Friday, June 25, 2021

చిమ్మచీకటి చుక్కలపాడులో సూర్యకాంతి వెలుగులు



చింతూరు అటవీ ప్రాంతంలో ఏడుగుర్రాలపల్లి దగ్గరున్న చుక్కలపాడు అనే గ్రామం ఎన్నో సంవత్సరాలుగా కరెంట్ లేకుండా చుక్కల వెలుగులోనే ఉంటున్నది.సాయంత్రం అయితే చిక్కటి చీకటి అలుముకుంటుంది.చుట్టూ కొండలు,అడవి.ఎన్నో సంవత్సరాల క్రితం చత్తీస్ఘడ్ నుంచి వలసవచ్చిన గుత్తికోయలు చుక్కలపాడులో బతుకుతున్నారు.
మొన్న ఫిబ్రవరిలో నేనూ ,ప్రశాంతి ఆ గ్రామానికి వెళ్ళాం.
అక్కడ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేసాం.
ఆ తర్వాతి నెలలో చుక్కలపాడు గ్రామం లో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక సోలార్ లైట్ ఇచ్చాం.అప్పుడు నేను వెళ్ళలేకపోయాను.ప్రశాంతి వెళ్ళి వాళ్ళకి సోలార్ లైట్స్ గురించి అన్ని వివరించి అందరికీ ఇవ్వడం జరిగింది.
నేను ఏప్రిల్ నెలలో వెళ్ళాలనుకున్నాను కానీ కరోనా ఉధృతి మళ్ళీ పెరగడం,మా అన్న అనారోగ్యం వీటి వల్ల వెళ్ళలేకపోయాను.
సోలార్ లైట్స్ వెలుగులో చుక్కలపాడు ఎలా వెలుగుతుందో చూడాలనే కోరిక ఇంతకాలం తీరనే లేదు.
అయితే నిన్ననే చింతూరు ప్రాంతంలో గ్రామ పోలీసుగా పనిచేస్తున్న ఒకమ్మాయి నిన్న రాత్రి ఆ గ్రామానికివెళ్ళి కొన్ని ఫోటోలు పంపించింది.
ఆ వెలుగులు చూసి చాలా సంతోషం కలిగింది.
ఎన్నో సంవత్సరాల చీకటి దాదాపు లక్ష రూపాయల ఖర్చుతో పరారైపోయింది.నా నాలుగు నెలల పెన్షన్ డబ్బు ఇలా సద్వినియోగమైంది.
ప్రశాంతి మరో రెండు గ్రామాల్లో కూడా పంచింది కానీ ఆ ఫోటోలు ఇంకా రాలేదు.
జీవితంలో ఇలాంటి అపూర్వమైన ఆనందం అరుదుగా దొరుకుతుంది.
డబ్బు దానంతట అది సంతోషాన్నియ్యదు.
సద్వినియోగం అయినప్పుడే
అరుదైన ఆనందాన్ని జెనరేట్ చేస్తుంది.
అదెలా అంటే ఇలాగన్నమాట.
*******************************
తొలిసారి చుక్కలపాడు వెళ్ళినప్పుడు నేను ఇలా రాసాను
చదువు లేకుండా, కనీసవసతులు లేకుండా మనలాంటి మనుష్యులు ఇంకా బతుకుతున్నారు. ముఖ్యంగా కరెంటు లేకుండా. అడవి మధ్య లో చిమ్మచీకటిలో. నువ్వు వాళ్ళ విద్య గురించి ఆలోచిస్తుంటే నేను ఆ గ్రామాన్ని వెలిగించాలని అనుకుంటున్నాను.అక్కడున్న 29 కుటుంబాలకు ఇంటికొక సోలార్ లైట్ కొనివ్వాలని నిర్ణయించుకున్నాను.మనిద్దరం కలిసి ఈ ఊరికి లైబ్రరీ, సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తే బావుంటుంది కదా.నేను మళ్లీ వెళ్ళేటప్పటికి చుక్కలపాడు గ్రామం లో వాళ్ళ ఇళ్ళల్లో లైట్లు వెలుగుతూండాలని నా కోరిక.) కోరిక తీరిపోయింది.
Rompicharla Bhargavi, Rama Krishna Rao and 31 others
8 Comments
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...