Monday, January 9, 2012

వృద్ధుల కోసం మా కొత్త కార్యక్రమం.

పడకండ్ల గ్రామంలో ఉన్న వందల ఏళ్ళ నాటి చింత చెట్టు

ఫకీరమ్మతో నా సహచరడు.

ఫకీరమ్మ

జమ్మి చెట్టు

పడకండ్ల గ్రామం.
ఈ రోజు నేను నా సహచరుడు కలిసి ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టేం.
ఇంతకు ముందే మేమొక ట్రస్ట్ ఏర్పాటు చేసాం.
ఈ ట్రస్ట్ గ్రామాల్లో ఉన్న వృద్ధుల కోసం మొదలు పెట్టాం.
ఈ రోజు పడకండ్ల అనే గ్రామం లో మా పని  ప్రారంభిచాం.
 కర్నూలు జిల్లా అహోబిలానికి దగ్గరుండే  పడకండ్ల గ్రామాన్ని మొదటిదిగా ఎంచుకున్నాం.
ఈమె పేరు ఫకీరమ్మ.80 సంవత్సరాలు.ఒంటరి మహిళ.ఇంకా పొలాలకెళ్ళి కూలి చేస్తూ బతుకుతోంది.
ఈమె గారే  మా మొదటి అతిధి.
గ్రామం లో ని ఒక స్వచ్చంద కార్యకర్త మా తరఫున ఆమెకు ఇక నుండి భోజనం పెడతాడు.
మేము అతనికి డబ్బు చెల్లిస్తాం.
కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడున్న 60 ఏండ్లు దాటిన వృద్ధులకు ఆహారం,వైద్య సహాయం  చెయ్యాలనేది మా సంకల్పం.

12 comments:

♛ ప్రిన్స్ ♛ said...

మంచి సంకల్పం మీకు మా అభినందనలు...

Sridevi said...

Congratulations. Manchi pani chesthunnaaru. Successful ga mundukellaalani ashisthunnanu. Keep updating us on this initiative - Thanks.

Praveen Mandangi said...

బాగుంది సత్యవతి గారు. కానీ పిల్లలు లేని వృద్ధులని వాళ్ళ బంధువులు ఆర్థిక భారం అనుకోకుండా పోషించే పరిస్థితి ఉంటే వృద్ధుల కోసం స్వచ్ఛంద సంస్థలతో పని ఉండదు కదా.

Ennela said...

chaalaa baagundandee..abhinandanalu..

anrd said...

చక్కటి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు అభినందనలండి.

santhi said...

Wonderful. You are truly an inspiration to everyone.

Rgds
Santhi

Anonymous said...

I really appreciate ur work.I am definitely inspired by ur work.Thanks.

సుజాత వేల్పూరి said...

ఈ కార్యక్రమం లో పాలు పంచుకోవడం మీ ట్రస్ట్ మాత్రమే చేస్తుందా సత్యవతి గారూ? ఫండింగ్ ఎలాగ? బయటి వారి నుంచి విరాళాలు స్వీకరిస్తారా? అలా అయితే వృద్ధులకు సహాయం చేద్దామనుకున్న వారు మీ ట్రస్ట్ తో చేయి కలపడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది కదా!

maa godavari said...

@తెలుగు పాటలు
@శ్రీ దేవి
@ప్రవీణ్ శర్మ
@ఎన్నెల
@ఏ ఎన్ ఆర్డి
@శాంతి
@తొలకరి
@సుజాత
అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు
మీ అభినందనలు మాకు మరింత స్పూర్తినిస్తున్నాయి.
సుజాతా!ప్రస్తుతం మేము బయట నుండి విరాళాలు తీసుకోవడం లేదు.
మాకు కావలసింది స్వచ్చంద కార్యకర్తలు.
వృద్ధులకు సహాయం చెయ్యాలనుకునే వారు నన్ను సంప్రదిస్తే చాలు.
వారు చెయ్యదలుచుకున్న ఊరి వివరాలు,ఎంతమందికి అవసరం ఉంటుంది,ఎవరు వారికి వొండిపెడారు లాంటి వివరాలు ఇస్తే చాలు.
మిగతాదంతా మేము చూసుకుంటాము.
అంటే వారికి డబ్బు పంపడం,వంట పాత్రలు కొనివ్వడం లాంటివి మేము చూసుకుంటాము.
మా ఇద్దరికి ఒకే కోరిక ఉంది.
మేము చనిపోయేనాటికి మా పేరు మీద ఒక్క రూపాయి కూడా ఉండకూడదు.
మాకు పిల్లలు లేరు కాబట్టి కూడబెట్టి,మూటలు కట్టి అందించాల్సిన పని అసలే లేదు.
మా ఇద్దరికి మాకు సరిపోను పెన్షన్ వస్తుంది.

నైమిష్ said...

చాలా మంచి కార్యక్రమం..మీ ఆశయాలు సఫలీక్రుతం కావాలని ఆశిస్తూ...

mohantangella said...

ento manchi pani...

ilantivi enno manchi panulu cheyyalani,me arogyanm bavundalani korukuntunnanu

Anonymous said...

manchi pani chestunnaru

ilantivi enno manchi panulu cheyyalani,me arogyam bavundalani korukuntunnanu

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...