ఈ మొక్క చూసారా?వెదురు బియ్యం మొక్క.కొమ్మలూ,రెమ్మలతో,పొడవైన కంకులతో చూడముచ్చటగా ఉంది కదా?
ఏమి లాభం.ఒక్క బియ్యం గింజని కూడా సంపాదించలేం.
కంకి మాత్రం పొడుగ్గా,సూదివాటంగా ఉంటుంది.
ముట్టుకుంటే చాలు జలజలా రాలిపోతాయి బియ్యపు గింజలు.
గింజ గట్టిగా కొర్రల్లాగా ఉంటుంది.
ఈ బియ్యాన్ని ఎలా జాగ్రత్త చెయ్యాలో ఎవరైనా చెబుతారా???
1 comment:
నేలపైన యేదైన దుప్పటి పరిచి, దానిపైన దులిపి చూడండి.
ఇంతచిన్న మొక్కకే బియ్యం వచ్చాయా? మా పొలం లో పెద్ద పెద్ద వెదురు చెట్లనించి బియ్యం వచ్చేవి. అది కూడా ఆ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా వుంటేనే.
వెదురు బియ్యం తో పరమాన్నం చెసుకుంటే చాలా రుచిగా ఉంటుందని మా పెద్దవాల్లు చెప్పేవారు. కాని ఎప్పుడూ మాకు చేసి పెట్టలేదు.
Post a Comment