పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.
వెబ్‌సైట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆదరణ పొందింది. ప్రతినెల క్రమం తప్పకుండా కొత్త కొత్త అంశాలతో, ఆలోచనలు రేకెత్తించే ఆర్టికల్స్‌తో మీ ముందుకొస్తోంది భూమిక.
ప్రత్యామ్మాయ, స్త్రీవాద పత్రికను నడపడంలోని ఇబ్బందులు విజ్ఞలైన మీకు తెలియనివి కావు. భూమికను మరింత బలోపేతం చెయ్యడానికి, ఆర్థికంగా కొంత నిధిని సేకరించడానికి మేము రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టాము.
1. స్త్రీలకు సంబంధించిన చట్టాలు, సహాయలు, సంస్థలు, ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఫోన్ నెంబర్లు, హెల్ప్‌లైనులు, న్యాయవాదులు, మానసిక సమస్యల కోసం ఎవరిని సంప్రదించాలి- అలాగే పిల్లలకి సంబంధించిన చట్టాలు సహాయలు, సంస్థలు, హెల్ప్‌లైనులు లాంటి వివరాలతో సమగ్రంగా రూపొందుతున్న డైరీ - 2008. దీని వెల రూ. 120/-
2. భూమిక హెర్బల్ హేండీ డైరీ - మేము 1998లో భూమిక నిధుల సేకరణ కోసం ప్రచురించిన హెర్బల్ డైరీని మరింత సమగ్రంగా, నూతన సమాచారంతో పునర్ముద్రించదలిచాము. అప్పట్లో ఈ డైరీ ఎంతో ఆదరణ పొందింది. మన చుట్ట వుండే, మన ఇంట్లో వుండే ఎన్నో వస్తువులతో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉపశమనాలు పొందొచ్చు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి వద్ద వుండతగింది. దీని వెల. రూ. 35/-
మేము ఈ రెండు డైరీల ప్రచురణ భూమికకు నిధులను సేకరించడం కోసమే చేపట్టాం. వీటి అమ్మకాల ద్వారా కొంత మూలనిధిని సేకరించాలనేది ముఖ్య ఉద్ధేశ్యం. భూమిక పట్ల మీ ప్రేమని, నిబద్ధతని ప్రకటించుకోవడానికి చక్కటి అవకాశం. హెర్బల్ డైరీని ఎక్కువ సంఖ్యలో కొని మీ బంధు, మిత్రులకు నూతన సంవత్సర కానుకగా బహూకరించండి. గ్రీటింగు కార్టులకు వందలకు వందలు ఖర్చు పెట్టే బదులు హెర్బల్ డైరీని కొంటే భూమికకు ఆర్ధిక లాభం -బహుమతి పొందినవారికి ఆరోగ్యలాభం. మిత్రులంతా ఒక్కొక్కరు పదికి మించకుండా ఆర్డర్ చేస్తే భూమిక పదికాలాల పాటు ఆర్ధికంగా నిలదొక్కుకుంటుంది.
భూమికను నిలబెట్టుకోవాలనే మా ఆవేదన అర్ధం చేసుకుంటారని. మేము ప్రచురిస్తున్న రెండు డైరీలను ఆదరిస్తారని ఆశిస్తూ…
Saturday, November 17, 2007
Tuesday, October 23, 2007
Thursday, October 18, 2007
ఆకాశమల్లెల జడివాన

అనుకోకుండా ఇంటికొచ్చిన పిల్ల సిసింద్రీలను
వెంటేసుకుని ఈట్ స్ట్రీట్ కి వెళ్ళానా
ఎదురుగా ఉన్న పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంటే
ఆకాశమల్లెల పరిమళం హటాత్తుగా చుట్టుముట్టింది
తలెత్తి చూద్దును కదా
గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఆకాశమల్లెలు
పచ్చటి కారప్పూల చెట్లకి
ధవళ వర్ణం లో కుప్పలు తెప్పలుగా
విరగబూసిన ఆకాశ మల్లెలు
చిన్నప్పుడు కారప్పూలని పిలుచుకుంటే
భాగ్యనగరంలో అవే ఆకాశమల్లెలయ్యాయి
అందంగా పొందిగ్గా బారులు తీరి నిలబడ్డ
ఆకాశమల్లె చెట్ల కింద
ఆదమరిచి నిలబడ్డానా
జలజలా నా తలమీద
కాదు కాదు నా తనువంతా
తడిపేసిన ఆకాశమల్లెల జడివాన
ఈట్ స్త్రీట్ వెర్రి హోరుకి
పార్కింగ్ లోని ఈ పారవశ్యానికి
పొంతన ఎలా కుదర్చడం ?
ఒక్కొక్క పువ్వూ ఒయ్యారాలుపోతూ
పరిమళాలు వెదజల్లుతూ
నా మీద వాలుతుంటే
అబ్బో! ఆ అనుభవాన్ని అక్షరీకరించడం
ఇలా మీతో పంచుకోవడం
మహదానందంగా ఉంది.
Tuesday, October 9, 2007
ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం
జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.
అంతకు మించిన దారేదీ ఆమెకు కన్పించలేదు. అంత తీవ్రమైన చర్యకి దిగితే తప్ప ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యవైఖరి ప్రపంచానికి తేటతెల్లం కాలేదు. ఎవరీ పూజా చౌహాన్?
2004లో పూజకి ప్రతాప్ చౌహాన్తో పెళ్ళయింది. ప్రతాప్ కూరగాయలమ్ముకుంట, పేపర్లు పంచుత జీవనం సాగిస్తున్నాడు. పూజ తన భర్త, అత్తతో కలిసి బతుకుతోంది. పూజ ఎక్కువగా చదువుకోలేదు. పెళ్ళయిన ఆరేడు నెలలకే ఆమెకు భర్తనుంచి కట్నం వేధింపులు మొదలయ్యయి. అదనపు కట్నం తెమ్మని భర్త, అత్త కలిసి తిట్టడం, కొట్టడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఆడపిల్లను కన్నందుకు కూడా హింసను చవిచడాల్సి వచ్చింది. ఒక రోజు ఆమెను బాగా కొట్టి, బిడ్డతో సహా ఇంట్లోంచి గెంటేయడం జరిగింది. తల్లిదండ్రులిచ్చిన కొద్దిపాటు సొమ్ముతో ఆమె అద్దె ఇంట్లో బతకడం మొదలుపెట్టింది. సరైన తిండి లేక, పోషకాహార లోపంతో తల్లీ బిడ్డలు చిక్కిశల్యాలయ్యారు. భర్త ఆమె అద్దెకుంటున్న ఇంటికి కూడా వచ్చి కట్నం తెమ్మని హింసించేవాడు.
ఈ దశలో పూజ మనోవర్తి కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 కింద కేసు వేసింది. సంవత్సరం గడిచిపోయినా ఆమెకు కనీసం తాత్కాలిక భృతి కూడా మంజూరు కాలేదు. కేసు కోర్టులో మూలుగుతోంది. అంతకు ముందు పూజ తన మీద హింస జరిగినపుడల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కుటుంబ తగాదా పేరు మీద పోలీసులు కేసును రిజిష్టర్ చెయ్యడంగాని, ఆమె మీద హింసను తగ్గించడానికి చర్యలుగానీ ఏమీ తీసుకోలేదు. పది పదిహేను సార్లు ఇలా జరిగింది. పోలీసులు అన్ని సార్లు కూడా ఎలాంటి చర్యల తీసుకోలేదు.
జూన్ 29న ఆమె మీద ఆమె భర్త దారుణ హింసని ప్రయెగించినపుడు ఆమె పోలీస్ కమీషనర్ కార్యాలయనికి వెళ్ళి, తన ఫిర్యాదును రిజిస్టర్ చేసుకుని, తనకు న్యాయం చేయకపోతే తనను తాను నిప్పటించు కుంటానని హెచ్చరించింది. ఆ రోజు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో లేకపోవడంతో తన సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కూడా తనని తాను కాల్చుకుంటానని బెదిరించినపుడు వత్రమే ఆమె కేసును రిజిష్టర్ చేసారు. ఆ తర్వాత ప్రతాప్ ఆమె ఇంటికెళ్ళి పోలీసులు తననేమీ చేయలేరని, ఒక్క రోజులో బెయిల్ మీద బయటకొస్తానని, నీ అంతు చస్తానని బెదిరించాడు. అతను బెదిరించినట్టుగానే అరెస్టయి, వెంటనే బెయిల్ మీద బయటకొచ్చేసాడు. ఇక ప్రతాప్ తనని బతకనివ్వడని పోలీసులు తనను రక్షించరని నిర్ణయించుకున్న తర్వాతే పోలీసులు, న్యాయవ్యవస్థ నిర్లక్ష్య వైఖరులను ఎండగట్టటానికి, దేశం మొత్తం తెలపడానికి లోదుస్తులు వత్రమే ధరించి రాజ్కోట్ రింగు రోడ్డు మీద నడిచి తన తీవ్ర నిరశన తెలిపింది. దినపత్రికలు, టి.వీ ఛానళ్ళు ఆమె ఫోటోను ప్రచురించాయి. ఆమె నిరశనకి ఎక్కువ ప్రాధాన్యమీయకుండా, ఆమెకు న్యాయం జరిగేలా ప్రయత్నించకుండా, పూజ వనసిక స్థితి మీద అనువనాలు కలిగేలా వార్తా కథనాలు, ఇంటర్వ్యలు ప్రసారం చేసాయి. అంటే మీడియ కూడా ఆమె పట్ల అవనుషంగా ప్రవర్తించింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు ప్రవేశించి ఆమె కేసును ఎంత నీరు గార్చాలో అంతా చేస్తున్నారు. పూజ పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. ర.800 మనోవర్తి వత్రంమంజూరైంది.
పూజా చౌహాన్ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విశ్లేషిస్తే ఈ దేశంలో స్త్రీల పట్ల పోలీసులు, న్యాయం, మీడియ, రాజకీయ నాయకులు ఎంత బండతనంతో, ఎంత ఇన్సెన్సిటివ్గా ప్రవర్తిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంత తీవ్రమైన గృహహింస కేసులో (గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా) పోలీసులు పూజను రక్షణాధికారిని కలవమని కనీసం చెప్పలేకపోవడం, ఆమెకు సరైన రక్షణ కల్పించకపోవడం, మనోవర్తి కేసుల్ని కూడా వమూలు కేసుల్లా మూలన పడేయడం చస్తే స్త్రీలకు న్యాయం ఎంత అందని పండో అర్ధమవుతుంది. అత్యుత్సాహంతో ప్రతీదాన్ని సెన్సేషన్ కళ్ళద్దాల్లోంచి మాత్రమే చేసే మీడియ కూడ ఆమెకి న్యాయం అందించలేకపోయింది. రాజకీయ నాయకులు ఆమెను అడ్డం పెట్టుకుని రాజకీయలబ్ది పొందాలనే చేసారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలోంచి పూజాచౌహాన్ చేస్తున్న పోరాటం, ఆమె తన నిరశసనను తెలియచేయడానికి ఎంచుకున్న పద్ధతిని అర్థం చేసుకోవడం, ఆమెలాంటి స్త్రీల ఒంటరి పోరాటాలకు అండగా వుండడం అత్యవసరం. ఆమె పూజ కావచ్చు లేదా మరో రోజా కూడా కావచ్చు.

Tuesday, September 25, 2007
ఆరు బ్రహ్మ కమలాలతో నేను

ఆరు బ్రహ్మ కమలాలతో నేను
మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.
Monday, September 24, 2007
పత్తి మందారం
Saturday, September 15, 2007
మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్
షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండి ఆమె నిర్బంధంలోనే వుంది. బలవంతంగా ముక్కుకు గొట్టాలు అమర్చి ఆహారం పంపిస్తున్నారు. ఆమెకు కొన్నిసార్లు బెయిల్ దొరికినా, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడంతో మళ్ళీ మళ్ళీ అరెస్టు చేయడం జైలుకి పంపడంజరుగుతూ వచ్చింది.
ఈ ఏడేళ్ళ కాలంలో షర్మిల వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నిరక్షరాస్యురాలైన , గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. “మీరు ఎందుకు మీ బిడ్డను చూడడానికి వెళ్ళలేదు” అని అడిగిన ఒక విలేఖరికి ఆమె తల్లి ఇరామ్ సఖీదేవి ఇచ్చిన సమాధానం “నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన ధృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలుచుకోలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు ఆమెను చూడదలుచుకోలేదు.”
షర్మిల నిరాహారదీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004 లో మణిపూర్ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమ అనే మహిళ అత్యాచారానికి, హత్యకి బలైనపుడు మణిపూర్ స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకి వారిని ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ ముందు మణిపురి తల్లుల నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సెవెన్ సిస్టర్స్‌గా పిలవబడే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేసిందీ నగ్న ప్రదర్శన.
ఇంఫాల్‌లోని జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లోని జుడీషియల్ కస్టడీ నుంచి బెయిల్ దొరికిన వెంటనే ఆమె మిత్రులు షర్మిలాను ఢిల్లీకి తరలించారు. చాలా నాటకీయ పరిస్థితుల్లో ఆమె హఠాత్తుగా అక్టోబరు 2 న ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ముందు ప్రత్యక్షమై మహాత్మాగాంధి సమాధి మీద పుష్పగుచ్ఛం వుంచుతూ “మహాత్మా గాంధీ కనుక ఈరోజు బతికి వుండి వుంటే, ఆయన తప్పకుండా సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి వుండేవాడని నేను యావత్ భారత ప్రజలకు చెప్పదలిచాను. భారతీయులందరికీ నా విన్నపం ఒక్కటే. సాయుధ దళాల చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పండి. మా ప్రచారంలో భాగం పంచుకోండి” (టెలిగ్రాఫ్ అక్టోబరు 5, 2006)
ప్రస్తుతం షర్మిలను అరెస్టు చేసి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వుంచి బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. ఇంఫాల్ హాస్పిటల్ ఇరుకు గదిలోంచి, ఎయిమ్స్‌లోని స్పెషల్ వార్డులో వుంటూ షర్మిల తన నిరాహార దీక్ష కొనసాగిస్తూనే వుంది. అయితే ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని డాక్టర్లు ప్రకటిస్తున్నారు. ముక్కుకి బలవంతంగా అమర్చిన గొట్టం వల్ల షర్మిల తీవ్రమైన బాధని భరిస్తోంది.. ఇటీవలే ఆమె బి.బి.సిలో మాట్లాడుతూ “మణిపూర్ ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతికోసం” అంటూ ప్రకటించింది.
ముప్పై ఐదేళ్ళ బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాంధీ అడుగుజాడల్లో, అహింసాయుత పద్ధతిలో, మడమతిప్పనిపోరు సల్పుతోంది. తన ప్రాణాలను తన ప్రజలకోసం తృణ ప్రాయంగా ఫణంగా పెట్టి పోరాడుతున్న షర్మిలా ఇరామ్‌తో గొంతు కలపడం అభ్యుదయాన్ని కాంక్షించే వారందరి కర్తవ్యం.

Friday, September 14, 2007
మానవీయ భాష నేటి అవసరం
ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.
నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.
అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చాలా వుంది. మీటింగు మొదలవ్వబోతోందని సూచిస్తూ తెలంగాణ వైశిష్ట్యం గురించి ఒక పాట పాడ్డం మొదలుపెట్టారు. పాట మంచి ఊపుగా, ఉద్విగ్నంగా సాగుతోంది. సభికులు పాటను ఆస్వాదిస్తున్నారు. నేనూ అదే మూడ్లో వున్నాను. హఠాత్తుగా, కర్ణకఠోరంగా వినబడిన పాటలోని ఒక వాక్యం నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. నిలువెల్లా వొణికించింది. కోపంతో నో..నో..అని అరిచాను కూడా.
తెలంగాణ అపుడెలా వుండేది, ఇపుడెలా వుంది పోలుస్తూ సాగుతోన్న పాటలో
‘’నిండు ముత్తయిదువులా ఉండేదానివి
ముండ మోపి లెక్క నయ్యావే తెలంగాణ…'’
ఆ పాటని పాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ఆ వాక్యాలని వాళ్ళెలా ఉచ్ఛరించగలిగేరా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధేసింది. నేనింక అక్కడ ఒక క్షణం నిలవలేకపోయాను. చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను.పాట పాడిన వాళ్ళని పిలిచి పబ్లిక్ మీటింగులో ఆడవాళ్ళని అవమానిస్తున్న ఆ పాటని మీరెలా పాడగలిగేరు అని అడిగితే సరైన సమాధానం రాలేదు.
విప్లవోద్యమ నేపధ్యం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన వ్యక్తులు వేదిక మీద, వేదిక కింద ఆసీనులై వున్న ఆనాటి సమావేశంలో స్త్రీలని ముత్తయిదువలని, ముండ మోపులని చీలుస్తూ, అవమానిస్తూ గొంతెత్తి పాడటాన్ని నేను ఈ రోజుకీ జీర్ణించుకోలేక పోతున్నాను. అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ కూడా ఇంకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేక పోతున్నారే అని చాలా బాధపడుతున్నాను. స్త్రీలను కించపరిచే భాషను భాషాశాస్త్రం నుంచి తొలగించాలని ఒక వైపు స్త్రీవాద ఉద్యమం డిమాండ్ చేసి కొంతవరకు మామూలు సాహిత్యకారుల్లో సైతం ఒక అవగాహనని కల్గించినా అభ్యుదయవాదులు, విప్లవ వాదులు దీన్ని వొదిలించుకోలేకపోవడం చాలా దు:ఖంగా అన్పిస్తోంది.
తెలుగు భాష నిండా స్త్రీలను కించపరిచే పదాలు - మానభంగం, అనుభవించడం, చెరచడం, ముండమోపి, ముత్తయిదువ, అయిదోతనం, శీలం, అబల, సౌభాగ్యవతి లాంటి పితృస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పదాలు కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇలాంటి దారుణ పద ప్రయోగాలను భాషా శాస్త్రం నుండి తొలగించడానికి ఒక భాషా సాంస్కృతిక విప్లవంలో పాలు పంచుకోవాల్సింది పోయి అభ్యుదయ వాదులు కూడా వివక్షాపూరిత భాషను యధేేచ్ఛగా ప్రయోగించడం అర్ధం చేసుకోలేకపోతున్నాను.
ఇప్పటికైనా స్త్రీలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అభ్యుదయ వాదులతో సహా అందరూ ఆలోచించాలని, పెద్దు ఎత్తున చర్చను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Sunday, August 26, 2007
గుండె చెరువౌతోంది మిత్రులారా!
మతమౌఢ్యం,మతవాదాల రూపమింత భయానకమా?
మన బతుకులింక వేయి పడగల మతమౌడ్య్లుల పడగ నీడల్లోనేనా?
అయ్యో!మనం 21 వ శతాబ్దంలోనే బతుకుతున్నామా!
నిన్న ఆ భయానక,బీభత్స సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు నేను, పిఓడబ్ల్యూ సంధ్య,సుజాత,ఇంకో అమ్మాయి కలిసి విశాఖ గిరిజన స్త్ర్రీల పై అత్యాచారాల విషయమై జరిగిన సమావేశంలో పాల్గొని ముఖ్య మంత్రి కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళేం.మేము ఆ రోడ్డు దాటిన పది నిముషాలకి బాంబు దాడి జరగడం,అందమైన లుంబిని పార్క్ బుద్ధుడి సాక్షిగా రక్తసిక్తమైపోయింది.అమాయక ప్రాణాలు మత మౌఢ్యానికి బలై పోయాయి.
కళ్ళ వెంబడి రక్తాశ్రువులు ధార కడుతున్నాయి. గుండెను పిండేసే ఆ బీభత్స ద్రుశ్యాలను చూసి చూసి మెదడు స్తంభించిపోయింది.
ఉదయమే పేపర్ ముట్టుకుంటే చేతులకంటిన నెత్తురు ఎంత కడుక్కున్నా,ఏ సబ్బులేసి తోముకున్నా వదలడం లేదు.ఆ నెత్తుటి చేతులతో తిండి సహించక,పడుకుంటే నిద్ర రాక పీడ కలలు
పగలు కూడ పీడిస్తున్నాయి.
అయ్యో! ఇది నాగరిక సమాజమా?
మతం పేరు మీద ఎన్ని కోట్ల మంది బలవ్వాలి?
క్షతగాత్రుల్ని చూస్తుంటే గుండె చెరువై కళ్ళళ్ళోంచి ఉప్పెనలా
దుఖం తన్నుకొస్తోంది.
ఈ బాధకి మందేమిటి?

Friday, August 17, 2007
Wednesday, August 15, 2007
ఖుషీ కా దిన్
జగనే కీ రాత్
హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు......
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.
(శనివారం రోజు సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)
Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
ప్రపంచాన్ని స్త్రీల దృష్టి కోణం నుంచి చూడమంటాను పురుషులు లేని ప్రపంచాన్ని నేను కోరడం లేదు ఆడపిల్లలు అన్నింటిని ఆఖరికి ప్రాణాన్ని సైతం కోల్...