Tuesday, January 27, 2015

విశ్వప్రేమ ని నేర్పే విపశ్యన


                                                          కొండవీటి సత్యవతి

నాగార్జున సాగర్‌ వెళ్ళే దారిలోగుర్రంగూడ గ్రామంలో  విపాశన సెంటర్‌ వుంది.జూలై 19  తేదీన 1.30కి విపాసన సెంటర్‌ చేరాను. 2.15 కంతా అప్లికేషన్నింపడం అయ్యిందిఅప్లికేషన్‌ నింపాక పద్మజ అనే ఆవిడ దగ్గరికి (టీచర్‌)వెళ్ళమన్నారు.  అన్ని నియమాలకు కట్టుబడివుంటారారూల్స్‌ మరియు రెగ్యులేషన్లు చదివారాఅని అడిగారుఅన్నీ చదివానుమీ వైబ్సెట్లుకూడా చూసాను అని చెప్పానుమీరు జర్నలిస్ట్ని రాసారు కదా పేపర్‌ అంటేభూమిక పత్రిక అనిస్త్రీల కోసం ఒక హెల్ప్లైన్‌ నడుపుతానని చెప్పాను.మీరు రెవెన్యూడిపార్ట్మెంట్లో చేసేవారు కదా అని అడిగారునేను ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అన్నాతర్వాత చెబుతాను అన్నారుఎలా తెలుసో ఆతర్వాత చెప్పారులెండి.  నాకు సింగిల్‌ రూమ్‌ కావాలిఅంటే 117 ఇచ్చారుసామాను మోసుకుని రూమ్‌ కొచ్చానురూమ్‌ చక్కగా నీట్గా,క్లీన్గా వుందిసిమెంటుతో కట్టినమంచంపరుపుస్టోర్కెళ్ళి దుప్పట్లు తెచ్చుకుని  మంచంమీద పరిచానునేనుతెచ్చుకున్న దుప్పట్లు కూడా పరుచుకుని  రూమ్ని ప్రేమించడంమొదలుపెట్టానురూమ్‌ ముందు చెట్లు పెద్ద రావి చెట్టుఆకులు గలగలమంటూ ఒకటే సంగీతం.దానికి తోడు లెక్కలేవన్నీ పిట్టల వైవిధ్య స్వరాలు.రామచిలకలుపిచ్చుకలు ఒకటే పాడుతున్నాయి.వస్తూ వస్తూ కారులోనే లంచ్‌ తిన్నానురూమ్‌ సర్దాక బయటకొచ్చాను ఒకావిడ నిలబడి వుందినవ్వగానే వచ్చి నా రూమ్‌ ముందు కూర్చుందిఆవిడకి ఇది మూడోసారట.విపాసన గురించి చెప్పిందిఅన్నం తిన్నారా అని అడిగితే ఇక్కడతినలేదుపన్నెండింటికి  జొన్న రొట్టె తిన్నాను అన్నానుఅయ్యోపదండి.సాయంత్రం ఏమీ వుండదుఅంటూ డైనింగ్‌ హాల్కి తీసుకెళ్ళి తనే కంచంలోఅన్నంచపాతిపప్పుమజ్జిగ పట్టుకొచ్చిందిఆకుకూర,పెరుగుఅయిపోయినట్టుంది అంది నాకు చపాతి వద్దు కొంచం అన్నం చాలు అని పప్పు అన్నంతిని మజ్జిగ తాగానుపప్పుఅన్నం తిని మజ్జిగ తాగానుపప్పు చాలా రుచిగావుంది. 5గంటలకు హాలు దగ్గరికి రమ్మన్నారుఅప్పటి వరకు మాట్లాడవచ్చు.సెల్ఫోన్‌, డబ్బు వాళ్ళ దగ్గరడిపాజిట్‌ చేసేసాను.
ఆవరణంతా చెట్లతోహాయిగా వుందివాతావరణం బావుందిపెద్ద లోటస్పాండ్లో పసుపుపచ్చ కలువలుపూసాయిమూడు రౌండ్లు నడిచి ఒక చెట్టు దగ్గర కూర్చున్నానుసత్యవతిగారూ!అంటూ పిలుపుసర్వీస్‌ కమీషన్‌ కొలీగ్‌.  ఇద్దరం మాట్లాడుతూ మరో రౌండునడిచాం.నాలుగింటికి నా రూమ్‌ కొచ్చాను.ఇక్కడికి రాగానే పెద్ద బరువేదో వదిలినట్టుందిచేతిలో పైసా లేకుండాహాయిగా పది రోజులు వుండొచ్చురూమ్కి తాళం వెయ్యక్కరలేని హాయిదేనినీపట్టించుకోనక్కరలేదుదేనినీ మొయ్యక్కర్లేలేదుబ్యాగ్‌,సెల్ఫోన్బాదరబందీలేదురూమ్‌ తలుపుదగ్గరేసి అలా చెట్లలోకి నడుచుకుంటూవెళ్ళిపోవడం అబ్బనిజంగా ఎంత సుఖంగా వుందోపది రోజులపాటు దొరికే ఈస్వేచ్చ.  శృంఖాలాలుగొలుసులు లేని స్వేచ్ఛని అనుభవించడం నిజంగా గ్రేట్ప్రివలేజ్‌. ఎలాంటి మతపరమైన బోధనలుకీర్తనలు లేకపోవడం కేవలం కేవలంప్రకృతితోసంబంధం వుండడంమనతో మనకి మాత్రమే సంబంధం వుండడం ఫీలింగ్‌ గుడ్‌.రేపటి నుండి ఎలా వుంటుందో తెలియదు.   అనుభవం ఎలా వుంటుందో చూడాలినాకిష్టమైన చెట్లుపిట్టలు వుండనే వున్నాయివుండలేకపోవడం ఏమిటి?దూరంగా ఎక్కడినుండో నెమలి కేక కూడావినిపిస్తోందికోయిల బృందగానం వుండనేవుంది

ఆరుగంటల నుండి ఏక్టివిటీ మొదలైంది.ఆరింటికి ఉప్మాటీఇచ్చారుఅదేరాత్రిభోజనం  తర్వాత మెడిటేషన్‌ మొదలైందివిపాశన ప్రారంభించిన గురువుసత్యన్నారాయణ గోయంకాగారి ఆడియో పన్యాసంతో తొలి మెడిటేషన్‌. పాటించాల్సిననియమాలుఅంతకు ముందుదమ్మసేవకులు పాతసాధకులునియమాల గురించి వివరిస్తూఆవరణలో వున్న వివిధ మెడిటేషన్‌ సెంటర్లు చూపించారు తర్వాత ఐడికార్డుఇచ్చారురాత్రి తొమ్మిది వరకు మెడిటేషన్‌ నడిచిందిబాసింపట్టులో అంతసేపు కూర్చోవడం కష్టమైందిగుండె బరువెక్కినట్లనిపించింది.నొప్పిగాకూడా అనిపించిందిదాన్ని పట్టించుకోకుండా మెడిటేషన్‌ చేసానురాత్రి9.30 కి లైటార్పేసి పడుకున్నానుచాలాసేపు నిద్రపట్టలేదు.  దీని '0' డే అంటారుబుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం కనుగొన్న మెడిటేషన్ని ఇలా ఇపుడునేర్చుకోవడం బావుందిమనం తీసుకునేశ్వాస మీదే ధ్యాస పెట్టడంపరధ్యాసలేకుండా వుండడం ఇదే మొదటి రెండు రోజులు.శ్వాస ఎటు వెళుతుందిఎలావెళుతోంది చూడ్డమే పని వేరే పనేమీ లేదు.

మొదటిరోజు.
ఉదయం నాలుగింటికి గంట మోగిందిఠక్కున మెలకువ వచ్చిందిబ్రస్చేసి,మెడిటేషన్‌ హాలుకెళ్ళిపోయాను. 4.30కి తొలిసెషన్‌ మొదలైందిశ్వాసమీదధ్యాస అంతేశ్వాస ఎలా వెళ్ళుతోందిలా బయటకు వస్తోంది గమనిస్తూ మనసునుముక్కు పుటాల మీదే కేంద్రీకరించమనిగోయంకా గారు హిందీలోనుఇంగ్లీషులోను,వేరొకాయన తెలుగులోను చెబుతూంటారుమనసు శ్వాస మీద నిలవదుఅది గమనించిమనసును లాక్కొచ్చి శ్వాస మీద నిలపమంటారు క్షణం వుంటుందిడోక్షణంపారిపోతోందివరంగల్‌ పోతుందిహైదారాబాద్‌ పోతుందిఅమెరికాపోతుంది.అండమాన్‌ పోతుందిఏమిటేమిటో ఆలోచనలు వస్తుంటాయిచిత్రమైనఆలోచనలొస్తుంటాయిఎవరితోనో మాట్లాడుతుంటాంమళ్ళీ గుర్తొచ్చి మనస్సునులాక్కొచ్చి ముక్కు మీద కూర్చొబెడతాంకొంచెం సేపు కూర్చుంటుందిమనసు అలానిలకడగా వున్నపుడు మనంశ్వాసని చూడగలుగుతాంమనసు షికార్లు చేస్తునప్రుడుశ్వాస మీద ధ్యాస వుండదుఆలోచనలని ఆపడం మన తరం కాదుగమ్మత్తుగా మనఆలోచనలకనుగుణంగా మన శ్వాసలో తేడా తెలుస్తుందిఎవరి మీదో కోపంఎప్పటిదో!వాళ్ళ పని లా పట్టాలిఏదో పని మిగిలిపోయింది.దానిని ఎపుడు పూర్తిచెయ్యాలిప్రియమైన వ్యక్తి ఆలోచనలోకి వస్తే... అప్రియమైనవాళ్ళు వస్తే..శ్వాసలో తేడా గమనించొచ్చుతనకు నచ్చని అంశం గుర్తొస్తే మనసు ఉద్రిక్తమౌతుందినచ్చినది గుర్తొస్తే మనసు సేదతీరుతుంది తేడాలుశ్వాసలో తెలుస్తాయిద్రేకపడినప్పుడు శ్వాసబరువుగాబలంగా వస్తుంది.అంటే నెగిటివ్‌ విషయాలు ఆలోచనల్లోకి వచ్చినపుడు శ్వాస బరువెక్కుతుంది.గాలి ధారాళంగా లోపలికి వెళ్ళలేకపోతుందిమనసు తేలికగా వున్నపుడు గాలిమాములుగాతేలికగా వెళ్ళిపోతుందిఅలాగే మనసు ఎప్పుడూ గతంలోకిభవిష్యత్తులోకిచక్కర్లు కొడుతూంటుందిఇప్పటిమీద నిలవదునిన్నేంజరిగిందిఎందుకు జరిగిందిఎలా జరిగింది లాంటి జరిగిపోయినవాటిమీదరేపేంజరగబోతోందిఏం కాబోతోందిలాంటి వాటి చుట్టే తిరుగుతుంటుందిదీనివల్లఆందోళన పెరిగి ప్రస్తుతాన్ని ఆస్వాదించలేకపోతాంఇది తొలిరోజుగోయంకా గారి ఉపన్యాససారాంశం.ఉదయం 4.30 నుండి మధ్యలో కొంత విరామంతో రాత్రి 9.00దాకా సాగింది మెడిటేషన్‌. సాయంత్రం ఎనిమిదిన్నరకి గోయంకా గారి వీడియో ప్రసంగం విన్నాం.ఆయన్ని చూసాం టివిలోసాయంత్రం ఐదింటికి మరమరాలుఅరటిపండుటీఇచ్చారు.ఇదే డిన్నర్‌. తొమ్మిదింటి దాకా మెడిటేషన్లో వున్నాం కానీ ఆకలివెయ్యలేదుమధ్యాహ్నం అన్నంచపాతీలుకమ్మటి పప్పు తియ్యటి పెరుగువేడివేడి సొరకాయబెండకాయ కూరతో మంచి భోజనంఉదయం ఆరింటికి వేడి వేడి పొంగలి,పల్లీ చట్నిఅరటిపండు,టీ.తొమ్మిదింటికి రూమ్కొచ్చిన వెంటనే పడుకుండి పోయానువెంటనే నిద్రపట్టేసింది రోజు నేను నేర్చుకున్న ముఖ్యమైన అంశంభోజనాన్నిప్రేమగాఇష్టంగాగౌరవంగా తినడం.ఏం తింటున్నామో తెలుసుకుంటూ తినడం.ఆకలిని అర్ధం చేసుకోగలగడంనచ్చని అంశంబుద్ధుడినిభగవానుడనడంశ్వాసమీదధ్యాస సాధిస్తే పరమపదం పొందుతారని చెప్పడంపరమపదం అంటే ఏమిటిసెంటర్లోఎక్కడా బుద్ధ విగ్రహంగానీగోయంకా గారి ఫోటోలు కానీ లేవుఇది బావుంది.



రెండోరోజు.
నాలుగింటికి గంట మోగిందివెంటనే లేచాను.  సెంటర్వేపు నడిచానుచాలానిశ్శద్ధంగా వున్నాయి పరిసరాలుచల్లటిగాలిరావిఆకుల గలగలుమాతో పాటేకొన్ని పక్షులు లేచాయికోయిలమ్మ గొంతు సవరించుకుంటూ కూయడంమొదలుపెట్టిందిరకరకాల పిట్టల సంగీతం వింటూసెంటర్దాకా నడిచానురోజూఇరవై సార్లన్నా ఇదంతా నడుస్తాను. నిశ్శబ్దవేళ 4.30కి మెడిటేషన్మొదలైందినిన్న మొదలైన ప్రశ్నలవల్ల ఒక వ్యతిరేక భావం రావడంతోమెడిటేేషన్‌ కష్టమైందిపదే పదే అవే ప్రశ్నలు వేధించడంతో ఇంక చెయ్యలేనేమోఅనుకున్నాను ''జీవనకళనునేర్చుకోవడమే విపాసన'' అని గోయంకా గారు చెప్పడంతోఆ రెండు ప్రశ్నల్ని పక్కన పెట్టానుసింపుల్గాఅర్థవంతంగాఆనందంగా జీవించడానికే  కళ అని ఆయన రెండోరోజు చెప్పారుబుద్ధుడిని భగవాన్అనలేదుకాని స్వర్గంనరకంపాపంపుణ్యం అంటూ బుద్ధుడువ్యతిరేకించినవాటిని ప్రస్తావించారు రెండు రోజుల సాధన విపాశనకి ఉపయోగపడుతుందిఅన్నారుఅంటే విపాసన వేరే వుందని అర్థమైందిబహుశ రేపటి నుండిమొదలవుతుందోమో! 4.30 నుండి మధ్యలలో కొంత విరామమిస్తూ 9.00 దాకా సాగింది
అంత సేపు కూర్చోవడం చాలా కష్టంగా వుంది మోకాళ్ళు పాదాలు విపరీతమైననొప్పిఐదు నిమిషాలు ఒకే ఫోజులో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నాను.కావాలంటే కుర్చీ మీద కూర్చోవచ్చుదిండులేసుకుని కిందే కూర్చున్నాను.ఆరింటికి ఉప్మాబత్తాయి పండు ఇచ్చారుఎనిమిదిదాకా రెస్ట్‌. అపుడేస్నానంరూమ్‌ శుభ్రం చేసుకోవడంబట్టలుతుక్కోవడంలాండ్రి సౌకర్యంవుందినేను తొలిరోజు మాత్రమే లాండ్రికిచ్చానుతర్వాత నేనే ఉతుక్కోవడంమొదలుపెట్టానుపనులన్నీ స్వయంగా చేసుకోవడం చాలా బావుందిమధ్నాహ్నం మంచిభోజనంకేసరి స్వీట్‌.ఎ్కవ తినడంవల్ల మధ్యాహ్నం సరిగా కూర్చోలేకపోయాను.ఇలా చెయ్యకూడదు.

 సాయంత్రం ఆరింటికి పేలాలుబత్తాయిపండుటీఅదే డిన్నరుపేలాలు తినిబత్తాయి రూమ్కి తెచ్చానురాత్రికి ఆకలేస్తుందేమోననే భయం వదలడం లేదు.నిజానికి ఆకలి వెయ్యడం లేదుతొమ్మిదింటికి రూమ్కొచ్చి బత్తాయి తిని,స్నానం చేసి నిద్రపోయానుమూడు రోజులుగానిశ్శబ్దమేమాటలు లేవు.ఒకరివేపు ఒకరు చూడ్డంలేదుతలదించుకుని ఎవరి ధోరణిలో వాళ్ళుమూడు
రోజుల్లో కేవలం మూడు మాటలుఅదీ టీచర్తోదమ్మ సేవకులతోమాట్లాడాను.గోయంకా గారి ఉపన్యాసంలో కొంచెం నవ్వాను అంతేమా గుంపులోపెద్దవాళ్ళుమధ్యవయస్కులుపిల్లలు దాదాపు డెబైమందిపన్నెండు మందిక్రిస్టియన్‌ నన్స్‌ వున్నారుఅందరూ చాలా శ్రద్ధగాచేస్తున్నారుతొలిరోజు వాళ్ళతో మాట్లాడానుమీరు ఎందుకు వచ్చారు అంటే డిఫరెంట్ఎక్స్పీరియన్స్‌ కోసం అన్నారునేనూ అందుకే వచ్చానని చెప్పాను.

మూడో రోజు

నాలుగింటికి బెల్‌. నాలుగున్నర నుండి 6 వరకు మెడిటేషన్‌. ఆరింటికిఇడ్లీలు పల్లీ చట్నీబత్తాయి పండుపండురూమ్కు తెచ్చానుఎనిమిది నుండి11 వరకు కంటిన్యూయస్గా మెడిటేషన్‌. కూర్చోవడం చాలా కష్టంఅయినాకూర్చుంటాంకూర్చోలేక బయటకొస్తే రెండు నిమిషాల్లోదమ్మ సేవకురాలు వచ్చినమస్కరించి లోపలికి పదమంటుందిసౌంజ్ఞలేమాటలుండవుపదకొండుకి వేడి వేడిభోజనంమితంగా తినడం మంచిదిలేకపోతే కూర్చోలేం.  ఒకటినుండి రింటివరకునిరంతరధ్యానంమధ్యలో టీచర్తో మాట్లాడొచ్చు ''మీరు మధ్యలో లేవకండి.కళ్ళుతెరవకండి'' అని సలహా ఇచ్చారుశ్వాస మీద ధ్యాసపెట్టండి.నొప్పులుండవు '' అని కూడా అన్నారునాకు విపరీతంగా చెమట పడుతోందిఅంటేచాలా మంచిది కదాచెమట పట్టాలంటే ఎంత కష్టపడాలిమీకు ఫ్రీ స్టీమ్‌ బాత్అవుతోంది కదా  అంటూ నవ్వారు''.  నేను కూడా హాయిగానవ్వానుఆవిడ సలహాపాటించానుమధ్యలో లేవలేదు.కళ్ళు తెరవలేదు.నొప్పుల మీద దృష్టిిపోయింది.శ్వాస మీదే ధ్యాస పెట్టాను. 7 గంనుండి తొమ్మిదిదాక మళ్ళీ ధ్యానం.గోయంకా గారి ఉపన్యాసంరేపు విపాశన నేర్పుతామని చెబుతూ చాలా సరదాగామాట్లాడారుచాలానవ్వానుబుద్ధుడి అష్టాంగ మార్గాల గురించి చెప్పారు.విపాశన తర్వాత ఎలాంటి మార్పులొస్తాయో ప్రతి క్షణాన్ని ఎరుకతో ఎలాఆస్వాదిస్తామో ప్రతిదీ నిరంతరం ఎలా మార్పు చెందుతుందోశరీరంలోని కణాలుచస్తూ పుడుతూ ఎలా వుంటాయో మంచి సరదా ఉదాహరణతో చెప్పారు.ప్రతిదీఅశాశ్వతమనిమార్పు మాత్రమే శాస్వతమని అర్థం చేసుకోవాలని చెప్పింది వినినేను ఆశ్చర్చపడ్డాను.''మార్పు మాత్రమే శాశ్వతం'' అని ఒక సందర్భంలో నేను
రాసిన కవిత గుర్తొంచ్చిందిఒక వేదనామయ సమయంలో నేను  కవిత రాసాను.భ్రమలకు లోనవ్వకుండా అన్నింటినీ తీక్షణంగా చూడాలనిఅప్పటికి ఏది సత్యమోఅదే సత్యమనిగతానికి భవిష్యత్తుకు లంకెపెట్టి మనుషులు బాధపడతారనివాస్తవంలో ఎప్పుడూ జీవించరని ఆయనచెప్పింది నేను చాలాకాలంగాఆచరిస్తున్నదేగతం గొప్పది భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతోనే మనిషి బతుకుతుంటాడునాకెప్పుడూ  ఆందోళన లేదునేను ప్రస్తుతంలోనే జీవిస్తాను.తొమ్మిదింటికి రూమ్కొస్తే ఒకావిడ రూమ్‌ ముందు పాము ముడుచుకునిపడుకుంది.అందరూ బేజారయ్యారుమౌనం వీడి మాటల్లో పడ్డారు లోపు దమ్మసేవిక వచ్చిచాలా నిబ్బరంగా పాముని చీపురుతో తొలగించేసి అందరినీ రూమ్లోకి పంపింది.పాము పెద్దదికాదుచిన్న కట్లపాముపిల్లఅయినా జనాలకి పామంటే భయమేకదా!.చిన్న పాము పిల్లఅందరి మౌనాన్ని కాసేపు భగ్నం చేసిందిరూమ్లోపలికొచ్చి ఉదయంసాయంత్రం సేకరించిన బత్తాయిలు తినిస్నానం చేసిమంచమెక్కానుచాలాసేపు నిద్రపట్టలేదురేపు విపాశన నేర్పుతారట., అంటేఏమిటోనని చాలాసేపు ఆలోచించానుమెల్లగా నిద్రపట్టిందిఏవేవోకలలు.ఒంటిగంటకు ఏదో చప్పుడై మెలుకువవచ్చిందిమంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నానుసాయంత్రం మెడిటేషన్‌ అయ్యాకా వొళ్ళంతా తేలిక పడుతున్నఫీలింగ్‌ వచ్చి నవ్వొచ్చింది.
నాలుగోరోజు
 రోజు  చాలా ముఖ్యమైందిరోజూలాగానే 4 గంటలకి లేవడం, 4.30కిమెడికేషన్లో కూర్చోవడం. 4.30కి ప్రకృతి ఎంత ప్రశాంతంగాసమ్మోహనంగావుంటుందోచల్లటిగాలి అడక్కుండానే ప్రేమగా వొళ్ళంతా తాకుతుందిఆనిశ్శబ్దం మనసును ఎంత హాయి పరుస్తుందోమధ్యాహ్నంవిపాశన
క్లాసువుంటుందనిరెండు గంటలు ఎవ్వరూ హాల్లోంచి బయటకెళ్ళకూడదనిఆసనం మీంచి లేవకూడదని చెప్పారుమూడు రోజులపాటు శ్వాస మీద ధ్యాసతో మెడిటేషన్‌ నడిచింది. 3.15కి గోయంకాగారి ఆడియో ఉపన్యాసం మొదలైందివిపాశన గురించి.కళ్ళు మూసుకుని తలమీదిఆయువు పట్టును చూడమన్నారుతర్వాత ముఖం కళ్ళు,చెవులుముక్కుబుగ్గలునోరు పెదవులుమెడ కుడి చెయ్యి మొత్తం ఎడమచెయ్యి మొత్తంగుండెపొట్టనాభికుడికాలు మొత్తంఎడమ కాలు మొత్తం,వీపు మొత్తం మీద శ్వాసను నడుపుతూ చూడమన్నారుఏంసంవేదన/సెన్సేషన్జరుగుతుందో గమనించమన్నారుశిరస్సు నుంచి పాదాలదాకా ఎలాంటి సెన్సేషన్ఏర్పడుతున్నాయో సాక్షిలాగా గమనించమన్నారుప్రతీదీ అశాశ్వతంపుడుతుంది,నశిస్తుందినిత్యం మారుతుంది అనే ఎరుకతో గమనించమన్నారుతలనించిపాదాలకొచ్చేసరికిఎన్నో నొప్పులు పుడతాయినశిస్తాయిచెమట పడుతుంది.ఆరిపోతుందిదురద పుడుతుందిపోతుందిశరీరం మొత్తంలో నిరంతరం ఎన్నోసంవేదనలు పుడుతుంటాయిపోతుంటాయ్‌. మళ్ళీ పుడుతుంటాయ్‌. పోతుంటాయ్‌.వాటిని నిర్వేదంగానిరపేక్షంగాసాక్షిలాగాగమనించమంటారుఏదీ నిత్యంకాదుఏదీ శాశ్వతం కాదు అనే దృష్టిలో సంవేదనలని చూడమని చెప్పారుఅలాగేఎక్కువ నొప్పిని ద్వేషించవద్దనితక్కువ నొప్పిని ప్రేమించవద్దనిరెండూశాశ్వతం కాదని తలనించి పాదాలవరకు జరిగే ప్రయాణంలో కనబడే సంవేదనలన్నీశాశ్వతంకాదనే ఎరుకతో చూడమని చెప్పారువిపాశన అంటే మార్పు.  శరీరంలోను,ప్రకృతిలోను నిరంతర మార్పులు జరుగుతుంటాయిఏదీ శాశ్వతం కాదు అనే ఎరుకే విపాశన అని నాకు అర్థమైందిక్లాసయ్యాక బయటికొచ్చాక  బెంచీ మీద చాలాసేపు అలాగే కూర్చుండిపోయానునాఆలోచనా విధానం విపాశనకు చాలా దగ్గరగావుందనిపించిందికళ్ళల్లో ఎందుకో నీళ్ళొచ్చాయిఎవరితోనైనా మాట్లాడితేబావుండనిపించిం '' మార్పుమాత్రమే శాశ్వతంమరేదీ కాదు'' అంటూ నేను రాసుకున్న కవిత పదే పదేగుర్తొచ్చిందిఎంతో అందంగా పూసే బ్రహ్మకమలం ఎంతఅశాశ్వతమోగుర్తొచ్చిందిఎర్రటి చిగురాకుఆకుపచ్చగా మారిపసుపు రంగుకు మారి రాలిపోవడం గుర్తొచ్చిందిఅందమైన గులాబీ నాలుగు రోజులకే రేకులన్నీరాలిపోయి నిర్జీవమవ్వడం గుర్తొచ్చిందిప్రకృతిలో ప్రతిదీ పుడుతూనశిస్తూమళ్ళీ పుడుతూ నశిస్తుంటుందిమనిషిమాత్రమే తాను శాశ్వతమనివిర్రవీగుతాడుఎంతో విధ్వంశం సృస్టిస్తాడుసంపద పోగేసి జనాలని దోపడీ
చెయ్యాలనుకుంటాడుఏదీ శాస్వతం కాదు తానే శాశ్వతం కాదు అనే ఎరుకతోజీవించడంఅదే ఎరుకతో మరణించడం విపాశన అని నాకు అర్థమైంది.

ఐదో రోజు

  రోజు కూడా 4.30 నుండి 9 దాకా ధ్యానం సాగిందినిన్న తలనించి పాదాలవరకు మనసును నడుపుతూ మెడిటేషన్‌ చేస్తూ శరీరంలో  భాగంలో  స్పందన కలుగుతుందో చూస్తూ స్పందనలను అర్థం చేసుకోమని చెప్పారు రోజు పాదాలనుండి శిరస్సుదాకా చూడమనిచెప్పారుగంటసేపు కదలకుండాకళ్ళు తెరవకుండామెడిటేషన్‌ చేస్తూ మనసుతో శరీరంలోని అంగాంగాన్ని పరిశీలిస్తే ఎన్నోసంవేదనలు తెలుస్తాయినెప్పులుచెమటలుమంటలుదురదలుదగ్గులుతుమ్ములుఆవలింతలు ప్రతి అంగంలోను ఏదో ఒక సంవేదన పుడుతూ,నశిస్తూవుంటుందిచెమట మీద చల్లగాలి తగిలినపుడు హాయిగా వుండడంచెమటకిమంటపుట్టినపుడు చికాకుగా కోపంగా వుండడం అన్నీ తెలుస్తుంటాయి. 150 మందికూర్చునే హాలులో ఫ్యాన్లు వెయ్యరుచెమట పట్టాలని  ఫీలింగ్స్తెలియాలని ఫ్యాన్లు వెయ్యరని తర్వాతఅర్థమైంది కానీ ముందు చాలా కోపమొచ్చేదికోపంగా బయటకొచ్చి చల్లగాలిలో తిరిగిన సందర్భాలు కూడా వున్నాయికానీ  స్థితి అవసరమని తర్వాత అర్థమై నా ప్రవర్తనకి సిగ్గుపడ్డానుఆల్మోస్ట్‌ అందరూ అలాగే చేసారు.  తలనించి పాదాలదాకాపాదాలనించి తలదాకా కళ్ళుమూసుకుని సర్వే చేస్తున్నపుడు శరీరంలో ఎన్నో స్పందనలు పుట్టినశిస్తున్నాయని స్పందనా శాశ్వతంగా వుండదని అర్థమౌతుందితలనించి దిగుతున్నపుడు మెడమీద నొప్పి వుండొచ్చుమళ్ళీ పాదాలనించి తలమీదికి వచ్చేటప్పటికీ  నొప్పి పోవచ్చుతీవ్రత తగ్గొచ్చుఅంటేశరీరంలో పుట్టే ప్రతి స్పందన అశాశ్వతంశరీర ధర్మం ప్రకారం నొప్పులు,  చెమటలుదురదలు ఇంకా ఎన్నో సంవేదనలు వస్తూ పోతుంటాయిఒకనాటికి తన ధర్మం ప్రకారం ముసలిదై శరీరం నశిస్తుందిమట్టిలో కలిసిపోతుంది శరీరానికి ఎన్ని నగిషీలు చెక్కినాగుడిసెలో వున్నా,బంగ్లాలో వున్నావీధిలో వున్నా మరణం ఆసన్నమైనపుడు మరణిస్తుందిఇది శరీర ధర్మం.  ప్రకృతి ధర్మం కూడా అదేప్రకృతి కూడా అనుక్షణం మారుతుంటుందిగంగానదిలో నిలబడి నీళ్ళు తాగుతున్నపుడు ఒకే నీరును మరో మాటు ఎప్పటికీ తాగలేంతాగి తలయెత్తే సరిగాగంగా ప్రవాహం ఎంతో దూరం పోతుందికొత్త నీరు వస్తుందిహిమాలయాలు అలాగే  న్నట్లనిపిస్తాయికానీ హిమం కరుగుతూంటుందిమళ్ళీ మంచు కురుస్తూంటుందివిత్తనం మొలకెత్తగానే ఎదుగుతుంటుందిప్రకృతిలో చలనమున్నదంతా చలిస్తూనే వుంటుందిమారుతూనేవుంటుందిమార్పు సహజం.  సుకుమార బాల్యంముగ్ధయౌవ్వనంమధ్య వయస్సుముసలితనం – శరీరం నిరంతరం మారుతుంటుందిశరీరంలో కానీప్రకృతిలో కానీ ఏదీ నిత్యంశాశ్వతం కాదుఅంతా అనిత్యంమార్పు మాత్రమే శాస్వతంఇదే విపాశనప్రతి నిత్యం మారడాన్ని అర్ధం చేసుకోవడమే విపాశనమార్పును అర్థం చేసుకోలేక శాశ్వతమనుకుంటేనే దు:ఖంఇప్పటికిది నిజం.వాస్తవంఅంతే.

ఆరో రోజు 
 రోజు ఉదయం  గమ్మత్తు జరిగిందినాలుగ్గంటలకి విపరీతమైన వర్షం కురిస్తున్నపుడు మెలుకువ వచ్చిందిలేచి టైమ్‌ చూస్తే  నాలుగయ్యిందిబయట వర్షంగంట కొట్టారో లేదో తెలియడం లేదుఅందరి రూమ్‌ తలుపులు మూసే వున్నాయిఎవ్వరూ లేవలేదుబ్రష్‌ చేసుకునిబయటకొచ్చానుదమ్మ సేవిక కనబడిందిబెల్కొట్టలేదు అని చెప్పాను అపుడు వెళ్ళి బెల్‌ కొట్టించింది.  నేను గొడుగు తెచ్చానుగొడుగేసుకుని వర్షంలో సెంటర్కెళ్ళాను.  అలా కుండబోతగా కురుస్తున్న వర్షంలో ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళడం ఎంత బావుందో చెప్పలేను.కాసేపటికి వాన తగ్గిందిఒక్కొరొక్కరే రాసాగారుఆలస్యంగా  మెడిటేషన్‌ మొదలైందినిన్నటి పద్ధతేతలమీంచి పాదాలవరకు ఏం జరుగుతుందో గమనించడంగంటసేపు కదలకుండా కళ్లు మూసుకుని కూర్చుంటే అన్నీ తెలుస్తాయిమనసు ఎక్కడ ఆగుతుందో అక్కడ ఏదో సంవేదన/సెస్సేషన్‌ తెలుస్తుందిపదిగంటలకి మమ్మల్ని సెల్కి వెళ్ళమన్నారుసెల్‌ అంటే పగోడాఆరు అడుగుల పొడవు/మూడు అడుగుల వెడల్పు వుండే చీకటిగదిలైట్‌ వుంటుందికానీ చిమ్మ చీకటిలోనే కూర్చోవాలనిపిస్తుందిఅక్కడ కూర్చుని మెడిటేషన్‌ చెయ్యాలిఇక్కడకూడా  గమ్మత్తు జరిగిందినాకు ఆరు బయటే విపరీతంగా చెమట పడుతుందిపగోడాలోకి వెళ్ళగానే టాప్‌ తీసేసి  బనీనుపైజామా మీద కూర్చున్నానుచెమటతో తడిసి పోతాననుకున్నానుఒక్క చుక్క చెమట పట్టలేదు మాట టీచర్కి చెపితే '' మీరు పరిసరాలకు బాగాఅడ్జస్ట్‌ అవుతారుకొత్త ప్రాంతంలో కూడా టెన్షన్‌ వుండదుచాలామందికి పగోడా చూస్తే భయంచీకటి చూస్తే భయంమీకు ఎక్కడున్నా ఒకటేవాస్తవం మీద మీ దృష్టి వుంటుందిఇది చాలా మంచిది.'' అన్నారుమధ్యాహ్నం టీచర్‌ పిలిచారుఎందుకు పిలిచారా అనుకుంటూ ఆవిడదగ్గరికెళ్ళానుపగోడాలో ఎలా వుందో అడగడానికి పిలిచారుచాలాసేపు మాట్లాడారుఆవిడ కూడా పదిరోజుల కోసం వచ్చారు మాతో పాటే వెళ్ళిపోతారునా మెళ్ళో పూసలదండ ఏంటిఏం నమ్మకం అని అడిగారుఉట్టిదేసరదాగా వేసుకున్నానునేను నాస్తికురాలనుదేవుడిని నమ్మను అని చెప్పాను ఇరవై నిమిషాలు అవి ఇవి మాట్లాడారుఆవిడ ఎవరితోను అలా మాట్లాడ్డం చూడలేదుగుళ్ళల్లో నాకు ఎదురైన అనుభవాలు చెపితే బాగా నవ్వారుగోయంకా గారి ఉపన్యాసాలు చాలా బావున్నాయిచాలా వ్యంగ్యంగా సూటిగా మాట్లాడతారుబుద్ధుడిజీవితం గురించిఎందరివో అనుభవాలుగురించి చక్కగా చెబుతారుఆయన ఇంగ్లీషు అద్భుతంగా వుంటుందినేను ఆయన హిందీ ఉపన్యాసాలు విన్నానుతెలుగు అనువాదం నచ్చలేదురోజూ  కొత్త అనుభవంకొత్త ఆలోచనలు వస్తున్నాయి.

ఏడో రోజు ఉదయం  సంఘటన జరిగిందిబ్రేక్ఫాస్ట్కి వెళ్ళినపుడు సేవిక నన్ను అరటిపండు తీసుకోవద్దని సైగ చేసింది.మొదట నాకు అర్ధం కాలేదుసరేనన ఉప్మా మాత్రమే తిన్నానునేను పండు రూమ్కి తీసుకెళుతున్నాననిఐదు తర్వాత ఏమీ తినకూడదనే నియమం వుందికాబట్టి అలా చెప్పింది కాబోలనుకున్నానుఆమెను అడిగానుఎందుకు అలా చెప్పారని (సేవికతో మాట్లాడొచ్చురూమ్కు తీసుకెళ్ళి తినడం 'శీల్భంగ్‌' అని అలా చెయ్యకూడదని చెప్పింది.  కానీ చాలామంది రూమ్కి తీసుకెళ్ళడం గమనించాకేతీసుకెళ్ళొచ్చనుకుని నేనూ అలాచేసాను. 'శీల్భంగ్‌' అనే మాట చాలా చికాకు పెట్టిందిటీచర్కెళ్ళి చెప్పాను. ''నేను  పొరపాటు చేసానునాకు తెలియక చేసాను'' అన్నాను.'' ఫర్వాలేదులెండిఇపుడు తెలిసి మానేసారుగాచెప్పారు కాబట్టి మాఫీ  యిపోయిందిలెండి '' అంటూ నవ్వారుమనసులో చికాకు మాయమైపోయిందిఅంతకు ముందు చాలా గింజుకున్నానుఎందుకు అలా చేసానని చాలసేపు మధన పడ్డానుపొరపాటును ఒప్పేసుకునిబయటకు చెప్పేసుకోవడంతో ఎంత రిలీఫ్‌ వుంటుందో తెలిసి వచ్చింది.

పగోడాలో ఏడుపు

విపాశన మెడిటేషన్లో పగోడాలో కూర్చుని చేసే మెడిటేషన్‌ చాలా పవర్ఫుల్గా వుంటుందిమనసు చాలా తీక్షణమౌతుందిఏడో రోజు పగోడాలో మెడిటేషన్‌ చేస్తున్నపుడు నాకెందుకో ఆపుకోలేనంత ఏడుపు వచ్చిందివెక్కి వెక్కి ఏడుస్తూనే వున్నానునా జీవితంలో నేను చేసినకొన్ని తప్పులు కొన్ని గుర్తొచ్చాయివాటివల్ల ప్రభావితమైన వాళ్ళు గుర్తొచ్చారునా ప్రవర్తన వాళ్ళనెంత  బాధపెట్టి వుంటుందో గుర్తొచ్చిందిఇలాంటివి ఒకటి రెండు సంఘటనలే నా జీవితంలో జరిగాయిఅవే గుర్తొచ్చి అమితమైన దు:ఖం కలిగిందిరెండోది హెల్ప్లైన్కి కాల్చేసేఅసంఖ్యాక స్త్రీల దు:ఖంవారి సమస్యలుబాధలు గుర్తొచ్చి మరింత ఏడుపు తన్నుకొచ్చిందినా స్నేహితుల్లోనా చుట్టూ వున్న వాళ్ళల్లో కొంతమంది పడుతున్న మానసిక వేదనలుసంఘర్షణలు గుర్తొచ్చి కూడా చాలా ఏడుపొచ్చిందివాళ్ళంతా  దు:ఖాలను మోయకుండా,ఇలాంటి మెడిటేషన్కొచ్చి బరువుల్ని దింపేసుకోగలిగితే ఎంత బావుంటుంది అనిపించిందిపగోడాలో ఏడుపు గురించి టీచర్కి చెప్పాను. ''అలా దు:ఖం రావడం చాలా మంచిదిలోపలున్న బరువంతా కరిగిపోయిందిస్త్రీల దు:ఖం మిమ్మల్ని కదిలించింది వాళ్ళంతా సంతోషంగావుండాలని మీరు భావిస్తారుఅందుకే వాళ్ళకోసం ఏడ్చారు'' అన్నారావిడ.

 ఆకలివేళ అందిన బిస్కట్

మెడిటేషన్‌ పూర్తయ్యాక తొమ్మిదింటికి రూమ్కొచ్చి స్నానం చేసినైటీ తగిలించి బయటకొచ్చి నిలబడ్డానుబయట చల్లగాహాయిగా వుందిఎదురుగా అర్థచంద్రుడుమెల్లగా ఆకలి మొదలైందిరూమ్‌ లోపలి కెళ్ళి నీళ్ళు తాగాను.  కాసేపు చల్లబడిందిమళ్ళీ మొదలైందిఐదింటికితిన్న మరమరాలుసేవిక అలా చెప్పాకాఅరటిపండు డైనింగ్హాల్లో కూడా తినాలనిపించలేదుతినలేదుఇంత ఆకలేస్తోందినిద్రపడుతుందా అసలుపొద్దున నాలుగింటికి లేవాలి కదాతలుపేసి పడుకున్నానుఊహూఆకలి.. మళ్ళీ వరండాలో కొచ్చానుఅటుఇటూ తిరగడం మొదలుపెట్టానుఅలా తిరుగుతున్నపుడు హఠాత్తుగా పక్కరూమ్లో ఉన్నావిడ ఓ చిన్న బిస్కట్‌ పాకెట్‌ తెచ్చి నా చేతిలో పెట్టిందిఆశ్చర్యపోయానుమాటలుపరిచయాలు లేవు కాబట్టి ఆవిడ పేరు తెలియదువొద్దన్నానుఫర్వాలేదు తీసుకోండి అని సైగలద్వారానే చెప్పిందితర్వాత ఆవిడ లోపలి కెళ్ళిపోయారునేను నా రూమ్లో కొచ్చి బిస్కట్‌ ప్యాకెట్‌ విప్పానుమూడు బిస్కట్లున్నాయిబ్రిటానియా వాళ్ళు కొత్తగా తెస్తున్న రాగిబిస్కట్లురెండు బిస్కట్లు తిని నీళ్ళు తాగాక అబ్బఆకలి మంట చల్లారడం అంటే ఏంటో అర్థమైందిఅసలావిడకినాకంత ఆకలిగా వుందని ఎలా అర్థమైదబ్బాబిస్కటివ్వాలని ఎందుకన్పించిందబ్బా అంటూ ఆశ్చర్యపోతూఆలోచిస్తూ నిద్రపోయాను.

 ఎనిమిదితొమ్మిది రోజులు పూర్తిగా మెడిటేషన్తోనే గడిచాయితలనుండి పాదాలవరకుపాదాల నుండి తలవరకు గమనిస్తూ మెడిటేషన్‌ చెయ్యాలిరిపీటెడ్గా గంటల తరబడి అదే స్థితిలో వుండాలిశరీరంలోని అంగాంగాన్ని గమనించడంకలుగుతున్న సంవేదనల్ని చూడడం,సుఖకరమైన వాటినిదు:ఖకరమైన వాటిని సమంగా చూడడంనొప్పిని ద్వేషించడంసుఖాన్ని ప్రేమించడం చెయ్యకుండా సమతని పాటించడం చాలా ముఖ్యమైన అంశంగా వుంటుందికళ్ళు మూసుకుని అంతర్వేత్రం తో మనసుని అంగాంగం మీదికి నడిపిస్తున్నపుడు చాలా అనుభవాలు కలుగుతాయిమనసు ఒక అంగం మీద ఆగినపుడు అక్కడ ఏదో ఒక సెన్షేషన్‌ వుంటుందినొప్పోదురదోమంటోచెమటో ఏదో ఒకటి వుంటుందిమన రియాక్షన్స్‌ కూడా వుంటాయిదురద పెట్టగానే గోకడం కూడా రియాక్షనేదురదని ద్వేషిస్తాంకోపంగా గోకుతాం.చెమటపట్టి చీదరగా వున్నపుడు చెమటని ద్వేషిస్తాం చెమట మీదికి చల్లగాలి వాలినపుడు  చల్లదనాన్ని ప్రేమిస్తాంరెండూ క్షణికమైన భావాలేఅశాశ్వతమైనవేమనం శిరస్సు నుంచి పాదాల వరకు అంతరౌత్రంతో ప్రయాణం చేస్తున్నపుడు మన ప్రయాణం   లుపెట్టినపుడుముక్కు మీద దురదనోచెమటలోమంటో ఏదో ఒక సంవేదన కనబడుతుందిమనం దాన్ని అలాగే సాక్షిలాగా చూసుకుంటూ పాదాలవేపు ప్రయాణం అయిపోతే...మళ్ళీ పాదాల నుంచి శిరస్సు వేపు వచ్చినపుడు  సంవేదన ముక్కు మీద వుండకపోవచ్చుచెవిమీదోనుదిటి మీదోఅలాంటి సంవేదన కనబడవచ్చుగోయంకా గారు చాలా సార్లు అనిత్యఅనిత్య అంటూంటారుఅలాగే మనసు పొరల్లోనోగుండెల్లోనో గూడు కట్టుకుని గడ్డకట్టుపోయిన సంవేదనలుమన సబ్కాన్షన్‌ మైండ్లో నిక్షిప్తం అయివున్న జ్ఞాపకాలుద్వేషాలుప్రేమలుదు:ఖాలుఅసంఖ్యాకసంఘటనలు - మనం సంవత్సరాలుగా మోస్తున్న దు:ఖపు మూటలు మన అంతర్నేత్రానికి ఆనడం మొదలుపెడతాయిశాస్వత సంపదగా మనం మనలోపల నిక్షిప్తం చేసుకున్న గుట్టలకొద్దీ సంవేదనలువాటిద్వారా మనకి ఎదురైన దు:ఖాలుసుఖాలు అన్నీ కళ్ళకు కట్టడంమొదలౌతుందిఎవరిమీదో ఎంతో కాలంగా పెంచుకునిగుండెల్లో ఘనీభవించుకున్న ద్వేషం,ఎవరి మీదో అవధుల్లేకుండా పెంచుకున్న ప్రేమ ప్రేమవల్ల ఎదురైన దు:ఖాలు కరగడం మొదలౌతాయిఘనీభవించిన సంవేదనలు కరుగుతున్నపుడు  మన కళ్ళల్లోంచి ఒక్కోసారికన్నీళ్ళు ధారకడతాయిచాలామంది బాగా ఏడుస్తారునా వరకు నేను ఎవ్వరి మీద శాశ్వత ద్వేసాన్ని పెంచుకోలేదునాకు ఎవరి మీద అంతద్వేషం లేదు.

కానీ ఒక సంఘటన ఇక్కడ చెప్పాలినేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటపుడు  డివిజన్‌ సబ్కలెక్టరు నా మీద అకారణ ద్వేషం చూపించేవాడుమీటింగ్ల్లో నిలబెట్టి అవమానించడంపరుషంగా మాట్లాడడం చేసేవాడుదానికి కారణముండేది కాదుబహుశా నా బాడీ లాంగ్వేజ్‌,ధిక్కార స్వభావం అతనికి నచ్చివుండవునాకు రెవెన్యూ డిపార్ట్మెంట్‌ ఫ్యూడల్‌ బానిసత్వపు లక్షణాలు అలవడలేదునేను ఆఫీసుకు నా కైనటిక్‌ హోండా మీద వెళుతున్నపుడుఅతని జీప్‌ ఎదురుపడిందంటే సాయంత్రం మీటింగ్లో అతను శివాలు తొక్కేవాడుదీనివల్ల అతనిమీద నాకు విపరీతమైన ద్వేషంఅసహ్యం పెరిగిపోయాయిఛాన్స్‌ వస్తే ఎప్పుడో తన్నాలి అన్నంత అసహసం పెరిగిపోయిందిఇదంతా నా మనసులో ఘనీభవించిపోయిందిఅతని పేరు తలిస్తే వొళ్ళంతా కంపించి పోయేంత కోపంనేను  డిపార్ట్మెంట్‌ వొదిలేసి వచ్చాకా పదేళ్ళ వరకు ద్వేషం నాలో వుందిసంవత్సరం క్రితం భూమిక పనిమీద అతన్ని కలవాల్సి వచ్చినపుడుకలిసి మాట్లాడినపుడు ఇతని మీద ఇంతకాలం  ద్వేషాన్ని అలాగే గడ్డకట్టి దాచుకున్నానా?  అని సిగ్గనిపించింది ద్వేషం అలాగే వుండడంవల్ల నా కోపం పెరగడం తప్పలాభామేముందిఅతని కొచ్చిన నష్టమేముందిపోనీ  నీ వల్ల నేనింత బాధపడ్డాను అని చెప్పానాచెప్పేవీలుందాలేదు కదా!   రోజు అతని మీద ద్వేషం కరిగిపోయిందిగమ్మత్తుగా అతనిపుడు మా ఇంటి ఎదురుగా కొత్తగా కట్టిన ఐఎఎస్‌/ఐపిఎస్‌ క్వార్టల్లో కొచ్చాడుఅతని మీద అదే ద్వేషం కొనసాగివుంటే  రోజు  ఇంటి వైపు చూస్తూ కోపంతో సతమతమై వుండేదాన్నిఇపుడలాంటి ఫీలింగ్‌ లేదుఅలా గడ్డకట్టిన ద్వేషాలుకోపాలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో  మనకు అనుభవమే.నేను ఇప్పటికీ ద్వేషిస్తున్న మనిషిక్షమించలేని మనిషిమరొకడున్నాడుఅతను నరేంద్రమోడిపేపర్లో అతని ఫోటో కనిపిస్తే చాలు అతని కళ్ళని చింపేస్తానుఅతని ఫోటోలోని కళ్ళుల్లోకి చూడడం కూడా నాకు ఇష్టం వుండదుఅయితే  ద్వేషంకోపంవల్ల నాకు జరిగే నష్టం ఏమీ లేదు కానీ అతను జరిపించిన మారణకాండని నేనెప్పటికీమర్చిపోలేనుఅయితే మోడీ మీద ద్వేషం వ్యక్తిగతమైందికాదు కాబట్టి అది నాలో గడ్డకట్టలేదు.

విపాశన ధ్యానం చేస్తున్నక్రమంలోగంటలకొద్దీ సమయం మనతో మనం గడపడంతో మన మనస్సులో పేరుకున్న వికారాలు మనకు అర్థమవ్వడం మొదలౌతుందిరాగం,ద్వేషం ఈ రెండే మనల్ని ప్రభావితం చేస్తుంటాయని తెలుస్తుంది రెండూ కూడా శాశ్వతంగా మనలోఉండిపోయేవి కావనిఅవి కూడా మారుతుంటాయని తెలుస్తుంటుందిమనకి దు:ఖాన్ని కలిగించేవిసుఖాన్ని కలిగించేవి  సంవేదనలుఅవి ఎంత కాలముంటాయిఅవి శాశ్వతంగా వుండిపోతాయామారిపోతుంటాయాఅనిత్యాలైతేమారిపోతే మనమెందుకు బాధపడాలి?సంతోషపడాలి ప్రభావాలు మన జీవితాలనెందుకు శాశించాలిఎన్నో ఆలోచనలకు నిలయమౌతుంది మనసు మనసే అంతర్నేత్రం ద్వారా శరీరంలోని ప్రతి అంగాన్ని శోధిస్తుంటుందిసంవేదనలని చూస్తుంటుందివిపశ్యన ధ్యానం చేస్తున్న వాళ్ళు  దు:ఖకారకసుఖకారసంవేదనల్ని సాక్షిలాగాసమత్వంతో చూడాలని చెబుతుంటారు గోయంకాగారు.  కోట్ల కణాల సముదాయం శరీరమైతే ప్రతి కణంలోను ప్రతి క్షణం మార్పు జరుగుతుంటుందిసంవేదనలు పుడుతూ గిడుతూ వుంటాయిపుట్టిన క్షణం నుంచి  మార్పు శరీరంలో జరుగుతుంటుంది.ఒకరోజు గడవడం అంటే ఒక రోజు చావుకి దగ్గరవ్వడంశిశువు ఒక రోజు పెరగడం అంటే మరణానికి ఒక రోజు దగ్గరవ్వడం నిరంతర మార్పు అనివార్యంగా  రుగుతూ చివరికి శరీరం మరణించడంగా పరిణమిస్తుందిఇది శరీర ధర్మందీన్ని ఎవ్వరూ  మా ర్చలేరుశాసించలేరు.అయినప్పటికీ మనిషి తాను శాశ్వతమనే భ్రమతోనే సంపదల్నిపోగేసుకుంటూ వుంటాడుసమాజానికి చెందాల్సిన వనరుల్ని కూడా తానొక్కడే   గొట్టాలనుకుంటాడుహింసలకిఅణచివేతలకిదుర్మార్గాలకి పాల్పడతాడుమనిషిలోని కౄరత్వంశరీరధర్మం ఏమిటో అర్థం
చేసుకోనివ్వదుఅహంకారంఆధిపత్యంపొగరుబోతుతనం తన ఉనికి శాస్వతమనే భ్రమని కల్పిస్తాయిఒక్కసారి మనిషి అంతర్ముఖుడై తన మనసులోని భయంకర చీకటి కోణాలపై వెలుతురు ఫోకస్‌ చేసుకోగలిగితేతాను ఎన్ని నికృష్ణకార్యాలకు పాల్పడతాడోఎన్ని వికారాలుతనలో గూడు కట్టుకుని వున్నయోఅవి తననెంత హీనస్థితికి దిగజార్చాయో అర్థమవుతుందివిపాశనలో పది రోజులపాటు ఎలాంటి బహిర్ముఖం లేకుండా అంతర్ముఖంలో వుంటూ తన మనసు లోతుల్ని శోధిస్తుండడంవల్లవాటి నిజనైజాలు తెలుస్తుండడంవల్లతమ నిజస్వరూపాలు తేట  ల్లమవుతుంటాయిఒక్కోసారి అది గాఢమైన దు:ఖానికి దారితీస్తుంది.  రాగంద్వేషంకౄరత్వం,
అహంకారంఆధిపత్యంలాంటి గుణాలు తనకి దు:ఖాన్నివ్వడంతో పాటు తన చుట్టూ వున్న వాళ్ళకు మానసిక వేదననిమన:శాంతిని లేకుండా చేస్త్తాయని అర్థమవుతుంది.

శరీరధర్మం ఏమిటిమరణించడం అంటే అశాశ్వతంఅనిత్యంమరి ప్రకృతిధర్మం ఏమిటివాట్‌ ఈజ్‌ రూల్‌ ఆఫ్‌ నేచర్‌? ప్రకృతి ధర్మం   కూడా పుట్టడంగిట్టడంనిరంతర మార్పు చిన్న బీజం నుండి పుట్టిన మర్రిమాను కూడా పుట్టి పెరిగిపువ్వులు పూసికాయలు కాసి,మరణించడంవిత్తనం ద్వారా మళ్ళీ పుట్టడం... మళ్ళీ అదే సైకిల్‌. అంటే ప్రకృతిలోని సమస్తంపుడుతూగిడుతూ...నిరంతరం మార్పు చెందుతూ వుండడమే ప్రకృతి ధర్మంధర్మం అంటే ఇక్కడ నియమంమహోత్తుంగ హిమాలయాలమీద మంచు కూడా శాస్వతంగా వుండదు.మంచు కురుస్తుందికరుగుతుందిప్రవహిస్తుందినదిగా అవతరిస్తుందిఆఖరికి సముద్రంలో కలుస్తుందిమళ్ళీ మబ్బురూపం ధరించి వాన చినుకై కురుస్తుందిహిమాలయాలు అలాగే మంచుతో శాశ్వతంగా నిలబడి వుంటాయని మనకి భ్రమ కలుగుతుందికానీ అక్కడ నిరంతరచలనంనిరంతరం మార్పు జరుగుతుంటుందిహిమాలయాల మీద మంచుకూడా అశాశ్వతమేఅలాగే సముద్రాలు ఒక్కచోటే వున్నట్టు అన్పిస్తుందిసముద్రంలో నిరంతర మార్పులు జరుగుతుంటాయినదుల నీరొచ్చి చేరుతుందితన లోని నీళ్ళే మబ్బులై మళ్ళీ తన మీదేకురుస్తుంటాయ్‌. సెలయేళ్ళుజలపాతాలు ఇవన్నీ కూడా చలన  శీలత సిద్ధాంతానికి  ట్టుబడివుంటాయిమార్పు ప్రకృతి ధర్మంశరీరధర్మంప్రకృతి ధర్మం ఒక్కలాగే వుండి అనుక్షణం మారుతూ వుంటాయిరెండింటిలోను శాశ్వతత్వం లేదుమార్పు చెందుతూ పుడుతూనశిస్తూ వుండడమే రెండింటి ధర్మం నియమాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటేఅనుభూతి చెందాలంటేఎవరో చెబితే కాకుండా మనకు మనమే అనుభవంలోకి తెచ్చుకునే జీవనకళ విపాశన.

 అర్ధరాత్రి సమస్తాన్ని వొదిలేసి చీకటిలోకి నడుచుంటూ వెళ్ళిపోయిన సిద్ధార్థ గౌతముడుబుద్ధగయలో రావిచెట్టు కింద తపస్సుచేసి దు:ఖానికి పరిష్కారం సాధించాడనిబుద్ధుడయ్యాడనిప్రపంచానికి వెలుగు ప్రసాదించాడని చెప్పగా విన్నాంసాహిత్యంలో చదువుతున్నాం.దు:ఖమంటే ఎరుగని సిద్ధార్ధుడు దు:ఖం ఎదురైనపుడు కలత చెంది అసలు మనిషికి దు:ఖమెందుకు కలుగుతుందిదు:ఖం ఎక్కడఎలా పుడుతుంది?అని శోధించాడుబోధివృక్షం కింద కదలకుండా కూర్చుని దు: కారణం కనుక్కున్నాడురోజుల తరబడి  కదలకుండా కూర్చునిసిద్ధార్థుడు,
కన్నువిప్పకుండా దు:ఖం కారణం కోసం తన లోపలే వెతనారంభించాడుతన మనసులోకితన లో ప్రపంచంలోకి  చేసిన ప్రయాణం తన శరీరంలో జరుగుతున్న సంవేదనలను చూపించిందిదు:ఖకారకసంతోషకారక సంవేదనలు ఎలా పుడుతున్నామోనశిస్తున్నామో సిద్ధార్ధుడుతన అంతర ప్రపంచంలో గమనించాడుకోరికలు ఎలా పుడతున్నాయో అర్థం చేసుకున్నాడుసంవేదనల స్వభావంఅవి మంచివైనాచెడువైనాదు:ఖాన్నిచ్చినా సంతోషాన్నిచ్చినా వాటి జీవితం స్వల్పమని పుడుతూ గిడుతూ వుంటాయని తెలుసుకున్నాడుతన సొంత అనుభవంనేర్చిన ఈ జ్ఞానాన్ని విపశ్యన పేరుతో ప్రజానీకానికి పరిచాడుమొదట తన అనుభవాన్ని ఐదుమందికి పరిచాడు తర్వాత కోట్లాది మంది  జ్ఞానాన్ని అందుకున్నారుమనసు ఆడించినట్టల్లా మనిషి ఆడితే-  కోరికలు తీరితే సంతోషపడి ( సంతోషం కూడా అశాశ్వతమేతీరకపోతేదు:ఖపడడం జరుగుతుందని చాలాస్పష్టంగా చెప్పాడు.
కోరికలే మనిషి దు:ఖానికి కారణమనిసుఖదు:ఖాలను సమంగా చూడగలిగితేసమతను సాధించగలిగితే మనిషి జీవితం సాఫీగా సాగిపోతుందనిగొప్ప ఆనందం అందుబాటులోకి వస్తుందంటాడు.  ఒక వ్యక్తి మీద ప్రేమకన్నవస్తువుల మీద ప్రేమ కన్నా విశాల ప్రేమనిప్రకృతిలోనిసమస్తాన్ని ప్రేమించగలిగితే మనిషి మహానందాన్ని అందుకుంటాడనిఅతను కూడా బుద్ధుడవుతాడనిబుద్ధుడు అనేది పేరు కాదనిసమస్థితిని సాధించిన ప్రతి వొక్కరూ బుద్ధులేనని విపాశన చెబుతుంది.  భారతదేశంలో బుద్ధుడి ద్వారా పుట్టిన  జ్ఞానం ఇక్కడ అంతరించిపోయిందని,
బర్మా  మాత్రం  దీన్ని భద్రంగా కాపాడుకున్నదనితాను 1969లో బర్మా నుంచి భారతదేశం వచ్చాననివిపాశన సెంటర్లను స్థాపించానని గోయంకాగారు చెబుతారు.

పదిరోజులపాటు ఇంటినిపనినిసంబంధాలని వొదిలేసి కేవలం నాతో నేనునాలో నేను గడపడానికి విపాశనని వెళ్ళడానికి కారణం అసలు విపాశన అంటే ఏమిటో తెలుసుకోవడం అనుభవం ఎలా వుంటుందో అనుభూతి చెందడం కోసమేనిజానికి నేను ఎప్పుడూ పాజిటివ్దృక్పథంతోనే వుంటానుజీవితాన్ని సింపుల్గా ఎలాంటి ఆర్భాటాలు లేని విధంగా మలుచుకున్నానువస్తు సముదాయం అవి ఎలాంటివైనా సరే నన్ను ప్రలోభపెట్టలేవుదు:ఖాలనుదిగుళ్ళను గుండెల్లో మోస్తూ తిరగడం నా వల్లకాదువాటిని అధిగమించే మార్గాలను అన్వేషిస్తాను.ప్రతి సమస్య పరిష్కారం  సమస్యలోనే వుంటుందని నమ్ముతాను అతీత శక్తిని నమ్మని దాన్ని  కాబట్టే  నాకు విపాశన సెంటర్లో వాతావరణం చాలా నచ్చిందిమతపరమైన కర్మకాండసంప్రదాయాలు లేని లౌకిక పద్ధతులు అక్కడ నెలకొనడంబుద్ధుడి విగ్రహం కూడాలేకపోవడం బావుందిబుద్ధుడిని భగవానుడని పిలవడం వెనుక ఇప్పటి భగవానుడు కాడనివిపాశన జ్ఞానంద్వారా సమతను సాధించిన వాళ్ళని భగవాన్‌ అని  రోజుల్లో పిలిచేవారని గోయంకాగారు వివరించారుఅలాగే పరమపదమంటే మరణాన్ని కూడా  ఎరుకతో,చిరునవ్వుతోస్వీకరించడంగా అర్థం చేసుకోవాలిబుద్ధుడు మతం ఆధారంగా సృష్టించబడిన స్వర్గనరకాలను నిరసించాడనిమతపరమైన కర్మకాండలవల్ల మనిషి పొందే జ్ఞానమేమీ వుండదనిఆ కర్మకాండలో కూరుకుపోవడమే వుంటుంది తప్ప దాన్నుండి బయటపడలేరని బుద్ధుడు
చెప్పాడని గోయంకా చెబుతారు.

మొత్తానికి విపాశన మెడిటేషన్‌ నాకొక కొత్త అనుభవాన్నే ఇచ్చిందిఆహ్లాదకరమైన వాతావరణంఎంతో నిబద్ధతతో పనిచేసే దమ్మసేవికలుఎంతో స్నేహంగా వుండే టీచర్‌ పద్మజగారుపది రోజుల పాటు చక్కటి క్రమశిక్షణవొళ్ళొంచి అన్ని పనులూ చేసుకోవడం చాలా నచ్చింది.మనం తలుచుకుంటే ఏమైనా చెయ్యగలం అనే నమ్మకాన్ని మనకి ఇస్తుందిపదిరోజులు మాట్లాడకుండా వుండగలంరాత్రి భోజనం లేకుండా బతకగలంబయట ప్రపంచంతో సంబంధం లేకుండా మనతో మనం పదిరోజులు గడపగలంఅన్నింటినీ మించి పుడుతూనే సెల్తో పుట్టామని,కంప్యూటర్‌ కవచకుండలాలతో  పెరిగామని విర్రవీగే వాళ్ళకి అవి లేకుండా కూడా హాయిగా పది రోజులు బతకొచ్చని అర్థమౌతుందిఎపుడూ బయట ప్రపంచంతోవస్తు సముదాయంతో ఉక్కిరిబిక్కిరిగా బతికే మనంమన లోపలి ప్రపంచాన్ని దర్శించాలంటేసంకుచిత ప్రేమల్నుండివిశ్వప్రేమను అలవరుచుకోవాలంటే  ప్రతి వొక్కరం  అనుభవాన్ని పొందితీరాలి.

మరో ముఖ్య విషయం చెప్పాలిఇక్కడ భోజనంవసతి అన్నీ ఉచితమేవిరాళాలివ్వమని కూడా అడగరుఅయితే పది రోజులు హాయిగా అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి మనమే విరాళం ఇవ్వాలనుకుంటాంనేను రూ. 2000 విరాళమిచ్చానుఇక్కడ పద్ధతి ఏమంటే నేనుఇచ్చిన విరాళం నా తర్వాత వచ్చేవాళ్ళకు ఉపయోగపడుతుందినా కోసం ఎవరో విరాళం ఇచ్చే వుంటారుఈ అవగాహనతో అందరూ తోచినంత  విరాళం ఇస్తారునిజానికి పదిరోజులు తిండితిప్పలుకరెంట్‌, వాటర్‌ వీటికి బాగానే ఖర్చవుతుందిసాధకులిచ్చే డొనేషన్స్‌ కాకుండా వేరేఎలాంటి విరాళాలు స్వీకరించరు.

అన్ని మానవ సంబంధాల్లోకి స్నేహం ఉన్నతమైందని నమ్మే నాకువిపాశన చివరిరోజు మంగళమైత్రి ఒక్కటే అలవరుచుకోవాలనిప్రకృతి మీదమానవాళి మీద స్నేహాన్నిప్రేమని మాత్రమే కురిపించాలనిమనం స్నేహంతో మన హృదయాన్ని నింపుకుంటే స్నేహం మన చుట్టూప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతుందనిఒక్కోసారి  స్నేహంప్రేమ మన మనసుల్లోంచి పొంగిపొర్లి మనతో వున్న వాళ్ళందరికీ దాన్ని పంచుతుందని గోయంకా గారు చెప్పినపుడు నా కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు కురిసాయి.మానవాళి మొత్తం  కళని అలవరుచుకుంటే ప్రపంచం మొత్తం శాంతి నెలకొనిఅందరూ మనశ్శాంతితో బతుకుతారు కదా అనిపించింది.

 చివరగా పదో రోజు మధ్నాహ్నం నుండి ఒకరితో ఒకరం మాట్లాడుకునే అవకాశం దొరికిందిచిత్రంగా చాలామంది నన్ను గుర్తుపట్టారుమీరు టీవీలో వస్తారుకదామిమ్మల్ని చాలాసార్లు చూసాం అన్నారుపరస్పర పరిచయాల్లో భూమిక పత్రికభూమిక హెల్ప్లైన్‌ గురించి చెబుతూనేను రచయిత్రిననిజర్నలిస్ట్నని చెప్పగానే చాలామంది బాగా ఎడ్జ్తెట్‌ అయ్యారుహెల్ప్లైన్‌ గురించి వివరంగా చెప్పమన్నారునేను చేస్తున్న పనిని మెచ్చుకుంటూ చాలామంది అభినందనలు  చెప్పారుటీచర్‌ పద్మజగారు నిన్నటివరకు మీరు నాకు నమస్తే చెప్పారు రోజు నేనుమీకు నమస్తే చెబుతున్నాను.  మీరు బాధిత స్త్రీల కోసం చాలా చేస్తున్నారుఅభినందనలునేను మీ ఆఫీసుకొస్తానుమనం మళ్ళీ కలుద్దాం '' అన్నపుడు నాకు నా పనిపట్ల  మరింత గౌరవంనిబద్దత పెరిగినట్లనిపించిందినేను రెగ్యులర్గా సందర్శించే చెంచల్గూడా మహిళా జైలులోవిపాశన మెడిటేషన్ను ఏర్పాటు చేద్దామని పద్మజగారితో చెప్పినపుడు ఆవిడ తప్పకుండా ప్రయత్నిద్దాం అన్నారు.

జూలై మొదటి తేదీన పెట్టెబేడా సర్దుకునినా రూమ్ని శుభ్రంగా కడిగి,
దుప్పట్లు వగైరాలు ఉతికేసి మళ్ళొస్తానని చెట్టకిపిట్టలకి చెప్పి,
తేలికైన శరీరంతో (మూడు కేజీల బరువు తగ్గానుఉత్సాహంగా వున్న మనసుతో మా
  1. ఇంటి ముఖం పట్టాను.

Sunday, January 25, 2015

సమూల పరివర్తన ద్వారానే స్త్రీవిముక్తి సాధ్యం

(డా|| ఉమ చక్రవర్తితో డా|| రమేశ్ ఉపాధ్యాయ జరిపిన ఇంటర్వ్యూ అనువాదం- జె. ఎల్. రెడ్డి (హిందీనుండి)
‘Social Dimensions of Early Budhism’, ‘Rewriting History : The Life and Times of Pandita Ramabai’, ‘Gender and Caste through a Feminist ‘Everyday Lives and Everyday Histories : Beyond the Kings and Brahmins of India’ లాంటి ముఖ్యమైన పుస్తకాలు రచించిన డా|| ఉమ చక్రవర్తి (జననం 1941) ప్రసిద్ధ స్త్రీవాద చరిత్ర రచయిత్రి. స్త్రీల, సాధారణ పజ్రల అధికారాలకు సంబంధించిన ఉద్యమా ల్లో క్రియాశీలమైన పాత వహించడమేగాక ఈమె ఢిల్లీ లోన Centre for Women Development Studies అనే సంస్థలో ప్రశంసించదగ్గ పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మిరండాహౌస్లో చరితోప్రన్యాసకురాలుగా చాలా ఏళ్ళు పనిచేసి పదవీ విరమణ చేశారు. డా|| రమేశ్ ఉపాధ్యాయ వారితో జరిపిన ఈ ఇంటర్వ్యూ 10-5-2003న రికార్డు చేయబడి ‘కథన్’ అనే హిందీ సాహిత్య పతిక్ర జూలై-సెప్టెంబర్ 2003 సంచికలో వెలువడింది. డా|| ఉపాధ్యాయ ‘కథన్’ పతిక్ర సంపాదకులే కాక, పేరుమోసిన హిందీ రచయిత. 25కు పైగా వీరి నవలలు, కథాసంపుటాలు, అనువాదాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. వీరు కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు.

Sunday, January 4, 2015

ఇలాంటి ”మద్దెల చెరువులు ” ఇంకెన్ని ఉన్నాయో ???

(ఇటీవల మహిళా సమత సొసైటి వారితో కలిసి పసిపిల్లల మరణాలు అధికంగా...ప్రమాదకర స్థాయిలో నమోదైన మద్దెలచెరువు గ్రామాన్ని సందర్శించాను..
దాని మీద నేను రాసిన రిపోర్ట్ ఇది.దీనిని మహిళా శిశు అభివృద్ధి శాఖ వారికీ,వైద్య ఆరోగ్య.కుటుంబ సంక్షేమ శాఖవారికీ సమర్పించాను.
గత సంవత్సరం లో నన్ను అమితంగా బాధించిన సంఘటనల్లో ఇదొకటి.
ఈ గ్రామం లో నమోదైన ఐ ఎం ఆర్ జాతీయ గణాంకాల్ని ప్రభావితం చేసేంత తీవ్రంగా ఉంది.)














ఇలాంటి ”మద్దెల చెరువులు ” ఇంకెన్ని ఉన్నాయో??? –
.
మద్దెలచెరువు, పిట్లం మండలం నిజామాబాద్‌ జిల్లాలో ఒక చిన్న గ్రామం. అలాంటి చిన్న గ్రామంలో గత ఆరునెలల కాలంలో పదకొండు మంది పసిపిల్లలు చనిపోయారు. అంటే ఆరు నెలలుగా ఆ ఊళ్ళో పసివాళ్ళ ఏడుపు సవ్వడి వినబడలేదు. వినబడినా నెల లేక రెండు నెలలు అంతకు మించి అంటే రెండు నెలలలోపే ఆ పసివాళ్ళు ఈ లోకంనించి మాయమైపోయారు. మద్దెలచెరువు గ్రామంలో ఐ.ఎం.ఆర్‌. ఇంత దారుణంగా వుంటే ఈ విషయం ఏ మీడియాను ఆకర్షించలేదు. కనీసం స్థానిక విలేఖరులకు కూడా ఈ వార్త చేరలేదు. అంత పకడ్బందీగా పసివాళ్ళ మరణ వార్తల్ని దాచిపెట్టారు. గ్రామంలో ఇంత దారుణం జరిగినా సంబధిత శాఖల అధికార్లెవ్వరూ గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించలేదు.
వారం రోజుల క్రితం మహిళా సమత సొసైటి ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రశాంతి ఫోన్‌ చేసి ఈ విషయం గురించి చెప్పేవరకూ నాకూ తెలియదు. మహిళా సమత మద్దెలచెరువు గ్రామంలో పనిచేస్తోంది కాబట్టి వాళ్ళ కార్యకర్తల ద్వారా ఈ విషయం ప్రశాంతికి రిపోర్టు అవ్వడం, తన ద్వారా నాకు తెలియడం జరిగింది. మహిళా సమత కార్యకర్తలు నెలరోజులుగా ఈ అంశం మీద గ్రామంలో స్త్రీలతో మాట్లాడుతున్నారు. బిడ్డల్ని కోల్పోయిన తల్లులు తమ దుఃఖాన్ని పంచుకోవడానికి గానీ, జరిగిన విషయాల గురించి మాట్లాడటానికి గానీ ఇష్టపడకపోవడంతో కార్యకర్తలు చాలా సార్లు గ్రామానికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిజానికి బాధిత స్త్రీలు బయటకొచ్చి మాట్లాడటానికి మహిళా సమత కార్యకర్తలు చాలా కృషి చేసారు. చాలాసార్లు గ్రామానికి వెళ్ళారు. వీరి కృషి ఫలితంగానే మొట్టమొదటిసారి బాధిత స్త్రీలందరు మాతో మాట్లాడగలిగారు. అప్పటికే వాళ్ళ జిల్లా టీమ్‌ల మధ్య ఈ అంశమై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రశాంతి చెప్పిన వెంటనే నాకు వాళ్ళతో కలిసి ఆ గ్రామానికి వెళ్ళాలనిపించింది. ఆ గ్రామంలో మహిళా సమత ఉనికి లేకపోయుంటే నేను మద్దెలచెరువు వెళ్ళగలిగేదాన్ని కాదు ఈ రిపోర్టు రాసేదాన్ని కాదు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆరునెలల కాలంలో ఒకే గ్రామంలో అంతమంది పసివాళ్ళు మృత్యువాత పడడం నన్ను కలిచివేసింది. నిజానికి ఈ అంశం జాతీయ స్థాయి మీడియాలో ప్రముఖంగా రావాల్సింది. కానీ ఇంతవరకు రాష్ట్రస్థాయిలో కాదు కదా జిల్లా స్థాయి మీడియాలో కూడా ఈ అంశమై వార్తలు రాలేదు. గ్రామంలో మీడియాను కూడా పిలిచి ఒక మీటింగ్‌ని నిర్వహించాలని జిల్లా కమిటీ సభ్యులు నిర్ణయించుకుని రాష్ట్ర ఆఫీసుకు ఈ విషయం చెప్పారు. ఆ విధంగా వారితో కలిసి నేను కూడా 18.12.14వ తేదీన మద్దెలచెరువు గ్రామానికి వెళ్ళడం జరిగింది. మహిళా సమతా నుండి ఉమ, ఉషలతో కలిసి మేము ఏడున్నరకి నిజామాబాద్‌ వేపు బయలుదేరాం. కామారెడ్డి, బాన్సువాడ మీదుగా అడవుల్లోంచి ప్రయాణించి 10.30కి మద్దెలచెరువు గ్రామం చేరాం.
స్త్రీలంతా బయటనే ఎండలో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. బాత్‌రూమ్‌ కోసమని ఒకరింటికి వెళ్ళినపుడు ఆమె ‘టీ తాగండక్కా’ అని ఆప్యాయంగా పిలిచింది. ఆమె చీరకుచ్చిళ్ళు పట్టుకుని వేలాడుతున్న ఐదారేళ్ళ కుర్రాడు ”ఏందమ్మా! ఖాలీ టీ ఇచ్చి పంపుతవా? అన్నం పెట్టవా” అని అడిగాడట. వాళ్ళమ్మ మురుసుకుంటూ మాకు చెప్పింది. వాడి ఆతిథ్యం అబ్బురమన్పించింది. టీ తాగి మీటింగ్‌ జరిగే కాడికి వచ్చాం. స్త్రీలంతా అక్కడ చేరారు. ఎదురుగా అంగన్‌వాడి సెంటర్‌, స్కూల్‌ వున్నాయి. నీడకూడా వుందక్కడ. కానీ స్త్రీలు ఎండలో రోడ్డుపక్క కూర్చోడానికే ఇష్టపడ్డారు. ఎండ చుర్రుమంటోంది. ”ఏందమ్మా! ఎండలోనే కూర్చుంటారా? అంటే ఒకామె…. పేరు గంగవ్వ ” మేం రోజంతా ఎండలోనే పనిచేస్తాం. ఎండలో కూర్చోవడానికి కష్టమేమి లేదు. భలే చలిగా కూడా వుంది” అంది చురుగ్గా. నా నోరు ఠక్కున మూతపడింది.
క్రమంగా గుంపు పెద్దదైంది స్త్రీలు, పురుషులు మా చుట్టూ చేరారు. ఎవరైతే బిడ్డల్ని పోగొట్టుకున్నారో మెల్లగా వారు రాసాగారు. ఓ అరగంటలో నిజామాబాద్‌ నుండి మీడియా మిత్రులు వచ్చారు. మేం మాట్లాడటం మొదలు పెట్టకుండానే ఒకామె తానే ముందు మాట్లాడుతూ….” మా గ్రామంలో మళ్ళిట్లా జరక్కూడదు. ఏం చేయాలో సోంచాయించాలి. మేం మీటింగ్‌ పెట్టుకుని మాట్లాడుకున్నం” అంది ”ఏం జరిగింది? ఎందుకని మీ గ్రామంలో ఇంతమంది పసిగుడ్లు చనిపోయారు. ఇది చాలా సీరియస్‌ విషయం మీరు ఏమనుకుంటున్నారు” అని అడిగాం. ముందు మనం పరిచయాలు చేసుకుందం” అంది ఉమ. అందరూ పేర్లు చెప్పి ”వెన్నల సంఘం” అని చెప్పారు. కొంతమంది వేరే సంఘం పేరు చెప్పారు. కానీ ఎక్కువ మంది మహిళా సమత సొసైటీకి చెందిన వెన్నల సంఘంలోనే సభ్యులుగా వున్నట్టు పరిచయాల తర్వాత అర్థమైంది. ఒక్కొక్కరూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ లోపు మద్దిలచెర్వు ఏ.ఎన్‌.ఎమ్‌ ఆరోగ్య మేరి వచ్చారు. ఆమె వచ్చేసరికి ఒకామె మాట్లాడుతోంది. ఆమె చెప్పేది వినకుండా ”వీళ్ళకి మూఢ నమ్మకాలెక్కువ. నేను చెప్పిన మాట వినరు.” అంది చాలా పరుషంగా. ” మూఢ నమ్మకాలేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? దయచేసి అలాస్టేట్‌మెంట్లు ఇవ్వకండి” అని గట్టిగా అన్నాను నేను. ”లేదు మేడం! వీళ్ళు అంగన్‌వాడి సెంటర్‌లోకి రారు. తినరు. అన్నీ మూఢ నమ్మకాలే” అంది మళ్ళీ! ”ఏంటమ్మా! ఆమె అలా అంటోంది. ఎందుకెళ్ళరు? అంగన్‌వాడిలో ఎందుకు తినరు? ఏమైంది? అంటే…”ఈడనే కాముని పున్నమి కాల్తుంది. ఆడలోపల ఆంజనేయుడి గుడివుంది. లోపల దెయ్యమో భూతమో ఉందమ్మా! ఆడ తిన్న వాళ్ళందరికీ ఇదో ఇలా బిడ్డలు సచ్చిండ్రు. ”పదకొండు గంటలకి అన్నం పెట్టమంటే వాళ్ళు పెట్టరు. మిట్ట మధ్యాహ్నం ఆ చెట్లమీద భూతాలుంటాయి. అందుకే మేం పోము.” అంది ఒకామె. మాకేమీ అర్థం కాలేదు. క్రమంగా అర్థం కాసాగింది. గ్రామంలో గర్భం దాల్చిన మహిళలు మొదట్లో అంగన్‌వాడి సెంటర్‌లో ఇచ్చినవి తినేవాళ్ళు. ఎలా ప్రబలిందో వాళ్ళకే తెలియదు కానీ ఆ సెంటర్‌ ఆవరణలో దెయ్యమో…భూతమో వుందని, అక్కడికెళ్ళి తిన్నందుకే పిల్లలు చనిపోతున్నారనే ప్రచారం జరిగింది. దానిని ఈ మహిళలు నమ్మారు. అక్కడిచ్చే ఆరకొర పోషకాహారం కూడా తీసుకోవడం మానేసారు. ”తినాలి కదమ్మా! తినకపోతే కడుపులోపలి బిడ్డకి బలమెట్లా వస్తుంది ” అంటే” ఇంట్లో తింటున్నాం కదా ! ఆ సెంటర్‌ కయితే మేం పోం” అని గట్టిగా చెప్పారు. దీని మీద చాలాసేపు మాట్లాడాం.
ఇంకొక ముఖ్యమైన అంశం మా దృష్టికొచ్చింది. అదేమంటే ఆ గ్రామంలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. బిడ్డల్ని కోల్పోయిన తల్లులతో మాట్లాడుతున్నప్పుడు… వాళ్ళు అందరూ బాల్యవివాహాలు జరిగిన వాళ్ళే. మాకు ఇరవై ఏళ్ళు వున్నాయి. అంటున్నారు గానీ అది నిజం కాదని వాళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఇంకా బాలికలుగా కన్పిస్తున్న శోభ,, ఖైరున్నీసా.. చాలా నీరసంగా, రక్తహీనతలో ఉన్నారు. వాళ్ళ శరీరాలు పేలవంగా, పాలిపోయి వున్నాయి. వాళ్ళ మానసిక స్థితి గురించి… వాళ్ళ మానసిక వేదన గురించి మాట్లాడే వాళ్ళేలేరు. ఇంత జరిగాకా… మళ్ళీ వెంటనే గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవ్వరికీ తెలియదు. గర్భనిరోధానికి ఎలాంటి పద్ధతులున్నాయో వాళ్ళకి అవగాహన లేదు. ఫలితం… నాలుగు నెలల క్రితం బిడ్డను కోల్పోయి, చాలా బలహీనంగా వున్న ఒకామె ప్రస్తుతం రెండు నెలల గర్భంతో వుండడం. ”మీకు భయమన్పిస్తుందా? మీరు కొంత వ్యవధి ఇవ్వాల్సింది కదా” అంటే బలహీనంగా నవ్వడం తప్ప సమాధానం లేదు. ఆమెకి అవగాహనా రాహిత్యంతో పాటు ఎలాంటి ఛాయిస్‌ లేదని అర్థమైంది.
బిడ్డని కోల్పోయిన ఓ తల్లి నిర్వికారంగా కూర్చుని వుంటే అత్త మాట్లాడిన మాటలు మమ్మల్ని దిగ్భ్రమకి లోనుచేసాయి. ”నేను నా కోడలిని దవాఖానాకి తీసుకుపోయినా మంచి తిండి పెట్టినా. బోలెడు డబ్బు ఖర్చుపెట్టి కాన్పు చేయించాను. 3.50 కిలోల బరువున్న పిల్లడు పుట్టిండు. కొన్ని దినాలు మంచిగానే వుండే. ఏం కారణం లేకుండానే సచ్చిపోయిండు” అంది. ఆమె పక్కనే తలకి మఫ్లర్‌ కట్టుకుని, శుష్కించిన శరీరంతో, పుల్లల్లా వెళ్ళాడుతున్న చేతులతో ఆమె కోడలు కూర్చుని వుంది. ఆమె ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. ఒక నిర్లిప్తత… నిరాశక్తత.. నేను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే.. మళ్ళీ ఆమె అత్తే… ”నా కోడలు కన్న కొడుకు సచ్చిండు… డాక్టర్‌ ఆమె గర్భసంచిని కూడా తీసేసింది. మాకు సెప్పకుండానే” ”అదేంటి? గర్భసంచి ఎందుకు తీసేసారు? చెప్పలేదా మీకు?” షాక్‌ తిన్నాం మేము.” ముందు చెప్పలేదు. మేం వచ్చేస్తుంటే నా కొడుకును తీసుకపోయి సంతకం పెట్టించుకుంది. ఇంత లావున్న గర్భసంచిని ప్లేటులోపెట్టి ఇదే… మీ కోడలి గర్భసంచి అని చూపించింది. అది మా కోడలిది కానేకాదు. ”అంది అత్త గట్టిగా. కోడలి వేపు చుడ్డానికి నాకు భయమేసింది. ఎంతఘోరం ఎంత అమానవీయం… నా కళ్ళల్లోకి నీళ్ళొచ్చి కలతచెందుతుంటే ”ఆమె వయస్సు 35 ఏళ్ళు… ఆమెకి అలాకాక ఇంకెలా అవుతుంది?” అన్న ఆరోగ్యమేరిని ఈడ్చి కొట్టాలన్నంత కోపమొచ్చింది. ”ప్లీజ్‌ ! మీరు మాట్లాడొద్దు. మీకు కనీస సంస్కారం కూడా లేనట్టుంది. స్టేట్‌మెంట్లు ఇవ్వడం… పుస్తకాల్లోంచి అంకెలు చూపించడం తప్ప మీకు ఇంకేమీ చేతకాదా?” అని గట్టిగా అరిచాన్నేను. కొడుకుని పొగొట్టుకోవడమే కాక మళ్ళీ తల్లయ్యే అవకాశం లేకుండా గర్భసంచిని.. అదీ ఆమెకి చెప్పకుండా కత్తిరించిపారేసిన డాక్టర్‌ ధన వ్యామోహం… ఆమె నిర్వకారంగా, యోగినిలా కూర్చున్నది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ముఖంలో విషాదం గూడుకట్టుకుని వుంది. కానీ… ఆ దు:ఖాన్ని వ్యక్తీకరించే దారేది ఆమెకు లేదు. ఆమె మనసులో ఏమి కల్లోలం జరుగుతున్నదో…. దాన్ని కొలచగల సాధనం అక్కడ ఎవ్వరి దగ్గరా వుండదని అర్థమై నాకు చాలా దు:ఖమనిపించింది.
వొకరి తర్వాత ఒకరుగా బిడ్డల్ని కోల్పోయిన తల్లులు తమ అనుభవాలను చెప్పుుకున్నారు. వొక్కరి కళ్ళలోంచి కూడా కన్నీళ్ళు రాలలేదు. ఇంకిపోయాయా? ఎండిపోయాయా? ఇద్దరు తల్లులు చాలా బలహీనంగా, ఇంటర్‌ చదువుతున్న పిల్లల్లా వున్నారు. ఖచ్చితంగా వాళ్ళవి బాల్యవివాహాలే. ఆ గ్రామంలో బాల్య వివాహాలు చాలానే జరుగుతున్నట్టున్నాయ్‌. ఈ తల్లులకి తమకి పురిటి నొప్పులొచ్చాయో, కడుపులో నొప్పి వచ్చిందో కూడా అవగాహన లేదు.
”వాళ్ళకి నొప్పులొచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళరు మేడం. పనులు చేస్తూ వుంటారు. వాళ్ళ కిచ్చిన కార్డులో 108 నంబరు రాసి ఇస్తాను అయినా ఫోన్‌ చెయ్యరు. వాళ్ళకి పురుటి నొప్పులంటే తెలియదు” ఆరోగ్య మేరీ నోరు విప్పితే వాళ్ళమీద కంప్లయింట్స్‌ తప్ప… వాళ్ళకి లేని, తనకి వున్న అవగాహనని వాళ్ళకి ఎలా కల్పించాలో తెలియదు. పురుటి నొప్పుల్ని ఎలా గుర్తించాలో వాళ్ళకి చెప్పాలనే ఇంగితం ఏఎన్‌ఎమ్‌కి లేదు. బిడ్డని పొగొట్టుకోవడంలో తప్పంతా వాళ్ళదే అని చెప్పడానికి ఆవిడ శతవిధాల ప్రయత్నం చెయ్యడం మ్కానిపించింది.
”మా కోడలు బాగా పని చేస్తుంది. ఎనిమిదో నెలలో నాట్లేసింది” అని ఓ అత్త చెప్పినప్పుడు ”ఎనమిదో నెల వచ్చాకా నాట్లా” విలవిల్లాడుతూ అడిగింది ఉష. ఎనమిది నెలల గర్భంతో ఆమె ఎన్ని సార్లు వొంగి, లేచి నాట్లేసిందో నేను విజువలైజ్‌ చేసుకుని అదిరిపోయాను. ”ఎనమిది నెలలొచ్చాకా కూడా పొలం పనులు చేయిస్తారా? కష్టం కదమ్మా చెయ్యడం ”అని అడిగితే…” లే… నాట్లేయలేదు. ఊకే పొలం చూడనీకి పోయిందంతే” అత్త మాట మార్చింది. కోడలు తలవొంచుకుని కూర్చుంది. పితృస్వామ్యం పడగనీడ కనబడింది నాకు.
”మా కోడలికి మంచిగా మందులిప్పించినా… అంగన్‌వాడిలో ఇచ్చిన గోలీలు వేసినా… అయితే గోలీలు మధ్యలోనే ఆపేసినా… మందులెక్కువేస్తే బిడ్డ బాగా పెరిగిపోతందట.. కాన్పు కష్టమైతదట. అందుకే మందులాపేసినా”. ఒక అత్త స్టేట్‌మెంట్‌. ఏం మాట్లాడాలి? గర్భిణీకి ఏమందులెప్పుడు ఎన్ని వేయాలో నిర్ణయించేది డాక్టరు కాదు. అత్త నిర్ణయిస్తుంది. కరక్టు డోసులు పడ్డాయో లేదో తెలియదు. ఏం మందు వేసారో… ఏం వెయ్యలేదో తెలియదు. దీని మీద పక్కా అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య కార్యకర్త ” వీళ్ళ మందులు సరిగా వేసుకోరు” అని స్టేట్‌మెంట్‌ ఇచ్చేస్తుంది. అంతే. ఎందుకు వేసుకోలేదో అడిగి మందులు వెయ్యదు.
మేం మాట్లాడుకుంటున్న సమయంలో ఆ ఊరి సర్పంచి వచ్చాడు. వస్తూనే ఆరోగ్య మేరీ మీద విరుచుకుపడ్డాడు. ఆయనకి రెండు రోజుల క్రితమే విషయం తెలిసిందట. నాకు ముందెందుకు చెప్పలేదు అని ఆమెని అడుగుతున్నాడు. ”నువ్వసలు గ్రామంలో ఎందుకుండడంలేదని” నిలదీస్తున్నాడు.”గ్రామంలో ఏం జరిగినా నువ్వు మాకు చెప్పాలి కదా నువ్వు చెప్పలేదు. మహిళా సమత వాళ్ళొచ్చి చెప్పే వరకు మాకు తెలియదు. వాళ్ళకున్న బాధ్యత నీకు వుండక్కరలేదా?” అంటూ నిలదీసాడు సర్పంచి. ఆయన అడుగుతున్నపుడే గ్రామస్తులు ముక్త కంఠంతో ”ఈమె గ్రామంలో వుండాలి. ఏ రాత్రి ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఆరోగ్య కార్యకర్త అందుబాటులో వుండాలి ”అంటూ అరిచారు,” ఇల్లు చూపించండి నేనిక్కడే వుంటాను. ఇద్దరి పని నేనే చేస్తున్నాను. ఇంకొక కార్యకర్తని పిట్లం పంపించేసారు.” అంటుంది మేరి. ఆరోగ్య మేరీకి తన సమస్యలు తప్ప ఆ ఊరిలో వున్న ఆడవాళ్ళ సమస్యలు అస్సలు కనబడవు.
మేం ఊరిలో తిరుగుతున్నపుడు. చాలా చానెల్స్‌ వాళ్ళు గ్రామంలోని స్త్రీలతో మాట్లాడారు. బాధిత మహిళలు కెమెరాల ముందు కూర్చుని మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. తమ దు:ఖాన్ని వివరించడం వాళ్ళకి చాలా కష్ఠమైంది. మేము అన్ని ఛానల్స్‌తోను ఆ గ్రామంలో వున్న సమస్యల గురించి వివరంగా చెప్పాం. ఒకే గ్రామంలో అంతమంది పసివాళ్ళు చనిపోవడం చాలా సీరియస్‌ విషయమని, ఈ వార్త రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయస్థాయి మీడియాలో రావాల్సిన అవసరం వుందని, సంబంధిత శాఖల అధికారులు ఈ గ్రామంలో పర్యటించి, ఒక క్యాంప్‌ను నిర్వహించి సమస్యల మీద అధ్యయనం చెయ్యాలని మేము చెప్పాము.
ఆ తర్వాత మేము అంగన్‌వాడి సెంటర్‌ ఉన్న ఆవరణలోకి వెళ్ళాము. ఏ అంగన్‌వాడి సెంటర్‌లోకి మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వెళ్ళమని చెబుతున్నారో ఆ సెంటర్‌కి పక్కనే బడి, గుడి వున్నాయి. సెంటర్‌లో పదిమంది చిన్నపిల్లలు కూర్చుని వున్నారు. అంగన్‌వాడి వర్కర్‌ లేరు. ఒకమ్మాయివుంది. మీరెవరిని అడిగితే లింక్‌ వర్కర్‌నని చెప్పింది. సూపర్‌వైజర్‌ వచ్చి వెళ్ళారా అంటే ఇంకా రాలేదు అని చెప్పింది. అక్కడ ఓ పెద్ద గిన్నెనిండా కోడిగుడ్లు వున్నాయి. ఈ ఊరికి ఇన్ని గుడ్లు కావాలా? అని అడిగితే ”పదిరోజుల కోసం” అని చెప్పింది లింక్‌ వర్కర్‌. ”ఇవి ఎప్పుడు వచ్చాయి” అంటే… ”మూడు రోజులైంది.” ”పదిరోజులు అలా బయటపెడితే పాడయిపోతాయి కదా” ”అవును. పాడయిపోతే పారేస్తాం ఇవ్వము.” అవి ఖచ్చితంగా పాడవుతాయి.. మనుష్యుల పొట్టల్లోకి వెళ్ళాల్సిన గుడ్లు పెంటకుప్పల్లోకి పోతున్నాయన్నమాట. కోడి గుడ్లు సరఫరా చేసే ఏజన్సీకి ఇచ్చిన నియమాలేంటో తెలియదు. బహుశా రెండు రోజుల కొకసారి సరఫరా చెయ్యాలి. అక్కడ ఫ్రిజ్‌ వుండదు కాబట్టి గుడ్లన్నీ బయటే వుండాలి కాబట్టి కనీసం రెండురోజుల కొకసారి సరఫరా చెయ్యాలి. కానీ పది రోజుల కొకసారి సరఫరా చెయ్యడం దారుణం. అందరూ గుడ్లు తింటున్నట్టు ప్రభుత్వ లెక్కల్లో వుంటుంది కానీ… ఆ గుడ్లు పాడైపోయి చెత్త బుట్టల్లోకి పోతున్నాయి. అలాంటివి తినడం కూడా ప్రమాదకరం. గుడ్లు పగలగొడితే పాడైందని తెలుస్తుంది ఉడకబెట్టిన గుడ్లు వొలిస్తే తప్ప తెలియదు. అది నల్లగా వుంటేనే పాడైంది అనుకుంటారు. అలాంటివి తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ఇది అంగన్‌వాడిలో పరిస్థితి.
సర్పంచితో మేం గమనించిన అన్ని విషయాలు చర్చించాం. అంగన్‌వాడీ సెంటర్‌ నడుస్తున్న స్థలానికి సంబంధించి మహిళల్లో వున్న భయాల గురించి అవగాహన కల్పించాలని, తాత్కాలికంగా వేరే ఏదైనా ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చెయ్యమని, గ్రామంలో జరిగిన శిశు మరణాల గురించి సీరియస్‌గా పట్టించుకుని, ఆ వివరాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళాలని కోరాం. ముఖ్యంగా పదేపదే బాధిత మహిళలు ప్రస్తావించిన డా||మాలతి, డా||సుధలతో పేషంట్లని తమ ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌లకి తరలించుకుని వేలకొద్దీ రూపాయాలు గుంజుతున్న వైనంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయమని చెప్పాం. అలాగే ఒక మహిళ అనుమతి తీసుకోకుండా, ఏమి సమస్య వల్ల గర్భసంచి తీసేయాల్సి వచ్చిందో చెప్పకుండా గర్భసంచి తీసేసి, ఆ తర్వాత భర్తతో సంతకం పెట్టించుకోవడం నేరమని, ఆమె మీద పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వాలని కోరాం. మేం చెప్పిన అన్నింటినీ ఆయన వొప్పుకుని తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాడు. ”మేం అవగాహన కార్యక్రమాలు చేస్తాము దాని కోసం ఏర్పాట్లు చేస్తాము. మహిళా సమత నుండి మీరు తప్పకుండా రావాలి” అని ఆయన కోరారు.
సమయం రెండున్నర. మేము తిరుగు ప్రయాణమయ్యాం. మద్దెలచెరువు గ్రామంలో మేము గమనించిన అంశాలు.
బాల్యవివాహాలు
.
మహిళల్లో రక్తహీనత
.
నెలలు నిండాకా కూడా బరువైన పనులు చేయడం
.
ఆరోగ్య కార్యకర్త నిర్లక్ష్యవైఖరి
.
అంగన్‌వాడి సెంటర్‌ వున్న స్థలం పట్ల ఉన్న భయాలు, అపోహలు
.
ఏ మందులు ఎన్ని ఎప్పుడు వేసుకోవాలో అవగాహన లేకపోవడం
.
పురుటి నెప్పుల గురించి అవగాహన లేక, ఆసుపత్రికి వెళ్ళడంలో ఆలస్యం చెయ్యడం
.
ఆరోగ్య కార్యకర్తమీద నమ్మకం లేక బయట ఆసుపత్రులకు వెళ్ళడం, ప్రభుత్వ డాక్టర్ల ధనవ్యామోహం, అవసరం వున్న లేకున్నా ఆపరేషన్లు చెయడం, ప్రభుత్వ ఆసుపత్రి నుండి తమ ఆసుపత్రులకు తరలించడం, వేల కొద్దీరూపాయలు వసూలు చెయ్యడం
.
ఐరన్‌ లాంటి మందులు ఎక్కువ తింటే కడుపులో బిడ్డ బరువు పెరిగి, కాన్పు కష్టమై, పెద్దాపరేషన్‌ చేయించాలి, దానికి బోలెడు ఖర్చవుతుందని ఆలోచించి, ఐరన్‌ గోలీలను మధ్యలోనే మానేయడంతో వీళ్ళల్లో విపరీతమైన రక్తహీనత.
.
కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల అవగాహన లేదు. బిడ్డకి, బిడ్డకి ఎడం ఎందుకుండాలనే చైతన్యం లేదు. భర్తలు నిరోధ్‌ వాడొచ్చని, స్త్రీలకి వేరేపద్ధతులున్నాయనే అవగాహనలేదు. ఫలితం వెంటవెంటనే గర్భధారణ.
.
పిల్లలను, గర్భిణీ స్త్రీలను కంటికి రెప్పలా కాపాడాల్సిన అంగన్‌వాడి సెంటర్లు… వీటి మీద స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. ఒక గ్రామంలో ఐ.ఎం.ఆర్‌ ఇంత ఘోరంగా వుంటే దానికి బాధ్యత వహించాల్సింది ఆశాఖే.
వైధ్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆరోగ్య కార్యకర్తలకి సరైన శిక్షణనివ్వాలి. ఆశిక్షణ మానవీయ కోణంలో వుండాలి.
.
తమ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ ఊరి సర్పంచ్‌కి వుంది. ఆరు నెలలుగా తమ గ్రామంలో వరుస శిశు మరణాలు జరుగుతున్నా, ‘ రెండు రోజుల క్రితమే నాకు తెలిసింది’ అని ఆయన చెప్పడం విడ్డూరంగావుంది.
.
చివరగా మద్దెల చెరువు గ్రామంలో జరిగిన అవాంఛనీయ శిశుమరణాల విషయంలో అక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా సమత సోసైటి బాధ్యత గురించి చూద్దాం. మహిళా సమత గ్రామీణ మహిళలతో అట్టడుగు స్థాయిలో వున్న అన్ని వర్గాల మహిళలతో అనేక అంశాల మీద పనిచేస్తుంది. పాటల ద్వారా, సమావేశాల ద్వారా, పోస్టర్లద్వారా, పుస్తకాల ద్వారా ఎన్నో అవగాహనా కార్యమ్రాలు చేస్తుంది. గ్రామీణ స్త్రీలు గ్రామంలోని సమస్యలను సమావేశాల వేదిక మీదకి తెచ్చి చర్చించేలా ఫెసిలిటీట్‌ చేస్తుంది. అవగాహనను, చైతన్యాన్ని కల్పించడంతో పాటు సమాచారాన్ని అందించడంలో మహిళా సమత ముందుంటుంది. పిట్లం మండలానికి అంచున వున్న ఈ గ్రామంలో పనిచేసే కార్యకర్తలు కొంతకాలం అందుబాటులో లేకపోవడం, ఆ క్లస్టర్‌లో పనిచేసే ఒక కార్యకర్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహిళా సమత ఆమెని అక్కడ బాధ్యతల్నుంచి తొలగించింది. కూడా…. ఎంతో నిబద్ధతతో పనిచేసే మహిళా సమత సొసైటీలో జరిగిన ఇలాంటి పరిణామాల వల్ల కూడా మద్దెలచెరువు గ్రామంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలకు వాళ్ళు కొంత బాధ్యత వహించాల్సి వచ్చింది.
అలాగే అన్ని జిల్లాలలోను సామాజిక అంశాలపై పనిచేస్తున్న ఇందిరాక్రాంతి పథం సంఘాలున్నాయి. మద్దెలచెరువులో మహిళా సమితే కాక ఐకెపి కూడా పనిచేస్తోంది. సోషల్‌ ఏక్షన్‌ కమిటీలు ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. అప్పులివ్వడం, కట్టుకోవడం – అప్పుల మాయాజాలంలో సామాజిక అంశాలు కొట్టుకుపోయాయనుకోవాల్సి వస్తుంది. ఎంత రుణం తీసుకోవాలి? ఎవరెంత రుణమిస్తారు? వడ్డీ ఎంత? ఎన్ని కిస్తులు కట్టాలి ? లాంటి వాటిమీద అవగాహనున్న స్త్రీలకు రక్తహీనత మీద, కుటుంబ నియంత్రణ పద్ధతుల మీద, ఐరన్‌ గోలీల మీద, పురుటి నొప్పులెప్పుడొస్తాయో, ఎలా గుర్తుపట్టాలో లాంటి అంశాల మీద శాస్త్రీయ పద్ధతిలో అవగాహన లేదు. స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మూఢ నమ్మకాల మీద ఎలాంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టలేదు.
ఇక మీడియా… ఏదో చెట్టుకి బొప్పాయికాయ వినాయకుడిలా వుంది? ఫలానా వారింట్లో ఇంత పొడుగు పొట్లకాయ కాసింది. ఫలానా విఐపి ఏ గుళ్ళో ప్రదిక్షిణలు చేసాడు? ఏ గుడికి ఏ విఐపి వెళ్ళాడు? షారూక్‌ఖాన్‌ చెడ్డీ వేసుకున్నాడు, ధోనీ గుండు చేయించుకున్నాడు లాంటి చెత్త వార్తలతో పేజీలు నింపుతారు కానీ గ్రామీణ ప్రాంతాల సమస్యలు, గ్రామీణ స్త్రీల స్థితిగతుల గురించిన వార్తలు వెయ్యరు. ఇంత ప్రమాదకరస్థాయిలో శిశు మరణాలు జరిగినా ఏ వొక్క విలేఖరిగానీ, ఛానల్‌ గానీ వెళ్ళి ఆ వార్తల్ని ప్రపంచానికి తెలియచెయ్యాలని అనుకోలేదు. ఈ రోజుకి కూడా ఈ వార్త జిల్లా స్థాయిలో రాలేదు. రాష్ట్రస్థాయిలో వస్తుందన్న ఆశలేదు.
ఇదీ పరిస్థితి…. మద్దెలచెరువులో జరిగిన శిశు మరణాల గురించి కనీసం మహిళా సమత సొసైటి ద్వారా అయినా ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి మద్దెలచెరువులు ఎన్నున్నాయో అనే భయం నా నరనరాన జరజరాపాకుతోంది.

Monday, December 1, 2014

కోయంబతూర్ వెళ్ళింది జాతీయ స్థాయి పార్టనర్స్ సమావేశానికి.

https://www.facebook.com/satyavati.kondaveeti/posts/599896830117040

కావ్యేషు నాటకం రమ్యం...













మీటింగులు..పనులు....భూమిక పత్రిక పని...హెల్ప్ లైన్ కేసులు...
ఎంత వొత్తిడి ఉన్నా 5.30 అయ్యేసరికి రవీంద్ర భారతి మీద వాలిపోవడం...
తొలిరోజు గీత...మలిరోజు మూడో రోజు నాతో ప్రశాంతి...ప్రాణనేస్తాల తో కలిసి రసాస్వాదనం...
వనమాలి అనే సాంస్కృతిక సంస్థ ...వీటి బాధ్యులు దేవి...శాంతారావ్...మహేష్.
మూడు రోజులపాటు 5.30 నుంచి 10.30 దాకా నాటకం నన్ను పూనింది...
మొదటి రోజు రాయలసీమ పాలెగాడు నరసిమ్హా రెడ్డి వీరోచిత తొలి స్వాతంత్ర్య పోరాట స్పూర్తి...
రెండో రోజు పుల్లరి పన్నును ధిక్కరించిన కన్నెగంటి హనుమంతు అద్భుత చరిత్ర...
ఈ రెండు నాటకాలు స్టేజిని సర్వాంగ సుందరంగా అలంకరించి సీను సీనుకి స్టేజి అలంకరణ మారుస్తూ ప్రదర్శించారు.
మూడో రోజు ఎవరి పేర్లు తలిస్తే రక్తం ఉప్పొంగుతుందో, ఆదివాసుల కోసం అస్త్రాలను బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టి ఉద్యమించి పోరాడి వీరమరణం పొందారో వారు...జోడేఘాట్ వీరుడు కొమరం భీం...మన్యం శూరుడు అల్లూరి సీతారామరాజు...
ఈ రెండు నాటకాలని వీధి నాటక రూపం లో మహాద్భుతంగా ప్రదర్శించారు.
ఆ నాటకాలను చూస్తూ పొందిన ఉద్వేగం ...రసాస్వాదనం మరే ప్రక్రియలోను పొందలేము.
కళ్ళ ముందు కనబడే పాత్రలతో మమేకమై ఏడుస్తాం..నవ్వుతాం...ఈలలేస్తాం.
ఈ అనుభూతిని పొందాలంటే నాటకం చూడాల్సిందే.
ప్రతిస్పందన చెప్పమని నిర్వాహకులు కోరినప్పుడు నేను చిన్న కొమరం భీం పక్కన నిలబడి నాకు ఈ ట్రూప్ తో కలిసి నాటకాలేసుకుంటూ తిరగాలని ఉంది అని చెప్పాను.
ఈ సందర్భంగా దేవి ఒక ప్రపోజల్ పెట్టింది.
తదుపరి ప్రాజెక్ట్ గా నాయకురాలు నాగమ్మ...చిందు ఎల్లమ్మల జీవితాలను నాటకీకరించాలని ఉందని...ఆర్ధికంగా సహకరించడానికి ఎవరైనా ముందుకొస్తే మార్చి 8 నాటికి గాని...ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టిన రోజున కానీ ప్రదర్శించవచ్చు అని చెప్పింది.
ముఖ్యంగా చిందు ఎల్లమ్మని రంగం మీదకి తేవాలని ప్రయత్నం అంది.
నేను వెంటనే చెప్పాను నేను కొంత సహకరిస్తాను మితృలందరినీ అడుగుదాం అని హామీ ఇచ్చాను.
కార్యక్రమం పూర్తయ్యాకా ప్రశాంతిని వాళ్ళింట్లో దింపడానికి వెళ్ళినప్పుడు దీని గురించే చర్చించాం.
మితృలారా!!! మీకు ఏమైనా ఐడియాలుంటే చెప్పండి.
చిందుల ఎల్లమ్మ కధని నాటకీకరించి ప్రదర్శించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఖచ్చితంగా ఇంకా తెలియదు.
కానీ ఆ సొమ్మును సేకరించగలం అనే నమ్మకం నాకు ప్రశాంతికి కలిగింది.
మీరు ఏమంటారు ఫ్రెండ్స్....

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...