మొన్న నేను చంచల్ గూడా లోని మహిళ జైలు కు వెళ్ళాను.
నేను అరెస్ట్ అయ్యి వెళ్ళేననుకునేరు.
జైలులో ఉన్న మహిళల సమస్య లు తెలుసుకునేందుకు,వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఐ జి ప్రిజన్స్ నాకు అనుమతి ఇచ్చారు.
నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జైలుకు వెళ్ళొచ్చు.
మహిళా ఖైదీలతో మాట్లాడవచ్చు.వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యొచ్చు.
దాదాపు వందమందితో మాట్లాడాను.
వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు.కొంతమంది జైలులో ఉన్నట్టు తమ ఇంట్లో వాళ్ళకు తెలియదని వాళ్ళతో చెప్పమని కోరారు.కొంత మంది అప్పీల్ విషయమై అడ్వొకేట్ తొ మాట్లాడమన్నారు.
ఒకామె అయితే తనను తన తల్లిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేరని,తన నాలుగేళ్ళ కొడుకు ఒక్కడూ గుడెసె లో ఉండిపోయాడని,వాడిని వెతికించమని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది.గుడిశె ఎక్కడుంది అని అడిగితే అరే మైశమ్మ గుడి దగ్గర అంది.
నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బండ్లగూడాలోని అరేమైసమ్మ గుడి చుట్టుపక్కల వెతికాను కానీ పిల్లాడు లేడక్కడ.అస్సలు గుడిశే లేదు.పోలీస్ స్తేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికొచ్చేసా.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.
శిక్షలు పడిన వాళ్ళవి ఒక రకమైన సమస్యలు.అండర్ ట్రెయిలర్ లవి భిన్నమైన సమస్యలు.వాళ్ళ కోసం ఎవ్వరూ రాక కొందరు; బెయిల్ ఇప్పించే వాళ్ళు లేక కొందరూ,షూరిటీలు లేక కొందరూ.
వీటన్నిటి మీదా పని చేయాలని ప్రయత్నం.
5 comments:
అయ్యో... వింటుంటేనే బాధ గా అనిపిస్తోంది. ఎలా హేండిల్ చేస్తారో మీరు..
పాపమండీ...ఏమిటో వారి జీవితాలు. మీరు ఇలా వాళ్లతో వెళ్ళి మాట్లాడడం మంచి పని. అది వాళ్ళకి కొంత రిలీఫ్.అందుకు మీకు అభినందనలు.
MEERU MAAKANTE KOTIRETLU MELU.AAMENU,VAALLA AMMANU ENDUKU ARREST CHESHARU?APPUDU PILLAVADU LEDA?POLICELU EMI CHEBUTUNNARU?AA INTI CHUTTUPAKKALAVAALLU EMANTUNNARU?CHALA BHADAGA VUNNADI,MEMU ENCHEYALO CHEPPANDI. GAJULA
gud work.satyavati gaaru.....
>> అండర్ ట్రెయిలర్ లవి భిన్నమైన సమస్యలు.. వీటన్నిటి మీదా పని చేయాలని ప్రయత్నం.
ఓ సమస్య ఇలా పరిష్కరిమ్చబడితే సర్వదా ముదావహం. ఆ మధ్య చదివిన ఓ నవలలో ఈ అంశమై కాస్త ప్రస్తావన, ఆ పరంగా కొందరు లాయర్స్ చేస్తున్న సాయం/ఇస్తున్న సహకారం రచయిత బాగా రాసారు. మీది వెలుపలి నుమ్చి ప్రయత్నం అయినా సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ..
Post a Comment