Sunday, May 1, 2011

ఆస్మాన్ మే కభి కభి అకేలే రెహనేకా మన్ లగ్తా హై





(మేం త్వరలో ప్రారభించబోయే ఓపెన్ స్పేసే ఆస్మాన్)

ఆస్మాన్ మనందరి ఆశల హరివిల్లు
వంట ఇల్లులేని ఆస్మాన్
అంట్లు తోమక్కరలేని ఆస్మాన్
బట్టలుతక్కరలేని ఆస్మాన్
బల్లలు తుడవక్కరలేని ఆస్మాన్
కధ రాసుకోవాలనుందా
కవిత్వం కలబోసుకోవాలనుందా
ప్రియ సఖికి ప్రేమ లేఖ రాయాలనుందా
కళ్ళు మూసుకుని కమ్మటి పాటలు వినాలనుందా
ఏ కాగజ్ కి కష్టీ ఏ బారిష్ కీ పానీ
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక
నా చిలుకా ఓ రామ చిలుకా
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఉబికి ఉబికి వెల్లువెత్తే ఈ పాటల్ని వినాలనుందా
ఊరికే అలా కూర్చుని రంగులు మారే
ఆకాశాన్ని చూడాలనుందా
పున్నమి నాటి వెన్నెల్లా,పున్నాగ పూల వర్షంలా
ఒక ఏకాంతం,ఒక నిశ్శబ్దం
నచ్చిన నెచ్చెలి తో ఒక సాన్నిహిత్యం
చట్రాలులేని,సరిహద్దులులేని
అవధుల్లేని అడ్డు అదుపుల్లేని
ఆనందాల గని సంతోషాల పెన్నిధి
మా ఆస్మాన్
ఈ ఆస్మాన్ లో అపుడపుడూ
నన్ను నేను దొరికించుకునే
స్వేచ్చా ప్రపంచం
నాకై నేను సృష్టించుకోబోతున్న
సరికొత్త సంతోష సౌధం
నేనులోంచి మనంలోకి సాగే
మరో మహా ప్రయత్నానికి
మేలిరకమైన బాట మన ఆస్మాన్.

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

చేయ్యలనుకున్నవన్ని స్వేచ్చగా.. చేసేయాలనుకోవడం..నేను..నుండి మనం వరకు.. ఆకాశం మన హద్దు.. అవకాశం వదలొద్దు. బాగుంది..మేడం.. చాలా బాగుంది.ధన్యవాదములు.

maa godavari said...

వనజవనమాల గారూ
థాంక్స్.
అనుకున్నవన్ని చెయ్యడానికే ఆస్మాన్.
మీరూ హైదరాబాద్ వచ్చినపుడు వచ్చెయ్యండి ఆస్మాన్ కి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...