తెల్లవారుఝామున తొలివేకువ వేళ వర్షంతో పాటు మా ఇంట్లో పొగడపూల వర్షం కూడా కురిసింది.ఒకటా రెండా చెట్టు కిందంతా పరుచుకున్న పూలని ఏరడానికి అరగంట పట్టింది.
నడుం నొప్పి వచ్చింది కానీ పొగడపూలని ఏరడంలో ఉన్న సంతోషం ముందు ఈ నొప్పులెంత?
వర్షం శుభ్రంగా కడిగి మరీ పూలని రాల్చింది.
సువాసనలు వెదజల్లుతూ ఎంత తేటగా ఉన్నాయో చూడండి.
ఈ బొకే చూసారా? నా నేస్తం గీతకి ఇవ్వడానికి నేనే తయరు చేసా.
పొగడపూల బొకే మీరెప్పుడూ చూసి ఉండరు.
పూలతో పాటు సువాసనలూ మీకు పంచే వీలుంటే బావుండు.
7 comments:
Lucky geetha...your friend! ;-)
నాకు మీ ఇంటికి రావాలనిపిస్తోంది.. మీ అందమైన తోటలో కూర్చోడానికి :-)thanks for sharing the pictures!
అబ్బ ఎంత బాగున్నాయో .
మీ ఫ్రెండ్ గీతను కాక పోతిని పొగడ పూల బుకేను పొంద .
మధురవాణి గారూ,మాలా కుమార్ గారూ
పొగడపూల సువాసనలు ఆస్వాదించినందుకు ధన్యవాదాలు.
మా ఇంటికి వచ్చేయండి మరి.బోలెడన్ని పూలు మీకు ఇచ్చేస్తా.
మీ మీ ఇళ్ళు ఎక్కడో చెప్పేస్తే నేనే పొగడపూలతో ప్రత్యక్షమౌతా.
మా ఇల్లు కుందన్ బాగ్ లో ఉంది.
Super.. Wonderful pictures!
మూడేళ్ళ కిందట జూలై రెండున సత్యవతి నాకు పంపిన పొగడపువ్వుల గ్రీటింగ్ కార్డ్ ఇంకా పదిలంగా వుంది.పువ్వులతో సహా
సత్యవతి
అబ్బ ఎంత బాగునాయో పొగడ పూలు. గీత నైనా కాక పోతిని బొగడ పూలను పొందక. ఆ గడ్డినైనా కాక పోతిని గాలి పూలను రాల్చగా... చాలా......................చాలా బాగున్నాయండీ, కంప్యూటర్ లోనుంచి మంచి వాసనొస్తున్నాయేంటో..
దేవుళ్ళని నమ్మే వారు దీనినే అదృష్టము అంటారు. మీరు అద్రుష్టవంతులవ్వడము మా అదృష్టము. ఎన్నో వందనాలు మీ అభిమానానికి!
Post a Comment