Wednesday, September 18, 2013

నాకొచ్చిన కొత్త ఆలోచన

ఈ రోజు నేను గీత (నా నేస్తం)లంచ్ చేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటుంటే....... 
హఠాత్తుగా నా బుర్రలోకి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
ఉదయం లేచిన దగ్గర నుండి ఇంటింటికీ ఎన్నో అవసరాలుంటాయి.
ఎన్నో సర్వీసులు కావాల్సుంటుంది.
పెద్దవాళ్ళు,వ్యాధిగ్రస్తులై మంచాన పడ్డవారికి హోం నర్సులు,
ఇంట్లో సహాయం చెయ్యడానికి హౌస్ మెయిడ్స్,వారం వారం ఇల్లు శుభ్రం చెయ్యడానికి హౌ కీపర్,
తోటని చూసుకోవడానికి గార్డనర్,
కార్ డ్రైవ్ చెయ్యడానికి డ్రైవర్,
ఎలక్ట్రీషియన్,ప్లంబర్,మేస్త్రి,
వంట చేసి పెట్టడానికి కుక్,
రకరకాల బిల్లులు కట్టడానికి సహాయం,
ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో సహాయాలు,సర్వీసులు అవసరముంటుంది.
హైదరాబాదు మురికివాడల్లో చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్న యువతీ యువకులు లక్షల్లో ఉంటారు.
వాళ్ళల్లోంచి ఎంపిక చేసుకుని,శిక్షణ నిచ్చి, పైన పేర్కొన్న సర్వీసుల్లో వాళ్ళ సేవల్ని వినియోగిస్తే ఎలా ఉంటుంది అనేదే నాకొచ్చిన ఆలోచన.
ఒక కాల్ సెంటర్ మొదలుపెట్టి,డాటా బేస్ మెయింటైన్ చేస్తూ ఎవరికి కావాల్సిన సర్వీసులు వాళ్ళకి అందేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను.
మొదట ఒక పదిమంది తో ఒక నియమిత ప్రాంతం లో మొదలుపెట్టాలని నా ప్లాన్.
అమ్మాయిలకి అన్ని రకాల శిక్షణలు ఇప్పించి సెల్ఫ్ సస్టైన్ చేస్తే వాళ్ళకి ఆత్మవిశ్వాశం పెరుగుతుంది.
ఒక్క ఫోన్ కాల్ తో మీక్కావాల్సిన సర్వీసులు మేమిస్తాం మా సంస్థ లో రిజిస్టర్ చేసుకోమని కోరతాం.
అలాగే అయా రంగాల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళ వివరాలు మేము సేకరిస్తాం.వాళ్ళు కూడా మాసంస్థలో రిజిస్టర్ చేసుకుంటారు.
అలాంటి వారికి మేము ఐడెంటిటి కార్డ్ ఇష్యు చేస్తాం.
భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేసి చాలా అమంది జాబ్స్,పని అడుగుతుంటారు.
బాధితులకి ప్రిఫరెన్స్ ఇస్తాం.
క్రమం గా రైన్ బో హోంస్ లో అమ్మాయిలను,షల్టర్ హోం లలో ఉన్న బాధిత స్త్రీలను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి ఆయా పనులు చేసుకొని సొంతంగా బతికేలా ప్రోత్సహిస్తాం.
ఇలా ఎన్నో ఆలోచనలొస్తున్నాయ్.
నా ఆలోచనలను మీతో పంచుకోవాలనిపించింది.
మీరు ఇచ్చే సలహాలను తీసుకోవాలనిపించింది.
నా ఆలోచనని ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకువస్తాను.
నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు.
పూనా మునిసిపల్ శాఖ ఒక కాల్ సెంటర్ నడుపుతున్నదని విన్నాను.
దయచేసి మీ సలహాలు, సూచనలు పంచుకోండి.

Sunday, September 15, 2013

కర్నూల్ లో ఉన్న పది రోజుల్లో.........

కర్నూల్ లో ఉన్న పది రోజుల్లో నా చుట్టూ ఉన్న ప్రకృతి
ఎన్ని భిన్న కోణాల్లో కనిపించిందో,నా లోపల ఎన్ని అనుభవాలను నింపిందో
వర్ణించలేను కానీ చూపించగలను.
క్షణానికో అనుభవం,నిమిషానికో అనుభూతి.
ఆకాశం పగలు ఎంత అద్భుతంగా ఉంటుందో రాత్రి మరింత అందంగా ఉంటుంది.
పగలు రాత్రి తేడా తెలియని ఉద్విగ్నం లో మునిగిపోయాను.
ఎన్ని నదుల్ని చూసాను....క్రిష్ణ, తుంగభద్ర, హంద్రి.....
ప్రకృతిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను కానీ ఇప్పుడు మరింత గాఢమైన ప్రేమలో పునీతమౌతూ.......

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...