Friday, June 25, 2021

సృజనాత్మకత ఉట్టిపడే అబ్బూరి చాయాదేవి గారు


ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, "తనమార్గం" కధల సంపుటికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందిన అబ్బూరి చాయా దేవి గారు ఇటీవల బాగలింగంపల్లి లోని తన ఇంటిని అమ్మేసి కొండాపూర్ లోని చండ్ర రాజేస్వర రావ్ ఫౌండేషన్ వృద్ధాప్య కేంద్రంలో చేరారు. బాగలింగంపల్లి లో చక చకా తిరుగుతూ అన్ని పనులూ చేసుకుటూ తిరిగేవారు.
ఓ రోజు హఠాత్తుగా నిర్ణయం తీసుకుని ఇల్లు అమ్మేసి కొండాపూర్ వచ్చేసారు.
భూమిక ఆఫీసు ఉన్నది బాగలింగంపల్లి లోనే కాబట్టి తరచుగా ఆఫీసుకు వచ్చేసేవారు.నేనూ రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని.
ఆవిడ షిఫ్ట్ అయ్యాకా ఒక సారి వెళ్ళాను కానీ ఆవిడ అప్పటికి రూం సర్దుకోలేదు.
ఈ రోజు సాయంత్రం చల్లగా వాన పడుతున్నవేళ చాయా దేవి గారిని చూడ్డానికి వెళ్ళి నా కళ్ళను నేను నమ్మలేక పోయాను.
తన రూం నూ ఎంత అద్భుతంగా అలంకరించుకున్నారో మీరే చూడండి.
ఎనభైలలోకి ప్రవేశిస్తున్న ఆవిడ కళా హృదయం,సృజనాత్మక శక్తికి జేజే లు చెప్పి తీరాలి.
అక్కడికెళ్ళిన ఈ నెల రోజుల్లో ఆవిడ ఎన్నో బొమ్మలు చేసారు.మదర్ థెరిస్సా,రవీంద్రనాధ్ ఠాగూర్,గురజాడ లాంటి ప్రముఖుల బొమ్మలు తయారు చేసారు.
చాయా దేవి గారు చేటలో చేసిన చాట భారతం చూసి తీరాలి.
కేంద్రం వారిచ్చిన పరుపును చూడండి ఎంత కళాత్మకంగా అలంకరించారో.
తన రూం ముందు తన పేరు,పోస్ట్ బాక్ష్ చూడండి.
స్పూర్తిదాయకమైన ఆవిడ జీవన శైలి అబ్బురపరుస్తుంది.అనుసరించాలనిపిస్తుంది.
నాకు ఎంతో ఆత్మీయురాలైన చాయా దేవి గారితో అందమైన ఆవిడ గదిలో ఓ గంట సేపు గడిపి నేను మా ఇంటికి బయలుదేరాను.
కొంత మంది తామెక్కడున్నా పరిసరాలను తమకు కనుగుణంగా మలుచుకుంటారు.
అలాంటి వారిలో అబ్బూరి వారు అగ్రగణ్యులు.
(అబ్బూరి చాయా దేవి గారు సి ఆర్ ఫౌండేషన్ లో చేరినప్పుడు నా బ్లాగ్ లో రాసాను ఇది.
ప్రస్తుతం ఆవిడ మళ్ళీ రూం మారానని నన్నొక సారి రమ్మని ఫోన్ చేసారు.
ఎఫ్ బి లో కొత్త మితృల కోసం ఈ పోష్ట్.
రేపో ఎల్లుండో చాయాదేవిగారి దగ్గరకెళ్ళాలి.)
Padma Vangapally, Sudha Goparaju and 54 others
2 Comments
Like
Comment

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...