Saturday, December 31, 2011

పొగడపూల తో నూతన సంవత్సర శుభాకాంక్షలు




కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితృలందరికోసం నేను తయారుచేసిన పొగడపూల గుచ్చం.
పొగడపూల వెనకున్నది ఓ చెట్టుకి పూసిన పువ్వు.వుడ్ రోజ్ లా సహజమైన పువ్వు.
దానికి నేను పొగడపూలను అతికిస్తే ఇంత అందమైన పుష్ప గుచ్చం తయారైంది.
సృజనాత్మక దృష్టి ఉండాలే గాని ప్రకృతి మనకెన్నో అద్భుతాలను అందిస్తుంది.
ఈ కళాత్మక గుచ్చ్హాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిస్తుంది.
నా దృష్టిలో ఆనందం మన చుట్టూనే ఉంటుంది.దాన్ని ఒడిశి పట్టుకొవడం ఇదిగో ఇలాగే.

శుభాకాంక్షలతో
మీ
సత్యవతి

6 comments:

John said...

beautiful...!

Sravya V said...

Wow !
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

♛ ప్రిన్స్ ♛ said...

!! సత్యవతి !! గారు పువ్వులు చాల బాగున్నాయి నేను ఎప్పుడు చూడలేదు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

Unknown said...

పొగడపూల గుచ్ఛం ఎంతో బాగుంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు...

శ్రీలలిత said...

పుష్పగుఛ్ఛం చాలా అందంగా వుంది..
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...

santha sundari.r said...

ప్రతి పండగకీ పువ్వులని అందించే సత్యవతికి,

ప్రస్తుతం అమెరికా లో ఉన్న నేను మీ పుష్ప గుచ్చాన్ని మా అమ్మాయిలకి కూడా చూపించాను.చాలా ఆనందించారు.మీ గురించి,ఎంత బిజీ గా ఉంటారో చెప్పాను కాబట్టి,ఇంత ఓపిగ్గా దీన్ని స్నేహితులకోసం తయారు చేసిన మీ సృజనాత్మతకి ఆశ్చర్యపోయారు. అందం ఆనందం పంచే మీకు ప్రతి కొత్త సంవత్సరమూ మరింత సుఖ సంతోషాలని అందించాలని ఆకాంక్షించే వాళ్ళలో నేను కూడా ఉన్నానని తెలియజేస్తూ...
శాంతసుందరి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...