హబ్బో ! ఎన్నెన్ని గాలిపటాలు,ఎన్నెన్ని రంగులు,ఎంతెంత అల్లరి,అరుపులు,కేకలు ఎంత కోలాహలమో !
తెగిన గాలిపటాల కోసం కుర్రాళ్ళ ఉత్సాహం.
ఒక్క అమ్మాయీ లేకపోవడం ఎంత నిరుత్సాహామో నాకు.
ఒకే ఒక్క ఆడపిల్ల కనబడి ఫోటో తీస్తానంటే ఇలా ముఖం దాచేసుకుంది.
అమ్మాయిలూ! ఎగరెయ్యండి ఆకాశమే హద్దుగా.
హాయిగా ఎగురుతున్న పతంగుల్ని చూస్తున్నానా
ఆదమరిస్తే మాంజా మెడకి చుట్టుకోవడం ఖాయం.
మీ కోసం కొన్ని ఫోటోలు
సీసాపెంకులు నూరి తయారు చేసిన మాంజా మెడకి తాకితే ఇంతే సంగతులు చిత్తగించవలెను
Thursday, January 14, 2010
Tuesday, January 12, 2010
రుచిక కేసు - రేపుతున్న ప్రశ్నలు
ఒక జెసికాలాల్, ఒక అరుషి, ఒక స్వప్నిక, ఒక రుచిక. ఎవరు వీళ్ళంతా? ఏం జరిగింది వీళ్ళకి. ఈ సంవత్సరాంతాన ఎందుకు వీళ్ళను తలుచుకోవలసి వస్తోంది. వీళ్ళంతా ఎందుకు అర్ధాంతరంగా చనిపోయారు? చనిపోలేదు. చంపేయబడ్డారు. కళ్ళ ముందు వరుస క్రమంలో నిలబడి నన్నెందుకు ఇంతటి మానసిక క్షోభకి, ఆపుకోలేని దు:ఖానికి గురి చేస్తున్నారు. అదుపు చేసుకోలేని కోపంతో నా కలం కూడా వొణుకుతోంది. ఏం తప్పు చేసారని వాళ్ళు మరణం అంచులవేపు నెట్టేయబడ్డారు. ఈ దేశంలో ఆడదానిగానో, ఆడపిల్లగానో పుట్టడమే వాళ్ళ నేరమా? ఇంకా ఎంతమందిని ఇలా చంపేస్తారు? చంపేసిన వాళ్ళని శిక్షించరా? శిక్షలు పడవని తెలిసేకదా చంపేస్తున్నారు.
నేను ఢిల్లీలోని కుతుబ్ హోటల్ రూమలో టి.వీ ముందు కూర్చుని, ఆనాటి సమావేశపు బడలిక నుండి సేద తీరుతున్నవేళ రుచిక కేసుకు సంబంధించిన తీర్పు గురించిన వార్తను చూసాను. పద్నాలుగు సంవత్సరాల పసిపిల్ల రుచిక లైంగిక అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 19 సంవత్సరాల తర్వాత వెలువడిన తీర్పు గురించిన వార్తను చూసాక నా గుండె ఒక్కసారిగా జలదరించినట్టయింది. నిందితుడు, అప్పటి హర్యానా ఐజి ఎస్.పి.ఎస్‌్. రాధోడ్ నవ్విన నవ్వు, వెకిలి, విషపు నవ్వు నా కళ్ళల్లోంచి కదలడం లేదు. భారతదేశ న్యాయవ్యవస్థ భాగోతం మీద రాధోడ్ ధిక్కార, నిర్లక్ష్యనవ్వు. నన్నెవరేం చెయ్యలేరు అనే పొగరుబోతు నవ్వు. పసిపిల్ల మీద దున్నపోతులా లైంగిక వేధింపులకు పాల్పడిన రాధోడ్, దున్నపోతు మీద వాన కురిసినట్టే న్యాయవ్యవస్థ ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళి పోయాడు. కేవలం ఆరునెలల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా. ఘనత వహించిన కోర్టువారు వెంటనే ఉదారంగా బెయిల్ కూడా మంజూరు చేసేసారు. పై కోర్టులో అప్పీల్ చేస్తానంటూ దున్నపోతు కోర్టు నుండి జారిపోయింది.
ఈ ఉదంతం మనిషన్న వాడిని మండించకుండా వుంటుందా? తన ప్రాణ స్నేహితురాలి తరఫున ఇరవై సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న ఆరాధన దు:ఖాన్ని ఎవరు అర్ధం చేసుకుంటారు? ఎవరు ఓదార్చుతారు? స్త్రీలమీద పదే పదే జరుగుతున్న ప్రాణాంతక దాడులు, లైంగిక అత్యాచారాలు, యాసిడ్ పొయ్యడాలు పెచ్చరిల్లి పోతూనే వున్నాయి. నిందితులు రాజకీయ అండబలంతో, డబ్బు కండకావరంతో, ఏళ్ళు పూళ్ళూ సాగే న్యాయవిచారణా వ్యవస్థ, అవినీతిలో మునిగితేలే పోలీసు వ్యవస్థల వల్ల చట్టం నుండి సునాయాసంగా తప్పించుకుపోతున్నారు. శిక్షించని న్యాయవ్యవస్థ వల్ల అత్యాచారాలకు గురౌతున్న స్త్రీలు తామే అంతమౌతున్నారు తప్ప నిందితులు కాలరెగరేసి, వెకిలి నవ్వులు నవ్వుతూ సభ్య సమాజంలో మిన్నాగుల్లా తిరుగతూనే వున్నారు మళ్ళీ మళ్ళీ కాటేేస్తూనే వున్నారు.
1990 ఆగష్టు పన్నెండు. కోటి ఆశలతో టెన్నిస్ తారనవ్వాలనే బలమైన ఆకాంక్షలతో అప్పటి హర్యానా ఐజి మరియు హర్యానా లాన్ టెన్సిస్ అధ్యక్షుడు రాధోడ్ ఆఫీసులో అడుగుపెట్టింది రుచిక. తన ఫ్రెండ్ ఆరాధనని వెంట తీసుకెళ్ళింది. ఆరాధనని బయటకు పంపి 14 సంవత్సరాల రుచికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు రాధోడ్. తిరిగి వచ్చిన ఆరాధనకి జరిగిన ఘోరాన్ని చెప్పింది రుచిక. ఆగష్టు 18న పోలీసులకు ఫిర్యాదు చేసారు రుచిక తండ్రి, సోదరుడు. రుచిక స్వదస్తూరితో జరిగిన ఘోరాన్ని రాసిచ్చింది. పోలీసులు కంప్లయింట్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి రాధోడ్ మీద నేరాన్ని ధృవీకరించారు. అప్పటి నుండి రుచిక కుటుంబం తీవ్రమైన వేధింపులకి గురౌతూ వచ్చింది. బెదిరింపులు రావడం, రుచిక ఎక్కడికెళ్ళితే అక్కడికి రాధోడ్ గుండాలు వెంటాడం, రుచిక సోదరుడి మీద కారు దొంగతనాలు అంటగట్టి అరెస్ట్ చేయడంలాంటి వికృత చర్యలకి రాధోడ్ పాల్పడడం మొదలుపెట్టాడు. ఒకసారి రుచిక సోదరుడిని ఆమె ముందే తీవ్రంగా కొట్టి వేధించాడు. రుచికని స్కూల్ నుండి తీసేసారు. పద్నాలుగు సంవత్సరాల రుచిక ఈ మానసిక వేదనని, వొత్తిడిని తట్టుకోలేక రాధోడ్‌ని తిడుతూ తన జీవితాన్ని నాశనం చేసాడని బిగ్గరగా ఏడ్చేదని తండ్రి చెప్పారు. తనెంత నచ్చ చెప్పినా, ఓదార్చినా వినేది కాదని కళ్ళనీళ్ళ మధ్య పత్రికల ముందు వాపోయాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి లోనై డిశంబరు 29, 93లో రుచిక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆరాధన, ఆమె తండ్రి కలిసి రుచిక ఆత్మహత్యకు కారకుడు రాధోడ్ అంటూ కేసు వేసారు. క్రింది కోర్టు ఈ వాదనని అంగీకరించినప్పటికీ హైకోర్టు అతను నిర్ధోషి అని కితాబిచ్చి వదిలేయడం, ప్రభుత్వం రాధోడ్‌కి డి.జిపిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగిపోయాయి.
ఆరాధన తన పోరాటం ఆపలేదు. 1990 కేసు రిజిస్టరు అయినప్పటికీ 1999 వరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ కాలేదు. రాధోడ్ తన రాజకీయ, పోలీసు ప్రాబల్యాన్ని ఉపయోగించి కేసును ముందుకెళ్ళకుండా చెయ్యడంతో పాటు రుచిక కుటుంబాన్ని చంఢీగడ్‌లో బతకలేని స్థితి కల్పించాడు. డి.జి.పిగా తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించడంవల్ల వారు చంఢీగడ్ నుంచి వెళ్ళిపోయారు. వారి తరఫున, తన స్నేహితురాలి కోసం ఆరాధన ఇరవై సంవత్సరాలు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు డిశంబరు 21, 2009న చిన్నపాటి విజయం సాధించింది. రాధోడ్‌కి కేవలం 6 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది కోర్టు.
నేరం జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత, బాధితురాలు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెకి దొరికిన న్యాయం చూసి గుండెలు బాదుకుని ఏడ్వాలో, పగలబడి నవ్వాలో తెలియడం లేదు. నేరగాడికి సంబంధించి, అతడిని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన రాజకీయ వ్యవస్థ విశ్వరూపం దిమ్మతిరిగేలా చేస్తోంది. నలుగురు ముఖ్యమంత్రులు ఈ నేరస్థుణ్ణి కాపాడుకుంటూ వచ్చిన వైనం కథలు, కథగా, వార్తాపత్రికలు ప్రచురిస్తున్న కధనాలు చదువుతుంటే, ఎంతమందిని ఎన్ని రకాలు ప్రలోభపెట్టి, బెదిరించి తన నేరాన్ని కప్పిపుచ్చుకున్న పెద్ద పోలీస్ రాధోడ్ కౄరమైన, వెక్కిరింత నవ్వు వెన్నులో వొణుకు పుట్టిస్తోంది. స్త్రీల మీద అత్యాచారాలు చేసి, కిరోసిన్ పోసి కాల్చి, యాసిడ్ పోసి రూపాలను చిదిమేసి, ఎన్నో దారుణాలు చేసే పురుషుల్ని, నేరస్థుల్ని, నిందితుల్ని, పురుషాధిక్య సమాజం ఎలా కాపాడుకుంటూ వస్తుందో ‘రుచిక’ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల్లోను పాతుకుపోయిన పితృస్వామ్యం స్త్రీలను ఎన్ని రకాలుగా రాచిరంపాన పెడుతుందో ఈ కేసులో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని నేరాలు చేసినా, కమ్ముకుంటూ, కాపాడుకుంటూ వచ్చే పోలీస్, పరిపాలన, న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు వున్నపుడు రుచికలాంటి పసికూనలు రాధోడ్‌లాంటి రాక్షస పదఘట్టనల కింద నలిగిపోక ఏమైతారు? రాధోడ్ కౄరనవ్వుకి అర్ధం ఇదే.
మరి మనమేం చెయ్యాలి? నిరాశలో కూరుకుపోదామా? నిట్టూర్చి వదిలేద్దామా? ఈ దేశంలో 50 కోట్ల మంది స్త్రీలకి గౌరవంగా, భద్రంగా, హింసారహితంగా బతికేహక్కు వుందని ఎలుగెత్తాల్సిన అవసరం, ఆవశ్యకత మరింత ఎక్కువైందని అర్ధం చేసుకుందామా? రాధోడ్ పురుషులందరికి ప్రతినిధి కాడు. పురుష ప్రపంచమా! పెదవి విప్పండి. మాతో గొంతు కలపండి. పోయేదేమీ లేదు. సమానత్వం వెల్లివిరియడం తప్ప.

Sunday, January 3, 2010
పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.
నిన్న సాయంత్రం మా సెనగ చేలో సాయం సంధ్య కెంజాయనీ,చలచల్లనీ శీత గాలినీ,పచ్చపచ్చని పొలాల తాజాదనాన్ని తనివితీరా ఆస్వాదించి ఇంటికొచ్చానా,
అబ్బో ! తూరుపుదిక్కునుంచి రెండు తొనలు తీసేసిన నారింజ పండులా నిగ నిగలాడిపోతూ విదియ నాటి చంద్రుడు (31 నిండు పున్నమి రోజు కదా)
ఈ ద్రుశ్యాన్ని కళ్ళ నిండా నింపుకొని కమనీయంగా నిద్రపోయానా ,ఉదయం లేవగానే మరో అందమైన అనుభవం నా కోసం ఎదురు చూస్తోంది.
ఇంతకుముందు ఒకటి రెండుగా వచ్చే పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.నేను చల్లిన బియ్యం తింటూ నా కెమేరాకి చిక్కిపోయాయి.
నేను చల్లింది గుప్పెడు బియ్యమే కానీ పిచ్చికలు పంచిన సంతోషం విలువను ఖరీదు కట్టే అక్షరాలు నా దగ్గర లేవు. మీరూ చూడండి కావాలంటే.
Saturday, January 2, 2010
ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్!

ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్.
ఒక చోట పచ్చగా ఒక చోట బంగారు రంగులో మెరిసిపోతూ మా సెనగ చేను
గోధూళి వేళ, సూర్యుడు పడమటి దిక్కున,కొండ వెనక కనుమరుగవతున్న వేళ
సెనగ చేలో,పక్షుల పాటలకి కువ కువ లాడుతూ నేను
మొక్క జొన్న కంకులు ఫైరగాలికి తలలూపుతుంటే
పారవశ్యంలో మునిగి సర్వం మరచిన నేను
భాగ్యనగర శబ్ద కాలుష్యానికి దూరంగా
బంగారు సెనగాచేలో బహు సంతోషంగా నేను
నేను చెప్పేది అబద్ధమనుకుంటే ఈ చాయా చిత్రాలు చూడండోచ్!

Wednesday, December 30, 2009
శాంభవి కేసు లో మేము సాధించిన విజయం
Great news in child Sambhavi case where she was projecred as a goddess.The Chairperson Human Rights Commission Justice Subhashan reddy reserved judgment for 4 days but has said Usha Rani has lied and sambhavi's rights have been violeted,she has been exploited in the name of spirituality and he also said Usha rani tried to take advantage of Potuluri veerabrahmendra swamyis supposed predictions.Ths judge also said that he will order the child to be sent to school and the collector will be asked to ensure this.
Saturday, December 19, 2009
Wednesday, December 9, 2009
యాసిడ్ ఆయుధంగా మారిన వేళ మన కర్తవ్యమేంటి?
డిశంబరు 13 దగ్గరకొస్తోంది. ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ గుండెల్లో అలజడి.. వెన్నులోంచి జరజరాపాకి మెదడును కంపింపచేసిన ఉద్వేగం. వరంగల్‌లో స్వప్నిక, ప్రణీతల మీద యాసిడ్ దాడి జరిగిన రోజు. యావత్తు ఆంధ్రరాష్ట్రం నివ్వెరపోయిన రోజు. ఎన్నో స్వప్నాలతో ఇంజనీరింగు వరకు ఎదిగి, యాసిడ్‌కి బలైన స్వప్నిక గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లని నయనం ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఒక సామూహిక దు:ఖం అందర్ని కమ్ముకున్న సందర్భం. ఆనాటి అరాచక, అమానుష దాడికి సాక్షిగా తన రూపాన్ని కోల్పోయి, గుండె నిబ్బరంతో అనూషలాంటి తనలాంటి బాధితులకు ఆత్మవిశ్వాసం కల్గిస్తున్న ప్రణీత మన కళ్ళెదుట తిరుగుతూ మనకి కర్తవ్యబోధ చేస్తూనే వుంది. సభ్య సమాజం, పౌర సమాజం ఈ విషయమై ఏం చెయ్యాలో చెప్పక చెబుతూనే వుంది. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? యాసిడ్ దాడులు తగ్గాయా? స్వప్నిక మీద దాడి చేసిన ముగ్గురు యువకుల్ని ఎన్‌కౌంటర్ చేసేసి చేతులు దులిపేసుకున్న పోలీసులు మరిన్ని యాసిడ్ దాడులు జరక్కుండా చర్యలేమైనా తీసుకున్నారా? ఎన్‌కౌంటర్‌లో నిందితుల్ని చంపేయడంవల్ల ఈ దాడులేమైనా తగ్గిపోయాయా? లేదు. తగ్గలేదు. మరింత పెరిగాయి. ఈ రోజు యాసిడ్ ప్రేమోన్మాదులకే కాదు స్త్రీల మీద దాడి చెయ్యడానికి ఆయుధంగా మారిన వైనం మనం గమనించొచ్చు.
నిన్నటికి నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ (నిజమాబాద్‌లో) తన భార్య మీద యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రెండో పెళ్ళి చేసుకుని మొదటి భార్య మనోవర్తి అడిగినందుకు అతను ఈ దాడికి తెగబడ్డాడు. ‘రక్షకభటులే’ యాసిడ్‌ను ఆయుధంగా వాడ్డం మొదలుపెడితే స్త్రీలు రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? వరంగల్ ఘటన తర్వాత మన రాష్ట్రంలో వరుసగా ఎన్నో దాడులు జరిగాయి. ఒక్క గుంటూరులోనే ఏడు యాసిడ్ దాడులు జరిగాయి. నిజానికి ఈ దాడులు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితమవ్వలేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13 యాసిడ్ దాడుల కేసులు, ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇవి రోజు రోజుకూ పెరిగే దిశలోనే వున్నాయిగాని తగ్గడం లేదు.
యాసిడ్ దాడి జరిగిన తర్వాత ఆ స్త్రీల పరిస్థితి గురించి, వారి మానసిక వేదన, శారీరక వైకల్యం గురించి ఎవరూ ఆలోచిస్తున్న దాఖలాలు కనపడ్డం లేదు. ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోయి, ఉన్నరూపం కోల్పోయి, కాలిన గాయాల మచ్చలే తోడుగా మిగిలిపోతున్న బాధితుల బాధాతృప్త హృదయాలకు ఊరటనందించే లేపనాలేమీ మనమివ్వడం లేదు. వారి మానసిక ఘర్షణ, షాక్, తీవ్రమైన వత్తిడిని గురించి పట్టించుకోవడం లేదు. ఘటన జరిగిన వెంటనే పెను సంచలనం సృష్టించి, హడావుడి చేసే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆ తర్వాత మహామౌనంలోకి జారిపోతోంది.ఘటనానంతరం బాధితురాలికి అన్ని విధాలా అండగా వుండాల్సిన ప్రభుత్వం నియమాల, నిర్లక్ష్యాల చట్రంలో ఇరుక్కు పోతుంది. ‘చట్టం తన పని’ తాను చేసుకుంటూ పోతుంది’ లాంటి చవకబారు ప్రకటనలతో కాలం గడుపుతుంది. అందువల్లనే కదా ప్రణీత దాతల దయాదాక్షిణ్యాల మీద తన వైద్యం చేయించుకోవలసి వస్తోంది. బాధితులను నూటికి నూరు శాతం ఆర్ధికంగా, సామాజికంగా, వైద్యపరంగా ఆదుకోవలసిన బాధ్యత నిర్ద్వంద్వంగా ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ పని చెయ్యనపుడు సభ్య సమాజం ప్రభుత్వం మీద వత్తిడి తేవాల్సిన అవసరం వుంది. రాజమండ్రిలో అనూష ప్రేమ పేరిట జరిగిన దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి, మెడ మీది నరాల్ని కోల్పోయి నిస్సహాయంగా పరాయివాళ్ళ పంచన బతుకుతున్న వైనాన్ని ఒక ఛానల్ ఇరవై నాలుగు గంటలపాటు చూపించినా బండబారిన మన చర్మాలు, ఘనత వహించిన ప్రభుత్వం వారి చర్మాలు ఒకింత కూడా చలించలేదు. ఇదెంత బాధాకరం? ఇదెంత దు:ఖ కారకం?
యాసిడ్ దాడుల నివారణ కోసం ప్రభుత్వం ఒక ముసాయిదా తయారు చేసిందని, నేడో రేపో ఆర్డినెన్స్ రాబోతుందని వార్తలొస్తున్నాయి. మంచిదే. స్త్రీల మీద హింసల్ని నిరోధించడానికి ఒక దాని తర్వాత ఒకటి చట్టాలు చేసుకుంటూ పోదాం. మరింత కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టుకుందాం. ఎన్‌కౌంటర్లు చేసి చంపేయ్యాలని, మరణశిక్షలు వేసి వీళ్ళని ఏరెయ్యాలని కూడా చాలామంది సెలవిస్తున్నారు. కొత్త చట్టాలు తేవడం ద్వారాను, కఠినమైన శిక్షల్ని అమలు పరచడం ద్వారాను స్త్రీలపై దాడుల్ని, హింసల్ని అరికట్టలేమని చరిత్ర చెబుతూనే వుంది. కొత్త చట్టాన్ని చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అమలులో ప్రదర్శించే నిర్లక్ష్యం సంగతేంటి? గృహహింస నిరోధక చట్టం 2005, వచ్చి మూడేళ్ళయిపోయింది. ఈ చట్టం వల్ల గృహహింస తగ్గిపోయిందా? తగ్గలేదు సరి కదా ఎక్కువైంది. దీనిక్కారణం చట్టం గురించిన ప్రచారలోపం, అమలులో నిర్లక్ష్యం, జుడీషియరీ నిరాసక్తత. అమలులో చిత్తశుద్ధి లోపిస్తే ఎన్ని కొత్త చట్టాలొచ్చి లాభామేంటి??
అలాగని చట్టాలే వొద్దని అనడం లేదు. కఠినంగా శిక్షించే చట్టంతో పాటు, స్త్రీల పరంగా శిలాసదృశ్యంగా, మహాకఠినంగా మారిపోతున్న మానసిక స్థితి, దృక్పధాల మాటేంటి? కత్తులతో కుత్తుకలు కోయడం, యాసిడ్‌తో శరీరాన్ని దహించేయడం, కిరోసిన్ మంటల్లో కాల్చేయడంలాంటి శారీరక హింసలు, ఈటెల్లాంటి మాటలు, చర్యలతో మనసును మెలిపెట్టే, మానసికంగా కుంగదీసే మానసిక హింసల్ని అంతంచేసే చర్యలేవీ మనం చేపట్టడం లేదు. హింస స్త్రీల మనశ్శరీరాలను ఎలా ఛిద్రం చేస్తుందో తెలియచెప్పే పాఠాలని మనం తరగతి గదుల్లోగానీ, తల్లిదండ్రుల మాటల్లోగానీ వినడం లేదు. కత్తులదాడిలో మెడలు తెగి రక్తం స్రవిస్తున్న దుర్మార్గవార్తని ఓ ఛానల్ ”కోతల సీజన్” అని వ్యాఖ్యానించగలిగిందంటే మీడియా ఈ అంశమై ఎంత మొద్దుబారిపోయిందో అర్ధమౌతోంది కదా! మరి మనమేం చెయ్యాలి?
సంస్కారవంతమైన చదువులు, విలువలతో కూడిన సాహిత్యం, మానవీయ కోణాలని ఆవిష్కరించగలిగిన మీడియా, తక్షణం స్పందించే పరిపాలన, సత్వర న్యాయమివ్వగలిగిన న్యాయవ్యవస్థ ఈనాటి తక్షణావసరం. వీటన్నింటి గురించి గొంతు విప్పే సివిల్ సొసైటీ కావాలిప్పుడు. అన్నింటిని మించి అహరహమూ స్త్రీని అణిచివేసి, ఆమె మానవ హక్కుల్ని కాలరాస్తున్న పితృస్వామ్య భావజాలం మీద మనమందరం మన బాణాలనెక్కుపెట్టాలి. అది మాట ద్వారానా, పాట ద్వారానా, సాహిత్యం ద్వారానా, చదువు ద్వారానా, ఉద్యమం ద్వారానా, ఉక్కు లాగా చెక్కు చెదరని ఐక్య ఆచరణ ద్వారానా అన్నది ఎవరి సంస్కారాన్ని బట్టి, ఎవరి దృక్పధాల్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన సమయమిది.

Sunday, November 29, 2009
భూమిక ఆధ్వర్యంలో మహిళలపై యాసిడ్ దాడుల మీద ఒక రోజు సదస్సు
Online edition of India's National Newspaper
Sunday, Nov 29, 2009 The Hindu
‘Sure punishment works better’
Meet on prevention of acid attacks on women comes up with recommendations
Bhumika Women’s Collective and Oxfam India organise day-long meeting
The recommendations will be forwarded to Home Minister P. Sabitha Indra Reddy
HYDERABAD: Fast track courts to expedite cases, compensation to victims through the Collector within stipulated time, special fund for immediate financial help, timely treatment to the victim, cancellation of recognition to the educational institutions that do not constitute committees against sexual harassment, and laws against the gender harassment to be included in the school curriculum are some of the recommendations by the Bhumika Women’s Collective in view of the amendments proposed to the Indian Penal Code as part of the A.P. Criminal Law (Amendment) Act, 2009 to curb acid attacks on women.
The organisation, along with Oxfam India, organised a daylong meeting on ‘Prevention of acid attacks on women’ here on Saturday.
The recommendations resulted from group discussions on the proposed changes to the Act, and the modalities of care and support for survivors.
A sure punishment works better than a stringent punishment, the recommendations read.
Compensation
They also found fault with the proposed link between the compensation and the progress of the case in the court.
The recommendations will be forwarded to the Home Minister P. Sabitha Indra Reddy, said M. Satyavathi from Bhumika.
Vidya Prasad, former Secretary of Legal Services Authority, while making concluding remarks, felt that a comprehensive legislation to curb violence against women on the lines of Domestic Violence Act, with provisions for rehabilitation, and economic and employment support could work better than the proposed amendments to IPC.
Inspector General of Police (CID) S. Umapathi suggested that the recommendations, along with rehabilitation measures may be included in a government order instead of formulating a special legislation.
Fine
Amendments to the IPC propose, among others, a fine between Rs.2 lakh and Rs. 5 lakh for grievous hurt by fire, heated substance acid, or explosive substance, imprisonment of seven years or more, and immediate interim compensation to be paid to the victim.

Wednesday, November 25, 2009
మహిళలపై హింసకు "నో"చెబుదాం.హింసను ఎదుర్కోడానికి అందరం కలిసికట్టుగా పోరాడదాం
Saturday, November 21, 2009
శాంభవి ఉండాల్సింది గుడి లో కాదు బడిలో
శాంభవిని గుడి నుంచి రక్షించి బడిలో చేర్చాలని మానవ హక్కుల కమీషన్ ని కోరిన వార్తను మీరంతా టివీల్లో,పేపర్లలో చూసే ఉంటారు. ఇవిగో ఆ ఫోటోలు
Friday, November 6, 2009
వందేళ్ళయినా వన్నెతగ్గని కొ.కు రచనలు
భూమిక November 2009
1980-81 మధ్యకాలం. నేను పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న రోజులు. దిల్‌సుక్‌నగర్‌లో రూ. 150 లకు అద్దె ఇంట్లో వుంటూ రోజూ ఓ కిలోమీటర్ నడిచి, బస్సు డిపోకి వచ్చి, ఓ అరగంట క్యూలో నిలబడి, ఆర్‌టిసి బస్సులో సీటు సంపాదించి ఆఫీసుకెళ్ళేదాన్ని. ఓ రోజు విశాలాంధ్ర పుస్తకాల షాపుకెళ్ళి కొ.కు పుస్తకాలు కొన్నాను. ఆ సంకలనంలోని ఓ చిన్న గల్పిక నా మీద పెను ప్రభావాన్ని చూపింది. దాని పేరేమిటో నాకిపుడు గుర్తు లేదు. అందులో ఆఫీసులకి బస్సుల మీద వెళ్లే వాళ్ళ మీద ఆయన ఇలా రాస్తారు. ”పది పదిహేను నిమిషాల బస్సు ప్రయాణానికి సీటు కోసం ఈ ఉద్యోగస్తులు అరగంట ముందొచ్చి క్యూలో నిలబడతారు. అదో అలవాటుగా చేసేస్తారు గాని, ఆ అరగంట బస్సులో నిలబడిపోదామని ఆలోచించరు. పడీ పడీ, ఇంట్లో వాళ్ళని తొందర పెట్టి వచ్చి క్యూలో నిలబడతారు. కాళ్ళు పీక్కుతున్నా క్యూలోంచి కదలరు”. ఆ గల్పికలో ఇలా అర్ధం వచ్చేట్టు వుంటుంది. ఈ చిన్న గల్పిక చదివిన తర్వాత నేను ఏ రోజూ క్యూలో నిలబడలేదు. ఆ మూసని తోసిరాజని రద్దీ బస్సుల్లో ఎక్కడంటే అక్కడ, ఆఖరికి ఫుట్‌బోర్డింగు కూడా చేసేదాన్ని. మనుష్యులు ఒక యాంత్రికతకి ఎలా అలవాటు పడిపోయారో, కొత్త దారుల్ని వెతక్కుండా ఎలా దానిలోనే కొట్టుకు పోతుంటారో ఈ బుల్లి గల్పికలో చెప్పిన కొకు రచనల్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా చదవడం మొదలుపెట్టాను. కొ.కు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీద ప్రత్యేక సంచిక తేవాలనే ఆలోచన మొదలైన దగ్గర నుండి ఈ గల్పిక నాకు పదే పదే గుర్తుకు రాసాగింది.
ఈ ప్రత్యేక సంచికకు బీజం పడింది శ్రీకాకుళంలో. ఆగష్టు పదహారున కేంద్ర సాహిత్య అకాడమీ, కథానిలయం సంయుక్తంగా కొ.కు రచనల మీద సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో నేను వైజాగులో వున్నాను. నాయుడుపేట నుంచి ప్రతిమ ఫోన్ చేసి శ్రీకాకుళం మీటింగుకి వెళుతున్నావా అని అడగడం, ఆవిషయం నాకు తెలియదని చెప్పడంతో, తనే వివరాలన్నీ చెప్పింది. శ్రీకాకుళం వెళ్ళాలనే తపన మొదలైంది. అప్పటికీి టైమ్ ఎనిమిది. మీటింగు 10 కి. నేనేమో ఒక అవసరమైన వ్యక్తిగత పని మీద వైజాగులో వున్నాను. ఇంకేమీ ఆలోచించలేదు. టాక్సీి తెప్పించుకుని అప్పటికప్పుడు బయలుదేరి ఆ సమావేశానికి వెళ్ళాను. సింగమనేని నారాయణగారు, కాళీపట్నం రామారావు మాస్టారు, చాగంటి తులసి ఇంకా ఎందరినో కలిసాను. రామమోహనరాయ్‌గారు ‘కొ. కు చారిత్రక దృక్పధం” మీద అద్భుతమైన ప్రసంగం చేసారు.నేను టాక్సీ మీద ఖర్చు చేసిన రెండున్న వేలు ఈ సమావేశంలో పాల్గొన్న ఆనందం ముందు ఎందుకూ కొరగానివయ్యాయి. అంతే కాదు కొ.కు మీద నేనెందుకు భూమిక ప్రత్యేక సంచిక వెయ్యకూడదు. వేసి తీరాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది.
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఉదయమే శాంతసుందరిగారికి ఫోన్ చేసి, కొ. కు గారి ప్రత్యేక సంచిక తీసుకొద్దాం. మీరు సహసంపాదకురాలిగా బాధ్యత తీసుకుంటారా? అని అడిగిందే తడవు ఆవిడ ఒప్పుకోవడం, ప్రత్యేక సంచికకి రూపకల్పనా జరిగిపోయాయి. ఆవిడ వెంటనే రచనల సేకరణ పని మొదలు పెట్టేసారు. నిజానికి ఈ ప్రత్యేక సంచిక వెనుక కృషింతా శాంతగారిదే. అందరికీ ఫోన్‌లు చేసి మాట్లాడటం, వాళ్ళ వెంటబడి రచనలు రప్పించడం అంతా ఆవిడే చేసారు. ఆవిడ ఒప్పుకోక పోయి వుంటే అసలు ఈ ప్రత్యేక సంచిక సాధ్యమయ్యేది కాదు. ఆవిడకి ‘థాంక్స్’లాంటి పడికట్టు పదాలతో కృతజ్ఞతలు తెలపడం నా కిష్టం లేదు. స్నేహంలో ఇలాంటి పదాలు ఇమడవు. ఇక కొ.కు.గారి రచనలకు సంబంధించి వివిధ కోణాలు ఈ సంచికలో ఆవిషృతమయ్యాయనే నేను భావిస్తున్నాను. ఈ అన్ని కోణాలను ఒకేసారి చదివే ‘అదృష్టం’ (దీనికేదైనా ప్రత్యామ్నాయ పదం వెదకాలి) నాకు కలగడం నన్ను ఆనందోద్వేగాల్లో ముంచేసింది. వందేళ్ళ క్రితం పుట్టిన ఈ మనిషికి ఇంత విశాల దృక్పధం, శాస్త్రీయ భావజాలం అన్నింటిని మించి స్త్రీ సమస్య మీద ఇంత సంస్కారవంతమైన ఆలోచనలు ఎలా వంటబడ్డాయి? అక్టోబరు 28న అంటే నేను ఈ ఎడిటోరియల్ రాస్తున్న రోజుకు సరిగ్గా వందేళ్ళ ముందు ఆయన పుట్టారు.
”ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన తెలుగు సాహిత్య పరిణామం విషయంలో కొ.కు కొంత కాలం ద్రష్టగాను, ఆ తరువాత స్రష్టగాను కూడా పని చేసారు. ముఖ్యంగా రాయప్రోలు అభినవ కవితకు, కృష్ణశాస్త్రి భావకవితకు కొ.కు ద్రష్ట. శ్రీ శ్రీ కంటే కాస్త ముందు పుట్టినా కొ.కు భావ కవితా ప్రవాహంలో దూకలేదు. శ్రీ శ్రీ దూకి తిరిగి ఒడ్డుకెక్కి తన త్రోవ తాను చూసుకొంటున్న కాలందాకా కొ.కు ప్రపంచాన్ని చూస్తూ, తెలుసుకుంటూ, చదువు , ఆలోచించుకుంటూ వచ్చాడు. చలం సాహిత్యం కొ.కును ఎంతగానో ఆలోచనలకు, కలవరానికి గురి చేసింది. ” అంటుంది కాత్యాయనీ విద్మహే కొ.కు వాజ్మయ జీవితం గురించిన వ్యాసంలో.
గురజాడ, శ్రీశ్రీ, చలం, వీరేశలింగంలాంటి వారి ఆలోచనాధోరణి యువకుడైన కొ.కు మీద బలంగానే వుండింది. ఆ తరువాత దాస్ కాపిటల్ చదవడంతో కొ.కు కు మార్కి ్సస్టు ప్రాపంచిక దృక్పధం ఏర్పడడం, అభ్యుదయ రచయితల సంఘంలో భాగస్వామి కావడం జరిగాయి. ఉద్యోగాల వేటలో ఊళ్ళు తిరుగుతూ, వివిధ ఉద్యోగాలు చేయడంతో విస్తృతమైన జీవితానుభవం సంపాదించాడు. భిన్నమైన అనుభవాలను పొందాడు. ఈ అనుభవాలన్నింటిని విశ్లేషించుకుంటూ వాటినన్నింటిని తన రచనల్లో పొందుపరిచాడు. అసంఖ్యాకంగా వ్యాసాలు, కథలూ రాస్తూ పోయాడు. నిజానికి ఒక్క కవిత్వం తప్ప ఆయన రాయని ఆధునిక సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.
ఆయన రచనల్లోని సూటిదనం, వ్యంగ్యం, నిర్మోహమాటం పాఠకుల గుండెలకు నేరుగా తాకుతాయి. మారదలుచుకున్న వాళ్ళకు చుక్కానిలాగా పనిచేస్తాయి. బండబారిన వాళ్ళకు కొరడా దెబ్బల్లా తాకుతాయి. మన సాహిత్యం అనే వ్యాసంలో ”ఆత్మగౌరవం కల జాతి తన కళలను ఎంతో అభిమానంతో చూసుకుంటుంది. మన కళల మీద మనకున్న అభిమానం చూస్తే మనకు ఆత్మగౌరవం ఏమీ లేదని స్పష్టమౌతుంది” అంటారు.
స్త్రీల మానసిక సంఘర్షణలను, ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న ఆగచాట్లను చాలా ఆర్తితో, గుండెలోతుల్లోంచి కొ. కు. రాయడం కన్పిస్తుంది. ‘ఆడజన్మ’ నవల్లో ”నువ్వు మా జీతం లేని నౌకరువు. నీది ఇరవై నాలుగ్గంటల నౌకరీ, శలవుల్లేవు నీకు, ఫిించను లేదు. నువ్వు చేతులు మారినా నీ నౌకరీ మారదు.” అంటారు. ఇంకోచోట ”నీకు ఆత్మజ్ఞానం లేకుండా, చదువూ విజ్ఞానమూ లేకుండా చేసి ఉంచింది దేనికనుకున్నావు. నీకు అడుగడుగునా అంకుశాలు దేనికనుకున్నావు? నిన్ను అబలగాను నీ కీర్తి లేత తమలపాకులకంటే సుకుమారంగానూ, నీ మార్గం కంటక భూయిష్టంగాను, నీ జీవితం ఒక అంతులేని అగ్ని పరీక్షగాను ఉంచింది దేనికనుకున్నావు” అంటారు కోపస్వరంతో. అలాగే సౖౖెరంధ్రి కథలో జానకి పాత్ర చిత్రణ, ఆ పాత్రను మలిచిన తీరు అమోఘం. ”నాలుగేళ్ళ భరించాను. ఇక చాలనిపించింది. ఒక రోజు చెప్పేసాను. నన్ను మీరు మెదడులేని ఆడగాడిద అనుకుంటున్నారో, ఊరందరితోను రంకు పోగల సాహసికురాలిననుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో మొగుడూ, పెళ్ళాం ఆటలు ఆడినదాన్నే” అంటూ మొగుడి ముఖంతోపాటు సమాజ ముఖాన్ని ఫెెడేల్మని తన్నినట్లు సమాధానం చెప్పింది. ‘యావజ్జీవ స్నేహం’ అనే అందమైన వాక్యాన్ని ఈ కధలోనే రాసారు.
అలాగే 1955 లో రాసిన ‘దాలిగుంటలో కుక్కలు’ ఆశయాలు వల్లిస్తూ, తనవరకు వస్తే ఆచరణలో ముఖం చాటేసే వాళ్ళ గురించిన కథ. సమ్మె చేస్తున్న ఒక కథలోని కూలీల పట్ల సానుభూతి వర్షం కురిపించి ”యజమానులను చంపినా పాపం లేదు” అంటూ రంకెలు పెట్టె మనుష్యులు, తమ బంధువుల పొలంలో పనిచేసే కూలీలు సమ్మె కడితే ”కూలీ లంజా కొడుకులు సమ్మె చేస్తున్నారు.” అంటూ విరుచుకు పడుతూ ”పోలీసుల్ని పిలిపించి, పికెటింగు చేసేవాళ్ళని మిల్లు ముందు నుంచి వెళ్ళగొట్టించి, కొత్త కూలీల్ని తెచ్చుకోలేకపోయావా” అంటూ సలహాలిస్తారు. ఒకటిన్నర పేజీల ఈ కథలో ఆశయాలకి, ఆచరణకి మధ్య వున్న అగాధాన్ని, మనుష్యులు ఎంత తేలికగా ఆశయాలు వల్లించి తనదాకా వస్తే ఎలా జారిపోతారో అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది.
చివరగా ‘ఆడ బ్రతుకే మధురం’ కధలోని ఓ పదునైన వాక్యంతో నేను ముగిస్తాను. 1947లో రాసిన ఈ చిన్న కథ ఆనాటి స్త్రీలకే కాదు ఈనాటి స్త్రీలకి కర్తవ్య బోధ చేయడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ని మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయే. ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూను.” చిన్నపిల్ల అంతరంగంలోంచి వుబికి వచ్చిన ఈ మాటలు, తిట్లూ, తన్నులూ తింటూ హింసాయుత జీవితాల్లో మగ్గుతున్న ఈనాటి స్త్రీల చెవిన పడితే ఎంత బావుండు.
ఆత్మగౌరవాన్ని ప్రోది చేసే, ఆత్మవిశ్వాసాన్ని అంతరంగం నిండా నింపే కొ.కు రచనలు ఈనాటి సమాజానికి ఎంత అవసరమో ఆయన రచనల్ని మళ్ళీ చదువుతున్నపుడు మరింతగా అర్ధమైంది. కొ.కు ప్రత్యేక సంచికను తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
మా ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ, ఈ సంచిక రూపకల్పనలో, రచనలు సేకరణలో సహకరించిన సహసంపాదకురాలు శాంతసుందరికి అభినందనలు చెబుతూ అలాగే విరసం ప్రచురించిన సంకలనాల్లోంచి కొన్ని రచనలను పునర్ముృదించుకోవడానికి అంగీకరించిన కృష్ణాబాయిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక సంచికపై స్పందించాల్సిందిగా పాఠకుల్ని అభ్యర్ధిస్తూ…

Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
ప్రపంచాన్ని స్త్రీల దృష్టి కోణం నుంచి చూడమంటాను పురుషులు లేని ప్రపంచాన్ని నేను కోరడం లేదు ఆడపిల్లలు అన్నింటిని ఆఖరికి ప్రాణాన్ని సైతం కోల్...