ఎకరాలు పోయాయి, అన్ని ఎకరాలు పోయాయి, మాకు ఇప్పుడు ఏమీ లేదు. మేమెలా బతకాలి. మోసం చేసి మా భూములు గుంజుకున్నారు. పద్ధెనిమిది వేలు నష్టపరిహారం అన్నారు. అందరికీ లంచాలిచ్చి మాకు మిగిలింది ఎకరానికి ఎడెనిమిది వేలు. ఆ డబ్బాంతా ఎన్నడో అయిపోయింది. మా తండా తప్ప మా కిప్పుడు ఒక సెంటు భూమి కూడా మిగల్లేదు. తైదలు, జొన్నలు, కందులు పండించుకు తినేటోళ్ళం. తొక్కు చేసుకోనీకి ఒక్క చింతకాయకూడా మిగల్లేదు. మేము భూమి లేకుండా ఎలా బతకాలి. మందుల కంపెనీల్లో మమ్మల్ని కూలీలుగా చేసారు. కూలీ కూడా రోజూ దొరకదు. పస్తులుంటున్నాం. హాయిగా మా పంట మేం పండించుకు తినేటోళ్ళం ఇప్పుడు దినసరి కూలీలుగా మారిపోయం. మా కష్టాలెవరికి చెప్పుకోవాలె. ఎవరైనా చస్తే బొంద పెట్టనీకి సెంటు జాగా కూడా లేకుండ చేసారు. అప్పుడు మాకు తెలివి లేకపాయె. ఇప్పుడు మాకు అన్నీ తెలుసు ప్రభుత్వం మా మొఖాన కొన్ని వేలు కొట్టి తను మాత్రం లక్షలకి, కంపెనీలకి పొలాలు అమ్మింది. ఇదేం అన్యాయం? ఇదేం ప్రభుత్వం? ఇప్పుడు మాకు అన్నీ తెలిసాయి. మా భూమి మాకు వెనక్కి కావాలి. మాకు నష్టపరిహారం మొద్దు, మందుల కంపెనీలొద్దు మా భూమి వకు కావాలి'’ అంటూ తండా వాసులు నినదించారు. ఈ విషయాలు పబ్లిక్‌ హియరింగులో చెప్పండని బాలగోపాల్‌ సచించారు. వాళ్ళని సమావేశానికి రమ్మని చెప్పి అందరం తండా నుంచి బయలుదేరాం.
‘ఫోటో తీసుకుందామని ప్రయత్నించి నపుడు ఒక లంబాడీ స్త్రీ అన్న మాటలు నా చెవుల్లో గింగిర్లు కొట్టాయి. ‘’ ఎందుకమ్మా ఫోటోలు. ఎన్ని సార్లు ఫోటోలు దిగాలి ఎంతమందికి మా బాధలు చెప్పుకున్నాం. అందరూ వస్తారు. మాతో మాట్లాడతారు. మా కన్నీళ్ళు చూస్తారు. కానీ ఎవరూ తుడవనీకి రావడం లేదు. మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు'’ ఆమె మాటలు నా చెంప మీద చెళ్ళున తగిలి నట్లయింది. ఇప్పటికి ఎంతమందికి తన గుండె విప్పి, తన బాధను వివరించిందో. ఎంత విసుగు చెందిందో పాపం! అన్పించింది, నిజమే! అందరం వస్తాం. చూస్తాం. సాలిడారిటీ ప్రకటిస్తాం. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి.
 గుండ్ల గడ్డ తాండ చూసిన తర్వాత, ఆమె మాటలు విన్న తర్వాత మనసంతా భారంగా అయ్యింది. అదే మూడ్‌తో పబ్లిక్‌ హియరింగు జరిగే చోటకి వచ్చాం. హైవేకి కూతవేటులో ఎపిఐఐసి కోర స్తంభాల పక్కన సమావేశం మొదలైంది. భూములు కోల్పోయిన వారంతా మాట్లాడసాగారు.
 మొదట జబ్బార్‌ అనే వ్యక్తిమాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం తీసేసుకుందని, హైదరాబాద్‌లోని జూపార్క్‌లాగా పార్క్‌ డెవలప్‌ చేస్తామని చెప్పి ప్రభుత్వం బలవంతంగా తమ భూముల్ని లాగేసుకుందని తెలిపాడు. దీనివల్ల తమ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారని, మొత్తం పోలేపల్లిలో నలభై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భూములు గుంజుకునే పని 2001 నుండి మొదలైంది. మాకు ఉద్యోగాలిస్తామని కలక్టర్‌ చెప్పాడుగానీ ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు. పోలేపల్లి సెజ్‌ వల్ల 370 కుటుంబాలు నాశనమైపోయయి. చస్తే కూడా బొంద పెట్టనీకి లేదు. 2006లో అరవింద్‌ ఫార్మా కంపెనీ ముందు ఉద్యమం చేసినపుడు మాకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పోలేపల్లి సర్పంచ్‌ బాలస్వామి గౌడ్‌ మాట్లాడుత ‘’ప్రభుత్వానికి ప్రజల భూముల్ని గుంజుకునే హక్కున్నదంటూ మా భూముల్ని లాక్కున్నారు. నిజానికి ఇవేవీ ఎసైన్డ్‌ భూములు కాదు. ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కొన్నారు. ప్రభుత్వం ఒప్పుకొన్న వేవీ చెయ్యలేదు. నష్టపరిహారం కూడాచాలా తక్కువ ఇచ్చారు. రైతులంతా భూమికి భూమి అడుగుతున్నారు. కానీ ప్యాకేజ్‌ అమలు చేస్తామంటున్నారు. పార్లమెంటరీ కమిటీ పోలేపల్లి వచ్చింది. కాన్షీరామ్‌ రాణా రిపోర్ట్‌ మాకు దొరకనే లేదు. ఆ రిపోర్ట్‌ ఏమైందో తెలియదు'’ అన్నారు. అబ్ధుల్‌ రవూఫ్‌ తన భూమి 15 ఎకరాలు పోయిందని తాను నష్టపరిహారం తీసుకోలేదని అడుగుతుంటే కోర్టుకు పొమ్మంటున్నారు. ‘’అంటూ వాపోయడు. శంకరయ్య మాట్లాడుతూ’ మా బతుకు తెరువైన రెండకరాలు పోయాయి. నా చేతికి పద్దెనిమిది వేలు వచ్చాయి. మాకు న్యాయం కావాలి. మాపొలంమాకు కావాలి. దీని కోసం ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం? మాది ఆరు ఎకరాలు పోయింది ఈ బాధ తట్టుకోలేక మా ఆయన గుండె పోటుతో చచ్చిపోయడు. అరవింద కంపెనీ వాళ్ళ జెండా పీకాం. రాయి పీకాం. వాళ్లు బోర్‌ పీకేసినాం. కంపెనీ కాడ టెంట్‌ వేసుకుని వంట చేసుకున్నాం. పోలీసులొచ్చి మమ్మల్ని పచ్చిపులుసు కూడా తిననీయలేదు.'’ పెద పెంటయ్య, మొగులమ్మదీ అదే వేదన. ‘’ఇరవై అయిదు ఎకరాలు గుంజుకున్నారు. మేము పదకొండుమందిమి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఎక్కడ కలక్టరాఫీసు ఎక్కడ పోలేపల్లి. కూలినాలి చేసుకు బతికేటోల్లం. మహబబ్‌నగర్‌కి పోవడం మావల్లవుతుందా? మాకు న్యాయం చెయ్యండి, ‘’ గంగమ్మ, కమ్లి, రంగమ్మ, సాజీదాబేగం. అందరి గుండెల్లోను సుడులు తిరుగుతున్న దు:ఖం.
ఆగష్టు ఏడున జరిగిన పోలేపల్లి ఫార్మాసెజ్‌ దురాగతాలపై జరిగిన పబ్లిక్‌ హియరింగులో వెల్లువెత్తిన కన్నీటి గాధలు. పోలేపల్లి , గుండ్లగడ్డ తాండ, ముదిరెడ్డి పల్లి గ్రామాల ప్రలజ కన్నీటి ప్రవాహాలు మమ్మల్ని ముంచెత్తిన సందర్భమిది. ఒక్కొక్కరూ తమ గుండె ఘోషను వినిపిస్తుంటే మేము చేష్టలుడిగి కన్నీటి పొరల మధ్య స్తబ్ధులమై కూర్చున్నాం. ‘’అభివృద్ధి'’ విశ్వరూప సాక్షాత్కారమైన సమయమది. రెండు ఫార్మా కంపెనీల లాభాల కోసం 320 కుటుంబా లను రోడ్ల పాలు, చేసిన ‘అభివృద్ధి’ భూతం ఎపిఐఐసి రూపంలో వికృతంగా సాక్షాత్కారిచింది.నలభై మంది ప్రాణాలను ఈ భూతం ఇప్పటికే మింగేసింది. మరెంతోమంది ప్రజల గుండెలు  ఉద్వేగంతో, ఉద్రేకంతో, ని్స్సహాయత్వంలో ఎప్పుడు ఆగిపోతాయోనన్నంత బలహీనంగా కొట్టుకుంటున్నాయి. మొన్నటిదాకా 2,5,8,10, ఎకరాలకు ఆసాములు. ఇప్పుడు రోజు కూలీలు. వాళ్ళు ఆరుగాలం కష్టించి పంటల్ని పండిచుకున్న పొలాల్లోనే కూలీలైనారు. ప్రత్యేక ఆర్ధిక మండలి వాళ్ళ భూముల్ని మింగేసింది. పచ్చటి ప్రాంతాన్ని తవ్వి పోగులు పోసింది. పబ్లిక్‌ హియరింగు సందర్భంగా వాళ్ళు రాసుకున్న కరపత్రం చడండి. వాళ్ళు తమ బాధను దాటి, రెప్పచాటున పొంగుతున్న ఉప్పెనను అదిమిపట్టి, ఈ ప్రత్యేక ఆర్ధిక మండలివల్ల భవిష్యత్‌లో జరగబోయే వినాశనం గురించి ఎంత వివరంగా  రాసారో చూడండి.
ప్రియమైనా ప్రజలారా!
మేము పోలేపల్లి, గుండ్లగడ్డతాండ, ముదిరెడ్డి పల్లి గ్రావలకు సంబంధించిన రైతులం. ప్రస్తుతం మేము ఫార్మాసెజ్‌ బాధితులం. 2003 సం.న గ్రీన్‌ పార్క్‌ పేరుతో 320 కుటుంబాలకు చెందిన వ వెయ్యి ఎకరాల భమిని ఎపిఐఐసి స్వాధీనం చేసుకుంది. వ పండ్ల తోటలను బోర్లను ధ్వంసం చేసి, పచ్చని గడ్డిని తగలబెట్టింది. మేము ప్రశ్నించినందుకు వపై కేసులు పెట్టి జైళ్ళలోకి నెట్టింది. భములు పోయిన తర్వాత మేమంత కూలీలుగా బతుకుతున్నాము. తైదలు, జొన్నలు, కందులు, సీతాఫలాలు, చింతకాయలు, వమిడి, జామలు పండించుకుంట, బర్లు, గొర్లు కాసుకుంట బతికే మమ్మల్ని బజారు కీడ్చింది ఎపిఐఐసి. గ్రీన్‌పార్క్‌ పేరుతో సేకరించిన భములను ప్రస్తుతం ఫార్మాసెజ్‌కు ఇచ్చింది. ఫార్మాసెజ్‌లో కీలకమైన అరబిందోఫార్మా, హైట్రోడ్రగ్సు కంపెనీలు బల్క్‌ డ్రగ్సు తయరు చేయటానికి నిర్మాణాలు చేస్తున్నారు. ఎపిఐఐసి ఫార్మాసెజ్‌ కోసం మౌళిక వసతులైన రోడ్లు, నీరు, కరెంటు ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాని 5 సం.రాల నుంచి నిరంతరం పోరాటం చేస్త వకు న్యాం చేయండి అని నెత్తి నోర కొట్టుకున్నా ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎపిఐఐసి ఎవరు పట్టించుకోలేదు.  భములు కోల్పోయి గుండెపగిలి చనిపోయిన 42 మంది రైతులు వారి కుటుంబాలు రోడ్లపాలయి బతుకెళ్ళదీస్తున్న ఏ ప్రభుత్వం చలించలేదు. ఈ సమస్య భములు కోల్పోవడం వరకు పోలేపల్లి సమస్య అయితే ఫార్మాసెజ్‌ ఉత్పత్తులు ప్రారంభించిందంటే ఈ సమస్య పాలమూరు జిల్లా సమస్య అవుతుంది. అంతేకాక దుందుబి నది నుంచి ఈ ఫార్మాసెజ్‌ విష పదార్ధాలు డిండినదిలో కలుస్తాయి. డిండినది నుంచి కృష్ణా నదిలో కలిసి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొత్తం విషపూరితం అవుతుంది. జంట నగరాలకు వచ్చే కృష్ణ తాగునీరు, దక్షిణ కోస్తాకు వెళ్ళే కృష్ణ సాగునీరు విష పదార్థాలతో నిండిపోతుంది. మనం పోలేపల్లి ఫార్మాసెజ్‌ వెదజల్లె విష పదార్ధాలతో ఎలా బతకగలం, ఎలా వ్యవసాయం చేయగలం, ఎలా ధాన్యాలను ఉత్పత్తి చేయగలం, ఎలా జాతీయ సంపదను పెంచగలం, ఎలా భావితరాలను బతికించుకోగలం. నిన్నటి వరకు ఒక ఊరి సమస్య అయితే పోలేపల్లి పార్మాసెజ్‌ ఈ రోజు మన ఉమ్మడి సమస్య. మన ఉనికి సమస్య. మన బతుకు సమస్య. మన నాగరికత సమస్య, మొత్తంగా మన దేశభక్త సమస్య, దేశసార్వభౌవధికార సమస్య. కెవలం ఒకరిద్దరు ఫార్మా కార్పోరేట్‌ యజవనుల ఆదాయన్ని పెంచటానికి జరుగుతున్న  ఈ ఫార్మాసెజ్‌ కుట్రను భావ ప్రకటన ద్వారా బద్దలు కొడదాం. కాళ్ళ కింద భమిని కోల్పోవడమంటే సమస్తమం కోల్పోవడమే. కాబట్టి ఆగష్టు 7, 2008 ఉదయం 10గలకు పోలేపల్లి గ్రామంలో జరిగే పబ్లిక్‌ హియరింగులో మీరందరు వతో గొంతు కలపండి. పార్మాసెజ్‌కు వ్యతిరేకంగా ఎక్కడిక్కడ చర్చ పెట్టండి. సెజ్‌ దోపిడీని ఎండగట్టండి. మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుదాం. పోలేపల్లి ఫార్మాసెజ్‌ వ్యతిరేక పోరాటాల్లో భాగమవుదాం, దేశభక్తిని చాటుకుందాం. సెజ్‌లను తరిమి కొడదాం, భారతదేశాన్ని కాపాడుకుందాం.
ఈ రోజు రాష్ట్రంలో ఏ మూల చూసినా సెజ్‌ మంటలే. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరుతో, పాలకుల ‘అభివృద్ధి’ జపం పచ్చని పంట పొలాలను బీళ్ళుగా పరుస్తోంది. ప్రజల జీవనాధారాలను లాక్కుని వాళ్ళను దిక్కులేని వాళ్ళుగా తయారు చేస్తోంది. దేశంలో పలు ప్రాంతాలు సెజ్‌ల సెగకి భగ భగ మండుతున్నాయి. అది పోలేపల్లి కావచ్చు. కాకినాడ కావొచ్చు. సత్యవేడు కావచ్చు. సింగరు కావొచ్చు. సూళ్ళూరు పేట కావొచ్చు. దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో, లక్షలాది కుటుంబాలను శాశ్వత నిర్వాసితులను చేయబోతున్నాయి ఈ ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు. దేశంలో మొత్తం 600 పైగా సెజ్‌లున్నాయి. మన రాష్ట్రంలో 91 సెజ్‌లు ఇప్పటికీ సత్యప్రాయంగా అనుమతి పొందాయి. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు అనేవి దేశాన్ని అభివృద్ధి పధంలో నడుపుతాయని, లక్షలాది ఉద్యోగాలు  దొరుకుతాయని ప్రభుత్వం మొండిగా వాదిస్తున్నది. ఇది నిజం కాదు. ఈ సెజ్‌ల ఏర్పాటు వల్ల పచ్చటి పంట పొలాలు, అపార మత్య్ససంపద, సహజవనరులతో పాటు, గ్రామాలకు  గ్రామాలను కార్పోరేట్‌ సంస్థలు దోచుకుంటున్నాయి. ప్రజలు తమ పొలాల నుండి, తమ జలాల నుండి, తమ నివాసాల నుండి వెళ్ళగొట్టబడతారు. ముఖ్యంగా ఎస్‌.సి.ఎస్‌.టి. బి.సి మైనారిటీ ప్రజల భూముల్ని ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటోంది. కార్పోరేట్‌ రంగ ‘అభివృద్ధి’ని ప్రజల అభివృద్ధిగా బుకాయిస్తున్న ప్రభుత్వం భూములు, వనరులు, కొంపా గూడు కోల్పోయిన ఈ ప్రజల్ని ఏ ‘అభివృద్ధి’ బాట కడ్తుంది?
 పోలేపల్లి విషయనికొస్తే ఎస్‌.సి, ఎస్‌టి, బి.సి, మైనారిటీలకు చెందిన మొత్తం 1240 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకున్నది. వీటిలో కేవలం 150 ఎకరాలను అరవిందో, హైట్రో ఫార్మాలకిచ్చి మిగతా భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చెయ్యలనుకుంటోదనేది స్పష్టం. రైతులకి 18 వేలిచ్చి ఫార్మా కంపెనీలకు కోట్లకు  అమ్మింది ప్రభుత్వం. సర్వం కోల్పోయి పోలేపల్లి ప్రజలు రోడ్ల మీద పడాల్సి వచ్చింది.
కాకినాడలో ఓఎన్‌జిసితో పాటు ప్రయివేటు పెట్రోలియం కంపెనీల కోసం 12,500 ఎకరాలను కబళించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సామర్ల కోట, పిఠాపురం, యు. కొత్త పల్లి మండలాల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ సెజ్‌ తీర ప్రాంతానికి వరింది. ఇవి చవిటి నేలలని ప్రభుత్వం చెబుతోంది కానీ అది నిజం కాదు. జీడి మామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు పంట భూమి కూడా వుంది. సరుగుడు నారు మళ్ళు ఇక్కడే ఎక్కువగా వున్నాయి. సరుగుడు  నారు రాష్ట్ర మొత్తానికి ఇక్కడి నుండే సరఫరా అవుతుంది అంతేకాదు ప్రకృతిలోని ఫలసాయం మీద ఆధారపడి బతికే  వెయ్యి కుటుంబాలకు పైగా గీత కార్మికులు, 1500 కుటుంబాల యాదవులు, మత్స్యకారులు ఈ ప్రాంతంలో వున్నారు. కాకినాడ సెజ్‌వల్ల వీరంతా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సెజ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్త  అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. జైళ్ళ కెళుతున్నారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళు తున్నారు.
అలాగే చిత్తరుజిల్లా సత్యవేడులో, అనంతపురం, నెల్లూరుల్లో, ప్రకాశం జిల్లా ఓడ రేవు, గు౦టూరు జిల్లా నవాబు పట్నంలో కూడా శరవేగంతో సెజ్‌లు అమలవు తున్నాయి. కోస్తా తీరం వెంబడి ప్రజలు ‘కోస్టల్‌  కారిడార్‌’ భయం గుప్పిట్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు 972 కిలోమీటర్ల అంటే కోస్తా  తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదారులు కృష్ణా, గు౦టూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 972 కి.లీ పొడవున ఈ కారిడార్‌కు కావలిసిన భూమి సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్త్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఆహారభద్రతకు ముప్పు ఏర్పడబోతోంది. ప్రజారోగ్యం, పర్యావరణం మంటగలిసి పోతాయి. ఈ కారిడార్‌లో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలు వదిలిపెట్టే వ్యర్ధాలవల్ల ఆ ప్రాంతమంతా నరకంగా వరబోతోంది. సముద్ర జలాలు, భూగర్భ జలాలు కలుషితం కాబోతున్నాయి. అయినా సరే ప్రభుత్వం ముందు చూపు లేకుండా, ప్రజల ఆధీష్టానికి వ్యతిరేకంగా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, కోస్టల్‌ కారిడార్‌ల ఏర్పాటుల కోసం సామ, దాన, భేద, దండోపాయ లన్నింటిని ఉపయెగిస్తోంది. వీటికి వ్యతి రేకంగా మాట్లాడుతున్న వాళ్ళని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తోంది. తాము బ్రహ్మాండమైన అబివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తుంటే అడ్డుకుంటున్నారని దమననీతిని ప్రదర్శిస్తోంది.
 పోలేపల్లిలో ఏర్పాటవుతున్న ఫార్మా సెజ్‌వల్ల సమస్తం కోల్పోయిన ప్రజలు, ప్రభుత్వం చెబుతున్న ‘అభివృద్ధి నమూనా’కి ఎంత దూరంలో వున్నారో ఆగష్టు 7న జరిగిన పబ్లిక్‌ హియరింగ్లో మాట్లాడిన ప్రజల్ని చూసిన తర్వాత ఎవరైనా అర్ధం చేసుకుంటారు. ఈ అభివృద్ధి నమూనా వెనక వుండే వినాశనం, విచ్ఛిన్నం, ఆహార, ఆరోగ్యం, జీవనాధారాల అభద్రతల గురించి మనం అర్ధం చేసుకోవాలి. పేద ప్రజల జీవితాలను, జీవనాధారాలను కార్పోరేట్‌ శక్తులకు బలిచ్చి, వాళ్ళకు లాభాలు గడించి పెట్టే పనిని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తలకెత్తుకోవడం ఎంతో గర్వి౦చాల్సిన విష యం. సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యం వాదులు, హక్కులసంఫలు ఈ విషయమై ఐక్య ఉద్యమం నడపాల్సిన అవసరం ప్రజలకు అండగా వుండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సెజ్‌ల మీద ఏర్పాటైన కాన్సిరామ్‌ రాణా పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్లు
1. రైతుల కష్టాలను వారి ఉద్యమాలను అర్ధం చేసుకోవాలి.
2. సెజ్‌ల అనుమతుల్లో అనవసర తొందరపాటు వల్ల కూడా సెజ్‌ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 3. సెజ్‌ల ఏర్పాటు అభివృధ్ధిని, ఎగుమతుల్ని సూచిస్తుంది. అయితే దీనిని ప్రజలెందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ప్రజల ఆవెదనతో తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టాలి.
 4. ప్రజల ఉద్యమాలను, వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటూ, దాని కనుగుణంగా సెజ్‌ చట్టానికి మార్పులు, చేర్పులు చేసే దాకా వేరే సెజ్‌లను నోటిఫై చేయరాదు.
 5.  రైతుల నుండి తీసుకునే భూముల వల్ల రైతుల దిగుబడి, ఆదాయం తగ్గటమొక్కటే కాదు వారి సా్మాజిక, సాంస్కృతిక జీవితం ప్రభావితమౌతుంది. వ్యవసాయంతో సంబంధమున్న రైతుల, కూలీల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని కమిటీ నమ్ముతోంది.
6. అలాగే రోడ్ల విస్తరణ ఇళ్ళ నిర్మాణాల వల్లను, టౌన్‌షిప్‌ల నిర్మానం వల్లను ఎంతో పంట పొలం నాశనమవుతోంది.
 7.  ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ ఏర్పాటు వల్ల, నగరీకరణవల్ల పంట భూములు పాడయిపోతున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం సీరియస్‌ చర్యలు తీసుకోవాలి.
 8.  ఆర్ధిక అభివృద్ధి కోసం వ్యవసాయ అభివృద్ధిని ఫణంగా పెట్టడం భావ్యం కాదు…
 9. వ్యవసాయ ొభూముల్ని ఎట్టి పరిస్థితుల్లోను వ్యవసాయేతర పనులకి కేటాయించకూడదు…
కాన్షిరామ్‌రాణా రిపోర్ట్‌ 47 రికమండేషన్స్‌ని ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ పోలేపల్లిని కూడా సందర్శించింది. సెజ్‌లు ఏర్పాటు చేసేటపుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి చాలా చక్కటి రికమండేషన్స్‌ ఇచ్చింది. పూర్తి వివరాలు వచ్చే సంచికలో ప్రచురిస్తాం.

Friday, September 12, 2008

మా ఊరు సీతారామపురం-నా లైఫ్ లైన్


    ఆయ్‌! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
    మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను  ఆ సంగతులు.
    మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మేం పిల్లలందరం కలిసి వేసంగి శెలవులొస్తే కోతుల్లాగా చెట్లమీదే ఎగురుతుండేవోళ్ళం. జీడిపళ్ళు చీక్కుంట, గింజల్ని చెట్లకిందే కాల్చుకుంట, జీడిపప్పు తెగ తినేవోళ్ళం. ఇప్పుడేమో కొలస్ట్రాలని భయపెడుతున్నారుగాని మేం తిన్నంత జీడిపప్పు ఎవ్వరూ తినుండరంటే నమ్మండి. మా కూరల్నిండా పచ్చిజీడిపప్పే. చింతచిగురు, మామిడి కాయ, వంకాయ కోడిగుడ్లు అన్నింట్లోను కలిపేసుకుని వండేసుకునేవాళ్ళం. చింతాకు జీడిపప్పు కూర  రుచి నే చెబితే ఏం తెలుస్తుంది. తిని చూడాలంతే.
    వేసంగి శెలవుల్లో మా పిల్లమూకంతా ఆడపిల్లలైతే లంగాలకి కచ్చాలుపోసి, మొగపిల్లలైతే జేబుల్లోకి గంపెడేసి చింతచిగురు కోసి కుప్పలు పోసేవోళ్ళం. చిటారుకొమ్మల్లోకి పాక్కున్టూ వెళ్ళిపోవడం బలే మజాగా వుంటుంది. చింతాకు ఉడకబెట్టి బిళ్ళలు చేసేవోళ్ళు. ఆకు ఎండబెట్టి డబ్బాల్లో పోసేవోరు. మాకు సంవత్సరమంతా చింతాకు, చిన్తపరిగెలు, మెత్తళ్ళు,చిత్తడాయిలు, చెంగుడుపట్టు- ఇయ్యన్ని ఏంటీ అనుకుంటున్నారా? చేపలండీ బాబు చేపలు. ఈ చేపలన్నీ చింతాకుతో కలిపి ఒండుకుతింటే  ఇంకేమీ ఒద్దనిపిస్తదండి. మీరు కూడా పశ్చింగోదావరి వాళ్ళయితే ఇయ్యన్నీ ఈజీగా తెలిసిపోతాయండి.
    ఏసంకాలంలో మామిడి పళ్ళతోపాటు మాన్చి రుచైన పండు మరోటుందండి. మీరెప్పుడైనా తాట్టెంక తిన్నారా? చెట్టుమీద ముగ్గిన తాటి పండు నిప్పులమీద కాల్చుకుని తిన్నారంటే..... ఎందుకులెండి వర్ణిఅమ్చడం. మీరెరూ తినుండరు. పోనీ కుంపటేసిన తేగలన్నా తిన్నారా లేదా? కనీసం బుర్ర గుంజయినా తిన్నారా? తినుంటే మాత్రం వందేళ్ళొచ్చినా ఆ రుచుల్ని మర్చిపోవడం వుండదండి. సరే. మా ఊరినిండా పళ్ళతోటలే కాదండి కూరగాయల పాదుల ఎక్కువేనండి. వంకాయలు, దొండకాయలు, బీర, సొర, పొట్ల, గోరుచిక్కుళ్ళు, టమెటాలు, పచ్చిరగాయలు, గోన్గూర, తోటకూర ఒకటేమిటి అన్నీ పండిస్తాం. వీటన్నింటికి నీళ్ళెక్కడినించొస్తాయా అని ఆలోచిత్తన్నారా ఏంటి? నుయ్యిలు తవ్వుతారు. పదడుగులు తవ్వితే చాలు బుడబుడమని  నీళ్ళూరిపోతాయి. రెండు కుండల్లాంటివుంటాయి. వాటిని బుడ్లజోడంటారండి. ఈ బుడ్లజోడుని నూతుల్లోని నీళ్ళతో నింపి కూరపాదులకి నీళ్ళుపోస్తారు. బుడ్లజోడుతో నీళ్ళపోత అంటారు సిపుల్‌గా.
    మా నాన్న చాలా కష్టజీవి. గోచిపెట్టుకుని బుడ్ల జోడుతో పాదులకి నీళ్ళపోతపోసి, పచ్చిగడ్డి కోసుకుని ఇంటికొచ్చి అలిసిపోయి అలానే వీధరుగుమీద పడి నిద్రపోయేవాడు. నేను నాన్నతో కలిసి పాదుల్లో పనిచేసేదాన్ని. గొడ్డలితో కట్టెలు కొట్టేదాన్ని. పాలు పితికేదాన్ని.నూతుల్లో దిగి బోలెడన్ని చేపలు పట్టేదాన్ని. ఎపుడూ ఊరిమీద బలాదూర్‌ తిరిగేదాన్ని. నువ్వాడపిల్లవి. ఇలాంటి పనులు చెయ్యకూడదు అని ఏనాడూ మా నాన్న నాకు చెప్పలేదు. నేనేం చేసినా అడిగేవోడు ఎవ్వడూ లేడనుకోండి.
    ఓసారి నూతిలో దిగి చేపలు పడుతుంటే సీసాపెంకు గుచ్చుకుని ఒకటే రక్తం. నేనేం భయపడలేదు. ఆ నూతుల్లోనే వున్న మెట్టతామరాకు ముద్దగా చేసి తెగిన చోట పూసేసానంతే. తెగిందని ఆరోజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఈ రోజుకి నా ఎడం చేయి మణికట్టు దగ్గర ఆ మచ్చ అలాగే వుండిపోయి, ఆ అల్లరి రోజుల్ని గుర్తుచేస్తంటుంది. తేగబుర్రల్ని కత్తితో కొడుతుంటే తెగిన మచ్చ కూడా ఎడం చేతి చూపుడు వేలు మీద వుందండోయ్‌. మరేంటనుకున్నారు. ఆ మచ్చల వెనక ఇంత మహా చరిత్ర వుందిమరి.
    తోటలెంబడి తూనీగలాగా తిరుగుతుండేదాన్ని కదా! నాకు బయమంటే ఏంటో తెలియదండి. కాని ఒక్క బావురుపిల్లికి  మాత్రం తెగ భయపడేదాన్ని. మా యిల్లు రైలుబండంత పొడుగుండి చాలా పెద్దమండువా ఇల్లండి. బోలెడంత పెరడు వుండేది. గుమ్పులుగా కోళ్ళు తిరుగుతుండేవి. ఈ కోళ్ళ కోసం రాత్రిళ్ళు బావురు బావురంటూ బావురుపిల్లి వచ్చేదండి. కోళ్ళు  గూళ్ళో దూరి కోడినెత్తికెళ్ళి తినేసేది. పిల్లొచ్చినపుడు కోళ్ళు గోల గోలగా అరిచేవండి. నా గుండెల్లో రైళ్ళు పరుగెట్టేవి. గుడ్లు మిటకరించి అటకమీదికి చూస్తుండేదాన్ని. అటకమీంచి బావురుపిల్లి  నా మీదికి  దూకేస్తుందని తెగ భయపడేదాన్ని. నేనెంత మొద్దునంటే పిల్లిక్కావలిసింది కోడిగాని నేను కాదుగా. అది ఈ మొద్దుబుర్రకు అర్తం కాడానికి చాలా కాలమే పట్టింది. అదండి సంగతి.
    మా వూర్లో నాకు ఎక్కువ యిష్టమైంది, ప్రాణప్రదమైంది అమ్మోరి తీర్తం.  మా వూరి దేవత పేరు మారమ్మ. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు. తీర్తం పదిరోజులుందనగానే  పిల్లల హడావుడి మొదలయ్యేది. తాటాకులు కోసుకొచ్చి బుల్లి బుల్లి బుట్టలల్లేవాళ్ళం. వీటిని జాజారి బుట్టలు అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి రెండేసి బుట్టలన్నమాట. బుట్టల్లో  మట్టి నింపి నవధాన్యాలు వేసి నీళ్ళు పోసేవాళ్లం. పొద్దున లేవడం బుట్టలన్నీ వీధరుగుమీద పెట్టుకుని మొలకలొచ్చినయ్య లేదా అని చూసుకునేవాళ్ళం. అన్నింటి కన్నా ముందు పెసల మొక్కలొచ్చేవి. తీర్తం నాటికి జాజారి బుట్టల్నిండా పచ్చటి మొక్కలు గుబురుగా వచ్చేసేవి. తీర్తం నాటిముందు రోజు రాత్రి ఆసాదులు మోళీ కట్టేవాళ్ళు. ఆసాదులంటే ఎవరో చెప్పలేదు కదా!  మారమ్మ తీర్తంలో ఘటాలనే గరగలంటారు. ఈ  ఆసాదుల గరగల నృత్యం చూసి తీరాల్సిందే. మాదిగడప్పుకు అనుగుణంగా వారు వేసే స్టెప్‌లు, ఏ మెగాస్టార్‌ కూడా వెయ్యలేదండోయ్‌. ఆ... అన్నట్టు మెగాస్టార్‌ మా వూరివాడేనండి. మా బస్సులోనే వచ్చి మాకు బీటేసినవోడేనండోయ్‌. ఆ ముచ్చట మరోసారి చెబుతాలెండి. ఈ ఆసాదుల  మోళీ అబ్ధుతంగా వుంటుంది.  మోళీ అంటే మరేం కాదండి మేజిక్‌ అన్న మాట. మనిషి నెత్తిమీద నల్ల దుప్పటి కప్పి, పొయ్యేట్టి పకోడీలువొన్డేసేవోరు. జేబుల్లోంచి రూపాయల కట్టలు లాగి దండల్లాగా మెళ్ళో వేసుకునేవోళ్ళు. పేకముక్కల్ని ఫెవికాలెట్టి అంటించినట్టు సర్రున ఎగరేసేవోళ్ళు. మేం పిల్లలం నోళ్ళు ముయ్యడం మర్చిపోయి మొద్దురాచ్చిప్పల్లా చూస్తుండిపోయేవాళ్ళం. పి.సి. సర్కార్‌ మేజిక్‌ షో వాళ్ళముందు పనికిరాదంటే నమ్మండి.
    ఇంక తీర్తం రోజు సంగచ్చెబుతాను. తలంటుస్తానం చేసేసి, వుంటే కొత్తబట్టలేసేసుకుని ఆసాదుల రాకకోసం ఎదురుచూత్తా కూచొనేవాళ్ళం. డప్పుల హోరుతో ఆసాదులెళ్ళి ఊరి పొలిమేరల్ని కట్టేసి వచ్చేవోళ్ళు. ఆసాదుల వెంటపడి రెండు చేతుల్లో పచ్చటి జాజారి బుట్టలతో మిడతల దండులాగా పిల్లల గుంపు. బుట్టలో జానేడేసంత పచ్చటి మొక్కలు. ఆసాదులు గరగల నృత్యంతో ముందుకెళుతుంటే వాళ్ళ వెనకాల మేము. గుడి వరకూ అలా వెళ్ళి బుట్టల్ని గుడిచుట్టూ తిప్పి గుడి గోపురం కింద అంచుల మీద పెట్టేసేవోళ్ళం. గుడంతా పచ్చగా కళకళల్లాడిపోయేది. అసలు పిల్లలు బుట్టల్తో నడుస్తుంటే పచ్చటి తివాసీని మోసుకెళుతున్నారా అన్నంత ఆకుపచ్చగా వుండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కళ్ళకి ఆ పచ్చదనం అగుపిస్తుందంటే మీరు నమ్మితీరాలి మరి.
     దీపాళి పండగ గురించి ఏం చెప్పమంటారు. ఎప్పుడూ డబ్బుల్తో దీపావళి టపాసులు కొనలేదు మేం. అన్నీ మేమే తయరు చేసుకునేవాళ్ళం. పేటేప్‌ కాయలు ( తాటాకులతో చేసేవి), మతాబులు,  సిసింద్రీలు, చిచ్చుబుడ్లు అన్నీ చేసేవోళ్ళం. ముడిసరుకులు కొనుక్కొచ్చి తయారు చేసేవోళ్ళం. మతాబులు చేయడానికి ముందు కాగితం గొట్టాలు చెయ్యలిగా. అలాగే సిసింద్రీ గొట్టాలు. కాయితం, అన్నం మెతుకులు వుంటే గొట్టాలు రెడీ. వాటిల్లో మందుకూరి ఎండకి పెట్టేవోళ్ళం. తాటాకుల్ని మెలికతిప్పి, మందుకూరి, వొత్తిపెడితే పెటేప్‌కాయ రెడి. మేం చేసినవి ఫట్‌ ఫట్‌ మని పేలేవి. మతాబులు జలతారు పువ్వుల్ని రాల్చేవి. సిసింద్రీలయితే  సుయ్‌మని ఎగిరిపోయేవి. ఇవన్నీ కాకుండా దీపావళికి మేం ఓ ప్రత్యేక వస్తువు  తయారు చేసేవోళ్ళం. ఉప్పు, ధాన్యపువూక, పేడ కలిపి ఓ మూటలాగా చేసి తాడు కట్టేవోళ్ళం. మూట మధ్య నిప్పురవ్వేస్తే, ఉప్పు టపటప పేలేది. తాడుతో ఆ మూటని గుండ్రంగా తిప్పితే మనచుట్ట నిప్పుల వలయం  ఏర్పడుతుంది. పేడ, వూక కాలుతుంటే ఉప్పురవ్వలు ఎగిసేవి. ఈ ఉప్పు మూట దీపావళికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తెలుసాండి.
    వినాయక చవితికి కూడా మేం ఎండుపల్లేరుకాయల్ని మూటగట్టి ఇంటికొచ్చే కొత్తల్లుళ్ళని తెగ బెదిరించేవాళ్ళం. మా అల్లరికి బావలు పరుగో పరుగు. అల్లుళ్ళని చాలా రకాలుగా ఏడిపించే వాళ్ళం. ఆకునిండా భోజనం పెట్టి, ఆకు కింద ఆవాలు పోసి, సన్నటి  తాడుకట్టి ఆయన భోజనానికి కూర్చుని తినడం మొదలెట్టగానే ఆకుని లాగేసేవాళ్ళం. కింద ఆవాలుంటాయిగా ఆకు ఈజీగా కదిలిపోయేది. ఇంటల్లుడి ముఖం చూడాలి. అందరం గొల్లున నవ్వేవాళ్ళం. అలాగే గారెల్లో బండారు గాజులెట్టి అల్లుడికి పెట్టేవాళ్ళు. ఆయన ఆనందంగా  గారెలు లాగించబోయేసరికి గాజు గట్టిగా పళ్ళకి తగిలి బెంబేలెత్తిపోయేవాడు. మేం నవ్వుకుంటూ గాజుకు సరిపడా డబ్బులివ్వాలని ఆటపట్టించేవాళ్ళం. ఇవన్నీ పండగ సరదాల్లో భాగమేనండోయ్. పండగ సంబరాలు ఎంత రాసినా తనివి తీరదు . ఉగాదికి అరకలు కట్టి దున్నడాలు, సంగ్రాంతికి దుంలెత్తుకొచ్చి భోగిమంటలేయడాలు, కార్తీక వమాసం చలిరోజుల్లో తెల్లవారు ఝామునే గోదావరిలో మునగడాలు, అట్లతద్దికి ఉయ్యల లూగడాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో సంబరాలు.
     మావూరి గొప్పదనం గురించి ఇంకేం చెప్పమంటారండి బాబు! మాకు ఒక వేపు గోదారి. మరోవైపు సముద్రం. గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటే  పది కిలోమీటార్ల దూరంలో సముద్రం. నా బతుకు మా వూరి పచ్చదనంతోటి, మా వూరి చుట్టు వున్న నీళ్ళతోటి ముడిపడిపోయింది. వెన్నెల్లో గోదారి మీద లాంటి ప్రయణం, అంతర్వేది రేవు, అన్నాచెల్లెలగట్టు, కొనసీమ కొబ్బరి చెట్లు ఇవన్నీ నా జీవితంలో అంతర్భాగాలు. నా బాల్యం ధగధగ మా గోదారి గట్టుమీద సూర్యబింబం మెరిసినట్టు మిరుమిట్టు గొలుపుతుంటుంది.
    నేనేం టాటాలు, బిర్లాల్లాగా నా నోట్లో బంగారపు చెంచా పెట్టుకునేం పుట్టలేదు సుమండి. నేను పుట్టింది ధాన్యపు కొట్లోనంట. మా అమ్మ నిండు నెలల్తో ధాన్యపు కొట్లోంచి ధాన్యం తీస్తోందట. అమాన్తం నేను పుట్టేసానంట. కొవ్వాసు పీసు ( ఒక రకం చేప) లాగా వుండి ఈరోజో రేపో అన్నట్టుండేదాన్నంట. నా కర్మకాలి నే పుట్టిన పద్నాలుగో రోజే మా అమ్మమ్మ  చచ్చిపోయిందంట.  నా చదువుకూడా అంతే. మా వీధరుగు మీదే బడి వుండేది. బుద్ధిపుడితే కూర్చునేదాన్ని. లేకపోతే చెట్లెక్కేదాన్ని. టీకాల వాళ్ళు వస్తే మాత్రం నేను చిక్కడు, దొరకడు. చిటారు కొమ్మల్లోకి ఎక్కి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక దిగేదాన్ని. నా కెవరన్నా భయముండేది కాదు కాని టీకాల వాళ్ళంటే ఆ సూదులు  చూసి భయమేసేది.
     నా కెందుకు, ఎలా, ఎపుడు పుట్టిందోగాని చదువుకోవాలనే కోరిక మాత్రం పుట్టేసింది. మా కుటుంబంలో అటు ఇటు చదువుకున్న వోళ్ళే లేరుమరి. నాకెలా పుట్టిందో తెలియదు. చదువుకోసం ఎంతో పోరాటం చేయాల్సివచ్చింది. మా నాన్నకి నన్ను చదివించాలనే వుండేది కాని డబ్బుల్లేవు. ఉమ్మడి కుటుంబానికి ఆయన చాకిరీ చేసేడు గాని చిల్లి కాని కూడా వుండేది కాదు. నా చదువు సమాచారం క్లుప్తంగా చెబుతాను. అయిదు వరకు ఊర్లోనే చదివాను. ఆరునించి పదివరకు ఓరియంటల్‌ స్కల్‌. అంతా సంస్కృతం మయం. మా సంస్కృతం మేష్టారు శ్లోకం తప్పు చదివితే స్కల్‌ చుట్టూ తిప్పి కొట్టేవోరు. ఒకసారి నేను ఆయనకి దొరక్కుండా బాదం చెట్టెక్కి కూర్చున్నా. ఆయన కోపం ఆపుకోలేక గోడకేసి తలబాదుకున్నాడు. నేను కిందికి వచ్చేసాను గాని ఆయన నన్ను కొట్టలేదు. నేను టెంత్‌ వరకు సంస్కృతం, ఇంటర్‌లో తెలుగు లిటరేచర్‌, డిగ్రీలో ఇంగ్లీషులిటరేచర్‌ చదవడమ్ వల్ల   సాహిత్యం మీద వల్లవలిన ప్రేమనాకు.
    మళ్ళీ ఓసారి మా ఊరి కెళదావ! మా ఊరికి బస్సులేదని ముందే చెప్పానుకదండి. నడవాల్సిందే! పదండి నడుద్దాం. కాలవ దగ్గర ఎర్ర బస్సుదిగి నడవడం మొదలెడితే మీకు ఇళ్ళేం కనబడవు. ఒక వేపు జీడితోటలు, మరోవేపు సరుగుడు తోటలు. ఆ తోటల్లో పడి ఓ మైలున్నర నడిస్తే  మా ఇల్లొస్తుంది. ఆ.... అన్నట్టు మీకు ఇంకో రహస్యం చెప్పడం మర్చిపోయా. ఎవరికి చెప్పకండేం. ఎండు సరుగుడాకులు చూసారా ఎపుడైనా? ఎండిపోయిన సరుగుడాకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టుకుని గుప్‌ గుప్‌ మని పీల్చి పొగవొదిలేవాళ్ళం. హమ్మ! ఎంత రౌడీ పిల్లలు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా?  'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అని మహాకవే అన్నాడు నాదోలెక్కా. మాకు సిగరెట్లు తయరు చేయడం ఎంత సులువో తెలిసిపోయింది.  మాకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలికూడా.
    మీకు మరోరహస్యం కూడా చెబుతానండి. ఎవరితోనుచెప్పకండి. మా నాయనమ్మ రోజూ పొద్దున్నే మాన్చి్ పోత్తాడి కల్లు ముంతలు ముంతలు లాగించేదంటండి. మీకు ఇంకో సీక్రెట్టు చెప్పేస్తున్నాను. కాచుకోండి. మేం కూడా తాటాకు దొన్నుల్లో నింపుకుని పోత్తాడి కల్లు తాగేసేవోళ్ళమండి. మా ఇంటెనక ఓ  పోత్తాడి వుందండి. దాని కల్లు భలే తియ్యగా వుండేదండి. కల్లు అనగానే చాలా మంది మొకాలెందుకో తుమ్మల్లో పొద్దుగకినట్టయిపోతాయి. ఎందుకో నా కర్థమే కాదు. ముంజలు మాత్రం జుర్రుకుంట తినేస్తారు కాని కల్లంటే ఆముదం తాగిన మొకాలు పెడతారు. కల్లంటే కల్తీ కల్లనుకుంటున్నారా ఏంటి కొపదీసి. కాదండి బాబూ! మా వూరి ఈడిగ ఎంకట్రావుడు కల్లు తీస్తాడు. తెల్లారగట్లే అతను చెట్టెక్కడం మనం చెట్లకింద చేరడం. ఫ్రెష్‌. తాగితే అపుడే దింపిన కల్లే తాగాలండి. లేకపోతే యమ డేంజర్‌. కొబ్బరి నీళ్ళలాగానే వుంటదండి. ఒట్టండి. ఆరోగ్యానికి అపుడే తీసిన కల్లు చాలా మంచిదని  మా ఎంకట్రావుడు చెపుతాడండి. ఇదండి మావూరి కల్లు బాగోతం.
    మీరందరూ గోలీకాయల్తో గోలీలాడితే మేమ్  జీడిపిక్కల్తో గోలీలాట ఆడి బోలెడు జీడిగింజల్ని సంపాదించేవాళ్ళం. ఆ తర్వాత వాటిని అమ్మి  డబ్బులు సంపాదించేవాళ్ళం. పుస్తకాలు కొనుక్కోవాలికదా! డబ్బులంటే గుర్తొచ్చింది. మేం డబ్బులు కూడా తయరు చేసేం. ఫెయిలయామనుకోండి. చిల్ల పెంకుల్ని గుండ్రంగా అరగదీసి సిగరెట్‌ పెట్టెల్లో వుండే ముచ్చిబంగారం అంటించి కొట్టుకు తీసుకెళ్ళి ( రాత్రిపూట) నిమ్మతొనలిమ్మంటే, చిల్లపెంకుల్ని తీసుకుని మా వీపుల్ని  విమానంమోత మోగించిన విషయం గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుంది నాకు. ఇంకా బలుసుచెట్ల కొమ్మలకుండే ముళ్ళకి నేరేడు పండ్లు గుచ్చి ద్రాక్ష గుత్తుల్లా చేసినా, పుంతలోని ఇసకలో ఉసిరి కాయల్ని కప్పెట్టి మర్నాడు తొనలు తొనలుగా వొలుచుకుతిన్నా, బ్రహ్మజెముడు కాయల్ని  కాళ్ళంతా పూసుకుని అమ్మోరక్తం  అని గగ్గొలు పెట్టినా, పిచ్చికాయలు, తాటాకు కలిపి నమిలి కళ్ళీ కన్నా ఎర్రగా నోరు పండించుకున్నా ఇదంతా మా అల్లరిలో భాగమైనా మా సృజనాత్మకతకి పునాదులని నేననుకుంటాను.
    అందుకే మా ఊరంటే ప్రాణం నాకు. నాకు బంగారు  బాల్యాన్నిచ్చిన మా సీతారామపురం నా లైఫ్‌ లైన్‌. ఊరుకుండాల్సిన లక్షణాలు లేని ఊరు కాబట్టి నేనాడింది ఆట పాడింది పాటగా సాగింది. దళితులు, రాజులు, కాపులు తప్ప వేరే  ఏ కులం వాళ్ళూ మా వూళ్ళో లేరు. దళితుల అణిచివేత విషయంలోమా ఊరేమీ మినహాయింపు కాదు. మా తాత ఓ భయంకరమైన, కరడుకట్టిన భూస్వామి. పావలా, అర్థణా అప్పిచ్చి ఎకరాలకెకరాలు భూమి రాయించుకున్న దుర్మార్గ భూస్వామి. ఈయన దుర్మార్గానికి బలై కుటుంబాలకు కుటుంబాలే ఊరొదిలి పోయారని, అందులో నా చిన్ననాటి నేస్తం నాగులు కూడ వుందని నేను పెద్దయ్యాకే నాకు అర్థమైంది. దొంగతనాలంటగట్టి దళితుల్ని గుంజలక్కట్టేసి కొట్టిన ఉదంతాలు చూచాయగా గుర్తున్నాయి. పాలేర్ల పెళ్లాల మీద అత్యాచారాలు చేసి, గర్భవతుల్ని చేసిన వాళ్ళూ వున్నారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళ పిల్లల్లో తమ పోలికలు చూసుకుని ముఖాలు మాడ్చుకున్న వాళ్ళూ  వున్నారు. ఇవన్నీ నాకు పెద్దయ్యాక తెలిసిన నగ్న సత్యాలు.    వీటికి, మా వూరిలో నాకున్న అనుబంధానికి ఏం సంబంధం లేదు. పైరు పచ్చల్తో కళ కళలాడే మా ఊరు, ఎత్తైన అరుగుల్తో గంభీరంగా వుండే మా యిల్లు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా వుంటాయి.
     ఇవండి మా ఊరి సంగతులు. ఇవన్నీ చదివేక మీరు నా బాల్యానుభవాలని ఆడపిల్ల మగపిల్లాడు సున్నితపు తాసులో కొలుత్తారని నాకు తెలుసండి. కల్లు తాగడాలు, సరుగుడు సిగరెట్లు పీల్చడాలు, గొడ్డళ్ళతో కట్టెలు కొట్టడాలు, చిటారుకొమ్మల్లోకి ఎగబాకడాలు, చేపల్ని పట్టుకోవడాలు ఇయ్యన్నీ జనం దృష్టిలో మగానుభవాలు. మగపిల్లలు మాత్రమే చేయల్సిన పనులు. ఆడపిల్లలక్కూడా ఇలాంటి బాల్యం వుంటుందంటే నమ్మరేమో! మనోళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఎచ్చనగాయలూ, వోమన గుంట్లూ ఆడాలి. లక్కపిడతలాటలూ, బొమ్మల పెళ్ళిళ్ళాటలు ఆడాలి. అమ్మలెనక వొంటింట్లో తిరిగి వొంటల్నేర్చుకోవాలి. తమ్ముళ్ళని  చెల్లెళ్ళని  ఎత్తుకు మోయలి. అడ్డగాడిదలు అన్నలు, తమ్ముళ్ళు తిని తేన్చిన కంచాలు ఎత్తాలి. వినయ విధేయతల్తో నడుములు, మెడలు వొమ్చేసి పెళ్ళికి సిద్ధంగా వుండాలి. అంతేకాని నాలాగా స్వేచ్ఛగా, పక్షిలాగా బయటే తిరగడం, నా కిష్టమైన  అన్ని పనుల్ని అడ్డూ, అదుపూ లేకుండా చేసేయడం అబ్బో! చాలా మందికి కంట్లో నలకపడ్డట్లే.
    చివరగా మా దొంగతనాల సంగతుల్జెప్పేసి ముగించేత్తానండి. మా వూర్లో బోలెడన్నిమామిడి తోటలున్నాయని చెప్పేనుకదండి. పచ్చిమామిడికాయలు మాకు బాగానే దొరికేవి కాని పండ్లు చిక్కేవి కాదు. మామిడి కాయల్ని ఎడ్లబండి మీద తీసుకొచ్చి మా తాతకు అప్పచెప్పేవోరు. మా తాత వాటన్నింటిని ఓ పెద్ద గదినిండా పోయించి పండింతర్వాత, కొంచం కొంచం డాగుపడ్డ పళ్ళనే బయటకు తెచ్చి ఇచ్చేవోడు. మాకు చాలా కోపమొచ్చేది. ఒక్క మంచి పండు ఇయ్యొచ్చు కదా అనుకునేవోళ్ళం. చచ్చినా ఇచ్చేవోడు కాదు. మరి మేం తక్కువోళ్ళమా? సరుగుడు కర్రల చివర్న సూదివాటంగా చెక్కి కిటికీల్లోంచి  పళ్ళు లాగేసేవోళ్ళం. ఆ గది కిటికీకి రెండు చువ్వల్లేకపోవడం మా పనెంతో సులువుగా అయిపోయేది. బోలెడన్ని మామిడి పండ్లు దొంగతనంగా లాగేసి తినేసేవోళ్ళం. మామిడిపండ్లు ఏమైపోతున్నాయో అర్తం కాక మా తాత జుట్టు పీక్కునేవోడు. ఇక మారెండో దొంగతనం భోగిమంటల కోసం దుంగలు ఎత్తుకురావటం. పొయ్యికిందికి దాచుకున్న కట్టెల్ని ఎత్తుకొచ్చి  భోగిమంటల్లో పడేసేవోళ్ళం. ఓసారి పెద్ద గొడవైపోయింది. రామాయమ్మని ఒకామె వుండేది. ఆమె పోట్లాట మొదలెట్టిందంటే ఓ పగల ఓ రాత్రీ నడిచేది. చెంబునిండా నీళ్ళు పెట్టుకుని అవి తాగుతూ మరీ తిట్టేది. దుంగలెత్తుకొచ్చామని మమ్మల్ని దుంపనాశనం తిట్లెన్నో తిట్టి మా చిన్నానతో కొట్టించింది.
     ఇలా రాసుకుంటపోతే ఈ వ్యాసం కొండపల్లి చెంతాడంత పొడుగైపోతాది. అవకాశం దొరికితే తరువాయి భాగం మళ్ళెప్పుడన్నా వినిపిస్తాలెండి. ఇంకా చానా సంగతులున్నాయి మరి.
     నేను ఇప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేసాను. ఏభై ఏళ్ళు వచ్చేసినా నా బాల్యం నా కళ్ళకి నవనవోన్మేషంగా కన్పిస్తూనే వుంటుంది. నా పెదాల మీద తురాయి పువ్వుల్ని పూయిస్తూనే వుంటుంది. మ ఊరు జున్నుముక్కలా నన్ను ఊరిస్తనే వుంటుంది. మా సపోటతోట నూతిలోని తెల్లని కలువపూలు నన్ను రా రమ్మని పిలుస్తనే వుంటాయి.
    మరింక శెలవుచ్చుకుంటానండి. మా ఊరంటే మీకూ ప్రేమ పుట్టే వుంటుంది. మీరందరూ కూడా మా ఊరిని, నాకు ప్రాణప్రదమైన మా సీతారామపురాన్ని ప్రేమించాలని కోరుకుంటూ....

Wednesday, September 10, 2008

మంచుపల్లకీలెక్కించొద్దు

తల్లులదినం...మదర్స్‌ డే. ఇటీవలే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటర్నెట్‌లో లక్షల సంఖ్యలో మదర్స్‌ డే మీద వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. కనీసం ఆరోజైనా - ఐ లవ్యూ మామ్‌.. అని చెప్పమనే సందేశాలు కుప్పలుతెప్పలుగా వెబ్‌సైట్లనిండా వుంటాయి. తల్లుల త్యాగాలను కీర్తించే కవిత్వం... అబ్బో... నెట్‌నిండా పొంగిపొర్లుతోంది. మరిక లోటేంటి?.. తల్లుల గురించి ఇంత వీరలెవల్లో కీర్తిస్తుంటే సంతోషించక ఈ సన్నాయి నొక్కులేంటి అనిపిస్తోంది కదా..
మాతృత్వంలోనే వుంది ఆడజన్య సార్ధకం. అంటూ తల్లితనాన్ని ఆకాశానికెత్తేయడం వెనక పిల్లలు కనలేని స్త్రీలను అవవనించడం అంతర్లీనంగా వుందన్న విషయం ముందు అర్థం చేసుకోవాలి. మాతృత్వాన్ని పోటీలుపడి పొగిడే పురుషపుంగవులు పితృత్వం గురించి ఒక్కమాట కూడా ఎందుకనరో ఆలోచించగలగాలి.
సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పనిని పునరుత్పత్తి శక్తి ద్వారా స్త్రీలు మాత్రమే చేయగలరు. అఫ్‌కోర్స్‌... పురుషుల పాత్ర లేకుండా ఈ పని జరగనప్పటికీ తొంభై శాతం బాధ్యత స్త్రీమీదే వుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసే మాతృత్వ ప్రక్రియను మాటల్లో కోటలు దాటించడం తప్ప ఆచరణలో అంతా అవహేళనే. స్త్రీ గర్భం ధరించిన క్షణం నుంచి కంటికిరెప్పలా కాపాడాల్సిన కుటుంబంగాని, సమాజంగాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని తమ తమ బాధ్యతల్ని ఏ రోజూ సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు.
గర్భం ధరించినప్పటి నుంచి ఆమె శరీరంలో చోటు చేసుకునే మార్పుల గురించి గాని, ఆమె మానసిక కల్లోలాల గురించి గాని ఎవరికీ పట్టదు. శ్రామిక మహిళల విషయమైతే మరీ అన్యాయం. పురుడు పోసుకునే ముందురోజు వరకు శ్రమ చెయ్యవలసిన్దే. కుటుంబ సభ్యుల కంచాల్లోకి అన్నం తేవాల్సిందే. పురిటి గాయలు మానకముందే పనిలోకి చొరబడాల్సిందే. మనం మహాఘనంగా కీర్తించుకునే మాతృత్వ మాధుర్యాలు, మాతృమూర్తుల దినోత్సవాలు వీరి దరిదాపులకు కూడా చేరని విషయాన్ని మనం గుర్తించడానికి నిరాకరిస్తాం. తల్లిపాల దినోత్సవాలను ఫుల్‌సైజ్‌ పేపర్‌ ప్రకటనలతో ఘనంగా జరుపుకుంటాం గాని బిడ్డకి కడుపునిండా పాలివ్వనివ్వని క్రూరత్వాల గురించి అస్సలు పట్టించుకోం.
పురిటి నొప్పుల గురించి , ప్రసవ వేదన గురించి అనుభవించిన వాళ్ళు మాత్రమే రాయగలరు.. చెప్పగలరు. పొరపాటున ఎవరైనా లేబర్‌ రూమ్‌లోని ప్రసవవేదన గురించి కవిత్వమో, కథో రాస్తే వాళ్ళు మాతృత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళుగా ప్రచారం చేస్తారు తప్ప, వాళ్ళు వర్ణించినదానిలో వాస్తవం గురించి చచ్చినా బుర్రకెక్కించుకోరు. మాతృత్వం చుట్టూ అల్లిన ఒక మిత్‌ మాతృత్వాన్ని గ్లోరిఫై చేస్తుందే గాని అందులోని బాధల గాధలను వర్ణించదు. ఈ మిత్‌ని బద్దలు కొట్టింది స్త్రీవాదులే. లేబర్‌ రూమ్‌లోని వేదనామయ ప్రపంచాన్ని సాహిత్యంలో ఆవిష్కరించింది స్త్రీవాద రచయిత్రులే. స్త్రీల శరీరాల్లో జరిగే మార్పులు సమస్తాన్నీ, ఆఖరికి రుతుక్రమంతో సహా అక్షరాల్లో నిక్షిప్తం చేయడంతో సాహిత్యంలో మొదటిసారి చాలా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. స్త్రీలు తమ అనుభవాల్ని, తమ ఆవేదనలను అక్షరీకరించి ప్రపంచం ముందు పెట్టినప్పుడు, ఆర్తిగా, ఆత్మీయంగా అర్థం చేసుకున్నవాళ్ళు బహుకొద్దిమంది. దాడికి దిగి, విష ప్రచారంతో మానసికంగా గాయపరిచినవాళ్ళే ఎక్కువ.
ఈ మధ్యనే ఒక తల్లి గుండెల్ని చీల్చుకుని వచ్చిన బాలింత డిప్రషన్‌ గురించి ఒక దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివినప్పుడు కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయ్యింది. చెప్పలేని ఒక ఉద్వేగం మనసంతా కమ్మేసింది. ఆ డిప్రషన్‌లో ఆ తల్లి తన కూతురితో సహా రైలుకెదురుగా నడిచిన సందర్భం గురించి చదువుతున్నప్పుడు గుండె అదిరినట్లయింది. ఆమె అలాంటి తీవ్రమైన మానసిక అలజడి నుంచి బయటపడి ఈరోజు విజయవంతమైన ప్రచురణలో నిలదొక్కుకోవడం నిజంగా అద్భుతమే. ఈ విషయన్ని ఎందుకు చెబుతున్నానంటే తల్లి పాత్రలో ఇమిడిపోయే ప్రతి స్త్రీ ఇంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మానసిక అలజడికి శారీరక మార్పులకు గురవుతుంది. దీనిని అర్థం చేసుకుని ఆసరాగా నిలిచే సపోర్ట్‌ సిస్టమ్స్‌ ఏవీ లేవు. పైగా వాటిని గురించి అవహేళన, నిర్లక్ష్యంతో నిండిన ధోరణే కుటుంబ సభ్యుల్లోను,సమాజంలోను వుంది. బిడ్డకు చెయ్యల్సిన చాకిరీ, నిద్రలేమి, బయటి ప్రపంచానికి దూరమై, ఇంటి నాలుగ్గోడలకే అతుక్కుపోవడం లాంటివన్నీ ఆ మాతృమూర్తిని ఎంత నలిపేస్తాయె ఎవరూ అర్థం చేసుకోరు. ఆడపుట్టుక పుట్టినందుకు ఇవన్నీ చాలా సునాయసంగా ఎక్కడా వ్యతిరేకించకుండా నల్లేరు మీద బండిలా నడిపించుకెళ్ళిపోవాలని అందరూ ఆశిస్తారు గాని వాస్తవ సమస్యల గురించి పట్టించుకునే పద్దతే లేదు.
మాతృమూర్తుల దినోత్సవాలు జరుపుకోవడం గ్రీటింగుల ద్వారాను కాదు. పైపై నుంచి పొంగుకొచ్చే కవిత్వాలతో అసలే కాదు, మానవ జాతిని వృద్ధి చేసే మహత్తర కార్యాన్ని భుజాలకెత్తుకుని, ప్రకృతి తనకు మాత్రమే ప్రసాదించిన గురుతర బాధ్యతను ఎంతో నిష్టతో, ఇష్టంతో కొనసాగిస్తున్న సమస్త స్త్రీ జాతికి ప్రపంచం మొత్తం రుణపడి వుంది. మాతృత్వాన్ని మాటల మాయజాలంతో కీర్తించడం కాక, ఆమె బాధ్యతల్లో మనస్స్ఫూర్తిగా, ప్రేమగా, ఆత్మీయంగా, పాలు పంచుకోవాల్సిన అవసరం వుంది. బిడ్డల బాధ్యతను అంగీకరించగలిగే వున్నత సంస్కారం అలవర్చుకోవడం ఈనాటి తక్షణావసరం. మాతృత్వ మాధుర్యం గురించే కాదు, పితృత్వ మాధుర్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతేగాని, స్త్రీలను, వారి జవజీవాలను పీల్చి పిప్పి చేసే చాకిరీల సమస్తం గురించి మాట్లాడకుండా ముఖం చాటేసి - మాతృమూర్తుల దినోత్సవాలు జరుపుతాం... మమ్మల్ని మంచుపల్లకీల్లో ఊరేగిస్తాం అంటే నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు.

Monday, September 1, 2008

ఉదయపు వర్షం ఎంతో హర్షం

తెల్లవారనే లేదు
పిట్టలింకా కన్ను తెరవనే లేదు
చెట్ల మీద మంచు ఇంకా ఆరనేలేదు
నా కళ్ళమీంచి దూకుతున్న సెలయేళ్ళు
ఉదయాన్నే వచ్చిన వర్షపు ధారలు
నన్ను నిలువెల్లా తడిపేసి
కిల కిలా నవ్వుతుంటే
ఆ సందడికి లేచిన పిట్టలు
తామూ గొంతు కలిపాయి
ఓ పక్క వర్షధారలు
మరో పక్క కలకూజిత రాగాలు
నాకేమో కళ్ళమ్మట ఆనంద భాష్పాలు.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...