Wednesday, November 24, 2010

నా నేస్తానికి నేనిచ్చిన పొగడపూల బొకే

 ఈ రోజు ఉదయం నా ప్రియ నేస్తం గీత కోసం ఏదైనా విలక్షణంగా
తయారు చెయ్యాలనిపించింది.అనుకున్నదే తడవు కాఫీ కూడా తాగకుండా తోటలో వేట మొదలెట్టాను.
పొగడచెట్టు కింద పొగడపూలు రాలి ఉన్నాయి.వాటిని ఏరాను.
వాటితో బొకే చెయ్యాలనిపించింది.
చెట్లన్ని వెతికి దేవ గన్నేరు కొమ్మ తెంపి పొగడపూలని ఆకులకు ఇలా అతికించాను.
సంపెంగ చెట్లు (తెలుపు,పసుపు)విరగ పూసాయి.
వాటిని కోసి మధ్యలో పెట్టాను.
ఒకేఒక్క అనార్ పువ్వు దొరికింది.దాన్ని కూడా తెంపి అలంకరిస్తే ఈ అందమైన బొకే తయారయ్యింది.
ఆ బొకేని గీతకి ఇచ్చినప్పుడు తన ముఖంలో ఎంత సంతోషమో!!!
వెంటనే అక్కడ నా రూంలో ఉన్న బుద్ధుడి దగ్గర పెట్టింది.

గాఢ స్నేహం లో ఇలాంటి ఆనందాలని అస్సలు మిస్ అవ్వకూడదు.

3 comments:

చెప్పాలంటే...... said...

nijamgaa baavundi mi boke....

మాలా కుమార్ said...

chaalaa baagundi.

సుజాత వేల్పూరి said...

గీత గారి జడలో సంపెంగ పూలు మాత్రం నిన్న మతి పోగొట్టాయంటే నమ్మండి! మీరు అల్లంత దూరాన ఉండగానే వత్తుగా వ్యాపించిన ఆ సుగంధం నుంచి తేరుకోవడం కష్టమనిపించింది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...